Skip to main content

Full text of "Telangana Sahitya Akademy books తెలంగాణ సాహిత్య అకాడమీ"

See other formats


మాదిరెడ్డి సులోచన కథలు 

















తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రచురణ: తెలంగాణ సాహిత్య అకాడమి 


మాదిరెడ్డి సులోచన కథలు 


MADIREDDY SULOCHANA KATHALU 


ప్రచురణ సంఖ్య : 21 
మొదటి ముద్రణ : అక్టోబర్‌, 2018 
ప్రతులు : 1000 


డీటీపీ, లేఅవుట్‌, కవర్‌పేజీ డిజైన్‌ : కరుణ, 9010201880 
ముద్రణ : కర్షక్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌. 


ఫోన్‌: 79950 60477 


కాపీలు దొరుకు చోటు 
కలాభవన్‌, రవీంధ్రభారతి, సైఫాబాద్‌. 
హైదరాబాద్‌ - 500 004 


వెల : రూ. 120/- 


మారుతున్న కాలానికి 
మంచిని బోధించే కథలు 


సాహిత్యం బహుముఖమైంది. విసృతమైంది. సందర్భాన్నిబట్టి కాల 
పరిణామాలనుబట్టి జీవితంలోని భిన్నభిన్న పార్వ్వాలు సాహిత్యంలో ఆవిష్కత 
మవుతుంటాయి. ఒక కాలంలో ప్రధానస్రవంతిగా ఉన్న ధోరణి మరొక కాలంలో 
చిన్నపాయగా మారవచ్చు. ఒక సందర్భంలో చిన్నపాయగా సాగిన ధోరణి మరో 
సందర్భంలో ప్రధాన స్రవంతిగా మారవచ్చు. జీవితంలోని అన్ని పాయలను, 
అన్ని స్రవంతులను ఏదో స్థాయిలో ప్రతిబింబిస్తూ, ప్రతిఫలిస్తూ సాహిత్యం 
పురోగమిస్తుంది. 

తెలుగు సాహిత్యంలో ఈ భిన్నత్వం, జీవనవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. 
ప్రగతిశీల సాహిత్యం, ప్రజా ఉద్యమ భావోద్వేగాలు ప్రధానంగా వెల్లువెత్తిన డెబ్బయ్యో 
దశకంలోనే కాల్పనిక సాహిత్యం, వ్యాపార ధోరణులు ప్రబలంగా సాగిన విచిత్ర 
స్థితి గమనించవచ్చు. ఒకవైపు సీరియస్‌ సాహిత్యం, మరొకవైపు కాలక్షేప సాహిత్యం 
సమాంతరంగా వెల్లువెత్తటం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. తెలుగు పాఠకలోకం విరివిగా 
పెరుగుతున్న కాలానికీ తగిన విధంగా వార, మాసపత్రికలు వెలువడటం, ప్రచురణ 
సంస్థలు వెలియటం, గ్రంథాలయాలు, అద్దె గ్రంథాల దుకాణాలు ఏర్పడటం 
క్రమపరిణామం. కాగా వీటన్నిటికి సరిపడే స్థాయిలో సాహిత్య సృజన పుష్కలంగా 
జరిగింది. సృజనాత్మక కాల్చనిక సాహిత్యంలో తప్పనిసరిగా ప్రస్తావించవలసిన 
ఇద్దరు ముగ్గురు రచయిత్రుల్లో మాదిరెడ్డి సులోచనది విశిష్ట స్థానం. 

డెబ్బయవ దశకపు తెలుగునాట నాగరిక, సామాజిక, సాంసృతిక 
పరిస్థితులను మాదిరెడ్డి సులోచన బలంగా చిత్రించింది. తెలంగాణ సామాజిక 
వాతావరణం నుంచి ఎదిగివచ్చిన రచయిత్రి అవటం వల్ల ప్రతి రచనలోనూ 
సమాజ ప్రయోజనం కాంక్షించింది. పత్రికలు, ప్రచురణ సంస్థలు ఎంతగా వ్యాపార 
ప్రయోజనాలవైపు నడిచినా సాహిత్యాభిమానాన్ని సామాజిక వికాసాన్ని దృష్టిలో 
ఉంచుకొన్నాయనిపిస్తుంది. వర్తమాన కాలంతో సరిపోల్పినపుడు అప్పటి ప్రతి 
రచనలో ఏదో ఒక సందేశం కనిపిస్తుంది. 


మాదిరెడ్డి సులోచన ఎన్నో నవలలు, మరెన్నో కథలు రచించి కాలంతో 
పోటీపడ్డ రచయిత్రిగా గుర్తింపు పొందింది. 72 నవలలు, 100 పైగా కథలు 
రాసిన రచయిత్రిని పట్టించుకోవలసినంతగా పట్టించుకోకపోవటం విషాదం. 
పాఠకలోకం వేరే అయి ఉండొచ్చు. సాహిత్యధోరణి ఏదయినా అయిఉండొచ్చు. 
నిరాదరణ ఆమోదయోగ్యం కాదు. అప్పటి సామాజిక పరిస్థితిని అధ్యయనం 
చెయ్యటానికి ఈ రచనలు తప్పకుండా ఉపయోగపడతాయి. తెలంగాణ సామాజిక 
జీవితంలోని అన్ని పార్వ్వాలు, సాహిత్య ధోరణులు సమన్వయం చేయటం అస్తిత్వ 
నిర్మాణానికి ఎంతగానో అవసరం. 

మాదిరెడ్డి సులోచన కథలన్ని పరిసరాల నుంచి ప్రభావితమై రచింప బడినవే. 
మారుతున్న కాలాన్ని మనుషుల ప్రవర్తనలను, ఆలోచనలను మంచివైపు నడిపించే 
ఆరాటం కనిపిస్తుంది. 

స్వేచ్చా ప్రణయం పేరుతో అవసరాలు నెరవేర్చుకునే వివాహేతర 
సంబంధాలను 'నేటి కథిలో ఎండకట్టింది. ఈ కారణంగా ఇప్పుడు జరుగుతున్న 
హత్యాస్థితిని అప్పుడే నాలుగు దశాబ్దాల కిందటే రచయిత్రి చిత్రించటం ఆమె 
ముందుచూపుకు దర్పణం. అట్లా అని మడికట్టుకున్న రచయిత్రికాదు మాదిరెడ్డి 
సులోచన. కూతురు డాన్సు నేర్చుకొంటానంటే తప్పుబట్టే తల్లి మనస్తత్వాన్ని 
“రంగప్రవేశం” కథలో తీవ్రంగా గర్భించింది. “సామాజిక పరిణామ క్రమంలో పిల్లల 
యెడల తల్లిదండ్రుల దృక్పథం కూడా మారాలి అని భావించింది. నాట్యం పట్ల 
అభిరుచిని కాపాడుకోవటానికి ఇంటిని ఎదిరించిన పాత్రగా లతని తీర్చిదిద్దింది. 
రచయిత్రికి పరిసరాలపట్ల, పరిస్థితుల పట్ల, పరిణామాల పట్ల, సంఘ కట్టుబాట్ల 
పట్ల స్పృహ ఉంది. పురోగామి రచయిత్రిగా తనవైన ఆలోచనలు, ఆదర్శ భావనలు 
కథల్లో వ్యక్తీకరించింది. ప్రయోజన దృష్టిలేకుండా ఇందులో ఏ కథా రచించలేదు. 

మాదిరెడ్డి సులోచన తెలంగాణ సాహిత్య చరిత్రలో తప్పకుండా పేర్కొనదగిన 
రచయిత్రి. ఎన్నో దశాబ్దాలుగా ఆమె కథలు పాఠకులకు అందుబాటులో లేవు. 
వాటిని అధ్యయనం చేస్తే ఆనాటి సమాజపు ఎన్నో విశేషాలు పరిశీలనకు వస్తాయి. 
తెలంగాణ సాహిత్య అకాడమీ “మాదిరెడ్డి సులోచన కథలు పుస్తకంగా ప్రచురించటం 
కర్తవ్యంగా భావించింది. అన్ని ప్రచురణలవలెనే ఈ ప్రచురణను ఆదరిస్తారని 
కోరుతూ, సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. 


తేదీ : 3-10-2018 నందిని సిధారెడ్డి 
చైర్మన్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ 


IV 


మనిషి మనస్సుల్లోని చీకటి కోణాలు వెతికిన 
మాదిరెడ్డి సులోచన 


మాదిరెడ్డి సులోచన రచనలు పాఠకులకు దొరకక చాలా రోజులైంది. 
నవలలను పత్రికలను ఆసక్తిగా చదివే పాఠకుల సంఖ్య మెలెమెల్లెగా తగ్గింది. 
దాంతో నవలలను అద్దెకిచ్చే లైబరీల సంఖ్య తగ్గింది. తగ్గుతూ తగ్గుతూ 
లుప్తమైనయి. గిరాకి లేక నవలలను కథలను ప్రచురించే ప్రచురణ సంస్థలు 
మూతపడ్డాయి. అటువంటి తరుణంలో ఇతర రచయిత్రుల రచనలతోపాటు 
మాదిరెడ్డి సులోచన నవలలు కథలు దొరకకుంట అయినయి. తెలంగాణ తన 
అస్మితను వెతుక్కుంటున్న సమయంలో మాదిరెడ్డి సులోచన సృష్టించిన విశాలమైన 
సాహిత్య ప్రపంచం గుర్తుకు వచ్చింది. అప్పుడు కొందరు ప్రచురణ సంస్థలు 
అద్దె లైబ్రరీల్లోని నవలలు దుమ్ముదులిపి ఆమె రచించిన కొన్ని నవలలను 
దొరికించుకొని ప్రచురించారు. ఆమె రచించిన 72 నవలల్లో సగం మాత్రమె 
లభిస్తున్నాయి. పుస్తకాల షాపుల్లో లభిస్తున్నాయి. మాదిరెడ్డి సులోచన వందకు 
పైగా కథలు రచించింది. కాని కథలేవి లభించని పరిస్థితి ఏర్పడింది. కొన్ని 
పత్రికల్లో వుండి పోయాయి. కొన్ని కథాసంపుటాలుగా వచ్చినా వ్యక్తుల దగ్గర 
లేవు. 

గ్రంథాలయాల్లో ఆనాటి పుస్తకాలు చీకిపోయి ముట్టుకుంటె నుసినుసి 
అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అటువంటి పుస్తకాలను గ్రంథాలయాలు 
“లీడ్‌ అవుట్‌ చేసి ఒక గదిలో కుప్పగా వేసేస్తారు. అటువంటి 'లీడ్‌ అవుట్‌ 
అయిన పుస్తకాల కుప్ప నుంచియె పరిశోధకుడు పుస్తకాభిమాని తెలంగాణ 


Vv 


సాహిత్య పరిరక్షణ చేయాలన్న తపనగల సంగిశెట్టి శ్రీనివాస్‌ తెలంగాణ తొలితరం 
మలితరం రచయితల సాహిత్యాన్ని సేకరించి భద్రపరిచాడు. చీకి చినిగిపోతుంటె 
జిరాక్స్‌ చేయించి పెట్టి పరిరక్షించాడు. ఆ విధంగా సంగిశెట్టి మాదిరెడ్డి సులోచన 
కథలను అరవై వరకు సేకరించి భద్రపరిచాడు. ఆర్థిక లోటువల్ల ప్రచురించలేని 
పరిస్థితి. ఆఖరికి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో 2017లో తెలంగాణ 
రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ సెంటర్‌ తరఫున 20 కథలు అచ్చువేసాడు. ఆ తరువాత 
కొన్ని మిగిలిన 82 కథలను తెలంగాణ సాహిత్య అకాడమీ వారికి ప్రచురణ 
నిమిత్తం సమర్పించాడు. తెలుగు అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి, ఏనుగు 
నరసింహారెడ్డి గారలు ఆ కథలను పరిశీలించారు. తెలంగాణ ప్రత్యేక రాష్టోద్యమం 
కాలంలో ఎంతో మరుగున పడిన కథా సాహిత్యం సాహిత్యలోకానికి పరిచయ 
మైంది. తెలంగాణ వచ్చింతరువాత తెలంగాణ అస్మితను, అస్తిత్వాన్ని సాహిత్య 
వైభవాన్ని విశిష్టత, వైవిధ్యాన్ని ప్రత్యేకతను చాటాలనుకుంటున్న తెలంగాణ 
సాహిత్య అకాడమీవారు లుప్తమై పాఠకలోకానికి దొరకకుండా ఉన్న 32 కథలను 
(ప్రచురించాలని వెంటనే అంగీకరించారు. దీంతో మనకు మాదిరెడ్డి సులోచన 
52 కథలు సాహిత్యలోకానికి లభిస్తున్నాయి. ఆమె కథల వస్తువు స్వరూప 
స్వభావాలు శిల్చ్పవైవిధ్యం గురించి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. 

తెలుగు సాహిత్య చరిత్రలో 1960, 70 దశకాలు రచయిత్రుల యుగమని 
చెప్పవచ్చును. వీరేశలింగం పంతులు యుగంలో చదువు నేర్చిన స్త్రీలు స్రీలకు 
ప్రీధర్మం, నీతి, భక్తి నడవడికను బోధిస్తు పద్యరచనలు చేసారు. స్వాతంత్రోద్యమం 
కాలంలో భండారు అచ్చమాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి వాళ్ళు కథానికలు 
రచించి ఆధునికమైన వచనప్రక్రియను చేపట్టారు. తర్వాత కాలంలో దేశ 
స్వాతంత్ర్యం తరువాత ప్రీల విద్య కోసం పాఠశాలలు, కాలేజీలు వెలసాయి. 
స్ర్తీలు విద్యావంతులై నవలలు, కథలు వ్రాయటం ఆరంభించారు. అనేక సంఖ్యలో 
1960, 70 దశకంలో రచయిత్రులు రచనలు చేసారు. ఆ కాలంలోనే శిక్షితులు, 
అర్థశిక్షితులైన స్రీలు సమాజంలో వున్నారు. వాళ్ళు కాలక్షేపానికి పుస్తకాలు 
చదవటం జరిగింది. అది అనేక సంఖ్యలో పాఠకులను సృష్టించింది. ఆ పాఠకుల 
కోసం పత్రికలు స్థాపించబడ్డాయి. ఆ పత్రికలు స్రీలు రచిస్తున్న కథలను 
ధారావాహికంగా నవలలను ప్రచురించారు. అనేక ప్రచురణసంస్థలు నెలకొల్పబడి 
స్రీలు రచించిన పాఠకాదరణ పొందుతున్న నవలలను కథలను ప్రచురించి 


VI 


డబ్బు చేసుకోవటం ఆరంభించారు. కొందరు ఆ పుస్తకాలను కొనుక్కొని చదువు 
కొనుకోలేకపోయిన వాళ్ళకోసం అరద్దెకిచ్చే లైబ్రరీలు బయలుదేరాయి. ఈ విధంగా 
ప్రొడక్షన్‌ డిమాండ్లతో స్ర్తీల రచనలు వ్యాపారీకరణ పరిస్థితులను తయారుచేసాయి. 
అయితే ఈ వ్యాపారీకరణ సాహిత్య రచనలు కొంతమంది చెప్పుకోదగిన 
రచయిత్రులు మాలతీ చందూరు, కోడూరి కౌసల్యాదేవి, ఆనందరామం, లత, 
వాసిరెడ్డి సీత్రాదేవి, శ్రీదేవి, రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి, 
ఇల్లిందల సరస్వతీదేవి, యశోదారెడ్డి, మాదిరెడ్డి సులోచన, బొమ్మా హైమాదేవి 
వంటి సీరియస్‌ నవలలు కథలు వ్రాసే వాళ్ళు కన్పిస్తున్నారు. 

చాలామంది రచయిత్రులు కోస్తా ప్రాంతం నుంచి వచ్చినా చదువులో 
వెనుకవున్న తెలంగాణ నుంచి రచయిత్రులు బయలుదేరటం ఆశ్చర్యకరమైన 
విషయమే. తెలంగాణ నిజాం ప్రభువు పరిపాలనలో ఉర్దూ రాజభాషగా వుండేది. 
తెలుగుకు ఆదరణలేని అక్షరాస్యత నాలుగు శాతం మాత్రమే వున్న తెలంగాణలో 
ప్రీల అక్షరాస్యత శూన్యమనే చెప్పాలి. అటువంటి తెలుగుకు ఆదరణ లేని 
తెలుగు మాట్లాడటం గౌరవంగా లేని ప్రాంతం, తెలుగు చదవటం వ్రాయటం 
నేర్వని ప్రాంతం నుంచి నందగిరి ఇందిరాదేవి, మాదిరెడ్డి సులోచన, యశోదారెడ్డి, 
బొమ్మా హైమాదేవి వంటి రయిత్రులు బయలుదేరి కోస్తా రచయిత్రులతో 
సమానంగా నిలబడి కథలు నవలలు వ్రాసారంటే తెలంగాణ గర్వించదగిన 
విషయం. రచనల సంఖ్య విషయంలోను తెలంగాణ రచయిత్రులు ఏం తక్కువ 
లేరు. మాదిరెడ్డి సులోచన, బొమ్మా హైమాదేవి ఒక్కొకరు 60, 70 నవలలు 
వ్రాసారు, వందవరకు కథలు వ్రాసారు. పత్రికలు ప్రచురణ సంస్థలు పాఠకులు 
వాళ్ళ రచనలను ఆదరించారు. యద్ధనపూడి సులోచనారాణివి పదికి పైగా 
నవలలు సినిమాలుగా వస్తే మాదిరెడ్డి సులోచనవి పది నవలలు సినిమాలుగా 
వచ్చి ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ఆ విధంగా తెలంగాణ రచయిత్రులు 
మేమేం తక్కువ కాదని తెలుగు సాహిత్యంలో రచయి[తులయుగంలో చోటు 
చేసుకున్నారు. యద్ధనపూడి సులోచనారాణి నవలలు ఇంగ్లీషులోని “మిల్స్‌ అండ్‌ 
జాన్‌ నవలల లాగా నాయకీనాయకుల మధ్య (పేమకథలుగా కన్పిస్తాయి. 

మాదిరెడ్డి సులోచన సామాజిక, రాజకీయ, చారిత్రక నవలలు రచించింది. 
ఆమె నవలలు సామాజిక సమస్యను ప్రజల జీవితాన్ని చిత్రించే వరకట్నం, 
స్త్రీల వివాహ సమస్యలు, ధనాశతో చేసే అన్యాయాలు, మతమౌధ్యాన్ని, మానవతా 


VI 


విలువలను చిత్రిస్తూ సహజమైన వివిధ రకాల పాత్రలతో వైవిధ్యపూరితమైన 
ఇతివృత్తాలతో నవలలు రచించింది. ఆమె అక్కడక్కడ తెలంగాణ భాష, 
సంస్కృతులను, ఇతివృత్తాలను, పాత్రలను తీసుకొని నవలలు రచించి తాను 
తెలంగాణ బీడ్డనని చాటుకున్న గొప్ప రచయిత్రి. తెలంగాణ భాష సంస్కృతులను 
వ్రాస్తే తన నవల స్వీకరింపబడుతుందో లేదో కోస్తా పత్రికలు ప్రచురిస్తాయో 
లేదో అని భయపడకుండ ఆమె ధైర్యంగా తెలంగాణను చిత్రిస్తూ నవలలు 
కథలు రచించిన రచయిట్రి. ఆమె 1965-83 మధ్యకాలంలో రచనలు చేసింది. 

ఇప్పుడు ప్రచురిస్తున్నవి మాదిరెడ్డి సులోచన కథలు కాబట్టి నవలల 
గురించి ఎక్కువ చెప్పకుండా కథల్లోకి వద్దాం. తెలంగాణలో కథ 1910 
దశకంలోనే కోస్తా ప్రాంతంతో సమానంగానే పుట్టి వికసించింది. ఆరంభ దశలో 
వచ్చిన కథలు చిన్నగా కొన్ని పాత్రలు సంభాషణలతో, ఏదైన రచయిత ఉ 
ద్దేశాన్ని సంఘటనను చిత్రించేవిగా వుండేయి. గురజాడ, చాసో, కొడవటిగంటి 
కథలు; సురవరం, వట్టికోట ఆళ్వారుస్వామి, కాంచనపల్లి కథలు ఇదే విధంగా 
వుండేయి. తర్వాత కాలంలో తెలుగు కథ కథనంలో 'కాంప్లెక్సిటీ'-క్షిష్టత, నిడివి 
పెరిగింది. సమాజ చిత్రణ చారిత్రక పరిణామ దశలో సంఘటనలను చిత్రించటం 
ఆరంభమైంది. సంఘటనల వెనుకున్న సామాజిక రాజకీయ కారణాలను ధ్వనింప 
జేయటం; సమాజంలోని పరిణామ శీలత, దోపిడీ, హింసలు, అసమానతలు 
వాస్తవికతను నగ్నత్వాన్ని చిత్రించటం కన్పిస్తుంది. జీవిత సంఘటనలను చిత్రిస్తూ 
జరుగుతున్న జీవితాన్ని చెప్తూ ఒక జీవిత వ్యాఖ్యానాన్ని సామాజిక వాస్తవికతను 
జోడిస్తాడు. 

విప్లవ కథల రచనలో క్లిష్టత, గాంభీర్యం, మాండలికాల (ప్రయోగం 
పాత్రోచిత భాష కేవలం కల్పన కాక జీవితానికి, సమాజంలో జరుగుతున్న 
సంఘటనలకు సమీపంగా వుండటం అనే లక్షణాలు ప్రవేశించాయి. ఇవే కథ 
లక్షణాలు తెలంగాణ అస్తిత్వవాదం నాటి కథల్లోను తెలంగాణేతర ప్రాంతాల 
నుంచి వచ్చే కథల్లోను కన్పిస్తున్నాయి. కాని కేవలం రచయిత ఉద్దేశం చెప్పటానికి 
పాత్రలను సన్నివేశాలను కల్పించటం ఉండదు. 

మాదిరెడ్డి సులోచన కథలో క్లిష్టత లేదు. అప్పటికి కథ “కథానిక రూపం 
లోనే వుంది. కథ నిడివిలో చిన్నదిగా వుండేది. అందుకే 'కథానికి రూపంలో 
వుందంటున్నాను. ఒక ఉద్దేశాన్ని జీవిత సత్యాన్ని చెప్పేందుకు కల్పిత పాత్రలతో 


VII 


సన్నివేశాన్ని సృష్టించటం వరకే కథా శిల్పం పరిమితమై వుందేది. ఒకొకసారి 
రచయితలు తమ దృష్టిలోకి వచ్చిన వ్యక్తుల సన్నివేశాల చుట్టు సంఘటనలను 
అల్లి కథ వ్రాయటం వుండేది. ఇవే "కథానిక లక్షణాలు మనకు మాదిరెడ్డి 
సులోచన కథల్లో కన్పిస్తాయి. 

మాదిరెడ్డి సులోచనకు సంకుచిత భావాలు లేవు. ప్రీల అభ్యుదయాన్ని 
స్వేచ్చను హక్కులను గుర్తిస్తూ ఆమె కథలు వ్రాసింది. 'ప్రగతిపథమా? పతన 
పథమా?” కథలో పద్మ పాత్ర విపరీతమైన ఆశతో జీవిస్తూంటుంది. అడుగడుగున 
ఆమెకు నిరాశనిస్పృహలే!! ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త పెద్ద ఉద్యోగస్తు 
డవుతాడంటే కాలేదని అసంతృప్తిలో డబ్బున్నవాళ్ళను గురించి మాట్లాడటం, 
అమెరికాలో వ్యాపారముందంట, భర్తను వదిలేసి అతనితో వెళ్ళిపోతాననటం, 
స్వేచ్చగా తిరగటం - ఇవన్నీ ఆఖరికి ఆమెను వేశ్యాగ్భహంలోకి చేరుస్తాయి | 
“స్త్రీకి సమాన హక్కు కావాలన్నా కానీ అది దుర్వినియోగం చెయ్యమని చెప్పలేదు” 
అంటుంది పద్మ టీచరు. ఇవి రచయిత్రి అభిప్రాయంగానే మనకు ధ్వనిస్తాయి. 
ఈ సందేశం ఇయ్యటానికే మాదిరెడ్డి ఈ కథను వ్రాసింది. 

రచయిత్రుల యుగంలో రచయిత్రులు స్రీలకు స్వేచ్చ, ఆర్థిక 
స్వావలంబనం, సమాన హక్కులు కావాలని ఆకాంక్షిస్తూ కథలు రచించారు. 
రచయిత్రుల స్ర్తీ కేంద్రీకృతమైన కథల్లో నవలల్లో మనకు ఈ సందేశాలే కన్పిస్తాయి. 
కాని విపరీతమైన స్వేచ్చను, స్వేచ్చను దుర్వినియోగం చేయడం రచయిత్రులు 
కాంక్షించలేదు. స్రీలు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు వుండాలని వుత్తమగృహిణిగా, 
గుణవతి, ఆదర్శవతియైన ప్రీగా వుండాలనే రచనల్లో సందేశాలు ఇచ్చారు. 
తర్వాత కాలంలో వచ్చిన ప్రీవాదంలోని పురుషాహంకారం, కుటుంబ వ్యవస్థ 
ప్రీల స్వేచ్చారాహిత్యానికి కారణమని వ్రాయలేదు. కుటుంబవ్యవస్థ విచ్చిన్నం 
కాకూడదనే వాళ్ళు కోరుకున్నారు. 

“రంగప్రవేశం” కథలో రేణు తలిదండ్రులిచ్చిన స్వాతంత్ర్యంతో పెరిగింది. 
లత తల్లి అదుపాజ్ఞల్లో పెరిగింది. ఇద్దరు స్నేహితురాండ్రు. లత చివరకు తల్లికి 
ఎదురుతిరిగి తన మార్గం తాను వెతుక్కుంటు ఇల్లు విడిచిపోతుంది. మాదిరెడ్డి 
సులోచన అభిప్రాయంలో పిల్లలకు ఏమాత్రం భావస్వాతంత్ర్యం స్వేచ్చ 
ఇయ్యకుండా పెంచితే ఈ విధంగా ఎదురుతిరిగే అవకాశముందన్న సందేశాన్ని 
వినిపించింది. 


IX 


“కలిసిరాని కాలం” కథలో మోహిని వస్తు వ్యామోహంతో తన శీలాన్ని 
అర్చించి వాటిని పొందాలనుకుంటుంది. ఈ వస్తువ్యామోహాన్ని మాదిరెడ్డి 
సులోచన నిరసించింది. 

'నేటికథి చాల విషాదమైన కథ. పంకజం వివాహిత. పిల్లలున్నారు. 
అయినా పెద్ద హోదాలో వున్న రాఘవను (్రేమించినట్లు నటించి అతని నుంచి 
లాభాలు పొందుతుంటుంది. ఆఖరికి ఆమె కొడుకు తల్లి ప్రవర్తనను సహించలేక 
రాఘవను చంపుతాడు. రాఘవను విపరీతంగా (ప్రేమిస్తున్న దనుకున్న పంకజం 
రాఘవ చావుకు కాస్తంత కూడా చలించకుండా వుంటుంది. ఆమెది కేవలం 
స్వార్థంతో కూడిన (పేమ, నటన అని తెలుస్తుంది. సమాజంలో తమ స్వార్థం 
కోసం పురుషులను (ప్రేమించినట్లుగా నటించి వాడుకుంటారన్న సత్యాన్ని మాదిరెడ్డి 
ఈ కథలో చిత్రించింది. 

స్ర్తీల అత్యాశ, అసూయ, ద్వేషం, ఈర్య్య, కపటత్వాలను మాదిరెడ్డి సులోచన 
చాల కథల్లో చిత్రించింది. “ఒక్కమాట” కథలో తార, శ్రీధర్‌లు ప్రేమించి పెండ్లి 
చేసుకుంటారు. వాళ్ళ క్లాసుమేట్‌ లలిత శ్రీధర్‌ను (ప్రేమిస్తుంది. తారను పెండ్లి 
చేసుకున్నాడనే ఈర అసూయలతో లలిత లేనిపోని మాటలు కల్పించి వాళ్ళ 
సంసారంలో చిచ్చుపెట్టి వాళ్ళిద్దర్ని విడదీస్తుంది. స్త్రీ ఈర్యా ద్వేషాలు ఎంతగా 
వుంటాయో మాదిరెడ్డి సులోచన ఈ కథలో చిత్రించింది. 

ప్రీ బుద్ధిః ప్రళఉయాంతకః కథలో కూడా రచయిత్రి ప్రీలల్లో వుండే 
అభిమానం అసూయాద్వేషాలను చిత్రించింది. కథ ఒక జమీందారీ కుటుంబానికి 
సంబంధించింది. రాధికకు పిల్లలు కాలేదు. బావ తోటికోడలు పిల్లలనే తన 
పిల్లలుగా చూసుకుంటుంది. ఒకనాడు తోటికోడలు నిందించి మాట్లాడిందని 
రాధిక కోపంతో భర్తతో వేరే బంగ్లాలో కాపురం పెట్టింది. తన చెల్లెలుకు పెండ్లి 
సంబంధం చూస్తున్నారని తెలిసి ఆ చెల్లెల్ని తన భర్తను ఒప్పించి అతనికిచ్చి 
వివాహం చేస్తుంది. పెండ్లినాటి నుంచే ఆమె హృదయం భర్తను మరో ప్రీతో 
పంచుకోలేక పగిలిపోతుంది, మండిపోతుంది. చెల్లెలు గర్భవతి అయిందని 
తెలిసి ఆమె హృదయం తుకతుక ఉడికిపోతుంది. ఒకరోజు రాధిక పాలల్లో 
విషం కలిపి నిండుగర్భిణి అయిన చెల్లెలుకు తాగించింది. చెల్లెలు మరణిస్తుంది. 
ఇదంతా తెలిసిన భర్త ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. స్త్రీలో వుండే ఈర్యా అసూయలు 
ఎంతపని చేయిస్తాయో రచయిత్రి ఈ కథలో చిత్రించింది. కథ కొంచెం పెద్దదే. 


X 


మాదిరెడ్డి సులోచన కథల్లో ఇటువంటి స్రీల మనస్తత్వాన్ని చిత్రించే కథలు 
ఎక్కువగా ఉన్నాయి. స్రీ పాత్రల చుట్టూ తిరిగే రచయిత్రుల కథల్లో ఇటువంటి 
వస్తువులే ఎక్కువగా కన్పిస్తాయి. నవలల్లో మాత్రం ఇతివృత్తం పెద్దది కాబట్టి 
కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యక్తుల సంబంధాల్లో ప్రీల పాత్ర, ఉద్యోగం చేసే 
ప్త్రీల సమస్యలు, ఆర్థిక స్వావలంబనం, ప్రేమలు, వరకట్నం, కులాంతర వివాహ 
సమస్యలు చిత్రింపబడినాయి. కాని కథల్లో స్త్రీల మనస్తత్వ చిత్రణలే ఎక్కువగా 
కన్పిస్తాయి. 

మాదిరెడ్డి సులోచన భర్తతోపాటు ఇథియోపియా పోయి కొన్నాళ్ళు అక్కడ 
వున్నది. భర్త టీచరు. అప్పుడు కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు టీచర్ల కొరతతో భారతదేశం 
నుంచి టీచర్లను రప్పించుకున్నాయి. ఇథియోపియాలో మాదిరెడ్డి కూడా బి.ఎద్‌. 
చేసిన టీచరు కాబట్టి అక్కడ టీచరుగా కొన్నాళ్ళు పనిచేసింది. “బదులు ఇచ్చి 
బిరుదు కొన్నాము కథలో భారతీయులు విదేశాల్లో వున్నా తమ నైజం మార్చుకోరని 
చిత్రించింది. వాళ్లు ఇథియోపియా పోయిన కొత్తలోనె ఒక తోటి భారతీయుడు 
వచ్చి వాళ్ళను మూడు వందల డాలర్లు కావాలని బదులు అడుగుతాడు. బాధగా 
ముఖం పెట్టాడని పోనీ అని డబ్బు ఇస్తారు. తర్వాత తెలుస్తుంది అతని స్వభావమే 
బదుళ్ళు అడిగేదని. ఎక్కడికి పోయినా మన భారతీయులు తమ స్వభావాన్ని 
విడువరు అని చెప్తూ రచయిత్రి భారతదేశంలో పక్కింటివాళ్ళు ఎట్లా బదులు 
ఇయ్యమని వచ్చేవారు ఎట్లా వాపసు ఇయ్యకుంటూ ఎగ్గొట్టేవారు ఒకొకసారి 
బదుళ్ళు అని తీసుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవారో ఆ వృత్తాంతాలన్నీ 
చెప్తూ కథను నడిపించింది. 

మాదిరెడ్డి సులోచన కథల్లో శైలి సాఫీగా సాగుతుంది. చదివించేటట్లుగా 
వుంటుంది. మామూలు విషయమైనా ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా మార్చే నైపుణ్యం 
వుంది. వాటా, అంట్లు, ఆకతాయి, డబ్బు పుచ్చుక, చెప్మా - వంటి ఆంధ్ర 
ప్రాంతాల పదాలు, నుడికారాలతోపాటు ఒంకలు పెట్టడం, సాకం తీసింది, 
సాలమ్మ వంటి తెలంగాణ పదాలు నుడికారాలు కూడా వున్నాయి. “సాలమ్మ 
కథలో సాలమ్మ పాత్ర పూర్తిగా తెలంగాణ భాషలో మాట్లాడుతుంది. రచయిత్రుల 
యుగంలో మాదిరెడ్డి సులోచన రచలు పత్రికలలో అచ్చువేయరేమోనన్న జంకుతో 
తెలంగాణ భాషను వాడకుండా వుండలేదు. ధైర్యంగా ఆమె తెలంగాణ పదాలను 
నుడికారాలను ప్రయోగించిన రచయిత్రి. చాలా నవలల్లో తెలంగాణకు 


XI 


సంబంధించిన ఇతివృత్తాలను తీసుకున్నది. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ 
ఉద్యమాన్ని చిత్రిస్తూ రాజకీయ నవల “సంధ్యారాగం” రచించింది. 'బుతుచక్రం'లో 
అచ్చమైన తెలంగాణ వ్యవసాయ జీవితాన్ని పండుగలను వర్ణించింది. నవలల్లో 
కథల్లోకన్నా తెలంగాణ భాష నుడికారాలను ప్రయోగించటం ఎక్కువగా 
కన్పిస్తుంది. పాత్రలు కూడ తెలంగాణ ప్రాంతంవాళ్ళు అనిపించేటట్లుగా చిత్రణ 
చేసింది. ఆ విధంగా రచయిత్రుల మధ్య ఒక గొప్ప రచయిత్రిగా పేరు 
సంపాదించుకున్నది మాదిరెడ్డి సులోచన. రచయిత్రుల యుగంలో వుండి 
రచయిత్రులతో స్నేహ సంబంధాలు పెట్టుకునేది. అటువంటి మాదిరెడ్డి సులోచన 
తెలంగాణ అస్మితను అస్తిత్వాన్ని నిలిపిన ఉత్తమ రచయిత్రి. 


5-9-2018 ముదిగంటి సుజాతారెడ్డి 
రోహణమ్‌ 8309571083 


XII 


విషయసూచిక 


1. 
2. 


భార్యా కోపవతీ... 
బడి 


3.తనదాకవస్తే ! 


4. 


౨9 ౨౦౫౩ ౯ ౯ 


కృష్ణకన్నయ్యా ! 
రక్ష 

రేవతి 

పురుష లక్షణము 
అంతరాత్మ 
సాలమ్మ 


. అడ్డం తిరిగిన కథ 

. ప్రగతి పథమా ? పతన మార్గమా ? 
. కలిసిరాని కాలం 

. నేటి కథ 

se బుద్ధిః ప్రళయాంతకః 

. ఒక్కమాట ! 

. రంగప్రవేశం 

3 పుట్టినరోజు 

. పడి లేచే కడలి తరంగం 

. అభిమానులున్నారు జాగ్రత్త ! 


XIII 


105 
122 
129 
137 
146 
156 


21. 
22, 
28. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


32 


ఖరీదయిన స్నేహము 
జరుగుతున్న చరిత్ర 
అనుబంధాలకు అర్థం ఏమిటి? 
ఆశకు హద్దులు 

అనుభవం 

బదులు ఇచ్చి బిరుదు కొన్నాము 
హరివిల్లు 

దేవుడు తెల్లబోయాడు 

డబ్బు! డబ్బు! డబ్బు! 

చీమలు పెట్టిన పుట్టలు 
(బతకటానికో దారి 

భలే భార్యలు 


XIV 


169 
178 
188 
200 
208 
219 
282 
246 
255 
264 
272 
282 


భార్యా కోపవతీ... 


కాఫీ గ్లాసుల్లో పోస్తున్న ఉమకు కాలింగ్‌ బెల్‌ అదే పనిగా వినిపించడంతో, 
అవి అక్కడ వదిలి తలుపు తీయక తప్పలేదు. 

“యెవరు ?” విసుగ్గా అడిగింది. 

“నేను కస్తూరి గారింటి నుండి వచ్చాను. వారి తమ్ముడు బాబ్టీని ఒక్కసారి 
పిలుస్తారా ?” అన్నాడు ఆదుర్దాగా. 

ఆడబడుచు పేరు వింటూనే ముడుచుకపోయింది ఉమ. 

“యెందుకు ?” ముఖం చిట్లించింది. 

“అరగంట క్రితం కస్తూరిగారి భర్త పోయారండి...” 

అతని మాట పూర్తి కాకముందే బాబీ వచ్చాడు. విషయం విని నోట 
మాటరానట్టు క్షణం నిలబడిపోయాడు. 

“ఇక్కడ ఆటోలు దొరకవని ఆటోరిక్షా తెచ్చానండీ” ఆ వచ్చిన కుర్రాడు 
చెప్పాడు. బాబ్టీ యాంత్రికంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. 

“అదేంటమ్మ గట్ల చూస్తవు ! వెళ్ళి ఆటోరిక్షా యెక్కు నేను తాళం ఏస్తగని..” 
వాకిలి ఊడుస్తున్న పనిమనిషి, చీపురు పడేసి, తలుపులు వేసి, తాళాలు 
పెడుతుంటే, తప్పదన్నట్టు, ఉమ ఆటోరిక్షా యెక్కింది. 

“నేను రెండిండ్లల్ల పని చేసుకుని వస్తాను.” అన్నది, తాళం చెవులిస్తూ, 
ఆటోరిక్షా సాగింది. ఉమ ఆలోచనలు కూడా సాగాయి. రెండేళ్ళనాడు తమకు, 
ఆడబడుచుకు తెగతెంపులు అయ్యాయి. ఏ ధైర్యంతో మనిషిని పంపింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 1 


ఉమ వివాహమయిన కొత్తలో కస్తూరి తన మేనమామతో స్పష్టంగా 
అనటం తను విన్నది. 

“ఏమిటో మావయ్యా ! అయ్యా, అమ్మ లేక ఏ అచ్చట, ముచ్చట తీరలేదు. 
మళ్ళీ అలాంటి అమ్మాయినే తెచ్చారు వాడికి. అక్షంతలు వేసి ఆ అన్న చేతులు 
దులుపుకున్నాడు” అన్నది. 

ఉమకు తల బద్దలు కొట్టుకుందాం అనిపించింది. --- అన్న తనను 
ఎంత (ప్రేమగా పెంచాడు ! మళ్లీ పిలవటానికి యెందుకు రాలేదో ! ఆమె 
వారం రోజులు అత్తగారింట్లోనే ఉండిపోయింది. ఆడబడుచు అన్న ఒక్కమాట 
తన ఆత్మాభిమానాన్ని ఎంత దెబ్బ తీసిందో ఉమకు బాగా తెలుసు. 

వారం తరువాత అన్నాా వదినా వచ్చారు. వదిన తండ్రి పోయాడట. 
క్రొత్త దంపతులకు చికాకులు యెందుకని తెలియజేయలేదట. ఉమ కొర కొర 
కస్తూరి వంక చూసింది. 

“ఏమనుకోకు బావగారూ ! మీరు రాకపోతే మరో విధంగా అనుకున్నాను.” 
నంగనాచిలా క్షమాపణ చెప్పుకుంది. 

ఉమకు మాత్రం ఆడపడుచు అన్న మాటలు శూలాల్లా హృదయాన్ని 
గుచ్చుకుని బాధ పెడుతూనే వున్నాయి. ఆ తరువాత కస్తూరిని చూస్తే కసి, 
కోపం వచ్చేవి. క్రొత్తలో ఆమె, ఆమె భర్త రాగానే తల నొప్పనో, పని వుందనో 
తప్పించుకునేది. ఒకరోజు బాబ్దీయే నిలదీశాడు. 

“ఉమా! ఏమిటి నీ ఉద్దేశం ? మేమున్నది ఇద్దరం. అక్కని చూడగానే 
ముఖం మాడుస్తావేం. ౫ 

“ఆమె అంటే నాకిష్టం లేదు.” కచ్చితంగా చెప్పింది. 

“ఎందుకు !” 

చెప్పింది. అతను పెద్దగా నవ్వాడు. 

“పెళ్ళి, బంధుత్వం అన్నాక ఆ మాత్రం ఉండవా ?” 

“నన్నూ మా అన్నను అవమానించింది !” 

“అవకాశం చూసి నువ్వూ ఏదో అనేయ్‌! అంతేగాని ముఖం 
మాడ్చుకుంటారా !” 

“ఊహుం.....” ఆ తరువాత కస్తూరి ఏదన్నా ఉమకు వికృతంగానే 
వినిపించేది. 





2 భార్యా కోపవతీ... 


ఓ పండుగ రోజు కస్తూరి వచ్చింది. భోజనం చేసి వెళ్ళకూడదూ! 
ఊహు! 

“మరదలమ్మా ! ఏమిటి ఆలస్యం ? నీ పెళ్లిరోజే మా ప్రక్కింటి అమ్మాయికి 
పెళ్లి అయింది. పురుటికి వచ్చింది.” అన్నది నవ్వుతూ. అంతే, అలిగి పడుకుంది 
ఉమ. భర్త వచ్చాక, అపర సత్యభామే అయింది. 

“మనం ముసలి వాళ్ళమా మీ అక్కయ్య యెంత మాటన్నది ? మీకు 
మళ్ళీ పెళ్లి చేసే వుద్దేశంలో ఉంది.” 

“ఛ... ఛ... అలా యెందుకు అంటుంది ! తనకు పిల్లలు లేరు. మనకు 
కలిగితే చూడాలని సరదా...” 

“నేను చెప్పిందేదీ నమ్మరన్నమాట....” విసుగ్గా అంది ఉమ మాటా 
మాటా పెరిగింది. 

“అసలావిడ ఇక్కడికి రావడం, మీరు అక్కడికి పోవటం చూస్తే నేను 
ఆత్మహత్య చేసుకుంటాను...” అంటూ ఆఖరు అస్త్రం ఉపయోగించింది ఉమ. 

“చేసుకో...” అన్నాడు విసుగ్గా. 

అంటే ఉమ నల్లుల మందు (త్రాగడం, ఆస్పత్రిలో చేర్చడం, ఆమె అన్నకు 
ఏదో ప్రమాదం వల్ల అని చెప్పడం, వారం రోజుల తరువాత ఉమ ఇంటికి 
వచ్చింది. దాదాపు రెండు సంవత్సరాలుగా కస్తూరి రాలేదు. వాళ్ళింటికి వీళ్ళూ 
వెళ్ళలేదు. ఉమకు ఇప్పుడు ఏడో నెల. తమ్ముడికి పిల్లలు పుడితే తప్పక వస్తుంది. 
ఆ పరిస్థితి యెలా ఎదుర్మోవాలని ఆలోచిస్తుండగానే ఈ చావు కబురు వచ్చింది. 

“ఊ... దిగు...” బాబ్జీ అనటంతో ఉమ ఆటో దిగింది. అతను కిరాయి 
ఇచ్చాడు, లోపల నుండి కస్తూరి ఏడ్చు హృదయ విదారకంగా వినిపిస్తోంది. 

ఇద్దరూ లోపలికి వెళ్లారు. 

కస్తూరి తమ్ముడిని చూస్తూనే తలబాదుకుని ఏడ్చింది. 

“ఏమండీ ! బాబ్టీ వచ్చాడు చూడండి ! మీరు యెప్పుడూ వాడు దొంగలా 
రాత్రి వస్తాడనేవారే.... ఉదయమే వచ్చాడు చూడండి....” భర్త శవంమీద పడి 
దుఃఖంతో కదలిపోతూ ఏద్చింది. 


“ఊర్మో అక్కయ్యా” చెమర్చిన కళ్ళతో అక్కను లేవదీశాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు ఏ 


“ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదురా. నువ్వు పెట్టిన ఖర్చు బూడిదలో 
పోసిన పన్నీరు అయింది” అని ఏడుస్తుంటే, ఉమ ఆలోచనలు పరిపరి విధాలుగా 
పోయాయి - 

“ఈయన జీతమంతా నాకే ఇస్తారు ! ఖర్చు యెలా పెట్టారు ! అప్పు 
చేశారా 1!” అని. 

రావలసిన వారంతా వచ్చారు. సాయంత్రానికి అంతా ముగిసిపోయింది. 
మధ్యాహ్నమే ఉమను, నిండు మనిషని పంపించి వేశారు. ఉమ ఇంటికి వచ్చిన 
దగ్గర నుండి బోనులో పులిలా తిరుగుతుంది. తనకు తెలియకుండా భర్త వెళ్ళడమే 
కాక, డబ్బు ఇస్తున్నాడు. కుమ్మరాములా ఉంది ఆమె హృదయం. తలుపు చప్పుడు 
కాగానే వెళ్ళి తీసింది. వచ్చింది భర్త కాదు, తన అన్న శ్రీహరి. 

“మీ ఆడపడచు మగడు పోయాడట కదా! అక్కడికి వెళ్లి వస్తున్నాను. 
బాబ్టీ నిన్ను తీసుకు వెళ్ళమన్నాడు.” 

“ఏం, ఇప్పుడు రారటనా !” 

“యెలా వస్తారమ్మా ? ఆమెకు ఎవరున్నారు ? మేనమామ కూడా 
యాత్రలు చేస్తున్నాడట....” అన్నాడు. 

అన్నయ్య కేం తెలియదు అనుకుంది ఉమ. కోపంగా అన్నగారి వెంట 
వెళ్లింది. మళ్ళీ బాబీ రాలేదు; ఆమె వెళ్ళలేదు. 

పెద్ద కర్మరోజు శ్రీహరి వెడుతూ ఉమని రమ్మని అడిగాడు. 

“చిన్నపిల్ల, ఆ కర్మకాండ చూసి అప్‌సెట్‌ అవుతుంది, మీరు వెళ్లిరండి” 
అన్నది వదిన. అతను వెళ్లిపోయాడు. 

పదకొండవరోజు అలసటగా, చిన్నబోయిన ముఖంతో వచ్చాడు బాబీ. 

“ఆయనను చేసుకుని అక్కయ్య ఏనాడూ సుఖపడలేదు. కట్నము ఇవ్వలేక, 
మామయ్య వ్యసనాల పుట్టని కూడా చూడక అక్కయ్యను ఆయనకు అంటగట్టాడు. 
రోగాలు, రొస్టులతో నయినా కొన్నాళ్ళు (బతికితే బావుండేది.” 

“ఎవరికి యెంత రాసిపెట్టి ఉంటే అంతే జరుగుతుంది. మీ అక్కయ్య 
అక్కడే ఉందా ?” 

“ఈ పూట ఏదో గుళ్ళో నిద్రపోయి, రేపు మామయ్య ఇంటికి వెడుతుంది. 
ఉమ ఆరోగ్యం యెలా వుంది ?” 





4 భార్యా కోపవతీ... 


“బాగుంది. ఈ పూట ఇక్కడే ఉండు. రేపు వెళుదువుగాని.” 

శ్రీహరి బయటికి వెళ్లాడు. పిల్లలంతా హాల్లో చదువుకుంటున్నారు. 
అంతవరకు కాలేజి కబుర్లు చెబుతున్న శ్రీహరి కూతురు రాధ, బాబీ రావడంతో 
బయటికి వెళ్లిపోయింది. ఉమ భర్తను పలకరించి, ఓదార్చే మూడ్‌లో లేదు. 
ఆమె భర్తను చూడనట్టే అటు తల తిప్పుకుంది. 


“సారీ ఉమా! అక్కయ్యకు ఎవరున్నారు చెప్పు ?” అన్నాడు ఆమె ప్రక్కన 
కూర్చుని భుజం మీద చేయివేసి. 

“వెళ్ళండి, అక్కడే ఉండండి...” ఉక్రోషంగానూ మరింత రోషంగానూ 
అన్నది. 

“బావుంది ! మనకేదయినా కష్టం వస్తే శ్రీహరి బావగారు సాయం 
చెయ్యరా!” 

“నేనూ ఆమే ఒక్కటేనా !” 

“ఎందుకు కాదు. శ్రీహరి న్‌ కన్నయితే, నేను ఆమెకు తమ్ముడిని.” 

“ఆమె కిచ్చిన డబ్బు ఎక్కడిది ?” 

“నాది... దొంగతనం చెయ్యలేదు.” 

“మీ జీతమంతా నాకే ఇస్తున్నారు కదా !” 

“రెండు సంవత్సరాలుగా బోనస్‌, ఇంక్రిమెంట్లు వచ్చిన డబ్బు దాచాను-” 

“భార్యా భర్తలు అనగానే ఒకరి కొకరు ప్రాణంగా ఉండాలంటారు. ఇదేనా 
ప్రాణం ! ఇదేనా నమ్మిక ? ఇదేనా మన బంధం ?” 


“నా పొరపాటేం లేదు. భార్యాభర్తలు అనగానే అధికారం చెలాయించడం 
కాదని గుర్తుంచుకో. ప్రాణం తీసుకునే ప్రమాదస్థితి కల్పించుకుంటే నేను 
ఉపాయంగా మరో మార్గం చూసుకున్నాను” అన్నాడు. 

“నా మార్గం నేను చూసుకుంటాను. ఇక మీ దగ్గరకు వచ్చే ప్రసక్తి 
లేదు” అన్నది రోషంగా. 

“నువ్వు రావంటే పట్టుకు ప్రాకులాడ వలసిన ఖర్మ నాకేం లేదు.” 

చర చర బయటికి వెళ్లిపోయాడు బాబ్లీ. 

“బాబ్జీ ఏడమ్మా ? వంటయిపోయింది” అంటూ వదిన వచ్చి అడిగింది. 





మాదిరెడ్డి సులోచన కథలు ఏ 


“ఏమో ! అక్కదగ్గరకే వెళ్లాడేమో” అన్నది కళ్ళ నీరు కనిపించకుండా 
ముఖం ప్రక్కకు తిప్పుతూ. 

ఆ తరువాత బాబ్టీ రాకపోవడంతో శ్రీహరి, అతని భార్య ఏమైనా ఘర్షణ 
పడ్డారా అని గుచ్చి గుచ్చి అడిగారు. 

“వదినా ! ఆయనకు నేనంటే బొత్తిగా లక్ష్యం లేదు” బావురుమని జరిగిన 
విషయం చెప్పింది. ఇద్దరూ [మ్రాన్సడి పోయారు. 

శ్రీహరి బాబీ దగ్గరకు పరుగెత్తుకు పోయాడు. 

“అతను ఒక నెల సెలవు పెట్టి, అక్కను తీసుకుని యాత్రలకు పోయాడు” 
అని చెప్పారు యింటివారు. అతను యింటికి వచ్చాడు. చెల్లెలిది తప్పు. కాని 
ఇప్పుడు మాట చెబితే మరింత బాధపడుతుంది అనుకున్నాడు. ప్రిమెచ్యూర్డ్‌ 
బేబి పుట్టింది. ఉమ పరిస్థితి బాగా దిగజారిపోయింది. మందులకని, పండ్లకని 
బోలెడు ఖర్చు అవుతోంది. పాపను ఇంకుబేటర్‌లో పెట్టారు. ఆ ఖర్చు చూస్తుంటే 
ఉమ మతి పోసాగింది. ఆ రోజు అన్నా వదిన మాటలు వినిపించాయి. 

“ఇదుగో ఇంజక్షన్లు, మందులు కొనుక్కురండి.” 

“ఈ రోజు ఇరవై ఏడో తారీఖు. ఇంకో నాలు రోజులు ఆగు...” 

“బావుందండి, అమ్మాయి ఇప్పుడే కోలుకుంటూంది. చంద్రహారం పెట్టి 
డబ్బు తీసుకురండి. ఈ కార్యం గడిస్తే మెల్లగ విడిపించుకోవచ్చు” అన్నది. 

“సరే...” ఆమె మాటలకు యెదురు చెప్పలేదు. 

“అన్నయ్య ఎంతమంచివాడు అనుకుంది. వెంటనే ఎవరో వీపుమీద 
చరిచినట్టయింది. “మీ వదినలా నువ్వు ఆడపడుచు కోసం బంగారం తాకట్టు 
పెట్టగలవా ?’ 

“తనూ, తన ఆడపడుచు ఒక్కటేనా ?” 

తను శ్రీహరికి చెల్లెలయితే, కస్తూరి బాబీకి అక్క తేడా ఏమిటి ? 

ఏమో ఏమీ అర్థం కాలేదు. కుమిలి కుమిలి ఏడ్చింది. 

“బాబ్టీ రాలేదనే కదా ! వస్తాడులేమ్మా అక్క గురించి ఆ మాత్రం బాధ 
ఉండదా ? అభిమాన ముండకపోయాక ఆత్మీయులెందుకు ? మే మున్నామని 
నిశ్చింత కాబోలు. తలనొప్పి వస్తుంది ఊర్మో..” గదిలోకి వచ్చిన వదిన 
ఓదార్చింది. 





6 భార్యా కోపవతీ... 


“అది కాదు వదినా...” తన బాధ చెప్పుకుంది. 

“ఆయనలా దొంగతనంగా మా ఆడబడుచుకు పెట్టడం మంచిదేనా ? 
అసలు మా అన్నయ్య నిన్ను అడగంది ఏ పని అయినా చేస్తారా !” 

“చెయ్యరుగాని, మీ అన్నయ్యకు నేనెప్పుడూ ఆంక్షలు పెట్టనుకదా!” 

ఉమ మాట్లాడలేదు. 

“అయినా నీకు కసూరికి మనస్పర్థలు ఎందుకు వచ్చాయి ?” వదిన 
అడిగింది. ఉమ చెప్పింది. 

“ఎంత పిచ్చిదానవు ఉమా ? ఆవిడకు నీకంటే ముందే బాబ్టీ ఆత్మీయుడు. 
ఆ మాత్రం ఆదుర్దా ఉండదా ? నాన్న గారు పోయి మేము రాలేదని ఆమెకేం 
తెలుసు. మన రాధకు సంబంధం చూస్తే పిల్లాడు బాగా లేదని నువ్వ అనలేదా? 
ఆత్మీయురాలేగా పిల్లలు కలగలేదంటే, తప్పేముందమ్మా ! స్పోర్టివ్‌గా ఈ కాలంలో 
అనుకున్నప్పుడు పిల్లలు కలుగుతారు వదినా అనాలి గాని...” 

“నీకు తెలియదు వదినా...” 


“నాకు తెలియంది, నీకు తెలియవల్సింది ఒక్కటేనమ్మా. ఈ ప్రపంచంలో 
రంగులు, రూపాలు వేరు కాని ఆత్మీయత, ఆకలి అందరకూ సమానమే.” 


“ఈనాడు అక్కకు సాయం చేశాడని బాబ్బీపై కోపగించుకున్నావు. 
నీకేదయినా కష్టం వస్తే మేం రాకపోతే బాధపడవా ?” అని ఆమె అడుగుతుండ 
గానే పిల్లలు యెవరో పిలిచారు. ఆమె లేచిపోయింది. ఉమ ఆలోచిస్తూ 
పడుకుంది. ఆమెకు వదిన లేపి, భోజనం పెట్టి మందిచ్చింది. “పగలు ఏదయినా 
చదువుకో. రాత్రిళ్ళు నిద్రరాదు.” ఆమె మళ్ళీ పనిలో దూరింది. 

“ ఆకలంతా ఒక్కటే ! ఆత్మీయత అంతా ఒక్కటే.” వేయి గొంతుకలతో 
అరిచారెవరో. కళ్ళు విప్పి చూస్తే యెవరూ లేరు వదినె మౌనంగా పని 
చేసుకుంటోంది. తనకు నలుగురు పిల్లలున్నా తనను, తన పాపను యెంత 
జాగ్రత్తగా చూసుకుంటుంది వదిన. 

“నువ్వు నీ ఆడబడుచును కూడా బాగానే చూసుకున్నావు. పుట్టెడు 
దుఃఖంలో వుంటె వచ్చి ఓదార్సావ్‌...” 

ఎవరు ? ఎవరూ లేరు తన అంతరాత్మే ! 





మాదిరెడ్డి సులోచన కథలు 7 


కళ్ళు మూసుకుంది. 

“ఆకలంతా ఒక్కటే, ఆత్మీయత అంతా ఒక్కటే....” కళ్ళు విప్పింది ఎవరూ 
లేరు, మళ్ళీ కళ్ళు మూసుకుంది. 

ఆస్పత్రి నుండి మనిషి వచ్చాడు. ఆదుర్దాగా లేచింది. “అమ్మగారూ ! ఓ 
అయిదారు వందల రూపాయలు అయితే గాని పాప బ్రతకదట, వచ్చి 
తీసుకెళ్ళమన్నా! స్‌ 

“ఆం... వదినా... ఓ వదినా...” 

“ఏమిటమ్మా ?” 

“పాపకు... పాపకు ఏవో కావాలట...” 

“నన్నేం చేయమంటావు ? చంద్రహారం తాకట్టు పెట్టి నీకు వైద్యం 
చేయిస్తున్నాం. ఇంకా యెక్కడ తేము.” 

“వదినా... నాపాప.... నాపాప....” ఏడుస్తూ ఆస్పత్రికి పరుగెత్తింది. 
పాపను తెల్లని గుడ్డలో చుట్టి ఇచ్చారు. 

“అయ్యో ! వదినా యెందుకింత కఠినంగా మారిపోయారు !... నాపాప 
నా పాప దిక్కులేనిదానిలా చనిపోయింది....” 

“ఇప్పుదేడిస్తే ఏం లాభం ! సమయానికి రాలేదు.....” 

“నా పాప... అయ్యో నా పాప....” 

“ఉమా... ఉమా ! ఏమిటమ్మా ?” వదిన కుదుపులకు మేలుకుంది. 

“ఆం అంతా కలేనా అమ్మయ్య అని కన్నీరు ఒత్తుకుంది.” 

“సాయంత్రం పాపనిస్తారట మీ అన్నయ్య భోజనానికి వచ్చి చెప్పారు.” 
అన్నది. 

“వెళ్ళి చూద్దాం వదినా, అబ్బ ఎంత పీడకల...” భయంగా చూసింది. 

సాయంత్రం వెళ్ళి పాపను తెచ్చారు. శ్రీహరి మంచినీళ్ళలా డబ్బు ఖర్చు 
పెడుతుంటె ఆమె వదిన ముఖం చూసింది. అదే చిరునవ్వు అదే వాత్సల్యం ఆ 
ముఖంలో. 

“వదినా ! అనవసరమైన ఖర్చు - ౫” 

“ఇదిగో ఉమా ! ఇలాంటివి లేకపోతే జీవితంలోని సుఖం ఏం తెలుస్తుంది? 
మా బాధ్యత మేం తీర్చుకుంటాం. నువ్వు అనవసరమైన ఆలోచన మానెయ్యి.” 
కసురుకుంది వదిన. 





8 భార్యా కోపవతీ... 


ఇంటికి వచ్చిన ఉమకు తన పెళ్ళి అయిన నాటినుండి కస్తూరిని తను 
బాధించిన విధానం గుర్తుకు వచ్చింది. ఆమె బాధతో తల వంచుకుంది. సంస్కార 
రహితంగా ప్రవర్తించింది. 

బయట బాబ్దీ గొంతు వినిపించింది. 

“అన్నీ పోగొట్టుకున్న అభాగ్యురాలు బావా ! ఒక్కసారి పాపను 
చూడాలంటుంది రాగానే ఇంటివారు చెబితే నానామాటలు అన్నది నన్ను ఈ 
పరిస్థితుల్లో మా ఇద్దరికీ పడదని ఎలా చెప్పను !” 

“బాబ్టీ ! మరీ పసివాడిలా మాట్లాడకు అక్కయ్యను తీసుకురా. ఉమ 
ఏమనదని మాటయిస్తున్నాను.” 

“మీకు తెలియదు బావా ! మా అక్క వస్తుందంటే పాపను బయటికి 
పంపుతుంది.” 

“నువ్వు ఆ అనుమానాలేం పెట్టుకోకు - ” 

ఆ తరువాత ఉమ బయటికి వెళ్ళేసరికి బాబ్టీ వెళ్ళిపోయాడు. శ్రీహరి 
ఉమ వంక తీక్షణంగా చూశాడు. 

“నన్ను క్షమించన్నయ్యా” 

“నేను కాదు క్షమించ వలసింది బాబ్టీ -” అన్నాడు. ఉమ మాట్లాడకుండా 
లోపలికి వెళ్ళిపోయింది. 

రెండు గంటల తరువాత మెల్లగా వచ్చింది కస్తూరి. ఉమ మాన్సడి 
చూస్తూ వుండిపోయింది. యెప్పుడూ నవ్వుతూ వుత్సాహానికి మారుపేరులా వుండే 
కస్తూరి నుదుట బొట్టు లేక సాదా నేతచీరతో దీనంగా వుంది. 

“వదినా !” ఉమ మొదటిసారిగా సంబోధిస్తూ కస్తూరిని వాటేసుకుని 
బావురుమంది. 

నిజమా, కలా అన్నట్టు చూశారు అక్కా తమ్ముళ్ళీద్దరూ. 

“ఊర్మోమ్మా - ఊర్మో - ” కస్తూరి ఓదార్చింది. ఆ తరువాత ఉమ 
మాటలు రానట్టు, కూతుర్ని తెచ్చి ఆడబడుచు వడిలో వేసింది. 

బాబ్జీ నిర్లిప్తంగా వుండిపోయాడు. శ్రీహరి కోపగించుకుంటే ఆ కోపం 
చూసి తన భార్య అలా మర్యాద నటిస్తుందనుకున్నాడు. రాత్రి భోజనాలయి 
ఇంటికి బయలుదేరారు. 





మాదిరెడ్డి సులోచన కథలు 9 


“ఏమండీ - ” ఉమ నెమ్మదిగా పిలిచింది. 

“ఏమిటి” వెనుతిరిగాడు. 

“నన్ను - నన్ను క్షమించండి, నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను” అతను 
నమ్మలేనట్టు చూశాడు. 

“వదినను కొన్ని రోజులు ఇక్కడుంచకూడదు?” 


“వద్దమ్మా, ఈ అవతారంతో యెక్కడికీ రావాలని లేదు. నా తమ్ముడికి 
కూతురు పుట్టిందంటె వచ్చాను - ” అన్నది కస్తూరి. వాళ్ళను సాగనంపి వచ్చిన 
ఉమ హృదయం తేలికగా వుంది. 

ఉమలో వచ్చిన మార్చు, నిజమయిందేనా అని ఆలోచిస్తున్నాడు బాబ్లీ, 
అక్క వెంట నడుస్తూ. 


O 





10 భార్యా కోపవతీ... 


బడి 


ఆకాశము చిల్లులుపడినట్టు కుండపోతగా వర్షం కురుస్తుంది. 
తడుస్తున్నామన్న స్మృతి కోలుపోయినట్టు పనులు చేసుకుంటున్నారు రైతులు. 
వ్యవసాయం కూడా ఒక జూదం లాంటిదే. విత్తి, అష్ట కష్టాలుపడి పసిబిడ్డలా 
సాకిన చేలు, ప్రకృతి కరుణిస్తే పండుతాయి. 

ఉత్సాహంగా గోనెపట్టాలు, గడ్డిగొడుగులు మోసుకుని వెడుతున్న 
శ్రామికులను చూస్తూ కిటికీ దగ్గర నిలబడింది సుశీల. నెత్తిన టప్పుమని పెద్ద 
నీటిబొట్టు పడేసరికి తలయెత్తి చూచింది. అక్కడ కురుస్తుంది. బయటి వరండాలో 
నిలబడిన విద్యార్థులు ఇవేవీ పట్టించుకోకుండా నీటిలో తడుస్తూ, నీటితో 
ఆడుతున్నారు. ఆ పిల్లల్లో ఒక పిల్లయితే బావుండును ! మళ్లీ కిటికీలో నుండి 
బయటికి చూచింది. యెదురుగా, దూరంగా పెద్ద బంగళా చూస్తూనే ఆమె 
ఊహలు పరిపరి విధాలుగా పోయాయి. ఆ బంగళాలో ఏ జమీందారో, ఏ 
షావుకార్లో, భూస్వాములో వుండి వుంటారు. మహా అయితే ఇద్దరో, ముగ్గురో, 
నల్లురో అయి వుంటారు. నల్లురికి అంత బంగళా యెందుకు ! తన ప్రశ్నకు 
తానే నవ్వుకుంది. 

“ఏమండీ వర్షం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులను ఇంటికి 
వెళ్ళమనేదా? - వాళ్లున్నా లాభం లేదు. కూర్చోవడానికి స్థలం లేదు.” 
అసిస్టెంటుగా పనిచేస్తున్న వరలక్ష్మి అడిగింది సుశీలను. 

“ఊ... వర్షం తగ్గనియ్యండి” అన్నది. ఆమె సుశీల కంటె వయసులో 





మాదిరెడ్డి సులోచన కథలు 1 1 


పెద్దది. ఆ ఊళ్ళో భర్త చనిపోయిన దగ్గర నుండి పని చేస్తుంది. సీనియర్‌ మోస్ట్‌ 
అనవచ్చు. కాని విద్యార్హతలు లేనందున అసిస్టెంటుగానే మిగిలిపోయింది. సుశీల 
మాత్రం ఆమె వయసును అనుభవాన్ని మరచిపోలేదు. ఎప్పుడు ఏ పని చేసినా 
ఆమె సలహా సంప్రదింపులు కావాలనుకుంటుంది. 

“వరలక్ష్మిగారూ ! ఈ బడి కట్టి యెన్నేళ్లయింది?” 

“యెన్నో ఏళ్ళా! రెండేళ్ళు మొన్నటి సంవత్సరానికి ? 

“అప్పుడే జల్లెడలా అయింది చూడండి. ప్రభుత్వమే ప్రజలదన్న భావన 
మన ప్రజల కెప్పుడు వస్తుందో కదా ?” నిట్టూర్పు వదిలింది. 

“కనీసం అందరూ అక్షరాస్యులయితే వస్తుందనుకోవచ్చు.” 

“వర్షాకాలమంతా ఇదే పద్ధతి అయితే, కొన్నాళ్ళకి మనమే అక్షరాలు 
మరిచిపోతాము. ఆ... ఆ బంగళా యెవరిదండీ ?” 

“అదా! భూస్వామి చంగయ్యగారిదండి.” 

“అలాగా ! ఆ యింట్లో యెవరుంటారు ?” 

“ఇప్పుడు యెవరూ వుండరండి. తాళమే. అతని కొడుకు లిద్దరూ 
అమెరికాలో సెటిల్‌ అయ్యారట. కూతుళ్ళు యెక్కడెక్కడో ఉంటారు. తోచనప్పుడు 
సంవత్సరానికి వారం పది రోజులు వచ్చి ఉండి వెళ్ళిపోతారు. 

“సంవత్సరానికి ఒక్క వారం ఉండటానికి అంత పెద్ద బంగళా కావాలా?” 

“డబ్బున్నవారు మరి....” 

ఆమె మాట పూర్తికాక మునుపే బయట పిల్లల దెబ్బలాట వినిపించింది. 
వరలక్ష్మి గొణుక్కుంటూ వెళ్ళింది. సుశీల ఆలోచిస్తూ బయటికి వచ్చింది. సన్నగా 
చినుకులు పడుతున్నాయి. కుండపోత వర్షం మాత్రం తగ్గింది. 

“మీరందరూ ఇంటికి వెళ్లిపొండి” పిల్లలకు చెప్పిందామె. 

“రేపు వర్షం ఇలాగే ఉంటే ఇంటిదగ్గరే ఉండిపోవాలా?” ఓ గడుగ్గాయి 
అడిగాడు. 

“లేదు, బడికి రావాలి” కచ్చితంగా చెప్పింది సుశీల. అవతలి మూల 
వణుకుతూ నిల్చున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఆమెను ముఖం చిట్లించుకుని 
చూచారు. 

“వచ్చి ఇలా వణుకుతూ నిలబడాలనా!” ఆచారి అడిగాడు. అతనిది ఆ 
ఊరే. అధికారులను బ్రతిమాలి స్వంత ఊళ్ళో వేయించుకున్నాడు. అతను పాఠాలు 


l2 


చెప్పేకంటే యెక్కువగా తన స్వంత వ్యవహారాలు చూచుకుంటాడు. రెండెకరాల 
కొండ్ర దున్నుకుని, చిల్లరకొట్టు చూచుకుని బ్రతుకుతున్నాడు. అలాంటిది సుశీల 
హెచ్‌.ఎమ్‌.గా వచ్చిన దగ్గర నుండి ఒక రూల్‌ పెట్టింది. పది నుండి నాల్లు 
వరకు బడిలో ఉండి తీరాలని, పాత హెడ్‌ మాష్టరుగారయితే అతను రూల్‌ 
పెట్టి తను వెళ్ళిపోయేవాడు. ఆ తరువాత నవ్వుకుని మిగిలినవారు ఆయనను 
అనుసరించేవారు. సుశీల తొమ్మిదిన్నర కల్లా బడిలో ఉంటుంది, నాల్గున్నర 
దాటితేగాని బయటికి వెళ్ళదు. పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టు ఉంది. 
ఒక్క వరలక్ష్చి మాత్రం యెవరున్నా లేకపోయినా మాత్రం తనుంటుంది. నాల్లో 
టీచరు గోవిందరావు. ఆతని ఊరు ఐదు మైళ్ళ దూరాన ఉంటుంది. అతను, 
భార్య కలిసి ఒక ఇంగ్లీష్‌ మీడియం స్కూలు పెట్టుకున్నారు. ప్రభుత్వ బడికి, 
తోచనప్పుడు సైకిల్‌పైన ఓ ట్రిప్పు కొట్టిపోతాడు. అతడిని కలుసుకోవాలను 
కున్నవారు జీతం వచ్చే రోజు వచ్చి వేచిచూస్తారు. సుశీల అన్నీ కట్టుదిట్టం 
చేసింది. ఆడది ఏం చేస్తుందిలే అనుకున్న గోవిందరావుకు జీతం రాలేదు. 
ఆడది ఆదిశక్తి అని గ్రహించాడు. ముఖం మాడ్చుకుని వస్తున్నాడు. తన కోపం 
విద్యార్థుల మీద చూపేవాడు. అన్ని సర్దుబాటుచేసి, కొత్త విద్యా సంవత్సరం 
నుండి కొత్త పాఠశాల అవుతుందని, సుశీల సెలవుల్లోనే టైమ్‌ టేబిల్‌ సిలబస్‌ 
రాసిపెట్టింది. వర్షం వల్ల బడి కురుస్తుంది. విద్యార్థులు బయటికి వెళ్ళవలసిన 
పరిస్థితి ఏర్పడుతుందని ఊహించలేదు. 


“సుశీలగారూ 1” 


తన ఆలోచనలు ఆపి తలయెత్తింది. గోపాలరావు నిల్చున్నాడు తన సైకిలు 
పట్టుకుని. 


“వర్షాలు ఇలా పడుతుంటే సైకిల్‌మీద రావటం కుదరదండీ.” 
“యెలా కుదిరితే అలా రండి.” అన్నది కఠినంగా. 

“బురదలో అయిదు మైళ్ళు నడువలేనండీ.” 

“మరేం చేద్దాం. గ 


“వచ్చి మనమిక్కడ చేస్తున్న పనేముందని ! నాల్గు రోజులు బడి 
మూసివెయ్యకూడదూ !” 


“క్తూడదు.....” అన్నది కఠినంగా. అతనేదో గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 13 


అందరూ వెళ్లిపోయాక హెల్పర్‌గా వచ్చిన రంగదాసును వెంటబెట్టుకుని, 
పాత బంగళావైపు వెళ్లింది. వరండాలోనే దాదాపు వెయ్యిమంది కూర్చోవచ్చు. 
ఒక పెద్ద రేకుల షెడ్డది. దాంట్లో కొంత భాగం గారాజ్‌లా కట్టారు. మిగతాదాంట్లో 
శిథిలావస్థలో ఉన్న గుర్రపు బండి ఉంది. అవి కురుస్తున్న సూచనలేం 
కనిపించలేదు. 

“రంగదాసూ ఇక్కడెవరూ కాపలా ఉండరా?” 

“రాములు అని ఉండేవాడమ్మా. దొరగారు సంవత్సరాని కొకసారి వస్తే 
ఇతను నెలకొకసారి వస్తాడు.” అన్నాడు. 

“అలాగా ! ఈ ఊరికి పెద్ద యెవరూ? లక్ష్మయ్య గారేనా !” 

“వారే.” 

“అక్కడికి వెడదాము పదా, ఇద్దరూ లక్ష్మయ్యగారింటికి బయలుదేరారు. 

“ఈ సమయంలో అతను నిషాలో ఉంటాడు అమ్మగారూ !” అన్నాడు 
రంగదాసు. 

“మరి ఆయనను కలిసేదెలా ! ఉదయం ఇంట్లో ఉండరు. మధ్యాహ్నము 


నాకు పని...” 


ఆడవారు తాగుబోతులను చూచి భయపడే అబలలంటూ అణగి మణగి 
ఉంటున్నారు. కాస్త ఈ పరిధి దాటి బయటకు రావాలి. అప్పుడే దేశంలో సగం 
సమస్యలు తీరుతాయి. 

“ఏంది పెద్ద పంతులమ్మా! ఏంది గిట్ల వచ్చినవు.” పళ్ళన్నీ బయటపెట్టి 
నవ్వాడు, లక్ష్మయ్య. 

“బడినిండా నీళ్ళున్నాయి. విద్యార్థులు యెక్కడ కూర్చుంటారు ?” అన్నది. 

“దానికి నన్నేం చెయ్యమంటావు. ఆం.... తెలిసింది. సెలవు ఇచ్చి 
ఎల్లిపో....” అన్నాడు. 'కూర్చో' అనే మర్యాద కూడా లేదు. ఆమె అతని వంక 
చూచి మెల్లగా వెనుదిరిగింది. 

“నేను చెప్పితే విన్నారు కాదు.” 

రంగదాసూ ! విద్యాహీనులైన అధికారులకేం తెలుసు ! ఊళ్లూ, ఊరి 
బడులూ బాగుపడాలంటే ఏ ఊరి కామందుల పిల్లలు ఆ ఊరి బడిలో చదివితే, 


14 = 


వారికి బడి గురించి శ్రద్ధ వహించాలని అనిపిస్తుంది” అన్నది. ఆమె ఆ రాత్రంతా 
ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. 


మర్నాడు చంగయ్యగారి వరండాలో రెండు క్లాసులు, అతని మోటార్‌ 
గారాజు, రేకుల షెడ్డులో మరి రెండు క్లాసులు తీసుకోవాలని నిర్ణయించింది. 
వరండా మధ్యలో నాల్గవ తరగతి పిల్లలను తీసుకొని తను పాఠాలు మొదలు 
పెట్టింది. అమాయకులయిన తల్లిదండ్రులు ఆమె సాహసానికి అచ్చెరువొందారు. 

“ఆయనగారి అనుమతి లేకుండా !” వరలక్ష్మి గొణుక్కుంది. “మనమేం 
బిల్లింగ్‌ను తినటం లేదు టీచర్‌. పాడుబడిన పరిసరాలు చూడు ఎంత 
శుభ్రంగా తయారయ్యాయో !” తృప్తిగా చూచింది. 

వరుసగా వారం రోజులు ముసురు పట్టీ, ఆఖరు రోజున పెద్ద వర్షం 
పడింది. బడి బిల్లింగ్‌ ఒకవైపు నుండి కూలిపోయింది. అది చూచి తల్లిదండ్రులు 
సుశీలను మరోసారి మనసులోనే మెచ్చుకున్నారు. ఆ సమయానికి పిల్లలే 
ఉంటే ! 


వారం రోజులు గడిచాయి. బడిని గూర్చి సుశీల పైకి రిపోర్టు పంపింది. 
అధికారులు వచ్చి చూచుకుని వెళ్లారు. 


ఆచారికి ఒకటే దిగులు ! ఆడ పంతులమ్మ ఆదిశక్తి అయిందేం ? అతను 
సెలవుపెట్టి సిటీకి వెళ్ళాడు. యెందుకు వెడుతున్నాడో రంగదాసు చెవిలో ఊదాడు. 
రంగదాసు కడుపు ఉబ్బిపోతుంది. చివరకు మధ్యాహ్నము వెళ్లి సుశీలతో చెప్పాడు. 

అమ్మగారూ ! ఆచారిగారు పట్నం వెళ్లారు. చంగయ్య గార్ని తీసుకు 
వస్తారట. 

“యెందుకేమిటి ?” 

“వారింట్లో మనము బడి పెట్టినందుకు ?” “ఇంట్లో యెక్కడయ్యా, 
వరండాలోనేగా ! రాని చూద్దాం. అవసరానికి మించిన భూములుగాని, వస్తు 
సముదాయముగాని యెందుకు చెప్పు ! మనము బడిగా ఉపయోగిస్తే, రోజూ 
ఊడ్చి, చల్లి శుభ్రం చేస్తాం, ఇటు అందరికి ఉపయోగపడుతుంది. ఆయన 
సంవత్సరానికోసారి వస్తే ఉండటానికి స్థలమే లేదా?” సుశీల భయపడుతుందను 
కుంటే మొండికేసిందేమిటి అనుకున్నాడు అతను. ఈ కొత్త సిద్ధాంతం అతని 
బుర్రకు యెక్కలేదు. అవసరాన్ని మించిన దానికంటే ఎక్కువ ఊర్లో యెందరికో 
పొలాలున్నాయి. వాటి మాటేమిటి ? దాచుకోలేక అడిగేశాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 15 


“తెలుగు వస్తుందికదా ! వార్తాపత్రిక చదువకూడదు ! భూపరిమితి చట్టం 
అమల్లోకి వచ్చింది” అన్నది సుశీల. అతనికి విపులంగా చెప్పి పంపించి వేసింది. 
ఆమె పిల్లలకు లెక్కలు చెబుదామని పుస్తకం తియ్యగానే, వాకిట్లో జీపు ఆగిన 
శబ్దం అయింది. దిగుతున్నది చంగయ్యగారని గ్రహించి విద్యార్థులను నిశ్శబ్దంగా 
కూర్చుండమని చెప్పి, యొదురువెళ్లి నమస్కరించింది. అతను ప్రతి నమస్మారం 
కూడా చెయ్యలేదు. 

“నువ్వేనా మా ఇంటి తాళం విరగ్గొట్టి నానా ఆగం చేసింది ?” తీక్షణంగా 
అడిగాడు. 

“మీ ఇంటి తాళం విరగ గొట్టలేదు, ఆగమూ చెయ్యలేదు. కూలిపోయిన 
బడి మూలాన మీ వరండాలో తలదాచుకున్నాము. విద్యార్థులు చక్కగా 
చదువుకుంటున్నారు.” అన్నది. 

“యెవరి అనుమతితో ఈ కాంపౌండులో (ప్రవేశించారు !” 

“కుక్కలు, గాడిదలు యెవరి అనుమతితో వచ్చాయి. వాటికన్నా హీనంగా 
కనిపిస్తున్నారా ఈ విద్యార్థులు !” బాధగా అడిగింది. 

“కుక్కలు, గాడిదలు ఏమిటి ?” ముందుకు నడుస్తూ అడిగాడు. “మేం 
వచ్చేసరికి వరండాలో విశ్రమించి ఉన్నవి కుక్కలు, గాడిదలే కదండీ....” అతనిని 
అనుసరించింది. 

ఆమె పిలవకుండానే కుతూహలము అణచుకోలేక అందరూ వచ్చారు. 
పిల్లలు లేవబోయి, సుశీలను గుర్తుకు తెచ్చుకుని కూర్చుండిపోయారు. 

అతను వింతగా, విప్పారిన నేత్రాలతో చుట్టూ పరికించాడు. గడ్డి, 
ముళ్ళకంపతో ఉండే ఆవరణంతా శుభ్రంగా ఉంది. అక్కడక్కడ నాటిన మొక్కల 
చుట్టూ తడికెల గుమ్మి పెట్టి ఉంది. వెగటు వాసనతో ఉండే హాలు పిల్లలతో 
కళ, కళలాడుతుంది. శిథిలమైన ఆవరణ ప్రాణం పోసుకుని సజీవంగా 
కదులుతున్నట్టు అనుభూతి చెందాడు. 

“తాళం విరగ గొట్ట లేదన్నమాట !” అతను సంతోషంగా చూచాడు. 

“ఒకరింటి తాళం విరగగొట్టేటంత కుసంస్మారిని కాదండీ. అసలే మన 
బడులు నడిచేది అంతంత మాత్రం, అందులో వర్షం నెపంతో సెలవులిస్తే 
విద్యార్థులు పాడయిపోతారు.” 


16 = 


“ఊ....” అన్నాడు దూరంగా కనిపించే పిల్లలవంక చూస్తూ, ఆ మాట 
ఆమె ఒక్కర్తి అనటం లేదు. విద్యార్థులంతా ఏకమయి ముక్తకంఠంతో అరుస్తున్నట్టు 
అనుభూతి చెందాడు. 

“అలా చూస్తాడేం ? చీవాట్లు వెయ్యడేం ?” గోవిందరావు ఆదుర్దా. 

“అన్నింటికి తెగింపు పనికి రాదంటే వింటుందా ?” అని వరలక్ష్మి 
ఆందోళన. 

“మన దేశాన్ని పీడించే జబ్బు ఒక్కటేనండి - అనవసరంగా పాడుచేస్తారు 
గాని అవసరమయిన వారికి ఇవ్వరు.” అన్నది. ఆ తరువాత అటు తిరిగింది. 

“అవసరమయితే పిలుస్తాను. మీరంతా మీ మీ పనులు చూచుకోండి. 
రంగదాసూ, మా ఇంటికి వెళ్ళీ పాలు తీసుకురా.” అని పురమాయించింది. 

చంగయ్యకు అతిథి మర్యాదలు చేసి, మామూలుగా తన పనిలో 
లీనమయ్యింది. 

ఆయన తాళం తీయించి ఇంట్లోకి వెళ్ళాడు. బూజు తెర రెప్పనవచ్చి 
అతని ముఖాన్ని ముట్టుకుంది. అది దులుపుకుని లోపలికి వెళ్ళి చుట్టూ చూచాడు. 
గబ్బిలాలు, ఎలుకలు కనిపించాయి. 

“జంతువులకంటె హీనంగా కనిపిస్తున్నారా, ఈ విద్యార్థులు 77 

- అన్న ప్రశ్న మరోసారి అతని చెవుల్లో ధ్వనించింది. యాభై యెకరాల 
పొలం లాండ్‌ సీలింగ్‌లో పోయింది. ఈ ఇంటి గురించిన తన తాపత్రయమేగాని 
యెవరూ పట్టించుకోరు. అతను ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. అతను 
విశ్రాంతి తీసుకుని లేచి కూర్చున్నాడు. 

సుశీల వచ్చింది, స్టూలు లాకుని కూర్చుంది. 

“మన వారికి శంకరాచార్యుని ఫిలాసఫీ వంట బట్టిందేమో కానీ, జీవితం 
అర్థం కాలేదండీ. బడి అంటె హెడ్‌ మి(స్టెస్‌ స్వంతం అనుకుంటారు. నేను 
కదిలితే ఒక బడి కదులుతుంది, అందుకే రాలేకపోయాను.” 

“ఫరవాలేదు, ఒక్కదానివే ఉంటున్నావా ?” 

“ప్రస్తుతానికి ఒక్కదాన్నేనండీ, అమ్మ వస్తారు.” 

“నీవు వయసులో చిన్నదానివయినా, నీ పని తీరు నచ్చింది. ఈ బడిని 
మిషనరీ స్పిరిట్‌తో నడుపుతానంటె, ఈ బంగళా ఇచ్చివేస్తానమ్మా” 

“చంగయ్యగారూ !” 





మాదిరెడ్డి సులోచన కథలు 17 


“అవునమ్మా ! అవసరం లేనివారికి వారసత్వం పేరుతో అంటగట్టడం 
నా అభిమతం కాదు.” 

“కాని చంగయ్యగారూ! నేను యెప్పుడూ ఇక్కడే ఉంటానన్న నమ్మకం 
లేదు.” 

“ఉండాలమ్మా, ఊరికి ఒకరిద్దరు ఉత్సాహవంతులైన నీలాంటివారు, 
పదేళ్ళపాటు ఉండాలి.” 

“ప్రభుత్వ ఉద్యోగులం, ఈ రోజు ఇక్కడ, రేపు మరేదో చోట” అన్నది. 

“యొక్కడున్నా మీరు వెలిగించిన దీపం దేదీప్యమానంగా వెలగాలని నా 
ఆకాంక్ష లక్ష రూపాయలు విలువ చేసే బంగాళా ఇస్తూ, నా చిన్న కోర్మె తీర్చమని 
ప్రభుత్వాన్ని ఆర్థిస్తాను.” 

“మీ చిన్న కోరికా !” 

“అవునమ్మా, నిన్నీ బడికి పెర్మినెంటు హెడ్‌మిగస్టెస్‌గా ఉంచమని 
కోరతాను, తప్పక నా మాట మన్నిస్తుంది ప్రభుత్వం.” 

అతని మాటలు వింటూ తనకు మాటలు రానట్టు నిలబడి పోయిందామె. 
భూస్వాములంతా చంగయ్యగారిలా ఉంటే ? దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. 
ఈ సంగతి తెలియని ఆచారి, గోవిందరావు, సుశీల ఉద్యోగం పోవటమో 
ట్రాన్స్‌ఫర్‌ కావటమో ఖాయం అనుకుని, భుజాలు యెగరేస్తున్నారు. 


O 


తనదాకవస్తే ! 


బంధువుల పెళ్ళికని పూనా వెళ్ళాను. శనివారం ఉదయము వివాహ 
మయింది. సాయంత్రానికి రిజర్వేషను ఉంది. తిరిగి వద్దామని ప్రణాళిక 
వేసుకున్నాను. 

“యెప్పుడూ తొందరే, నాల్లు రోజులుంటే తప్పా ?” మా వదిన అడిగింది. 
ఆమెకు బంధుప్రీతి ఉందో లేదోగాని, మొహమాట పెట్టటంలో ఘనురాలు. 

“అవునే మాలాంటి వారింట్లో యెందుకుంటావు ?” 

“మేం బీదవారమమ్మా నీకు కనిపిస్తామా !” ఇలాంటి మాటలు వింటుంటే 
మహా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా సమయము లేకపోయినా 
వాళ్ళమ్మాయి వివాహానికి వెళ్ళాను. ఏదో వెళ్లాను, వివాహము అయింది కదా 
అని ఊర్మొంటుందా ? నాల్లు రోజులుండమని గొడవ. 

“వదినా ! సోమవారం టి.వి. ప్రొడ్యూసర్స్‌ ఇంటర్‌వ్యూ ఉంది. నేను 
లోకల్‌ కమిటీ మెంబర్‌ని, నేను లేకపోతే యెలా ? నువ్వు నిష్టూరం ఆడతావని 
వచ్చాను. 

“మహా వచ్చావులే చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని, ఇంతకంటే రాకున్నా 
సంతోషించే వాళ్ళము” అన్నది. “ధన్యోస్మి అనుకున్నాను. “సరే నేను రాలేదు 
అనుకో.” అన్నాను, ఏడ్వలేక నవ్వుతూ. “మాటలకేమొచ్చే... భోజనముచేసి 
అయినా వెళ్లు” అన్నది. 

భోజనాలు అయ్యేసరికి నాల్లు దాటింది. హడావుడిగా అందరి నిష్టూరాలు 
దూరంనెట్టి టాక్సీలో స్టేషన్‌కు బయలుదేరాను. దారిలో టాక్సీ చెడిపోయింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 19 


సమయం చూస్తే నాల్గున్నర అయింది. అయిదు ఇరవైకి బండి బయలుదేరుతుంది. 
ఒక్కనిమిషం, ఒక్క నిమిషం అంటూ పది నిమిషాలు గడిపి తెల్లజండా యొత్తాడు 
టాక్సీవాలా. చుట్టుప్రక్కల యొక్కడ టాక్సీలు, ఆటోలు కన్పించలేదు. కావాలంటే 
ఓ రెండు రూపాయలు ఇస్తాను, టాక్సీ, ఆటో ఏదయినా తెచ్చి పెట్టమని 
టాక్సీవాలాను బ్రతిమాలాను. అతను వెళ్లి అయిదు పది నిమిషాలకు ఆటో 
తెచ్చాడు. బండి దొరుకుతుందని ఆశ లేకపోయినా ఆఖరి ప్రయత్నంగా, 
ఆలస్యంగా రావచ్చు అన్న ఆశతో స్టేషన్‌ చేరాను. నేను స్టేషన్‌లో అడుగు 
పెడుతున్నాను, బండి కదిలింది. అసహాయంగా స్పీడ్‌ అందుకున్న బండివంక 
చూచాను. ప్యాసింజరు ఉందంటే వెయిటింగ్‌ రూమ్‌లో కూర్చున్నాను. ప్యాసింజరు 
లేటట. అందులో వెళ్లి హైరానా పడేకంటే ఆదివారం ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరితే 
సోమవారం అయిదున్నర గంటలకు చేరవచ్చునని సలహా ఇచ్చారు రైల్వేవారు. 
ఆ క్షణంలో ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోలేమేమో ! మనకు 
ఒక్కటే విషయం గుర్తుంటుంది. యెవరేది చెబితే అది పాటించటము. అందుకే 
మళ్ళీ పెళ్ళివారింటికి వచ్చి మరు రోజు ఒక గంట ముందుగా వెళ్ళి నా సమస్య 
టికెట్టు కలెక్టరుతో చెప్పాను. 

“ఒక్కరే కదా! టు టైరులో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ చేస్తానులెండి” అన్నాడు. 
కూర్చోవటానికి స్థలము దొరికినా చాలు అనుకున్నాను. 

బండి రాగానే టు టైరులో ఎక్కాను. రెండు మూడు సీట్లవంక చూచాను. 
ఖాళీ లేదు. మరో సీటువంక చూచాను భార్యభర్తలు కూర్చున్నారు. ఒక పాప 
అటు ఇటు పరుగెత్తి ఆడుతుంది. సీటు ఖాళీగా ఉంటే కూర్చుని ఆటాచి సీటు 
కింద పెట్టాను. అతను నావంక ఎగా, దిగా చూచాడు. సంకెళ్ళు వేసిన దొంగను 
పోలీసు ఇన్‌స్పెక్టర్‌ చూచినట్లు. 

“ఇది రిజర్వ్‌డ్‌ కంపార్ట్‌మెంటండీ” అన్నాడు. 

“అవునండి....” అని నా పరిస్థితి వివరించాను. అతని ముఖం 
జేవురించింది. 

“మీ కష్టాలతో రూల్స్‌కేం పని? ఇది రిజర్వ్‌డు కంపార్టుమెంటు. ఐ 
పెయిడ్‌ ఫర్‌ దిస్‌ పీట్‌... నేను ఈ సీటుకు డబ్బు కట్టాను కాబట్టి నాది...” 
అన్నాడు కచ్చితంగా. అతడి ధోరణి చూస్తుంటే జీవితంలో మొదటిసారి డబ్బుకట్టి 
యొక్కినట్టుంది. సంభాషణ ఘర్షణలోకి దిగింది. “అయ్యో రిజర్వేషన్‌ లేనిది 


20 తనదాకవస్తే ! 


యెలా యెక్మావమ్మా ?” “మాకు ఓ పూట తిండికి లేకపోయినా ఇలాంటి అలవాట్లు 
లేవమ్మా. ఓ ఐదు రూపాయలకు ముఖం చూచుకుంటామా ?” 

“మొగవారే టిక్కెట్టులేక ప్రయాణాలు చేస్తారు అనుకునేవారం, ఆడవారు 
రిజర్వేషన్‌ లేక యెక్కుతారా !” 

“యెక్కక ఏం చేస్తారు ? ఆడవారు కదా అని కన్ఫెషన్‌ ఇస్తారనుకుంటారు. 
సమాన హక్కులు అంటారు కదా సమానంగా శిక్షించాలి.” 

“పొరపాటు యెవరికయినా జరుగుతుంది. పాతికో ముప్పై పెట్టి టికెట్టు 
కొనగా లేనిది అయిదు రూపాయలు రిజర్వేషన్‌కు, అది పెట్టుకోలేరా !” 

రకరకాల కామెంట్లు విని నా మతి పోయినంత పని అయింది. ఆ 
క్షణంలో నేనో చీటింగ్‌ ఉమెన్‌గా డబ్బు కక్కుర్తి పడుతున్నాను అన్నట్లు వారు 
అభిప్రాయ పడుతుంటే ఏడ్పు వచ్చింది. 

“ఫ్లీజ్‌! మీరాక్కమాట కూడా మాట్లాడవద్దు. మీ సీటు మీరే ఉంచుకొండి” 
చటుక్కున లేచి నిల్చున్నాను. 

“నిలబడితే మీ నేరం మాసిపోతుందా ? మీ దగ్గర రిజర్వేషన్‌ టికెట్టు 
లేనప్పుడు యెందుకు యొక్కారు ? యెందుకొచ్చిన చదువులండీ !” సీటుకు 
డబ్బు కట్టిన అతని వాదన. 

నా మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది. ప్లేన్‌లో వెళ్ళకూడదు ? 
నిజంగానే టికెట్‌ కలెక్టర్‌ మాట విని రూల్స్‌కు విరుద్ధంగా యెక్కాను. 
ఆలోచిస్తున్నాను. 

“యెవడి కోసం నోరు మూసుకుంటుంది ! తప్పు తనదేగా !” మళ్ళీ ఆ 
సీటువాలా గర్వంగా అంటున్నాడు. 

“ఏమండీ జరిగింది చెప్పాను, అనవసరంగా మాట్లాడవద్దు.” 

“యిందుకనము ! ఈ కంపార్దుమెంటులో నుండి దింపేసే అధికారము 
కూడా ఉంది మాకు” అన్నాడు. చదువు, సంన్మారం ఉన్నవారు కూడా ఇంత 
అసభ్యంగా మాట్లాడుతారని మొదటిసారి అర్థం అయింది. 

“రూల్స్‌ చదువుకున్నవారే పాటించకపోతే యెలాగండీ ” సీటువాలా 
రూల్స్‌, నీతి గురించి పులిస్టాప్‌ కామా లేకుండా ఉపన్యాసము దంచేస్తున్నాడు. 
నేను పట్టించుకుంటే ఇంకా మాటాడుతారని విననట్టు ఊర్మున్నా అతని మాటలు 
వినిపిస్తూనే ఉన్నాయి. 





మాదిరెడ్డి సులోచన కథలు 21 


తరువాత స్టేషన్లో దిగి రిజర్వేషన్‌ లేని కంపార్టుమెంటులో యెక్కబోయాను. 
అడుగు పెట్టడానికి స్థలం లేదు. సందులేకుండా బట్టలు పేర్చిన అటాబలా 
ఉంది. ఊపిరి ఆడటం కష్టం అనిపించింది. ఫస్టు క్లాసులో కూడా అవకాశము 
లేదన్నారు. కురుడివాడి వచ్చేవరకు యెలాగో తంటాలుపడి, అక్కడ సిట్టింగు 
స్థలం దొరికింది. షోలాపూర్‌ రాగానే బ్రేక్స్‌ ట్రబులని బండి రెండు గంటలు 
ఆగింది. 

నాంపల్లిలో బండి దిగేసరికి చాలా ఆలస్యం అయింది. తొమ్మిది గంటలకు 
సోమాజిగూడలో ఉండాలి. స్టేషన్‌కు కారు వచ్చింది. గబగబ దిగి, ఇల్లు చేరి, 
స్నానం చేసి, కాఫీ త్రాగి ఉపగ్రహం చేరుకున్నాను. 

“మీరు ఒక్కరే రావాలి...” అన్నారు డైరెక్టర్‌. ఇంటర్‌వ్యూలు ప్రారంభం 
అయ్యాయి. ఒక గంటకంతా అయిపోయింది. కాఫీ త్రాగి ఇళ్ళకు వెళ్లిపోవలసిందే 
కాని పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాం. బయట క్లర్క్‌ యెవరితోనో ఘర్షణ 
పడుతున్నాడు. కూర్చుండలేక బయటికి వచ్చాను. “నాదేం పొరపాటు లేదండీ, 
టైను రెండు గంటలు లేటు. హోటల్‌కి వెళ్లి బస కుదుర్చుకుని ఆదరా, బాదరాగా 
బయలుదేరాను. ఈ ఊరు నాకు కొత్త, ఆటోవాడు యెక్కడెక్కడో తిప్పి తెచ్చాడు. 
తీరా వచ్చాక కంగారులో సర్టిఫికెట్లు మరిచిపోయాను....” ప్రాధేయపడుతున్నాడు 
వ్యక్తి. 

“అది నిజమేనండీ, ఇంటర్‌వ్యూ అయిపోయింది. కమిటీ మెంబర్స్‌ కూడా 
వెళ్లిపోతున్నారు.” 

“ఒక్కసారి వారితో మాట్లాడే అవకాశము కలుగజేయండి, సర్టిఫికెట్ల 
కోసమని మళ్లీ వెళ్లాను, చూడండి బొంబాయి నుండి ఇంటర్‌వ్యూకు వచ్చిన 
నేను ఆలస్యంగా వస్తానా !” 

అతని వాదన నిజమే ననిపించింది. అతడు అర్హత కలవాడే అయితే 
మిగతా మెంబర్లతో మాట్లాడవచ్చు అనుకున్నాను. 

“వ్లాట్‌ ఈజ్‌ ద మేటర్‌” అని అడిగాను. 

అతను ఇటు తిరిగాడు, నేను అతడిని చూచి యెంత తెల్లబోయానో, 
నన్ను చూచి అతను అంతే తెల్లబోయాడు. అతను మరెవరోకాదు, సీటువాలా 
అంటే నిన్నరాత్రి నాతో సీటు కోసము వాదించి రూల్స్‌ చెప్పిన పెద్దమనిషి. “ఐ 
పెయిడ్‌ ఫర్‌ దిస్‌ సీట్‌” అంటూ పదేపదే గుర్తు చేసిన మహానుభావుడు. 


22 తనదాకవస్తే ! 


“మేడం... మేడమ్‌... మీరా...” అతను ఆశ్చర్యంగా అపనమ్మకంగా 
చూస్తున్నాడు. ఆ చూపులో మీరే అని తెలిస్తె మొత్తం బర్త్‌ ఇచ్చి నిల్చునే వాడినే 
అన్న భావం కనిపించింది. 

“ఎక్స్‌క్యూజ్‌ మీ మేడమ్‌” నాకు ఛాన్స్‌ ఇప్పించమన్నట్టు ప్రాధేయ 
పూర్వకంగా ఉన్నాయి అతని చూపులు. 

“చూడండి, రూల్స్‌ గురించి ఇంత బాగా మాట్లాడిన మీరు రూల్స్‌ 
పాటించకపోతే యెలా ?” అన్నాను. అలా మాట్లాడటం సంస్మారమో కాదో 
తెలియదు. కాని మాటలు అసంకల్పిత ప్రతీకార చర్యలా వచ్చాయి బయటికి. 
నేను మానవ మాత్రురాలనేగా. 


“కావాలని చేయలేదు మేడమ్‌....” 
“యెవరూ ఏ తప్పూ కావాలని చేయరు. అయినా శిక్షింపబడుతారు...” 


“నా స్థలంలో మీరే ఉంటే...!” అతనికి కోపం వస్తుంది. కోపాన్ని, 
అక్కస్సును దిగమింగాడు. యెలాగో ప్రశ్నించాడు నాకు నవ్వు వచ్చింది. 

“నేను మహాత్ముడి అంత గొప్పదాన్ని మార్చ్‌ అంత విశాల దృక్పథం 
కలదాన్ని కాకపోయినా, కొన్ని నియమాలు పాటించే, సంస్కారం ఉంది. నేను 
తప్పక పాటించి తీరుతారు. రూల్స్‌ మీ కోసం, అవకాశాలు మా కోసం అనే 
తత్వం కాదు.” అన్నాను. 

“మేడమ్‌...” దీనంగా చూచాడు. 

“సారీ మిస్టర్‌ ! ఈ జాబ్‌కు పబ్లిక్‌ రిలేషన్స్‌ మేంటేన్‌ చెయ్యగల్లి వుండాలి. 
అది మీకు చేతకాదు” అని నేను తిరిగాను. అఫ్‌కోర్స్‌ అతని తృప్తి కోసం 
ఇంటర్‌వ్యూకు పిలిచి, తరువాత రిగైట్‌ పంపవచ్చు. ఆ క్షణంలో నాకు అలాంటివి 
గుర్తుకు రాలేదు. నన్నో మోసకత్తె క్రింద జమకట్టి అవహేళన చేసిన అతని 
ముఖమే గుర్తుకు వచ్చింది. “రూల్స్‌” అంటూ ఉపన్యసించిన అతని కంఠమే 
వెంటాడింది. 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 23 


కృష్ణకన్నయ్యా ! 


అఆఅ౦దరము అమరావతి శిల్పసౌందర్యము చూడాలని బయలుదేరాం. 
రాత్రి దారిలో మజిలీ చేశాము, ఏ ఊరన్నది అప్రస్తుతం. ఒక ఊరు, లేదా 
ఎ.బి. ఏదయినా అనుకుందాము. మాది, కరుణానిధిది, రామమోహన్‌ది ముగ్గురి 
కార్లు హోటల్‌ ముందు ఆగాయి. 

“మా చెల్లెలు ఈ ఊళ్ళో ఉంది, వెడదాము, హోటలెందుకు?” అన్నది 
మిసెస్‌ కరుణానిధి. 

“అమ్మా! ఈ బలవంతపు ఆతిథ్యం వాళ్ళ నెత్తిన రుద్దకు. మనము మన 
సంతోషం కోసం యివర్నో ఇబ్బంది పెట్టటం భావ్యం కాదు” అన్నాను. 

“అది నిజమేగాని బెడ్డింగు, భోజనం అన్నీ వెంట ఉన్నాక హోటల్‌ 
వాడికి తగలెయ్యటం దేనికి ? ఒక రాత్రి కళ్ళు మూసుకుంటే గడిచిపోతుంది. 
మనమేం వండమన్నామా, వార్చమన్నామా ?”మిసెస్‌ రామమోహన్‌ అన్నది. 
ఆమెకు ఒక్క పైసా ప్రాణంతో సమానం. 

“సరే మీరు వెళ్ళండి” అన్నాను. రెండు కార్లు వెళ్లిపోయాయి. మేం గది 
తీసుకుని గదిలో సామాన్లు పెట్టుకున్నాం. 

“నాకు కొక్కాకోలా... కావాలి”, అంటూ అబ్బాయి గంతులేస్తున్నాడు. 


“మీరు ఓ గంట వీడిని బయటికి తీసుకువెళ్లండి. కాస్త తలనొప్పి 
తగ్గుతుంది”, అన్నాను. వాడికి ఇరవైనాల్లు గంటలు కోకకోలాలు, చాకలెట్లు 
అంటూ అరవటంతోనే సరిపోతుంది. ప్రక్కవాళ్ళ తల పగిలిపోతుందన్న జ్ఞానం 
లేదు. 





24 మాదిరెడ్డి సులోచన కథలు 


వాళ్లు బయటికి వెళ్లారు. మెల్లిగా దక్షిణంవైపు కిటికీ తీసి బయటకు 
చూసాను. 


“అమ్మగారూ ! ఏమయినా తెచ్చిపెట్ట మంటారా?” 

“ఒక కప్పు వేడి టీ తెచ్చిపెట్టు”, అన్నాను. కిటికీలో నుండి బయటికి 
చూస్తున్నాను. ఎక్కడినుండో నా కిష్టమయిన పాట వినిపించింది. 

నల్లనయ్యా 

కృష్ణకన్నయ్యా ! 

విరహిణి రాధ ఆలపించే విరహగీతం. కాలేజీ ఉండగా క్లాసులు యెగగొట్టి, 
నేనూ రాధ పాడుకునేవాళ్లం. రాధ గొంతులో అమృతధారలు వర్షించేవి. ఆమె 
ముఖ భంగిమలు చూస్తుంటే రాధ, మీరా, గోపికలు కనిపించేవారు. రాధ 
అందాల బొమ్మ. వివాహమయి ఆరు నెలలు తిరుగక పూర్వమే చనిపోయింది. 


కాని... కాని ఈనాటి ఈ పాట అచ్చం రాధ పాడినట్టే ఉంది. ఎవరు ? 
ఎవరు ఆ పాడేది? పదిలంగా దాచుకున్న నా నెచ్చెలి స్పృతులు కెలికింది ఎవరు? 


నా రాగానికి ప్రాణం నీవయ్యా 
కృష్ణకన్నయ్యా... 
'కృష్ణకన్నయ్యా ! అనే పదం రాధ కంఠంలో ఓ ప్రత్యేకమయిన వరవడిలో 
పలికేది, అదే.... అదే గొంతు ! మాధుర్యం ! అదే లాలిత్యం ! 
“అమ్మగారూ ! టీ అండి,” హోటల్‌ కుర్రాడు స్పూన్‌తో ట్రేను కొట్టాడు. 


“ఆం... వచ్చావా ? పాట వినిపిస్తే...” అన్నాను కంగారుగా, కప్పు 
అందుకుంటూ. 


“మాతాజీ పాట మీకు నచ్చిందా ? అందరికీ నచ్చింది లెండి” అతను 
గర్వంగా అన్నాడు. 

“ఎవరా “మాతాజీ? 

“ఏమోనమ్మా! ఈ ప్రక్కన షావుకార్ల కోడలు. వివాహం కాగానే కృష్ణుడు 
దర్శనమిచ్చి, మాతాజీని భక్తురాల్ని చెసారమ్మా....” 

“మహత్తు ఉందా ?” 

“మాతాజి దగ్గరా? చాలా మహత్తు ఉంది. షావుకార్ల వ్యాపారం 
మూలపడింది. ఆమె పాద మహిమ వల్ల ఇప్పుడు బాగున్నారు.” 


కృష్ణక న్నయ్యా! 2 వ 


“భవిష్యవాణి చెబుతుందా ?” 

“ఉహు ! పాట ఆపి, చిన్నగా నవ్వి అందరిని ఆశీర్వదిస్తుంది” అన్నాడు. 
టీ త్రాగి ఇచ్చేశాను. 

నా ఊహా రూపు నీవయ్యా ! 

అదే మధురమయిన పాట ! నాకు కుతూహలంగా ఉంది. హోటల్‌ 
కుర్రాడిని వెంట రమ్మని అడిగాను. అప్పుడే సంధ్య దీపాలు వెలిగిస్తున్నారు. 
అతను కౌంటర్‌ దగ్గర గది తాళం ఇచ్చి వచ్చాడు. 

“వెళ్ళండమ్మా ! ఒక్కడే అబ్బాయి లాగున్నాడు. 'మాతాజీ నిండు మనసుతో 
ఆశీర్వదిస్తే మళ్ళీ ఈనాటికి కూతురు పుడుతుంది” ముసిముసిగా నవ్వాడు. 
ఇందాక సామాన్లు తెచ్చిన నడివయసతను. 

హోటల్‌ కుర్రాడు దారి చూపగా ప్రశాంతమైన ఇంటి ఆవరణలో అడుగు 
పెట్టాను. ఒకవైపు పాతకాలపు మేడ, మరోవైపు ఆలయం ఉన్నాయి. ఆలయ 
ప్రాంగణంలో అమ్మ మీరాబాయిలా ఉన్న ప్రీ చిన్న ఆసనం మీద కూర్చున్నది. 
ఆమె చేతిలో ఏక్‌తార ఉంది. పొడవాటి జుట్టు వీపంతా పరుచుకుంది. ఆమె 
ఎదురుగా, బారులు తీర్చిన ప్రీ పురుషులు కూర్చున్నారు. నేను క్యూలో 
కూర్చున్నాను. దూరం నుండి ఆమె వయసు అంచనా వెయ్యలేకపోయాను. 
పాటకంటే మృదువుగా, పొడవయిన వేళ్ళు ఏక్‌తారను మీటుతూ కనిపించాయి. 

పూజ తతంగం లేదు. క్యూలో ముందుకు జరిగిన వారిని చిరునవ్వుతో 
తలమీద చెయ్యి పెడుతుంది. అందుకే అరగంటలో మాతాజీని చేరాను. 

ఆమె కివ్వాల్సిన కట్న కానుకలు పక్కనే ఉన్న వృద్దురాలు తీసుకుంటుంది. 
నా తలపై చేయి పడగానే తలయెత్తాను. ఒక్క క్షణం అర్ధ నిమీలిత మాతాజీ 
నేత్రాలతో నా చూపులు కలబడ్డాయి. 

“రాధా.... రాధా....” అప్రయత్నంగా నా నోటి నుండి వెలువడిందా 
పిలుపు. 

ఆమె కళ్ళు మూసుకుని మళ్ళీ ఏక్‌తార మీటుతూ... 

కన్నయ్యా ! నిన్ను పిలిచేరు రావయ్యా. 

రాధ మనసులో మాధవుడివీవయ్య. 

అదే కంఠం, అదే మధురిమ. వెనుక వచ్చే భక్తులను చూసాక ముందుకు 
జరక్క తప్పలేదు. ముసలమ్మ దగ్గర ముడుపు చెల్లించి బయటకు వచ్చాను. 


26 కృష్ణకన్నయ్యా | 


అదెలా సాధ్యం ! ఈ రాధ మా రాధ. ఒక్కనాటి పరిచయమా, మూదేళ్ళు కలిసి 
చదివాము. మనిషిని పోలిన మనిషి ఉంటాడు. ఎక్కడో కాస్త భేదం ఉంటుంది. 
సినిమా కాదు, ఒకే వ్యక్తి డబుల్‌ యాక్షన్‌ చెయ్యటానికి. 


“ఇంత చిన్న వయసులో భగవత్‌ సాక్షాత్కారం జరిగిందంటే 
అదృష్టవంతురాలే. 2 

“పూర్వజన్మ సుకృతం. 2 

భక్తులు అనుకుంటూ వెడుతున్నారు. నేనేం చేయాలో తోచలేదు. ఒక్క 
క్షణంలో మహత్తు, మహిమ ఏమీ కనిపించలేదు. ఆ క్షణంలో కనిపిస్తే గారడీ 
అవుతుందేమో, మెల్లగా గదికి వచ్చాను. నన్ను చూసి మావారు నవ్వారు. 

“ఏం ఆత్మబలం క్షీణించిందా, శాస్త్రీయ దృక్పథం సన్నగిల్లిందా ?” అని 
అడిగారు. ఎప్పుడూ, అమ్మలు బాబాలు, స్వాములు అంటూ చర్చ వస్తే నేను 
ఖండించడం కద్దు. 

“ఆధ్యాత్మిక చింతనతో, ఈ ప్రాపంచిక సుఖాలకు, విషయాలకు దూరంగా 
బ్రతకటం హర్షించతగ్గదే కాని, ఈ అమ్మలను, బాబాలనూ నమ్ముతూ మరో 
దేవుడని కొలువటం మానసిక బలం లోపించటమో, శాప్రీయ దృక్పథం తెలియకో 
కావాలి” అనేదాన్ని. అందుకే వెటకారం చేసారు. 


“అందుకు కాదండి... ఆమె మా రాధండి... రాధ పాటలు పాడేదని 
చెప్పేదాన్ని, ఆ రాధ.” 

“ఆ చనిపోయిన రాధ బ్రతికి వచ్చిందా ! పద, పద, మళ్లీ ఉదయం 
లేస్తూనే (డైవ్‌ చెయాలి.” 

వెళ్లి భోజనం చేసి వచ్చి పడుకున్నా రాధే గుర్తుకు వస్తుంది. నాకు 
నిదుర రావటం లేదు. కిటికీ తీసుకుని చూసాను. పది గంటలకు పాటలు 
ఆగిపోయాయి. మెల్లగా వచ్చి పడక మీద నడుము వాల్చాను. బయట బెల్‌ 
నొక్కారు యెవరో. లేచి తలుపులు తీసాను. తుఫానులా వచ్చాడు రామ్మోహన్‌. 


“అబ్బ ఏం ఇల్లండీ అది ! బయట పడుకొమ్మన్నాడు. దోమలు 
చంపుతున్నాయి. మీరు ఏమనుకున్నా సరే, ఈ సోఫాలో పడుకుంటాను...” 
అతను సోఫాలో నడుము వాల్చాడు. పదకొండు గంటలకు వచ్చిన మనిషిని 
యెలా తరుముతాము ! 





మాదిరెడ్డి సులోచన కథలు 2] 


అతనికో బెడ్‌షీటిచ్చి, లైటు ఆర్పాను. మళ్లీ వేరే గొంతు వినిపించింది. 
మిసెస్‌ రామ్మోహన్‌ అయి వుంటుంది అనుకున్నాను. భలే మనుష్యులు ! లేచి 
తలుపు తీసాను. ఈసారి యెవరో అపరిచితుడు నిల్చున్నాడు. 

“కాంతి అంటే...” 

“నేనే....” అన్నాను. 

“మాతాజీ మిమ్ముల్నొక్కసారి రమ్మంటున్నారు” అన్నాడు. వెంటనే వారిని 
లేపి విషయం చెప్పాను. 

“ఆ.... పొద్దున వస్తామని చెప్పు” 

“నాకేం భయం లేదండి, నేను వెళ్లి వస్తాను” అన్నాను. నాపేరు 
చెప్పిందంటే ఆమె రాధే అయివుంటుంది. 

“ఊ... నీ జిజ్ఞాస కాదు కాని ప్రాణాలు తీస్తావ్‌...” ఆయన లేచి వచ్చాడు. 

మేము పాతకాలపు మేడలోకి వెళ్ళాము. 

“మీరక్కడ కూర్చోండి సార్‌.... మాతాజీ ఆమెను మాత్రమే రమ్మన్నారు” 
అన్నాడు. మావారు హాల్లో వున్న ఫేము కుర్చీలో కూర్చున్నారు. నేను పైకి 
వెళ్లాను. ఓ గది తలుపు తట్టగానే ఓ ముప్పయి అయిదేళ్ల వ్యక్తి బయటికి 
వచ్చాడు. అతని పోలికలుబట్టి, రాధ భర్తగా గుర్తించాను. నేను లోపల అడుగు 
పెట్టగానే, రాధ తలుపు వేసింది. ఆమె ఇప్పుడు వేలుముడి వేసుకున్నది. “ఏమిటి 
క్రాంతీ ! చనిపోయిన రాధ యెలా బ్రతికిందనా !” నవ్వుతూ నా భుజాలమీద 
చేతులు వేసింది. 

“రాధ.... రాధా నువ్వేనా ?” 

“నేనే క్రాంతీ !” ఆమె నా చెయ్యిపట్టి తీసుకువెళ్లింది. ఇద్దరం మంచం 
మీద కూర్చున్నాము. రాధ వెలికిలా పడుకుంది. 

“క్షమించు క్రాంతీ ! నడుము నొప్పి పుడుతుంది. ఐదు గంటల నుండి 
ఒకే పొజిషన్‌లో కూర్చోవటం నరకమే అనుకో....“ 

“రాధా... ఏమిటీ నాటకం ! నువ్వు మాతాజీవి ఎప్పుడయ్యావు ?” కాస్త 
ఆవేశంగా అడిగాను. 

“ఏమిటోయ్‌; అంత అనుమానం ! ముప్పై ఏళ్ళ మాతాజీ అంటే యెంత 
గ్లామరు. ఏం కథ... ఆం....” అన్నది నవ్వుతూ. 


28 కృష్ణకన్నయ్యా | 


“ప్లిజ్‌ రాధా! నన్ను ఇంకా చిత్రవధ చెయ్యకు” 

“నా గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతోనే నువ్వు చిత్రవధ అనుభవిస్తుంటే, 
రోజూ ఈ నాటకం ఆడలేక నేనెంత చిత్రవధ అనుభవిస్తున్నానో నీకేం తెలుసు...” 

“ఎందుకీ నాటకం ! చెప్పు రాధా... చెప్పు.” 

“చెబుతాను....” రాధ కళ్లు మూసుకుంది. 

“కాంతీ ! మా అత్తగారిని చూసి దైవభీతిగల కుటుంబం అంటూ మా 
వాళ్లు మురిసిపోయారు. నేను సంతోషించాను. వివాహమయి, తొలిరాత్రి గడిపాక 
గాని వాళ్లెంత అంధకారంలో (బ్రతుకుతున్నారో అర్థం కాలేదు. నా భర్త 
రాజేశ్వరీదేవి” అనే అమ్మవారి భక్తుడు. కోటి కోర్మెలతో అడుగుపెట్టిన నన్ను 
చేరదీయకపోగా, పద్మాసనం వేసుకుని కూర్చుని, 'రాధా మనకు సుపుత్రుడు 
కలగాలంటే, కఠోర నియమబద్దులమై మండలం రోజులు అమ్మవారిని సేవించి 
మనం ఏకం కావాలి” అన్నారు. ఏం చేయాలో చెప్పు? నలభై రోజులు 
నరకయాతన అనుభవిస్తూ వారు మంచం మీద పడుకుంటే కటిక నేలపై 
పడుకున్నాను. ఆ తరువాత ఒక్కరోజు దాంపత్య జీవితం అనుభవించాము. 

“గాంధీగారు ఏమని సెలవిచ్చారో తెలుసా, తుచ్చమైన కోర్కెలతో కాదు, 
దాంపత్య జీవితం గడిపేది సంతానం కోసం....” అంటూ మళ్ళీ నన్ను దూరం 
ఉంచారు, మూర్ధత్వమో, ఆధ్యాత్మిక చింతనో అర్థం కాలేదు. అతడిని నిలదీసి 
అడిగితే ఏవో పిట్టకథలు చెప్పేవారు. 

“వయసు, మనసున్న మనిషిగా ఏం చేయాలి చెప్పు ? అనుకోకుండా.. 
అనుకోకుండా....” చెప్పలేకపోయింది. 

“ఏం జరిగింది రాధా ?” 

“ఏం జరుగకూడదో అదే జరిగింది క్రాంతీ! మా ప్రక్క ఇంట్లో ఉన్న 
ముస్లిమ్‌ యువకుడికి నన్ను నేను అర్చించుకున్నాను. నా కోర్కెలు 
పండించుకున్నాను.” 

“అది నీ పొరపాటు కాదు రాధా! నీ భర్త మూర్ధత్వం” అన్నాను. మనిషికి 
లైంగిక జీవితం కూడా బయలాజికల్‌ ఆర్ట్‌, నీడ్‌ అంతే. 

ఆ విషయము ఇంట్లోవారికి తెలియగానే, మావాళ్లను పిలిపించారు. 
మావాళ్లు నేను చచ్చిపోయానని దుమ్మెత్తిపోసి వెళ్లిపోయారు. మా అత్తవారికి 
రాజేశ్వరమ్మ ఏం చెప్పిందో గాని వాళ్లు వచ్చారు. 





మాదిరెడ్డి సులోచన కథలు 29 


“నిన్ను క్షమించి, యెవరూ పొందనంత గౌరవాన్ని ఇప్పిస్తాము. మేము 
చెప్పినట్టు వినాలి” అన్నారు. 
“ఏమిటి ?” కుతూహలంగా అడిగాను. 


“రాజేశ్వరమ్మ శిష్యబృందంలో చేరిపోవాలి, ఉపదేశం పొందాలి. ఆమె 
చెప్పినట్టు నటించాలి. నీకు రోజూ నీ ప్రియుడితో సమాగం దొరుకుతుంది. 
కావాల్సినంత కరు 

“నా కిష్టం లేకపోతే !” అన్నాను. 

“మా సంగతి తెలియదు, మా పరువు ప్రతిష్టల కోసం ఏమయినా చేస్తాం. 
నీ ప్రియుడు ఈ లోకంలో ఉండడు...” అన్నారు, క్రాంతీ. ఆ క్షణంలో ఏం 
గుర్తు రాలేదు. ఆరాధనా అభిమానంతో చూసే అతని ముఖం కనిపించింది. 
అంగీకరించాను. నేను ఏమయిపోయినా ఫరవాలేదు, కాని.... కానీ- నాకు 
అమరసుఖాలు చూపించిన అతడు మరణించటానికి వీల్లేదనిపించింది. ఆ 
రోజునుండి అమ్మవారి ముఖ్య శిష్యురాలిని అయ్యాను. ఆమె పోయాక మాతాజీగా 
రూపుదాల్సాను. గొర్రెదాటు జనము, భక్తితోపాటు, మాకు భక్తికి కష్టము లేకుండా 
కానుకలు ఇచ్చిపోతారు. నా నెలసరి ఆదాయం అయిదారు వేలుంటుంది. 
కొందరు నగలిస్తే, కొందరు నాణాలిస్తారు. ధాన్యం కొలుస్తారు....” 


“ఇదంతా మోసం కాదా ?” అరిచాను. 


“క్రాంతీ ! ఆవేశపడుతున్నావు. వేషంతో మోసం చేసి బ్రతుకవచ్చని 
అనుకున్నప్పుడు, కష్టపడేది ఎవరు చెప్పు ?” రాధ నవ్వుతూ అడిగింది. 


“విద్యావంతురాలివి, వివేకం కలదానివి. ఈ అవతారాలు యెత్తటానికి 
సిగ్గు లేదూ?” 


“కాంతీ ! నీకు వీలుంటే ఈ పూట వచ్చి చూడు. నా ఆశీస్సులకు 
వచ్చేవారు విద్యాధికులు, విదేశాలకు వెళ్లేవా శ 


“అందరికీ అసలు సంగతి చెబుతాను. నీ బండారం బయట పెడతాను.” 
“ఎంత అమాయకురాలివి క్రాంతీ !” పగలబడి నవ్వింది. 


“నాకు వ్యతిరేకంగా ఒక్క మాటన్నాా ఈ చుట్టుపట్ల నిన్ను బ్రతుకనివ్వరు. 
మన జనం ఆలోచించే స్థితిలో లేరు...” అన్నది జాలిగా. 


3 (0) కృష్ణకన్నయ్యా | 


నాకేం తోచలేదు, రాధ అన్న మాటలు అబద్ధం కావని తెలుసు. ఒకటి 
రెండుసార్లు జిజ్ఞాసతో బాబాల, అమ్మల, స్వాముల మహత్తేమిటని విద్యావంతు 
లను అడిగితే, వాళ్లు 'నువ్వు మూర్చురాలవన్నట్టు” చూశారు. అందుకే మౌనం 
వహించాను. 

క మాలోచిస్తున్నావు క్రాంతీ! నన్ను ఏ విధంగా ఎక్స్‌పోజ్‌ చెయ్యాలనా?” 

“కాదు రాధా! నీ మహిమలు అందరూ యెలా నమ్ముతారు 1” ఆశ్చర్యంగా 
అడిగాను. 

“మా మరుదులు, ఆడపడుచులు భక్తులలో చేరిపోతారు. నా గురించి 
ప్రచారం చేస్తారు.” 

“ఓహ్‌...! రాధా, ఈ విషయము ఈనాడు బయట పెట్టకపోయినా ఏదో 
ఒకరోజు వ్రాస్తాను.” 

“నువ్వు వ్రాసినా మా వాళ్లు నలుమూలల నుండీ నిన్ను ఖండిస్తూ, నా 
మహిమలు కీర్తిస్తూ వ్రాస్తారు. వెర్రిదానా ! ఈ వ్యవస్థ మార్చి, మనిషిని ఆలోచింప 
చేయటానికి మహత్తు గల మహాత్ముడు అవతరించాలి.... పోనీ యొక్కడికి 
వెడుతున్నావ్‌?” 

చెప్పాను, రాధ నా భుజం తట్టి, నవ్వింది. 

“విష్‌ యు గుడ్‌ లక్‌, పిల్లలు-” 

“ఒకబ్బాయి-” అన్నాను. 

“అయితే ప్రభుత్వానికి నీ పూర్తి సహకారం ఇస్తున్నా వన్నమాట” నవ్వింది, 
మరో అరగంట కూర్చుని, అందరి విషయాలడిగితే జవాబు చెప్పి బయటికి 
వచ్చాను. 

“సారీ క్రాంతీ ! నా చేతి కాఫీ, పండ్లరసం కూడా త్రాగవని తెలుసు. 
అందుకే ఏం ఇవ్వలేదు.” 

“ఫరవాలేదు- సీస్వార్థమే కాని ఈ అమాయకులను మభ్యపెట్టడం 
మారవన్న మాట-” 

“ఎందుకు మారాలి?” (ప్రభుత్వ యంత్రాంగమే నా మహిమ లాంటిది. 
అక్కడ మార్చు వస్తుందా, మోసం లేదా? అది మార్చు-” 





మాదిరెడ్డి సులోచన కథలు 3 1 


జవాబు చెప్పలేనట్టు క్రిందికి వచ్చి, ఆయన కునుకు తీస్తుంటే లేపాను. 
తిరిగి చూడకుండా గదిలోకి వచ్చాను. రామ్మోహన్‌ హాయిగా, బాబు ప్రక్కన 
పడుకుని నిదుర పోతున్నాడు. మావారు లేపబోయారు. 


“పోనివ్వండి-” అని సోఫాలో కూలబడ్డాను. నిద్ర వస్తుందేమో ఆయన 
ఏం అడుగలేదు. రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. 

కన్నయ్యా - కృష్ణ కన్నయ్యా ! 

పాట వినిపించింది, వెళ్లి విసురుగా తలుపు వేసాను. నిళ్ళబ్ద 
వాతావరణంలో స్పష్టంగా వినిపిస్తోంది. గబగబా మా వారిని లేపాను. 

“అబ్బబ్బ ఏమిటి?” 

“త్వరగా వెళ్లాం-” ఆయన విసుక్కుంటూ ప్రయాణం అయ్యారు. విషయం 
మూడు ముక్కల్లో చెప్పాను. 

“ఆ పాట నా గుండెలను చీల్చివేస్తుంది. ఇంకొక్క క్షణం ఉన్నా నేను వెళ్లి 
రాధతో తగవుపడాలి-” అన్నాను. 

రామ్మోహన్‌ వాళ్లను వచ్చి ఆ తరువాత ఊళ్లో కలవమని బయలుదేరాం 
- దూరంగా వినిపిస్తూనే ఉందా పాట, కృష్ణ కన్నయ్యా అంటూ. 


(0 


32 కృష్ణకన్నయ్యా | 


రక్ష 


ఆఫీసులో అడుగుపెట్టి ఆశ్చర్యపోయాను. ఎవరి పనులు వారు 
చేసుకోవటానికి బదులు, అందరూ ఒక్కచోట చేరి గోలగా చర్చించుకుంటున్నారు. 
మేనేజరు రాలేదా ? 

“వచ్చావా వాసూ - రారా, మన స్టెనో చరిత స్లీపింగ్‌ టాబ్లెట్లు మింగిందట 
తెలుసా?” కుమార్‌ అడిగాడు. 

“ఛ-ఛ, చరిత ఆత్మహత్య చేసుకుంటుందని నమ్మకం కల్గటం లేదు” 
అన్నాను. 

“నమ్మకపోతే నీ ఖర్మ, జీవన్‌ నర్సింగ్‌ హోమ్‌లో చేర్చారు. మన 
మేనేజరుగారు అక్కడే ఉన్నారు” ఆఖరిమాట అనేటప్పుడు కాస్త గొంతు తగ్గించాడు. 

“అలాగా ? యెందుకు చేసుకుందబ్బా!” ఆశ్చర్యపోయాను, వెళ్లి నా 
సీట్లో కూర్చున్నాను. 

“ఒరేయ్‌ అయ్యలూ, రేపు మన వాసు సిన్సియారిటికీ మెచ్చి, మెడలో 
హారం వేస్తామటరా?” ఉగ్రవాది నర్సింహము నన్ను చూచి నవ్వాడు. 

“అవక, తవకలు చేసి, ఆఫీసరు తిడితే సమాజం అంటూ తిట్టిపొయ్యటం 
నాకు అలవాటు లేదు నర్గింహముగారు. సమాజంలో నేనొక భాగాన్ని” అన్నాను. 
ముఖం మాడ్చుకుని వెళ్లిపోయాడు అతను. అతని నోరు ఆడినంత. చెయ్యి 
ఆడదు. ప్రతివారము ఒక ఎక్స్‌ప్లనేషన్‌ అందుకుంటాడు. రెండు రోజులు మన 
విద్యావిధానాన్ని, సమాజాన్ని గుమస్తాలను తయారు చేస్తున్న యూనివర్సిటీలను 





మాదిరెడ్డి సులోచన కథలు 33 


తిదతాడు. అతనేరోజు సమయానికి ఆఫీసుకు రాడు. వచ్చిన రోజు ఈరోజు 
లాగే ఏదో వింత వార్త వస్తుంది. 


మధ్యాహ్నము మేనేజరు ఆఫీసుకు వచ్చే వరకు అవక తవకగానే ఉంది. 
అతను రాగానే అందరూ గప్‌చిప్‌గా తమ, తమ సీట్లలో కూర్చున్నారు. 
హెడ్‌ మాష్టర్‌ ఓరియెంటెడ్‌ బడులు, ఆఫీసర్‌ ఓరియెంటెడ్‌ ఆఫీసులున్నంత కాలము 
మన దేశము ప్రగతి సాధించలేదు. దేశం నాకేమిచ్చింది అని వాపోయేకంటే, 
దేశానికి నేనేం చేస్తున్నాను, అనుకోవాలి. అందరూ సీట్లలో కూర్చున్న అయిదు 
నిమిషాలకు లంచ్‌ టేక్‌ ఇచ్చారు. నేను, కుమార్‌ మా మామూలు స్థలంలో 
క్యాంటీన్‌లో ఒక మూల వెళ్లి కూర్చున్నాం. 


“వాసూ! చరిత అవుట్‌ ఆఫ్‌ డేంజరు. ప్రమాదం తప్పిందట” అన్నాడు. 

“యెవరు చెప్పారు?” అన్నాను టిఫిన్‌ విప్పుతూ. 

“ఉండు.... లలితతో కాస్త పని ఉంది”. మరోమూల కూర్చున్న టెపిస్ట్‌ 
లలిత దగ్గరకు వెళ్లాడు. 


నేను ఆలోచిస్తూ కూర్చున్నాను. జీవితంలో ఏ విషయాన్ని సీరియస్‌గా 
తీసుకోదు చరిత. జాలీగా గడుపుతుంది, వచ్చిన డబ్బంతా అలంకారాలకు, 
హోటళ్లకు తగలేస్తుంది. అయిదారు నెలల నుండి క్రొత్తగా వచ్చిన మేనేజరు 
శ్రీరాములు వెంట తిరుగుతుంది. ఇద్దరూ (ప్రేమికులని అందరికి తెలుసు, 
శ్రీరాములు ముగ్గురు బిడ్డల తండ్రి, మరి చరిత అతనితో స్నేహము యిలా 
పెంచుకుందో తెలియదు. ఒకరోజు మేనేజర్‌ ఇంట్లో బర్త్‌డే పార్టీలో తనూ వారి 
ఫ్యామిలీ మెంబరుగా మసులుతుంటే చూడలేక అడిగాను. ఈ అతి చనువు 
అర్థం ఏమిటని. 


“మిష్టర్‌ వాసూ ! మీరు అందరిలాంటి వారేనన్నమాట, ప్రేమించిన 
మాత్రాన పెళ్లి చేసుకోవాలని యెక్కడుంది, అయామ్‌ అబవ్‌ ఆల్‌ దిస్‌ వరల్డ్‌ 
కామెంట్స్‌” అని గర్వంగా నవ్వుతూ “ఫాస్టు లైఫ్‌ లీడ్‌ చేసే ప్రతివాడు అనే 
మాట” అది. 

“అది నిజమే...” గర్భం, గిర్భం అని అడుగబోయిన నా ఆలోచనా 
రాహిత్యానికి నవ్వుకున్నాను. మోడర్న్‌ సొసైటీలో యెన్నో సౌకర్యాలు, 
విశ్చంఖలత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయేమో, నా అభిప్రాయము గ్రహించింది. 


34 


“చూడండి, గర్భం వచ్చినా మామూలు ఆడవాళ్ళలా నేను లబో, దిబో 
మనను. నా సంతానాన్ని గర్వంగా, ఆదర్శప్రాయంగా 'పెంచుకుంటాను.” 


నేనేం మాట్లాడలేదు. అంత ఆత్మవిశ్వాసము నీ వరకు ఉంటే చాలు, 
అలాంటి చరిత ఆత్మహత్య చేసుకునే అవసరము ఏమొచ్చింది ? 


“అబ్బబ్బ ! ఏం చిత్రము...” ఒగరుస్తూ వచ్చాడు కుమార్‌, ఏమిటన్నట్టు 
చూచాను. 

“చరిత ఆత్మహత్య యెందుకు చేసుకుందో తెలుసా?” 

“నువ్వే చెప్పాలి.” 

“మన మేనేజర్‌ గారిపై కోపం చేత.” 

“అదేం ?” 

“ఈ మధ్య అతను కాస్త లలిత వెంట తిరుగుతున్నాడు. లలిత చాలా 
నాటీ గర్ల్‌, అందరిని ఏడ్పించటంలో దిట్ట. ఒయ్యారం వలికించి మేనేజర్ని 
పిచ్చివాడిని చేసిందట.” 

“అయితే?” అసహనంగా అడిగాను. 

“అతను చరితను అవాయిడ్‌ చేస్తూ, లలితను ఇంటికి పిలిచి భార్యకు 
పరిచయము చేశాడట.” 

“ఆ సంగతి చరితకు తెలిసిందా?” 

“అక్షరాలా? యెవరు చెప్పారో తెలుసా ?.... లలితే మరురోజు వచ్చి, 
తనూ మేనేజర్‌ కలిసి సినిమాకు వెళ్లామని, అతను హోటల్‌కు ఆహ్వానించాడని 
చెప్పిందట. విసురుగా ఆయన గదిలోకి వెళ్లిందట. ఏం జరిగిందో తెలియదుగాని, 
జేవురించిన ముఖంతో బయటికి వచ్చి, విస విస వెళల్లిపోయిందిట.” 

“అవును నిన్న త్వరగా వెళ్లిపోయింది.” 

“ఈ మధ్య వాళ్ల ఇంటావిడకు డాక్టరు వ్రాసిన ప్రిస్మిష్షను తీసుకుని, 
అయిదారు కొట్లలో పది టాబ్లెట్లు కొన్నదట. అవి మింగి పడుకుందట.” 

“మరి యెవరు చూచారు?” 


“మేనేజరుగారే రాత్రి పలుకరించి, ప్రసన్నురాలని చేసుకుందామని వెడితే 
కట్టెలా పడి ఉందట, హడలిపోయాడట మహానుభావుడు.” 





మాదిరెడ్డి సులోచన కథలు 35 


“ఇవన్నీ నీకెలా తెలుసు?” 

“లలితే చెప్పింది, మేనేజర్‌ గదిలోనుండి వచ్చిన చరిత ముఖం చూస్తే 
జాలి వేసిందట లలితకు. ఛ తన మూలంగా ఆ అమ్మాయి బాధపడటం ఇష్టంలేక, 
తనకు బాస్‌ అంటే యెలాంటి ఇంటరెస్ట్‌ లేదు, ఏద్పించటానికి అలా చేశానని 
చెప్పబోయిందట. అక్కడి గందరగోళం చూచి హడలిపోయిందట. అసలు 
రాత్రంతా తనూ అక్కడే ఉందట. చరితకు యేమన్నా అయితే అన్న భయముతో...” 
కుమార్‌ చెప్పుకు పోతున్నాడు. నేను ఆశ్చర్యంగా మూలకు కూర్చున్న లలిత 
వంక చూచాను. అబలలు, ఆడవారు అంటారుగాని సాహసానికి పెట్టింది పేరు 
అనుకున్నాను. 

చరిత విషయము పాతబడిపోయింది. వారం రోజులకు వచ్చి మళ్లీ తన 
సీట్లో కూర్చుంది. అందరూ తేలికగా నిట్టూర్చారు, ముఖ్యంగా మేనేజరుగారు. 
ఆ రోజు పని ఉందని త్వరగా వచ్చాను. అప్పటికే వచ్చిన లలిత తన సీట్లో 
కూర్చుని టైప్‌ చేసుకుంటుంది. ఆవిడ చిరునవ్వుతో విష్‌ చేసింది. తలాడించి 
వచ్చేశాను. 

“ఏమిటి త్వరగా వచ్చేశారు?” 

“ఏం త్వరగా వచ్చే హక్కు మీకే ఉందా?” అన్నాను పదునుగా. 

“ఏమండోయ్‌ కోపం భోంచేశారా ఏం?” 

“అడ్డమయినవి వినటానికి, తినటానికి నేను మేనేజరును కాను” అన్నాను. 

లలిత లేచి నా సీటు దగ్గరకు వచ్చింది, ఆమె ముఖము సీరియస్‌గా 
ఉంది. 

“క్షమించండి, నాపై నిజంగా కోపం వచ్చింంది. కారణమూహించగలను. 
చరిత అంత సిల్లీగా చేస్తుందనుకో లేదు. అంతకంటే యెక్కువ అతని భార్యముందు 
ఆటలు పట్టించాను. 'నీ భర్త నిజాయితీపరుడు కాడని అర్థం వచ్చేలా చెప్పాను. 
అయినా ఆవిడ ఆత్మహత్యకు ప్రయత్నించలేదు. చరితతో పరిహాసం చేస్తూ 
నిన్ను వదిలి నా వెంట పడ్డాడోయ్‌ అన్నాను. తన (ప్రేమ నిష్ఫలమైతే జీవించటము 
వృథా అని చీటి వ్రాసిందండీ.” 

“ఆవిడ ప్రాణం పోతే...” 

“ప్లీజ్‌ ! ఆ మాట అనకండి. తలుచుకుంటేనే వెన్ను జలదరిస్తుంది. 
భార్యకు లేని బాధ ఈవిడ కెందుకండీ?” 


36 తక 


“అవును వాసూ ! రాత్రంతా ఇదే ఆలోచించాను.” 

అప్పుడే వచ్చిన కుమార్‌ అడిగాడు. 

“ఏముంది వెరీ సింపుల్‌, భార్యకు వివాహ బంధము ఒక రక్ష్మ 
పిల్లలున్నారు. పైపై మెరుగులు చూచి బయట తిరుగుళ్లు తిరిగే భర్తను ఏమనలేక 
ఊర్ముంది. ఎటు తిరిగినా తనవాడే నన్న నమ్మకం, సమాజంలో స్థానముంది, 
ప్రియరాలిదేముంది ? అంతా తాత్మాలికమైన వ్యామోహము. దాన్ని శాశ్వతం 
అనుకుంటారు. ఆ నమ్మకం అబద్ధం అయితే సహించగలరా?” అన్నాను. ఇద్దరూ 
కన్విన్స్‌ అయినట్టున్నారు. 

“మైగాడ్‌ నేనంత దూరం ఆలోచించలేదు. అతడు వివాహితుడు. అతనిపై 
వ్యామోహముతో అమ్మాయి చెడిపోతుందనే అనుకున్నాను. అతని వ్యామోహము 
నుండి తొలగించాలని అన్నాను.” 

“ఇక మీదట ఇలాంటి పరిహాసాలు ఆడకండి.” అన్నాను. ఒక్కరొక్కరే 
రావటం మొదలు పెట్టారు ఆఫీస్‌ స్టాఫ్‌. ముగ్గురం మా సీట్లలోకి వెళ్లిపోయాము. 
మన నాగరికత ఒక్క సెక్స్‌ విషయములోనే ముందంజ వేసిందేమో అనిపిస్తుంది. 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 37 


రేవతి 


ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌, సుపీరియారిటీ కాంప్లెక్స్‌ చాలా మందిని 
బాధిస్తుంటాయి గాని మా రేవతిని బాధించేది కొత్త రకమయిన కాంప్లెక్స్‌. తన 
బాధను ఒకరితో చెప్పుకునేది కాదు. చెప్పుకున్నా సానుభూతి దొరకటం దుర్లభమె 
అనుకుంటాను. రేవతి, నేను బి. ఎస్సీ పాసవగానే ఒక ప్రయిమరీ స్మూల్లో టెంపరరీ 
టీచర్స్‌గా పని చేశాము. నాకంటే ప్రతి విషయంలోను చురుకయింది. తను 
విసిరే విసుర్లకు అందరూ నవ్వేవారు. తను ఎమ్మెస్సీ చేయటానికి వెళ్లింది. నేను 
బి.ఇడి.కి వెళ్లాను. 


తరువాత తన గురించి రకరకాలుగా చెప్పారు కాని, నేను పట్టించుకోలేదు. 
పని పాట లేనివారు బోలెడు కల్పిస్తారని అనుకున్నాను. ఎందుకంటే మన 
సంఘంలో అన్నం నీరు తరువాత పోచుకోలు కబుర్లు, కడుపు నింపుతున్నాయి. 
మా శ్రీవారు జాంబియా నుండి ఇండియాకు వచ్చారు. అప్పుడు ఉగాండాలో 
అల్లర్లు జరుగుతున్నాయి. జాంబియా, ఉగాండా యెక్కడుంటాయో తెలియని 
ఒక ఎమ్మెస్సీ నా ఫ్రెండ్‌తో “ఫలానా వారి భర్తను అల్లర్లు అవుతుంటే వెళ్లగొట్టారు” 
అన్నదట. పాపం ఈ మనిషి హైరానాపడి వచ్చి అడగలేక అసలు సంగతి 
అడిగింది. ఈ రెండు దేశాలు వేరని, వార్తా పత్రికలలోని వార్తలు చూసి నమ్మింప 
జేయవలసి వచ్చిందామెను. 


అలాగే ఒకసారి నేను, మా అన్న షాపింగ్‌కు వెళ్లాము. మా ఇద్దరిని 
దీక్షగా చూస్తే పోలికలు కలుస్తాయే తప్ప, ఆయనది మంచి రంగు. అకస్మాత్తుగా 
చూస్తే అన్నా చెల్లెలని అనుకోరు. మాకు తెలిసిన ఉడుకుమోతు ప్రీ చూసి 





38 మాదిరెడ్డి సులోచన కథలు 


“ఫలానా ఆమె భర్త దేశంలో లేడని షికార్లు జోరుగా చేస్తుంది.” అని ప్రచారం 
మొదలుపెట్టింది. నేను శ్రీవారి దగ్గరకు వెళ్లేటప్పుడు టీ పార్టీకి అందరిని పిలిచి 
మా అన్నను పరిచయం చేస్తే, తన అపచారం గ్రహించిన ఆ స్త్రీ 'మీ అన్నా! 
అంటూ తెల్లమొహము వేసింది. అందుకే ఏదీ త్వరగా నమ్మను. 

“ఏమోయ్‌ క్రాంతీ ! మీ ఫ్రెండు అదే రేవతి ఇక్కడికి జువాలజి టీచర్‌గా 
వస్తూంది.” మా బడిలో పనిచేసే హిందీ టీచర్‌ చెప్పింది. ఆమె యెప్పుడూ 
తాజా వార్తల్ని అందిస్తుంది. 

“ఎంత శాతము నిజమో!” 

“నూటికి రెండువందల పాళ్ళు - సరా?” ఆమె మాట పూర్తి కాకముందే 
నా చూపులు దూరాన నడుస్తున్న స్రీ పైన పడ్డాయి. బాబ్‌ హేర్‌, బొడ్డు క్రిందికి 
చీర, అయిదంగుళాల ఎత్తు మడిమల జోళ్లు, క్రీమ్‌తో తళతళ లాడుతున్న 
ముఖం, నీలిరంగుతో టచప్‌ చేసిన కనురెప్పలు, బొమ్మల నడుమ నల్లని 
బొట్టున్నాయి. ఒకే ఒక గుర్తువల్ల రేవతని గుర్తుపట్టాను. పెదవుల మీద చెరగని 
చిరునవ్వు. 

“రేవతీ...” లేచి యెదురు వెళ్లాను. 

“హాయ్‌ !” చెయ్యూపి యెగాదిగా చూసింది. సగర్వంగా భుజాలు 
ఎగురవేసింది. 

“యూ ఓల్లు డేమ్‌ ! ఏమీ మారలేదు. జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చి వస్తాను” 
తను వెళ్లిపోయింది. నవ్వుకుని క్లాసుకు వెళ్లిపోయాను. మర్నాడు లాబ్‌లో నిల్చుని 
అలమరాలు తుడిపిస్తున్నాను, హడావుడిగా మా లెక్కల టీచర్‌ వచ్చింది. 

“అబ్బబ్బ ! క్రాంతీ ! స్టాఫ్‌రూమ్‌లో కూర్చోవటం దుర్భర మయిందోయ్‌!” 
అన్నది తల పట్టుకుని. 

“ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగాను. 

“నీ (ఫ్రెండ్‌ నోటికి హద్దూ పద్దూ లేదు. ప్రతి ఆడదానికో రంకు 
మొగుడుంటాడట. చెడిపోని ప్రీ పురుషులంటూ లేరట. ఒకటేమిటి వందలు...” 
ఆమె చెప్పినవి విని అప్పుడే మరిచిపోయాను. పిల్లలు వచ్చే సమయమయింది. 
ఎక్స్‌పరిమెంట్‌ చేయడంలో నిమగ్నమయిపోయాను. 

ఆ రోజు నాకు ఒక పీరియడ్‌ ఖాళీ. స్టాఫ్‌ రూమ్‌కు వచ్చాను. రేవతి 
ఉపన్యాసం పుల్‌స్టాప్‌ కామా లేకుండా సాగుతుంది. 


శవ 39 


“ఈ సృష్టిలో ఒక స్త్రీ ఒకే పురుషుడితో ఉందంటే నేను నమ్మను. కొందరు 
ధైర్యంగా చేస్తారు. కొందరు చాటుమాటు వ్యవహారాలు సాగిస్తారు. ఇది సృష్టి 
రహస్యం....” 

“రేవతీ!....” పిలిచాను. 

“ఓ... వ్లాట్‌ ఓల్టుడేమ్‌” ఇటు తిరిగింది. 

అక్కడ కూర్చున్న ముసలి మాష్టారు లిద్దరు, డ్రిల్లు మాష్టారు, ఆంధోని 
చెవులు విప్పి విన్నంత (శ్రద్ధ కనపరుస్తున్నారు. 

“స్టాఫ్‌ రూమ్‌లో కామన్‌ ఇంటరెస్టు ఉన్న విషయాలు మాట్లాడాలి” 
అన్నాను. 

“ఓయ్‌... మతి వుందా? సెక్స్‌కన్నా ఇంటరెస్టు అయిన విషయాలు 
ఏముంటాయి ? ఇది కామన్‌ ఇంటరెస్ట్‌ అయిన టాపిక్‌.” 

శ సిద్ధాంతము మాత్రం కామన్‌ కాదు.” 

“ఏమ్మా! అఫెయిర్‌ లేకుండా ఒక్కర్ని చూపించు. నేనిలా చేశాను అనే 
ధైర్యం యెందరికి వుంది!” 

“రేవతి గారూ ! యెవరి అఫేర్స్‌ వారికుంటాయేమో. లేవన్న వారితో 
ఛాలెంజి చెయ్యండి. స్టాఫ్‌ రూమ్‌లో విచ్చలవిడిగా మాట లెందుకు?” హిస్టరీ 
టీచర్‌ వినోదిని అసహనంగా అంది. 

“బెడ్రూమ్‌లో అయితే బావుంటాయా!” నవ్వుతూ అడిగింది. 

“ఛ... మీతో మాట్లాడటం నాదే తప్పు” వినోదిని లేచిపోయింది, నేను 
రేవతి దగ్గరగా వెళ్లాను. 

“యెందుకు రేవతీ! ఇంటరెస్టు ఉన్న వాళ్ల దగ్గర మాట్లాడు, పెళ్లికాని 
అమ్మాయి, కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంది...” 

“వమ్మా!.... మొగవాడి ముఖమే ఎరగవా!” నోటితో చెప్పలేనంత పచ్చిగా 
అడిగింది. అక్కడున్న మొగవారికి ముఖం చూపించలేక నేను వెళ్లిపోయాను. 
మాటలతో ఆగినా బావుండును. అక్కడున్న మొగ ఆడకు ఏదో సంబంధాలు 
అంటగట్టేది. ఆమెను చూస్తే ప్రతివారు జడుసుకునేవారు. కాని, చెరువు 
ముయ్యవచ్చుగాని నోరెలా మూస్తాం. ఒకటి రెండుసార్లు వినోదిని హెడ్‌మిస్టెస్‌తో 
చెప్పింది, ఆమె వార్నింగ్‌ ఇచ్చింది. 


40 3 


మర్నాడు రేవతి నా దగ్గరకు వచ్చింది. 


“క్రాంతీ ఓ విషయం తెలుసా?” ఏమిటన్నట్టు చూశాను. ముందుకు 
వంగి దగ్గరగా వచ్చింది. 


“అదే మన హెడ్డి మొహము... హెడ్‌మిస్టెసోయ్‌ ఆ క్లర్క్‌ గాడితో 
కులుకుతుంది” అన్నది. 


“రేవతీ!” నా ఆశ్చర్యానికి అంతులేదు. యెందుకు రేవతి ఇంతగా 
దిగజారిపోయింది. యాభై మూడేళ్ళ హెడ్‌ మిథ్టైస్‌, తల పండిపోయింది. 
ఒళ్లు వచ్చి ఆయాసంగా తిరుగుతుంది. క్షర్మ్‌ రామనాథం ఇరవై రెండేళ్ల కుర్రవాడు. 
ఆమెను చూస్తే నోటిమాట రాదంటాడు. 

“ఏమిటోయ్‌ అంతలా ఆశ్చర్యపోతున్నావు. అది ప్రకృతి సిద్ధాంతము. 
వయసులో తేడా అనుకుంటున్నావేమో” నవ్వింది. 

“అలాంటి వారిమధ్య శృంగారమేం పందుతుంది?” 


“ఛు. రేవతీ అలాంటివి ఊహించటానికి కూడా జుగుప్పగా ఉంది” 
అన్నాను కంపరంగా. 


“అవును మరి, మనిషిలో ఉన్న బలహీనత అదేనోయ్‌. జుగుప్పాకరంగా 
ఉందంటూనే దాని వెంట పరుగెడతాడు. ఇదొక్కటేనా ఎవరికి ఎవరితో సంబంధ 
ముందో చెప్పమంటే చెబుతాను” వేదాంతిలా, తత్వవేత్తలా ఫోజు పెట్టింది. 
నాకు ఒళ్లు మండిపోయింది. 


“నా రంకు మొగుడెవరో చెప్పు” అన్నాను. 


“క్రాంతీ!” అనుకోని ఈ ప్రశ్నకు తెల్లబోయింది. రేవతి ముఖం వెలవెల 
బోయింది. ఒక్క నిమిషం మాట్లాడలేనట్టు నన్ను చూస్తూ ఉండిపోయింది. 

“రేవతీ! ప్రీ అంటే బొమ్మని, విలాస వస్తువు అని చాటిచెప్పుకునే నీలాంటి 
వారు ప్రీ విముక్తి గురించి మాట్లాడతారు. ఎంగిలి కూటికి ఎగబడినట్టు సెక్స్‌ 
అంటే నీకు పిచ్చి వుందేమో, ఆ పిచ్చి జనరలైజ్‌ చేసి అందరికి అంటగట్టకు 
జాగ్రత్త ! ఇకమీదట రంకు మొగుళ్లు, స్రీ పురుష సమావేశాలు అంటూ స్మూల్‌ 
ప్రిమెసెస్‌లో మాట్లాడు చెబుతాను” అరిచి బయటికి వచ్చాను. స్టాఫ్‌ రూమ్‌కు 
వచ్చి కూర్చున్నాను. అక్కడ మగవారు చేరి అదే చర్చ జరుపుతున్నారు. ముఖాన 
పట్టిన చమట తుడుచుకున్నాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 41 


“ఆవిడన్నట్టు తాము చేసిన పని అంగీకరించడం గ్రీలందరికి సాధ్యం 
కాదు” వెంకయ్య మాష్టారు పెదవులు చప్పరించేశాడు. 
ప్రీ అందుకే బూర్జువాగా తయారవుతుంది” ఆంథోని అంటున్నాడు. 


“ఏమయినా తన ప్రణయ చరిత్ర ఇంత బహిరంగంగా చెప్పే రేవతి 
అభినందనీయురాలు.” 

“ఓహో ! ఏం విశాల హృదయమండీ, మీ భార్య కేదయినా ప్రణయ 
చరిత్ర అంటూ ఉంటే ఆమెను బహిరంగంగా చెప్పనిచ్చి, మీ రానందిస్తే మీ 
విశాల హృదయానికి జోహార్లు పట్టేదాన్ని” అన్నాను వెటకారంగా. 


“మా వాళ్లు అలాంటివారు కాదు. అంతకు దిగజారలేదు” ఆంథోని 
ముఖం కందగడ్డలా అయింది. 


“తోటి ప్రీ విచ్చలవిడిగా తిరిగితే అభినందనీయురాలు. మీ స్త్రీ మాట 
వచ్చేటప్పటికి మాటలకు కట్టుబాటు యెందుకో? రేవతికి మతి చలించిందేమో, 
వాగుడు పిట్టలా తయారయింది. దాని వాగుడు ఆధారంగా మీరు పరాయి 
స్త్రీలను గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు” అన్నాను శాసించినట్టె. హెడ్‌ 
మిగెస్‌కు, విద్యార్థులకు నాపట్ల అభిమానమని వీళ్లూ కాస్త అభిమానంగానే 
ఉంటారు. అభిమానంతో నయితేనేం, జడుసుకుని అయితేనేం అప్పటికి 
ఊరుకున్నారు. 

ప్రీ పురుషుల సంబంధాలు ఎలా వుంటాయన్నది రీసెర్చి చేయకపోయినా, 
సమయంతో పరుగెత్తే ఈ యుగంలో మధ్యతరగతి కుటుంబాలలో భార్యాభర్తలే 
తమకున్న కాలాన్ని వినియోగించుకోవటం దుర్భరమయింది. ఇతరత్రా ఆలోచించే 
సమయం యెక్కడ ? యెక్కడో పనిలేని వారు, కుటుంబానికి దూరంగా ఉండే 
వారు, సాంఘిక పరిస్థితులను యెదురుకోలేక తమ చుట్టూ ఓ పరిధి 
గీసుకున్నవారు తప్పితే, శృంగారం, చట్టుబండలు అంటూ ఏదయినా దొరికితే 
సినిమాల్లో దొరకాల్సిందే. భార్యాభర్తల అనుబంధం అనండి, లైంగిక జీవితం 
అనండి అది కూడా యాంత్రికమయిన చర్యల్లో ఒకటిగా మారిపోతుంది. 
ఎక్సెప్షన్స్‌ వున్నాయి. అది వేరే సంగతి. ఈ మధ్య జనంలో కంటే సాహిత్యంలో 
ఈ సెక్స్‌ పర్వెర్షన్స్‌ కనిపిస్తున్నాయి. వాటిని ఇంటలెక్చువల్‌ స్టాండర్డ్‌ అంటున్నారు. 
జీవితాన్ని ప్రతిబింబింప చేయాలి అంటారు సాహిత్య చర్యలో సమకాలీన 
జీవితాన్ని ప్రతిబింబింపజేసేది ఉత్తమ సాహిత్యమంటారు. కాని అడ్డదారి పట్టిన 


42) 3 


సాహిత్యాన్ని ఆహా అంటే ఓహో అంటున్నారు. దాంతో రేవతిలాంటి వారి 
మతి చక్రంలా తిరుగుతుందేమో ! 

రేవతి గురించి అందరం ఆలోచించడమే మానేశాం. ఎవరెవరో స్కూటర్ల 
వెనకాల ఎక్కి వచ్చేది. చిన్నా పెద్ద అన్న భేదం లేకుండా వాడు తన వెంట ఎలా 
పడుతున్నాడో చెప్పేది. నవ్వి ఊరుకునే స్థితికి వచ్చేశాం. పరీక్షల గొడవలో పడి 
స్టాఫ్‌ రూమ్‌కేసి వెళ్లలేదు. వారం పది రోజులకు వెళ్లి చూద్దునుకదా, రేవతి నెల 
రోజులు సెలవు పెట్టిందని తెలిసింది. 

“పెళ్లేమో!” యెవరో అన్నారు. 

“ఆమెను పెళ్లి చేసుకునే ధైర్యం ఏ మొగాడి కుందండీ” ఒక మగ మాష్టారి 
ప్రశ్న 

“ఆమె కబుర్లు కమ్మగా వినే మీలాంటి వారు చాలా మంది ఉన్నారు” 
అన్నాను. అతను ముఖం చిటపట లాడించేడు. మగవాడి బలహీనత అని 
అనను స్రీ అబలత్వమే అతనితత్వం గుర్తించకుండా చేస్తుంది. తన స్త్రీకో ధర్మం, 
పరాయి ప్రీకి మరో ధర్మం అన్న భావన పోయిననాడే నిజమైన మార్పు వచ్చిందని 
ఆశించాలి. 

సెలవులిచ్చారు, సెలవులు అయిపోవచ్చాయి. సెలవుల్లో చేయాలనుకున్న 
పనులు ఏవీ పూర్తి కాలేదు. ఏ ఆటంకమూ లేకుండా అప్పడాలు ఒత్తించాలని 
అనుకుంటుండగా ఓ కుర్రాడు చీటీ తెచ్చి ఇచ్చాడు. రేవతి రాసింది, అక్షరాలు 
అలుక్కు పోయినట్టున్నాయి ! తను ఏదో ప్రయివేటు నర్సింగ్‌ హోమ్‌ అడ్రసు 
యిచ్చింది. ఆ సాయంత్రం వెళ్లాను. రేవతిని చూడగానే అసలు సంగతి అర్థం 
అయింది. ఆరోగ్యశాస్త్రంలో చదివిన సుఖరోగాల చిహ్నాలు కనిపించాయి. 

“రేవతీ !” అన్నాను బాధగా, అందంగా చలాకీగా ఉండే రేవతేనా! 
నమ్మశక్యం కావటం లేదు. 

“నాకు తెలుసు క్రాంతీ, నువ్వు వస్తావని, నీకు నా వాచాలత మీద 
కోపం కాని నా మీద లేదని తెలుసు....” ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది. 
ఆమెకు మంచి డాక్టరును చూడమని చెప్పాను. 

“క్రాంతీ ! నిన్నెందుకు పిలిచానో తెలుసా?” 

“డబ్బేమయినా కావాలా?” 


“అదీ ఒక కారణమే అనుకో, కాని నేను పిలిచింది అందుకు కాదు. నా 
హృదయంలోని బాధను దింపుకుందామని, నువ్వన్నట్టు ప్రీ తన అబలత్వంతో 





మాదిరెడ్డి సులోచన కథలు 43 


పురుషుడికి లొంగిపోతుందే. ఎందుకో ఫస్టులో కూడా ఇంకా ఫస్టు రావాలని 
ఆశ పట్టుకుంది. అందుకే ఒక మూర్చుడు చెప్పిన మాటలు విని అతనికి లొంగి 
పోయాను. తరువాత అతను బోగస్‌ అని తెలిసిపోయింది. వాడు నా విషయం 
యూనివర్సిటీ అంతా చెప్పాడు. ఓ ప్రొఫెసర్‌ నన్ను కోరినప్పుడు “కోర్కె తీర్చకపోతే 
నిన్ను ఫెయిల్‌ చేస్తొనని అనలేదు కాని, చేస్తాడని నేనే భయపడి లొంగి 
పోయాను... అలా జారుడు బండమీద నుంచీ దొల్లి బంతిలా దొర్లాను...” 


“సరే ఇప్పుడు ఆ విషయాలు యెందుకు ? ముందు విశ్రాంతి తీసుకో, 
ప్రతివాడు తప్పు చేస్తాడు. అది తప్పని తెలుసుకోవడంలో ఉంది గొప్ప. ఇక 
మీదట జాగ్రత్తగా ప్రవర్తించు” అన్నాను ఆమె చేయి నిమురుతూ. “నా ఆరోగ్యం 
దిగజారిందనే చింతలేదు. మందులున్నాయి కాని మిమ్మల్నందరిని నాలాంటి 
వారనుకుని తృప్తిపడ్డాను, నా తృప్తి కోసం అందరికీ రంకు అంటగట్టాను. 
అందుకు కోపగించకు క్షమించు.” కళ్ల నిండుగా నీళ్లు నింపుకుని అర్థించింది. 
నాకు రేవతిని చూస్తే జాలివేసింది. వయసు బరువు, మనిషి పరువుతో 
ఆడుకుంటుందేమో. 

“ఫరవాలేదు! నీ కాంప్లెక్స్‌ యెప్పుడో అర్థం చేసుకున్నాం. ఉపాధ్యాయు 
లుగా ఆ మాత్రం అవగాహన చేసుకోకపోతే ఇక ఎందుకు?” నవ్వుతూ రేవతిని 
ఓదార్సాను. మరో అరగంట వుండి, తను అడిగిన డబ్బు ఇచ్చి బయటకు 
వచ్చాను. 

ఈ మారుతున్న విలువలు, సంస్కృతి మనల్ని ఎక్కడికి తీసుకు 
పోతున్నాయి? అందుకే అన్నారు చీకటిలో వున్నవాడు ఒక్కసారి వెలుతురులోకి 
వస్తే గుడ్డివాడవుతాడని. ఒక్కసారి కట్టుబాట్లు సడలిస్తే రేవతిలా పడటం 
అవుతుంది. మంచీ చెడు ఉపోద్దాతం తరువాతే స్వేచ్చ ఇవ్వాలేమో ? 


మూడు నెలల తరువాత బడికి వచ్చిన రేవతిని చూసి ఎవరూ ఆమేనా?” 
అనుకుని నమ్మలేకపోయారు. కాంప్లెక్సు నుంచి బయట పడిందేమో, ముభావంగా 
క్షుప్తంగా మాట్లాడింది. 


O 


44 333 


పురుషలక్షణము 


“ఉద్యోగము పురుష లక్షణము” అనేవారు ఆనాడు. ఆడవారికి ఒంకలు 
పెట్టటమే పురుష లక్షణంగా మారిందా అనిపిస్తుంది. అందరి పురుషులను 
చూస్తే, తమ పెళ్ళాం తప్ప అందరూ చెడిపోయినట్టే కనిపిస్తారు కొందరికి. ఆ 
జాతికి చెందినవాడే రమేష్‌. అతను, నేను ఎమ్మెస్సీలో క్లాస్‌మేట్స్‌మి. మంచి 
స్నేహితులం కూడాను. మహిళల దృష్టిలో ('ప్రేమికులము. శ్రీకాంత్‌తో నా 
వివాహం నిశ్చయము కావటముతో మేము (్రేమికులమన్న అభిప్రాయం 
మార్చుకున్నారు. నాకు ప్రాణ స్నేహితురాలు లావణ్య అడగనే అడిగేసింది. 

“రమేష్‌ను పెళ్లి చేసుకుంటావని అందరూ అనుకున్నారు.” 

“నేను అనుకోలేదు.” 

“చాల్లేవే డొంక తిరుగుడు. అసలు సంగతి చెప్పు” 

“వడ్డీ సంగతి వదలటానికి, మా మధ్య స్నేహం తప్ప మరేం లేదు తల్లీ.” 

“అలాగా ? అందరూ అలా అనుకున్నారే? మీరు ప్రేమించుకున్నారని...” 

“నువ్వు నమ్మావు అవునా ? మేం ప్రేమబాసలు చెప్పుకున్నామా ? 
ఉత్తరాలు రాసుకున్నామా ? రెండు సంవత్సరాలలో కనీసం ఓరచూపులు 
చూచుకున్నామా?” 

“తెలుగు సినిమా ప్రేమకాదు తల్లీ... నిజమైన ప్రేమ....” 

“ప్రేమా, దోమా ఏం లేదు. నీతో ఉన్నట్టే రమేష్‌తో సన్నిహితంగా 
ఉన్నాను” 





మాదిరెడ్డి సులోచన కథలు 45 


“అతను మాత్రం మాటల సందర్భంలో నిన్ను డ్రేమించినట్టై చెప్పాడు.” 
“అతని అభిప్రాయము అతనిది, దానికి నా బాధ్యతేముంది?” 


“అతడిని కాదనడానికి కారణము కనిపించలేదు. నువ్వేం అనుకోనంటే, 
నీకంటే అన్నింటిలో....” ఆగిపోయింది. 

“ఆపావేం? అతనిదే పైచేయి అవునా? అవునా? అతని వ్యక్తిత్వం నాకు 
నచ్చలేదు. అతని అభిప్రాయాలతో ఏకీభవించలేదు. నల్గురితో నవ్వుతూ 
మాట్లాడితే చెడిపోతామనుకునేవారికి ఏం చెబుతాం?” 

“అవును, ప్రీ అంటే అణగి మణగి ఉండాలంటాడు.” 

“ప్రేయసిగా నన్ను భరించగలడేమో గాని, భార్యగా భరించలేడు” అన్నాను. 

నా వివాహం శ్రీకాంత్‌తో జరిగిపోయింది. తనే నన్ను నిరాకరించాడట, 
నా (ప్రవర్తనపట్ల అతనికి నమ్మకం లేదట, నా కేరక్టర్‌ అంత మంచిది కాదట, 
ఇది అతను చేసిన ప్రచారం. కాపురానికి వచ్చాక రమేష్‌ గురించి పూర్తిగా 
మరిచిపోయాను. నాకు ఉమెన్స్‌ కాలేజీలో ఉద్యోగం దొరికింది. ఇంట్లో పని, 
ఆలిండియా రేడియో అక్కరలేదని తమ వాక్సాతుర్యంతో ఇంటివారిని అలరించే 
మరదులు, ముఖ్యంగా పెద్ద మరిది రవికాంత్‌ ప్రేమాయణం వినటంతోనే కాలం 
కరిగిపోయేది. 


“నీ ప్రేమాయణం వినలేను బాబోయ్‌!” అంటే సినిమా, చిరుతిండ్లు 
లంచం పెట్టేవాడు, కాకా పట్టేవాడు. రోజుకో కొత్త కథ వినిపించేవాడు. 


“వదినా... వదినా! ఈ రోజు ఏమయిందో తెలుసా” 

“ఏమయింది ?” 

“మా సిరిమల్లి ఉందే ఎజ్బచీరలో ఎంత బావుందో, 'లాల్‌చడి” అని 
ఏడిపించాననుకో.” 

“ఏడ్చిందా ? కంటికి కడివెడు నీళ్లు కారాయా!” 

“యెదురు ప్రశ్నలు వెయ్యొద్దు ఫ్లీజ్‌ ! నేను ఏడిపించానని కోపంతో, 
భుజం గట్టిగా గిల్లింది వదినా!” అంటూనే కెవ్వుమన్నాడు. పక పక నవ్వుతూ 
శశికాంత్‌ నిలబడ్డాడు. 


“ఇంత గట్టిగా గిల్లిందట్రా అన్నయ్యా నీ ప్రేయసి...” 


46 పురుషలక్షణము 


“చూడు వదినా ! పెద్దవాడిని కదా పిసరంత కూడ మర్యాదలేదు.” 

“ఈ పూటకు ప్రేమాయణం చాలు” అన్నాను. 

అలాగే రోజూ రవికాంత్‌ తన ప్రేయసి గురించి చెప్పేవాడు. ఆమె ఇచ్చే 
బహుమతులు ఏకరువు పెట్టేవాడు. 

“వదినా! ఈ రోజునా బుగ్గ, వదినా ? ఈ పూట...” నేను వారించేదాన్ని. 
రవికాంత్‌ ఇంజనీరింగ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. ఫస్ట్‌క్లాస్‌లో పాసయినా, స్తబ్దంగా 
తయారయ్యాడు. బాబు పుట్టటంతో, నేను అతని విషయము అట్టే పట్టించుకోలేదు. 
మాకు హైద్రాబాద్‌ (ట్రాన్స్‌ఫర్‌ అయింది. రమేష్‌ వచ్చి ఇల్లు చూసి సెటిల్‌ 
అయ్యేవరకు, అతను, అతని భార్య సహాయము చేశారు. రమేష్‌ పెళ్లికి బాబు 
రోజుల పిల్లవాడు. అందుకే వెళ్లలేదు. అతని ఆశయాలకు తగిన భార్య. 
అనవసరంగా ఒక్కమాట మాట్లాడదు. వసుధ మనము యెంత అల్లరిచేసినా 
విడి, విడనట్టు పెదవులు విప్పి నవ్వుతుంది. మావారికి కూడ వసుధంటే 
గౌరవము. 

“ఆ అమ్మాయి కుదురుగా ఉంటుంది కదూ?” 

“ఏమో బాబూ! వయసుకు మించిన గంభీరత, నా కిష్టంలేదు” అన్నాను. 

“జలసీ...” అన్నారు నవ్వుతూ. 

రమేష్‌ మాత్రం చాల గర్వంగా, ఇష్టంగా భార్య గురించి చెప్పేవాడు. ఓ 
సినిమా నిర్మాత మా క్షాసుమేటు చౌదరి మామగారు, ఆయన ఏదో ఫంక్షనుకు 
పిలిచాడు. 

“సరదాగా వెళ్ళామా రమ్మూ!” 

“నీకు మతి పోయిందా క్రాంతి ! సినిమా వాళ్లతో తిరిగితే బాగుపడ్డట్టే” 

“ఒకరితో తిరిగినంత మాత్రాన చెడిపోయే మంచి ఉండి యెందుకు?” 
అన్నాను. 

“మేము మాత్రం రాము” భార్యను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ అమ్మాయి 
అయినా యెదురు చెప్పలేదు. మర్నాడు వచ్చి భార్య యెంత మంచిదో, సీతా, 
సావిత్రి లాంటిదో చెప్పాడు. విని ఊరుకున్నాను. ఆమె కట్టే చీరల దగ్గర నుండి 
అతనే యెన్నిక చేయాలి. అది చూస్తే నాకు చిరాకుగా ఉండేది. దూరదేశం 
వెళ్లినప్పుడు తనకు నచ్చిందే భార్యకు తెచ్చినా అందం, చందం. ఆమె 





మాదిరెడ్డి సులోచన కథలు 47 


యెదురుగుండానే ఆమెకు నచ్చినవి అటు త్రోసి నీ ముఖం అంటూ తనిష్టం 
వచ్చినవి కొనేవాడు. 

ఒకరోజు కాలేజీలో నాకు నాతోటి లెక్సరర్‌కు చిన్న తగాదా వచ్చింది. 
అతను ఇంటికి వచ్చి వాదించాడు. 

“అది కాదండీ. డిగ్రీలు యెలా వస్తున్నాయో తెలుసు. అందరిని ఆ 
కోవకు చెందిన వారనుకోవటం పొరపాటు.” 

“నూటికి తొంబయి తొమ్మిది మంది కాపీ కొట్టిన బాపతే.” 

“అయి ఉండవచ్చు. ఆ ఒక్క పర్సెంటులో నేను చేరి పోతానేమో, 
క్లాసుమేటు రమేష్‌ ఉన్నాడు అడగండి” అన్నాను. 

“కాపీ కొడితే కొట్టావేమో, యెవరు చూచారు.” రమేష్‌ అన్నాడు, 
దెబ్బతిన్నట్టు చూచాను. 

“యెలా పాసయింది మీరంతా వాదించి నిర్ణయించుకో నక్కరలేదు. ఒక్క 
క్లాసు తీసుకుంటే తెలిసిపోతుంది” అన్నారు మావారు. ఆ లెక్చరర్‌ ఇక వాదనకు 
తావు లేదన్నట్టు వెళ్లిపోయాడు, రమేష్‌ ఒకటే గోల! 

“నీ మొగుడిముందే పరాయి మొగాడితో అంతలా వాదించకపోతేనేం?” 

“తప్పేం?” 

“తప్పా ! తప్పున్నరా, అదే మా ఆవిడయితే పాతరేద్దును” అన్నాడు 
రమేష్‌ 

నేను మాట్లాడలేదు, అనుచితంగా ఏం మాట్లాడానో అర్థం కాలేదు. 
రమేష్‌ ప్రవర్తన రోజు రోజుకు తీవ్రమయింది. వాళ్లావిడ తప్ప, చెడిపోని స్తీ 
లేదన్నట్టు మాట్లాడేవాడు. అతని చుట్టూ తిరిగే స్నేహితుల సంఖ్య తగ్గిపోయింది. 

“ఆయన భార్య పతివ్రత అయితే పూజ చేసుకొమ్మను, అందరూ చెడిన 
వారంటే యెవరూరుకుంటారు?” మరో స్నేహితురాలు అంది సరసంగా. 

యెవరయినా ఇంటికి వెళ్లగానే తలుపు పరదాలు సర్టోవాడు, ఆమె కెదురుగా 
వెళ్లి కాఫీలు, టీలు తెచ్చేవాడు. 

“ఆ ఎస్సై భార్య ఉంది చూడు, బావను ప్రేమించి, బలవంతంగా ఇతన్ని 
పెళ్లి చేసుకుందట.” 


4 8 పురుషలక్షణము 


“క్రాంతీ ! మన ప్రిన్సిపాల్‌ గారి అమ్మాయి బొత్తిగా చెడిపోయింది. 
రోజుకో అబ్బాయి కావాలట.” 

“ఫలానా రత్నంగారు లేరు, భార్యను తార్చే పైకి వచ్చాడట.” 

ఆ వాలకము చూస్తే కంపరము పుట్టుకు వచ్చేది. తన భార్య పతివ్రత 
అని పూజించటం బాగానే ఉంది. అందరిని అలా తీసి పారవేయటం నాకేమాత్రం 
నచ్చలేదు. ఒక్కొక్కసారి తీవ్రంగా నిరసించే దానిని. 

“నీ మనసులో ఏదో కల్మషం ఉంది, లేకపోతే యెవర్నో అంటే 
యెందుకంత రోషం?” 

“ఛీ... నన్నూ అనుమానించే కోవలో చేరావన్నమాట” ఓ రెండు, మూడు 
రోజులు మాట్లాడలేదు. దాదాపు మా ఇంట్లో జరిగే విషయాలు వారికి, వారివి 
మాకు తెలుస్తూనే ఉంటాయి. 

“అసలు ఉద్యోగం చేసే ఆడవారినే నమ్మకూడదు” అనేవాడు. నేను 
ముభావంగా ఉండిపోయాను. సంక్రాంతి పండక్కు మా వాళ్లంతా మా దగ్గరకే 
వస్తామని వ్రాశారు. నాకు ఊపిరి ఆడనట్టుంది. రమేష్‌ భార్య వచ్చి సహాయం 
చేసింది. 

“ఈ పూట మీరిద్దరూ ఇక్కడే భోజనము చేయాలి” అన్నాను. యెప్పుడూ 
అవును, కాదు అనే ఆమె ఆ రోజు నోరు విప్పి చెప్పింది. 

“ఆయన సంగతి తెలుసుగా, మళ్లీ వస్తాను.” 

ఆమె పోబోయింది, వాకిట్లో రిక్షాలు ఆగాయి. మా అత్త మామ, 
మరుదులు దిగారు. ఆమె గదిలోకి తప్పుకుంది. 

వాళ్లు దిగుతూనే మా వాడితో ముచ్చట్లు ఆడటం మొదలుపెట్టారు. 

“వదినా; మొదట ఓ కప్పు వేడి కాఫీ కావాలి” శ్రీకాంత్‌ అడిగాడు. నేను 
వంటింట్లోకి వెళ్లేసరికి, రమేష్‌ భార్య నీళ్లు పెట్టింది. 

“ఆయనొచ్చే వేళయిందండీ, నేను వెడతాను” వెనక గుమ్మము తీస్తుంది. 

“వదినా ! కెన్‌ ఐ హెల్ఫ్‌యు?” రవి వచ్చాడు. అతను మ్రన్న్చడి పోయినట్టు 
ఆగిపోయాడు. 

“వసూ!.... వసుధా... నువ్వా?” 

వసుధ మా రవి ప్రియురాలా ! 





మాదిరెడ్డి సులోచన కథలు 49 


“రవీ... ప్లీజ్‌... అలా చూడకు...” ఆమె రెండు చేతులతో ముఖం 
కప్పుకుంది. అప్పుడే రమేష్‌ వచ్చి రవి వెనక నిలబడటం నేనొక్కదాన్నే చూచాను. 

“రవీ... క్షమించు నన్ను. ఆస్తిపాస్తులు లేవని, విషం తీసుకుంటానని 
నాన్న బెదిరించి చేశాడీ వివాహము....” తలుపు తీసుకుని వసుధ వెళ్లిపోయింది. 
కాఫీ కలిపి చూస్తే రమేష్‌ లేడు. రవికి కాఫీ ఇచ్చాను. అతను క్రింది పెదవి 
కొరుకుతూ నిలబడిపోయాడు. మిగిలిన వాళ్లకు కాఫీలు ఇచ్చి, టవల్స్‌ తీద్దామని 
బెడ్‌రూమ్‌లోకి వెళ్లాను. రమేష్‌ యెటో చూస్తూ కిటికీ దగ్గర నిల్చున్నాడు. 

“రమేష్‌ 1” 

“క్రాంతీ ! నన్ను చూచి నవ్వకు... క్రాంతీ... నవ్వకు.” 

“ఛ.... ఛ... రమేష్‌! ఇప్పుడు నిన్ను చూచి నవ్వితే స్నేహానికి అర్ధమే 
లేదు. వసుధ విషయము నీకేం తెలుసు! నమ్మావు?” 

“వసుధ తప్పేంలేదు. వివాహము కాగానే చెప్పింది. నా అంచనాలు 
తారుమారు కావటంతో, అందరూ చెడిపోయినవారని నిరూపించే ప్రయత్నం 
చేశాను.... అంతే... నాలోని పురుష అహంకారము అలా మాట్లాడించింది. 
మరచిపో క్రాంతీ....” అతను పిలుస్తున్నా వినిపించుకోక వెళ్లిపోయాడు. 

“అమ్మాయ్‌ ! రవికి ఓ మాత్ర ఉంటే ఇవ్వమ్మా తలనొప్పిట” అని అత్తగారు 
పిలువటంతో వెళ్లిపోయాను. 


(0 


వ () పురుషలక్షణము 


అంతరాత్మ 


వచ్చిన కథలన్నీ ముందు పెట్టుకుని కూర్చున్నాడు ప్రిన్సిపాలు పాండు 
రంగారావు. అతనిచేయి వణుకుతోంది, అంతరాత్మ నువ్వు చేస్తున్న పని మంచిది 
కాదని హెచ్చరించబోయింది. పాండురంగారావు విసుగ్గా అంతరాత్మను 
జోకొట్టాడు. 

మంచికి నిర్వచనము ఏమిటి ? 

తను చేస్తున్న చెడు బయటికి యెలా వెడుతుంది ? నీతి, నియమము 
అని మడికట్టుకు కూర్చుంటే పనులు అయినట్టే. 

“నాన్నారూ!” త్రివేణి వచ్చింది, హడావుడిగా. 

“ఏమిటమ్మా !” ఆప్యాయంగా అడిగాడు. 

“అది కాదండీ, మరేమో, మా స్నేహితురాళ్లంతా ఏమంటున్నారంటే...” 

“చెప్పమ్మా ఏమన్నారు ?” 

“చిన్న కథలపోటికి మీరు న్యాయ నిర్ణేతలు కదా! నేను వ్రాసిన కథ 
పోటీకి అంగీకరించరట కదా!” అమాయకంగా అడిగింది. 

“యెవరన్నారమ్మా ?” అతని గొంతు నీరసంగా ఉంది. 

“చెప్పాను కదా, స్నేహితురాళ్లంతా అంటున్నారు.” 

“వాళ్లకేం తెలియదు, ఆ పత్రిక తెచ్చి నిబంధనలు చదువు” అన్నాడు. 
నిబంధనలు చదివింది. న్యాయనిర్దేతల పిల్లలు పాల్గొనరాదని యెక్కడా లేదు. 





మాదిరెడ్డి సులోచన కథలు వ 1 


“నాన్నారూ ! నాకు ఫస్ట్‌ ప్రైజు ఇస్తారు కదండీ.” 
“తప్పకుండా తల్లీ...” అన్నాడు కూతురి వీపు నిమురుతూ, వెయ్యి 
రూపాయలు పోగొట్టుకోవటం తనకు మాత్రం ఇష్టమా ? 


“మీ నాన్నగా రొక్కరిస్తే చాలా ? మరో న్యాయ నిర్దేత కూడా ఉన్నారుగా” 
అప్పుడే అక్కడికి వచ్చిన కమలమ్మ అన్నది. 

“అవునా నాన్నారూ ?” 

“మీ అమ్మకేం తెలియదు, ఫస్టుపైజు నీది. మళ్ళీ మళ్ళీ అన్నాడు 
ఉత్సాహంగా వెళ్లిపోయింది త్రివేణి. 


“పసిదానికి ఆశపెట్టడం దేనికి? మీరు ఇచ్చినా మరో న్యాయనిర్ణేత 
ఇవ్వవద్దూ?” 

“ఇవ్వరని నీకు కలగాని వచ్చిందా ? దాన్ని నిరాశ పరచకు. పత్రికలవారు 
నా స్నేహితులు. ఇక మరో న్యాయ నిర్దేత ఓ రచయిత్రి. ఆమెకు నన్ను ఎదిరించే 
దమ్ములు లేవు. నువ్వూరుకుందూ!” అన్నాడు. 

విషయము ఏమిటంటే, ఉత్సాహవంతులయిన విద్యార్థులలోని రచనా 
పిపాసను బయటికి లాగాలని, ఓ ప్రముఖ పత్రిక కాలేజీలో, హైస్కూల్లో చదివే 
విద్యార్థుల కోసం చిన్న కథల పోటీ పెట్టారు. మొదటి బహుమతి వెయ్యి 
రూపాయలు, రెండవ బహుమతి ఐదు వందలు, అని అనౌన్స్‌ చేసి, యెడిటర్స్‌ 
కాక, ప్రిన్సిపాల్‌ పాండురంగారావును, మరో రచయిత్రి నైనాదేవిని న్యాయ 
నిర్ణేతలుగా వేశారు. పోటీలో పాండురంగారావు కూతురు త్రివేణి కూడ ఓ కథ 
వ్రాసి, తను విద్యార్థిని అని కాలేజీ నుండి సర్టిఫై చేయించుకు వచ్చి, పోటీలో 
పాల్గొన్నది. పాండురంగారావు కూతురు కథ చదివి కాస్త మార్పులు, చేర్పులు 
చేయించి వ్రాద్దాం అనుకున్నాడు. కాని ఎడిటర్స్‌ మొదట చదివి ఉంటే బాగోదని 
ఏమయితే అది అయిందని కూతురుకే మొదటి బహుమతి ఇచ్చేశాడు. 
అంతరాత్మను అవతలికి నెట్టి, ప్రథమ బహుమతికి అర్హమైన కథను అన్నిటి 
క్రింద పెట్టాడు. 

ఆ రాత్రి కమలమ్మ కొన్ని చదివింది. కూతురిది అసలు చదువలేనంత 
అస్తవ్యస్తంగా ఉంది. ఆమెకు చాలా బాధకల్లింది. ఆమె తండ్రి టీచరుగానే 
చేశాడు. వకృృత్వం పోటీలు జరిగితే కమలమ్మ పాల్గొంటే అతను తప్పుకునేవాడు. 


వ 2 అంతరాత్మ 


“పంతులుగారూ ! మీరు అన్యాయం చేయరని తెలుసు. తప్పుకోవటం 
యెందుకు ?” ప్రధానోపాధ్యాయుడు అనేవాడు. 

“యెందుకండీ, ఒకవేళ మా అమ్మాయే బాగా మాట్లాడినా అందరు 
ఏమనుకుంటారోనని మొహమాటంతో ఇవ్వకపోవచ్చు...” నవ్వాడు పంతులు 
గారు. అంత నీతి నియమాలుండేవి. తన భర్త మిగిలిన వారివి చదువకుండా 
ఇవ్వటం నచ్చలేదు. ప్రతిచోట అవినీతి అరాచకం ప్రాకిపోయింది. దాన్ని కూకటి 
వేళ్లతో కదిలించే వాడు యెప్పుడొస్తాడో ! 

వారం రోజులకు పత్రికాధిపతీ కౌండిన్య రెండవ జడ్డీ అయిన నైనాదేవి 
దగ్గరకు ఫైలు తీసుకునివెళ్లి, ఆవిడ చేత కూడా చూపించుకుని, ఆవిడ వ్రాసిన 
రిమార్క్‌ తీసుకుని వచ్చాడు. 

“ఏమిటి ? ఆవిడ వాటిని చదువబోయిందా ? నేను వ్రాసినవే టిక్‌ కొట్టి 
ఉంటుంది కదూ?” సగర్వంగా అడిగాడు పాండురంగారావు. 

“అక్కడే మనము పొరపడ్డామండోయ్‌. తాను చదువటమేకాక అక్కడే 
ఉంటున్న ఇద్దరు ఎమ్‌.లిట్‌లతో కూడా చదివించింది, మీరు లాస్టున పెట్టిన 
అమ్మాయి కథకు మొదటి బహుమతి రావాలని సూచన చేస్తూ యెందుకు 
రావాలో నోట్‌ పుటప్‌ చేశారు.” 

“మీరేం నిర్ణయించారు ?” 

“మీరు యెలా అంటే అలా ?” 

“బోడిది అక్షరజ్ఞానము లేనివారంతా రచయిత్రులే. ఓ కుటీర పరిశ్రమ 
అనుకుని రచనలు చేస్తూ, ఇలాంటి వాటిల్లో తల దూరుస్తారా?” పాండురంగా 
రావు ఆ కారణంగా కళ్ళు ఎట్ట చేశాడు. 

“అబ్బే, ఆవిడ అభిప్రాయము ఆవిడ వ్రాశారు. మనం మనమే, ఆవిడనో 
న్యాయనిర్ణేతగా నిర్ణయించుకున్నాము. మాటలు అనటం భావ్యం కాదేమో.” 

“ఊ ! త్రివేణీ మా అమ్మాయి అని గుర్తించిందా?” 

“గుర్తించే ఉంటుంది...” నసిగాడు, కౌండిన్య, ఆమె మెత్తగా వేసిన చీవాట్లు 
గుర్తుకు తెచ్చుకుంటూ, 

“వెయ్యి రూపాయల ద గ్గర ఈ కక్కుర్తి ఏమిటండీ? తను న్యాయనిర్ణేతగా 
ఉన్నప్పుడు కూతురు పాల్గొనడం ఏం బావుంటుంది? (క్రింది నుండి పైవరకు 





మాదిరెడ్డి సులోచన కథలు 53 


ఇదే తంతు...” అని నిట్టూర్చడం పాండురంగారావుకు యెలా చెబుతాడు. 
ఇద్దరూ చిరకాల మిత్రులు. నానా కష్టాలు పడి పేరు సంపాదించుకున్నారు. 
ఒకరి బలహీనతలు ఒకరికి తెలుసు. 

“ఆమె చెప్పినట్టే బహుమతి ఇస్తే రేపు మన తలకు ఆముదము రుద్దుతారు, 
అసలే సూద్రపు పీనుగులు.” 

“పోనీ ఒక పనిచెస్తే మొదటి, రెండవ బహుమతి కాక, ఆవిడ మొదటి 
బహుమతి యిచ్చిన అమ్మాయికీ ప్రత్యేకమయిన బహుమతి యిస్తే...” 

“ఆ... యిందుకు లెండి” 

“రేపు మనమీద పడి ఏడ్వకుండాను” 

“అలాగే చేద్దాం” అన్నారు. ఆ పై వారము ఫలితాలు పత్రికలో 
ప్రకటించారు. అది చూచి పాండురంగారావు గర్వంగాను, నైనాదేవి బాధగా 
నవ్వుకున్నారు. ప్రముఖుల సమక్షంలో బహుమతి ప్రదానము జరుగుతుందని 
ప్రకటించారు. ఆహ్వానాన్ని చూచుకొని పాండురంగారావు ఆలోచనలో పడ్డాడు. 
ఆ సభకు ఆకతాయి వెధవలు వచ్చి, త్రివేణి తన కూతురని గుర్తిస్తే ? అవాకులు 
చవాకులూ వాగితే ? అర్జంటుగా తలనొప్పి తెచ్చుకొని మంచ మెక్కేశా డాయన. 

“నాన్నారూ ! ఈ రోజు నా కథకు బహుమతి యిస్తారు. మీరు రండి” 
అని మారాం మొదలు పెట్టింది త్రివేణి. 

“నాకు ఆరోగ్యం బాగా లేదమ్మా!” అన్నాడు. 

“నేను వెళ్ళను నాన్నారూ” మూతి ముడుచుకు కూర్చుంది త్రివేణి. 

“మా తల్లివి కదూ ! వెళ్ళి బహుమతి తీసుకుని అందరు మాట్లాడింది 
జాగ్రత్తగా విను. ముఖ్యంగా ఆ నైనాదేవి ఏమంటుందో విను...” అన్నాడు 
అనునయిస్తూ, నిరాశగా వెళ్ళిపోయింది త్రివేణి. 

“ఆత్మను చంపినా అంతర్మాత ఒకటి ఏడ్చింది ఏద్పించటానికి...” విసుగ్గా 
సిగరెట్టు తీసి వెలిగించుకున్నాడు. రాత్రి యెనిమిది గంటల వరకు అసహనంగా 
గడిపాడు. ఇంత ఆలస్యం అయిందేం? బహుమతి ప్రదానోత్సవము ఇంతసేపా? 
తనకు తెలుసు, ఆ వెంపరి నైనాదేవి అవాకులు, చవాకులూ పేలుతూ ఓ రెండు 
గంటల ఉపన్యాసం యిచ్చి ఉంటుంది. 

“నాన్నారూ! ఇదిగోనండీ చెక్కు సర్టిఫికెట్టు...” లేడిపిల్లలా దూకుతూ 
వచ్చింది త్రివేణి. వెనకాల కమలమ్మ వచ్చింది. 


వ 4 అంతరాత్మ 


“ఇంతాలస్యం అయిందేం సభ ఆలస్యంగా ప్రారంభం అయిందా” 

“లేదండీ, వచ్చేటప్పుడు బస్సులు దొరకలేదు... సభ అరగంటలో 
ముగిసింది. ఇద్దరు న్యాయనిర్ణేతలు రాలేదు కదా.” 

“ఏమిటీ? నైనాదేవి రాలేదా? యెందుకు?” 


“ఏమో కౌండిన్యగారే పోటీ నిర్వహించిన వుద్దేశం చెప్పారు. ఆ తరువాత 
మంత్రిగారు నాలుగు మాటలు చెప్పి బహుమతులిచ్చారు, అరగంటలో 


అయిపోయింది.” 


“అమ్మయ్య” అనుకుని గుండెల మీద చేయి వేసుకున్నాడు. అంతవరకు 
ఏవేవో ఊహిస్తున్న అతని మనసు కుదుటపడింది. 


ఆ విషయము పాతబడిపోయింది. అనుకున్న ప్రకారము పోటీలో నెగ్గిన 
కథలు పత్రికలో ప్రచురించలేదు. అనివార్య కారణాల వలన కథలు ప్రచురించ 
లేదని ప్రకటించాడు. అది చూచి త్రివేణి నిరుత్సాహ పడిపోయింది. ఆ విషయం 
తండ్రితో చెప్పింది. 

“అలాగా ! సాయంత్రము అలా వెళ్ళి కనుక్కుంటానులే” అన్నాడు. 
సాయంత్రము కాలేజీ నుండి వస్తుండగా కూతురు చెప్పిన విషయము జ్ఞాపకం 
వచ్చింది. కౌండిన్య దగ్గరికి వెళ్లాడు. ఆమాట, ఈమాట చెప్పాడు. 

“ఆ... మొన్న సభకు నైనాదేవి రాలేదట.” 

“మీరు రాలేదు కదా! అందరూ ఏమనుకుంటారోనని ఆమెకు ఫోను 
చేశాము. “వచ్చి అక్కడ నేను ఆత్మను చంపుకుని అబద్దాలు మాటలాడలేను. 
నిజం మాటలాడి మీ అందరితో నిష్టూరము కొని తెచ్చుకోలేను..” అన్నారు.” 

“బోడి ! ఏడ్వలేకపోయింది.” 

“కథలు ప్రచురించినా, పాఠకులతో గోల లెండి” కౌండిన్య మాట 
మార్చాడు. 

“త్రివేణి కథ ఇలా యివ్వండి. దిద్ది పట్టుకొస్తాను” అన్నాడు కౌండిన్య 
ఆశ్చర్యంగా పాండురంగారావు వంక చూచాడు. ఏం మనుషులు! బాహ్యంగా 
తమ తప్పులు కప్పి పుచ్చుకున్నా అంతరాత్మ యెలా అంగీకరిస్తుంది? మన 
దేశంలో విద్య భుక్తికోసమే ఉపయోగ పడుతుందా ! మంచి, చెడు విచక్షణ 
లేదా?” 





మాదిరెడ్డి సులోచన కథలు 55 


“ఇక ఇప్పుడా తతంగం అంతా యెందుకు లెండి. మనము స్నేహితుల 
మయినా మన చుట్టూ వున్నవారు మనల్ని వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తారు” 
అన్నాడు విసుగుగా. 

పాండురంగారావు ఇంటికి వచ్చాడు. త్రివేణి ఆశగా ఎదురు వచ్చింది. 

“ఏం నాన్నారూ? నా కథ అచ్చు అవుతుందా?” 

“ఊ ! నోరుమూసుకో, రాసింది యింతోటి మహాకథ...” విసుగ్గా 
చూచాడు. అప్పుడయినా పిల్లలకు ఇలాంటి అత్యాశలు కల్పించకూడదని 
ఆలోచించలేదు. నైనాదేవిని, కౌండిన్యను అవకాశము దొరికితే చడా మడా 
తిట్టేద్దామని చూస్తున్నాడు. ఇలాంటి వారి ఆత్మలు, అంతర్మాతలు యెప్పుడో 
చనిపోయి వుంటాయి. 


O 


వ 6 అంతరాత్మ 


నాలమ్మ 


“ఈవిడతో చచ్చిపోతున్నానే.” 

చదువుతున్న పుస్తకము మూశాను. యెదురుగా సుధ నిలబడింది. 

“హాస్పత్రుల చుట్టూ తిరిగే బాధ మీ వాళ్ళకు తప్పుతుంది. దేశానికి 
జనాభా తగ్గుతుంది” అన్నాను విసుగ్గా. 

“యెంత మాటన్నావే...” 

“రెండు కిలోల మాట అమ్మా సుధమ్మతల్లీ ఏనాడయినా చావులు, ఏడ్పులు 
లేకుండా వంట చేశావుటే?” 

“ఇదంతా నా ఖర్మలే | హాస్టల్లో హాయిగా తగలడక ఇక్కడికి వచ్చాను. 
చారులో వచ్చే బొద్దింకల్ని మిరపకాయలు అనుకుంటే పోలా ! ఉడికీ, ఉడకని 
అన్నము ముందుకు వచ్చిన్నాడు చెయ్యి మూతి కడిగేసుకుంటే హాయిగా సన్నబడి 
సలాకులా తయారు అయ్యెదాన్ని” ఏడుపుగొంతుతో రాగం తీసింది. 

“మాతల్లిగదే ఇప్పటికయినా హాస్టల్‌కు వెళ్ళమ్మా. ఏయ్‌ రిక్షా” లేచి కిటికీ 
దగ్గరకు వెళ్ళి కేకవేశాను. 

“అంతేగాని వచ్చి వంటలో ఒక చెయ్యి వెయ్యవన్నమాట” అన్నది 
దిగులుగా. 


“ఉహు ! ఒక చెయ్యికాదు వేలు కూడా పెట్టనివ్వను.” కూరలు తీసుకుని 
వచ్చింది లక్ష్మి. తనే జవాబిచ్చింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 57 


“స్పేహితురాల్ని కష్టపెట్టిన పాపానికి నరకంలో పడతారు.” ఉక్రోషంగా 
అన్నది సుధ. 

“ఎంచక్కా ! అడ్వంచరస్‌గా ఉంటుంది. వెధవ స్వర్గంలో మంచి 
పనులంటూ ప్రాణం లేనట్టు పడి ఉండాలి” అన్నది లక్ష్మి, 


“ఆ నరకంలో నువ్వు కలలు కనే నలకూబరుడు ఉండడు.” 
“అబ్బే! నువ్వె మొగసిరి అనుకునే ఒథెల్లో లాంటి వాడున్నా ఫరవాలేదు.” 


అసహాయంగా నావంక చూచి వెళ్ళిపోయింది సుధ. లక్ష్మి రాకపోతే ఓ 
చెయ్యో, కాకపోతే రెండు చేతులో వేసేదాన్ని కాని లక్ష్మి ఊరుకోదు. ముగ్గురము 
ఒక్క ఊరివారము, నేను డాక్టరి చదువుదాం అనుకుని సీట్రురాక, బి.యెస్సీ. 
చదువుతున్నాను. ఎం.కాం.లు తక్కువగా వున్నారని, బి.కాం. చదివి పి.జి. 
చేద్దాం అని లక్ష్మి బి.కాం. చదువుతుంది. సుధ బి.ఏ. చదువుతుంది. ముగ్గురం 
హాస్టల్లో ఉండి, అక్కడి భోజనము, కొందరు విద్యార్థులు చేసే అల్లరి భరించలేక 
విడిగా వాటా తీసుకుని వంట ప్రారంభించాము. ఒక వారంలో ఒకరం వంట 
చేస్తే మరొకరు కాఫీ టిఫిన్ల పని చూడాలి. మూడోవారు బజారుపని చూడాలని 
నిర్ణయించాము. వారం, వారం పనులు మారుతుంటాయి. సుధ తను వంట 
చేయాల్సి వచ్చినప్పుడు అర్జంటుగా తలనొప్పి తెచ్చుకోవటమో, కడుపునొప్పి 
తెచ్చుకోవటమో చేసేది. పాపం స్నేహితురాలు కదా అని ఓ చెయ్యి వేసేదాన్ని 
లక్ష్మి న్యాయవాదిలా ఫోజుపెట్టేది. 

“చూడు మాలతీ ! సుధకు సహాయము చేస్తున్నానని అనుకుంటున్నావేమో, 
దాన్ని సోమరిపోతుగా తయారు చేస్తున్నావు” నాకో ఉపన్యాసం దంచేసింది. 


“అలా బజార్లోకెళ్ళి అడుగుదాం, యెవరు పోతులా ఉన్నారో!” సుధ 
కయ్యానికి కాలు దువ్వింది. ఇలా ఓ నాల్గు నెలలు నెట్టుకు వచ్చాము. సుధ 
ధోరణి మారలేదు... 

“అసలు మా అమ్మ నన్ను మొగాడిలా పెంచింది.” 

“వంటొచ్చిన వారంతా మొగాళ్ళే. నలభీమపాకం అంటారు.” 

సుధ వంట చేసినన్ని రోజులు చదువు సాగేదికాదు. వాగ్యుద్దాలతో కాలము 
గడిచిపోయేది. ఆ రోజు మేం వాదులాడుతుండగా, మాకు అంట్లు తోమిపెట్టే 
ఆదెమ్మ వచ్చింది. 





ఎర సల్మ 


“ఇగ ఈ జుట్లపందిరి యెందుకు? పరీచ్చలయ్యే వరకు మనిషిని తెస్త 
పెట్మోని...” అన్నది, ఆదెమ్మ. 

“నీనెత్తిన పాలుబొయ్య ! అట్లానే తీస్మోనిరా” ఆమె భాషలో చెప్పింది 
సుధ. 

“యెంతివ్వాలి?” లక్ష్మి అడిగింది. 

“ఏదో మీ దయ! నడివయసు దాటింది, ఇంతన్నము పడేసి ఆకు పోక 
చెక్కలు పైసలిస్తే సాలు...” అన్నది ఆదెమ్మ. 

“అలాగేలే, రేపు ఆవిడ పని చెయ్యలేనినాడు యెవరు చూస్తారు ? నెలకు 
ఇరవై రూపాయలు బ్యాంకులో ఆమె పేర వేస్తాం. తను బాగా పనిచేస్తే వచ్చేఏడు 
కూడా పెట్టుకుంటాము” అన్నాను ఉదారంగా. 

ఇంతలో టెలిఫోన్‌ (మోగింది అది ఇంటివారిది, మా గది ముందు 
ఉంటుంది. ఫోన్‌ యెత్తి యెవరో, ఏమిటో వివరాలు కనుక్కుని చెబితే ఇంటావిడ 
వస్తుంది. ఎత్తవద్దనుకుంటే ఆ శబ్దంతో చెవులు గింగురుమంటాయి. ఫోన్‌ యెత్తి 
యెవరో, యెందుకు చేశారో పిన్నిగారికి చెప్పి, ఆవిడ చెప్పిన వార్త ఫోన్‌లో 
చెప్పివచ్చాను. 

“హాయిగా ఆపరేటర్‌ పనిచేస్తున్నావు, ఓ యాభై రూపాయలు 
అడగరాదూ?” లక్ష్మి దీర్భం తీసింది. 

“పోనీ ఇంటి అద్దె మాఫ్‌ చెయ్యమనరాదూ?” సుధ మూతి విరిచింది. 
మా మాటల్లోనే ఆదెమ్మ పనిమనిషిని తీసుకుని వచ్చింది. 

“దండాలమ్మా...” ఆమె చేతులు జోడించింది. 

“దండం దండం, ఏమిటి నీ పేరు?” అన్నాను. 

“సాలమ్మ... అమ్మ...” అన్నది వినయంగా ఏభై ఏళ్ళుంటాయేమో, 
ముచ్చట ముడితో, మహారాష్టులు కట్టే ఎరకలంచు చీరతో, నోటినిండా 
తాంబూలం, నుదుట ఎట్టిని బొట్టుతో నిండు ముత్తయిదువులా కనిపించింది. 

“సాలమ్మ... ఇదేం పేరు?” 

“మాయమ్మకు ఆరుమంది ఆడపిల్లలే పుడితే, ఇగసాలు అనుకోని 
సాలమ్మంట పెట్టిండ్రుట” అన్నది. 


“శ్చ హో ఆదెమ్మ అంతా చెప్పిందా ?” 





మాదిరెడ్డి సులోచన కథలు 59 


“చెప్పిందుండ్రి, అది మా చెల్లెలాయె” 

ఆమెకు వంటిల్లు చూపాను. ఏం చేయాలో చెప్పాను. టెలిఫోన్‌ బాధ్యత 
కూడా అప్పగించి యెలా తీయాలో నేర్పించబోయాను. 

“ఏందమ్మ గట్లచేస్తవూ ఇనస్పెటర్‌ ఇంట్ల పన్టేసిన” 

“ఇనుప పెట్టెలు చేసేవారా?” 

“ఓయమ్మ నీకేం తెలువదు. ఇస్మూల్లు తనిఖీ చేస్తడు చూడు.” 

“ఓ ఇన్‌స్పెక్టరుకు వచ్చిన తిప్పలా?” అని నవ్వాను. మేం చదువుకోవాలని 
ఆమెను వంటింట్లోకి పంపి మేం గదిలోకి వచ్చి పుస్తకం తీసుకున్నాము. అందరికి 
అప్పుడే ఫస్టుక్తాసులు వచ్చినట్టు కలలు రాసాగేయి. 

“మాలా! సాలమ్మ రావటం ఓ వరం కదూ!” సుధ అడిగింది. 

“మొదలు నువ్వు నోరు మూసుకుని నన్ను ఈ చాప్టర్‌ చదువనిస్తే పెద్ద 
వరమిచ్చిన దానవు అవుతావు” లక్ష్మి కసురుకుంది. అందరము పుస్తకాలలో 
తలదూర్చాము. 

ఫోన్‌ (మోగింది, అంతకంటే గట్టిగా ఖంగున సాలమ్మ గొంతు (మోగింది. 

“వస్తున్నా... వస్తున్నానంటే.. అలా కొడతారేం.. ఆగుండ్రి, ఆగుండ్రి...” 
వచ్చి ఫోన్‌ యెత్తింది. 

“అల్లో ! నేను సాలమ్మను.. ఇగ సూడయరీ జరాయి వంక చెయ్యి. 
ఆం... ఆం...” అంటూ ఫోన్‌ పెట్టేసింది. 

“ఈడి అమ్మ కడుపుడుక ఎంగిలపీసులో మాట్లాడాడు” విసుక్కుంటూ 
వెళ్ళిందామె, మళ్ళీ నా దృష్టి చదువు మీదకు మళ్ళించాను. 

“ఏందమ్మా... పేరేందో చెప్పుండి” సాలమ్మ వచ్చింది. ఆమె గొంతులో 
ఆ భగవంతుడు గంట అమర్చాడా అని అనుమానం కల్లింది లక్ష్మికి ముగ్గురి 
పేర్లు చెప్పాము. ఈ వారమంతా ఏదయినా అవసరమయితే సుధను అడగమని 
మమ్మల్ని ఆటంక పరచవద్దని చెప్పాం. 

“ఓ గ్యాసుపొయ్యి కొనుక్కుంటే పోతది. ఈ పంపు నాకు కొట్టరాదమ్మ...” 
సాలమ్మ నిల్బుండిపోయింది. సాలమ్మ వెళ్ళిపోతే మళ్ళీ తన పాలిటపడే పాకశాస్తం 
తలచుకుంటే ఒల్లు జలదరించిందిలా ఉంది సుధకు, అతి ఓర్పుగా స్టౌవ్‌ 


60 సల్మ 





వెలిగించటం, పంపు చెయ్యటం నేర్పించి సుధ. అయిదు నిమిషాలు అయిందో 
లేదో, సాలమ్మ గొంతులోని గంట గణగణమంది. 

“సుద్దమ్మా... ఓ సుద్దమ్మా...” 

“ఏమిటి పప్పు ముద్దమ్మా?” ఉక్రోషంగా వెళ్ళింది. 

“ఇంత కాఫీచుక్క లేనిది పని సాగదమ్మ, పాలెయ్యి” 

“అవిగో ఆ గిన్నెలో ఉన్నాయి. మేం కాఫీ త్రాగేశాము. తోడుకు 
సాయంత్రము టీకి ఉంచాము. 

“ఏందేంది ? గీ పాలలో డోడు, కాపీ అవుద్దా?” 

“కావాలి” సుధ విసుక్కుని వచ్చింది. 

“చూడు సాలమ్మా చదువుకుందామని నిన్ను పెట్టుకున్నాం. మరేం 
మాట్లాడక, వంటకాగానే వచ్చి చెప్పు” లక్ష్మి గట్టిగా వార్నింగ్‌ ఇచ్చి వచ్చింది. 

సాలమ్మ క్రమశిక్షణకు అచ్చెరువొందాము. గంట తరువాత వచ్చింది. 

“సుద్దమ్మా ! వంటయింది భోజనానికి రా...” అన్నది సాలమ్మ, 

“అప్పుదేనా? పదిగంటలే అయింది” అన్నాను. 

“కొత్తవి చేసిన, నాస్తలేన్టి పన్టేస్తాను ? నేను పెట్టుకతిని పండుకుంట...” 
అని వెళ్ళిపోయింది. 

“రేపటి నుండి మనకు ఏదయినా ఫలహారం చెయ్యమందాము అందులో 
తనూ తింటుంది” అన్నది సుధ. మరో గంట చదువుకుని భోజనానికి వెళ్ళాం. 
సాలమ్మ వంటింటి కవతలున్న వరండాలో హాయిగా నిదురపోతుంది. సుధ 
కోపంగా కంచాలు పెట్టింది. నేను గిన్నెల మూతలు తీశాను. కిలోన్నర ఉడికే 
గిన్నెలో నిండుగా వండి, సగం తీసినట్టు కన్పించింది. అప్రయత్నంగా నా చేతులు 
గుండెల మీదికి వెళ్ళాయి. మరో గిన్నె తీశాను. పసుపు నీటిలో అందంగా 
ప్రింటులా మిరపకాయలు, ఆవాలు తేలుతున్నాయి. మరో గిన్నెలో నూనె 
ఓడుతున్నాయి, వంకాయ ముక్కలు. 

“సాలమ్మా ! ఈ పసుపు నీరేమిటి ?” 

“ఆ... పరగడుపున పనిచెబ్తే పండినప్పుడు లేపితే నాకు కోపం..... అని 
దాల్‌ అది పప్పు. తిని జూడుండ్రి రోజూ అవే అడగాలే మల్లేమనుకున్రో! బగార 
ఒంకాయ, నన్ను లేపకుం[ ” అటు తిరిగి పడుకుంది. 





మాదిరెడ్డి సులోచన కథలు 61 


“బావుందే ఈ ఒప్పందం పరగడుపున పని చెప్పకూడదు, పంతే 
లేపకూడదూ-” నవ్వాను. 

నూనె నాలుకకు చుట్టుకునిపోగా, దాల్‌ అనబడే పదార్థం పోసుకుని 
ముద్ద నోట్లో పెట్టుకున్నాను. అంతే అటు ఏడుతరాల, ఇటు ఏడుతరాల పెద్దలు 
జ్ఞాపకం చేసినంత పొలమారి, మంట కపాలాన్ని అంటింది. 

“అబ్బా!” కళ్ళమ్మట నీళ్ళు కారుతుంటే గడగడ నీళ్ళు త్రాగేసింది సుధ. 
అసలే గులాబిరంగు గల లక్ష్మి ముఖం టమోటాపండు రంగుకు మారింది. 

“మజ్జిగ - మజ్జిగే-” అన్నది, ఎగఊపిరి, దిగఊుపిరి వదులుతూ, నిన్న 
పడేసిన పెరుగుగిన్నె ఖాళీగా ఉంది. 

“అబ్బా ! నోరు మండిపోతుందే, కాసిన్ని పాలయినా పొయ్యవే!” అన్నది, 
పాలగిన్నె ఖాలీ. సాలమ్మను లేపి అడిగాము. 

“ఏందోనమ్మా ! పాడిగల్ల ఇంట్లా పుట్టిన్య, ఇంకా ఉందనుకున్నలే పెరుగు 
నీళ్లపాలు-” ఆమె సోది మొదలుపెట్టింది. ప్రభుత్వమిచ్చే పాలేతల్లీ, రెండు సీసాలు 
కొంటున్నామని చెప్పినా వినదు. 

“రెండు సీసాలు ఏం సాల్తయి ? నాతో కలిపి నలుగురం. కనిస్క సీసా 
కావాల్సిందేనూ-” 


ఆమె మాట కాదంటే ఎక్కడ మళ్ళీ వంట తనపాలిట పడుతుందోనని 
సుధ మూడు సీసాలకు రాజీ కుదిర్చింది. కారం తక్కువగా వేస్తుండమనీ, నూనె 
చూచి వాడమనీ చెప్పాము. 


“లాభం లేదమ్మా, మాకంతా చేతినిండా ఉంటేనే పని సాగుద్ది” కచ్చితంగా 
చెప్పిందామె. 

“అవునూ, మనుషులు చూస్తే ఫేసన్‌గ ఉన్నారు. ఈ గ్యాస్‌ నూనె పొయ్యి 
యెందుకు గ్యాస్‌ పొయ్యి కొనరాదండ్రి.” 


“సాలమ్మా! నీ సలహాకు నమస్మారం. మా దగ్గరంత డబ్బు లేదుగాని, 
స్టామీదే వంట చెయ్యి-” అన్నది లక్ష్మి. బయటి గదిలోకి వచ్చాము అర్ధాకలితో. 


ఆ రాత్రి ఒక్క టెలిఫోన్‌ కాల్‌ అయినా రాలేదు. చదువు చక్కగా సాగిందని 
సంతోషించాము. తెల్లవారక ముందే ఇంటివారి పిన్ని మాకు సుప్రభాతం పాడింది. 


02 హమ్మ 





“యెన్ని ముఖ్యమయిన పనులు పాడయిపోయాయి. టెలిఫోన్‌ ప్రక్కన 
పెడతారా? అంత ఇష్టం లేకపోతే యెత్తం పిన్నిగారూ అంటే పోలా!” 

“మేం పెట్టలేదండీ-” అన్నాము. 

“ఏందమ్మ దబాయింపు. నేను పెట్టిన, మీ టెలిఫోన్‌ కోసం మా నిదుర 
యెందుకు ఖరాబు కావాలంట!” నిలదీసింది. మమ్మల్ని గుడ్డలు జాడించినట్టు 
జాడించే పిన్నిగారు కిక్కురు మనలేదు. ఆ సాయంత్రమే టెలిఫోన్‌ స్థానము 
మారింది. 

“మనల్ని ఇల్లు మారమంటుందేమో-” దిగులుగా చూచించి లక్ష్మీ. కాని 
ఆ మాట అనలేదు. మేము సగం కరెంటు బిల్లు, నీటిబిల్లు ఇచ్చుకుంటాము. 
కాని వాడేవి నాల్గోవంతే. ఉమ్మడి వరండా, అయినా మేం యొప్పుడూ వాడం. 

నాల్గురోజుల కోనాడు వంటింట్లోకి వెళ్ళి ఆశ్చర్యపోయాను. గ్యాస్‌ పొయ్యి 
ఉంది. యెక్కడిదన్నట్లు చూచాను. “సుధమ్మ కొన్నది” అన్నది. గ్యాస్‌ కొనడానికి 
బజార్లో దొరకటము లేదు. మన పేరు రిజిస్టర్‌ చేసి, వెచి, వేసారితే కూడా 
రాదు. నా అనుమానం ముఖం మీద చదివిందేమో సుధ “బ్లాకులో వెయ్యి 
రూపాయలకొస్తే కొన్నాను” అన్నది. డబ్బెక్కడిదని అడగబోయి ఆగిపోయాను. 
దాని చేతులకు బంగారు గాజుల్లేవు. వాటి స్థానంలో అందమయిన ఎజ్జి మట్టి 
గాజులు అలంకరింపబడ్డాయి. 

సాలమ్మ పుణ్యమా అని ఖర్చు రెట్టింపు పెరిగింది. పరీక్షల ముందు 
మార్పులు, చేర్పులు యెొందుకని భరించాము. లక్ష్మి, సుధ స్పెషల్‌ క్లాసులంటూ 
వెళ్ళారు. నేను ఒక్కదాన్నే బాటనీ రికార్డుతో కుస్తీ పడుతున్నాను. 

“మాలమ్మా !” సాలమ్మ వచ్చింది. 

“మాలతమ్మా అనమని లక్షసార్లు చెప్పాను.” 

“నా పెండ్లయిన కొత్తలో మాఇంటి ఆయన నాపేరు అడిగితే సరళమ్మా 
అనమన్నాడు. అది గుర్తుంది గనకనా! నీ పేరు గుర్తుంచుకోవటానికి-” అన్నది. 
తాంబూలంతో పండిన తన నాలుక బయటకు చాపి చూచుకుంటూ. 

“ఏమిటి ?” 

“అది కాదు - మీకు బాయిపెండ్సు లేరా?” 


“బాయి 'పెండ్చా![” అర్థం కానట్టు చూచాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 6౩3 


“అదే మొగదోస్తులు !” అన్నది. 

“బాయఫెండ్చా!” నవ్వాను. 

“ఆం. ఆం. గాల్లే. గదేదో పేరు గుర్తులేదు. ఆస్టల్ల పన్టేసిన ఆడపిల్లలు, 
మొగపిల్లలు లవ్వాడుకుంటే మజాగుండేది...” మెలికలు తిరిగిపోయింది. 

“మా కెవరూ లేరుగాని వెళ్ళి పన్దూసుకో...” కసిరాను. 

“ఈ పూట సీర్మకుపోతున్న ఇంటోల్ల పనిపిల్లతో, పని నువ్వే చేసుకో...” 
సాలమ్మ మూతి తిప్పుకుని వెళ్ళిపోయింది. మధ్యాహ్నానికి టిఫిన్‌ చేసి, రికార్డ్‌ 
పూర్తి చేసుకున్నాను. సుధ, లక్ష్మి వచ్చి మంచానికి అడ్డం పడిపోయారు. 

బయటి ఇంటివాళ్ళ పిన్నిగారు సాలమ్మ అరుస్తుంటే బయటికి వచ్చారు. 


“చూడు మాలతీ ! మీ సాలమ్మ ఏం చేసిందో ? మా పిల్లముండను 
సినిమాకు తీసుకువెళ్ళి, దాన్ని బయట కూర్చోబెట్టి పావలా వేరుసెనగకాయలు 
కొని పెట్టిందట...” 


“చెబితే చెవిటిదానివా ! ఆ సీర్మ పెద్దోలది...” అన్నది సాలమ్మ. 


“మలయాలం సీర్మ, పెద్లోల్లకే అంటే ఏముంటదో అని పోయిన. పిల్లను 
రానియ్యలేదు.” 

“ఇంటి దగ్గరే చెప్పొద్దా ! మా పిల్లను వేరే సినిమాకు పంపేదాన్ని.” 

“నా వెంట పంపమని అడిగినానమ్మ, మీ పిల్ల దెచ్చిన మూడు రూపాయల్ల 
రాను, పోను రూపాయిన్నర రిక్షాకయింది. పావలా పల్లీలు కొనిపెట్టిన, మిగిలిన 
పైసలు ఫస్ట్‌కు ఇస్త” లోపలికి వచ్చింది. 

సాలమ్మ ధాటికి ఆగలేమని తెలుసుకున్న పిన్నిగారు గొణుక్కుంటూ 
వెళ్ళిపోయింది. 

“మనోల్లకు పెద్లోల్లకు సీర్మలు తియ్యొస్తాయి. బిలో హాటు... బిలోకోల్లు 
అంట ఓ సీర్మ చూచిన యెంత బాగుందో...” అన్నది. సాలమ్మ సిన్మా మీద 
కోపం గిన్నెల మీద చూపుతూ. 


“బిలోహాటు...” నేను ఆలోచనలో పడ్డాను. 
“అమ్మా ! మాలమ్మా బ్లోహాట్‌, బ్లోకోల్డ్‌ గురించో మన సాలమ్మ 
చెబుతున్నది” లక్ష్మి ఫక్కున నవ్వింది. 


04 హమ్మ 





వస్తువులు ఖర్చు చేసినా, నోటికి రుచిగా ఉండే పదార్ధాలు చేస్తుందని 
ఆమె ఆగడాలు లెక్కచేయటం లేదు. 

మా సాలమ్మ మంచి శృంగార నాయిక. కవులు ఆమెను చూస్తే తమ 
కలాలకు పదును పెట్టేవారు. వారం రోజులుగా సరిగ్గా యెనిమిదిన్నరకు పనులు 
పూర్తి చేసుకుని, స్నానముచేసి, ఇంటివారి దొడ్లో పూచిన మల్లెలు, కనకాంబరాలు 
మాల కట్టుకుని బయటికి వెడుతుంది. 


యెక్కడికని అడిగే ధైర్యం యెవరికీ లేదు. ఏమిటా అని ఒకసారి ఆమె 
వెంట బయటికి వచ్చాను. గేటు దగ్గర నిలబడి కళ్ళు తిప్పుతూ చేతులూపుతూ 
ప్రక్కింటి రాజన్‌తో కబుర్లు చెబుతుంది. రాజన్‌కు ఆ వీథిలో మంచిపేరు లేదు. 
ఆ సమయంలో రాజన్‌ భార్య పట్టుమామి పెరుమాళ్ళ సేవలో ఉంటుంది. 
ఆలోచించి సుధ లేనిది చూచి సాలమ్మ కో వార్నింగ్‌ ఇచ్చాను. 


“ఆ రాజన్‌తో మాట్లాడావంటే నీవు ఇంకోచోట పని చూసుకో” అన్నాను. 
సుధ అంటే లెక్క చేయదు. పని అంటే దానికెంత భయమో తెలుసు. నేను, లక్ష్మీ 
అంటే నిజమే అనుకుంటుంది. అందుకే మరోరోజు ఆరాటంగా, నేను కలిపిచ్చిన 
పిండి చపాతీలు ఒత్తుతూ కూర్చుంది. రాజన్‌ చూస్తుండగా మామతో మాట్లాడి 
చూచాయగా పనిమనుషుల విషయము అన్నాను. అంతే మర్నాటినుండి రాజన్‌ 
బయటికే రాలేదు. మామ అంటే అతనికి హడల్‌, అమ్మయ్య అని నిట్టూర్చాను 
తేలికగా. నా నిట్టూర్పుల ఆయుష్షు అత్యల్పం. 

“మాలమ్మా దేవుడు మా చెడ్డోడు” అన్నది వంటింటి కిటికీలో నుండి 
బయటికి చూస్తూ, అక్కడ దేవుడు చేసిన చెడ్డపనేం కనిపించలేదు. ఇంటివారి 
పిన్ని బాబాయిగారు మొక్కలకు కుదుల్లు చేస్తున్నారు. 

“దేవుడు చేసిన చెడ్డపని ఏమిటి సాలమ్మా?” 

“అచ్చం సీర్మ ఈరోలాగుండె అయ్యకు ఇడింబిలాంటి పెండ్లమా!” 
ఆశ్చర్యంగా చూచాను. ఆ ఇంటికి వచ్చి ఇన్ని రోజులయినా, నేను వాళ్ళిద్దరినీ 
సరియయిన జోడీ అవునా, కాదా అని చూడలేదు. నిజమే ఆయన అందగాడు, 
ఆమె లావుగా, వయసు మళ్ళిన దానిలా ఉంటుంది. 

“ఆ మాట పైకి అనేవు, పిన్ని మమ్మల్ని వెళ్ళగొడుతుంది”, గాయింత 
తెలువదా? అన్నది. ఆమెవంక చూచాను. ముఖం కడిగేటప్పుడు సబ్బుతో కడిగి, 





మాదిరెడ్డి సులోచన కథలు 65 


హిమాలయా స్నో పట్టించింది. కళ్ళకు కాటుక, కాసంత బొట్టుతో, యెవరయినా 
చూస్తే కళ్ళు తిప్పుకోలేరు. 

“మాలతీ ! ఇలా రావే”, లక్ష్మీ కేకవేసింది. ఏమిటని వెళ్ళాను. పెరట్లో 
బోగన్‌విల్లా పందిరికింద పేపర్‌ చదువుతున్న బాబాయిగారితో రాజకీయాలు 
చర్చిస్తుంది సాలమ్మ. ఆమె నవ్వు ముందు జగదేక సుందరి క్లియోపాత్ర నవ్వు 
దిగదుడుపే అనిపించేలా హెయలు ఒలకబోస్తుంది. పిన్నిగారు గుడికి వెళ్ళే 
సమయము, సాలమ్మను పిలిచాము. 

“అక్కడేం పని?” 

“ఏందమ్మో ! నా పన్లతో మీకేం? మీకు వంట చేస్తున్నగాని అమ్ముడు 
పోతన్ననా? మీ రెవరితో మాట్లాడుతున్నరో నేనడుగొచ్చినా!” కంయిమంది, 
ఆమె గొంతులోని గంట గణగణకి అదిరిపోయాం మేము. ఆమె రెండు, మూడు 
రోజులు రుసరుసలాడుతూ, అర్జంటుగా కడుపునొప్పి, తలనొప్పి తెచ్చుకుని 
పడకవేసింది. మూడురోజులు మా తంటాలు మేం పడ్డాం. నాల్గ్లోరోజు మాత్రం 
హుషారుగా లేచి పని మొదలు పెట్టింది సాలమ్మ. “పట్నంలో షాలిబండా 
పేరయినా గోలుకొండ...’ పాడుకుంటుంది. ఫస్ట్‌ తారీఖు లెక్కలు చూచుకున్నాం, 
నెలసరి ఖర్చుకన్న రెండింతలయింది ఖర్చు. చదివామా అంటే అదీ లేదు. 
గ్యాస్‌ పొయ్యి కోసం సుధ గాజులు మాయం అయ్యాయి, మాట్లాడక మా 
పద్ధతిలో వంటచేసి, ఓ మూల పడి ఉండమని సాలమ్మకు వార్నింగ్‌ ఇద్దాం 
అనుకుంటుండగానే ఇంటివారి పిన్ని నుండి హాల్లో హాజరుకమ్మని సమన్‌ 
వచ్చింది. మా సమాలోచన ఆపి వెళ్లాం. 

“అమ్మాయి ! మా బంధువులు వస్తారు, ఇల్లు ఖాళీ చేయండి.” 

“పరీక్షల ముందు యెలా పిన్నిగారూ!” 

జమ్‌ పరీక్షలు అయ్యేలోగా నా కాపురమే కూలిపోతుంది,” పిన్నిగారికి 
కన్నీరు ఒచ్చింది. పిన్నిగారు భయపడినంత చంచలమైన స్వభావము కలవాడు 
కాదు బాబాయి. రాజకీయాల పేరెత్తితే కుక్క దగ్గరయినా ఆగిపోతాడు ఆయన. 
సాలమ్మను పని మాన్పిస్తామని ముగ్గురం హామీ ఇచ్చి కాళ్లు అనుకోండని చేతులు 
పట్టుకు బ్రతిమాలాం. పిన్నిగారు అంగీకరించింది. సాలమ్మను పంపేద్దాం 
అనుకుంటే ఆమాట చెప్పే దమ్ములు మా ముగ్గురికీ లేవు అనిపించింది. ఆమెను 
పిలిచి ఇరవై రూపాయలు చేతిలో పెట్టాను. 


606 నెయ్య 





“ఆదెమ్మ జీతం ఒద్దన్నది కాని నేనే బ్యాంకిలో వేద్దాం అనుకున్నాను. 
అసలు సంగ తేమిటంటే...” మాటలు మింగాను. 

“ఏందీ ? జీతం వద్దన్నదా ? నాకు కడుపులేదా, కాళ్ళు చేతుల్లేవా ? 
ఇరవై బిచ్చం ఇస్తారా? నెలకు యాభై ఇస్తేనే గాని ఉండనమ్మో...” దృఢంగా 
చెప్పింది. 

“మా కంత ఇవ్వటం చేతకాదు.” 

“నాకు పనీ చేతకాదు...” 

“చేతనయి మహా వండి వార్చినట్టు, సాలమ్మా! న్‌ సర్వీస్‌ చాలమ్మా...” 
లక్ష్మి చేతులు జోడించింది. 

“అవును! సాలమ్మా! నువ్వు ఒక్క పూటయినా సక్రమంగా పని చేశావా!” 
సుధ విరుచుకుపడింది. సాలమ్మ అనవలసిన మాటలన్నీ అని, వీథి వీథంతా 
మమ్మల్ని రభస చేసి వెళ్ళిపోయింది. 

“వాళ్ళమ్మ ఇక చాలు అనుకుని సాలమ్మ అందేమో గాని, సాలమ్మ పని 
చూశాక పనిమనుషుల గొడవే చాలనిపిస్తుందే తల్లీ. సెల్ఫ్‌ హెల్ఫ్‌ ఈజ్‌ బెస్ట్‌ 
హెల్స్‌....” సుధ అన్నది. 

“అమ్మో... అమ్మో ! నీకు జ్ఞానోదయం అయిన సందర్భంగా వేడి, వేడి 
కాఫీ చెయ్యి చూద్దాం” అన్నది లక్ష్మి. 

“ఓ యస్‌... ” సుధ వెళ్ళింది. పెద్ద వర్షం వచ్చి వెలిసినట్టుంది ఇల్లు, 
సాలమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా బాయిపెండు అంటున్న ఆమె స్వరం వినిపించి, 
నవ్వు వస్తుంది. 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 67 


తల్లి తప్పు 


రమాదేవి కూతురి ప్రక్కన కూర్చుని మాటి, మాటికి కళ్ళు ఒత్తుకుంటుంది. 

“యాదగిరేంద్రా ! నీవు దీనులపాలిటి దిక్కు అంటారే, నా ఒక్కగా నొక్క 
కూతుర్ని కాపాడు” అని నమస్మరించుకుంది. మొక్కు తీర్చుకోవటానికి పెద్ద 
దూరం వెళ్ళనక్కరలేదు. 

కాని మంచములో పడి ఉన్న కల్పన మాత్రం కదల లేదు. డాక్టరు దగ్గర 
ఉండకూడదూ ! నేనేం దేవుడినా అంటూ వెళ్ళిపోయాడు. 

“ఏడుకొండలవాడా వెంకటరమణా ! నా బిడ్డను నాకివ్వు తండ్రీ, తల 
నీలాలు ఇస్తాము” అని మొక్కింది మరోసారి, యాదగిరేంద్రుడిని నమ్మలేక. 
అప్పటికి కదలలేదు - కల్పన. ఒకవైపు కూతురి ప్రాణం పోతుంటే జాలి, 
దయా మాని అమ్మలక్కలు నోటికి వచ్చినట్టు పేలుతున్నారు. 

“అసలు తప్పంతా తల్లిది, మొదట తెలియక పిల్ల ఏదో చేస్తే మందలించి 
మంచిది కాదని చెప్పుకోరూ?” 

“ఆం... లాభం వస్తే ఎవరయినా ఎందుకు మందలిస్తారమ్మా, మీ 
పిచ్చిగాని.” 

“ఇప్పుడు యెంత అవమానము జరిగిందో చూడు. అవమానము అటుంచి 
మొదట ఆ పిల్ల ప్రాణానికి ముప్పు వచ్చింది.” 

“ఆపిల్ల ప్రాణానికి వచ్చిన ముప్పేం లేదు ! సూది కాల్చి వాత వెయ్యండి. 
“అమ్మో అని లేచి కూర్చోకపోతే అడగండి” 





68 మాదిరెడ్డి సులోచన కథలు 


వీళ్ళ నోళ్ళలో మన్నుపడా, తన కూతుర్ని ఎంత మాటన్నారు ! అంత 
దుఃఖములో కూడా పళ్ళు పట పట కొరికింది రమాదేవి. 

“మా ఊళ్ళో గొల్లల అమ్మాయి అంతేనండీ, తప్పు చేస్తూ పట్టుపడి మూడు 
రోజులు మూతి బిగించి, మూగనోము పట్టి ఇంట్లో వాళ్ళను ఏడ్పించింది.” 

“భగవంతుడా ! నా బిడ్డ నిజంగా అలా నటిస్తే నా అంత అదృష్టవంతు 
లెవరూ ఉండరు,” అనుకుంది రమాదేవి. 

మరో అరగంట తరువాత అవాకులు చవాకులు వాగి విసుగు వచ్చిందేమో, 
అమ్మలక్కలు వెళ్ళిపోయారు. డాక్టరును పంపడానికి వెళ్ళిన భర్త ఇంకా రాలేదు. 
ఆమెకేం తోచలేదు. 

“అమ్మా... కల్పనా 1” ఊపుతూ పిలిచింది రమాదేవి. జవాబు లేదు, 
ఎండ్రిన్‌ నిజంగా కడుపులోకి వెడితే అసలు (బ్రతికేదా కూతురు ! నిజంగా 
స్పృహలో లేదా, అందరూ అనుకున్నట్టు నటిస్తుందా, అర్థం కాలేదు. 

“కంచి కామాక్షీ! మధుర మీనాక్షీ నా బిడ్డను కాపాడండి....” కన్నీటితో 
చేతులు జోడించింది. 

నిజంగా తప్పు తనదేనా ? అంతరాత్మ నిలదీసి ప్రశ్నించింది. కాదనలేక 
పోయింది రమాదేవి, ఆమెకు ఒక్కొక్కటే గుర్తుకు వస్తుంది. 

అయిదారేళ్ళ వయసు కల్పనకు. ఎవరింటికో పెళ్ళికి వెళ్ళారు. పెళ్లి 
అయ్యాక, పెళ్ళి కూతురి మెడలోని ముత్యాల దండ పోయిందని పెళ్ళివారు 
గొడవపడ్డారు. అందరూ వెతికారు, ఎక్కడా దొరకలేదు. వాళ్ళు నిరాశ చెసుకుని 
ఊర్మున్నారు. ఆ సాయంత్రమే ఇంటికి వచ్చారు. తన జాకెట్టు జేబులో నుండి 
ముత్యాల దండ తీసింది కల్పన. 

“యెక్కడిదమ్మా ?” 

“పెళ్ళికూతురిదే, బావుందని తీసుకున్నాను” అన్నది. తన కూతురు దొంగా! 
ఆమెకు కోపం వచ్చింది. కాని వెంటనే స్వార్థం దాన్ని కప్పి పెట్టింది. అలాంటి 
దండ చేయించుకోవాలని యెన్నాళ్ళ నుండో ఉంది తనకు. కూతురు తన కోర్కె 
గ్రహించినట్టే తీసుకువచ్చింది. 

“అలా తీసుకు రావచ్చా? అసలెవరితో చెప్పకు” అన్నది. 

“అలాగే” అన్నది కూతురు. ఆ ముత్యాల దండ పబ్లిక్‌గా వేసుకోవటానికి 
వీలులేదయ్యె. ఆలోచించి ఓ ప్లాను వేసింది, మర్నాడు తమకు తెలిసిన కంసాలి 
దగ్గరకువెళ్ళింది. 


తల్లి తప్పు 69 


“వీరాచారీ ఒట్టి ముత్యాలు బోసిగా ఉన్నాయి. మధ్యలో పచ్చలు కెంపు 
పూసలు వేసి చుట్టు” అన్నది. 

“నేనుండగా ఇదెక్కడ చేయించారమ్మా!” వీరాచారి కాస్త నిష్టూరంగా 
అడిగాడు. 


“అమ్మాయి పుట్టిన రోజుకు మా అమ్మ చేయించిందిలే” అన్నది. ఒక్క 
అవక, తవక పనిచేస్తే ఎన్ని అబద్ధాలు ఆడాలి. ఈ వీరాచారి అమ్ముండగా వస్తే 
అసలు గుట్టు బయట పడుతుందన్న దిగులు లేకపోలేదు. అది వేసుకుని అడిగిన 
వారికి అడగని వారికి యెంత కష్టపడి దాన్ని సంపాదించారో చెప్పింది. 
రెండోసారి, కూతురికి రింగులు కొందామని మగన్‌లాల్‌ బంగారు కొట్లోకి 
వెళ్ళీంది, నచ్చక తిరిగి వచ్చింది. కల్పన మాత్రం ఓ జత రింగులు చూపింది. 

“యెలా తెచ్చావ్‌?” 

“మీరు మాట్లాడుతుండగా, నా ఆర్టిఫిషల్‌ రింగులు అందులో పెట్టి ఇవి 
తెచ్చానే” అన్నది. కూతురివంక మెచ్చుకోలు పూర్వకంగా చూచింది. మర్నాడు 
మగన్‌లాల్‌ కొట్టునుండి వచ్చిన మనిషిని చూచి నిలువెల్లా వణికి పోయిందామె. 

“అమ్మగారూ! పర్స్‌లో అడ్రసుంది కాబట్టి వచ్చాము. నిన్న మీరు పర్స్‌ 
మరిచి వచ్చారు.” అతను పెద్ద పర్స్‌ అందించాడు. వణుకుతున్న చేతులతో 
అందుకుంది. రిక్షా ఖర్చులు కల్పన తన పర్స్‌లో నుండి పెట్టింది, కాబట్టి తనకేం 
తెలియలేదు. అతనికి ధన్యవాదాలు కూడా చెప్పలేదు. 

“ఇది మోసం ! దగా ! అన్యాయం, అవినీతి...” అంటూ ఆత్మ ఘోషపెట్ట 
సాగింది. ఒకటి రెండు రోజులు ద్వైదీ భావాలతో సతమతమయినా, “వాడు 
యిందరిని మోసం చెయ్యకపోతె అంత కొట్టు సంపాదించాడు” అని సరిపెట్టు 
కుంది. 

మరోసారి ప్రక్కింటి వాళ్ళ ఉంగరం తెచ్చింది కల్పన. అరగంట తర్వాత 
ప్రక్కింటామె వచ్చింది. 

“కల్పనా ! మీ మామయ్య ఉంగరం చూశావా?” 

“ఏ ఉంగరం ?” కల్పన అమాయకంగా అడిగింది. 

“సంగతేమిటి వదినా ?” రమాదేవి రంగములోకి వచ్చింది. గుండె బితుకు, 
బతుకు మంటుంది. 


70 తల్లి తప్పు 


“మీ అన్నయ్య చేతి జమీందారీ ఉంగరం వదినా, స్నానానికి వెడుతూ 
డ్రస్సింగ్‌ టేబిల్‌ దగ్గర పెట్టారు. కల్పన మా సుధ ఇద్దరే ఉన్నారు. నేను ఒంటింట్లో 
తగలడ్డాను” అన్నది వస్తువు పోయిందన్న బాధతో. 

“అదప్పుడే వచ్చేసింది వదినా, మా ఇంటా వంటా ఇలాంటి బుద్ధులు 
లేవు. ఉంగరం తెస్తే ఇంతసేపు ఊర్ముంటానా చంపెయ్యనూ?” 

“కల్పన తెచ్చిందనలేదు వదినా, చూచిందేమోనని.. వస్తాను. నేను కష్టపడి 
ఆయనకని చేయించాను. తీసినవారి చేతికి నిప్పు పెట్ట. పాము కుట్ట....” 
శాపనార్థాలు పెడుతూ వెళ్ళిపోయింది. 

గడియారాలు మొదలుకొని గడ్డిపరక వరకు, బంగారం మొదలుకుని 
బఠానీల వరకు ఏది వదిలి పెట్టేదికాదు. బయటి వాళ్ళను వదిలేసినా 
దొంగవస్తువుల విషయము భర్తకెలా చెప్పాలో తెలిసేది కాదు. అబద్దాలు అతిగా 
ఆడ్డం నేర్చుకుందేగాని కూతుర్ని మందలించలేదు. కల్పనకు ఏ లోటు లేకుండా 
నగలు చేయించింది. జడకుచ్చులు మొదలుకుని, జిగినీ గొలుసు వరకు.. 

“మా ఆవిడ కాపాయం చేయటంలో ఫస్టండీ” అని గర్వంగా అనేవాడు 
రామలింగం, అప్పటికే ఒకరిద్దరు కల్పన విషయము పసిగట్టిన వారున్నారు. 

“అలాంటి కాపాయము మా ఆడవాళ్ళు చేయకపోయినా బాధలేదు లెండి” 
అన్నారు. 

ఒకసారి రమాదేవి తమ్ముడి భార్య వచ్చింది. ఆమె గొప్పింటి ఆడకూతురు. 
ఏడువారాల నగలు అంటారే ఆ విధంగా ఉన్నాయి ఆమెకు. 

“అమ్మా! నాకలా చేయించవే” మారాం మొదలు పెట్టింది కల్పన. 


“నీకేం తక్కువ ఉన్నాయి, రెండు మూడు రకాల సెట్లున్నాయి” కూతురి 
తల నిమిరింది తల్లి. 

“ఆ లాకెట్టు గొలుసు బాగుంది కదమ్మా” 

“అది విదేశాల్లో తెచ్చుకుందట” అని, తమ్ముడు పిలవగానే వెళ్ళిపోయింది. 
అతను ఎక్కువ ఉత్తరాదినే ఉంటాడు. అయిదారేండ్లకోసారి వస్తారు. అందుకే 
అడుగులకు మడుగులు ఒత్తినట్టు మర్యాదలు చేసింది. మర్నాడు వాళ్ళు 
వెళ్ళిపోయారు. కల్పన పరికిణీ సవరించుకుంటూ వచ్చింది. 

“అమ్మా ! యెలా ఉందే గొలుసు?” 





మాదిరెడ్డి సులోచన కథలు 71 


రమాదేవి క్షణం ఆశ్చర్యపోయింది, మరదలి గొలుసు కూతురి మెడలో 
ఉంది. 

“నా స్నేహితురాండ్లకు చూపించి వస్తానమ్మా” అన్నది కల్పన. 

“వద్దమ్మా ! దాన్ని మార్చేవరకు బయటికి తియ్యొద్దు.” 

“మార్చటం యెందుకమ్మా ! మా అత్తయ్య ఇచ్చిందని చెబుతాను. వాళ్లీ 
ప్రాంతాలకు రావచ్చారా?” 

“నాతల్లే ! పదిహేనేళ్ళయినా, నిండానూరేళ్ళ మనిషిలా మాట్లాడుతున్నావే” 
అన్నది సంబరంగా 

భర్త వెంట వచ్చే తమ్ముడిని మరదల్ని, వాళ్ళ పాపను చూచి, సర్పద్రష్టలా 
ఉన్నచోటే ఆగిపోయింది రమాదేవి. కల్పన స్థితి అలాగే ఉంది. 

“రమా! మాధవి లాకెట్టు గొలుసు పోయిందట. ఇంట్లో ఏమయినా 
పడిపోయిందేమోనని వచ్చాము, బండి కూడా నాల్గు గంటలు లేటుట.” 

“అవును వదినా! అది మీ తమ్ముడు మా మొదటి మారేజి ఆనివర్సరీకి 
బేరూట్‌లో కొనిచ్చారు. పాపేమో అక్క తీసింది మమ్మీ అంటుంది...” 

అందరి దృష్టి కల్పన మెడమీద పడింది. భూదేవి బ్రద్ధలయి తనను 
ఇముడ్చుకుంటే బావుండును అనిపించింది. 

“మీ రెళ్ళాక గది దులుపుతుంటే దొరికింది అత్తయ్యా. ఆర్టిఫిషల్‌ది 
అనుకుని వేసుకున్నాను” చప్పున గొలుసు తీసి ఇచ్చేసింది. 

“ప్రొద్దున అమ్మ బాక్స్‌లో నుండి తియ్యలేదూ!” 

“ఏమిటే నేను తీశానా ! అప్పుడే ఎందుకు చెప్పలేదూ?” ఉక్రోషంగా 
పాప చెవులు పట్టుకుంది. 

“అమ్మ తెమ్మన్నదనుకున్నాను.” పాప బావురుమంది. 

“కల్పనా ! పాప చెవి వదులు” తీక్షణంగా చూచింది మాధవి. 

“నన్ను అడిగితే ఇచ్చేదాన్నిగా (12 

“ఏమిటే మాధవీ ! నా కూతురిమీద దొంగతనం పెడుతున్నావా? చుట్టాలని 
మర్యాద చేసినందుకు బాగా గడ్డి పెట్టావమ్మా.” 

వదినా, మరదళ్ళు మాటల బాణాలు వదులుతుంటే బండికి సమయ 
మయిందంటూ మొగవారు, గోలపెట్టారు. రమాదేవి భర్త రామలింగం 


12 తల్లి తప్పు 


బావమరిదిని బండి ఎక్కించి వచ్చి, తలుపులు చేరవేసి, అక్కడ కనిపించిన 
రూళ్ళక(ర్రతో కూతుర్ని చావబాదాడు. రమాదేవి ఏడ్చి మొత్తుకున్నా లాభం 
లేకపోయింది. పనిమనిషి పరుగున వచ్చి విడిపించింది. ఆయన ఎందుకు 
కొట్టాడో చూచాయగా అర్థం అయింది. మర్నాడు వీథి వీథంతా చాటింపు 
వేసింది. అక్కడ ఉండలేక ఖాళీ చేశారు. బజారు నుండి వస్తువులు కొనుక్కొని 
వచ్చినా అతను అనుమానంగా చూచి, కొన్నిసార్లు వెళ్ళి కొట్లో కనుక్కునేవాడు. 
ఈ నరకమంతా భరించిందిగాని, కూతురితో ఇది మంచిపని కాదని చెప్పలేక 
పోయింది రమాదేవి. కల్పన తల్లి చెబితే వినేదేమో, నిదురబోతున్న 
బంధువులమ్మాయి మెడలో నుండి సూత్రం తాడు సూత్రాలతో తెచ్చింది. ఆనాడు 
ఆమె పెట్టిన శాపనార్థాలు మరిచిపోలేదు. 

“నా మంగళసూత్రాలు కాజేసిన వారికి సూత్రాలు లేకుండా పోనీ” అని 
తిరిగి ఇచ్చేద్దామా అనుకుంది. లోగడ పోయినవి తెమ్మంటే? తనను 
కాదన్నట్టుంది. యాదగిరి గుట్ట మీద దూరపు బంధువుల పెళ్ళీ అంటే తల్లీ 
కూతురు బయలుదేరారు. ఈ మధ్య పత్రిక ఇవ్వనివాడే పాపాత్ముడు. ఎవరు 
పిలిచినా వెడుతున్నారు. 

వివాహమయి, భోజనాలయి అందరూ విశమంచారు. కలకలం 
వినిపించింది, అందరూ లేచారు ఏమిటంటూ. పెళ్ళికూతురి చంద్రహారం 
మాయమయిందట. 

“ఆం... పేరుకు ఆలయాలేగాని దొంగలు తిరుగుతుంటారు” అన్నది 
రమాదేవి. తలా ఒక మాటనుకున్నారు. చివరకు అందరి బట్టల పెట్టెలు సోదా 
చెయ్యాలని అంటే అందరికంటే ముందు కల్పన తనసూట్‌కేసు తెచ్చి వారి 
ముందు పెట్టింది. సోదా జరిగింది కాని చంద్రహారం బయటికి రాలేదు. అందరూ 
నిరాశగా కూర్చుండిపోయారు. పెళ్ళీ కూతురు ఏడుస్తుంది. 

టే నెక్కడా పారెయ్యలేదు. గుచ్చుకుంటుందని, ఈ పట్టుచీరలో దాచాను” 
అంటుంది. అరగంట గడిచింది, పెళ్ళీ కూతురి వదిన దృష్టి కల్పన కొప్పుపై 
పడింది. 

“ఏం కల్పనా ! ముది ముత్తయిదువులా కొప్పు పెట్టావు?” 

“ఉక్క వదినా ! మెడలమీద జడ చికాకుగా ఉంది,” అన్నది. 

“నాకు మాత్రం ముసలక్కలా కనిపిస్తున్నావు” అంటూ దూకుడుగా ముడి 
లాగింది. బజార్లో దొరికే లోపల ఖాళీగా ఉన్న బన్ను, దాంట్లో నుండి చంద్రహారం 





మాదిరెడ్డి సులోచన కథలు 73 


కిందపడింది, అంతే. చుట్టూ మూగిన జనము ఎన్ని అనాలో అన్నీ అన్నారు 
తల్లీ కూతుళ్ళను. పదిమంది నోట పడిందీ విషయము. లోగడ యెవరో చేసిన 
దొంగతనాలకు వీళ్ళనే బాధ్యుల్ని చేసి తిట్టారు. 

“మనకు ఇన్ని వేల సంపాదన ఉన్నా ముక్కుకుంటే చెవికి ఉండదు, 
అన్నిచోట్ల నగలు కొట్టి పెట్టుకోవాలంటే ఇంతే మరి...” 

“అదేమిటో ఆ రామలింగంతో తేలుస్తాను.” 

పెళ్ళి పెద్ద వీళ్ళ వెంబడి వచ్చాడు. అంతే కల్పన హడలి పోయింది. 
పెరట్లోకి పరుగెత్తింది, తండ్రికీ విషయము తెలిస్తే జరిగే అనర్థం తెలుసు. 
అందుకే ఇంటి వాళ్ళు మొక్కలకని తెచ్చిపెట్టుకున్న మొక్కల మందు నోట్లో 
వేసుకుంది. రమాదేవి వెంటనే చూచి, బిగుసుకు పోయిన కూతురి మీద పడి 
లబో, దిబోమంది. 

కావల్సిన గోల అయింది, వచ్చినతను అనవలసినవి అందరి ముందు 
అని వెళ్ళిపోయాడు. తన ఆలోచనల నుండి తేరుకుంది. రామలింగం హృదయము 
భగ్గుమంటున్న కడుపు తీపిని చంపుకోలేక డాక్టరును పిలిచాడు. అతను 
చెయ్యవలసిందంతా చేశాడు. 

రామలింగం అపరాధిలా ఆఫీసుకుపోవటం, ఇంట్లో కూర్చోవటమే 
దినచర్యగా మార్చుకున్నాడు. కల్పన కోలుకుంది, ఆ ఇంట్లో నిశ్శబ్ద వాతావరణము 
పిచ్చివాళ్ళను చేస్తుంది. ఆమె భయము ఆమెకున్నది. ఈ సంగతులన్నీ తెలిస్తే 
మేనల్లుడు తన కూతుర్ని చేసుకుంటాడో లేదోనని, భర్తను వెళ్ళమని ప్రాధేయ 
పడింది. 

“ఏం ముఖంతో వెళ్ళాలి?” 

వాళ్ళిద్దరు నిర్ణయించుకునే లోపలే, మేనల్లుడు శంకరానికి సంబంధం 
ఖాయమయిందన్న వార్త వచ్చింది. ఇద్దరూ కుమిలిపోయారు. శంకరం క్షమాపణ 
లతో ఉత్తరం వ్రాశాడు. విప్పి చదివి, తలకు చేతులు పెట్టుకున్నాడు రామలింగం. 

“మామయ్యా ! ఈ అలవాటు చుట్టప్రక్కల వారిని కూడా దెబ్బతీస్తుంది.” 

“నేను సంఘజీవిని, ఫలానావాడు వస్తున్నాడు జా(గతోయ్‌ అని ఎవరయినా 
అనుకుంటే అంతకన్న నరకం మరేం లేదంటాను.” 

“ఈ అలవాటు అత్తయ్య ఎలా ప్రోత్సహించిందో అర్థం కాలేదు. తల్లి 
ప్రాథమిక గురువంటారే...” 


74 తల్లి తప్పు 


చదువలేక భార్యకిచ్చాడు. 
“మీరు అదేమాట అంటారా?” 


“ఇంకేమాట అనమంటావు ! ఒక్కసారి... ఒక్కసారి దానికీ అలవాటుందని 
చెబితే కొట్టో, తిట్లో, బుజ్జగించో మాన్పించే వాడిని.” అతని కంఠము బొంగురు 
పోయింది. ఆమె కళ్ళముందు మంగళసూత్రాలు, తాడు చెడిపించే దృశ్యము 
మెదిలింది. 

“నా మంగళ సూత్రము తీసినవారికి మంగళసూత్రం కరువుగాని...” 
శాపనార్ధాలే వినిపించాయి. ఆమె ముఖం గ్లానితో మలినమయింది. 


“మా అమ్మ ముప్పై పైసలకు మూరకొన్నది.” కూతురి గొంతు విని 
బయటికి వచ్చింది. ఇంటావిడ మల్లెపూలు కోశావా అంటే కొన్నట్టు చెప్పే 
కూతుర్ని చూస్తే ఒళ్ళు మండిపోయింది. కూతుర్ని అరవబోయింది. కానీ ఈ 
సారి అంతరాత్మ హెచ్చరించటంతో తన తప్పు తెలుసుకుంది. తను స్వార్థంతో, 
దురాశతో ప్రోత్సహించింది. ఆ అలవాటు ముదిరిపోయింది. తను మానలేదు. 
తలపట్టుకుని కూర్చుంది. 

“పిల్లలకు తల్లులు అతి సున్నితంగా, నిజాయితీ, లోకం తీరు, బాధ్యతలు 
నేర్పాలి. ముఖ్యంగా ఆడపిల్లలు తల్లిని చూచి నేర్చుకుంటారు. అందుకేనేమో 
మన పెద్దలు “కూతురు చెడుగయిన మాత తప్పు” అన్నారు. వినలేక కోపంగా 
రేడియో కట్టేసింది. యంత్రం కాబట్టి రేడియో మీట నొక్కింది. కాని తన 
హృదయంలో రేగిన తుఫాను ఎలా తగ్గుతుంది? 


“అమ్మా! తప్పు నీది” అని కూతురు నిలదీస్తే తను ఏం జవాబు 
చెప్పగలదు! అలాగే కూర్చుండిపోయింది. సమస్యను కాలానికి వదిలి. 


(0 





మాదిరెడ్డి సులోచన కథలు 75 


అడ్డం తిరిగిన కథ 


శ్రీకాంత్‌ కూర్చుని పేపరు చూస్తున్నాడు. పది, పన్నెండు మంది 
కుర్రవాళ్ళు వచ్చారు. నమస్కరించి కూర్చున్నారు. శ్రీకాంత్‌కు వారంతా 
పరిచయస్తులే. వారంతా ఆయన స్టూడెంట్స్‌, వయసు తక్కువ అవటం మూలాన 
విద్యార్థులలో ఓ విద్యార్థిగా కలిసిపోయాడు. ఇప్పుడు ఎం.ఏ. చేసి లెక్చరర్‌గా 
పనిచేస్తూ, రిసర్చి చేస్తున్నాడు. 

“ఏమిటయ్యా ఇలా వచ్చారు?” 

“ఏం లేదుసార్‌, మా ఆఫీసులో కల్చరర్‌ అసోసియేషన్‌ ఒకటి పెట్టాము. 
దానికి ప్రారంభోత్సవము మీ చేతుల మీదుగా జరగాలి” వినోద్‌ అడిగాడు. 

“అన్నింటిలా ఏదో ఉత్సవం చేసి వదిలి వేయాలని లేదు మాష్టారూ! ఓ 
చిన్న మార్చు తీసుకురావాలని మొన్నో సాహిత్య సమావేశానికి వెళ్ళాను. ఒక 
మంచి రచయితగారు బల్లగుద్ది, అపస్వరాలు, మంచీ చెడు తరువాత మంచి 
నవలే రాలేదంటాడు. అందుకని ఒక్కొక్క సమావేశంలో కొన్ని మంచి నవలలను 
గూర్చి చర్చించాలని ఉద్దేశం ఉంది” విక్రమ్‌ చెప్పాడు. శ్రీకాంత్‌ చిరునవ్వుతో 
వారిని అభినందించాడు. 


“చాలా సంతోషం! మీరు అలాంటి కార్యక్రమాలు తలపెట్టారంటే 
నాలాంటిచిన్న మొన్న కవులు బాగుపడతారు” అన్నాడు. 


“మరి మీరు అనుమతిస్తే ఆహ్వాన పత్రికలు అచ్చువేస్తాం” అన్నారు వారు. 





76 మాదిరెడ్డి సులోచన కథలు 


“అదికాదు వినోద్‌ రామనాథంగారిచే ప్రారంభోత్సవం చేయిస్తే బావుంటుం 
దని నా అభిప్రాయము.” 


“రామనాథంగారా!” అందరూ ఆశ్చర్యంగా చూచారు. రామనాథం నోరు 
విప్పితే శ్రీకాంత్‌ను అవమానించే మాటలు అంటుంటారు. ఇద్దరూ ఒకే బడిలో 
పని చేసేవారు. రామనాథంతో పాటు శ్రీకాంత్‌ కవిత్వము వ్రాయటం అతని 
దురదృష్టము. అదొక్కటేకాదు, రామనాథంగారు పొట్టిగా, సన్నగా ఉంటారు. 
శ్రీకాంత్‌ పొడవుగా, బలంగా ఉంటాడు. 


“బహ్మరాక్షసుడు... బకాసురుడు....” అంటూ గొణుక్కుంటాడు, 
శ్రీకాంత్‌ను చూడగానే. 

పొడవుమీద శ్రీకాంత్‌ ప్యాంటు వేసుకున్నా పైజమా వేసుకున్నా ధోవతి 
కట్టుకున్నా నప్పుతుంది. అది చూస్తే రామనాథానికి పచ్చి పుండులో పొట్టి 
మిరపకాయల కారం పోసినట్టు మండుతుంది. 

“ఓరేయ్‌ అబ్బాయిలూ ! బండవాడితో తిరగకండిరా మీరు. బండబారి 
పోతారు. వాడి దున్నపోతు స్వరూపానికి జరీధోవతి కట్టాడు....” అనేవాడు 
అక్కసుగా. 

“శ్రీకాంత్‌గారి కవిత వచ్చిందండి, చాలా బావుందని” తోటి ఉపాధ్యా 
యులు అంటే ధుమ, ధుమ లాడేవాడు. 


“అ ఆలు నేర్చిన ప్రతి వెధవా కవే. వీళ్ళంతా కలిసి వాల్మీకి, వేదవ్యాసుడికి 
వారసులమైన మా మేధస్సును మరుగున పదేస్తున్నా! ” అనేవాడు. 

ఆ విషయాలన్నీ శ్రీకాంత్‌కు తెలియక కాదు, తెలిసినా నవ్వి 
ఊరుకొనేవాడు. యెవరయినా మిమ్మల్ని నిందించారని చెప్పినా పట్టించుకునేవాడు 
కాదు. అలాంటివారిని చూచి జాలిపడాలి. మన మనస్సు స్వచ్చంగా ఉన్నంత 
కాలం ఇలాంటివాటిని పట్టించుకోకూడదు” అనేవాడు. వినోద్‌కు తెలుసు 
ఈనాటికి కూడా రామనాథం, శ్రీకాంత్‌ పేరు చెబితే మండిపడతాడు. శ్రీకాంత్‌ 
ఓర్చుకున్నంత కాలము, అందరిని మన్నిస్తాడు. ఇక ఓర్చుకోలేనన్ననాడు, వాళ్ళతో 
హలో తప్ప స్నేహంగా ఉండడు. రామనాథం దానికి పూర్తి విరుద్ధం. మనుష్యుల్ని 
చులకన చేయటంలో నోరు పారేసుకోవటంలో సిద్ధహస్తుడు. అతన్ని హల్లో 
అంటే పాపం. వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడి, విన్నవాళ్ళే అన్నట్లు చెప్పటంలో 
ప్రావీణ్యం గడించాడు. అయినా అతడంటే శ్రీకాంత్‌కు ఓ విధమైన అభిమానము. 





అడ్డం తిరిగిన కథ 77] 


వాల్మీకి, వ్యాసుడికి వారసుడని నమ్మకపోయినా, కవిత్వానికి కొత్త రూపురేఖలు 
దిద్దాడనే మంచితనాన్ని మెచ్చుకుంటాడు. 


“ఏమిటయ్యా మాట్లాడరు.” 
“అది కాదు సార్‌.... మరి....” 


“మీ సందేహము నాకు తెలుసు. అతడిని ఆహ్వానించమని హృదయ 
పూర్వకంగా చెబుతున్నాను. వచ్చి ఓ గంట మాట్లాడగల స్తోమతు ఉన్నవాడు.” 


“స్తోమత ఒక్కటే కాదుసార్‌.” 


“ఆయనకు మూడ్‌ ఉంటే సభామర్యాదలు బాగానే పాటిస్తారు. అదికాక 
మనిషిలోని గుణం ప్రధానం కాదిక్కడ, అతనిలోని కవితాసక్తి. మంచి కవి, 
మాట్లాడగల దిట్ట. చర్చ “ఆధునిక కవిత్వం, ఆశుకవిత్వమా అంటున్నారాయె” 
రామనాథం గురించి యెలాంటి అభిప్రాయము ఉన్నా, శ్రీకాంతంటే ఉన్న 
అభిమానంకొద్ది; రామనాథంచేత ప్రారంభోత్సవం చేయించటానికి 
అంగీకరించాడు. 


“యువకళా నికేతన్‌” ప్రారంభోత్సవము ఘనంగా ఏర్పాటు చేశారు. 
శ్రీకాంత్‌ శుభాకాంక్షలు పంపాడు. రామనాథం చాలా సంతోషంగా వచ్చాడు. 


“వెధవలు శ్రీకాంత్‌.... శ్రీకాంత్‌ అంటూ వాడి గారడీలో పడేవారు. 
ఇప్పటికయినా నా వర్త్‌ తెలిసింది” అనుకున్నాడు మరోసారి. 


వేదికమీద, అందరి పరిచయాలు చేశాడు అధ్యక్షుడు. “శ్రీరామనాథం 
గారు మాకేం క్రొత్త కాదు. మాకు హైస్మూల్లో గురువుగారు. మంచి గొప్ప 
కవి...” వినోద్‌ పరిచయము చేశాడు. 


“పరిచయము పేలవంగా ఉంది” మైకు లాక్కున్నాడు రామనాథం. 


“కుర్రవాళ్ళు పరిచయ వాక్యాలు పలుకలేక పోతున్నారు. కవి అంటే, 
రవి కంటే తీక్షణమయినవాడు. నేను అలాంటివాడినే. నేను పొందిన సన్మానాల 
వరుస క్రమము చెబితే వార్తాపత్రికలోని ముందటి పేజీ సరిపోదు. ప్రభుత్వము, 
ప్రజలు గుర్తించిన కవిని.... కాదు, కోటి ప్రభాత తేజరవిని.” తన్మయత్వముతో 
తన గురించి చెబుతున్నాడు. వినోద్‌, విక్రమ్‌, రామకృష్ణ మొదలగు వారంతా 
తెల్లబోయి చూస్తుండగానే గంటకాలం హరించిపోయింది. 





78 అడ్డం తిరిగిన కథ 


“ఏం బోరు.... ముచ్చటగా మూడు నిమిషాలు, అంతగా అయితె అయిదు 
నిమిషాలు, అదీకాకపోతే పది నిమిషాలు మాట్లాడితే బావుంటుంది” అన్నాడు 
హితవరి. 

“ఏదయినా విషయము మీద మాట్లాడినా వినడానికి బావుంటుంది” 
అన్నాడు మరో మనిషి 

ఇలా అనుకుంటుండగానే, మిగతా ఉపన్యాసాలు యిచ్చేవారు తప్పు 
కున్నారు, సభ ముగిసింది. నాల్లు కమ్మటి కథలయినా వినిపించలేదే అని కొందరు 
బాధపడిన మాట వాస్తవమే. అందరూ తేనీటి విందు ఏర్పాటు చేసిన దగ్గరకు 
వెళ్ళారు. 

“నేనెవర్నో గుర్తుపట్టావా?” దర్పంగా అడిగాడు రామనాథం, అక్కడ 
ఏర్పాట్లు చేస్తున్న కుర్రాడిని. 

“గుర్తుపట్టకేం ? కవి రామనాథం గారు...” నవ్వుతూ అన్నాడు. 

“ఓహో! అయితే ఆంధ్రలో ఇంకా నా పరపతి పోలేదన్నమాట. గ్లామరు 
తగ్గలేదన్నమాట” సంబరంగా చిత్రంగా కళ్ళు తిప్పాడు రామనాథం. 

ఒకసారి వచ్చిన పరపతి పోవటం మాటలా? అక్కడే ఉన్న పెద్దమనిషి 
అన్నాడు. 

“మీకు తెలియదండీ, శ్రీకాంత్‌ ఓ త్రాష్టుడున్నాడు, నా పరపతి, నా 
పేరు చెడగొడుతున్నారు.” ఇది వ్రాయలేక మృదువుగా వ్రాసినవి కాని, నీచంగా 
వెగటుగా, వెటకారంగా మాట్లాడాడు. రామనాథం గారి మాటలకు వినోద్‌కు 
మండిపోయింది. 

“మీరు అపార్థం చేసుకుంటున్నార్‌ సార్‌! మిమ్మల్ని ఆహ్వానించమని 
శ్రీకాంత్‌ గారే చెప్పారు.” 

“ఆం... ఏమిటి?” 

“అవున్‌ సర్‌ ! మొదట మేము ఆయననే అడిగాము. పెద్దవారు, 
అనుభవము కలవారని మీ పేరు సూచించారు.” విక్రమ్‌ చెప్పాడు. 

రామనాథం ముఖం వెల వెల బోయింది. మరుక్షణమే తేరుకున్నాడు. 
రామనాథానికి జవాబులు చాలా తొందరగా స్ఫురిస్తాయి. అది సక్రమంగా 
ఉంటే యెంత బావుండును అనిపిస్తుంది. 





మాదిరెడ్డి సులోచన కథలు 79 


“నాకు తెలుసు యెందుకామాట అన్నాడో” మీసం లేకపోయినా ఉన్నట్టు 
ఊహించుకుని దువ్వాడు. 

“యెందుకంటారు ?” విక్రమ్‌ ఉక్రోషంగా అడిగాడు. 

“యెందుకేమిటి వీళ్ళంతా నా అభిమానులు. నన్ను పిలువక, తన్ను 
పిలవమంటే, మా అభిమానులూరుకోరని తెలుసు” దర్పంగా నవ్వాడు. 

వినోద్‌ నవ్వుకున్నాడు. అడ్డం తిరిగిన కథ అంటే ఇలాంటివానిని చూచే 
అన్నారు కాబోలు. 

“అతను నాకు పత్రికలలో అవకాశము లేకుండా చేస్తుంది అతనేననండి, 
నా రెప్యుటేశన్‌ పాడు చేస్తున్నాడు” అనర్గళంగా అబద్దాలు చెబుతున్నాడు, 
కార్యకర్తలు కర్తవ్య విమూఢుల్లా నిలబడిపోయారు. యెదుటివారి సంస్కారం 
అర్థం చేసుకునే మనసు ఎందరికుంంటుంది? ఒక్క శ్రీకాంతే కాదు, సహాయము 
చేస్తాము, సహకరిస్తాం అనుకునేవారు, అవతలి వ్యక్తుల మనస్సు కూడా 
గుర్తించాలి. లేకపోతే 'కుక్క-గాడిది కథ మళ్ళోసారి చదవాలి. మన పిట్టకథలు, 
పుక్కిటి పురాణాలలో కూడా జీవిత సత్యాలు దాగి ఉన్నాయేమో ననిపించింది. 


O 





80 అడ్డం తిరిగిన కథ 


ప్రగతి పథమా? పతన మార్గమా? 


ఆ మరురోజు చెప్పే పాఠము తయారుచేస్తూ కూర్చున్నాను. హడావుడిగా 
వచ్చింది పద్మ. ఆమె నా విద్యార్థిని. ఆమె చంకలో ఆమె మూడేళ్ళ కూతురు 
చంద్రిమ వుంది. 

“రా పద్మా, ఏమిటి విశేషం?” 

“ఏం లేదు మేడమ్‌! చంద్రిమను మీ పాదాల దగ్గర పడేస్తాను. ఎవరయినా 
పెంచుకుంటామంటే ఇచ్చేయండి. మీ అబ్బాయి పెద్దవాడయిపోయాడు. మీకు 
అమ్మాయిలంటే ఇష్టం. 'పెంచుకోనయినా పెంచుకోండి, వస్తాను” వచ్చినంత 
వేగంగా వెళ్ళిపోయింది పద్మ. నేను తేరుకుని బయటికి వచ్చేసరికి ఆమె ఎక్కిన 
ఆటో రిక్షా చాలా దూరం వెళ్ళిపోయింది. చంద్రిమ బిక్కు బిక్కుమని చూస్తూ 
ఏడుస్తూంది. 

“ఊర్మోమ్మా... ఊర్మో-” ఓదార్చబోయాను. ఏడ్పు మరింత యెక్కువ 
చేసింది. ఏం చేయాలో తోచలేదు. బిస్కెట్లు తెచ్చి యిచ్చాను. 

“నాకొద్దు, అమ్మ కావాలి....” బావురుమంది. 

పద్మమీద విపరీతమైన కోపం వచ్చింది. ఏం చేయాలి ! ఒకవేళ ఆత్మహత్య 
చేసుకోవాలని వెళ్ళలేదు కదా?నా కాళ్ళలో వణుకు ప్రారంభమయింది. పద్మ 
వాళ్ళ నాన్న బౌద్ధనగర్‌లో ఇల్లుకట్టి, గృహ ప్రవేశానికి పిలిచారు. అప్పుడు 
వెళ్ళాము, మసగ్గా గుర్తుంది యిల్లు. 

“రామ్మా! అమ్మ దగ్గరకు వెడదాం” అన్నాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 81 


చంద్రిమ ఆశగా వచ్చింది. అమ్మాయిని యెత్తుకుని బయటికి వచ్చి 
యింటికి తాళం పెట్టాను. రిక్షాలో యొక్కాక, రిక్షా నడిచినట్టే, నా ఆలోచనలు 
వెనక్కు పోయాయి. 

ఒకసారి నేను, మావారు సినిమాకు వెళ్లాము. 

“నమస్తే మేడమ్‌!” 

“నమస్తే....” తలెత్తాను. అందమైన అమ్మాయి నిల్చుంది. ఎక్కడో 
చూచినట్టు అనిపించింది. 

“ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న పద్మనండి.” 

“ఓ!....” పలకరింపుగా నవ్వాను. 

“ఇతను మా బావ భాస్కర్‌... కాబోయే...” మధ్యలో మాట ఆపేసింది. 
సిగ్గుతో తలవంచుకుంది, అతను నమస్కరించాడు. 

“కంగ్రాచ్యులేషన్స్‌!” అన్నాను. ఆ తరువాత పద్మ చొరవగా రావటం, 
తనకు అర్ధం కానివి అడిగి తెలుసుకోవటం మొదలుపెట్టింది. ఒక విద్యార్థినిలా 
కాక ఒక స్నేహితురాలిలా మసలినా మేడమ్‌ అంటూ పిలిచేది. బావ, తనూ 
యొక్కడెక్కడ తిరిగేది, ఏం బాసలు చేసుకునేది చెప్పేది. పద్మలో ఓ చిత్రమైన 
గుణం కనిపెట్టాను. ఆడంబరాలంటే విపరీతమైన మోజు. 

“మేడమ్‌! మీరు, సారు సంపాదిస్తారు కదా. ఇంత కౌపీనం దేనికండీ? 
ఓ వంటమనిషిని పెట్టుకుని, సుబ్బరంగా నాల్టు రకాలు వండించుకుని తినక...” 

“పద్మా! కూర, సాంబారు, పెరుగన్నం యిలాగే దొరికితే చాలమ్మా 
చచ్చేవరకు” అనేదాన్ని. 

“ఏమిటండీ అరవ బ్రాహ్మల్లా ఆ తెల్ల జాకెట్టు మీరూను. హాయిగా 
చెప్పుల దగ్గర నుండి చెవిపోగుల వరకు మాచింగ్‌ వేసుకోక-” అంటుంటే 
నవ్వి ఊరుకునేదాన్ని. అప్పుడప్పుడు మావారు ఆమె మాటలు యిష్టంలేనట్టు 
చీదరించుకునేవారు. 

“ఏమిటా నోటిరంకు యెంతమాట వస్తే అంత అనేస్తుంది!” అని, ఆ 
అమ్మాయి తన ప్రేమ కలాపాలు చెప్పినప్పుడు అనేవారు. 

ఓ శుభోదయాన పద్మ ఒక అందమైన యువకుడితో వచ్చింది. ఇద్దరి 
మెడలో దండలున్నాయి కాబట్టి, వివాహం చేసుకున్నా రనిపించింది. మరి 
భాస్కర్‌ ఏమయినట్టు? 





82 ప్రగతి పథమా? పతన మార్గమా? 


“ఆశ్చర్యపోతున్నారా మేడమ్‌ ! ” నవ్వింది పద్మ, 

“సుధాకర్‌ ! నువ్వు కూర్చో నేను మేడమ్‌తో మాట్లాడాలి” అన్నది. ఇద్దరం 
లోపలికి వెళ్ళాం. 

“మేడమ్‌! భాస్మర్‌ తండ్రి వ్యాపారం దెబ్బతిన్నది. గుమస్తాగా వుద్యోగం 
చేస్తున్న వాడిని చేసుకుని ఏం సుఖపడతాను ? అందుకే వర్ణాంతరమైన 
సుధాకర్‌ను చేసుకున్నాను. అతను హరిజనుడు. రిజర్వేషన్లలో తప్పక మంచి 
వుద్యోగమే వస్తుంది. ఎం.ఏ. పాసయ్యాడు. అందుకే అతడిని చేసుకున్నాను” 
అన్నది. నేను క్షణం దిమ్మెరపోయాను. అభిమానము, ఆప్యాయతతో వివాహం 
చేసుకుంటానంటే, ఫరవాలేదు కాని, పదవికోసం, డబ్బు కోసం జరిగే వివాహాలు 
విజయవంతమవుతాయా? 

“మేడమ్‌ ! మేం యింకా చాలాచోట్లకు వెళ్ళాలి.” 

“విష్‌ యూ ఆల్‌ ద బెస్ట్‌-” అన్నాను. ఇద్దరికీ కాఫీ యిచ్చి పంపేశాను. 

బి.ఏ. ఫస్టియర్‌లో చంద్రిమ పుట్టింది. పద్మ చదువు మానేసింది. సుధాకర్‌ 
సోషల్‌ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంటులో చిన్న వుద్యోగిగా చేరాడు. అప్పటి నుండి 
పద్మలో ఓ విధమైన నిరుత్సాహం ప్రవేశించింది. 

“వెధవ అయిదు వందలు దేనికి సరిపోతాయి మేడమ్‌?” అనేది విసుగ్గా. 

“ప్రారంభంలో అంతే పద్మా, సరిపెట్టుకోవాలి” అనేదాన్ని. 

“ఏం సరిపెట్టుకుంటాను ? తమ యిష్టానికి వ్యతిరేకంగా జరిగిన 
వివాహమని, అమ్మా నాన్నలు కూడా ఒక్క చీర కొనలేదు, నగా చేయించలేదు.” 

“చీరలు నగలే జీవితం కాదు పద్మా?” 

“కష్టాలు, కన్నీళ్లా!” విసుగ్గా అడిగింది. ఆ అమ్మాయి నిరాశ యెలా 
పోగొట్టాలో తెలిసేది కాదు. బి.ఏ. ప్రయివేటుగా పూర్తిచేసి తనను ఏదయినా 
వుద్యోగంలో చేరమన్నాను. చదువుకోవటానికి నా దగ్గరకు వచ్చేది. 

“హరిజనులు యెక్కువ చదవకపోయినా మంచి వుద్యోగం వస్తుందంటారు 
కదా...” 

“అదంతా ప్రచారం కోసం ప్రభుత్వం వేసే స్టంటు” అన్నాను. 

ఓ పది పన్నెండు రోజులుగా అన్యమనస్కంగా కనిపించింది. నా పనులలో 
వుండి నేను అడగలేదు. మా అబ్బాయి స్సూల్‌ ఫైనల్‌ పరీక్ష పాసయ్యాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 83 


వాడిని కాలేజీలో చేర్ప్చించటం, వగైరాలు పూర్తి చేశాము. పద్మ విషయము 
మరిచేపోయాము. ఈనాడు యిలా సంభవించింది. 


“ఇదే బౌద్ధనగరమమ్మా...” రిక్షా అతను అన్నాడు. 

“అదిగో ఆ మూడో సందులో పోనివ్వు” అన్నాను. అతను రిక్షా తీసుకువెళ్ళి 
పద్మ వాళ్ళ యింటిముందు ఆపాడు. 

“ఆ... మీరా?” పద్మ వాళ్ళమ్మ నూతిలో వెయ్యబోయిన చేదతీసి నూతిమీద 
పెట్టి వచ్చింది. 

“చందు మీ ఇంటికెలా వచ్చింది ?” ఆశ్చర్యంగా అడిగింది. 

ఇద్దరము ముందు గదిలోకి వెళ్లాము. ఆమె సోఫాను పమిటతో దుమ్ము 
దులిపింది. 

“కూర్చోండి” అన్నది. కూర్చుని విషయాలు చెప్పాను. చంద్రిమ వెళ్ళి 
అమ్మమ్మ వడిలో కూర్చుంది. 

“ఎంతకు తెగించింది ! నారాత రాళ్ళపాలయింది” ఆమె సోకం తీసింది. 

“ఆమె భర్త నడుగుదామా? నాకు వాళ్ళిళ్ళు తెలియదు.” 

“అతను బుద్ధిమంతుడమ్మా. కులంతో గుణాన్ని కలుపటం అనవసరం. 
ఇది లేదు, అది లేదు అంటూ అతని ప్రాణాన్ని తోడింది. ఈమధ్య ఆ ఇంటి 
ప్రక్కనో త్రాష్టుడు చేరాడు. వాడికి అమెరికాలో వ్యాపారముందట, రెండు 
కార్లున్నాయట. వాడితో తిరుగుతూ, అమెరికా వెడతానని సుధాకర్‌కు 
విడాకులిస్తానని పట్టుపట్టింది.” 

“తను ప్రేమించి పెళ్ళి చేసుకుందిగా.” 

“ఆమాటే మేము అడిగాము. అంతకంటే ధనవంతుడు తటస్తపడితే 
యెలా? అన్నాము. మా మాట ఏనాడు విన్నది గనక?” అని కంట 
తడి పెట్టుకుంది. భాస్కర్‌ విషయాలు క్లుప్తంగా చెప్పింది. 

“పుట్టగానే యెవరూ ధనరాసులు నెత్తిన పోసుకురారు. భాస్మర్‌కు దీన్నిద్దా 
మనుకొన్నా కాదంది. మేం చదువు సహాయము చేశామన్న అభిమానముతో - 
మా రెండో అమ్మాయి లక్ష్మిని చేసుకున్నాడు. హాయిగా వున్నారు. ఇప్పుడు పెద్ద 
వుద్యోగం అయింది. ఈ యెండమావుల వెంట పరుగెడితే యెలా?” ఆమె 
ఏడుస్తుంది. నిజంగా జాలివేసింది. ప్రగతి, విప్లవం అంటే నిర్వచనాలే తప్పుగా 





84. ప్రగతి పథమా? పతన మార్గమా? 


యిచ్చారేమో. అయిదారు వందల విద్యార్థినులున్న కాలేజీలో రోజుకోరకం వార్త 
వింటుంటాం. 


“ఒకమ్మాయి లైంగిక స్వేచ్చను కోరి నల్లురి కుర్రాళ్ళతో తిరిగింది. చివరికి 
మొదటివాడు చంపేశాడు.” 

“మరో అమ్మాయి నడిబజార్లో మగవాడిని అవమానించిందట. నల్గురు 
మొగపిల్లలు ఆ అమ్మాయిని అవమానించి కక్ష తీర్చుకున్నారు. 

మచ్చుకు రెండు చెప్పాను, రక రకాల మనస్తత్వాలు, ఎందుకిలా 
జరుగుతుంది? నైతికంగా దిగజారటం ఓ గొప్ప పనా, ప్రగతా ! 

పద్మది మరో రకం కేసు, ఏం చేద్దాం? 

పద్మ తండ్రి వచ్చాడు. అతని ముఖం జేవురించింది విషయము వింటూనే. 

“చండాలపు పిల్ల ! నా కడుపున చెడబుట్టింది. పట్టుకొచ్చి నరికి పోగులు 
బెడతాను” అంటూ చిందులు తొక్కాడు. 

“మొదట యెక్కడున్నదో కనుక్కుంటే మాట్లాడొచ్చు” అన్నాను. 


“మీరు పనులు వదులుకుని ఇక్కడెందు కుంటారమ్మా ? నేను మీ ఇంటికే 
తీసుకువస్తాను” అని నాతో అంటూనే అతను పాపం కాఫీ అయినా తీసుకోకుండా 
బయలుదేరాడు. 

అతను వెళ్ళాక, పద్మ వాళ్ళమ్మకు ధైర్యం చెప్పి, చంద్రిమను వదిలి 
వచ్చేశాను. ఆ రోజంతా చూచాను, యెవరూ రాలేదు. మర్నాడు నాల్గుగంటలకు 
టీ త్రాగుతున్నాను. అప్పుడు పద్మా, తండ్రీ వచ్చారు. 

“మీరు ఎడ్యుకేటెడ్‌. ఇంతో అంతో వ్రాసే అలవాటున్నవారు కూడా 
సంకుచితంగా ఆలోచిస్తే యెలా?” వస్తూనే గయిమంది. 


“నేను ఏం సంకుచితంగా మాట్లాడానో చెబుతావా కాస్త?” కోపంగా 
అడిగాను. 

“విదేశాలలో యెంత స్వేచ్చో ఆలోచించండి. పాడు దేశం పాడు 
మనుషులు ఛీ... ఛీ...” 


“నీకే పాడుబుద్ధి పుట్టిందే....” తండ్రి చెయ్యి లేపాడు. నేను ఆపాను. 
ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 85 


“చూడు పద్మా ! ఈ స్వేచ్చ కోరేవారు, విధిగా సంతాన నిరోధకం 
అవలంబిస్తారు. అమెరికాలో నానాటికి జనాభా తగ్గిపోతుంది. అలాగే నువ్వు 
చెయ్యాల్సింది, ఇప్పుడా పసిదాని బ్రతుకేం కావాలి?” ఆఖరు అస్త్రం 
ప్రయోగించాను. 

“ఏం అవుతుంది, బ్రతుకుతుంది. నా ఆర్థిక స్థితి బాగు పడగానే 
తీసుకువెళ్ళి హాస్టల్లో చేర్చిస్తాను” అన్నది దృఢంగా. 

“మరి చట్టరీత్యా నువ్వు సుధాకర్‌ దగ్గర విడాకులు తీసుకోవాలి” అన్నాను, 
ఆఖరు అస్త్రం నిష్ఫలం కావటంతో. 

“ఇదిగో, నేను యెటుపోయి, ఏం చేసినా అభ్యంతరం లేదని వ్రాసిచ్చాడు 
సుధాకర్‌...” లాయర్‌ సమక్షంలో వ్రాసిచ్చిన కాగితం చూపింది. 

“నీ కూతుర్నేం చేసుకుంటావో చేసుకో. మా నెత్తిన ఎందుకీ తద్దినం!” 
తండ్రి కోపంగా అరిచాడు. 

“సరే - వస్తాను మేడమ్‌. మీరెంతో మంచివారని, ఉన్నతులని వచ్చి నా 
బిడ్డను వదిలాను. మీరింత సంకుచితులని తెలియదు.... బై....” బిడ్డను 
వదలిననాడు వెళ్ళినంత వేగంగా వెళ్ళిపోయింది. 

నా మనసంతా చేదు మింగినట్టుంది. అనవసరంగా మాటలు పడితే 
యెవరి స్థితి అయినా అంతేనేమో, నాదేం పోయింది అనుకున్నాను. 

మూడు రోజులకు ఓ స్నేహితురాల్ని సాగనంపుదామని స్టేషన్‌కు వెళ్ళాను. 
సుధాకర్‌ పెట్టె, బెడ్డింగుతో నిల్చున్నాడు, నన్ను చూచి ముఖం తిప్పుకున్నాడు. 

“ఊరెడుతున్నావా సుధాకర్‌?” నేనే అడిగాను. 

“ఏం చనిపోతున్నా ననుకున్నారా ? మీ ప్రియమైన స్టూడెంట్‌ చేసిన 
ఘనకార్యం తెల్సిందిగా! ప్రేమించడం, పెళ్ళిచేసుకోవటం నేరమా? నాకేదో 
హోదా వస్తుందనుకున్న దానికి బాధ్యుడిని నేనా?” చీదరింపుగా చూచాడు. 

“స్త్రీకి సమాన హక్కు కావాలన్నా, కాని అది దుర్వినియోగం చెయ్యమని 
చెప్పలేదు, సారీ సుధాకర్‌...” 

“వద్దండీ, అందరూ సానుభూతి చూవుతుంటే భరించలేక 
వెళ్ళిపోతున్నాను-” 

“చంద్రిమ...” మాట ఆపి అతనివంక చూచాను. 





86 ప్రగతి పథమా? పతన మార్గమా? 


“నాకేం తెలియదు, ఒకందుకు మంచిదే అయింది. రోజూ ఆమె 
తిరుగుళ్ళు భరించలేక నాలో నేను కృంగిపోయేవాడిని” అన్నాడు రోషంగా. 

నాకు మాటలు రాలేదు. అలాగే చూస్తూ వుండిపోయాను, ఎవరో 
పిలవటంతో అతను వెళ్ళిపోయాడు. 

ఇంటికి వచ్చాను, దాదాపు రెండు నెలలు గడిచాయి. పద్మ విషయము 
పూర్తిగా మరిచిపోయాను. ఆరోజు పోలీసు ఇన్‌స్పెక్టర్‌, మావారి స్నేహితుడు 
వచ్చారు. ఆ మాట, ఈ మాట మాట్లాడాక బ్రోతల్‌ కేసెస్‌ గురించి చర్చ 
వచ్చింది. అతను ఓ మాటన్నాడు. 

“మీ రచయిత్రుల కెంతసేపు మగాడు మోసం చేసి, స్త్రీని వ్యభిచార 
గృహాలకు పంపుతున్నాడని వ్రాసెయ్యటమే తెలుసు. కొందరు మాత్రమే 
అలాంటివారు...” 

“మిగిలినవారు!...” కాస్త పదునుగా అడిగాను. 

“తిన్నదరక్క తీరి కూర్చుని ఏదో సంపాదించాలని వచ్చినవారే” అన్నాడు. 

“మీరు అలా అనకపోతే ఇంకేమంటారు లెండి...” 


“మీరు కొందరిని యింటర్‌వ్యూ చెయ్యండి. నిజం బయటికి వస్తుంది” 
అన్నారాయన. 

“అలాగే” అన్నాను, ఒంటరిగా వెళ్ళాలంటే కాస్త యిబ్బందిగా అనిపించి, 
ఓ ప్రజల రచయిత్రిగా లేబుల్‌ వేసుకున్నావిడను తోడు రమ్మన్నాను. 

ప | వాళ్ళ గురించి ఊహించి రాయగలం కాని ఇంటర్‌వ్యూ 
చేస్తే మర్యాద ఉంటుందా? భలేవారు గనక!” మళ్ళీ ఇలాంటి చర్చలు 
చెయ్యొద్దన్నంత గట్టిగా చెప్పింది. నిట్టూర్చి, రెండవరోజు ఇన్‌స్పెక్టర్‌ గారు చెప్పిన 
హోటల్‌కు వెళ్లాను, అతను యెదురు వచ్చాడు. 

“రండి, రండి ఈ రోజు గులాబి మాత్రమే వచ్చిందట.” వాళ్ళంతా 
బ్రోతల్‌ కేసు క్రింద అరెస్ట్‌ అయినవారు. వచ్చిన అమ్మాయిని చూచి తల 
తిరిగిపోయింది. 


“పద్మా” నా హృదయం చీల్చుకొని వచ్చిందా పిలుపు. 
“యస్‌ మేడమ్‌” తన కలవరం కప్పి పుచ్చుతూ ముందుకు వచ్చింది. 


“ఇదా... ఇదా... నువ్వు కోరిన ఆడంబరం!” 





మాదిరెడ్డి సులోచన కథలు 87 


“ఆ ఈడియట్‌.... ఒట్టి లోఫర్‌! బిజినెస్‌ లేదు, మట్టి లేదు. వాడి అల్లుడి 
వ్యాపారం చూడటానికి వెళుతూ, పెళ్ళాం పోయిందని నన్ను తీసుకు వెళ్ళాలని 
చూచాడు...” 


“పద్మా... పద్మా.....” నోటమాట రాలేదు నాకు. 


“నాకు తెలుసు మేడమ్‌ ! వాడు మోసం చేస్తే ఇంటికెందుకు రాలేదని 
అంటారు. వచ్చేం చేయాలి ? కాకుల్లా పొడిచే కుళ్ళు సమాజం....” 

“పద్మా! ఆపు నీ పుస్తకంలోని డైలాగులు ! సమాజం, సంఘము అంటూ 
బాధ్యతారహితంగా మాట్లాడకు. నీ ఆశలకు సమాజం ఏ విధంగానూ బాధ్యత 
వహించదని గుర్తుంచుకో. అతని అల్లుడు అంటున్నావు, అతని వయసెంతో 
తెలిసే డబ్బుకోసం నువ్వు (శేమ నటిస్తే, అతను అబద్ధం ఆడటంలో 
తప్పేముంది?” 

“నేనిక్కడే ఉండి ఈ కుళ్ళిపోయిన సమాజం మీద పగ తీర్చుకుంటాను” 
అన్నది ఆవేశంగా. 

“కుళ్ళిపోయింది సమాజం కాదు. నీ భావము, స్వర్గానికి నిచ్చెనలు వేస్తూ 
సమాజంపై రాళ్ళు రువ్వితే స్వార్థపరులు హర్షిస్తారేమో కాని, సమాజంలో నేను 
ఒక భాగమే అనుకునే నాలాంటి వాళ్ళు అంగీకరించరు” కోపంగా లేచాను. 
అక్కడా ఇన్‌స్పెక్టరున్నాడని కూడా మరిచిపోయాను. బయటికి వస్తుంటే యెవరో 
పెద్దలన్న మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. 

“చీకటి, చీకటి అని అరిచేవాడు కాదు. సమాజం శ్రేయస్సు కోరేవాడు, 
తన శక్తితో, యుక్తితో ఆ చీకట్లో చిరుదీపం పెట్టేవాడు.” 

నిజమే, పద్మ సమాజాన్ని ఏవగించుకుంటే, నేను పద్మను ఏవగించు 
కున్నాను. పద్మకంటే నేను యెదిగానా ! వెంటనే వెనుతిరిగి వెళ్ళాను పద్మ 
దగ్గరకు. 

“పద్మా! వద్దు పద్మా, నీ అందము యవ్వనము మహా అయితే అయిదా 
రేళ్ళుంటాయి. అప్పుడు కుళ్ళేది సంఘం కాదు నువ్వు, ఇంటికి వెడదాం పద.” 

ఓ గంటసేపు నేను, ఇన్‌స్పెక్టరు గారు రకరకాలుగా నచ్చచెప్పాము. 
ఆయన చూచిన కేసులెన్నో వివరించాక పద్మ కాస్త కదలిపోయింది. 


“మావాళ్ళు రానివ్వరు, మీరు ఆశ్రయమిస్తారా?” 





88 ప్రగతి పథమా? పతన మార్గమా? 


“తప్పకుండా పద్మా, మొదట నువ్వు స్వర్గం అనుకునే ఈ నరకకూపం 
నుండి బయటపడు...” 

ఇన్‌ స్పెక్టర్‌గారి ఇన్‌మ్లాయన్స్‌ వుపయోగించి పద్మను ఇంటికి 
తీసుకువచ్చాను. పద్మ, ఊహించింది కొంతవరకు నిజమే. వాళ్ళమ్మ, నాన్న 
తమకు కూతురే లేదు పొమ్మన్నారు. చుట్టుప్రక్కల వారికిపద్మ విషయం 
తెలియవలసిన అవసరం లేదుకానీ, అనవసర కుతూహలంతో అడుగుతారు. 
వారికి నిబ్బరంగా జవాబు చెప్పగలను నేను. కాని పద్మ మాత్రం అలా కాదు. 
పద్మను ఒక్కక్షణం పనిలేక వదలకూడదు. అందుకే ఇందిరా సేవాసదన్‌లో 
ఉన్న పాప చంద్రిమను తెచ్చి పద్మకిచ్చాను. నా పరపతినంతా ఉపయోగించి 
“యెంత కమీషన్‌ తీసుకొని ఉద్యోగా లిప్పిస్తున్నావని” ఎగతాళి చేసేవారికి 
చిరునవ్వుతో సమాధానము చెప్పి, పద్మకు ఉద్యోగం ఇప్పించాను. బి.ఏ. పూర్తి 
చేయటానికి నైట్‌ కాలేజీలో చేర్చించాను. 

“నీ పిచ్చిగాని సులోచనా ! అక్కడ యెవరూ తటస్తపడరంటావా? మళ్ళీ 
ఆశ చూపరంటావా?” మావారు జాలిగా నవ్వేవారు. ప్రగతి, స్వేచ్చ అని పేరు 
కోసం (ప్రాకులాడడానికి కాక నిర్మాణాత్మకమైన అభివృద్ధి జరగాలి. ఒక సూత్రం 
ఘంటాపథంగా చెప్పేటప్పుడు ఆ సమాజం, సాంఘిక, ఆర్థిక, రాజకీయ 
పరిస్థితులు ఆలోచించాలి. ఒడ్డునున్నవాడు అగాధంలో పడేవాడిని చూసి 
అరవటం వల్ల ప్రయోజనము లేదు. వారిని కాపాడే ప్రయత్నం చెయ్యాలి. 
పద్మలాంటి వారిని చూస్తుంటే మనము ప్రగతిపథంలో సాగిపోతున్నామా, పతన 
మార్గంలోనా? అని ఆశ్చర్యం కలుగుతుంది. పద్మ జీవితం కాలానికే వదిలేశాను. 
నా శాయశక్తులా ప్రయత్నించడము వరకే నా బాధ్యత. ఫలితము కాలమే 
నిర్ణయించాలి. 


(0 





మాదిరెడ్డి సులోచన కథలు 89 


కలిసిరాని కాలం 


ఆఫీసరు..... పేరెందుకు లెండి? పెద్ద ఆఫీసరు భార్య (పైజులు పంచి 
పెట్టడానికి వెళ్ళింది. ఆమె భర్తతో పనిచేసే రాజు ముఖ్య అతిథిగా వచ్చాడు. 

“మోహినీదేవిగారూ ! ఒక్కసారి మా ఇంటికి రండి. నేను యెప్పుడూ మీ 
గురించీ, మీ అందం గురించీ పొగుడుతుంటాను. మా వాళ్ళంతా మిమ్మల్ని 
చూడాలని చాలా కుతూహల పడుతున్నారు” అన్నాడు రాజు. మోహిని 
సమ్మోహనంగా నవ్వింది. స్త్రీకి తన అందం పొగడ్డం కంటే ఏం కావాలి ? 
“అలాగే పదండి” అన్నది. రాజుగారి కారు వెళ్ళి బంజారా హిల్స్‌లోని బంగళా 
ముందాగింది. రాజుగారి భార్య, తల్లి, అక్క చెల్లెండ్రు మోహినిని ఆహ్వానించటానికి 
వచ్చారు. వాళ్ళంతా రెప్పవేయటం మరచిపోయి ఆమెవంక చూడసాగేరు. 


“అబ్బ ! సినిమా తారలా ఉందికదే?” అతని చెల్లెలు గొణిగింది. 


“ఛ... సినిమా తారలు యొందుకు పనికివస్తారు ఆవిడ ముందు ? 
వాళ్ళు పూర్తి మేకప్పులో ఉంటారు.” రాజుగారి భార్య కసురుకుంది. 


మోహిని గర్వంగా, చిన్నగా నవ్వుకుంది. కాని అయిదు నిమిషాల్లో ఆమె 
గర్వం పటాపంచలయింది. రాజుగారి బంగళా చూచి, అది సినిమాసెట్టు అని 
(భ్రమపడింది. విశాలమైన గదులు, అందమైన ఫర్నీచరు, అపురూపమైన వస్తు 
సముదాయమూ చూచి మాటలు రానట్టుండిపోయింది. ఫలహారం, కాఫీ 
అయింది. వాళ్ళ పడకగదిలోకి వెళ్ళారు. వాడ్‌రోబ్‌ చూచి, వాళ్ళ నగలు చూచి 
ఆశ్చర్యపోయింది. కళ్ళు తిరిగిపోయాయి. వీళ్ళ జీతం తన భర్తకంటే యెక్కువా? 





90 మాదిరెడ్డి సులోచన కథలు 


ఆమెకు అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. పని ఉందంటూ ఇంటికి 
వచ్చేసింది. ఆమె బుర్రలో విమానం ప్రొఫెల్లర్లలా తిరుగుతున్నాయి ఆలోచనలు! 
తమకున్న ప్రభుత్వం వారి త్రీఆర్టీ ఇల్లు అసహ్యంగా కనిపించింది. ఆమె విసురుగా 
గదిలోకి వెళ్ళింది, తను కట్టుకున్న పోచంపల్లి పట్టుచీర బరువు అనిపించసాగింది. 

“ఏమయింది, అలా ఉన్నావు?” ఆమె భర్త శ్రీహరిరావు అడిగాడు. 

“ఆ జరిగిందేదో మిమ్మల్ని పెళ్ళి చేసుకున్ననాడే జరిగిపోయింది. కొత్తగా 
అనుకోవటానికేం ఉంది?” గొణుక్కుంది. 

“కాస్త గట్టిగా చెప్పలేవోయ్‌....” శ్రీహరి అన్నాడు. 

“ఏం లేదు, పిల్లలు భోజనాలు చేశారా?” 

“అం... మనమే ఉన్నాము” అన్నాడు. రాత్రిళ్ళు శ్రీహరి పుల్మాలు తింటాడు. 
డయిటింగ్‌ పేరుతో తనూ అవే తింటుంది. ఇప్పుడు పుల్మాలు చేయాలంటే 
యెక్కడలేని విసుగు వచ్చింది. 

“రొట్టెలు పాప చేసింది మోహినీ!” అన్నాడు శ్రీహరి - ఆమె మనసులో 
భావాలు గ్రహించినట్టె. పాప పెరుగుతుంటే శ్రీహరికి యెంత ఆనందం 
కల్గుతుందో మోహినికి అంత దిగులుగా ఉంటుంది. పాప తన వయసు లాగి 
బయట పెడుతున్నట్లు అనుభూతి చెందుతున్నది. వెళ్ళీ భర్తకు వడ్డించింది. 

“అదేం? నీకు అక్కరలేదా ?” 

“ఏదో టిఫిన్‌ తిన్నాను” తప్పించుకున్నది. శ్రీహరి భోజనం చేసి అలసటగా 
పడక చేరాడు. రోజూ కబుర్లతో అతడిని విసిగించేది, మౌనంగా కూర్చుంది. 

“ఏమిటి మోహీ ! మాట్లాడవు ? ఏ మాలోచిస్తున్నావు?” 

“ఏం లేదు....” ఏం చెబుతుంది ? రాజుగారి బంగళా గురించా? అతని 
ఐశ్వర్యం గురించా?” 

“లైటు ఆర్పేసి పడుకో...” 

“ఏమండీ... ఆ రాజుగారి జీతమెంత?” 

“ఓహో! అదాలోచిస్తున్నావా?” ఆయన ఫక్కున నవ్వాడు. 

“యిందుకు?” విసుగ్గా అడిగింది. 


“అలాంటి విషయాలు మరచిపోవాలి మోహీ! అవేం జీవితాలో? అవినీతికి 
మారుపేరు ఆయన. వేశ్యకంటే చెడిపోయిందామె” అన్నాడు. 


కలిసిరాని కాలం 91] 


“నీత్రిగా బ్రతుకుతున్న మీకు, పట్టం కట్టి సన్మానం చేస్తున్నారా?” లైటు 
ఆర్చి, విసుగ్గా అటు తిరిగి పడుకున్నది. 

శ్రీహరి మరేం మాట్లాడలేదు. ఆ చిన్న సంఘటన మోహిని జీవితాన్ని 
అశాంతిపాలు చేసింది. ప్రతి పనిలో, ప్రతిచోటా రాజు ఇల్లు, రాజు ఆడంబరం 
గుర్తుకు వస్తుంది. ఏం జీవితం? ప్రతి పైసాకు లెక్కచూడాలి? ఏ వస్తువు 
కొనాలన్నా పదిసార్లు ఆలోచించాలి. ఒక్కనాడూ ఆమె ప్రశాంతంగా బ్రతుకలేదు. 
ఆసక్తిగా మిసెస్‌ రాజు వివరాలు సేకరించేది. ఆవిడకు పెద్ద పెద్దవారితో 
పరిచయాలు, ఆవిడ చీకటి బ్రతుకు అర్థం అయిపోయింది. అసహ్యం కలుగలేదు. 
నీత్తికి నిర్వచనం, నైతిక విలువలకు అర్థం వెతుకసాగింది. ఆమె ఆడంబరాల 
వైపే మొగ్గింది. 

అనుకోకుండా అదే వారంలో రాజుగారు, భర్త, మరి కొందరు ఆఫీసర్ల 
కుటుంబాలతో గోవా చూడ్డానికి బయలుదేరారు. ఓ బస్సే మాట్లాడుకున్నారు. 
కళాకాంతులు లేని రాజుగారి భార్య స్వేచ్చగా, యథేచ్చగా అందరితో పూసుకు 
తిరుగుతుంది. తనకు కావలసినవి కొంటుంది. డబ్బు మాత్రం తను ఇవ్వదు. 
అదంతా ఓ అద్భుతంలా ఉంది. ఆమె మనసు మహాసాగరంలా ఉంది. ఏ 
ఆకర్షణాలేని ఆమె అలా సంపాదిస్తుంటే తను దద్దమ్మలా ఉండటం ఏం నచ్చలేదు. 
ఆమె మార్చును రాజు దంపతులు కనిపెట్టారు. 

“మీరు మడికట్టుకు కూర్చుంటే లాభం లేదండీ! ప్రపంచం డబ్బు చుట్టూ 
తిరుగుతుందని ఈపాటికి గ్రహించే ఉంటారు” అన్నాడు రాజు. శ్రీహరి దూరంగా 
ఉండటం చూచి, ఆమె మాట్లాడలేదు. అది అంగీకారంగా తీసుకున్నాడు. 

“మీరు 'ఊంి అనండి! లక్షాధికార్లు మీ పాదాల మీద వాలేలా చేస్తాను.” 

“ఏమిటి రాజుగారూ?” శ్రీహరి వచ్చాడు. 

“ఏం లేదు, మీరు చెప్పటంలేదని ప్రపంచం తీరు వివరిస్తున్నాను” అన్నాడు 
తడబాటుగా. 

“తనకు తాను తెలుసుకుంటే రుజుమార్గంలో ఆలోచిస్తారు. ఇతరులు 
చెప్పినప్పుడు తప్పుదారినే పడతారు” అన్నాడు శ్రీహరి. ఆ క్షణంలో శ్రీహరి 
మాటకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు మోహిని. ఆమె చుట్టూ, డబ్బూ, డబ్బుతో 
వచ్చే హోదా, వస్తువులూ తిరుగుతున్నాయి. ఆమెకు మంచి, చెడు ఆలోచించే 
విచక్షణ లేకపోయింది. 


92 కలిసిరాని కాలం 


ఆ రాత్రి శ్రీహరి పైఅధికారి రంగనాథ్‌కు ఉన్నట్టుండి గుండెపోటు 
వచ్చింది. అతనిని ఆస్పత్రిలో చేర్చారు. శ్రీహరి కంగారు పడిపోయి అతనితోనే 
ఉండిపోయారు. ఆస్పత్రి నుండి భార్యకు ఫోన్‌ చేశాడు - అధికారి భార్యకు 
ధైర్యం చెబుతూ అక్కదే ఉండమని, పదకొండు గంటల వరకుంది. మెల్లగా తన 
గదికి బయలుదేరింది. రాజు, మరికొందరు కారిడార్‌లో నిలబడి సిగరెట్లు 
కాలుస్తున్నారు. “మోహినీ!... మీ మోహన రూపానికి ముగ్గులయిపోయారు. 
వీరు....” ముద్ద, ముద్దగా మాట్లాడుతున్నారు రాజు. 

“రాజుగారూ ! నేను.... నేను...” 

“కనికరించారా ? ఇతనితో బీచ్‌ చూడ్డానికి వెడతారా?” 

“ఊహూ ! నేను వెళ్ళాలంటే ఒక్కరాత్రికి పదివేలు కావాలి” అతిశయంగా 
అని, గదిలో అడుగుపెట్టి గుండెల నిండుగా గాలి పీల్చింది. 

“తనేమంది ? ఒక్క రాత్రికి పదివేలు కావాలంది. ఇస్తారా ? ఇవ్వరు” 
నిశ్చింతంగా ఉంది. తలుపులేసుకుని పడుకుందామని తలుపు దగ్గరకు వచ్చింది. 
భళ్లున తలుపు తీసుకుని వచ్చాడో నడివయసు మనిషితో రాజు. 

“మోహినిగారూ ! ఇతను పదివేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.” 
రాజు మాటలు బయటపడుతుండగానే, వంద.... వంద నోట్ల కట్టలు మంచం 
మీద పడ్డాయి. 

“పది నిమిషాల్లో తయారయి రండి...” వాళ్లు మరో మాట వినకుండానే 
వెళ్ళిపోయారు. మోహానికి మతిపోయింది. అంత డబ్బు తను యెన్నడూ 
చూడలేదు. కళ్ళు జిగేల్‌ మన్నాయి. 

తలుపులు వేసి నిమిషాల మీద అన్నీ తన పెట్టెలో సర్దుకుంది. గబగబా 
తయారయి బయటికి వచ్చింది. గదికి తాళం పెట్టింది. సిగరెట్టు కాలుస్తున్న 
ఆసామి సిగరెట్టు పారవేసి చేయి చాపాడు. ఆ చేయి అందుకుని అతని వెంట 
వెళ్లింది. చీకటి.... ఒక మెట్టుకు రెండో మెట్టుకున్న యెత్తు ఊహించలేక తూలి 
పడబోయింది. 

“జాగ్రత్త...” అన్నాదేగాని అతను చేయూత ఇవ్వలేదు. 

“లిఫ్ట్‌లో వెళ్లాల్సింది.” 

“మనమంత పబ్లిక్‌గా తిరగటానికి భార్యాభర్తలం కాము” అన్నాడు. అతను 
తీసుకువెళ్లిన చోటుకు వెళ్లింది. ఆమె మనసు, తన శరీరంపై లేదు. తను 





మాదిరెడ్డి సులోచన కథలు 93 


కట్టబోయే అధునాతనమైన మేడ చుట్టూ, తను కొనబోయే కారుచుట్టూ, వస్తువుల 
చుట్టూ తిరుగుతుంది. తను పరాయివారి వెంట వచ్చాననిగాని, తన జీవితంలో 
మరొకరికి చోటిచ్చాననిగాని మరిచిపోయింది. 


“ఏయ్‌, అమ్మాయ్‌ !.... శ్రీమతిగారేమో - అక్కడ నా పర్స్‌లో పది 
రూపాయిలున్నాయి. టాక్సీలో వెళ్ళిపో...” 


“ఇంత రాత్రా” అన్నది గోడకున్న గడియారం వంక చూచి, ఒకటిన్నర 
చూపుతుంది. 

“సరే, నీ కెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్ళిపో. వెళ్ళేటప్పుడు మాత్రం 
'నో డిస్టబెన్స్‌” బోర్డ్‌ తగిలించి మరీ వెళ్ళు.” నిర్లక్ష్యంగా అటు తిరిగి పడుకున్నాడు. 
ఆమె అలాగే కూర్చుంది. ఇంత రాత్రి ఒంటరిగా వెళ్ళలేదు. ఒక కునుకు 
తీద్దామని నడుము వాలిస్తే నిదుర వచ్చేసిందంటే.... తెల్లవారిపోతుంది ! అందరికి 
తన విషయము తెలిసిపోతుంది. రాత్రంతా జాగారం చేసింది. అయిదు గంటలకు 
హోటల్‌ బయటికి వచ్చి, టాక్సీ తీసుకుంది. 'వెధవ కనీసం సాగనంపనయినా 
లేదు” అనుకుంది. 'ఛ... వాడి మర్యాద లెవడికి కావాలి? తనకు కావల్సింది 
డబ్బు. వాడికి కావల్సింది ఒక్క రాత్రి సుఖం. అవి రెండూ తప్ప, ఇంకేం 
ఆలోచించకూడదు తను.” 


“ఊం... గిట్టుబాటు బాగుందన్నమాట....” టాక్సీవాడు వెటకారంగా 
హిందీలో అడిగాడు కిరాయి తీసుకుంటూ. అతడిని ఓ కోరచూపు చూచి 
హోటల్లోకి వచ్చేసింది. తన గది తాళం తియ్యబోతూ రాయిలా నిలబడి 
పోయింది. కారిడార్‌లో వేసిన కుర్చీలో కూర్చుని నిదురబోతున్నాడు శ్రీహరి. 
యొక్కడికెళ్ళావంటే ఏం చెబుతుంది? యెంత అల్లరి అవుతుంది? మెల్లగా తాళం 
తీసింది. లేపాలా - వద్దా, అని తటపటాయిస్తుండగానే అతనే లేచివచ్చాడు. 


“వచ్చేసరికి రెండయింది మోహీ ! నువ్వు మిసెస్‌ రంగనాథన్‌ దగ్గర 
ఉంటావని, అంత రాత్రి లేపడం యెందుకని లేపలేదు....” శ్రీహరి చెబుతున్నాడు. 
అతని ముఖం చూడలేకపోయింది. బాత్‌రూమ్‌లో దూరింది. బట్టలు మార్చుకుని 
ముఖం కడుక్కుని వచ్చేసరికి అతను పడుకున్నాడు. 


“ఇంటిదగ్గర యెప్పుడూ ఉండే హడావుడే కదా! పడుకో....” అన్నాడు 
ఆవులిస్తూ, ఆమె అలసటగా పడుకోబోయింది. 


94 కలిసిరాని కాలం 


Kk x xk 


“మోహీ !... లే...” శ్రీహరి లేపాడు. ఆమె భయంగా చూస్తూ లేచింది. 
అతను కాలకృత్యాలు తీర్చుకుని, కాఫీ తాగి కూర్చున్నట్టున్నాడు. 

“మరో అరగంటలో మనం బయలుదేరాలి. రంగనాథన్‌ కోలుకున్నాడు. 
రాత్రి ట్రంక్‌ కాల్‌ చేశాం బొంబాయికి, అతని అన్నా వదిన వచ్చారు. 

“అయ్యో ! ముందే లేపొద్దా ? అన్నీ సర్దుకోవాలి.” 

“చాలామట్టుకు సర్దేశాను. నీవు బట్టలు మార్చుకుని సర్దుకోవాలి, అంతే.” 

ఆమె గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. రాత్రి తను అట్టడుగున దాచిన 
డబ్బు కంటబడితే... పడే ఉండవచ్చు. 

“మీరు అడ్డదిడ్డంగా సర్జుతారు, సూట్‌కేసులు ఎందుకు ముట్టుకున్నారు?” 
భయంగా విసుగ్గా చూసింది. 

“నేను సర్దలేదోయ్‌! బయట ఉన్నవి లోపల పెట్టాను” అన్నాడు. అమ్మయ్య” 
అని ఊపిరి పీల్చుకుంది. 

అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. రాజు దంపతులు మోహినిని 
చూచి వెకిలిగా నవ్వుతూ, చవకబారు జోక్స్‌ వేయటం, ద్వంద్వార్థాలు వచ్చే 
మాటలనటం (ప్రారంభించారు. మోహినికి నీటి బయట పడిన చేపపిల్లలా 
ఉంది. తలనొప్పి పేరుతో యెక్కువ భాగం కళ్ళు మూసుకుని పడుకుంది. సీటుకు 
జారగిల పడింది. శ్రీహరి ఆందోళనగా టీ మాత్రం ఇప్పించాడు, ఇల్లు చేరారు. 

రెండు రోజుల తరువాత కాస్త కుదుటపడింది, కాని భర్తను సమీపించ 
లేకపోయింది. ఏదో మిషతో దూరంగా ఉంటుంది. తను సంపాదించిన డబ్బు 
జాగ్రత్తగా బీరువాలో దాచింది. అంతా ఒక్కసారే ఇస్తే భర్త అనుమాన పడతాడు. 
అందుకో పథకం ఆలోచించుకుంది. 

“ఏమండీ...” 

“ఏమిటి మోహీ?” 

“మనము ఫ్రిజ్‌ కొనుక్కుందాం” 

“ఇంకో రెండేళ్ళు ఆగాలి డియర్‌. వెస్పా కొన్న అప్పే తీరలేదు” అన్నాడు 
టిఫిన్‌ చేస్తూ. 





మాదిరెడ్డి సులోచన కథలు 95 


“అది కాదండీ... నేను అప్పుడప్పుడు మిగిల్చి దాచుకున్న డబ్బు వెయ్యి 
రూపాయలుంది. ఇనీషియల్‌ పేమెంటుకు సరిపోతుంది. ఇన్‌స్టాల్‌మెంట్లు 
కట్టుకుందాము” అన్నది. 

“ఇప్పటికే ఇన్‌స్టాల్‌మెంట్ల జీవితంతో విసిగిపోయాను మోహీ...” 

“ఫ్రిజ్‌ నా అవసరం. దాని ఇన్‌స్టాల్‌మెంటు పొదుపు చేసి నేనిస్తాను” 
అన్నది. బ్రతిమాలి వెయ్యి రూపాయలు తెచ్చి ఇచ్చింది. అతను బ్యాంకులో 
డబ్బు కట్టి ఆఫీసుకి వెళ్ళిపోతానన్నాడు. అలాంటిది బ్యాంక్‌కు వెళ్ళిన గంటలో 
తిరిగి వచ్చాడు. అతని ముఖం జేవురించింది. 

“ఏమండీ... ఏమయింది?” ఆదుర్దాగా అడిగింది. 

“మోహినీ ! ఈ డబ్బు యొక్కడిది ?” 

“ఆం... నాదే.... పొదుపు... దాచాను...” 

“అబద్ధం.... చెప్పు మోహీ? నువ్వు దాచిన డబ్బు అయితే నేనిచ్చిందే 
కావాలి. నేను ఈ నోట్లు ఇవ్వలేదు.” 

“అది కాదు.... ఒకరికి అప్పు పెట్టాను.” 

“యివరు ?... యెవరు వారు?” 

యెొవరని చెబుతుంది? ఏమని చెబుతుంది? 

“వాళ్ళు.... మీకు తెలియదు.... మరిచి.... మరిచిపొండి.” 

“మోహీ... నిజంగా అంటున్నావా? నీ భర్త కంటే ఆ వ్యక్తే ముఖ్యమా ? 
అదృష్టవశాత్తు కౌంటర్‌పై నన్నెరిగిన వ్యక్తి ఉన్నాడు గాబట్టి సరిపోయింది. లేకపోతే 
ఈ పాటికి కటకటాల వెనుక ఉందేవాడిని. దొంగనోట్లు ఇచ్చిందెవరు?” 

ఏద్వటం మినహా జవాబు ఇవ్వలేకపోయింది. అతను ఎన్నో విధాలుగా 
ప్రయత్నించాడు. ఆమె నోరు విప్పలేదు, అతను విసుక్కుని నోట్లు మంచం 
మీద పడేసి ఆఫీసుకు వెళ్ళాడు. 

ఆమె వణికిపోయింది. యెంత మోసం ? యెంత దగా? తను శీలం 
పోగొట్టుకొని సంపాదించిన డబ్బు - నోట్లు - దొంగనోట్లా ? ఆ నిజాన్ని 
తట్టుకోలేకపోయింది. అన్నీ అవేనా ? లేక తక్కువయి వెయ్యి కలిపారా ? 
దొంగ నోట్లకు, మంచి నోట్లకు భేదం యొలా తెలుస్తుంది? 

ఇంకా ఏదో ఆశ, ఇంకా ఏదో మినుకు, మినుకు మనే వెలుగు ఆమెను 
నిలబెట్టింది. అయోమయంగా, ఇంటి పనులు ముగించింది. బ్యాంకులో తనకు 


96 కలిసిరాని కాలం 


బాగా పరిచయమున్న వారిని అడుగుదాం అనుకుంది. ఈలోగా ఆ వీధిలోకి 
వనితా మండలి సెక్రటరీ వచ్చింది. సెక్రటరీని చూడగానే మోహిని హృదయం 
ఎగిరి గంతేసింది. సంతోషంగా టీ పెట్టి ఇచ్చింది. 

“దొంగనోట్లు, మంచి నోట్లు అంటారు కదా! వాటికి భేదం కనుక్కోవటం 
యెలా?” అంది. 

“అదా, మంచి నోటుకు ఓ నిలువు గీత కనిపిస్తుంది” అంటూ ఓ నోటు 
తీసి చూపింది. అది చూచాక ఇక ఆదుర్దా ఆపుకోలేక పోయింది. ఆవిడ వెళ్ళి 
పోగానే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నది. నోట్లు ముందేసుకున్నది. 

సాయంత్రం శ్రీహరి ఆఫీసు నుండి వచ్చాడు. వస్తూనే పనిమనిషి ద్వారా 
మోహిని ఒంటి గంటకు గదిలో దూరి బయటికి రాలేదని విన్నాడు. అప్పటికే 
పిల్లలు వచ్చారు. నానా అవస్థపడి తలుపు విరగ్గొట్టాడు. మోహిని బీరువా, 
మంచం మధ్యలో చలనం లేనట్టు కూర్చుంది. ఆమె ముందు నల్లని కాగితాల 
మసి ఉంది. 

“మోహిని... మోహీ...” అతను భుజాలు పట్టి కుదిపాడు. ఆమె పిచ్చిగా 
చూచింది. “ఆం - ఊం అనటం తప్ప నోరు మెదపలేదు. 

“పాపా! డాక్టరుగారికి ఫోన్‌ చెయ్యి.” కూతుర్ని పంపి భార్యను మంచం 
మీద పడుకోబెట్టాడు. డాక్టరు వచ్చి చూచి, ఏదో పెద్ద షాక్‌, మెంటల్‌ ఆస్పత్రికి 
తీసుకు పొమ్మన్నాడు. శ్రీహరి భార్య స్థితికి కారణం ఊహించలేక, కాలం, విధి, 
దురదృష్టం అంటూ సరిపెట్టుకుంటున్నాడు. 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 97 


నేటి కథ 


క్లబ్బు నుండి నేను, రాఘవ బయటికి వచ్చాము. మిగతావారు కార్డ్స్‌ 
ఆడుతున్నారు. 

“మీ ఆవిడ తొమ్మిది దాటితే ఊర్మోదా?” కాస్త కుతూహలంగా, కాస్త 
హేళనగా అడిగాడు రాఘవ. 

“మా ఆవిడ వూరుకున్నా, అరిచినా అది వేరే విషయము. గృహస్తుగా 
నాకు కొన్ని బాధ్యతలున్నాయి.” అన్నాను, అతను మరేం మాట్లాడలేదు. నేను 
కారు రివర్సు చేసి తెచ్చాను. అతనొచ్చి కారెక్నాడు. అతను కారెక్కాడంటే అర్ధం 
నాకు తెలుసు, అతని ఆఫీసులో స్టైనోగా పని చేసే పంకజం దగ్గరకు వెళతాడని. 

“రాఘవా ! ఒక మాట చెప్పేదా?” 

“ఏమిటో ఆ విలువయిన మాట సెలవియ్యి,” అన్నా సిగరెట్టు 
అంటించుకుని. 

“ఈ చాటు మాటు, వ్యవహారం యెందుకు చెప్పు వ్‌ భార్య మంచిది, 
హాయిగా రెండో పెళ్ళీ చేసుకోవచ్చుగా,” అన్నాడు. 

“ప్రేమకు, వ్యామోహానికి, ప్రణయానికి అర్థం తెలియని అమాయకుడవు. 
మాది స్వేచ్చా ప్రణయము...” 

“కావచ్చు. అందులో నిజానిజాలు నాకు తెలియవు గాని, మొన్నో రోజు 
రాత్రంతా పంకజం ఇంట్లో ఉన్నావని వాళ్ళమ్మాయి, అబ్బాయి గొడవ చేశారట...” 





98 మాదిరెడ్డి సులోచన కథలు 


“ఏడ్చారు ! వాళ్ళనెవరు పట్టించుకుంటాడోయ్‌. పంకజం భర్త అంటే 
జంకాలి గాని, అతడికి కావల్సిన ప్రమోషన్లు ఇస్తున్నాను, త్రాగుటకు 
డబ్బిస్తున్నాను. ఇంకేం కావాలి?” 

“ఇన్నాళ్ళు సాగిన మీ ప్రణయ చరిత్ర నాకు తెలుసు. నీతో వారు చెప్పే 
కథలు యెరుగుదును. నేనెప్పుడయినా చర్చించానా?” 

“అంత అవసరం కూడా రాలేదు. శ్రీకాంత్‌ ! నువ్వు ఒట్టి జడుడివోయ్‌. 
ఈ పూట నావెంట పంకజం ఇంటికి రా. అప్పుడు ఆవిడ ఆరాధన, ప్రేమ, 
అభిమానము చూచాక వెధవ పెళ్ళి, వెధవ పెళ్ళాం అని అనకపోతే అడుగు” 
అన్నాడు. అతనికేమని చెప్పాలో అర్థం కాలేదు. అతడిని పంకజం ఇంటి ముందు 
వదిలేసి వచ్చేశాను. ఆ తరువాత రెండు రోజులకు క్లబ్బు పనిమీద ఇద్దరం 
పంకజం ఇంటికి వెళ్ళాం. నిజంగా ఆమె ఆరాధనకు మూగబోయినట్టు ఉండి 
పోయాను. స్వేచ్చా ప్రణయము యెందుకన్నాను అంటే, రాఘవను చూడగానే 
ఆమె ఎంత మైమరచి పోతుందో ఆ రోజు చూశాను. ఆవిడ బాత్‌రూమ్‌లో 
ఉంది. 

“యెవరే వచ్చింది?” 

“రావువగారు మమ్మీ...” అమ్మాయి చెప్పింది. అంతే తలుపు 
బ్రద్ధలయినంత పని అయింది, ఆవిడ తోపుకు. అస్తవ్యస్తంగా చుట్టుకున్నట్టుంది 
చీర, నుదుట సబ్బు నురుగు వదలనే లేదు. 

“మీరు వస్తున్నట్టు ఫోన్‌ చెయ్యకూడదా...? అయ్యో ఇంట్లో ఏం లేదు.” 

“ఇప్పుడవేం వద్దులే పంకజా! క్లబ్బు ఏనివర్సరీ. ఆ రోజు నువ్వు 
పాడతావేమో అడుగుదామన్నాడు శ్రీకాంత్‌”. 

“నన్ను అడిగేదేమిటండీ? నాపై మీకు అన్ని హక్కులున్నాయి. మీరు 
ఊం అంటే పాడటమే కాదు ఆడతాను.” 

“అమ్మమ్మ అక్కరలేదు, పాడితే చాలు...” అన్నాడు రాఘవ కళ్ళు చికిలించి. 
ఆమె బయటికి వెళ్ళింది. గొంతు మాత్రం వినిపించింది. 

“పాపా ! కాసేపు అత్తయ్యగారింట్లో ఆడుకోకపోయావా?... బాబూ, 
నిన్ను రంజిత్‌ రమ్మన్నాడురా.” 


“ఎందుకు మమ్మీ అబద్దాలు ఆడతావ్‌? రాఘవగారొచ్చారు వెళ్ళ 
మనరాదు-” రుస రుసలాడే గొంతు వినిపిచింది. వాళ్ళు వెళ్ళిపోవటం 


కిటికీగుండా చూశాను. 
నది కథ 99 


“మీరు వెళ్ళి కూరగాయలు తీసుకు రాకూడదు?” భర్తను పంపివెసింది. 

“అమ్మాయ్‌ గౌరీ... ఓ గౌరీ... నువ్వు సినిమాకు వెళ్లాలన్నావు కదే...” 

“రేపు పోతాను లెండి, బట్టలు బాగున్నాయి.” 

“అనుకొని మానుకోవటం యెందుకే వె(ర్రిదానా ! ఈ రూపాయి 
తీసుకువెళ్ళు...” పంకజం కేకలు ఆగిపోయాయి. మరో రెండు నిమిషాల తరువాత 
కారప్పూస, కాఫీతో తిరిగి వచ్చింది. 

“వస్తున్నట్టు ఒక్క ఫోన్‌ చేస్తే మీ కిష్టమైన మిరపకాయ బజ్జీలు చేసేదాన్ని” 
నొచ్చుకుందావిడ. 

“మరో రోజు చేద్దువుగానిలే. అనవసరంగా శ్రమపడి అందరినీ బయటికి 
పంపావు పంకజా ! నేను వెళ్ళిపోవాలి..” అతను ఫలహారం ప్లేటు అందుకున్నాడు. 


“కాసేపయినా ఇక్కడ గడపండి. వెడితే ఊర్ముంటానా? అదేం లేదు, 
మీరు వెళ్ళండి శ్రీకాంత్‌గారూ.” 


“థాంక్యూ...” లేచాను. 

“భలేవారు గనక. వెళ్ళమంటే టిఫిన్‌ వద్దనా ?” నవ్వి పంకజం ప్లేటు 
ఇచ్చింది. వాళ్ళీద్దరు బాగానే ఉన్నారు, జరుగుతున్నది చూస్తుంటే నాకే కంపరంగా 
ఉంది, ప్లేటు క్రింద పెట్టి కాఫీ మాత్రం తీసుకున్నాను. ఒకరిపట్ల ఒకరికి 
మహోన్నతమైన ఆరాధనా ? గౌరవమా, అప్పుడే రాఘవ వేసిన జోకుతో 
ఒకరి పట్ల, ఒకరి కెంత గౌరవమున్నదో తెలిసిపోయింది. 

“ఊం, మీ మరిది కనిపించడేం ?-” రాఘవ అడిగాడు, 

“తినడం, పడుకోవటంతో సరిపోయింది, పంపించి వేశాను.” 


“పడుకోవటం అంటున్నావు నీ గదిలో పడుకునేవాడా?” కోరగా చూస్తూ, 
కొంటెగా నవ్వాడు. 


“రీ | మీ రెప్పుడూ ఇంతే - అవును లెండి (పేమారాధనలు యెొక్కువయితే 
అనుమానాలు యొక్కువవుతాయి.” ఓ వెకిలి నవ్వు నవ్వింది. నాకు అక్కడ ఒక్క 
క్షణం ఉండాలనిపించలేదు. నేను ఒక్కక్షణం అక్కడుంటే ఒకరి కౌగిలిలో ఒకరు 
వాలిపోవటం తథ్యం అనిపించింది. ఇదేనా పవిత్రమైన వివాహ బంధము... 
ఒహో ప్రగతి మార్గం కాబోలు! అక్కడి నుండి వచ్చేశాను. 


100 == 


క్లబ్బు వార్షికోత్సవం సందర్భంగా పంకజం అద్భుతంగా పాడింది. 
అందరము అభినందనలు తెలిపాము. రాఘవ మాత్రము ఆనాటి కార్యక్రమానికి 
విచ్చేసిన ముఖ్య అతిథి వదిలిపోయిన పూలదండ తెచ్చి మెడలో వేశాడు. 

“లేడీస్‌ అండ్‌ జంటిల్‌మెన్‌ !... ఆం, నేనేం చేశాను ! ఉత్సాహము 
ఆపుకోలేక ఆమె మెడలో దండ వేశాను.... అఫ్‌కోర్స్‌ దండలు భార్యాభర్తలు 
మార్చుకోవాలని నియమము లేదు” ఉలిక్కిపడ్డట్టు చెబుతున్నాడు రాఘవ. 

“అబ్బే ప్రేయసి, ప్రియులు కూడా మార్చుకోవచ్చు” అన్నాడు రాజన్‌ 
గడుసుగా, అదేదో పెద్ద జోకయినట్టు అందరూ భళ్ళున నవ్వేశారు. 

“ఏమిటా ఆకతాయి తనము, ప్రక్కన ఆమె భర్త ఉన్నాడు.” మురళి అన్న 
డాక్టరు ఆక్షేపించాడు. 

“భరించువాడు భర్త, ఇలాంటివన్నీ భరించాలి” మరెవరో అన్నారు. నాకు 
చిరాకుగా ఉందేమిటో! వాళ్ళ ప్రవర్తనే చిత్రంగా ఉందంటే మధ్య వీళ్ళ గోల 
ఏమిటో అర్థం కాలేదు. ఎందుకో తల తిప్పేసరికి తలుపు దగ్గర పంకజం 
కొడుకు, కూతురు కనిపించారు. వాళ్ళ కళ్ళు రక్తాన్ని కక్కుతున్నాయి. దగ్గరగా 
వెళ్ళాను, వాళ్ళ ఊపిరిలో పాము బుసలు వినిపిస్తున్నాయి. 

“అంకుల్‌, అయిదు రూపాయలుంటే ఇస్తారా. రేపు తెచ్చి ఇస్తాను, ఇంటికి 
వెళ్ళాలి” అన్నాడు, బాబు. 

“మంచిది” అయిదు రూపాయలు ఇచ్చాను. బంగారం లాంటి పిల్లలు. 
వాళ్ళను చూచి, తల్లి కొన్ని కోర్కెలు త్యాగం చెయ్యొచ్చు. 

మరేం ఆలోచించలేక వచ్చి పార్టీలో చేరాను. ఆ రాత్రి పంకజానికి, 
భర్తకు లిస్ట్‌ ఇచ్చాను. ఎన్నోసార్లు నోటి చివర వరకు వచ్చిన మాటలను సంస్కారం 
అడ్డుపడి గొంతులోనే నొక్కేసింది. 

“ఏం మాట్లాడరేం, శ్రీకాంత్‌గారూ!” 

“చాలా బాగా పాడారు” ఏమనాలో తెలియక మరోసారి అన్నాను. 

“బావుందంటే కాదండోయ్‌ ! రేపు రాష్ట్రమంతా జరిగే కల్చరల్‌ వీక్‌లో 
నాకు అవకాశమివ్వాలి.” 

“అలాగే చూద్దాం” 

“చూద్దాం అంటే కాదు, నేను రాఘవ, ఈ మధ్య కొన్ని పల్లెపాటలు 
జంటగా పాడటం ప్రాక్టీసు చేశాం. ఇద్దరం పాడతాం, సినిమా పాటలతో విసుగెత్తి 
పోయిన జనము మైమరచి పోవాలి చూడండి” అన్నది పంకజం. 








మాదిరెడ్డి సులోచన కథలు 101 


“రాఘవ ఆఫీసరు కదా, పాడతాడో లేదో...” 

“మీ కెందుకు నేను ఊం అంటే చాలండీ. ఆ విషయాలు నాకు 
వదిలివేయండి” అన్నదామె. వారిని దింపి వచ్చేశాను, అలసట వల్ల నిదుర 
పోయాను. ఓ వారం రోజుల తరువాత పని తెముల్చుకుని త్వరగా ఇంటికి 
వచ్చాను. పంకజం కూతురు గొంతు విసుగ్గా వినిపించింది. 

“అంకుల్‌ పాడమన్నారట ఆంటీ ! రోజూ ప్రాక్టీసంటూ మమ్మల్ని బయటికి 
తరిమేస్తారు. రోజూ యెవరింట్లో కూర్చోవాలో తెలియటం లేదు” అన్నదా 
అమ్మాయి. క్రాంతి కూడా జవాబు చెప్పనట్టు నిలబడి పోయింది. భోజనాలు 
చేశాము. మా అమ్మాయితో కాసేపు కేరమ్స్‌ ఆడింది. నాతో కాసేపు కార్ట్‌ 
ఆడింది, పది దాటింది. పొమ్మని అనలేక మేము, పోతానని అనలేక ఆ అమ్మాయి 
మొహమాట పడుతుండగా బాబు వచ్చాడు. 

“రావే పోదాం, రేపటి నుండి డాబా మీద కూర్చుందాము. ఇల్లిల్లు తిరిగి 
విసిగిపోయాను” అన్నాడు. 

వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. 

“పిల్లలు మనంత యెదిగాక ఇంకా ఏమిటండీ ఈ శృంగారం, 
బంగారం...” విసుగ్గా అన్నది క్రాంతి. 

“మనిషికి వయసుంటుందిగాని కోర్కెల కుండదు వయసు.” 

“ఏద్బినట్టుంది మీ సమర్థింపు” రుస రుస లాడింది. మనిషి కట్టు తప్పి 
ప్రవర్తించి, సంఘాన్ని సంఘ నియమాలను తూలనాడుతా డెందుకో! 

మరునాడు మళ్ళీ లిఫ్ట్‌ అడిగాడు రాఘవ. అప్పుడు ఊర్మోలేకపోయాను. 

“రాఘవా ! ప్రాక్టీసు పేరుతో పంకజం పిల్లల్ని బయటికి పంపటం 
అంత మంచిది కాదేమోనని నా అభిప్రాయము.” 

“నీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను, పంకజం ఏకీభవించకూడదూ?” 
అన్నాడు గల గల నవ్వి. 

“ఈ గొడవ యెందుకు, ఓ రెండు గంటలు ఏ హోటల్లోనో గడిపి 
వెళ్ళకూడదు?” 

“ఖర్చులు నువ్వు పెట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు” అన్నాడు 
తేలికగా నవ్వుతూ. ఒక నిట్టూర్చు వదిలాను. కొందరు అదృష్టవంతులు, 


102 నికథ 


అనుకున్నాను. ఆ తరువాత వరుసగా టూర్లు, పనుల మూలంగా క్లబ్బుకు 
వెళ్ళటం తగ్గించాను. వెళ్ళినా అప్పుడే తిరిగి వచ్చేవాడిని. అయిదు గంటలకే 
బెల్‌ వినిపిస్తే ఆశ్చర్యంగా లేచాను. అప్పటికే క్రాంతి, లేచి తలుపు తీసింది. మా 
ప్రక్కింటి ప్రకాశం నిల్చున్నాడు. 

“శ్రీకాంత్‌ గారూ ! ఒక్కసారిలా వస్తారా?” 

“ఏమిటి ?” చెప్పులేసుకుని వచ్చాను. 

“ఇలా రండి....” చెయ్యి పట్టుకుని లాక్కువెళ్ళాడు. 

“ఏమిటండీ?” మా శ్రీమతి పిలుస్తున్నా వినిపించుకోలేదు అతను, 
దూరంగా ఉన్న చింతచెట్టు క్రిందికి తీసుకువెళ్ళాడు. అక్కడ రాఘవ కారుంది, 
కారు చుట్టూ జనము మూగి ఉన్నారు, చీకటిగా ఉండటము మూలాన స్పష్టంగా 
ఏం కనిపించలేదు. రాఘవ తన కార్లో వస్తె కారు అక్కడ పార్క్‌ చేసి, నడిచి 
పంకజం ఇంటికి వెడతాడు. లోపలికి చూచాను. రాఘవ కనిపించారు. 

“రాఘవా!” కుదిపాను, నిర్జీవంగా ప్రక్కకు వాలిపోయాడు. ఎవరో 
పరుగెత్తుకు వెళ్ళి టార్చి తెచ్చారు. టార్చి వేశాము, రక్తం మడుగులో పడివున్నాడు. 

“అమ్మో! చచ్చిపోయాడు. ఎవరో దొంగల్లా వున్నారు” అన్నారు యెవరో. 
దొంగలయితే అతని చేతికున్న రోలెక్స్‌ వాచి, వేలికున్న వజపు టుంగరం తీసుకుని 
వెళ్ళలేదేం? ఎందుకు దొంగతనం చేసినట్టు ? 

“కాదు యెవరో తెలిసినవారే అయివుండాలి. ఇక్కడ కాపేసి పట్టుకున్నారు” 
అన్నారెవరో! 

“అయినా ఆయనను చంపే దుర్మార్గు లెవరబ్బా !” 

“దుండగులు, దుర్మార్గులు ఢిల్లీ నుండి వచ్చి దోపిడీలు, హత్య 
చేస్తున్నారంట-” 

అందరి మాటలు వింటుంటే నాలో చలనము వచ్చింది. అప్పటికే 
వెలుతురు చీకటిని చీల్చుకుని వస్తుంది. నా మెదడు మొద్దుబారి పోయినట్టు 
అయింది. ఎప్పుడూ నవ్వే ఆ పెదవులు వికృతంగా మారాయి. నోరు సగం 
తెరిచి ఉన్నది. నా బుర్రలో ఒక ఊహ తళుక్కుమంది. కాని దాన్ని యెక్కువసేపు 
ఉంచలేకపోయాను. 


“పోలీసులకు కబురు చేద్దామా?....” ప్రకాశం అడిగాడు. 


“ఊం...” నా మాట పూర్తికాకముందే పోలీసుల జీపు, అందులో నుండి 
పంకజ, కొడుకు బాబు దిగారు. నా ఊహే నిజం అయింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 103 


“నువ్వు చెబుతుంది నిజమా !” నీరసంగా అడిగాను బాబును, తనే 
రాఘవను చంపానని చెబుతుంటే. 

“అబద్ధం ఆడవలసిన పని కూడా లేదు అంకుల్‌! ఇలాంటివారు దేశానికి 
చీడపురుగులు” అన్నాడు కసిగా, కచ్చగా పదిహేడు దాటి పద్దెనిమిదిలో అడుగు 
పెడుతున్న బాబు. పోలీసులు వాళ్ళ పని చేసుకుపోతున్నారు. 

నేను బాబు వంకే చూచాను. వాడి ముఖం ప్రశాంతంగా ఉంది. రోషం, 
కోపం మచ్చుకయినా లేవు. 

“బాబూ ! యెందుకు చేశావీ పని ?” 

“అంకుల్‌, తెలియకనే అడుగుతున్నావా ? ఎందుకు చేసినా, కొందరు 
తల్లి తండ్రులయినా జాగ్రత్తగా ఉంటారు” అన్నాడు. నాకు కళ్ళు చమర్హాయి. 
పెద్దల పొరపాటువల్ల రెండు కుటుంబాల పిల్లలు అయోమయంలో పడిపోయారు. 
రాఘవ ఏ పిల్లల కోసం వివాహము మానాడో ఆ పిల్లలు ఇప్పుడు ఏ దిక్కులేని 
వారయ్యారు. మనిషికి తనవారంటూ యెవరో ఒకరుండాలి. తన వారో, పగవారో, 
(ప్రైమించేవారో, ద్వేషించే వారో, వాళ్ళను యెలా ఓదార్చ గలను? ఈ వార్త విని 
పంకజం [బ్రతుకుతుందా ? ఈ ప్రణయ జీవులు విడిపోయి బ్రతుక గలరా? 
రాఘవ పరువు, ప్రతిష్ట, హోదా అన్నీ మరిచాడు. దాదాపు పంకజం అంతే. 
రాఘవ శవాన్ని మార్చురీకి పంపి, మెల్లగా పంకజం ఇంటివైపు బయలుదేరాను. 
వేలాది మంది వచ్చారు. పంకజానికి తెలియలేదా? తెలిసి స్పృహ తప్పి 
పోయిందా? ఆలోచిస్తూ ఆమె ఇంట్లో అడుగు పెట్టాను. 

“ఏమిటోనండీ, శవాలు, రక్తం అంటే నాకు చికాకు. అందుకే తలుపే 
తీయలేదు” అన్నది. నాకు ఒళ్లు మండింది. ఈ మనిషేనా రాఘవ కోసం 
ప్రాణం పెట్టింది. ఛీ... ప్రణయాలు, (ప్రేమలు, ప్రాణాంతకాలు. 

“మీ బాబు రాఘవను చంపాడని తెలుసా?” వెటకారంగా అడిగాను. 

“ఆం... తెలుసు.... వారు లాయర్‌ దగ్గరకు వెళ్ళారు” అన్నది. అక్కడొక్క 
క్షణం ఉండబుద్ది కాలేదు. మెల్లగా రాఘవ పిల్లలను చూద్దామని బయలుదేరాను. 
స్వేచ్చా ప్రణయాలు కావు. అవసరానికి వాడుకునే బలహీనతలు. పంకజానికి 
భర్తకు ప్రమోషన్లు కావాలి. తన మాయాజాలంలో రాఘవను పూర్తిగా గుడ్డివాడిని 
చేసింది. ఇలాంటి స్రీలు... ఒళ్ళమ్ముకునే వారికన్నా దేంట్లో మిన్నో అర్థం కాలేదు. 


O 
104 నజ ళథ 


స్రీ బుద్ధిః ప్రళయాంతకః 


మధుసూదన్‌రావు కార్‌ పార్క్‌ చేసి, వెనక సీట్లోని ప్యాకెట్‌ తీసుకుని, 
లాక్‌ చేసి హుషారుగా మేడ యెక్కాడు. ఆ రోజు మేడంతా నిశ్శబ్దంగా ఉంది. 
కారణం ఊహించలేకపోయాడు. చైతన్య ్రవంతిలా తిరిగే రాధిక జాడ కనిపించ 
లేదు. ప్యాకెట్లు సోఫాలో పడేసి కూర్చున్నాడు. 

“రాధీ ! రాధికా-” పలుమార్లు పిలిచినా జవాబు రాలేదు. విసుగ్గా లేచి 
పడక గదిలోకి దారి తీశాడు. రాధి గోడవైపు తిరిగి పడుకున్నా ఆమె పక్కలు 
యొగిరిపడుతూ, ఆమె ఏడుస్తుందని అతనికి తెలిపాయి. వివాహమైన పన్నెందేళ్ళ 
నుండి ఆమెతో ఆనందోత్సవాలే చూచాడుగాని యెన్నడూ ఆమె కంటిలో అశ్రు 
బిందువులు చూడలేదు. 


“రాధీ ! రాధీ ఇటు చూడు, ఏమిటి? యెందుకు ఏడుస్తున్నావు ?” 


6 » 


“చెప్పు రాధికా! నా మనస్సు కీడును శంకిస్తుంది.” 

“ఏం చెప్పాలి?” విసురుగా లేచి కూర్చుంది. “నేను.... నేను గొడ్రాలిని... 
పిల్లలంటే ఏమిటో తెలియనిదాన్ని. పాపిష్టిని. చాలా?” 

“అలా అని యెవరన్నారు?” అతని కళ్ళు ఎర్రబడ్డాయి. 


“ఈ యింటి పెద్దకోడలు. మీ ప్రియమైన వదిన... ఈ అవమానము 
భరించే కన్నా చావటమే మేలు...” రెండు చేతుల మధ్య తలపెట్టుకుని భోరున 
ఏడ్చింది రాధిక. వదిన పేరు వినగానే అతను కాస్త వెనక్కు తగ్గాడు. ప్రియమైన 





మాదిరెడ్డి సులోచన కథలు 105 


ఇల్లాలి దుఃఖం చూడలేకపోయాడు. ఆమె తల మృదువుగా నిమిరాడు. 

“వదినకు పిచ్చి యెత్తిందేమో. ఊర్కో రాధీ” చాలాసేపటికి రాధిక 
వెక్కిళ్ళు ఆపుకుంది. 

“అసలు వదినగారలా యెందుకన్నారు?” 

“మీకు తెలుసుకదా పిల్లలని నేను యెంత అపురూపంగా చూస్తానో. 
వందలు పోసి కొన్న ఆటవస్తువులు పాదడుచేసినా నేను ఒక్కమాటనలేదు. 
వివాహమైన క్రొత్తలో మీరు ప్రేమతో బహూకరించిన టాయిలెట్‌ సెట్‌లోని 
అద్దం ముక్కలు, ముక్కలుగా చేశారు. నాకెందుకో అశుభంగా తోచింది. బేబిని 
రెండు దెబ్బలు వేశాను. అంతకే ఆమె యెన్ని మాటలన్నదని. ఇన్నాళ్లకు మరో 
సత్యం తెల్సిందండీ. పరాయి పిల్లలపై (ప్రేమ పెంచుకోవటం భ్రమేనని...” 
ఆమె చెప్తూనే ఉంది. మధుసూదనరావు ముఖం వివర్ణమయింది. యెంతో 
గాయపడితేగాని రాధిక అలా అనదు. ఆమె (పేమమయి. అందుకే వెలమదొరల 
సాంప్రదాయాలు, వేలమీద వచ్చే కట్నాలు వదిలి మధ్య తరగతి కుటుంబానికి 
చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. ఆమె కాలేజీలో అతని జూనియరు. 

సంప్రదాయాలు సరిపడక పోయినా, పుట్టింటి లేమిని చూపుతూ అత్తింటి 
బంధువులు హేళన చేసినా, భర్త చిరునవ్వు నీడన అన్నింటిని ప్రక్కకునెట్టి తాను 
నవ్వడానికే పుట్టాను అన్నట్టు బ్రతికింది. తనకు సంతానము లేదని ఏనాడు 
తీరిగ్గా కూర్చుని విచారించలేదు. మధుసూదన్‌రావు అన్న శ్రీహరిరావుకు ఏటా 
సంతానం కల్గుతుంటే తోడికోడలికి ఏ కష్టం కలుగకుండా రాధిక తాను పెంచింది. 
క్రొత్తవారికి పిల్లలను కన్నవారెవరో తెలుసుకోవటం కష్టంగా ఉండేది. తన 
ఇద్దరి కొడుకుల మధ్య అన్యోన్నత కలకాలం అలాగే నిలవాలని వృద్ధమాత 
యెప్పుడూ ప్రార్థించేది. అన్యోన్యతకు అసలు కారణం రాధికేనని కోడలిని 
విపరీతంగా అభిమానించేది. శ్రీహరిరావు భార్య అరుంధతి అయినా 
అసూయాపరురాలు కాదు. తోడి కోడలిపై కోపం వస్తే “ఆ చిన్న దొరసాని పని 
ఇదంతా” అంటూ విసుక్కోవటమే అందరూ యెరుగుదురు. ఈనాడు అంతలేసి 
మాటలన్నదంటే నమ్మశక్యం కాకుండా ఉంది. చెప్పింది రాధిక కాబట్టి నమ్మవల్సి 
వస్తుంది. 

“అదంతా పీడకలగా మర్చిపో రాధికా. నీవు కావాలన్న శాంతినికేతన్‌ 
చీరలు తెచ్చాను లే.” బయట నుండి వ్యాకెటు తెచ్చి విప్పాడు. 





106 ప్రీ బుద్దిః ప్రళయాంతకః 


థి 


“ఇప్పుడేం వద్దండీ. నా మనసు బావుండలేదు.” 


“ఈ చీరలో నిన్ను చూడాలని యెంతో ఉత్సాహంగా వచ్చాను అతను 
నిరాశగా ముఖం పెట్టాడు. 


“మీరు మరీ చిన్నపిల్లల్లా పట్టు పడతారు” బలవంతంగా నవ్వి లేచింది. 
తెల్లచీరపై కాఫీ రంగు పువ్వులతో ఆకర్షణీయంగా ఉన్న దుస్తులు, రాధిక 
శరీరానికో వింత అందాన్ని చేకూర్చాయి. ఆమెకు ఉల్లాసం కల్గించే చోట్లన్నీ 
తిప్పి తీసుకువచ్చాడు. అందరూ నిదురబోయాక యిల్లుచేరి నిదురబోయారు. 
మర్నాడు ఏదో (గంథాలయం ప్రారంభోత్సవ ముందని భర్త వెళ్లిపోయాక, వెల్తిగా 
తిరిగింది రాధిక. పిల్లల నుండి తప్పించుకోవటానికి తలనొప్పి సాకుతో తలుపులు 
బిగించింది. అరుంధతి అయినా ఒక్కసారి వచ్చి “ఏదో నోరు జారాను చెల్లీ” 
అంటే పోయేది. పిల్లలు చుట్టూ చేరి చేసే అల్లరి చూచి గర్వంగా నవ్వుకుంది. 


ఈ చిన్న దొరసాని పిల్లలను చూడకుండా యెన్నాళ్ళుంటుందో చూద్దాం 
అనుకుంది. అటు పిల్లలను అదుపులో పెట్టలేక, ఇటు చిన్న కోడలికి నచ్చచెప్పలేక 
అత్తగారు సతమతమవుతున్నారు. 

క్రొత్త రోడ్డు పోయించే విషయమై అధికారులతో వాదించి అలసటగా 
ఇల్లు చేరాడు మధుసూదన్‌. రాధిక కిటికీ దగ్గర నిలబడి యెటో చూస్తుంది. 

“రాద్రీ!” మృదువుగా భుజం తట్టాడు. 

“వచ్చారా” వెనుకకు తిరిగింది. భర్త రెండు చేతులు పట్టుకుంది. ఉబికి 
వచ్చే కన్నీరు బలవంతంగా ఆపుకుంది. 

“ఏమండీ, వివాహమయిన ఇన్నేళ్ళలో మిమ్మల్ని ఏదీ కోరలేదు. నా 
కోర్కెలు గ్రహించి మీరే అన్నీ తీర్చారు. ఇప్పుడు నా అంతట నేను కోరే ఈ ఒక్క 
కోర్కె తీర్చండి.” 

“ఛ. నన్ను కన్నీటితో అర్థించాలా ! పిచ్చిదానా? ఆజ్ఞాపించే అధికారం 
ఉంది” కన్నీరు వత్తి భుజాల చుట్టూ చేయిచుట్టాడు. 

“మీ విశాల హృదయం నాకు తెలుసు. మనసు దర్చణమువంటిది. తెలిసి 
విసిరినా తెలియక విసిరినా రాయి దాన్ని ముక్కలు చేస్తుంది. ఆ ముక్కలు 
అతికినా అసహజంగానే కనిపిస్తాయి. నా హృదయ దర్పణం ముక్కలు 
అయిపోయింది. నేను పిల్లలకు దూరంగా ఈ యింట ఉండలేను. వారిని దగ్గరకు 





మాదిరెడ్డి సులోచన కథలు 107 


తీసుకోనూ లేను. నన్నీ బాధ నుండి రక్షించండి. నన్ను అపార్థం చేసుకోకండి...” 
అతని చేతులు విడిపించుకుని మరో గదిలోకి పారిపోయి తలుపు వేసుకుంది. 
“స్తీ అనాదిగా పురుషునికో సమస్యగానే మిగిలిపోయింది” అనుకుని నిట్టూర్చాడు 
మధుసూదన్‌రావు. 

దంపతులకు చెందిన వస్తు సముదాయమంతా తోటలోని బంగళా 
చేరింది. అపరాధిలా అత్తగార్మి పాదాభివందనం చేసి పరుగెత్తినట్టే కార్లోకి వెళ్ళి 
కూర్చుంది రాధిక. 

“అన్నయ్యా.... నన్నపార్థం చేసుకోవద్దు. దూరం నిల్చున్న అన్నగారి 
వద్దకు వెళ్ళాడు అతను. 

“అదేమిటో మధూ. మనము శాశ్వతంగా విడిపోతున్నామా. మరదలి 
మనసు కుదుటపడగానే వస్తారుగా” తమ్ముడి భుజం తట్టాడు. గదిలో అరుంధతి 
కుత కుతలాడిపోతుంది. “సాగితేసరి. యింత చిన్న విషయానికి రాద్దాంతం 
చేసి యిల్లు వదలాలా? పోనీ.” అనుకుంది. తోటలోకి వచ్చాక రాధిక కాస్త 
తేరుకుంది. ఉదయమే లేస్తూ మొక్కల సంరక్షణలో లీనమయ్యేది. 


Kk xk Kk 


రవీంధ్రభారతిలో చిత్రకారుల సమావేశం ఉందని భార్యాభర్తలు తయారవు 
తుండగా వరసకు ఆడబడుచు అయిన సుధాదేవి వచ్చింది. రాధిక తన 
ప్రయాణము మానుకుంది. ఆడపడుచు మర్యాదలన్నీ పొందిన పిమ్మట అరుంధతి 
అతిశయం. రాధిక మర్యాదలతో పోల్చి చూచుకున్న ఆమె హృదయం అరుంధతి 
పట్ల కసిగా మూల్లింది. 

“ఒక్కసారయినా పిల్లలను తీసుకుని ఇటుగా వచ్చిందా మీ అక్క? యెంత 
చేశావు. దానికి తెలుసులే. ఉత్తుత్త అలకలేగా సాగనిమ్మని. యెలాగు ఆస్తంతా 
తన బిడ్డలకేగా. గ 


“పోనివ్వండి వదినా” తేలికగా సుధాదేవి నోరు మూసింది గాని, తన 
హృదయంలో బయలుదేరిన సంచలనాన్ని అణచలేకపోతుంది. తన వాటాలో 
నుండి ఒక్క పైసా కూడా అరుంధతి పిల్లలకు దక్కరాదు. దక్కకూడదు. స్థిర 
నిశ్చయానికి వచ్చింది. “అనాథ శరణాలయాలకు రాస్తే? ఎవరినైనా దత్తత 
తీసుకుంటే? అవేవి సాగవని తెలుసు ! శ్రీహరి, మధుసూదన్ల మైత్రి అలాంటిది. 





108 స్ర్తీ బుద్దిః ప్రళయాంతకః 


థి 


అన్నదమ్ములే కాక ప్రియమిత్రులు కూడా. వారి మైత్రికి భంగం రాకుండా పని 
సాధించాలి. బాల్మనీలో నిలబడి ఆలోచిస్తుండగా నౌకరు నారయ్య సాయంత్రం 
పోస్టులో వచ్చిన ఉత్తరాలు తెచ్చాడు. వృద్ధ దాసి మంగమ్మ పూలమాల తెచ్చింది. 

“యెక్కడి నుండి దొరసానమ్మా ఉత్తరం?” 

“నాన్నగారు రాసినట్టున్నారు.” ఉత్తరం చించింది. 

“చి॥ లక్ష్మిసౌభాగ్యవతి రాధికను నాన్న ఆశీర్వదించి వ్రాయునది. 


ఇక్కడంతా క్షేమము. నీ క్షేమము తెలుపగోరాను. నీ తరువాత ముగ్గురు 
చెల్లెండ్ల పెండ్లి యెలాగో చేశాను. పదే, పదే నిన్ను సాయం అడగటం 
సమంజసము కాదు. కాని అడగక తప్పటం లేదు. ఆఖరు చెల్లి శశిరేఖ పెళ్ళీ 
చేసి నిశ్చింతగా ఉండాలని. ఈ యేడు తన చదువు కూడా ఆపేశాం. అబ్బాయి 
భారత్‌ హెవీ ఎలక్‌ ట్రికల్గ్‌లో ఫిట్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడట. అయిదు వేలు 
కావాలంటున్నారు. ఒక్కసారి నువ్వు వచ్చి చూస్తే, నిశ్చయించుకుందాం. మీ 
అమ్మ నిన్ను అడిగినట్టు చెప్పమంది.....” తను చూడటమంటే ఆర్థికంగా 
ఆదుకోమనే. చిన్నగా నవ్వుకుంది. 


“ఏమిటో! దానిష్టం. నేను చెబితే వినేదా!” అంటుంది హాల్లో మంగమ్మ, 
“ఏమిటి మంగమ్మా?” నవ్వుతూ వచ్చింది రాధిక. 

“మా పెద్ద అమ్మాయి మొగబిడ్డలు లేరని భర్తకు మళ్ళీ పెళ్ళీ చేసిందమ్మా. 
ఆ వచ్చింది దీన్ని నానా మాటలంటుందట. తెచ్చి యిక్కడే ఉంచుకోరాదా 
అంటారు నారయ్య....” ఆ తరువాత మంగమ్మ మాటలు వినిపించలేదు. 
మెరుపులాటి ఆలోచన ఆమె బుర్రను తొలిచివేయసాగింది. త్వరగా పడక గది 
చేరి తండ్రికి జవాబు రాసింది. 


Kk x xk 


“రాధీ నీ కేం మతిగాని పోయిందా? ఆవేశంలో ఏదో అంటున్నావను 
కున్నాను. శశినేమిటి, నేను పెళ్ళీ చేసుకోవటం ఏమిటి? బహు భార్యత్వము 
యెప్పుడో మా వెలమ దొరల్లో అమల్లో ఉండేది. కాలంతోపాటు మనుష్యులు 
మారారు” అన్నాడు తీవ్రంగా. 


“నా మతి ఉందనే అంటున్నాను. మన ఆస్తిపాస్తులు పరాయివారికి 
పంచి పెట్టే విశాల హృదయం నాకు లేదు. ఈ వివాహం జరగాలి...” 





మాదిరెడ్డి సులోచన కథలు 109 


“వీల్లేదు. నా కెంత మాత్రం ఇష్టం లేదు. యెంత ఆడపిల్ల తండ్రి అయినా 
మీ నాన్నకు మనసెలా ఒప్పింది?” 

“మా నాన్న నా హృదయ వేదన (గ్రహించారు. మీరు గ్రహించటం లేదు. 
సరే నేను చచ్చిపోతే యెలాగు చేసుకుంటారుగా” అన్నది రోషంగా. 

“పిచ్చి మాటలు మాని శాంతంగా ఆలోచించు రాధీ. వదిన చిన్న 
మాటన్నందుకు యింత బాధ పడుతున్నావ్‌. రేపు శశి మాత్రం అనదా?” 

“యెందుకంటుంది? పుట్టబోయే బీడ్డలు మన పిల్లలు. శశి నా చెల్లెలు” 
అన్నది గర్వంగా. 

మధుసూదన్‌ యెన్ని విధాలుగా చెప్పినా వినలేదు. నిరాహార దీక్ష పూనింది. 
కడకు సాధించింది. ఆవేశం, పట్టుదలంత చెడ్డవి మరోటి లేవు. వాటి ముందు 
విద్య, వివేకం కొరగానివే. 

తిరుపతిలో పద్మావతీదేవి ఆలయ ప్రాంగణంలో శశిరేఖ మెడలో 
మాంగల్యం కట్టాడు మధుసూదన్‌. బంధువులు, స్నేహితులు గుసగుసలాడారు. 
రాధిక పట్టుదలతో వివాహం చేసిందిగాని భర్త పరాయి వ్యక్తి అనుకుంటే 
యెక్కడలేని దుఃఖం వచ్చింది. బలవంతంగా నిగహించుకుని తిరుగుతుంది. 
బంధుజనంతో బంగళాకు తిరిగి వచ్చారు. “చంద్రికా ! మిగతా తతంగమంతా 
పూర్తి చేయందే నాకు తలనొప్పిగా ఉంది” రెండవ చెల్లెలికి పని అప్పగించి, 
గదిలో దూరింది. 

“రాధీ... తలుపు తీయి.” పది నిమిషాలు పిలిచాక తలుపు తీసింది. 
వెంట డాక్టరుగారు. ఆ క్షణంలో భర్త అనురాగానికి గర్వపడింది. అతను యిచ్చిన 
మాత్రలు వేసుకుని పడుకుంది. తను నిదురబోతేగాని భర్త కదలడు. కళ్ళు 
బలవంతంగా మూసుకుంది. యెవరో వచ్చారు గదిలోకి. 

“చంద్రికా! రాధికి ఒంట్లో బావుండలేదు. ఈ లాంఛనాలు 
జరక్కపోతేనేం?” భర్త నెమ్మదిగా అనటం వినిపించింది. 

అడుగుల సవ్వడి దూరం అయింది. అతన్ని బలవంతంగా అక్కడి నుండి 
పంపే బాధ్యత తన మీదుందని తెల్సినా ప్రీకుందే సహజమైన బలహీనత వల్ల, 
అతని సమక్షంలో కునుకుతీసింది. కలత నిద్ర నుండి మేల్మొన్న రాధిక 
సిగ్గుపడింది. తల దగ్గర ఈజీచైర్లో వెనక్కు వాలి నిదుర బోతున్నాడు మధుసూదన్‌. 
తన ప్రక్కన చోటు చేసుకుని గువ్వలా ఒదిగి నిదురబోతుంది శశిరేఖ. 





|| 10 స్త్రీ బుద్దిః ప్రకయాంతకః 


థి 


అమాయకంగా నిదురబోయే చెల్లి చెక్కిలి ముద్దాడింది. నెమ్మదిగా మంచము 
దిగింది. 

“మధూ!” భర్త చెవి దగ్గర గొణిగింది. 

“ఇప్పుడెలా ఉంది రాధీ?” 

“నాకేం! బాగున్నాను. లేచి యిలా మంచముపైకి పడుకోండి. మీరీ 
మధ్య మరీ మొండికేశారు. చిన్నగా మందలించి గది విడిచి వెళ్ళిపోయింది. 
ఆరోజే కాదు. యేరోజు అతను శశిరేఖతో గడపాలని. ఆమె సన్నిధిలో సర్వం 
మరిచిపోవాలని కోరలేదు. ఒక విధంగా రాధికకు తృప్తిగానే ఉంది. 

“అక్కయ్యా ! నాకేమన్నా పుస్తకాలు తెప్పించి పెట్టు” అని చెల్లెలు 
అడిగినప్పుడు గర్వంతో కూడిన చిరునవ్వుతో తల పంకించేది. యెన్నో 
సాయంత్రాలు భార్యా, భర్తలు పికారుకెళ్తే తోటలో ఒక మూల కూర్చుని చదువుతూ 
గడిపేది శశిరేఖ. పేదరికంలో పెరగటం చేత ప్రతిదానికీ రాజీపడటం 
అలవాటయింది. తండ్రి వివాహము నిశ్చయించిన నాడు హృదయము 
పగులకుండా పదిల పరుచుకుంది. యెదిరించితే అక్క నుండి యే సహాయము 
లభించదు. తండ్రి యెట్టి పరిస్థితులలోను వివాహం చెయ్యలేడు. యెదిగిన 
ఆడపిల్లలను చూచి లోకం చేసే అవహేళన భరించే కంటే కుటుంబగౌరవం 
కాపాడటము ఉత్తమమని భావించింది. మధుసూదన్‌ ముసలివాడేం కాదు. ఆ 
యింట్లో తనకు లభించే ఆదరణ యెలాంటిదో కూడా అంచనావేసింది. భర్త 
వేశ్యాగ్భహంలో ప్రవేశించినట్లు రావటం పోవటం బాధగా తోచేవి. కోర్మెలను, 
ఆవేశాలను, ఆశలను అదిమిపట్టి యెప్పుడూ పుస్తకాలతో కాలక్షేపం చేయటం 
నేర్చుకుంది. 


Kk x xk 


మూడు రోజులు బెంగుళూరులో గడిపి వచ్చారు మధుసూదన్‌, రాధికలు. 
తోటలో మొక్కలకు సంరక్షణ జరుగలేదని మాలిని కేకలేస్తూ వెళ్ళిందామె. 
మధుసూదన్‌ పైకి వెళ్ళాడు. తన గదికి వెళ్తుంటే శశిరేఖ గదిలో మాటలు 
వినిపించాయి. 

“ఏమోనమ్మా! మీ గొప్పోల్ల సంగతులన్నీ చిత్రమే. యింతకాడికి పెండ్లెవరు 
చేయమన్నారు? కొత్త పెళ్ళీకూతుర్లా తను ఆయనెంబడి తిరుగుతూ మిమ్మల్ని 
ఇలా వదిలేయటానికి మనసెలా ఒప్పిందో? పరాయిదానివా సయాన చెల్లెలివి.” 





మాదిరెడ్డి సులోచన కథలు 1 1 1 


“ఊర్మో మంగమ్మా ఏం మాటలవి. నాకిలాగే బావుంది.” 


“గొప్పోళ్ళకు గుండెలు లోటేనమ్మా. ఆయనకన్నా కట్టుకున్నదానివని 
కనికరం లేదా? అసలు తప్పంతా మీ చేతుల్లో ఉంది.” 

“నా చేతుల్లోనా? లేదే?” నవ్వుతుంది శశిరేఖ. 

“యహ పొండమ్మా. ఈ వనవాసం దేనికట. మీకు మొగాళ్ళను యెలా 
వశపరచుకోవాలో తెలియదు” ఈసారి ఆమెకు రోషం వచ్చింది కాబోలు. 

“అదేం పెద్ద విషయం కాదు. పురుషుడు వెన్నవంటి వాడు. స్త్రీ 
అగ్నిగోళము. ఆ తీక్షణతకు కరిగిపోతాడు. స్వంత అక్కతో పోటీపడటం 
చాతకాదు. నేను ఏమయినా ఫరవాలేదు” చిన్నదదయినా శశి మాట్లాడిన మాటలు 
అతన్ని కదల్చివేశాయి. మంగమ్మ వెళ్ళిపోగానే అపరాధిలా గదిలోకి వెళ్ళాడు. 
శశిరేఖ అదిరిపడి లేచింది. ఆ సమయంలో యెప్పుడూ భర్త తన గదిలోకి 
రావటం యెరగదీ ఆరుమాసాల్లో. 


“అంత అదిరిపాటు దేనికి శశీ?” 

“లేదు బావా.... ఇప్పుడే వచ్చారా, అక్కయ్యేది?” 

“క్రింద ఉన్నది. క్రిందకురా. నాకో కప్పు టీ ఇద్దువుగాని.” అతని వెనుక 
దిగి వచ్చింది. మంగమ్మ తెచ్చి ట్రే తీసుకుని టీ కలిపి ఇచ్చింది. 


ఆనాటి నుండి రాధికతో పాటు శశిరేఖను యొక్కడికి వెళ్ళినా పిలిచేవాడు. 
రాధికకు కోపమువచ్చినా వెంటనే సర్దుకొనేది. ఒకోసారి గంటలు గంటలు 
శశిరేఖ దగ్గర కూర్చుండిపోయేవాడు. 

“అక్కయ్య కనిపెట్టుకుని ఉంది వెళ్ళండి బావా” 

“నా ఉనికి భరించరానిదిగా ఉందా శశీ?” 

“బావా!” ఆమె కళ్ళు అ(శుపూరితము లయ్యేవి. “ప్రీ భర్త సాన్నిధ్యం 
కంటే ఏం కోరుకుంటుంది బావా. మన కాపురం అందరి వంటిదికాదు. మీరు 
ఒకవైపు మొగ్గుచూపి కలతలు రేపుట భావ్యంకాదు” అతను అత్యంత (ప్రేమతో 
దగ్గరకు తీసుకునేవాడు. 

“పరిహాసానికి కూడా అనుకున్నానా నీవింత క్షుణ్ణంగా ఆలోచిస్తావని 
తెలియదు” ఓదార్చి రాధిక దగ్గరకు వెళ్ళేవాడు. కాలం (ప్రశాంతంగా 
గడిచిపోతున్నది. 





|| 12 ప్రీ బుద్దిః ప్రళకయాంతకః 


థి 


Kk x xk 


మధుసూదన్‌, రాధికలు ద్రాక్షతోట వేయిస్తామని గోతులు తీయిస్తూ, 
తీరిక లేకుండా ఉన్నారు. శశిరేఖ తన శరీరంలో ఏదో మార్పు గమనించింది. 
ఎంతో సిగ్గుతో ఆ వార్త మంగమ్మ చెవిన వెసింది. మంగమ్మ సంతోషం యింతా 
అంతా కాదు. నౌకర్ల కందరకూ చాటింది. పెద్ద యజమానురాలికీ వార్త అందజేసి 
బహుమతి కొట్టాలని నారయ్య మధుసూదన్‌ తల్లి దగ్గరకు పరిగెత్తాడు. తలనొప్పితో 
పడుకున్న రాధికకే ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఓపిక చేసుకుని లేచింది. 
తన శ్రమ ఫలించినందుకు, తోటికోడలి ముందు గర్వంగా తలెత్తుకు తిరిగే 
అవకాశము కలిగినందుకు యెంతో ఆనందపడింది. చెల్లెలి గదిలోకి పోబోయి, 
కిల కిల నవ్వులు వినరావటంతో ఆగిపోయింది. 


“వదలండి బావా.... వదలమంటే. ఏమిటీ అల్లరి?” 

“శశి... ఈ రోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా!” 

“యెంతేమిటి?” శశి కంఠము పరిహాసంగా ఉంది. 

“ఇలా దగ్గరకు వచ్చి నా హృదయముపై చెయ్యి పెట్టి చూడు తెలుస్తుంది.” 

“ఇంకేం తెలుప వద్దులే” 

“ఇంత సంతోషాన్ని నాకందజేసిన నీకేం ఇవ్వగలను?” 

“ఏమిస్తారేమిటి?” 

“నువ్వేది కోరితే అది. నా ప్రాణమైనా సరే...” అక్కడ నిలబడలేక పోయింది 
రాధిక. గదిలోకి పరుగెత్తి వచ్చి మంచాన్ని ఆశ్రయించింది. మధుసూదన్‌ 
మారిపోతున్నాడు. శశి దాసదాసీ జనానికి అందజేసిన వార్త తనకు చెప్పలేదు. 
తన కా యింట్లో ప్రాముఖ్యం ఏం లేదా? ఆ క్షణంలో సర్వం యెవరో 
దోచుకుపోయినట్టు బాధపడింది. 

“అమ్మగారు ! పెద్దమ్మగారు వచ్చారు. వార్త అందజేసి పరుగెత్తింది పనిపిల్ల. 
అత్తగారు వేరుగా వచ్చిన తరువాత రావటం మొదటిసారి. తొందరగా బట్టలు 
సరి చేసుకుని వచ్చింది. క్రింది హాల్లోని దృశ్యము మరింత కలవరపరిచింది. 
సిగ్గుతో పెళ్ళికూతురిలా కూర్చున్న శశిని అక్కున చేర్చుకుని సంతోషం ప్రకటిస్తుంది 
అత్తగారు. చిరునవ్వుతో, గర్వంగా ((అది రాధిక ఊహేకావచ్చు) వింటున్నాడు 
మధుసూదన్‌. 





మాదిరెడ్డి సులోచన కథలు 1 13 


తనంత ఒంటరి వారెవరు లేరని ఫీలయింది. తనపై తనకే జాలి 
కలుగసాగింది. వచ్చి అత్తగార్మి పాదాభివందనం చేసింది. 

లేమ్మా రాధికా. నీ కోర్కె నెరవేరింది... భగవంతుడు మిమ్మల్ని చల్లగా 
చూడాలి నాల్గుకాలాలపాటు.” 

“ఇప్పుడే వచ్చారా?” 

“అవునమ్మా పూజలో ఉండగానే నారయ్య వచ్చి చెప్పాడు. అరుంధతి 
వాళ్ళు కూడా చాలా సంతోషించారు. వస్తామన్నారు. ఈ విధంగానైనా మీరంతా 
కలుసుకుంటున్నారని నాకు తృప్తిగా ఉంది.” అత్తగారి మాటలు వింటుంటే 
రాధిక హృదయము కలుక్కుమంది. తను యెవరిపై పగ సాధించాలని.... తన 
సర్వస్వము పణంగా పెట్టింది.... త్వరగా అటునుండి పూజాగ్భహముకేసి 
నడిచింది. సర్వ అలంకారములతో శిలలా ఉన్న మూర్తి ముందు పడిపోయింది. 
భగవాన్‌! నా హృదయములో అసూయకు తావు ఉండనీయకు. తెలీక నేను 
పారేసుకున్న వస్తువుపై భ్రమ తొలిగించి, త్యాగ గుణం ప్రసాదించు తండ్రీ.” 
ప్రార్థిస్తూ అచేతనంగా పడిపోయింది. యెంతసేపలా ఉందో తెలియదు. తన 
కత్యంత ప్రియమైన స్పర్శ అది. ఆ స్పర్శతో మెదడు పని చెయ్యటము 
మొదలుపెట్టింది. 

“డాక్టరుగారిని పిలిపించండి బావా” దీనంగా అంది శశి. 

“వద్దమ్మా, సంతోషంతో మతి పోగొట్టుకుని స్పృహ కోల్పోయింది. ఇలా 
పడుకోబెట్టు బాబూ” మధు చేతులలోని రాధిక తనూలతలా సోఫాలో విశ్రాంతి 
తీసుకుంది. 

“రాధీ... రాధీ” ఆదుర్దా నిండిన కంఠంతో పిలుస్తున్నాడు భర్త. “ఆం.... 
ఏం లేదు” సిగ్గుపడి లేచికూర్చుంది. దినమంతా వచ్చేపోయే బంధువులతో, 
అభినందనలతో గడిచిపోయిందామెకు. సాయంత్రము వెళ్ళి తోటలో కూర్చుంది. 
వెనుకాలే శశిరేఖ వచ్చింది. 

“అక్కా! ఇలా ఒంటరిగా కూర్చున్నావేం?” 

“నేను వంటరిదాన్నేగా శశీ.” 

“అక్కా...” దెబ్బతిన్నట్టు చూచింది. 

“యెందుకే ఆ అరుపు. అంత సంతోష వార్త దాసీలకు చెప్పావు ముందు. 
అది నీ బంధువులకు అందింది.” 





|| 14. ప్రీ బుద్దిః ప్రకయాంతకః 


® 


“అక్కా ! అపార్థం చేసుకుంటున్నావు. నీకు మొదట అందజేయాలనే 
రాత్రి నీ దగ్గర కూర్చున్నాను. తలనొప్పితో బాధ పడుతున్నావని, యేమాట 
చెప్పొద్దన్నరు బావగారు. ఉదయము నీ గదికి వద్దామనుకునే లోపలే, మంగమ్మ 
పసిగట్టి అడిగితే దాచలేకపోయాను. ఆమె అంత తొందరగా చాటిస్తుందని 
తెలియదు” అన్నది దీనంగా. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్ళు సుళ్లు తిరుగుతున్నాయి. 


“ఛ. నేను యేమన్నానని” చెల్లెలిని దగ్గరగా తీసుకుని నుదురు ముద్దు 
పెట్టుకుని, కన్నీరు వత్తింది. 

నవ్వుతూ మధుసూదన్‌కూడా వచ్చాడు. అందరూ ఆ సాయంత్రము 
కులాసాగా గడిపారు. 


మునుపులేని ఆరాటం, ఆందోళన, అవమానము, అనుమానము రాధిక 
గుండెల్లో గూడు కట్టుకుంటున్నాయి. మధుసూదన్‌ శశితో మాట్లాడుతున్నప్పుడు 
తన గుండెల నెవరో వేరు చేస్తున్నట్టు ఆరాటపడేది. భర్త కాసేపు కంటికి 
కనిపించకపోతే దూరమైపోతాడేమో నని ఆందోళన పడేది. అతను శశి గదిలో 
గంటసేపు గడిపితే తనను నిర్లక్ష్యము చేస్తున్నాదేమోనని అవమాన పరుస్తున్నాడేమో 
నని బాధ. శశి కాస్త నవ్వుతూ మాట్లాడితే భర్తను తనకు దూరం చేస్తుందని, 
అనుమానపడేది. అంతా రాధికదే ఊహ అనటానికి వీల్లేదు. మధుసూదన్‌కు 
తండ్రి నవుతాననే ఊహ అతిమధురంగా గర్వంగా ఉన్నది. అంత గర్వానికి 
కారణమైన శశి అంటే అపురూపము, ఆరాధనా ఉన్నాయి. మాతృత్వము 
పొందుతున్న ఆనందము కంటే తను ఆ యింటి కోడలుగా వచ్చిన కార్యము 
సఫలము అయినందుకు చాలా సంతోషిచేది శశి. 

ఆరోజు మధు, రాధికలు యెటో వెళ్ళారు. తోచక ట్రాన్సిష్టర్‌ పట్టుకుని 
వెన్నెల్లోకి వచ్చింది. పచ్చికపై పడుకుంటే మనసు ఉల్లాసంగా ఉంది. ట్రాన్సిస్టర్‌లో 
వచ్చే కర్ణాటక సంగీతానికి తన గొంతు కలిపి సన్నగా పాడుతూ పడుకుంది. 
పిలువడానికి రెండుసార్లు వచ్చి, ఆమె ఆనందానికి అంతరాయము కల్గించలేక 
వెళ్ళిపోయింది మంగమ్మ. బయటనుండి వచ్చిన మధు, రాధిక వాడిచూపులు 
లెక్కచేయక భార్యను వెతుక్కుంటూ ఆమె పడుకున్న చోటకి వచ్చాడు. తెల్లని, 
వెంకటగిరి చీరలో శరీరపు ఒంపులు దాచుకోలేక పోతుంది. కొందరు గర్భవతులు 
శరీరము లావెక్కి వికారంగా కనిపిస్తారు. శశిరేఖ మాత్రం అందంగా కనిపిస్తుంది. 
మోయలేని బరువు అన్నట్టు ఉంది. 





మాదిరెడ్డి సులోచన కథలు 1 15 


“శ్రలీ,” 

“మీరా” తిరిగిచూచింది. 

అతని కళ్ళు చల్లని వెన్నెలలు కురుస్తున్నాయా అన్నట్టు ఉన్నాయి. ట్రాన్సిస్టర్‌ 
ఆఫ్‌ చేసింది. అతని కళ్ళల్లోకి చూస్తూ - 

“ఊం. రాణిగారూ విహరిస్తుంటే” ఫక్కున నవ్వింది. 

“పడుకున్నాను దొరగారూ” అన్నది. 


“నిన్నిలా చూస్తూంటే మాటలు తడబడుతున్నాయి. నెమ్మదిగా వచ్చి ఆమె 
తలవైపు కూర్చున్నాడు. ఆమె అతని ఒడిలోకి ఒరిగిపోయింది. 


“ఇలా వెన్నెలలో పడుకుంటే హాయి ఉందండీ” 


“అలాగా పాపం. రోజూ ఉండదుగా. నాకు నీ సాన్నిధ్యమే. వెన్నెలలాగా 
ఉంటుంది శశీ. నాకింతటి ఆనందాన్ని యిచ్చిన నిన్ను యెలా పూజించాలి.” 

“పూజలు పునస్మాఠాలు వద్దులెండి. ఇలా (ప్రేమగా చూస్తే చాలు”. 

“అల్ప సంతోషివి శశీ! యెప్పుడూ ఏవీ అడగవు. ఏ కోరికలు లేవా?” 

“యెందుకులేవు? అవి అడక్కుండానే తీరుతున్నాయి. అమృతమూర్తి 
అక్కయ్య వల్ల, అనురాగమూర్తి యయిన మీవల్ల” అతని గుండెల్లో తలదాచుకుంది. 
అలాంటి కబుర్లతో కాలం తెలియలేదు. తన రేడియం వాచీకేసి చూచాడు. 
ఒంటి గంట చూపింది. 

“చాలా రాత్రి అయింది శశీ” అతను లేచాడు. ఆమె లేచింది. 

“అబ్బ... కాళ్లు వాచాయి” అన్నది అతను చేతులమీదుగా తీసుకున్నాడు. 

“దించండి.” 

“ఇక్కడ కాదు, మేడపైన” ట్రాన్సిస్టరు తీసుకున్నాడు. 

“బావుంది. దించమంటే-” 

“దించనంటే” ఆమెలాగే సాగదీశాడు. అవలీలగా ఆమె నెత్తుకుని మేడ 
యొక్కాడు. అతను, సంతోషములో, తన కంటే ముందు మరొకరు వెళ్తున్నారన్న 
విషయము గ్రహించలేదు. 

“గదిలో ఉక్కగా ఉంది” అన్నది. 

“అయితే బాల్మానీలో పడుకో ప్రకృవేయలేదు కదూ!” 





|| 16 ప్రీ బుద్దిః ప్రళకయాంతకః 


థి 


“దించండి. నేను తెచ్చుకుంటాను” 
“ఇంట్లో యింత మంది ఉండగా నీవు తెచ్చుకోవటమేం కర్మ” 
“దినమంతా పనిచేసి వారు అలసిపోతారు. వద్దండి.” 


“అయితే మీ అక్కయ్యను పిలుస్తాను. రాధీ... రాధీ...” అంతవరకు 
అవతలి గదిలో నిల్చున్న రాధిక హృదయము కుమ్మరాములా ఉంది. పెదవులు 
బిగపట్టి కోపాన్ని దిగమింగింది. 


“మీకు బొత్తిగా ఏం తెలియదు. దించండీ” అతను భద్రంగా పడకకుర్పీలో 
దించాడు. 


“నేను తెస్తానుండు” గదిలోకి వెళ్ళి పరుపు దిండు తెచ్చి అమర్చాడు. 
తన వస్తువులు తను తీసుకోలేని భర్త... ఈనాడు? రాధిక గదిలోకి పారిపోయింది. 
తను అరుంధతికి ఆస్తి దక్కకూడదనే అనుకుంది. కాని, తన భాగ్యం దొంగిలించ 
బడుతుందనుకోలేదు. తను నిర్మించుకున్న ఆశల సౌధంలోకి అప్సరసలా శశి 
ప్రవెశిస్తుందనుకోలేదు. రూపమేర్పడని సంతానముపై ఆపేక్షతో తనను చెల్లెలికి 
దాసిగా పని చేయమనే భర్త రేపు సంతానాన్ని చూచుకుంటే? ఏముంది - 
శశిరేఖ అతని హృదయాన్ని పరిపాలించే మహారాణి. ఆమెను ఆమె సంతానానికి 
చాకిరీ చేసేదాసి తను. మంగమ్మకు, తనకు భేదం లేదు. 


“ఇంతమంది పనివారుండగా నా పనులు నువ్వే చేయాలా రాధీ-” అనే 
భర్త యెంత తేలికగా అవమాన పరిచాడు. అదంతా వ్యామోహము. 
బంధువులంతా శశిని మాతృస్థానములో కూర్చుండబెట్టి గౌరవిస్తే తను చూడలేదు. 
చూచి భరించలేదు. భర్త తనను విస్మరించి శశిరేఖ చుట్టూ తిరిగితే సహించలేదు. 
సహించి బ్రతుకలేదు. ఒకరోజు మధుసూదన్‌ రాధికల (ప్రేమను చూచి ఈర్య్యపడే 
బంధు జనము, తనను చూచి పరిహసిస్తే భరించలేదు. అన్నింటికన్నా ముందు 
తను తప్పుకోవాలి. యెలా? యెలా? ఆలోచిస్తూ కిటికీ దగ్గర కూర్చుంది. 
సూర్యోదయమయినా ఆమె కనుల ముందు అంతా చీకటిగానే ఉంది. 
అవిరామంగా కురిపించే అశ్రువులు ఒత్తుకుని బయటకు చూచింది. మొక్కలకు 
మందుకొడుతున్న నారయ్యను చూడగానే ఆమె మస్తిష్కంలో మెరుపులాంటి 
ఆలోచన కల్గింది. గుండె నిబ్బరం చేసుకుని బాల్కనీలోకి తొంగి చూచింది. 
నిశ్చింతగా ఒక ప్రక్కకు తిరిగి పడుకుంది శళి. ఆమె ముఖానపడే భాస్మరుడివేడి 
కిరణాలను నిరోధించాలని బాల్కనీలో తెర కడుతున్నాడు మధుసూదన్‌. 





మాదిరెడ్డి సులోచన కథలు 1 17 


“యిందుకూ....” అంది అసహనంగా 


“ఉష్‌...” బయటకు వచ్చాడు. “రాత్రి ఆలస్యంగా నిదురబోయింది. ఏ 
మాత్రం అలికిడి అయినా లేస్తుంది. పద.” ఆమె ముఖం చూస్తే అంతమాట 
అనేవాడే కాదు. బుసలు కొడుతూ భర్త వెనకాలే మేడదిగింది రాధిక. 
రాధామాధవుల మధ్య మరొకరికి స్థానము లేదనుకొన్నది. 


“బెంగుళూరు నుండి వ్యాపారం సాగటం లేదని మేనేజరు ఉత్తరం రాసి 
నెలరోజులయింది. వెళ్ళి విషయాలు కనుక్కోండి.” 

“రేపు వెళ్తాను. అమ్మగారికి సంపాదనపై మోజు పెరిగిందే” అన్నాడు 
నవ్వుతూ 

“మరి పెరక్కపోతే యెలా-” రేపటికి పనంతా పూర్తి చేసి భర్త తిరిగి 
వచ్చేసరికి శోకమూర్తిలా తను మిగిలిపోతుంది. తన శోకము నివారించుటకై 
తన బాధను మరిచి పూర్వపు భర్త తనకు మిగులుతాడు. ఒకరి కొకరం ప్రాణమై 
మిగిలిన జీవితము గడుపుతాం. తమ తదనంతరము ఆ ఆస్తి యెవరికి పోతేనేం 
- గంగలో కలిస్తేనేం” 

“అమ్మను రమ్మని ఉత్తరం రాయండి. నాకేదో భయంగా ఉంది. మీరు 
కూడా దగ్గర లేకుండా వెళ్తున్నారు” అంది శశి. 

“ఇంకా పది రోజులకు కాని ప్రసవించవన్నాడుగా డాక్టరు. రేపు 
సాయంత్రం వచ్చేయనూ! అమ్మగార్మి ట్రంక్‌కాల్‌ చేస్తాను. అన్నింటికి మీ అక్కయ్య 
ఉంది” మృదువుగా భార్య బుగ్గలు నిమిరి బయలుదేరాడు. అతను వెళ్లాక వచ్చి 
మంచముపై పడుకుంది. తోచక పుస్తకం తీసింది. 

“అబ్బ యింకెన్నాళ్ళో ఈ బరువు” అనుకుంది. వారి సంతోషం చూస్తే 
అలాంటి బరువు ఓ బరువేనా అని నవ్వుకుంది. పాలగ్లాసుతో రాధిక 
ప్రవేశించింది. 

“రా అక్కా” లేచి కూర్చుంది. చాలా రోజులకు అక్క తన గదిలోకి వచ్చింది. 
రాధిక వెళ్ళి చెల్లెలి మంచంలో కూర్చుంది. 

“రావద్దామరి. నిన్న మొన్నంటే మీ బావగారు చూచుకొనేవారు” కాస్త 
నిష్టూరంగా అంది. 

“పో నవ్వుతూ ముఖం ప్రక్కకు తిప్పుకుంది. 





|| || 8 స్త్రీ బుద్దిః ప్రకయాంతకః 


థి 


“పోవాలి. మీ బావగారు నీ వెనకాల తిరుగుతూ పనులేం పట్టించుకోవటం 
లేదు. ఈ పాలు త్రాగు. పుట్టబోయే బిడ్డలకెలాంటి రోగాలు రావని మందు 
పంపారు అత్తగారు. అది కలిపాను” పాలగ్లాసు అందించింది. రాధిక చెయ్యి 
వణకడం శశి గమనించనే లేదు. పాలు తీసుకుని గడగడ త్రాగేసింది. 

“ఏం మందక్కా, వెగటు!” ముఖం చిట్లించింది. 

“మందులు తియ్యగా ఉంటాయా....” 

శశికేసి చూడకుండానే బయటికి వచ్చింది. అదిరే గుండెను అదుపులోకి 
తెచ్చుకుంటూ రెండు మెట్లు దిగింది. క్రిందిమెట్ల దగ్గర భర్తను చూచి పాలిపోయిన 
ముఖంతో నిలబడిపోయింది. 

“మీరు.... మీరు...” 

“ఏమిటి రాధీ అలా చూస్తావు? నేనే. టైన్‌ మిస్‌ అయింది” అతను పైకి 
వచ్చాడు. ఆమె చర చర క్రిందికి దిగింది. 

“మీరు వచ్చేశారా” ఆనందంతో లేవబోయిన శశి “అమ్మో” అంటూ 
కడుపు పట్టుకుంది. 

“ఏమిటి శశీ” ఆమె భుజాలను పట్టి కుదుపుతూ అడిగాడు. 

“కడుపులో నొప్పి. అబ్బా భరించలేని నొప్పి... మంచినీళ్ళు” మెలికలు 
తిరిగిపోసాగింది. నీళ్ళు త్రాగించాడు. వాంతి చేసుకుంది. గదంతా వెగటు 
వాసన వెయ్యసాగింది. 

“ఏం... ఏం తిన్నావు” 

“ఏం తినలేదు... అమ్మో అక్కయ్య యిస్తే కప్పు పాలు త్రాగాను.. బావా... 
నా ప్రేవులు... బయటికి వస్తున్నాయి... జాలిగా చూచించి. ఆమెను చేతులపై 
యెత్తుకుని క్రిందికి దిగాడు. 

“మంగమ్మా... నారయ్యా!” అతని అరుపులకు యింట్లోని నౌకర్లంతా 
హాల్లోకి వచ్చారు. 

“జాఫర్‌ను కారు బయటకు తియ్యమను. మంగమ్మా రెండు దిళ్ళు 
తీసుకునిరా. నిమిషాల మీద అన్నీ జరిగిపోయాయి. దుమ్ము రేగి కళ్ళల్లో పడితే 
కారు కదిలిపోయిందని తెలుసుకున్నారు మిగిలిన నౌకర్లు. 

“జాఫర్‌... పోనియ్యి...” కారు నూట ఇరవైమైళ్ళ స్పీడుతో పోతోంది. 





మాదిరెడ్డి సులోచన కథలు 1 19 


“బావా.... నేను.... నేను బ్రతకను” తిరిగిపోతోంది. 


“వద్దు శశీ. ఆ మాటనకు. నా ఆస్తినంతా వెచ్చించి, నిన్ను 
రక్షించుకుంటాను. కదలకుండా గుండెల కదుముకున్నాడు. కారు వెళ్లి ఆస్పత్రి 
ముందాగింది. (స్టెచ్చర్‌ కోసం ఎదురుచూడక ఎమర్జెన్సీ రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. 

“డాక్టర్‌ ఆమెను రక్షించాలి. బిడ్డ ఏమయినా ఫరవాలేదు.” 

“మా ప్రయత్నము మేము చేస్తాము.” అతను వెళ్ళి తలుపువేసుకున్నాడు. 
మంగమ్మతోబాటు మధుసూదన్‌రావు అసహనంగా, అసహాయంగా చూడసాగేడు. 
మరో గంటలో అన్నగారూ, తల్లీ వచ్చారు. “ఐయామ్‌ సారి! మా ప్రయత్నం 
మేం చేశాము. స్టాంగ్‌ పాయిసన్‌-” 


మధుసూదన్‌ శిలలా నిలబడిపోయాడు. “నా తల్లో” అంటూ మంగమ్మ 
తీసే శోకాలు కూడా అతని చెవులకు సోకలేదు. పోలీసులు, గొడవ కాకుండా 
అన్నీ చూచుకున్నాడు శ్రీహరిరావు. 

బిడ్డతో రీవిగా ఇంట్లోకి రావల్సిన శశి విగతజీవియై నిర్మలంగా నిశ్చలంగా 
భర్త ఒడిలో పడుకుని యిల్లుచేరింది. సాయంత్రము వరకు ఆమెను అగ్నిదేవుడికి 
ఆహారంగా సమర్పించి, అందరూ యిల్లు చేరారు. గదిలో శిలా ప్రతిమలా 
కూర్చున్న రాధికలో చలనము కలుగసాగింది. తల గోడకు వేసి బాదుకుంది. 
భర్తను క్షమాపణ కోరాలని యెంతో ధైర్యం కూడకట్టుకుని అయిదారుసార్లు 
లేచి, కూర్చుండిపోయింది. కోళ్ళు కూస్తున్నాయి. నెమ్మదిగా లేచి శశి పడుకునే 
గదిలోకి వెళ్ళింది. రాత్రి భర్త ఆ గదిలోనే పడుకోవటం చూచింది. లైటు వేసింది. 
నలగని పడక ఆమెను వెక్కిరించింది. క్రిందికి దిగబోయింది. 


“ఏం మనుసులో, గొప్పోళ్ళ మనస్సులో కనికరం ఉండదే మంగమ్మా.” 

“ఏం గొప్పో. ఇంత పాపమా” వినలేక మళ్ళీ తన గదిలోకి పరుగెత్తింది. 

మసక వెల్తురులో గది గుమ్మము దగ్గర్లో కాగితము కనిపించింది. ఆత్రంగా 
తీసింది. విప్పింది భార్త వ్రాతే. 

“రాధికా అననా, రాక్షసీ అననా... 


స్త్రీని... కవులు యెంత అందంగా వర్ణిస్తారు. స్త్రీ హృదయము అసూయకు 
ఆలవాలమని నేడో కఠిన సత్యము తెలుసుకున్నాను. మనది (పేమ వివాహము. 
దాని పర్యవసానము ఇంత దారుణంగా వుంటుందని నేను ఊహించలేదు. 





120 స్త్రీ బుద్దిః ప్రకయాంతకః 


థి 


బిడ్డలు లేరని నేను ఏనాడు విచారించలేదు. పసిబిడ్డల చిలిపి చేష్టలు చూసినప్పుడు 
క్షణం చలించినా, ఇంతే రాసిపెట్టి ఉందని సరిపెట్టుకునేవాడిని. నా మెడలు 
వంచి, వద్దో అంటున్నా నాకు తిరిగి వివాహం చేశావు. నా వంశాంకురమునకు 
కారణమైన నిన్ను నా హృదయములో దేవతగా పూజించుకున్నాను. నీవు 
మట్టిబొమ్మవని నాకేం తెలుసు! నా ఊహలకు... తీయని ఊహలకో రూపము 
ఏర్పడకమునుపే, నా ఆశలు, అడుగంటించావు. నీదెంత పాషాణ హృదయము. 
నీవిచ్చిన విషము జెషధంలా త్రాగిన నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలిని చూస్తూ 
యెలా నిగహించుకున్నావు? నీలో యింత అసూయ ఉందని తెలిస్తే ఆ 
అమాయకురాలిని కొట్టేవాడిని, తిట్టేవాడిని, నీ అసూయాగ్నిలో పడి భస్మము 
కానిచ్చేవాడినే కాను. నీ ఆస్తిని, అతిశయాన్ని పంతాన్ని నీకే వదిలిపోతున్నాను. 
యెక్కడికో యెందుకో నాకే తెలియదు....” అంతే తరువాత అలాగే 
విరుచుకుపడిపోయింది. శబ్దం విన్న మంగమ్మ పరుగున వచ్చింది. 


“రాధమ్మో... రాధమ్మతల్లో” అంటూ వచ్చినంత వేగంగా పరుగెత్తుకు 
పోయింది క్రిందికి. 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 121 


ఒక్కమాట ! 


“కాంతీ... క్రాంతీ! నీకీ విషయం తెలుసా?” హడావుడిగా వచ్చింది 
లలిత. 

“ఏ విషయం?” పేపర్‌ ప్రక్కన పడేసి ఆసక్తిగా అడిగాను. 

“తారా, శ్రీధర్‌ విడిపోయారట” అన్నది. 

ఏప్రిల్‌ ఫస్ట్‌ కాదు కదా అని కేలెండర్‌ వంక చూచాను. ఆ రోజు మార్చి 
ఇరవై రెండు. 

“నీకు నమ్మకం కలగటం లేదు కదూ? ఆనోట, ఈనోట విని నమ్మక 
ఇంటికి వెళ్ళాను. శ్రీధర్‌ ఒక్కడే ఉన్నాడు. తార అన్న ఇంటికి వెళ్ళాను. అక్కడ 
నేను ఊహించినట్టే తార ఉంది. నేను అడక్కముందే తనూ, శ్రీధర్‌ విడిపోయినట్టు 
చెప్పింది.” 

“ఎందుకో అడుగలేదా?” 

“ఆమె మాటలకు, నిబ్బరానికి, పొగరుకు హైరానా పడిపోయి అసలు 
సంగతి అడగనే లేదు” అన్నది లలిత. ఎవరెవరు చెప్పారో, ఏ ఆధారాలతో 
చెప్పారో చెబుతుంటే వింటున్నా. 

నామనసు పరిపరి విధాలుగా పోతూంది. 

శ్రీధర్‌, నేను, తారా, లలిత ఎమ్మెస్సీ ఒకేసారి చేశాము. తార చలాకి 
అయిన యువతి. అందం, అందానికి తగిన చాతుర్యంతో మనుషుల్ని 
నిమిషములో ఆకట్టుకుంటుంది. పరిచయస్తులుగా ఉన్న శ్రీధర్‌, తార ఎమ్మెస్సీ 





122 మాదిరెడ్డి సులోచన కథలు 


ఫైనల్‌లో ప్రేమికులయ్యారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ అందరికీ తెలుసు. ఒకరి కోసం 
ఒకరు పడే ఆరాటం, ఒకరిపట్ల ఒకరికున్న ఆరాధన, ఒకరిపై ఒకరు పెంచుకున్న 
అనురాగం నాకూ బాగా తెలుసు. వాళ్ళ కబుర్లన్నీ ఏ రోజుకారోజు నాకు చెబితే 
గాని తోచేది కాదు తారకు. 

ఎమ్మెస్సీ ఫైనల్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్ష ముందు గంభీరంగా 
ఉండవలసిన వాతావరణం నవ్వుల జల్లుకురిసినట్టుంది. మా క్లాస్‌మేట్స్‌ అంతా 
పకపక నవ్వుతున్నారు. తెల్ల చీరలో సిగ్గుల మొగ్గలా నిల్చుంది తార. 

“ఏమిటర్రా?” అన్నాను కుతూహలంగా. నేను అప్పటికే వివాహితురాలిని 
కావటం మూలాన అందరూ గౌరవంగా చూస్తారు. పెద్దరికం అంటగడతారు. 

“రా క్రాంతీ, మన తార, శ్రీధర్లు ఈ రోజే జంటగా కూర్చుంటున్నారు. 
కూడబలుక్కుని తెల్ల దుస్తులతో వచ్చారు చూడు.” నందకుమార్‌ చెప్పాడు. 
చుట్టూ చూచాడు. కొద్ది దూరంలో శ్రీధర్‌ నిలబడ్డాడు. అతని ముఖం ఎర్రగా 
ఉంది. అప్రయత్నంగా మా చూపులు కలుసుకున్నాయి. 


“చూడు క్రాంతీ! కాకతాళీయంగా మా నంబర్లు ప్రక్క ప్రక్కన పడితే...” 
ఆరోపణగా అన్నాడు శ్రీధర్‌. 

“ఓయ్‌... కొయ్యకు కోతలు. తెల్లబట్టలు కూడా కాకతాళీయంగా 
ధరించారా?” లలిత అడిగింది. లలితకు అసలే వాళ్ళంటే కోపం. శ్రీధర్‌ను 
తను అభిమానించింది. అతను రెస్పాన్స్‌ ఇవ్వలేదు. లలితను మొదటి 
పరిచయంలో అయితే ఇట్టే అభిమానిస్తాం. మాటలనిండా మధువే కురిపిస్తుంది. 
ఆ చనువు, ఆప్యాయత చూస్తే మతిపోతుంది. కాస్త నిదానించి, లలితను గమనిస్తే 
ఆమె మాటల్లో డెబ్బెఐదు శాతం అబద్ధం, ఇరవైఐదు శాతం నప్పు అని తేలుతుంది. 
లాబ్‌లో రౌండ్‌బాటమ్‌ ఫ్లాస్క్‌ చూడగానే లలిత గుర్తుకు వస్తుంది నాకు. 
నందకుమార్‌, రహీమ్‌ వాళ్ళంతా కాలక్షేప బఠాని అంటారు. కబుర్లు ఊరించి, 
మసాలా రంగరించి కలిపి మరీ చెబుతుంది. లలితకు తారంటే ఓ విధమైన 
ఈర్ష్య. కాని బయటపడదు. అందుకే శ్రీధర్‌ని నిలదీసింది. 

“విలీవ్‌ మి - అసలు అనుకోలేదు” శ్రీధర్‌ సంజాయిషీ. “మీరు 
కావాలనుకుని కట్టుకున్నారో అలా కలిసి వచ్చిందో మాకు తెలియదు. సాయంత్రం 
ఇద్దరూ కలిసి పార్టీ ఇవ్వాలి.” అందరూ పట్టు పట్టి పార్టీకి ఒప్పించారు. (ఫ్రొఫెసర్‌ 
రావటంతో అందరం కూర్చున్నాము. ఆయన కూడా వాళ్ళిద్దరిని చూచి - 


"ఒకమాట! 123 


ముసి ముసిగా నవ్వాడు. అదో ప్రత్యేక ఘటనగా మేం గుర్తించుకున్నాం. దానికి 
వికారమైన రంగులు పూసి లలిత ప్రచారం చేసింది. ఆ నాడు అతనలా ప్రక్కన 
ఉండటంతో సరిగ్గా రాయలేక ఫస్ట్‌క్లాస్‌ మిస్‌ చేశానంటుంది తార. ఏమయితేనేం, 
ఆ తరువాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అతను రీజినల్‌ రిసర్చి 
లాబొరేటరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తూంది. 
చీకు, చింతా లేనట్టు స్కూటర్‌పై తిరిగే ఆ జంటను నేను యెరుగుదును. 
ఒకొక్కసారి తార దూకుడుగా ప్రవర్తించినా శ్రీధర్‌ సర్దుకు పోయేవాడు. 


“నేను చెప్పింది వినిపించిందా?” లలిత రెట్టించింది. 


“ఆం... వింటున్నాను. మన సమస్యలే మనకున్నాయి. ఇతరుల గురించి 
యెందుకు ? కొత్త పుస్తకాలేం చదివావు?” మాట మార్చాను. “స్నేహితురాలి 
పట్ల ఉన్న అభిమానమింతేనా!? అన్నట్టు. ఒక ఆశ్చర్యకరమైన భావం కనపడిందా 
కళ్ళల్లో. లలిత లాంటి వారితో చాలా ప్రమాదం. మాట్లాడినప్పుడల్లా మనం 
ఊకొడితే మనమే మాట్లాడామనే చమత్సారి. పూర్తిగా ఉద్యోగ విషయాలు 
మాట్లాడుతూంటే నిరుత్సాహంగా లేచిపోయింది లలిత. వెడుతూ అసలు విషయం 
చెప్పింది. “అయినా తార కదేం బుద్ది! ఓ బిడ్డ తల్లి కూడాను. ఫలానా... 
గొప్పవాడిని ఉంచుకుందట” అన్నది. నాకు ఆశ్చర్యం కలుగలేదు. నవ్వు వచ్చింది. 
ఫక్కున నవ్వేశాను. 

“నా మాటలు నవ్వులాటగా ఉన్నాయా?” 

“అబ్బే.... అదికాదు. తార టేస్ట్‌కి నవ్వు వస్తూంది” అన్నాను. లలిత 
వెళ్ళిపోయింది. పిల్లలు ఆటల నుండి రావటంతో ఆ విషయం మరిచిపోయాను. 
రాత్రి పడుకునేటప్పుడు మావారు కూడా అదే విషయం చెప్పారు. నమ్మక 
తప్పలేదు. మర్నాడు కాలేజి నుండి వస్తూ తార దగ్గరకు వెళ్ళాను. 

“ఓయ్‌ ! క్రాంతీ, నేనొక గొప్పవాడిని ఉంచుకున్నాను. మా ఆయన్ని 
వదిలేశాను.” అన్నది నవ్వుతూ. కళ్ళు వర్శిస్తున్నాయి. పిచ్చిపట్టిందా అనిపించింది. 
ఆ తరువాత ఏడ్చి మనసు తేలిక పరుచుకుంది. 

“ఇదమ్మా వరస. పనికిమాలినవారు అనుకుంటున్నారని ఈవిడ ఇలా 
బాధ పడుతూంది” వాళ్ళ వదిన నిష్టూరంగా అన్నది. అన్న పిల్లలు చుట్టూ చేరి 
తమాషా చూస్తున్నారు. అలా వెళ్లామని తనను లేవదీశాను. ఇద్దరం దగ్గరలో 
ఉన్న పార్మ్‌కి వెళ్ళాం. అసలు సంగతేమిటని అడిగాను. 


124 ఒకమాట 


“ఆ మధ్య ఢిల్లీ కాన్ఫరెన్స్‌కి వెళ్ళాం గుర్తుందా?” తార అడిగింది. 

“అవును. మాకూ ఆహ్వానం వచ్చింది. మేం రాలేదు.” 

“పింకి - చిన్న పిల్ల - నేను వెళ్ళనన్నాను. ఆదర్శ పురుషుడు నా 
మొగుడు వెళ్ళూ, వెళ్ళూ, నలుగురినీ చూడు అంటూ పోరాడు. ఆఖరి క్షణంలో 
అన్నయ్య కూడా బలవంతం చేసి పింకిని ఉంచుకుంటానంటే బయలుదేరాను. 
మనమేమి లక్షాధికార్లమా అని ఆయన ప్లేన్‌లో వెళ్ళమంటే రిజర్వేషన్‌ లేకుండా 
బండిలోనే బయలుదేరాను. టి.సి.లతో చెప్పి ఏదో ఒక ఏర్పాటు చేసుకుందామని. 
ఒక రాత్రి గడిచింది. టి.సి. నేను అడిగిన విషయం పట్టించుకోనేలేదు. ఓ 
స్టేషన్లో ఘర్షణ పడుతుండగా, మా నాన్నగారి చిన్ననాటి స్నేహితులు, పలుకుబడి 
గల వ్యక్తి కలుగజేసుకుని అసలు విషయం కనుక్కుని, తన కంపార్ట్‌మెంటులోకి 
మార్చించారు. నేను మొహమాటంతో వద్దనబోయినా ఆయన వినిపించుకోలేదు. 


“అదేంటమ్మాయ్‌! మీ నాన్న పిలిస్తే వెళ్ళవా? నాకూ తోచటం లేదు” 
అన్నారు. ఆయనను చూచి టి.సి. కుక్కిన పేనులా నమస్కరించాడు. 


“ఫస్ట్‌ క్లాసులో అయినా రెండు రోజుల ప్రయాణం బోరుకొడుతుంది. 
ఆరోగ్య రీత్యా విమానం యొక్కకూడదు...” ఆయన ఆయాసపడిపోయారు. ఆయన 
గుమస్తా మందులిస్తూ వెంటే ఉన్నాడు. ముగ్గురం పేకాడుతూ, ఢిల్లీ వెళ్ళాం. 
దిగి హాయిగా వెళ్ళిపోకూడదూ? లలితతో పాటు దిగిన మరో ఇద్దరిని ఆయనకు 
పరిచయం చేసి నా కొచ్చిన సమస్య, ఆయన విడదీసిన చిక్కు అన్నీ చెప్పాను. 
మా అందరినీ ఆయన సరదాగా ఓ పూట భోజనానికి పిలిచాడు. లలిత అతని 
జెదార్యాన్ని పొగిడింది. ఇంద్రులు, చంద్రులు అన్నది. ఆయన కార్లో ఊరు 
చూడాలనే కోరిక వ్యక్తం చేసింది. తిరిగాం. ఇక్కడికి వచ్చి నాకు అతడికి 
సంబంధమని, ఒకటేమిటి... నోరు రావటం లేదు.” మరోసారి బోరుమంది. 
నాకు జాలేసింది. 

“ఆ నీలివార్తలు, గాలి కబుర్లు శ్రీధర్‌ ఎలా నమ్మాడు?” జవాబు చెప్పక 
ముఖం తిప్పుకుంది తార. చీకటిపడింది. నేను ఎన్నిరకాలుగా అడిగినా 
ఒకటేమాట. 

“నా దురదృష్టం.... పోనివ్వు” అంటుంది. ఇద్దరం ఇంటికి వచ్చాము. 
హాల్లో కూతుర్ని ఎత్తుకుని, తార వదినతో మాట్లాడుతున్నాడు శ్రీధర్‌. తార 
ముఖం తిప్పుకుని లోపలికి వెళ్ళింది. కాసేపు లోకాభిరామాయణం, కాఫీలు 





మాదిరెడ్డి సులోచన కథలు 125 


అయ్యాయి. మేం బయటి నుండి రావటం చూచి విషయం (గహించినట్టున్నాడు 
శ్రీధర్‌. 

“ఏం చెప్పింది మీ స్నేహితురాలు?” అన్నాడు. 

“తార నాకేం చెప్పలేదు. కాని, లలిత విషయం తెలిసిన మీరే ఇలా 
అనుమానిస్తే...” 

“నేను అనుమానించి వెళ్ళగొట్టానని చెప్పిందా?” రోషంగా మధ్యలోనే 
అందుకున్నాడు. 

“అందరూ అనుకుంటున్నారట, మీరు విడిపోయారని...” 


“ఈ ఇడియెట్‌ తొందరపాటు వల్ల అనుకుంటున్నారు. నలుగురు నాలుగు 
మాటలు అనుకుని గుసగుసలాడుతుంటే “కాస్త జాగ్రత్తగా ఉండకూడదూ? ఈ 
రూమర్స్‌ వింటూ నిగహించుకోవటం ఎంత నరకమో” అన్నాను. ఆ మాత్రం 
అనకూడదా? నెనూ మనిషినే. చికాకులుండవా?” 


“ఆ మాత్రం అంటే పరుగెత్తుకొచ్చే మూర్భురాలిని కానని క్రాంతికి బాగా 
తెలుసు” తుఫానులా వచ్చింది తార. ఊపిరి వేగంగా తీస్తూ, 


“ఏమో యెవడికి తెలుసు. అతనితో తిరిగావేమో అంటాడా? నా తండ్రి 
కంటే పెద్దవారు, పూజ్యులు, ఆయనతో తిరుగుతానట. ఈయన అనుమానం...” 
రోషంతో ఏదో గొంతుకు అడ్డం పడింది. అందరూ అంటే అంతగా 
బాధపడనుగాని, అందరితోనూ ఆత్మీయులూ చేరితే!” 

“తారా ! సెన్స్‌లెస్‌గా మాట్లాడకు... చూడు క్రాంతీ, మీ స్నేహితురాలి 
కోపం! “అందరూ అన్నవి మీరు నమ్ముతున్నారా... మీరు నమ్ముతున్నారా?” 
అంటూ పదిసార్లు రెట్టించింది. అసలే చికాకుగా ఉన్నాను. కొందరు 
విషపూరితమైన నవ్వు నవ్వుతూ, ఏమోయ్‌ శ్రీకాంత్‌ ! ఫలానా “పలుకుబడిదారు” 
మీ ఆవిడకు క్లోజట. కాస్త నాపని...” అంటూ మొదలు పెట్టారు. ఇలాంటివే 
విని, విని విసుగెత్తి ఇంటికి రాగానే కాస్త చికాకుపడిన మాట వాస్తవమే...” 


“నన్ను అనుమానించిన ఈ ఇంట్లో నేనుండను” తార అన్నది. 
“పోనీ ఇల్లు మారుద్దాం” వాతావరణం తేలిక చెయ్యాలని అన్నాడు శ్రీధర్‌. 


“చాల్లెండి వోన్యం. మీ మెరమెప్పులకు పొంగిపోను. నాకు 
మండిపోతూంది.” 


126 యాల! 


“చూడు క్రాంతీ ! తను ఎన్నిసార్లు నన్ను అనుమానించిందో అడుగు...” 
ఇంకా ఏదో చెప్పబోయాడు. 

“చాల్లెండి ప్రతాపం! బయట తాళం వేస్తారు. కిటికీలు పెద్ద, పెద్దవి. 
దొంగ దూరినా దిక్కులేదు. వెళ్లండి” అన్నది కసురుకుంటూ. 

“నువ్వూరా...” అన్నాడు. 

“వెళ్ళు తారా! తెలిసిన సంగతేగా! లలిత మాటలు పట్టించుకుంటావా!” 
అన్నాడు. 

తార వదిన నేను భోజనం చేసేవరకు వదలలేదు. 

“నిన్ను వదిలివస్తాను రా క్రాంతీ” శ్రీధర్‌ స్కూటర్‌ తీశాడు. 

“మీ ఆవిడకు అనుమానాలని ఇప్పుడే చెప్పావు. వద్దులే బాబూ.” 

“ఏయ్‌! ఏమిటే వాగావు?” తార కోపంగా చూచింది. 

“నేను రిక్షాలో వెళ్ళగలను గాని, మీరు వెళ్ళండి. విష్‌ యూ హాప్పీ నైట్‌” 
అన్నాను. 

“థాంక్స్‌” చిన్నగా నవ్వాడు శ్రీధర్‌. కొరకొర చూచింది తార. వాళ్ళ 
స్కూటర్‌ వెళ్ళిపోయాక తేలికగా నిట్టూర్చాను. తార అన్నకు, వదినకు చెప్పి 
ఇంటికి వచ్చేశాను. జీవితంలో ఇలాంటి అవమానాలు, అనుమానాలు అందరికీ 
తప్పవేమో అని నేను, మావారు అనుకున్నాము. 

నెల రోజుల తరువాత, ఈ అనుమానం తేలికగా తుడిచి పెట్టుకుపోలేదని 
అర్ధం అయింది. లలిత, తార ఒకే కాలేజీలో పని చేస్తారు. అక్కడి విసుర్లు, 
గుసగుసలు భరించలేకపోయింది తార. అందరూ వింత వ్యక్తిని చేసి చూడటం. 
కాలేజి కాలం నాటి నుంచి గ్రంథసాంగురాలేనట. పరీక్ష రోజే ప్రణయం పాకాన 
పడిందట తార విషయం విద్యార్థుల వరకు వెళ్ళిందట. అది భరించలేక రిజైన్‌ 
చేసింది. మరో నెల తరువాత శ్రీధర్‌ వచ్చి తనకు తిరుపతి కాలేజీలో లెక్చరర్‌ 
ఉద్యోగం వచ్చింది - వెడతానన్నాడు. 

“అదేం! బంగారంలాంటి సెంట్రల్‌ గవర్నమెంటు ఉద్యోగం!” మేమిద్దరం 
ఆశ్చర్యపోయాము. 

“కాంతీ ! స్త్రీలకే సమస్యలని మీరు అనుకుంటున్నారు. ఆఫీసుల్లో క్రబ్బుల్లో 
నా విషయంలో జరిగే ప్రచారాలు వింటుంటే..” అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. 





మాదిరెడ్డి సులోచన కథలు 127 


“మూర్తుల మాటలకు అంత ప్రాముఖ్యం ఇస్తావా?” 

“మూర్తులు... రోజూ ముఖాలు చూచే మనుషులు. నేనూ మనిషినే. 
ఏదో ఒకరోజు ఆవేశంలో ఎవరినో ఒకరిని హత్య చేసినా ఆశ్చర్యపోవద్దు. 
అందుకే.... అందుకే ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళిపోతున్నాం” అతని 
మాటల్లోని ఆవేదన వర్ణించలేను. 

“అక్కడ మాత్రం ఇలాంటివి ఉండవా?” 

“స్పేహాలకు, పరిచయాలకు స్వస్తి చెబుతాను” అన్నాడు. ఒక్క మాట 
యెంత అనర్థాలను సృష్టించగలదో అర్థం అయింది. లలితలాంటి స్త్రీలే స్రీలకు 
శత్రువులు. హత్యలు కత్తులు పట్టుకు చెయ్యక్కరలేదు. ఇది హత్య కంటే 
ఘోరమయింది. నిజమే. మనిషికి మనశ్శాంతి కావాలి. అది లేనినాడు ఎన్ని ఉ 
న్నా వ్యర్థం. లలితలాంటి ప్రీలను ఏమీ చెయ్యలేము. ఏ చట్టమూ శిక్షించలేదు. 
భారంగా శ్రీధర్‌ను సాగనంపాము. 


(0 


128 కహా 


రంగప్రవేశం 


ఆ రోజు ఆదివారం. ఆ ఒక్కరోజే బయటికి వెళ్ళాలన్నా సినిమా 
చూడాలన్నా తెరిపిగా ఉంటుంది. సినిమా ప్రోగ్రామ్‌ను వేసుకున్నాము. కాని 
మా రేణు రవీంద్ర భారతిలో డాన్స్‌ ప్రోగ్రాముంది వెడదామని పట్టుపట్టింది. 
ఒక్కతే కూతురంటూ శ్రీవారు అతి గారాబం చేస్తారు. అందుకే కూతురు చెప్పినట్టే 
డాన్స్‌ చూద్దాం అన్నారు. “వంటా, వార్పు అంటూ హడావుడి చెయ్యకు. వి 
హోటల్‌లోనో భోజనం చేద్దాం. చేంజ్‌ ఉంటుంది” అన్నారు. ముగ్గురమూ 
తయారయ్యాము. 

“మాలతీ !... ఓ మాలతీ...” మా ప్రక్క వాటాలో ఉండే ఇంజనీరుగారి 
భార్య పిలుపది. మేము నాల్లు సంవత్సరాలుగా కలిసి ఉన్నాము. 

అప్పుడప్పుడు మనస్పర్థలు వచ్చినా, సర్దుకుపోతూ ఉంటున్నాము. 

“రా పద్మా... ఏమిటి?” అంటూ బయటికి వచ్చాను. ఆమె ముఖం 
చిటపటాలడుతున్నది. 

“ఎక్కడికో ప్రయాణం అయినట్టున్నావు... ఓ... సారీ, అడగకూడదేమో!” 
అంది ఆమె. 

“లేదు పద్మా... నా కలాంటి పట్టింపు లేమీ లేవు. డాన్స్‌ ప్రోగ్రాముంటే...” 

“ఏం డాన్సులో ఏం పిల్లలో! రేణూ పెరుగుతున్నదన్న సంగతి తెలుసా 
నీకు?” తీవ్రంగా అడిగింది. 

“తెలియకేం? అందుకే వెడుతున్నాం. అమ్మాయి మాట మనమూ వినాలి 
కదా..?” అన్నాను నేను. 





మాదిరెడ్డి సులోచన కథలు 129 


“ఏడ్చినట్టే ఉంది తెలివి. మీ రేణును చూచి మా లత చెడిపోతున్నది 
మాలతీ!” 

ఆమె మాటలు నేను భరించలేకపోయాను. 

“పద్మా!” 

“అవును. అదుపులో పెట్టుకోకపోతే లాభం లేదు.” 

“ఏం చేసింది?” అన్నాను కోపం దిగమింగుతూ. 

“ఇంకా ఏం చేయాలి? డాన్సులు తైతక్కలంటూ మా లతను పాడు 
చేస్తున్నది. అయినా డాన్సులు ఒళ్లమ్ముకుని బ్రతికే వారికిగాని మన కెందుకు...?” 

“పద్మా! నీ భావం నాకు అర్థం అయింది. రేణు ఇక ముందెప్పుడూ లత 
దగ్గరకు రాదు... వెళ్ళు...” అన్నాను. నా రక్తం సల సల కాగిపోతున్నది. ఎంత 
మాటన్నది? 

పద్మ వెళ్ళిపోయింది. 

“రేణూ!” నా కేక నాకే వికృతంగా వినిపించింది. 

“ఏమిటి మాలతీ?” శ్రీవారు వచ్చారు. ఆయన ముఖం గంభీరంగా 
వుంది. 

“అది కాదండీ, మన బతుకు మనం బతుకుదామంటే ఈ పిల్లకు పెత్తనాలు 
ఎక్కువయ్యాయి...” 

“అమ్మా! ఆవిడ మాటలు పట్టుకుని నువ్వూ తొందర పడుతున్నావా? 
లతకు డాన్స్‌ అంటే యెంత ఇష్టమో! నేను ప్రాక్టీస్‌ చేస్తుంటే తనే వస్తుంది. 
నన్ను అనుకరిస్తుంది!” రేణు నిదానంగా చెప్పింది. 

“అది సరే, ఈ రోజు ఏం జరిగింది?” 

“తనూ నాట్యం చూడాలని కుతూహలపడింది. ఆంటీని అడిగితే 
తిట్టిందట. మనతో వస్తానంది. సరే రమ్మన్నాను. మా డాన్స్‌ మాష్టారు తనకు 
వచ్చిన కాంప్లిమెంటరీ టికెట్టు ఇచ్చారు. అది లత కిచ్చాను!” అన్నది రేణు. 

“చూడమ్మా ! పేరెంట్స్‌ ఇష్టం లేని పని పిల్లల చేత మనం ఎందుకు 
చేయించాలి? ఇక మీద ఇలాంటివి జరగకూడదు...” మావారు కాస్త కఠినంగానే 
చెప్పారు. సమయం అయిందని బయలుదేరాము. గేటు దాటి, గేటు వేస్తూ 
అప్రయత్నంగా వెనక్కు తిరిగి చూచాను. పద్మ వాళ్ళ పడక గదిలోనుండి రెండు 


|| 3 0 రంగప్రవేశం 


కళ్ళు, నీటితో నిండినవి... మమ్మల్నే చూస్తున్నాయని గ్రహించాను. ఒక నిట్టూర్పు 
వదిలి ముందు వెడుతున్న తండ్రీ కూతుళ్ళను అనుసరించాను. 

యాంత్రికంగా నడుస్తున్నాను. నా ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. 
పద్మ విచిత్రమైన మనిషి మగవారితో సమానంగా నిలబడి జవాబు చెప్పే 
ప్రీలకు శీలం లేదనుకుంటుంది. అంతేకాదు, చేతికి గాజులు లేని ప్రీలను చూచి 
మూతి విరుస్తుంది. వారంలో నాల్లుసార్లు ఉపవాసం చేస్తుంది. అయితే అవి 
ఆమె సొంత వ్యవహారాలు. 

సినిమాకు వెడదాం అంటే “మాలతీ, చవకబారుగా ఉంటాయి సినిమాలు! 
ఎందుకొచ్చిన సినిమాలు బాబూ!” అనేది. 

“బావుంది. (ప్రతిచోటా మంచి చెడులు రెండూ ఉంటాయి. 
కాలక్షేపమవుతుంది.” 

“కాలక్షేపానికే కరువు వచ్చిందా? నా దగ్గర పతివ్రతల కథలున్నాయి 
చదువు” అనేది. నా కలాంటప్పుడు బాధ కలిగేది. (స్త్రీ తనను తానే వంచించు 
కుంటుందా. ఆమెను ఎవరయినా వంచిస్తున్నారా అన్నది ఆలోచింప తగిన 
విషయం. అయితే ఇలాంటి అభిప్రాయాలతో ముందుకు సాగేదెలా? 

ఇంజనీరుగారికి తన క్యాంపులు, లెక్కలు తప్ప మరో గోల తెలియదు. 
లత తరువాత ఇద్దరు మొగ పిల్లలున్నారు. ఎప్పుడయినా పద్మ ఆ పిల్లల గురించి 
చెబితే గట్టిగా అరుస్తాడు. అంతే. 

ఒకరోజు సినీ ఆర్టిస్ట్‌ శ్రీకళ డాన్స్‌ ప్రోగ్రాముందని మేము తయారయ్యాం. 
లత తాను కూడా వస్తానని తయారయింది. 

“ఆంటీ! అమ్మను మీరొక్కసారి అడగండి!” అన్నది. 

సరేనని వెళ్ళి అడిగాను. అప్పటికి పద్మ స్వభావం పూర్తిగా తెలియదు 
నాకు, “మీ అన్నయ్య గార్ని అడుగు!” అన్నది. ఆయన కేంప్‌ నుండి 
యొప్పుడొస్తాడు! లతను ఎప్పుడు పంపిస్తాడు? భార్యకు తన పిల్లలను బయటకు 
పంపే స్వతంత్రం ఇవ్వని పురుషుల మీద అసహ్యం వేసింది. ఆ తరువాత 
మెల్లగా అర్థం అయింది - ఆయన్ని అడ్డం పెట్టుకుని ఈవిడే నాటకం 
ఆడుతున్నదని! 

పూర్తిగా ప్రపంచం తెలియనిది అందామా? అంటే కాదు. తనూ 
గ్రాడ్యుయేటు. ఏమిటో వింత మనస్తత్వం! 





మాదిరెడ్డి సులోచన కథలు 13 1 


హాలు చేరినాక బలవంతంగా నా ఆలోచనలు కట్టిపెట్టాను. తెలిసినవారు 
పలుకరిస్తుంటే, నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి వెళ్లాము. నిజమే - ప్రపంచంలో 
ఎన్నో సమస్యలున్నాయి. చెడ్డ వారున్నారు. మంచివారున్నారు. మనం 
మడికట్టుకుని ఇంట్లో కూర్చుంటే మంచి చెడుల మధ్య తేడా యెలా తెలుస్తుంది? 


పది నిమిషాలు ఇంటర్‌వెల్‌లా ఇచ్చారు. అందరూ బయటికి వచ్చారు. 
నేను లేచాను. తలుపు దగ్గర లత నిలబడి ఉంది. 

“ఎలా వచ్చావు లతా!” అని అడిగాను. 

“అమ్మా, నాన్న రామకృష్ణ మఠం వెళ్లారు ఆంటీ. తమ్ముళ్ళకు చాక్లెట్లు 
కొనిచ్చి, వరండాలో కూర్చుని ఇల్లు చూడమని వచ్చాను.” ఆ పిల్లను లోపలికి 
పిల్చుకుపోయి, చివర్న ఏదో ఏర్పాటు చేశాము. ప్రోగ్రామ్‌ అయిపోయింది. 
అంతా హోటల్‌లో భోజనం చేశాము. భోజనం అయ్యాక “ఆంటీ, మీరు 
వెళ్ళండి. అమ్మ మీతో వస్తే నన్ను తిట్టేదికాక మిమ్మల్నీ తిడుతుంది!” అన్నది 
లత. 

“ఇంత చీకట్లో ఒంటరిగా యెలా వస్తావు ? ఆమె తిడుతుందని నిన్ను 
ఒంటరిగా వదిలేస్తామా? పద!” అన్నారాయన. టాక్సీలో ఇల్లు చేరాము. 
అప్పటికింకా పద్మ రాలేదు. పిల్లలిద్దరూ వరండాలో పడి నిద్రపోతున్నారు. 

“లతా! ఇలా రావద్దమ్మా! ఇల్లు ఏదయినా అయితే... పిల్లలు నిద్రపోయాక 
యెవరయినా జొరబడి సామాన్లు తీసుకుపోయే ప్రమాదముందమ్మా” అన్నాను 
మందలింపుగా. 


లత తలవంచుకుంది. పిల్లలలో అంతర్లీనమయిన ఉత్సాహానికి కొంత 
వరకు తల్లిదండ్రులు ప్రోత్సాహమివ్వాలేగాని అధికారం చూపుతూ ఆంక్షలు 
పెడితే వారెంతవరకు ఆచరిస్తారన్న విషయం ఆలోచించాలి. 'మా కాలం” అంటూ 
చాలా మంది చెబుతుంటారు. సామాజిక పరిణామంలో పిల్లల యెడ తల్లిదండ్రుల 
దృక్పథం కూడా మారాలి. బలవంత పెట్టి పద్మ లతను ఆపగల్లిందా? లేదు. 
ఇంట్లోకి వచ్చేను. రేణు బట్టలు మార్చుకుని హార్లిక్స్‌ కలుపతున్నది. ఆ కళ్ళల్లో 
తృప్తీ, సంతోషమూ పోటీ పడుతున్నాయి. 

నెల రోజుల తర్వాత ఓనాడు మధ్యాహ్నం పని కాగానే పత్రిక పట్టుకుని 
కూర్చున్నాను. పద్మ ఆదరాబాదరాగా వచ్చింది. ఆమె ముఖంలో భయాందోళనలు 
స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


|| 3 2 రంగప్రవేశం 


“రేణు ఎక్కడికి వెళ్లింది మాలతీ?” 

“బడికి వెళ్ళింది!” అన్నాను. 

“బడికి వెడుతున్నారో లేదో తెలియదు మాలతీ ! నిన్న లత బడి నుండి 
రిపోర్ట్‌ వచ్చింది. వారం రోజులుగా బడికి రావటం లేదట!” అన్నది పద్మ 
ఆదుర్దాగా. 

“ఈ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలు కదా. ఎక్కడయినా కూర్చుని 
చదువుకుంటున్నారేమో!” అన్నాను. 

“అది... కాదు...” పద్మకు కన్నీరు ఉబికి వస్తున్నది. “ఇంట్లో కొన్ని 
వస్తువులు మాయం అయ్యాయి. దాని బట్టల బీరువా ఖాళీగా ఉంది.” ఇక 
ఆపుకోలేనట్లు బావురుమంది పద్మ. 

ఇద్దరమూ వెళ్ళి మరోసారి వెతికాము. పోలీసులకు రిపోర్ట్‌ ఇవ్వటానికి 
భయపడింది. తెలిసిన చోట్లు, వెళ్ళే ఊళ్ళు వెతికాము. కాలం గడిచింది. లత 
జాడే తెలియలేదు. పద్మ పూర్తిగా దిగజారిపోయింది. ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని 
వేరే ఊరు వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు “అది చచ్చిందనుకుంటాను!” అన్నది 
పద్మ. తనది గాయపడ్డ మనస్సు. నేను ఏం చెప్పగలను? రేణును దగ్గరగా 
తీసుకుంది. కంట తడి పెట్టుకుంది. 

రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. రేణు ఇంటర్‌ పాసయి, మెడికల్‌ 
కాలేజీలో చేరింది. చదువు వైపు పడింది దాని ధ్యాస. డాన్స్‌ ఉత్సాహం రంగ 
ప్రవేశంతోనే ఆగిపోయింది. రెండు, మూడు లోకల్‌ ఫంక్షన్లలో నాట్య ప్రదర్శన 
ఇవ్వమని తెలిసిన వారు అడిగారు. 

“చదువు దెబ్బ తింటుంది - ప్రాక్టీస్‌ చేస్తుంటే నాకు సీటు రావాలమ్మా!” 
అంటూ రేణు అంగీకరించలేదు. మేమూ బలవంతం చెయ్యలేదు. 

మా వారి మిత్రుడి కూతురి వివాహానికి మద్రాసు నుండి ఆహ్వానం 
వచ్చింది. ఒక నెల రోజులు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుని, పెళ్ళి చూచి 
రావచ్చని ప్రయాణం అయ్యాం. మూడు సంవత్సరాలుగా రేణు పరీక్షలు, చదువు 
ఓ దారిన పడాలని యెక్కడికీ వెళ్ళలేదు. ఒక కోర్సులో చేర్చించాము. అది 
కష్టపడో, ఎలాగో పూర్తి చేస్తుందన్న నమ్మకముంది. 

మద్రాసులో దిగాము. సాయంత్రం కుమారి లావణ్య భరత నాట్య 
రంగప్రవేశం ఉందని తెలిసిన ప్రొడ్యూసర్‌ ఆహ్వానించారు. 





మాదిరెడ్డి సులోచన కథలు 133 


“మన పిక్చర్‌లో చిన్న రోల్‌ వేస్తున్నది ఆ అమ్మాయి” అన్నాడాయన. 
పనేముంది... విశ్రాంతి కోసం వచ్చిన వారికి? 

“రేణు ఉంటే బావుండేది!” అని రెండు మూడుసార్లు ఆయన అన్నారు. 
ఎక్కడికి వెళ్ళినా ముగ్గురమూ కలిసే వెళ్ళేవారము. ఆ వెలితి కనిపిస్తూంది. 
ప్రొడ్యూసరు కారు పంపారు. వెళ్ళేసరికే కార్యక్రమం ప్రారంభమయింది. నాట్యం 
చేసే లావణ్యను చూచి ఉలిక్కిపడ్డాను. ఆమె లత! యవ్వనం తాలూకు ముద్రలలో 
ముగ్గ మనోహరంగా మారినా, గుర్తు పట్టగలిగాము. “మాలతీ, మన లత 
కదూ?” ఆయన నిటారుగా కూర్చున్నారు. అతి చాకచక్యంతో నాట్యం చేస్తూ 
చూపరులను ఆకట్టుకుంటున్నది లత. ప్రోగ్రాం ముగిసింది. ఒక్కసారి లతను 
కలిస్తే బావుండును. కాని ఎలా? ఆ నిర్మాతను అడిగితే వివరాలు తెలుస్తాయి 
అనుకుని లేచాము. 


“మిస్‌ లావణ్య మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నది!” అని ఒక యువకుడు 
వచ్చాడు. 

“మమ్మల్నేనా?” సందేహంగా అడిగాను. 

“మిమ్మల్నే!” అన్నాడు అతను. అతని వెనకాల వెళ్ళాము. మేకప్పు 
తీసివేస్తున్నది లత. “ఆంటీ!” అంటూ వచ్చి కౌగిలించుకుంది. అప్రయత్నంగా 
నా చేతులు ఆమెను చుట్టాయి. నా కళ్ళు చెమర్చాయి. “రేణు బావుందా?” అని 
అడిగింది లత. 

“బావున్నావా లతా? రేణు నిన్ను తలవని రోజు లేదు!” అన్నాను. “చాలా 
బావున్నాను ఆంటీ... ఓ... అంకుల్‌ కూడా వచ్చారే? నిజంగా ఈ రోజు నా 
జీవితంలో శుభదినం!” అంటూ నన్ను వదిలి ఆయన కాళ్ళకు నమస్మరించింది. 
ఆయన లేవనెత్తి అక్కున చేర్చుకున్నారు. ముగ్గురికి మాటలు కరువయ్యాయి. 

“మిస్‌ లావణ్యా, బయట మీ కోసం రామన్‌గారు ఎదురు చూస్తున్నారు!” 
అంటూ మమ్మల్ని పిలిచిన యువకుడే చెప్పాడు. 

“సారీ ఆంటీ, రేపు భోజనానికి మా ఇంటికి రండి!” అంటూ త్వరగా 
వ్యానిటీ బ్యాగు సర్దుకుంది లత. 

“మంచిది!” అన్నాను. ఇద్దరమూ హోటల్‌కు వచ్చాము. ఆ తరువాత 
మనసంతా చేదు మింగినట్లుగా ఉంది. ఇద్దరం మౌనంగా గడిపాము. 


|| 3 4 రంగప్రవేశం 


“అంకుల్‌! తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకున్నప్పుడు, ఆ పిల్లలంత 
అదృష్టవంతులుండరేమో! కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచిని 
అణగదొక్కి తమ ఇష్ట ప్రకారం శాసిస్తారు. అలాంటప్పుడు అందరూ కాకపోయినా 
కొందరయినా నాలా బయటపడతారు...” 

“నేను వివరణ అడగలేదు లతా!” అన్నారు ఆయన. 

“అదే, అంకుల్‌! ఆ మాటే చెబుతున్నాను. నేను స్థిరపడ్డ తరువాత 
ఉత్తరం రాశాను. వారు నన్ను మరణించిన వారిలో జమచేశారట. మళ్ళీ 
ఉత్తరం వ్రాయవద్దన్నారు.” 

పద్మ అంత కఠినంగా యెలా ఉండగలిగింది? 

“లతా ! నువ్వు వారిని యెంత క్షోభపెట్టావో నీకు అర్థం కాదమ్నూ” 
అన్నాను నేను. 

“ఎందుకర్థం కాదు! వాళ్ళిప్పుడయినా నన్ను అర్థం చేసుకోవాలని 
ప్రయత్నించారా! అమ్మాయిలతో మాట్లాడినా చెడి పోతాననుకునే స్వభావాన్ని 
యెలా అంచనా వెయ్యాలో మీరే చెప్పండి!” అన్నది. మాట్లాడక కూల్‌డ్రింక్‌ 
తీసుకున్నాము. 

“మన డాన్స్‌ మాష్టారి తమ్ముడిని బ్రతిమాలి ఈ ఊరు వచ్చాను అంకుల్‌. 
చిన్న చిన్న వేషాలు వేస్తూ నాట్యం అభివృద్ధి చేసుకోవాలనుకున్నాను. ఆలోచనకూ, 
ఆచరణకూ చాలా తేడా ఉంటుందని అనుభవం మీద తెలుసుకున్నాను. ఆశకూ, 
ఆశయాలకూ పొత్తు కుదరదని తెలిసింది. ఆశకు నీరుపోసి పెంచాను. 
ఆశయాలను సమాధి చేశాను. నేను ఒక పేరు మోసిన వర్తకుడికి....” అంటూ 
లత నిర్జీవంగా నవ్వింది. ఆమె నవ్వు ఆమె స్థితికి అద్దం పట్టింది. 

“లతా!” అన్నాను బాధగా. 

“అవును ఆంటీ! దీనికి యెవరినీ నిందించను. నన్ను నేనే నిందించు 
కుంటానేమో అవసరం వస్తే...” 

నా హృదయం భారమయింది. ఒక మధ్య వయస్కుడు షర్ట్‌ బటన్‌ 
పెట్టుకుంటూ మేడ దిగాడు. చూడడానికి అందంగానే ఉన్నాడు. “రామన్‌... 
మా ఆంటీ, అంకుల్‌”... అన్నది లత. 

అతను నమస్కరించాడు. ఆ తరువాత ఒక గంట పిచ్చాపాటి మాట్లాడాక 
రామన్‌కు పని ఉందని త్వరగా భోజనాలు వడ్డించారు. భోజనం అయ్యాక 
అతను వెళ్ళిపోయాడు. లత రేణు గురించి అడిగింది. చెప్పాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 13 జ 


“రామన్‌ అవివాహితుడా?” ఉండబట్టలేక అడిగాను నేను. 


“లేదు ఆంటీ! అతని కుటుంబం బొంబాయిలో స్థిరపడింది. వ్యాపార 
రీత్యా నెలలో పది రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది.” 

“జా(గ్రత్తమ్మా!” అనాలనుకున్నాను. కాని అనలేకపోయాను. లత 
మానసికంగా యెదిగిపోయిందేమో! 


“ఇల్లంతా ఆయనే నడుపుతారు ఆంటీ. నా డబ్బు నాది. ఆయన 
పట్టించుకోరు. నా కార్యకలాపాలకు అభ్యంతరం చెప్పరు. ఆం... మీకు 
అభ్యంతరం లేకపోతే సెలవుల్లో రేణును పంపండి ఆంటీ!” 


“తప్పకుండా పంపుతాము!” అని బయలుదేరాము. లత గేటువరకు 
వచ్చి సాగనంపింది. 


“వెళ్ళేలోపున మరోసారి రండి ఆంటీ....” అన్నది లత. 


“అలాగే” అన్నాను. బరువెక్కిన హృదయంతో కారెక్కాను. కాని పొరపాటు 
ఎక్కడ జరిగిందో, ఎవరిదో అని మాత్రం నిర్ణయించుకోలేక పోయాను. లత, 
పద్మ ఇద్దరూ తీవ్ర స్వభావం కలవారే! 


O 


|| 3 6 రంగప్రవేశం 


పుట్టినరోజు 


గో పిచంద్‌ ఇంటికి వచ్చేసరికి రాధ అందంగా అలంకరించుకుని బయటి 
వరండాలో నిలబడింది. అతని కళ్లు ఆనందంతో రెప, రెపలాడాయి. రాధిక 
తను చెప్పాక, ఇంత త్వరగా తయారవుతుందనుకున్నాడా? తమ ఇద్దరి రాకకు 
లక్ష్మి యెంతో సంతోషిస్తుంది. 

విధి విచిత్రమైన నాటకాలు ఆడుతుంది. గోపిచంద్‌ ఏమీ లేనినాడు 
లక్ష్మి ఉన్నవారి అమ్మాయి. దూరపు బంధుత్వం ఉన్నా స్వంత పిల్లలలాగే 
పెరిగారు. పదవ తరగతి పరీక్షలు వ్రాయగానే తమ దారులు వేరయ్యాయి. 
లక్ష్మి తండ్రి వ్యాపారం దెబ్బతిన్నది. గోపిచంద్‌ తండ్రికి ఉన్న పనికిరాని పొలాలు 
ఫ్యాక్టరీలకు తీసుకుని, ఊహించలేని డబ్బు ఇచ్చారు ప్రభుత్వం. 

దాని ఫలితంగా గోపిచంద్‌ ఎం.కామ్‌ చేసి బ్యాంక్‌లో ఉద్యోగం 
చేస్తున్నాడు. క్రింది భాగంలో వచ్చిందని ప్లాట్‌ కొన్నాడు. స్కూటర్‌ ఉంది. 
అయినింటి ఆడపడుచు రాధ ఇల్లాలు అయింది. 

లక్ష్మి తండ్రి కట్నం ఇవ్వలేక, అర్ధ యెకరం పొలం మిగిలిన ఓ రైతుకు 
కూతుర్చిచ్చాడు. లక్ష్మి భర్త ఆ అర్ధ ఎకరం అమ్మి కిళ్లీ కొట్టు పెట్టాడు. లక్ష్మి 
గోపీ... గోపీ అంటూ చనువుగా తిరిగితే రాధ దగ్గర బంధువులు, బాగా 
వున్నవారు అనుకుంది, పెళ్లిలో. 

లక్ష్మి భర్తకు కిళ్లీ కొట్టు వ్యాపారం వినగానే ఆమెకు వికారం కల్లింది. 
భర్తను ఆ ఛాయలకు పోవద్దన్నది. 





మాదిరెడ్డి సులోచన కథలు 137 


లక్ష్మి చిన్నప్పుడు యువరాణిలా బ్రతికింది. కలిమిలేములు శాశ్వతం 
కాదు. కిళ్ళీకొట్టు పెట్టుకోవటం నేరం కాదు” అని గోపిచంద్‌ ఎంత చెప్పినా 
రాధకు వినిపించలేదు. 

లక్ష్మివాళ్ళు వచ్చినా ముభావంగా ఉండేది. 

“బీరకాయపీచు చుట్టరికానికే పూసుకు తిరగాలా?” వాళ్లు వెళ్ళాక ముఖం 
చిట్లించేది. లక్ష్మి స్నేహపాత్రురాలు అని రాధికకు తెలుసు. ఏ ఆఫీసరు భార్య 
అయితే యెంత బావుండేది. 

“రాధీ! దూరం చుట్టమేకాని, చిన్నప్పుడు ఒకే తల్లి పిల్లల్లా పెరిగాము. 
నాకు స్నేహితురాలు” అన్నాడు గోపిచంద్‌. వాళ్ళ కుటుంబంలో తన స్థానం 
వివరించాడు. 

“అబ్బ ! స్నేహం చెయ్యటానికి మనుష్యులే దొరకలేదా, ఆ కిళ్ళీ కొట్టులో 
కూర్చుని చిల్లర సామాన్లు అమ్ముకునే వారు తప్ప” రాధిక విసుక్కుంది. గోపిచంద్‌ 
ఉలిక్కిపడ్డాడు. 

“రాధీ! వాళ్ళు దొంగతనం చెయ్యలేదు. స్వతంత్రంగా, సగర్వగా బ్రతుకు 
తున్నారు” అన్నాడు. 

“పేడ చెరిపేసి పిడకలు కొట్టడం కూడా స్వతంత్రంగా (బతకడమేనా?” 
వెటకారంగా అడిగింది. 

గోపిచంద్‌ చాలా బాధపడ్డాడు. ఇలాగే లక్ష్మిముందు అంటే ప్రమాదం. 
అందుకే లక్ష్మి ఇంటికి ఒంటరిగానే వెళ్ళేవాడు. ప్రతిసారి రాధికను తీసుకురాలేదని 
లక్ష్మి నిష్టూరం ఆడేది. కాని తనేం చేయగలడు? బలవంతంగా యెవరిచేత పని 
చేయించటం ఇష్టం ఉండదు. 

లక్ష్మికి వివాహమయిన ఆరేళ్ళకు కూతురు పుట్టింది. నామకరణోత్సవం 
లాంటివి ఊళ్ళోనే జరిపింది. మొన్నాక రోజు ఇంటికి వచ్చి, బొట్టు పెట్టి 
ఆహ్వానించింది, కూతురు పుట్టిన రోజుట. 

“ఈసారి తప్పించుకుంటే ఊరుకోను వదినా. మా గౌరిని మీరిద్దరూ 
ఆశీర్వదిస్తేనే నాకు తృప్తి” అన్నది. 

“నీకెందుకు లక్ష్మీ! రాధికను నా స్మూటర్‌ వెనుక సీటుకు కట్టి తీసుకు 
వస్తాను” హామీ ఇచ్చాడు గోపిచంద్‌. 


135 పక్టనరోజు 


ఉదయం అపర శ్రీకృష్ణుడై బ్రతిమాలాడు రాధికను. 
“నాకు మీ లక్ష్మి అన్నా ఆమె భర్త చేసే వ్యాపారమన్నా ఇష్టం లేదు. 
నాచేత ఇష్టంలేని పనులు యెందుకు చేయిస్తారు” విసుగ్గా అన్నది. 


“నా కోసం రావాలి రాధీ. నేను వచ్చేవరకు తయారుగా ఉండు. అరగంట 
అలా వెళ్లి, ఇలా వచ్చేద్దాం. ప్లీజ్‌ నువ్వు నా మాటకు విలువ ఇస్తావ్‌...” అని 
అరగంట బ్రతిమాలి వెళ్ళాడు. 


అతని భార్య దర్శనము శుభసూచకంగా కనిపించింది. 

“హాయ్‌ రాధా! మీ స్వీట్‌ డార్లింగ్‌” అన్నాడు ఆనందంగా. 

“అయితే కాఫీలోకి పంచదార వద్దన్నమాట” అన్నది నవ్వుతూ. 

“ఈపూట కారంపొడి కలిపినా త్రాగుతాను” అన్నాడు గోపి. 

“ఏమండీ! మనము దారిలో కాసేపు ఆగి, షాపింగ్‌ చేయాలి. మా పిన్ని 
కూతురు కోమల తెలుసుగా...” 

“అదేమైనా పిండి బొమ్మా...” అన్నాడు గోపిచంద్‌. 

“ఆం... దాని కొడుకు పుట్టిన రోజుట ఈరోజు. దారిలో వాడికో డ్రస్సు 
కొనుక్కుని, బొమ్మలు కొని, పార్టీ అయ్యాక మీ లక్ష్మి దగ్గరకు వెళ్లాం. అక్కడ 
పది నిమిషాల కంటే యెక్కువ ఉండలేను. మళ్లీ నన్ను అనవద్దు” అన్నది. 

“అబ్బ ప్రొద్దున అంతసేపు కొట్టిన మస్మాకు పది నిమిషాల గ్రాంటా! 
ఓ.కె. ఏం చేస్తాం వచ్చే జన్మలో భార్యనయి సాధించి, చెబుతాను” అన్నాడు 
గోపి. 

మరో పది నిమిషాలకు ఇద్దరూ స్కూటర్‌పై బయలుదేరారు. రాధిక 
ఆదేశానుసారం ఒక రెడీమేడ్‌ బట్టల షాపు ముందు ఆపాడు స్కూటర్ని. 

“అలాగే లక్ష్మి కూతురికో చొక్కా కొందాం రాధీ” అన్నాడు. 

“మీ ఇష్టం” అన్నది రాధిక. ఆమె తను కొనాలనుకున్న డ్రస్సు గంట 
ఎంపిక చేసి కొన్నది. గిఫ్ట్‌ ప్యాక్‌ అందంగా చేయించింది. 

“ఒక్క డ్రస్సు ఎంపిక చేయటానికింత సేపా?” 

“మా కోమలది చాలా మంచి టేస్ట్‌. దానికేవి ఒక పట్టాన నచ్చవు” 
అన్నది బిల్‌ అందిస్తూ. 





మాదిరెడ్డి సులోచన కథలు 139 


బిల్‌ చూచాడు. నలభై ఎనిమిది రూపాయలు. అంత యెక్కువగా 
అనిపించినా అతనేం మాట్లాడలేదు. తెల్లదానిపై నీలం చుక్కలున్న ఫ్రాక్‌ ప్యాక్‌ 
చేయించాడు. ఇరవై ఒక్క రూపాయి అయింది. ఆమె పన్నెండు రూపాయలు 
పెట్టి ఓ రైలు బొమ్మ కొన్నది. 

గోపిచంద్‌ గారికి ఏమన్నా కొనాలనుకుని, లక్ష్మి స్వభావం గుర్తుకు వచ్చి, 
తన ప్రయత్నం విరమించుకున్నాడు. 

ఇద్దరూ కోమల ఇల్లు చేరారు. 

బెలూన్లు, రంగు కాగితాలు కట్టిన హాల్లో, కుర్చీ పూలతో అలంక రించారు. 
ముందున్న స్టూలుపై పెద్ద కేకొకటి పెట్టారు. దానిపై క్యాండిల్స్‌ ఉన్నాయి. 

“దాదాపు వంద, రెండు వందల మందిని పిలిచారు. 

“హాయ్‌ రాధా...” అనేసి కోమల హడావుడిగా అక్కడ ఏర్పాట్లు 
చూడసాగింది. 

ఇద్దరూ వెళ్లీ కూర్చున్నారు. 

కోమల భర్త గారి ఆఫీసరు రాగానే, కూర్చుని, కేక్‌ కోయించారు. పాటలు 
పాడారు. కాగితం ప్లేట్లు తెచ్చి, ఓ కేకు పీస్‌, మిక్చర్‌, అరటిపండు పెట్టి అందరికి 
ఇచ్చారు. తరువాత అందరికి థంబ్స్‌అప్‌ ఇచ్చారు. రాధికకు కోమలను ఒంటరిగా 
కలుసుకోవటం కుదరటం లేదు. బొమ్మలు, బిస్మట్‌ ప్యాకెట్లు అందరూ ఇస్తున్నారు. 

కోమల కొడుకు అందంగా, తెల్లగా, బొద్దుగా, ముద్దొస్తున్నాడు. తను 
తెచ్చిన (డ్రస్సులో వాడింకెంత బావుంటాడో ఊహించుకున్నది. వాడి నెత్తుకుని, 
ప్రక్కకు తీసుకువెళ్లి తను తెచ్చిన డ్రస్సు వేసింది. నీలం నలుపు చారలతో 
వాడికి యెంతో నప్పింది. వాడిని ముద్దు పెట్టుకుంటుండగా హడావుడిగా వచ్చింది 
కోమల. 

“కెంపూ! ఇక్కడున్నావా? అవతల డాడీ నీ కోసం చూస్తున్నారు.... అరే 
వాడి డ్రస్సెవరు మార్చారు!” అన్నది కోమల. 

“నేనే కోమా! యెలా ఉందీ డ్రస్సు? కెంపు క్యూట్‌గా లేడూ?” 

“రాధీ! నీకు సమయాసమయాలు తెలియవు. వచ్చింది బిస్మెట్‌ ఫ్యాక్టరీ 
ఓనర్‌... మైగాడ్‌...” కోమల వాడి షర్ట్‌ లాగి ఒకవైపు వేసింది. వాడి చెడ్డీ లాగి 
రెండో వైపు వేసింది. ఇందాకటి ప్యాంటు, షర్ట్‌ తొడిగి బయటకు తీసుకువెళ్ళింది. 


140 పదల 


ఆ బట్టల వంక దీనంగా చూచింది. 

అవి తనను చూచి నవ్వినట్టు అనుభూతి పొందింది. 

“నీవు ఒక్క గంట ఏరి తెచ్చినావే. ఒక్క నిమిషం న్‌ స్నేహితురాలు నీ 
వంక చూచిందా అని యెవరో ప్రశ్నించినట్టు అయ్యింది. నీలం, నలుపు చారలు 
తిరగవేయటంలో అసహ్యంగా కనిపించింది. నిజానికి కెంపుకు తను తెచ్చిన 
బట్టలు యెంతగానో నప్పాయి. రాధిక కళ్ల నీళ్లు అదిమిపట్టి బయటికి వచ్చింది. 
యెవరి పరిచయస్తులతో వారు మాట్లాడుతున్నారు. గోపిచంద్‌ ఓ ప్రక్కకు నిలబడి 
గోడమీద వున్న కేలెండర్ల వంక చూస్తున్నాడు. 

“వెళ్లామా?” 

“అమ్మయ్య ! ఇంత త్వరగా తెమిలిందే” అన్నాడు అతను. 

“పార్టీకి వచ్చి పడకవేస్తామా?” అన్నది కోపంగా. 

కోపమెందుకో అర్థం కాలేదు. 

“మీ కోమలతో చెప్పి వస్తావా?” 

“అక్కరలేదు లెండి” అన్నది. ఇద్దరు బయటికి వచ్చారు. 

“గీకీ నాకెందుకో తలనొప్పిగా ఉంది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి 
నువ్వు లక్ష్మి వాళ్లింటికి వెళ్లు” అన్నది వేడికోలుగా. 

“మాడు రాధీ! ఈ ఒక్కసారికి నా మాట మన్నించు, ప్లీజ్‌, అయిదారు 
నిమిషాల కంటే యెక్కువ కూర్చోవద్దు. ఒక పార్టీకి వెళ్లామని చెబుతాను” అన్నాడు. 

మొండిగా వాదించే ఇష్టం లేదు. అతని వెనుకాల యెక్కి కూర్చుంది. 

“నువ్వు తెచ్చావుటె, యెంతో బావుంది...” అలా అనకపోయినా బావుందే” 
అంటే తను ఉప్పొంగి పోయేది. 'ఛ... ఛ దాని పనిలో అది ఉంది” 
అనుకోబోయింది. వాళ్ళాయన ఆఫీసరు తెచ్చిన బొమ్మ చూచి కోమల అన్న 
మాటలు గుర్తుకువచ్చాయి. 

“ఓ బ్యూటిఫుల్‌! యెంతబావుందో. అంకుల్‌కు థాంక్స్‌ చెప్పమ్మా” అని 
వయ్యారంగా అనటం తను విన్నది. 

ఛీ... ఛీ... తన కేమయింది ! ఆఫీసరు దగ్గర నటించక తప్పదు. తను 
స్నేహితురాలు. తన దగ్గర నటించటం భావ్యమా?” అనుకుంది. కాని ఆమె 
మనసంతా చేదు మింగినట్టుంది. సున్నితమైన చోట దెబ్బ తాకింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 141 


“ఏమిటి స్కూటర్‌ దిగవా?” భర్త అడిగేసరికి చటుక్కున స్కూటర్‌ 
దిగిందామె. 

“వచ్చారా అన్నయ్యా ! గౌరి నిదురపోతుందేమోనని భయపడుతున్నాను. 
రా వదినా. స్వాగతం.... సుస్వాగతం” అన్నది లక్ష్మి, 

శ్రీహరి కూతుర్ని తీసుకుని వచ్చాడు. 

“రామ్మా రాధికా...” అతను చిన్నగా నవ్వాడు. పాప బుట్టబొమ్మలా 
నైలాన్‌ చొక్కా వేసుకుంది. చేతులకు ప్లాస్టిక్‌ గాజులు, కళ్ల నిండుగా కాటుకతో 
చిరునవ్వులు చిందిస్తుంది గౌరి. 

ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు. పది మంది దగ్గరి వారే ఉన్నారు. 

“విత్‌ మెనీ హాపీ రిటర్స్‌ ఆఫ్‌ ద డే...” అని, అతను ఫ్రాక్‌ ఇచ్చాడు 
గౌరికి. 

ఆ పిల్ల అది గట్టిగా కడుపుకు అదుముకున్నది. 

“హారతి ఇచ్చెయ్యమ్మా” శ్రీహరి తల్లి కుందులు వెలిగించింది. 

లక్ష్మి పొట్లం విప్పింది. ఆమె కళ్లు ప్రశంసతో మిలమిలలాడాయి. 

“గోపీ! ఇది నీ టేస్ట్‌ అనుకోను. రాధిక ఎన్నిక చేసింది కదూ. చాలా 
బావుంది రాధికా” అన్నది నవ్వుతూ. 

“యెవరు ఎన్నిక చేస్తేనేం? నీకు నచ్చింది చాలు” అన్నాడు గోపి. 

రాధికకు ఒక్కసారి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. 

“వేసి చూడనా” అన్నది రాధిక. 

“అయ్యో అంత కంటేనా? నీకేం సొగసు బలసిందే తల్లీ. మూడు గౌన్లు 
మార్చావ్‌” అంటూ కూతుర్ని రాధికకు ఇచ్చింది. 

గౌను వేసాక అందరూ బావుందన్నారు. పాపకు హారతిచ్చి అక్షింతలు 
వేశారు. 

“ఇక మేము వెళ్ళివస్తాం లక్ష్మీ!” గోపిచంద్‌ లేచాడు. 

“బావుందన్నయ్యా? భోజనం చెయ్యకుండా వెళ్ళనిస్తానేమిటి? హోమ్‌ 
డిపార్ట్‌మెంట్‌ వదినది. ఏమ్మా” అడిగింది లక్ష్మి. 

గోపిచంద్‌కు లక్ష్మిపై కోపం వచ్చింది, మొహమాట పెట్టేస్తుందని. రాధిక 
ఏమంటుందోనని భయం. 


142 ప్టనరోజు 


“అలాగే భోజనం చెయ్యమంటే కాదంటానా?” అన్నది రాధిక. 

గోపిచంద్‌ చెయ్యి గిల్లి చూచుకున్నాడు. శ్రీహరి తల్లి వడ్డించగా అందరూ 
భోజనాలు చేసారు. 

అరటాకులో అన్నం, వంకాయ వేపుడు, దోసకాయ పప్పు, దొండకాయ 
పెరుగు పచ్చడి వడ్డింంచింది. ఆఖర్న పాయసం కూడా ఉంది. ఆడంబరం 
లేక, రుచిగా, శుచిగా ఉన్న పదార్థాలు అందరూ ఇష్టంగా తిన్నారు. 

ఆప్యాయంగా విసురుకునే మాటలతో హాస్యపు జల్లు కురిసినట్టు 
అయ్యింది. భోజనంతో పాటు అరమరికలు లేని ఆప్యాయత, కొసరి వడ్డించడం, 
కడుపుతో పాటు మనసు నిండిపోయింది రాధికకు. 

ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కనుండి చల్లగా వీచే మలయ మారుతంతో వచ్చిన 
అనుభూతి పొందింది రాధిక. 

“మీరు కూర్చోండి పెద్దమ్మా! నేను వడ్డిస్తాను” అన్నది రాధిక. 

మరోసారి కలా, ఇలా అన్నట్టు భార్య వంక చూచాడు గోపిచంద్‌. 

“యెందుకమ్మా...” అని శ్రీహరి తల్లి అంటున్నా వినకుండా ఆమెకు 
ఆకు వేసి వడ్డించింది రాధిక. 

“అయ్యో... చాలమ్మా చాలు...” ఆవిడ కంగారుగా చెయ్యి అడ్డం పెట్టింది. 

“బావుంది పెద్దమ్మా, మాకు వడ్డించలేదా?” అన్నది నవ్వుతూ రాధిక. 

“మీదంటే, ఏది తిన్నా అరగించుకునే వయసమ్మా రుచిగా ఉందని 
ఒక్క ముద్ద యెక్కువ తిన్నా రాత్రంతా బాధపడాలి” అన్నదామె. రాధిక లక్ష్మికి 
అన్ని సర్టటంలో సాయం చేసింది. లక్ష్మి గలగల కబుర్లు చెప్పింది. 

“నిజంగా గోపీ! నువ్వు చాల తెలివి మీరిపోయావు. వదిన్ని తీసుకువస్తే 
మేం కలిసిపోతామనే కదా, సాకులు పెట్టి తప్పించుకున్నావ్‌. నిజంగా యెంత 
సరళ స్వభావురాలు రాధిక” అన్నది లక్ష్మి, అందరికి తాంబూలం ఇస్తూ, 

“కణ, క్షణము జవరాండ్ర చిత్తముల్‌ అన్నట్టు మీ స్వభావాలను అర్థం 
చేసుకోవటం ఆ ఆదిదేవునికే తెలియలేదు. నే నెంత తల్లీ” అన్నాడు గోపిచంద్‌. 

రాధిక ముసిముసిగా నవ్వింది. 

“నిజం రాధికా! ఈ పూట నువ్వు రావటం నాకెంతో ఆనందంగా వుంది. 
నిండుగా ఉంది” అన్నది ఆనందంతో. 





మాదిరెడ్డి సులోచన కథలు 143 


రాధికకు ఒక్కసారి కళ్ళముందు మెరుపు మెరిసినట్టు అయ్యింది. యెంత 
మధురమైన అనుభూతి! యెంత చక్కని కాంప్లిమెంటు. వ్యక్తి జీవించటానికి 
ఇలాంటి అనుభూతులు అవసరం అనుకుంది. 

“అమ్మో, లక్ష్మీ ఏం సమ్మోహనాస్త్రం వేసావ్‌ తల్లీ! పది నిమిషాలుంటామని 
వచ్చాం. పదిన్నర గంటలయ్యింది” అన్నాడు టైమ్‌ చూచుకుని గోపిచంద్‌. 

“రోజూ ఉండరుగా....” అన్నాడు శ్రీహరి. 

మరో పది నిమిషాలకు భార్యాభర్తలు బయలుదేరారు. ఇంట్లోని వారంతా 
వాకిట్లోకి వచ్చి, నవ్వుతూ ఆప్యాయంగా సాగనంపారు. అందరి ముఖాలు 
ప్రసన్నంగా ఉన్నాయి. వారి రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అనుకుంది. లక్ష్మి 
ఆకు, అరటిపండు, లడ్డు పొట్లం చేతిలో పెట్టింది. 

గోపిచంద్‌ తన భుజం యెప్పుడో గిల్లుతుందని ఊపిరి బిగబట్టాడు. 
అయిదు నిమిషాలని అరగంట చేస్తే స్కూటర్‌ యెక్కగానే రాధిక చేసే మొదటి 
పని అది. 

ఇల్లు చేరినా అలాంటి ప్రమాదం జరగలేదు. 

“అమ్మయ్య...” అనుకున్నాడు. అతను స్కూటర్‌ పార్క్‌ చేసి, తాళం వేసి, 
బయటి తలుపులు వేసి వచ్చేసరికి, లడ్డూ ముక్కతుంపి, అతని నోట్లో పెట్టింది. 

ఉక్కిరిబిక్కిరి అయి ఆ ముక్క తినేశాడు. 

“రాధీ! కడుపు నిండా తిన్నాను. మళ్లీ ఈ బలవంతం ఏమిటి? రేపు 
తిందాం పెట్టెయ్యవోయ్‌” అన్నాడు. 

“ఉహు! నా పుట్టిన రోజు స్వీట్‌ తినాలి” అన్నది. ఆమె కళ్లు మిలమిల 
మెరుస్తున్నాయి. 

“ఏమిటి నీ పుట్టినరోజు! రాధీ డియర్‌ నీకేమయింది?” అన్నాడు 
కంగారుగా. 

అతనికి బాగా గుర్తు. వాళ్ళ పెళ్ళిరోజు, పుట్టినరోజు ఒకదాని వెంట 
ఒకటి వస్తాయి. మళ్ళీ ఈ రోజు పుట్టినరోజు అంటుందే రాధిక. భర్త అవస్థ 
గమనించి పకపక నవ్వింది. అంతలోనే గంభీరంగా మారిపోయింది. 

గోపిచంద్‌ నిజంగా భయంగా చూచాడు. 

“నా పుట్టినరోజు మన పెళ్ళీ అయిన మరు రోజు అని తెలుసు. మనిషిగా 
పుట్టినరోజు ఈ రోజండీ! పెద్ద, పెద్ద ఉపన్యాసాలు తేలేని మార్పు, ఒక్క చిన్న 


144 ప్వష్టనరోజు 


సంఘటన తెస్తుందందీ. ఆడంబరమే అనుభూతని, ధనికులే గొప్పవారని, హంగులే 
ముఖ్యమనుకున్న నాకు ఒక చిన్న సంఘటన కళ్లు తెరిపించింది.” అన్నది 
స్వప్నంలో నడుస్తున్నట్టు, నడుస్తూ. 

“ఏమిటి రాధీ.... ఏమిటది?” ఆమె భుజాలు పట్టి ఆపాడు. 

“మీరు ఒకనాడు అన్నారు గుర్తుందా, మనకంటే క్రిందివారిని చూడు 
రాధీ అంటూ, నిజమేనండి! మన అవసరం వారికి ఉంటుంది. మన రాక 
వారికి ఆనందం కల్గిస్తుంది. మన బహుమతి వారికి విలువయింది” అన్నది 
యెటో చూస్తూ, 

“రాధీ...” 

“నాకేం మతిపోలేదు” నవ్వింది. ఏం జరిగిందని అతను అడిగాడు. 
కాని ఆమె చెప్పలేక పోయింది. అతనికి చాలా సిల్లీగా అనిపించవచ్చు. యెంత 
వద్దనుకున్నా ఆమె కళ్ళముందు తిరగవేసిన డ్రస్సు కనిపించింది. అది చాలా 
చిన్నదే కావచ్చు కాని ఆమె మనసు సునిన్నతమైన చోట దెబ్బ తిన్నది. 

నిజంగా కోమలది తప్పుకాదని రాధికకు తెలుసు. అయినా ఆత్మీయురాలు 
నుండి ఒక్క ప్రశంసా వాక్యానికై పరితపించి పోయింది. గోపిచంద్‌కు మతిపోయి 
నట్టు అయింది. అయినా భార్య మనస్తత్వం తెలిసినవాడు కాబట్టి స్పోర్టివ్‌గా, 
ఆమె పాల భాగం చుంబించాడు. 

“ఇదేనోయ్‌, పుట్టినరోజు కానుక” అన్నాడు. 

“కానుకలు ఖరీదుతో కొలువరు శ్రీవారు, అనుభూతులతో...” 
అనబోయింది. అతను యెలాంటి ఉపన్యాసం వినదలుచుకోలేదు. ఆమె వాక్‌ 
ప్రవాహానికి ఆనకట్ట వేసాడు. 

O 





మాదిరెడ్డి సులోచన కథలు 145 


పడి లేచే కడలి తరంగం 


వర్షం... వర్షం... వర్షం! ఎటు చూచినా వర్షమే. పిల్లలిద్దరూ 
దగ్గుతున్నారు. ఆయనకు ఒక్క నిమిషం తీరిక వుండదు. చేసే వ్యవసాయ 
మెంతోగాని, పేకాట కబుర్లకు అంతూ దరీ ఉండదు. మేడ మీదికి పకోడీలు, 
వేరుసెనగకాయలు, కాఫీలు పంపటంతో నాకు తీరికలేదు. ఊర్లో ఆస్పత్రి లేదు. 
దగ్గరగా ఉన్న టౌన్‌కు వెళ్ళాలి. ఆయన స్నానానికి వస్తే అడిగాను. 

“రాజా, చిన్నీ ఒకటే దగ్గుతున్నారు.” 

“నన్నేం చేయమంటావ్‌! మనకే పరదా లేదుగా. వెళ్ళి డాక్టరుకు 
చూపించు...” అన్నారు. ఈ వర్షంలో బస్సులో వెళ్ళీరావటం మాటలా! నా 
దురదృష్టం. ఆస్తి అంతా నాదే అయినా అనుభవించలేని దురదృష్టవంతురాలిని. 
భర్త తోడి జీవితం ఇంత అందంగా ఉన్నది. పిల్లలవి ఇంకెంత అందంగా 
ఉంటుందో. వారి ఆరోగ్యం నేను పట్టించుకోకపోతే వారేమయిపోతారు. 

“శ్యామూ! రాజా ఒళ్ళు కాలిపోతుందే తల్లీ...” అమ్మమ్మ అరిచింది. 
భోజనాల తరువాత పిల్లలిద్దరిని తీసుకుని బస్సులో టౌనుకు బయలుదేరాను. 
ఇద్దరికి ప్లాస్టిక్‌ కోట్లు తొడిగి, చిన్న గొడుగు, సంచీ తీసుకున్నాను. ఇంకాస్త 
గట్టిగా వాదిస్తే దెప్పిపొడుపులు. 

“బి. ఏ. వెలగబెట్టావుగా. ఆ మాత్రం పనులు చేసుకోలేవూ” అంటారు. 

వర్షం మూలంగా డాక్టరుగారి దగ్గర యెక్కువగా రష్‌ లేదు. చూచి 
మందు లిచ్చారు. “మరేం భయం లేదమ్మా. వర్షాలు పడుతుంటే ఆ మాత్రం 





146 మాదిరెడ్డి సులోచన కథలు 


జలుబు చేయదా! అదీ లేకపోతే మా ప్రాక్టీసు మూలపడుతుంది” అన్నారాయన 
నవ్వుతూ. బజారు కెళ్ళి పండ్లూ, బిస్మట్లూ కొని బస్‌ స్థాండుకు వచ్చేసరికి బస్‌ 
వెళ్ళిపోయింది. తెల్లవారి ఎనిమిది గంటలకే మరో బస్సుంది. గుజ్బిపు బండి 
అయినా దొరుకుతుందేమోనని చూచాను. 

“ఆ రోడ్డు మీద నిలబడితే డిస్టిక్ట్సు బస్సు దొరుకుతుందమ్మా” అరటి 
పళ్ళు అమ్ముకునే అబ్బాయి సలహా యిచ్చాడు. ఇద్దరిని తీసుకుని రోడ్డుపైకి 
వచ్చాను. జ్వరం కొద్దిగా తగ్గినా నీరసంగా వుందేమో నడవలేక పోతున్నాడు. 
చెట్టుకింద రాయి చూచి కూర్చోబెట్టాను. ప్రక్కగా నేలకయ్యగా మారి నీళ్ళు 
పారుతున్నాయి. బస్సు వచ్చినా ఆపుతాడా? ఊర్లో ఇద్దరు ముగ్గురికి మోటార్‌ 
బైక్స్‌ ఉన్నాయి. వాళ్ళొచ్చినా నా రాజాని పంపేదాన్ని నాల్గు చినుకులు వచ్చినా 
కష్టమే. చీకటిపడింది. అటూ ఇటూ వెళ్ళేవారు తప్ప తెలిసినవారు కనిపించలేదు. 
కష్టసుఖాలు పంచుకుందామని ప్రమాణాలు చేసుకున్నాం. కాని సుఖమే 
పంచుకుంటారు మా శ్రీవారు. 

చీకటి, సన్నగా వర్షం ప్రారంభమయింది. రాజాని దగ్గరగా తీసుకున్నాను. 
నా ఉత్సాహం ఏమయిపోయింది? 

“శ్యామతల్లి వచ్చింది. రేడియో అమ్మి పారెయ్యాలి” అనేది పిన్ని. 

“ఒకర్తి ఉన్నా పదిమంది పెట్టు. రామ్మా కాసేపు బాట్‌మెంటెన్‌ ఆడదాం” 
బాబాయి పిలిచేవాడు. 

“శ్యామ మా ఆడబడుచే కాదు, మంచి స్నేహితురాలు” అనేది వదిన. 

“శ్యామ్‌! నువ్వు లేని పార్టీలేదు. సరదాగా ఉండదు” అనేవారు స్నేహ 
బృందం. 

ఒక అల్లరి కాదు. ఒక లెక్క కాదు. 

“అమ్మా! చలి....” రాజా అన్నాడు. నాకే చలిగా ఉంది. పసిపిల్లాడు. 
వాడికి ఉండదా? 

“కాసేపట్లో బస్సు రావచ్చు రాజా...” అన్నాను. పాల సైకిల్‌వారు 
కనిపించినా రాజాను పంపివేద్దాం అనుకొని, రోడ్డు పొడవునా దృష్టి సారించాను. 
ఎవరూ కనిపించలేదు. సన్నగా భయం ప్రారంభమయింది. 

అప్పుడే ఓ ఫియట్‌ కారు దూసుకుపోయేదల్లా ఆగింది. లైట్‌కాంతిలో 
నన్ను పరీక్షగా చూచింది ఓ తల. అందంగా, హుందాగా ఉన్న యువకుడు 
రేన్‌కోటులో దిగాడు. 





పడి లేచే కడలి తరంగం 147 


వర్షం పెద్దదయింది. అతని పాదాలు పట్టుకుని అయినా ఇల్లు చేరాలి 
అనుకున్నాను. 


అతను చనువుగా వణుకుతున్న చిన్నిని యెత్తుకుని, రమ్మన్నట్టు చూసాడు. 

“అలా చూస్తావేం శ్యామూ! నన్ను గుర్తుపట్టలేదా?” 

ఆ గంభీర కంఠం గిరిధర్‌దే. సన్నగా పీలగా ఉండే మనిషి... యెంత 
మారిపోయాడు! 

అతను ముందటి తలుపుతీసి చిన్నిని కూర్చోబెట్టి రాజును అందుకున్నాడు. 
నేను ఎక్కాను. రాజాను నా ఒళ్ళో కూర్చోబెట్టి తలుపువేశాడు. తను చుట్టూ 
తిరిగి వచ్చి సీట్లో కూర్చున్నాడు. 

“ఇంత ఆలస్యంగా ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావ్‌” 

చెప్పాను. 

“మెగాడ్‌! పిల్లలు ఇలా ఉంటే శివరామ్‌కు నిదురెలా పడుతుంది! ఆట 
యెలా ఆడతాడు?” 

తల వంచాను. 

“ఆ ద్రాక్షతోటలో మన బంగళా ఉంది. కాఫీ తాగి తిరిగి వెడుదువుగాని'.” 

“ఊం...” అన్నాను. 

“అమ్మమ్మగారు బావున్నారా?” 


అతను కారు నడుపుతూనే ఆశ్చర్యంగా నావంక చూసాడు. పిల్లలకు 
వెచ్చగా ఉందేమో నిదురపోయారు. 

బి.ఏ. పూర్తి చేస్తుండగా మామయ్య పోయాడు. మామయ్యకు నన్నిచ్చి 
చేసి ఆస్తి పైకిపోకుండా చూడాలని అమ్మమ్మ తాపత్రయం. అగ్రికల్చర్‌ బి. ఎస్సీ 
చదివిన మామయ్య అకస్మాత్తుగా తలనొప్పీ, జ్వరంతో పోయారు. అమ్మమ్మకు 
తోడుగా వెళ్ళాను. అప్పుడప్పుడు వచ్చి అమ్మమ్మను ఓదార్చేవాడు గిరిధర్‌. అతను 
మామయ్య స్నేహితుడట. అతను బి.ఏ. ఫేలయి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడట. 
పెద్ద కుటుంబం, ఆస్తిపాస్తులు లేవు. అమ్మమ్మ వ్యవసాయంలో సహాయం 
చేసేవాడు. అప్పుడు తెగ అల్లరి చేసేదాన్ని అతన్ని ఆటలు పట్టించేదాన్ని నేనెంత 





148 పడి లేచే కడలి తరంగం 


అల్లరిచేసినా కళ్ళు పెద్దవి చేసుకుని చూచేవాడు. కేరమ్స్‌, బ్యాట్‌మింటన్‌ 
ఒకటేమిటి అన్నీ ఆదేదాన్ని అతను నాపై ఆశలు పెంచుకున్నాడని అనుకోలేదు. 

అమ్మమ్మ కాస్త తేరుకున్నాక తన తోడికోడలి కొడుక్కే నన్నిచ్చి చేయాలని 
పట్టుపట్టింది. అతను లా చదువుతున్నాడట. ఆస్తి అంతా నాకే వస్తుందని 
అమ్మ, నాన్న అంగీకరించారు. 

ఆ రోజు గిరిధర్‌ పొలం గట్టున మౌనంగా కూర్చుని గడ్డి పీకివేస్తున్నాడు. 

“గీరీ!...” జవాబు లేదు. దగ్గరగా వెళ్ళి తల అటు, ఇటు ఊపాను. 
అతను ఉలిక్కిపడి చూచాడు. 

“తపస్సు చేస్తున్నావా మహాశయా?” 

“ఊం... ” అన్నాడు. అతని చూపులు కొత్తగా ఉన్నాయి. 

“యెవరి కోసమో?” 

“శ్యామూ! నీ కోసమే నా తపస్సు! నిన్ను చూచిన క్షణం ఎటువంటిదో 
కాని నీవు నా స్వంతం కావాలని నా అణువణువు కోరుకుంటుంది” అన్నాడు. 

నేను తెల్లబోయాను. అతనిలా అంటాడని ఊహించనయినా లేదు. 

“నాకు తెలుసు శ్యామూ! డబ్బు లేదు, చదువులేదని ఆలోచిస్తున్నావ్‌ 
కదూ! నీ చిరునవ్వు చూస్తూ....” అతను నా చేతిని తీసుకుని చెంపకానించు 
కున్నాడు. 

“నన్ను ఆలోచించుకోనియ్యి” అన్నాను చెయ్యిలాగి. 

“ఆలోచించు శ్యామూ! నా ఆరాధనను అర్థం చేసుకో” అన్నాడు తనూ 
తస. 

నేను అమ్మమ్మతో ఈ విషయం చెప్పాలని ప్రయత్నించాను. కాని చెప్పలేక 
పోయాను. 

శివరామ్‌ అందగాడే. చదువులో గిరికన్నా అధికుడే. అన్నింటికన్నా 
అమ్మమ్మకు కావాల్సినవాడు. అందుకే మౌనం వహించాను. గిరి అర్థం 
చేసుకున్నాడేమో, మళ్ళీ కనిపించలేదు. ఊర్లోవారు అనుకోగా విన్నది అతను 
పెద్ద కంట్రాక్టరయ్యాడని, చెల్లెళ్లకు మంచి సంబంధాలు చేశాడని, తమ్ముడికి 
చదువు చెప్పిస్తున్నాడని. శివరామ్‌ యెప్పుడయినా ఆదరణగా పిలిస్తే గిరిధర్‌, 
అతని ఆదరణ గుర్తుకువచ్చేది. 





మాదిరెడ్డి సులోచన కథలు 149 


“శ్యామూ!... శ్యామూ...” ఉలిక్కిపడి చూచాను. కారు చిన్న బంగళా 
ముందు ఆగింది. 

పిల్లలను లేపాను. అతను ఆప్యాయంగా వారి వీపులు నిమురుతూ 
యెత్తుకున్నాడు. నౌకరు కాబోలు పరుగెత్తుకు వచ్చి నా సంచీ అందుకున్నాడు. 

అతనలా పిల్లలను యెత్తుకు పోతుంటే నాకళ్ళు చమర్హాయి. ఒక్క 
నాడయినా శివరామ్‌ వారిని దగ్గరకు తీయడు. వాళ్ళంతటవాళ్ళు వెడితే 
కసురుకుంటాడు. 

“వీళ్ల నిలా నాపైకి వదిలి నువ్వేం చేస్తున్నట్టు.” 

నాకు రోషం వస్తుంది. వాళ్ళను లాక్కువచ్చి రెండు దెబ్బలు వేస్తాను. 

“అదేమిటి శివా! పిల్లలు తండ్రి దగ్గర కాకపోతే యెక్కడ గారాలు 
పోతారు?” అమ్మమ్మ అడుగుతుంది. 

“రా శ్యామూ....” వెళ్ళి హాల్లో కూర్చున్నాము. నౌకరుకు చెప్పాడు పిల్లలకు 
మొదట వడ్డించమని. 

“జ్వరం వచ్చింది. పాలు చాలు గిరీ...” అన్నాను. 

అతను నవ్వాడు. ఆ నవ్వు ఇప్పటికి నోరు విప్పావు అన్నట్టుంది “అల్లోపతి 
మందులకు ఏం కాదు....” అన్నాడు. 

పిల్లలను తీసుకుని నేను డైనింగ్‌రూమ్‌లోకి వెళ్ళాను. అతనూ వచ్చాడు. 
అతను పిల్లలతో కబుర్లు చెబుతూ నవ్విస్తూ ఆడుతుంటే అదో అపూర్వ దృశ్యంలా 
నా హృదయంలో నిలిచిపోయింది. ఆ స్థానంలో శివరామ్‌ను ఊహించబోయాను. 

“ఇదిగో! బల్ల దగ్గర నానా గలీజు, వీళ్ళకు ముందే అన్నాలు పెట్టేయ్‌-” 
గదుముతాడు. 

“కాఫీ తీసుకో శ్యామూ....” అన్నాడు. అతని చేతిలో కప్పు అందుకున్నాను. 
పిల్లలు టీవీ ముందు కూర్చున్నారు. 

“ఇప్పుడు వంట యెందుకు గిరీ? వెళ్ళిపోదాం.” 

“శివరామ్‌ యెదురు చూస్తాడా!” 

“అమ్మమ్మ ఆదుర్దా పడుతుందేమో” 

“నువ్వు బస్సందుకుని ఇల్లు చేరే సమయానికల్లా నేను ఇల్లు చేరిస్తే 
చాలుగా” అన్నాడు. 





150 పడి లేచే కడలి తరంగం 


ఇద్దరం బయటి వరండాలో కూర్చున్నాం. సర్మస్‌ చూపిస్తున్నారు టీవీలో. 
పిల్లలిద్దరూ మైమరచి చూస్తున్నారు. 

“శ్యామూ! గలగల పారే సెలయేరు గుర్తుకు వచ్చేది నిన్ను చూస్తే యెందుకు 
అంత మౌనంగా ఉంటున్నావ్‌?” 

“లేదే...” అన్నాను. ఆ ఆప్యాయతకు కరిగిపోతున్నాను. ఒక్కసారి వెళ్ళి 
అతని హృదయంలో తలదాచుకోవాలని ఉంది. నన్ను నేను నిగ్రహించుకున్నాను. 

“శ్యామూ! ఏమయినా కబుర్లు చెప్పు....” అన్నాడు. నా మానసవీణ 
మూగబోయింది. కబుర్లు పలకదని యెలా చెప్పనూ? నాకామాత్రం ఆప్యాయత 
కూడా కరువని చెప్పుకోలేని దుస్థితి. ఒక విధంగా ఒకరిని ఒకరు అర్థం 
చేసుకోవాలని పెట్టిన కోర్ట్‌షిప్‌లు మంచివేమో అనిపిస్తుంది నాకు. ఆయన 
త్రాగి వచ్చినప్పుడు చేరువగా వెళ్ళితే డోక్క్మోవటమే అవుతుంది. ఆయన ఆగ్రహంగా 

“ఒహో! ఇదేం పతివ్రతా వేషం? ఆడవారు కూడా జామ్మని 
తాగుతుంటే...” అంటారు. 

“అదృష్టవంతులు” అంటాను నిర్లిప్తంగా. 

“చాలా మారిపోయావు” అన్నాడు గిరి. 

“సహజమేగా!” నవ్వాను. అతను నన్నే చూస్తున్నాడు. నా జీవితంలోని 
అగాధం అంచనా వెయ్యాలని చూస్తున్నాడు. 

“నీ పెళ్ళెప్పుడు గిరీ?” మాట మార్చాలని అడిగాను. 

“ఇంకా ఆలోచించలేదు శ్యామూ. చేసుకున్నా ఆ అమ్మాయిని సంతోష 
పెట్టగలనా అని అనుమానం పీడిస్తుంది” అన్నాడు. 

“నీ అనుమానం అర్థం లేనిది గిరీ! నీవు మంచి భర్తవు, తండ్రివి కాగలవు” 
అని నాలుక కరుచుకున్నాను. 

గిరి అపనమ్మకంగా చూచాడు. అంత నమ్మకం ఉంటే నన్నెందుకు 
కాదన్నావ్‌ అన్నట్టున్నాయా చూపులు. 

“గిరీ! కౌమార్యదశలో కొందరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. 
మరికొందరు స్తబ్ధంగా ఉండిపోతారు. నేను ఆలోచించే లోపలే అంతా నిర్ణయం 
అయ్యింది....” అన్నాను. అంటుంటే నా కంఠం వణికింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 151 


అతను ఉద్వేగంగా నా చేయిపై తన చేయి వేశాడు. 

“గిరీ! ఆ రోజు ఒక్కటే ఆలోచించాను. నిన్ను ఒక పనిమనిషిగా చూచే 
అమ్మమ్మ ఆదరించకపోతే, ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో బాధపడతావనే 
అనుకున్నాను గాని, నీ ఆరాధన [గ్రహించలేదు గిరీ...” అన్నాను. నా కళ్ళు 
నిండుకున్నాయి. 

“శ్యామూ!...” 

“గిరీ! జీవితం చిత్రమయింది. అందనివి అందుకోవటానికి వెనుకాడ 
తాము. అందని వాటికి అర్రులు చాచి ఆశాభంగం పొందుతాము” అన్నాను 
కన్నీరు ఒత్తుకుని. అతని ముఖం కమిలి పోయింది. 

“భోజనం సిద్ధమయింది...” పనివాడు చెప్పాడు. 

ఇద్దరం లేచాము. భోజనానికి కూర్చున్నాము. అమ్మమ్మ గారింట్లో 
వేసుకున్నట్టే ఒకరి కంచంలో ఒకరం ఒడ్డించుకున్నాం. ఆ రోజు భోజనం 
తృప్తిగా అనిపించింది చాలా రోజుల తరువాత. అతను ఫ్రిజ్‌లో నుండి బిన్ట్‌ 
ఫ్రూట్స్‌ తీసి పిల్లలకు, నాకు పెట్టాడు. శివరామ్‌, నేను కలిసి కూర్చుని భోజనం 
చేసిన రోజులు వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. అతనికి లేని వ్యవసనం లేదు. 
నిర్వికారంగా అన్నింటిని భరించటం నేర్చుకున్నాను. ఒంటరితనం దిగులులో 
ఆశాకిరణాల్లా పిల్లలు తప్ప ఏముంది! 

ఒకరికోసం ఒకరు పని చేయటంలో యెంత ఆనందం ఉంది? 

మనిషికి స్నేహపూరితమైన మాటలు యెంత బలాన్ని కలుగజేస్తాయి. 
గిరిధర్‌ సమక్షంలో యెంతో హాయిగా ఉంది. కొందరు దైహిక వాంఛలతో 
తృప్తిని వెతుక్కుంటారేమో కాని, నాకు మానసికంగా దగ్గరగా వచ్చే తోడు కావాలి. 

“ఇంకొంచెం పండ్లు వేస్తాను శ్యామూ” 

“వద్దు గిరీ” చెయ్యి అడ్డం పెట్టినా వినలేదు. మళ్ళీ చిన్నప్పటి శ్యామలనై 
గలగల మాట్లాడుతుంటే గిరి సంతోషంగా చూచాడు. 

“అంకుల్‌! టీవీ ఇప్పుడే రాదా?” రాజా దిగులుగా అడిగాడు. 

“రేపు వస్తుంది రాజా” రాజాని వడిలో కూర్చోబెట్టుకున్నాడు. చిన్ని 
వచ్చింది. దాని కళ్ళు వాలిపోతున్నాయి. 

“శ్యామూ! చిన్నపిల్లల ప్రోగ్రాం వున్ననాడు వీళ్ళను పంపు. కారు 
పంపుతాను” అన్నాడు. 





152 పడి లేచే కడలి తరంగం 


నేనేం మాట్లాడలేదు. మేం టీవీ ఫ్రిజ్‌ లాంటివి కొనలేక కాదు. యెంత 
డబ్బయినా ఆయన వ్యసనాలకు సరిపడదు. 


“శివరామ్‌కు కోపం వస్తుందా?” 

“ఆయనకంత తీరిక, ఓపిక ఎక్కడివి గిరీ?” 

“యెప్పుడయినా గెలుస్తారా?” 

“సంవత్సరానికి ఒక్కసారి, రెండుసార్లు గెలుస్తారేమో, గెలిచిన రోజు 
తాగరు!” అన్నాను. ఆ రెండు రోజులే మేం భార్యాభర్తలం అని గుర్తుచేసే 


రోజులు. 

“ఈ వ్యవసనాలు మాన్ప్చించాలని ఏమయినా ప్రయత్నించావా?” 

“ప్రయత్నించడం భంగపడటం అన్నీ అయ్యాయి. ఇక ఒకే దారి ఉంది. 
విడాకులివ్వటం” అన్నాను నిర్లిప్తంగా 

బాధగా చూచాడు గిరి. 

“కాని గిరీ... నేను అతన్ని ప్రేమించాను...” అన్నాను. నా గొంతుకు 
ఏదో అడ్డంపడ్డట్టు అయింది. 

“అమ్మా... నిద్రొస్తుందే...” రాజా ఆవులించాడు. 

పిల్లలను తీసుకుని లేచాను. గిరిధర్‌ రాజా చేయిపట్టుకుని బయటికి 
వచ్చాడు. కార్లో కూర్చున్నాను. సన్నగా వర్షం పడుతోంది. 

కారు కదిలింది. 

“నా కీరోజు చాలా తృప్తిగా ఉంది గిరీ” అన్నాను. 

అతనేం మాట్లాడలేదు. 

“గిరీ! నా మనసు బాగోలేనప్పుడల్లా వచ్చి కాసేపు ప్రశాంతమైన ఈ 
వాతావరణంలో గడుపుతాను, అభ్యంతరమా?” 

“నా అదృష్టంగా భావిస్తాను. శని, ఆదివారాలు తప్పక ఉంటాను” 
అన్నాడు. 

“ఇక్కడికి రావాలంటే ఓ చిన్న షరతు...” 

“చెప్పు శ్యామూ!” కారు సాగిపోతుంది. 

“నీకింకా నేనంటే అభిమానం, ఆరాధనా ఉన్నాయా గిరీ” 





మాదిరెడ్డి సులోచన కథలు 153 


“అదేంమాట శ్యామూ!” 

“నేను అడిగింది ఏదయినా ఇస్తావా?” 

“అడిగి చూడు” అన్నాడు ముందుకు చూస్తూ. 

“నువ్వు త్వరగా వివాహం చేసుకోవాలి” అన్నాను. 

అతను నావంక చూచి బాధగా ముఖం పెట్టాడు. 

“గిరీ! ప్రేమ నిర్వచించరానిది. ప్రేమకు కామానికి, దైహిక సుఖాలకు 
ముడిపెట్టుకోకూడదు” అన్నాను. 

అతను ఈసారి మౌనం వహించాడు. 


“వీటి అన్నిటికి అతీతమయింది నీ ప్రేమ. అది పదిలంగా దాచుకుంటాను. 
నువ్వు నమ్మవు గిరీ! ఈ రోజు రెండు గంటల్లో నేను పొందిన అనుభూతి, తృప్తి 
వర్ణించలేనివి. నీ చల్లని స్నేహంలో సేద తీరాలంటే నువు ఓ ఇంటివాడివి 
కావాలి.” ఆప్యాయంగా అతని భుజం తట్టాను. 


అతను ఈసారి మాట్లాడలేదు. కారు వెళ్ళి మా ఇంటిముందు ఆగింది. 
నేనూహించినట్టే అమ్మమ్మ ఆదుర్దాగా చూస్తోంది. నన్ను చూస్తూనే ఆమె ముఖం 
చాటంత అయింది. 


“వచ్చావా తల్లీ! పదిసార్లు పైకి వెళ్ళి చెప్పాను. వీడి తలపండు పగలా....” 
అంటూ రాజాను అందుకుంది. చిన్నని భుజన వేసుకుని దిగాను. 


“యెవరు?.... నువ్వా గిరీ! బావున్నావా?” అమ్మమ్మ ఆశ్చర్యంగా 
చూసింది. 

“బావున్నాను అమ్మమ్మా... వస్తాను శ్యామూ.” 

“అదేమిటి నాయనా, ఇంట్లోకి రా...” అమ్మమ్మ పిలిచింది. 

“ఇప్పుడు దగ్గరలోనే పని. వస్తుంటాను....” 

అమ్మమ్మ లోపలికి వెళ్ళింది. 

“గిరీ...” 


“శ్యామూ! చెప్పానుగా నువ్వేది కోరినా కాదనే శక్తి లేదని. నువ్వే చూడు 
నచ్చిన అమ్మాయిని...” అన్నాడు, చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని. 


నా కళ్ళ ముందు ఆఖరు చెల్లెలు అనిత మెదిలింది. 





154 పడి లేచే కడలి తరంగం 


“మళ్ళీ మనసు మార్చుకోవుగా...” 
“ఉహుం...” అతను వెళ్ళి కార్లో కూర్చున్నాడు. 


“ఆసు పడిందిరా... ఆసు....” మేడ మీద నుండి పెద్దగా కేకలు 
వినిపించాయి. 


“పిల్లల్ని పంపు....” గిరికారు దూరమైంది. అలాగే నిలబడ్డాను. ఈ 
నిరాశామయమయిన జీవితంలో ఒక్క ఆశా కిరణం గిరి స్నేహం. మెల్లగా 
ఇంట్లోకి వచ్చి చిన్నిని పడుకోబెట్టాను. 

“ఓ వంద రూపాయలు కావాలి. అలాగే రెండు కప్పుల కాఫీ పంపించు. 
ఓ ఇద్దరు కొత్తవాళ్ళు వచ్చారు. వాళ్ళకు బీర్‌ పడదట....” అనేసి నిలబడిపోయాడు 
శివరామ్‌. 


నా హృదయం భగ్గుమంది. పిల్లలకెలా ఉందని అడగనివాడు, ఈ వర్షంలో 
యెలా వచ్చారని అడగనివాడు డబ్బు అడుగుతున్నాడు. 


“నాకు చేతకాదు. హోటల్‌ నుండి తెప్పించుకోండి. పంటమ్మిన డబ్బంతా 
మీ దగ్గరే ఉంది. నా దగ్గర లేదు” అన్నాను నిర్లక్ష్యంగా. 


“ఊం....” కోపంగా చూచి వెళ్ళిపోయాడు. 


మెల్లగా కిటికీ దగ్గరకు నడిచాను. మా పశువులు కాచే కుర్రాడు ఏదో 
పాట పాడుకుంటున్నాడు. నా హృదయానికి ఒక్క చరణం బాగా 
హత్తుకుపోయింది. 


“పడిలేచే కడలి తరంగంి ఆ తరువాత అన్నవి వినిపించలేదు. నా 
హృదయమూ అలాగే ఉంది. 

“అన్నం తినమ్మా...ఆం...” ఆవులిస్తూ వచ్చింది అమ్మమ్మ. 

“నా భోజనం అయింది” అన్నాను, కనుకొలుకులలో నిలిచిన నీరు 
తుడుచుకుని. అలాగే చీకట్లోకి చూస్తూ నిలబడిపోయాను. 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 155 


అభిమానులున్నారు జాగ్రత్త ! 


(ప్రతీ రచయితకి, రచయిత్రికి, పాడేవారికి, ఆడేవారికి, నటించేవారికి 
అభిమానులుంటారు. అదొక రకమైన ఆరాధన, కళోపాసన. ఈ అభిమానుల 
ఆరాధనే, విమర్శలే బ్రతుకడానికి స్ఫూర్తినిస్తాయి. 

కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురుకోవలసి వస్తుంది. 
సోమర్‌సెట్‌ మామ్‌ కూడా ఒక అనుభవం రాసాడు. ఒక అభిమాని భోజనానికని 
వచ్చి గమ్మత్తుగా జేబు ఖాళీ చేసి వెళ్తుంది. ఒక రకమైన అభిమానులుంటారు. 
నవల కథ ఏది వ్రాసినా విశ్రేషించలేరు. వారికి ఎక్కడ ఏ చిన్న పాయింట్‌ 
నచ్చకపోయినా నచ్చలేదు అని కచ్చితంగా రాస్తారు. బావుంది. బాగాలేదనేవారు. 
మరోరకం వారు డీప్‌గా ఇన్‌వాల్స్‌ అవుతారు. మనల్ని ఎవరయినా విమర్శించినా 
సహించలేరు. కోపంగా ఉత్తరం రాస్తారు. వారు నిజమైన అభిమానులు. 


మూడోరకం వారికి వ ఖ్యాతి చెందిన శేరు తెలిస్తే చాలు. 
అభిమానులౌతారు. అలాంటి అభిమానులతో మనకు గమ్మత్తయిన అనుభవాలు 
జరుగుతాయి. 


ఫ్యాన్‌మేల్‌ చదువుతుంటే ఓ ఉత్తరం నన్నాకర్షించింది. తీసి చూచాను. 
ఒకొక్క అక్షరం, పొందికగా అందంగా, చిత్రకారుడు గీసినట్టుంది. రక, రకాల 
స్మెచ్‌పెన్‌లతో రాసాడు. అతని ఓపికకు తీరికకు తబ్బి ఉబ్బిఅయ్యాను. పేరు 
శశాంకట అందమైన పేరు. 'నేను మీ అభిమానిని, శనివారం సాయంత్రం 
బయలుదేరి హైద్రాబాద్‌ వస్తున్నాను. మీరు ఆదివారం మొత్తం నాతో గడపాలి... 





156 మాదిరెడ్డి సులోచన కథలు 


అంటే అపార్థం చేసుకోకండి కబుర్లు, చర్చలు వైగరా... వైగరా..” అంత శ్రద్ధగా, 
అంత సమయం తీసుకుని రాసారంటె, ఒక్క ఆదివారం అతన్ని ఆహ్వానించటానికే 
భయం! 

వెంటనే ఉత్తరం రాసాను. “మీతో చర్చించి, మీతో భోజనం చెయ్యటానికి 
నాకేం అభ్యంతరం లేదు” రమ్మని రాసాను. 

శనివారం నాడే కాస్త ఇల్లు తిరగవేసి శుభ్రం చేసాను. నేను తలకు 
నూనె అంటుకున్నా. మొహమాటం లేకుండా ఇంట్లోకి వచ్చి మాట్లాడే 
అభిమానులున్నారు. అది వేరే విషయం. ఎవరయినా చెప్పకుండా మనింటికి 
భోజనానికి వస్తే ఏవో పచ్చళ్లు, ఏది ఉంటే అది పెడతాము. అతను వస్తున్నట్టు 
రాసాడు. అందుకని తయారు చెయ్యాలి. మర్నాడు ఉదయం అన్ని ఎంగేజ్‌మెంట్స్‌ 
కాన్సిల్‌ చేసుకున్నాను. అతను ఇంజనీరట. బిజీ పనులు ఒదులుకుని ఒక 
రచయిత్రిని చూడాలని రావటం గొప్ప అనిపించింది. (థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. 

మనిషి కూడా బాగానే ఉన్నాడు. ఎరుపు రంగు, ఎత్తు ఒత్తయిన జుట్టుతో 
అందం కంటే ఆకర్షనీయంగా ఉన్నాడు. 

వస్తూనే ఒక బాల్‌ పెన్ను బహూకరించాడు. 

“థాంక్స్‌...” అందుకున్నాను. అది గమ్మత్తుగా ఉంది. ఒకవేపు నీలం 
పాయింట్‌ ఉంది రెండోవేపు ఎట్ట పెన్ను ఉంది. 

“కాఫీ... టీ ఏం తీసుకుంటారు!” 

“మీరు కూడా మామూలు మనుష్యుల్లా అడుగుతారే. రచయిత 
సమక్షములో సాహిత్య రసాస్వాదన చేయాలి” అన్నాడు. 

నేను కాస్త సిగ్గుపడ్డాను. అతని ధోరణి చూస్తే ఎంత రచయిత్రి అయినా 
మామూలు ఆడవారిలా మాట్లాడతాననీ అనిపించింది. 

“మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా...” 

“ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే మగాడా! నేనొక పెద్ద పరిశ్రమ 
స్థాపించానులెండి. దాదాపు పదివేల మంది పని చేస్తారు.” అన్నాడు. 

నా గుండె అదిరిపోయింది. ఇంత పెద్దపారిశ్రామికవేత్త నా అభిమాని! 
గర్వంతో తల ఎత్తాను. 

“ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదని, చేవ ఉన్న మగాడేదయినా 
చేస్తాడని నిరూపించే ఓ నవల రాయండి” అన్నాడు శశాంక. 





అభిమానులున్నారు జాగ్రత్త ! 157 


అలాంటివి రాసాను. అయినా అన్నీ చదివే ఓపిక ఉండవద్దు. 

“చాలా రాసానండీ...” చెప్పాను. 

“వెరీ గుడ్‌. కీప్‌ ఇట్‌ అప్‌” 

“ధాంక్స్‌” అన్నాను. 

“చూడండి. ఈ ఇంగ్రీషువాడు మనకు రాజకీయంగా స్వాతంత్ర్యం ఇచ్చినా 
భావస్వాతంత్ర్యం లేదండి. ఇంకా థ్యాంక్స్‌ సారీలు అంటుంటాం.” అన్నాడు. 
ఇందాక తనూ కీప్‌ ఇట్‌ అప్‌ అన్నాడు కదా మరెలా అనగల్లాడు. నా ప్రశ్న 
ముఖంలో చదివినట్టు జవాబు చెప్పాడు. 

“మీరొక్కరే అలా అంటారని కాదు. సర్వ సామాన్యంగా అందరూ అనే 
పాయింటది. “భావ బానిసత్వం”పై ఓ నవల రాయకూడదూ!” 

“భావ బానిసత్వం అంటూ మకుటం పెట్టి నవల రాసే కంటే అవకాశం 
దొరికినచోట నిరసిస్తానండీ”అన్నాను. 

“అలాగ! అయితే ఒక పని చెయ్యండి. ఈనాడు సంఘములో తలెత్తిన 
అవినీతి ఆశ్రిత జన పక్షపాతం వైగరాలు బేస్‌గా చేసుకుని, ఓ రాజకీయ నవల 
రాయండి” అని సలహా ఇచ్చాడు. 

“అదేమిటి మీరు నా నవలలు ఏం చదివారు?” 

“అన్నీ చదివాను. మీ బుక్స్‌ హాట్‌ కేకులండీ.... అమ్ముడవుతాయి” అన్నాడు 
నవ్వుతూ. 

నేను నవ్వాను కాంప్లిమెంటుకు. వెళ్ళి కాఫీ తెచ్చాను. అతను తాగేసాడు. 

“అబ్బ కాఫీ చాలా బావుందండీ. ఇంకో కప్పు ఇస్తారా?” 

ఇంకో కప్పు తెచ్చిచ్చాను. 

“మీ గురించి ఆలోచించినప్పుడు నా ఊహలు గమ్మత్తుగా ప్రయాణం 
చేస్తాయి. మీరు ఓ వొంటిస్తంభం మేడలో కూర్చుని బ్రాందీయో, విస్మీయో 
త్రాగుతూ, అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ప్రకృతికి పరవసిస్తూ ఊహా జగత్తులోకి 
వెళ్ళిపోతారనుకుంటాము. లేదా ఏ కాళ్ళీరుకో ఊటికో వెళ్ళి ప్రకృతికి పరవశించి 
రాస్తారనుకుంటాము” అన్నాడు. నాకు పకపకా నవ్వాలనిపించింది. 

“అలా అయితే అభిమానులు దూరంగా ఉండాలి. ఆ వూహ కమ్మని 
కలగా మిగిలిపోతుంది” అన్నాను. 





158 అభిమానులున్నారు జాగ్రత్త ! 


“మామూలు మనుషులకు దూరంగా, ఒక వూహాలోకంలో వుండి 
రాయలేరా?” అన్నాడు శశాంక. 


నేను విచిత్రంగా చూచాను. యెవరయినా మామూలు మనుషుల 
సమస్యల నెందుకు ఆధారం చేసుకుని రాయరండీ అంటారు గాని ఇదేం ప్రశ్న! 


అతను ఇండప్టియలిస్ట్‌ కదా! అతని వూహలు ఖరీదు కలవి, అనుకున్నాను. 
మౌనంగా ఉండిపోయాను. 


“రచయితకి, మామూలు మనిషికీ తేడా వుండాలా లేదా?” 

“తప్పక వుండాలి. రచయితకు పరిశీలనా దృక్పథంతో పాటు, సమస్యలను 
అన్ని యాంగిల్స్‌ నుండి పరిశీలించే పరిజ్ఞానం వుండాలి” 

“అంతేనా!” 

“గుండెలోతులు తరచిచూచే నేర్పు వుండాలి. నా మట్టుకు నాకు 
వూహాలోకం కంటే వాస్తవ ప్రపంచంలో తిరుగటం చాలా సుళువు అనిపిస్తుంది. 
వాస్తవమైన సమస్యలు మనకు అందుబాటులో వుంటాయి” అన్నాను. 

“మీరు వంట చేస్తారా!” 

మధ్యలో ఇదేం ప్రశ్న తలాడించా? 

“అనుభవం కోసమా” 


“కాదు నా హాలీ! ప్రతీ పని చేసి చూడాలంటాను. అదేకాక, మనసుకు 
మెదడుకు ఎక్సర్‌సైజ్‌ అయినట్టె శరీరానికి కావాలి కదా” అన్నాను. 


“యోగాసనాలు వెయ్యండి” 

“వాటికి వెచ్చించే టైములో మన పనులు మనమూ చేసుకుంటే రెండు 
విధాలుగా కలిసి వస్తుంది కదా” అన్నాను. 

“కబుర్లు మీరు పని చేస్తారా ! పెడతారా!” 

“ఇంత చిన్న విషయానికి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది?” 

“రచయితలంతా ఊహలలో జీవిస్తారు కదూ!” 

“ఊహ వేరు,” అన్నాను. 

“అబద్ధాల వల్ల వచ్చే అనర్థాలను ఆధారం చేసుకుని ఒక కథ 
రాయకూడదూ!” అన్నాడు శశాంక. 





మాదిరెడ్డి సులోచన కథలు 159 


“ఏది చూచి అది రాస్తాను అనుకునే వాడు రచయిత కాదు. చూచిన 
సంఘటనకు అతని హృదయం కదలాలి. ఆ సంఘటనకు రూపకల్పన చేసేవరకు 
నిదుర పోరాదు... అంతటి స్పందన కలగాలి...” అన్నాను ఆవేశంగా. ఇంతలో 
మా మామయ్య కూతురు వచ్చింది. 

“రావే కూర్చో” అని కూర్చోబెట్టాను. మా ఇంట్లో దాపరికాలు ప్రత్యేకమైన 
గదులు లేవు. అందరమూ కామన్‌ హాల్లో కూర్చుంటాము. 


పరిచయం చేసాను. మా మామ కూతురు జయ అంటూ, అయినా 
శశాంక తన ధోరణి మానలేదు. సిగరెట్టు పేంత్తితే సిగరెట్లు, వాటివల్ల జరిగే 
హాని రాయమంటాదు. వ్యభీచారం, కట్నాలు, కరువు, కాటకాలు, అవినీతి, 
రెడ్‌ టేపిజమ్‌, ఇలా ఎత్తిన ప్రతీది రాయమంటాడు. 


దాదాపు నేను అన్ని సమస్యలు, తీసుకుని కథలు రాసాను. అతను 
చదువలేదా? 


“నా రచనలు ఏం చదివారు?” 

“చాలానే చదివాను.” 

“ఒక్క పేరు చెప్పండి” 

“నాకు పరీక్ష పెడుతున్నారా” 

“అబ్బే, మీరు ఏవో కొన్ని సమస్యలు అడిగారు. వాటి ఆధారంగా నవల 
రాయమన్నారు. అందుకడిగాను” అన్నాను. 

“నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా?” 

“భలే పాతాళ భైరవి హీరో నాకెక్కడ దొరికాడు..” 

“నిజమే చెప్పండి” 

“మనము ఒక్కటీ చదవలేదు.” 

“మరి చదువకుండా అభిమాని అంటారేం?” మా జయ అడిగింది. 

“పేరున్న వారికందరకు అభిమానిని” అన్నాడు నిజాయితీగా. 

“మీరు చదువక పోయినా నాకేం బాధలేదు” అన్నాను. 

అతను నవ్వాడు. 

“మీతో ఏకాంతంగా మాట్లాడాలి.” 





160 అభిమానులున్నారు జాగ్రత్త ! 


“నాతో ఏకాంతంగా మాట్లాడే విషయాలు ఏమున్నాయి.” 

“ఉన్నాయి...” అన్నాడు. 

“జయ నాకు చాలా క్లోజ్‌ చెప్పండి.” 

“మీరు నన్ను (యేమించినా, మానినా నేను మిమ్మల్ని గాఢంగా 
ప్రేమిస్తున్నాను” అన్నాడు. 

“ఏమిటి?” తెల్లబోవటం నావంతయింది. 


“అవునండి. మీరు అవివాహితులు నన్ను ప్రేమించి, నాతో వివాహానికి 
అంగీకరించరు. అందుకే మిమ్మల్ని చూస్తూ ఇక్కడే పడివుంటాను. మీ (స్టిఫ్‌ 
కాపీ చేస్తాను. నెలకో యెనిమిది వందలిస్తే చాలు” అన్నాడు. 

నేనింకా నా షాక్‌ నుండి తేరుకోలేదు. 

“వదినా... వదినా, నాకు ఇప్పట్లో ఉద్యోగం దొరకదు. నీ (సిఫ్ట్‌ కాపీయే 
కాదు, పోస్ట్‌ చేస్తాను. నీ గెస్ట్‌లకు కాపీ చేస్తాను. ఆయనకిచ్చిందాంట్లో సగం... 
సగం ఇవ్వు” అన్నది జయ. 


“ఏమండీ... ఏమిటీ మీ ఉద్దేశం. నేను పరిహాసం ఆడుతున్నానా” అతను 
జయను కొర, కొర చూచాడు. 


“నేనూ పరిహాసం ఆడటం లేదండీ. నిజంగానే అడుగుతున్నాను, ప్రైెఫరెన్స్‌ 
నాకివ్వాలి. స్వంత మామకూతుర్చి” 


“అభిమానులకంటే గొప్పవారు కారు బంధువులు.” 

“రచనలు చదివి అభిమానించాలి”. 

“మేడమ్‌ ఏదయినా మంచి పుస్తకం పేరు చెప్పండి చదువుతాను” అన్నాడు 
శశాంక. 


“మీరు పెద్ద పారిశ్రామికవేత్తలు. నేనిచ్చే ఎనిమిది వందలు ఏ మూలకు” 
అన్నాను కోపం దిగమింగుతూ. 


“పారిశ్రామిక వేత్తనే కాని అవన్నీ మా ఆవిడవి. అయివాంట్‌ టు స్టాండ్‌ 
ఆన్‌ మై ఓన్‌ లెగ్స్‌” 


“ఇప్పడున్నది ఆర్టిఫిషియల్‌ లెగ్సా” 
“జయా” అన్నాను నేను; 





మాదిరెడ్డి సులోచన కథలు 161 


“అయిలవ్‌ పీపుల్‌. పీపుల్‌ టేక్‌ ఇట్‌ ఈజీ. నే ప్రేమించినా నన్నెవరూ 


(ప్రైమించరు...” అతని ముఖంలో దిగులు కనిపించింది. 


వచ్చు. 


ఇదెక్కడి గొవడ... 
టీనేజర్స్‌ అనుకుంటే, తెలిసీ తెలియని వయసు ఏదో తొందరపడ్డారనుకో 


ఎంత లేదన్నా ముప్పై ఏళ్ళుంటాయి. 

ఇదేం పిచ్చి. 

“మేడమ్‌. నాకు ఆకలిగా ఉంది. వడ్డించు”. 

ఈ ఆర్డర్‌ విని ఇంకా తెల్లబోయాను. అడగటంలో అభ్యర్థన లేదు, హక్కు 


అన్నట్టుంది. 


“అలా తెల్లబోతారేమండీ. మేము శివోపాసకులం. రాత్రి కలలో శివుడు 


కనిపించాడు. ఈ పూట భోజనం నా భక్తురాలు... అని ఈ రచయిత్రి పేరు 
చెప్పారు. అందుకే వచ్చాం”. 


చంద్రశేఖర పాహిమామ్‌. 

చంద్రశేఖర రక్షమామ్‌.... 

అంటూ పాట మొదలు పెట్టాడు. 

ఇదెక్కడి అభిమాని. ఏం చేయాలో తోచలేదు. 

అయినా ఆకలితో భోజనం అడిగిన వారికి పట్టెడు అన్నం పెట్టలేమా? 


జయతోపాటు అతడిని భోజనానికి ఆహ్వానించాను. అతను భోజనానికి లేస్తూ, 
చేతిలోని బ్యాగు తీసాడు. అందులో నుండి చీరలు, జాకెట్లు, (బాలు 
బయటపడ్డాయి. 


నేను విస్మయంగా చూచాను. ఇంకా నయం ఎవరూ రాలేదు 


అనుకున్నాను. 


జయ ఫక్కున నవ్వింది. 

“ఇవి మా ఆవిడకని” అతనో వెర్రి నవ్వు నవ్వి బ్యాగులో కుక్కాడు. 
“మీకు తుండు కావాలా” అడిగాను. 

“అక్కరలేదు. లుంగి, పంచ, లాల్చి కావాలి. అవి వేసుకొమ్మని తార 


చెప్పింది” అన్నాడు. 





162 అభిమానులున్నారు జాగ్రత్త ! 


“తార... యెవరా తార?” 

“తార యెవరండీ?” జయ అడిగింది. 

“తార... తార తెలియదా” పక పక నవ్వేసాడు అతను. 

“చెప్పి నవ్వండి బాబూ.” 

“తార. ఆమె ఆకాశంలో వో నక్షత్రం. అందని చందమామ, అరవిరిసిన 
మల్లె మొగ్గ, అందాల అపరంజి...” యెటో చూస్తూ అంటున్నాడు. 

“రచయిత్రితో మాట్లాడుతున్నాననా అంత మైమరుపు” అన్నది జయ. 


“అవును పాడేవారన్నాా రాసేవారన్నా నాకు అభిమానం ఆరాధన. తార 
పాడితే నెమళ్లు పురివిప్పి నాట్యం అందంగా చేస్తాయి.” 


“మీ తార నెమళ్ళని చూసే నాట్యం చేస్తుందా” జయ పక, పక నవ్వింది. 

“ఎందుకు నవ్వుతారు” తీక్షణంగా చూచాడు జయవంక. 

“ఊరికేనే... రావే వడ్డించు...” అన్నది జయ. 

“రా... వే... రా... వే వడ్డించు యెవరినన్నారు?” అతను ఎట్జిబడిన 
ముఖం పైకెత్తాడు. 

“నిన్నూ నీ తారను కాదులే...” నిర్లక్ష్యంగా అన్నది జయ. 

“నేను అభిమానించే రచయితిని.. నేను అభిమానించే రచయిత్రిని “ఏమె” 
“రావె” అనటానికి ఎంత ధైర్యం?” వెళ్లి జయను పట్టుకున్నాడు. 

“ఎంత ధైర్యం.. ఆ.. వదులు...” జయ గింజుకోసాగింది. వారి మాటలు 


వింటూ వంటింట్లోకి వెళ్ళేదల్లా ఆగి ఏమిటో చూద్దును కదా, జయ గొంతు 
శశాంక చేతిలో నలిగి పోతోంది. 


“శశాంకగారూ” వెళ్ళీ బలవంతంగా విడిపించాను. 
“ఏమిటండీ వెర్రి ఆవేశం” 


“నాదే ఆవేశమా. నా ముందు, నా ముండదు, నా కళ్ళ ముందు మిమ్మల్ని... 
నా అభిమాన రచయిత్రిని 'రావే.. పోవే” అంటుందా ఎంత ధైర్యం.” అతను 
ఒగరుస్తున్నాడు. 

“మీ అభిమాన రచయిత్రినయ్యే కంటే ముందు జయకు వదినను.” 

“వదినవే గాని పనిమనిషి కాదుగా.” అన్నాడు తీక్షణంగా. 





మాదిరెడ్డి సులోచన కథలు 163 


“ఇదెక్కడి అభిమానమండీ, నా నవలలు చదువలేదు అంటారు. అభిమాని 
నంటారు.....” విసుక్కున్నాను. 


“నేను చదువకపోతేనేం? నా తార.. నా తార చదివింది. చదివితే మీవే 
చదువమన్నది” అన్నాడు చిన్నబోయి. 


నాకు అతని ధోరణి అర్థం కాలేదు. అభిమానినని వచ్చిన వాడిని 
పిచ్చివాడని యెలా అనుకోను. 


ఆలోచిస్తున్నాను. 
“మీకు శ్రమ ఇస్తే తారకు కోపం వస్తుంది. భోజనం హోటల్లో చేస్తాను 
లేండి” అతను లేచాడు. 


ఆకలంటూ అడిగిన మనిషికి భోజనం పెట్టకుండా పంపగలనా ? 
జయకోసం చూచాను. అది పారిపోయినట్టుంది. 


అతను భోజనం చేస్తుంటే, అతని మనసు స్థిమితంగా లేదని అర్థం 
అయింది. కొద్దిసేపు ఏదో మాట్లాడుతాడు, మరి కొద్దిసేపు నవ్వుతాడు. అన్నంలో 
నెయ్యి వేసుకున్నాడు. ఆ తరువాత పెరుగు వేసుకున్నాడు. 

“నెయ్యితో 'పెరుగా!” అన్నాను. 

“నెయ్యి యిటునుండి వచ్చింది” అంటూనే పెరుగుపై చారు, కూర, 
పచ్చడి వేసాడు. 

“ఏమయినా స్వీటుందా?” 

లేదన్నట్టు తలూపాను. అతను అన్నీ కలిపాడు. గబ, గబా, తినబోయి, 
ముద్ద నావైపు చాపాడు. 

“సారీ...” అన్నాను తలూపుతూ. 

“అభిమానంతో పెట్టేది విషమైనా అమృతం అవుతుంది మేడమ్‌!” 

నేనేం మాట్లాడలేదు. 


అతను చేసిన ముద్దలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. నాకు మింగుడు 
పడలేదు... గుండ్రాయంత అంటామే.. అంతంత ముద్దలు చేసి మింగేసాడు. 
మొత్తం అన్నం నాల్గు ముద్దలు అయింది. 


“బాఫ్‌రే...” అనుకుంటుండగానే అతను తేనుస్తూ లేచాడు. 





164 అభిమానులున్నారు జాగ్రత్త ! 


అప్పుడే పోలీసులతో జయ వచ్చింది. 

అతను కళ్ళు వెళ్ళబెట్టి చూచాడు. 

“ఇతనే.... ఇతనే....” భయంగా తనగొంతు తడుముకుంది. 

“ఈవిడ గొంతు నులుమాలని ప్రయత్నించారా?” 

“మేడమ్‌ అడ్డుపడింది. లేకపోతే చంపేసే వాడిని. చంపేసేవాడిని” 
అన్నాడు నిర్భయంగా. వాళ్ళు అతడిని తీసుకువెళ్ళారు, నన్ను (ప్రశ్నించాక. 

“అబ్బా! ఇదెక్కడి మెంటల్‌ కేసు.... తేలికగా నిట్టూర్చింది జయ. 
నాకెందుకో బాధగా ఉంది. నా స్టేట్‌మెంటు తీసుకుని పోలీసులు వెళ్లిపోయారు. 
మరో గంట తరువాత జయ వెళ్ళిపోయింది. 

నాకెందుకో బాధగా ఉన్నది. 

శశాంక. అభిమాని. ఎందుకలా అయ్యాడు. అతను నిజంగా మెంటల్‌ 
కేసా. అలా ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఆ రోజంతా గడచిపోయింది. 

మర్నాడు శశాంకలాగే ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు. 

“నమస్కారం రచయిత్రి....” 

“నినేనలదిషున! ఆహ్వానించాను. 

“నేను శశాంక అన్నను” అన్నాడు. 

“శశాంక... అయామ్‌ సారీ. అభిమానిగా వస్తే అరెస్ట్‌ చేయించాను.” 

“మంచిపని చేసారు” అతను నిట్టూర్చాడు. 

మీరు వాడికి తెలియక పోయినా వాడి తార అభిమాన రచయిత్రిగా 
మిమ్మల్ని గౌరవిస్తాడు. మీరు వాడిని హంతకుడు కాకుండా కాపాడారు. వాడికి 
పాటలన్నా పాడేవారన్నా పంచప్రాణాలు. “తార” గాయని. చక్కగా పాడేది. 
ఆమె శశాంకకు పరిచయం అయ్యేనాటికే ఇద్దరికీ వివాహాలు అయ్యేయి. 
సాంప్రదాయాలను ఒదులుకోలేక, ఒకరిని, ఒకరు ఆరాధిస్తూ బ్రతికారు. ఆమె 
కోసం శశాంక ఏమయినా చేసేవాడు. చేయటానికి సిద్ధపడేవాడు. ఆమెకు 
అభిమానులయిన వారు వాడికి అభిమానులే. ఆమెకు శత్రువు లయిన వారు 
వాడికి శత్రువులే. ఆ విషయం మా మరదలికి తెలిసింది. ఇంట్లో కలతలు 
ప్రారంభం అయ్యాయి. ఆ అమ్మాయిని తప్పు పట్టలేం...” 


“ప్రతీ భార్య భర్త తనవాడుగా ఉండాలని కోరుకుంటుంది.” 





మాదిరెడ్డి సులోచన కథలు 165 


“ఆ అమ్మాయి ఏడ్చింది. బెదిరించింది. ఒకరోజు ఇద్దరి ఘర్షణ 
తారాస్థాయి చేరుకుంది. విజయవాడలో తారకు ఘన సన్మానం ఉంది. అదే 
రోజు శశాంక బావమరిది పెళ్లి. సన్మానాలు ఎన్నో జరుగుతాయి. పెళ్లీకి వెళ్లాం 
అంటుంది అనురాధ. తారకు ఎన్ని సన్మానాలు జరిగినా తాను వెళ్ళవలసిందే 
అంటాడు శశాంక. ఇద్దరికీ నచ్చ చెప్పాం. “అన్నయ్యా అభిమానానికి అర్థం 
తెలియదు. మీరు వ్యాపారులు” అంటాడు. ఆ అమ్మాయికి నచ్చచెప్పాలని 
చూచాం. “చూడమ్మా. అందరూ ఒకే రకంగా ఉండరు. వాడు ఎమోషనల్‌, 
అదికాక వయసు....” అని చెప్పబోయాను. “మీ తమ్ముడని ప్రతీది అతనిదే 
రైటు అంటారేం” అన్నది. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఏమయిందో మేడమీద 
గదిలో గొడవకి మేం వెళ్ళాం. ఆ అమ్మాయి చీరకు నిప్పు అంటుకుని, గంతులు 
వేస్తుంది. అనురాధ చనిపోయింది. 


48) తమ్ముడే చంపాడు” అంటారు వాడి మామ. అదే సమయంలో 
వాడికి ఉన్న ఒక్క ఓదార్పు దూరం అయింది. తార దూరం వెళ్ళింది. 


మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్యోగం రావటంతో వెళ్ళిపోయారు. అప్పటి నుండి 
ఇంతే. ఒకొక్కసారి తారను తలుచుకుని బావురుమంటాడు. వ్యాపారం 
వదిలివేసాడు. వ్యాపకాలు వదిలి వేసాడు. నెలలకు నెలలు, అలా అలా స్తబ్ధంగా 
ఉండి పోతాడు. ఏం గుర్తుకు వస్తుందో ఒకేసారి లేచి, క్షీన్‌గా తయారయి, 
భార్య బట్టలు ప్యాక్‌ చేసుకుని తయారవుతాడు. తార స్నేహితుల దగ్గరకు వెళ్తాడు. 
ఒకసారి యెవరో తారకు లయ జ్ఞానం లేదు అన్నారు అంటే వాళ్ళను చితక 
బాదాడు. మొన్న పత్రికలో మీ ఫొటో చూచి వెంటనే ఇక్కడికి వచ్చాడు.” 


“మీరు డాక్టరును కన్‌సల్ట్‌ చేయలేదా?” 


“మద్రాసు, బొంబాయి అన్నీ తిరిగాము. అందరూ మెంటల్‌ ఆస్పత్రిలో 
చేర్చించమనే సలహా ఇస్తారు. చూస్తూ, చూస్తూ యెలా చేర్చించను?” ఆయన 
కళ్లు నిండుకున్నాయి. 


అంతటి భారీ మనిషి పసిపిల్లాడిలా అయ్యాడు. 
ఏమని ఓదార్చాలో కూడా తెలియలేదు నాకు. 


“ఈసారి ఇక్కడ చేర్చిస్తున్నాము” అతని మాటలు నూతిలో నుండి 
వచ్చినట్టు వినిపించాయి. 





166 అభిమానులున్నారు జాగ్రత్త ! 


“నన వానో కళ్ళు చమర్పాయి. శశాంక రూపమే కళ్ళ ముందు 
కదలాడింది. 

“మిమ్మల్ని (ప్రేమిస్తున్నాను మేడమ్‌” అన్నట్టే ఉంది. 

“మీకు సారీ చెప్పాలని వచ్చాను” అన్నాడు, అతను లేచి. నా హృదయం 
భారమయింది. మస్తిష్కం మొద్దుబారింది. 

శశాంక అన్నను కాఫీ త్రాగి అయినా పొమ్మనలేదు. 

అతను వెళ్లినా అలాగే కూర్చున్నాను. నాకు తెలియకుండా కన్నీరు 
కారుతుంది. జయ వచ్చిందే గమనించలేదు. 

“అన్నయ్య స్లమ్‌ ఏరియా క్యాంపు నుండి రాలేదా?” అన్నది. 

“లేదు” అన్నాను. 

“ఇప్పుడే సీన్‌ స్పెక్టర్‌ దగ్గర శశాంక అన్న కలిసాడు. నిజంగా కళాకారులు 
అదృష్టవంతులు” అన్నది జయ. 

“కాదు దురదృష్టవంతులు” అన్నాను నన్ను 

“కాదు ముక్కూ ముఖం తెలియని వాళ్ల అభిమానం, (మేమ పొందడం 
ఎంత అదృష్టం. నేను సలహా ఇచ్చానే, తారకీ విషయం తెలుపమని...” 

“వెధవ సలహా ఇచ్చావ్‌! ఇప్పుడు ఒక్కడు సఫర్‌ అవుతున్నాడు. అప్పుడు 
ముగ్గురవుతారు” అన్నాను. 

“అవునే...” ఆలోచనలో పడింది జయ. 

“అభిమానాలు ఎన్నో రకాలు. అభిమానం హెచ్చయి పిచ్చివారయ్యే వారు 
కొందరు. ఆత్మహత్యలకు పాల్పడే వారు మరికొందరు. ఏమిటో జీవితం. 
రచయిత్రిగా నా అభిమానుల అభిమానం దుర్వినియోగం చెయ్యొద్దనే యెప్పుడూ 
కృషి చేస్తాను” అన్నాను నిట్టూరుస్తూ. 

“ఆ తారది తప్పే...” 

“అభిమానం పెంచుకునే నాటికి ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరూ 
నేలవిడిచి సాము చేసారు. తప్పు తారపైకే తోసెయ్యటం భావ్యం కాదు.” 

“ఆమె హాయిగా ఉంది.” 

“స్త్రీ సహనమూర్తి భూదేవి అన్నారుగా. అందుకయినా ఆమె సహనమూర్తి 
అవ్వాలి మరి” అన్నాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 167 


“వస్తానే...” వెళ్లిపోయిందామె. 

నాకు రచయిత్రిగా యెన్నో రెట్ల భారం పెరిగిందని పిస్తుంది. పేరు డబ్బే 
కాదు, బరువు, బాధ్యతలు ఉన్నాయి. నాకు పూజ చేసే అలవాటు లేదు. 
మొదటిసారి చేతులు జోడించి వినమురాలనయి “శశాంక రక్షింపబడాలి...” 
అని ప్రార్థించాను... శూన్యంలో చేతులు జోడించి మరీ ప్రార్థించాను. 

జయ మాత్రం “అభిమానులున్నారు జాగ్రత్త” అంటుంది. అప్పుడప్పుడు. 
నా అభిమానులు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాను. 


(0 





168 అభిమానులున్నారు జాగ్రత్త ! 


ఖరీదయిన స్నేహము 


“బావా !” ఆ పిలుపు సుధదే. తనెలా వస్తుంది? కళ్లు విప్పాను. 
నిజంగా సుధే. నా జీవితములో సుధలు కురిపిస్తానని ముందుకు వచ్చిన అత్తయ్య 
కూతురు. అవమానించి పంపాను. ఆమెను నాకివ్వడానికి సాహసించిన అత్తయ్య 
అజ్ఞానాన్ని హేళన చేశాను. 

“గోపీ! నా మాటవిను. నీ స్వభావాన్ని అర్ధం చేసుకుని సర్దుకు పోగల 
అమ్మాయి ఒక సుధేరా...” నాన్న ప్రాధేయపడ్డాడు. 

“నాన్నా! నాకీ బంధువులంటే మంట. నువ్వు రాసుకుని తిరిగితే తిరిగావు. 
ఈ జిద్దు నాకు అంటగట్టాలని చూడకు” విసురుగా అన్నాను. నాకు అమ్మ 
వంతపాడింది. సుధ మరొకరి ఇల్లాలయింది. 


“బావా!” 

ఆలోచనలు ఆపి లేచి కూర్చోవటానికి ప్రయత్నించాను. శరీరము 
తూలుతుంది. సుధ ఆసరా ఇచ్చి కూర్చోబెట్టింది. 

“సుధా! నాపై... నాపై జాలి చూపుతున్నావా?” 

ఆమె కళ్ళు యెత్తి ఒకసారి నా వంక చూచింది. ఆ చూపులో 'నువ్వ 


యెప్పుడూ ఇంతే” అన్న నిరసన కనిపించింది. అటు తిరిగి తను పట్టుకు వచ్చిన 
బుట్టలోని పళ్ళు, సీసాలు అలమరలో సర్దింది 


“టమెటో సూప్‌ నీకిష్టంగా. ఒక కప్పు తాగుతావా?” 





మాదిరెడ్డి సులోచన కథలు 169 


“తీసుకురా...” అన్నాను. ఇంకేమన్నా ఆమె నొచ్చుకుంటుందని తెలుసు. 
జీవితములో నా అహంకారముతో యొదుటి వారిని నొప్పించిన సందర్భాలు 
కోకొల్లలు. అవి... అసందర్భాలు. ఇప్పుడు పగబట్టిన త్రాచుపాముల్లా నా 
హృదయములో బుస్సుమని, నా మనశ్శాంతిని మింగేస్తున్నాయి. 

“తీసుకో... ఒక్క అయిదు నిమిషాలు ఇలా కుర్చీలో కూర్చో. పడక 
దులుపుతాను” అన్నది సుధ. 

“ఉదయము నర్స్‌ దులిపింది” అన్నాను మొహమాటంగా. 

“మళ్ళీ రేపు ఉదయమేగా” ఆమె చేయూతనిచ్చి కుర్చీలో కూర్చుండబెట్టింది. 
సూప్‌ సిప్‌ చేశాను. పెప్పర్‌ యెక్కువగా పడిందేమో చురుక్కుమంది. 

“మీ ఆయన బావున్నాడా సుధా?” 

“బావున్నారు బావా. వచ్చేవారే. సాయంత్రము యెవరో వచ్చారు” అన్నది. 
సుధ భర్త లాయరు. ఈ మధ్య లాయర్ల రాబడిని గూర్చి చాలా నిరాశగా 
చెప్పుకుంటున్నారు. మరి సుధ భర్త యెలా నెట్టుకు వస్తున్నాడో! 

“పేరు ప్రఖ్యాతులు లేకుంటేనే హాయి బావా. ఆయనకు పేరు రాకపూర్వము 
హాయిగా ఉండేవారము. నెలకు వెయ్యి రూపాయలు వచ్చేవి. గుట్టుగా కాలక్షేపం 
జరిగేది. ఇప్పుడు రాబడి పెరిగింది. పేరు వచ్చింది కాని యెన్నో త్యాగం 
చెయ్యవలసి వచ్చింది. పండుగలు, పార్టీలు, అన్నీ ఒక్కటేమిటి?”అన్నది. 

నిట్టూరుస్తూ, నా జీతం అంత ఉందన్న మాట. సుధ మరో గంట ఉండి 
వెళ్ళిపోయింది. మళ్ళీ విసుగ్గా అనిపించింది. తల దగ్గర అందుబాటులో ఉన్న 
ఫోన్‌ మోగింది. అందుకున్నాను. రఫీ మాట్లాడాడు. వాడు రావాలనుకుంటే, 
తమ్ముడు సినిమా టికెట్లు బుక్‌ చేసి తెచ్చాడట. సినిమాకు వెడుతున్నాడట. 
వెళ్ళమని ఫోన్‌ పెట్టేశాను. కళ్ళు మూసుకున్నాను. 

నాకు నిదురరావడం లేదు. గతించిన సంఘటనలు మనసును 
వేధిస్తున్నాయి. 

“అరే బాయ్‌ గోపాల్‌... నువ్వింత బడా ఇంజనీరువు పెద్ద పార్టీ... అహ... 
అందరూ మరిచి పోలేనంత పెద్ద పార్టీ....” హడావుడి చేశాడు రఫి. 

“ఒరేయ్‌ బచ్చా ! అది మన గోపాల్‌ను అడగాలా వాడి హృదయము, 
వాడి పర్స్‌ రెండు విశాలమయినవి...” తన మాటలకు తనే పరవళించాడు 
రాజా. 





ఖ స్పేహ 
170 రీదయిన ్న్నహము 


“నిజం... ఆ మాట నేను అంగీకరిస్తున్నాను” పాండే వంతపాడాడు. 
వీళ్ళంతా పనిలేని వారేం కాదు. అంతా మంచి ఉద్యోగాల్లో ఉన్నవారే. నేను 
కనిపిస్తే చాలు నా చుట్టూ చేరి భజన మొదలుపెట్టేవారు. అప్పుడు అదేదో 
గొప్ప విషయంగా భావించి పొంగిపోయాను. భజన చేసే అవసరము ఏమిటని 
యెన్నడూ ఆలోచించ లేకపోయాను. రవీకి సంవత్సరానికి కావలసిన 
పచ్చళ్ళు, పప్పులు మా ఇంటినుండి వెళ్ళేవి. రాజా వారంలో నాల్టుసార్లు మా 
ఇంట్లోనే భోజనము చేసేవాడు. 


“అమ్మా! ఉత్తర, దక్షిణలు, తూర్పు పడమరలు చూచాను. ఏ హోటల్‌ 
వాడింత వరకు మీరు చేసినట్టు చేపల కూర చేయలేదు” అమ్మ పొంగిపోయేది. 
ఆ అమ్మ కొడుకు అయినందుకు నేను గర్వించే వాడిని - ఒకవేళ రాజా రాకపోతే 
మా ఇంట్లో వండిన కూరలు వాడింటికి పంపేవారము. పాండే పిల్లలు బొద్దుగా 
ఉండేవారు. అంకుల్‌, అంకుల్‌ అంటూ వదిలేవారే కాదు. ఆ పిల్లలకు ఆట 
సామాన్లు బట్టలు నేనే కొనేవాడిని. 


“బావుంది ఖర్చు మా అన్నయ్య నెత్తిన కొట్టి మీరు దూరంగా నిలబడి 
పోతారేం?” మిసెస్‌ పాండే అడిగేది భర్తను. 

“వాడిది పసిపిల్లల్లాంటి స్వభావము. అందుకే పిల్లలను చేరదీస్తాడు - 
వద్దని నొప్పించటం దేనికి?” అనేవాడు. ఫారిన్‌ వెళ్ళే స్నేహితుల ద్వారా పాండే 
కొడుక్కి రకరకాల కార్లు తెప్పించాను. ఒకరోజు జరిగిన సంఘటన బాగా 
గుర్తుంది. అమ్మకు జ్వరం వచ్చిందని పెద్దమ్మ కూతురు వచ్చింది. నాకు 
బంధువులంటే పరమ చికాకు. నర్ఫును కుదుర్చుకుంటే పోయేదిగా అన్నాను 
- అమ్మ చిరుగా నవ్వింది - నాన్న మాత్రం చిర, బురలాడాడు అప్పుడే. 

“నర్స్‌ వస్తే మీ అమ్మను చూస్తుంది. ఇల్లెవరు చూస్తారు?” నిజమే 
ఉన్నది ముగ్గురమయినా నా స్నేహితులు మరో ముగ్గురుంటారు. అమ్మకు ఆశ్రిత 
జనమున్నారు - ఆ రోజే పాండే కొడుకు కోసము తెప్పించిన మెకానో సెట్టుకు 
వెయ్యి రూపాయలు అయింది. ఆ డబ్బు నేను ఇవ్వగా చూచింది పెద్దమ్మ 
కూతురు - ఆ రాత్రికి నాకు స్వయంగా హార్లిక్స్‌ తెచ్చింది. 

“గుండులేడా?” అన్నాను చికాకుగా - గుండు అంటే మా పనికుర్రాడు. 
వాడి పేరు ఏదో ఇంత పొడవుగా ఉంటే మా వాళ్ళు వాడిని బొద్దుగా ఉన్నాడని 
గుండు అంటూ పిలుస్తారు. 





మాదిరెడ్డి సులోచన కథలు 171 


“ఉన్నాడు తమ్ముడూ. నీతో ఒక చిన్న విషయము చెబుదామని. మా 
పెద్లోడి చదువు అయిపోయింది. మా ఊళ్ళో ఇంకొక్క సంవత్సరం అయితే 
మెట్రిక్‌ అవుతుంది. మా ఆడబడుచు అన్నం పెడతానంది. ఫీజు నువ్వు కడితే...” 

“ఫీజు నేను కడితే వాడు పాసయి నాకు పేరు ప్రతిష్టలు తెస్తాడు - 
మెట్రిక్‌ పాసయిన వాళ్ళు బోలెడు మంది బూట్‌పాలిష్‌ చేస్తున్నారు” మధ్యలోనే 
ఆమె మాట పత్రుంచేశాను. ఆమె కళ్లల్లో కదలాడిన భావాలు చూచి సంతోషించాను. 
లేకపోతే నా స్నేహితుడి కొడుక్కి వెయ్యి రూపాయల బహుమతి కొన్నానని 
ఏడ్చుతో తన కొడుక్కి ఫీజు కట్టమంటుందా? ఆ క్షణంలో అంతే ఆలోచించాను. 
మెకానో సెట్టు పిల్లలు ఓ మూల పడేశారు. దానికి ఖర్చు చేసిన దాంట్లో 
పదోవంతు... అంటే వంద రూపాయలు ఖర్చు పెడితే వాడికి యెంత ఉపయోగ 
పడేదో! ఆలోచన రాలేదు. తల భారమయింది. కళ్ళు మూసుకుని నిదుర పోవాలని 
ప్రయత్నించాను. నిదుర మాత్రం దినమంతా నాతోనే యెందుకుంటుంది? 
దూరాన జనరంజని” పాటలు కాబోలు వినిపిస్తున్నాయి. 

“...తోడొకరుండిన అదే భాగ్యమూ!...” ఉలిక్కిపడ్డాను. నేను చదువులో 
ఫస్ట్‌. మంచి పదవిలో ఉన్నాను. నాతోపాటు పాసయిన ఇంజనీర్లు చిన్ను చిన్న 
పనులు చేస్తున్నారు. అలాంటప్పుడు నేను గర్వపడటంలో తప్పులేదనుకున్నాను. 
ఓ సుపిరియారిటీ కాంప్లెక్స్‌ పెంచుకున్నాను. నాకు తెలిసిన విషయాలు మరెవరికి 
తెలియవన్న నిర్ణయానికి వచ్చాను. నేను అన్నది నిజము కాబట్టి అందరు 
అంగీకరించి తీరాలని పట్టుపట్టేవాడిని. అందరు అంగీకరించేవారు. తాడంటే, 
తాడు పేడంటే పేడు అనేవారు నా స్నేహితులు. దాంతోనా ఆత్మవిశ్వాసము 
మరింత పెరిగిపోయింది. వారు నా హోదాకు, డబ్బుకు తలవంచి, నాతో 
పబ్బం గడుపుకోవటానికి అలా అంటున్నారన్న గహింపే లేదు. సంబంధాలు 
వస్తున్నాయి. ఒక్కటీ నాకు తగినదని అనిపించలేదు. నేను వివాహితుడిని అయితే 
తమ ఆటలు సాగవని కాబోలు నా స్నేహితులు కూడా వచ్చిన సంబంధాలకల్లా 
వంక పెట్టేవారు. 

“మనవాడు పంజాబీయులలో పుట్టవలసిన వాడు. వాడికి తగిన అమ్మాయి 
కావాలి” అనేవారు. అలాంటప్పుడు నా రంగు, ఒడ్డు పొడవు చూచుకుని 
మురిసిపోయేవాడిని. 

“ప్రతి వారిలో ఏదో ఒక లోపముంటుంది. రాజీ పడాలి” నాన్నగారు 
విసుక్కునేవారు. 





172 ఖరీదయిన స్నేహము 


“మీరు మరీనండి బాబాయిగారూ! వాడి కోసం యెక్కడో పూజ చేస్తున్నది. 
వాడు అన్నింటిలో ప్రత్యేకత కలిగనవాడు. ప్రత్యేకత కల అమ్మాయి దొరకాలి” 
రాజా అనేవాడు. నిజంగానే నా అహంకారానికి సవాలుగా నా జీవితంలో 
ప్రవేశించింది అమృత. పేరులోనే ఉందిగానీ స్వభావములో లేదు. ఇద్దరూ ఒకే 
అభిరుచులు గలవారు ఒకచోట ఉండగలరేమో గాని ఒకే స్వభావాలు గలవారు 
ఉండలేరు. అది మా విషయంలో నిరూపింపబడింది. పదేళ్ళు పెళ్ళీ చూపులతో 
గడిపాము. చివరకు అమృత క్లబ్బులో పరిచయము అయింది. ఆమెను వివాహము 
చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అమృతను మా వాళ్ళకు పరిచయము 
చేశాను. అమ్మ వెంటనే ముహూర్తం పెట్టించమన్నది. మళ్ళీ యెక్కడ మనసు 
మార్చుకుంటానో నని ఆమె భయము. అమృత వాళ్ళింటికి వెళ్ళాము. అమృత 
అందరిముందే పనివాడిని నానా మాటలు అన్నది, కప్పులపై మరకలు 
కనిపించాయని. నాన్న యెందుకో ముఖం చిట్లించారు. ఇంటికి రాగానే తన 
అభిప్రాయము చెప్పారు. 

“చూడు గోపీ, నువ్వు యెలా పెరిగావో ఆ అమ్మాయి అలాగే పెరిగింది. 
సంసారము చక్కగా సాగాలంటే, ఒకరు కాస్త తగ్గి ఉండాలని నా భావన...” 

“ఫ్యూడల్‌ థింకింగ్‌! ఆడదానికి వ్యక్తిత్వం ఉండొద్దనేగా మీరు అనేది?” 
నేను రోషంగా అడిగాను. 

“ఛ... ఛ... నేను ప్రీ, పురుషులని విశ్లేషించటము లేదురా. మీ ఇద్దర్లో 
ఒకరు సర్దుకుపోవాలి. మీ అమ్మ పట్టుదలను నేను సర్గుకుపోతుంటాను....” 
నాన్నగారు నవ్వలేక నవ్వారు. 

“అదేం లేదు బాబాయ్‌! సంసారములో సర్దుకు పోవటం అంటూ ఉంటే 
సారం లేక చప్పగా ఉంటుంది గో అహెడ్‌ గోపీ” అప్పుడే వచ్చిన రాజా 
ప్రోత్సహించాడు. నాన్నగారు తృప్తిగా అంగీకరించలేదు. నా స్నేహితులందరికి 
అమృత పరిచయమేనట. 

“అవునులే వాడి పెళ్ళాం కావాలని ఉందా ? మీ చెల్లెలు, మీ కోడలు 
మీకు కావాలి” విసురుగా అమ్మ నిష్టూరం వేసింది. 

“నీకు అసలు మతిపోయింది. ఇప్పుడే పెళ్ళి ఆపినా, సుధను తెచ్చి 
చేయగలనా? దాని పెళ్ళి అయిపోయింది. ఇక మీ ఇష్టం” అన్నారు. 

క్లుప్తంగా మా వివాహము తిరుచానూరులో జరిగింది. అమృతను చూచి 
అందరూ అభినందించారు. 





మాదిరెడ్డి సులోచన కథలు 173 


“ఇన్నాళ్లు ఆగినా చక్కని జోడి...” అని నా స్నేహబృందము సంతోషము 
ఇంతా అంతా కాదు. నాచేత రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టించి పార్టీ 
తీసుకున్నారు. ఆ రోజే మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మొదలు అయ్యాయి. 

“అనవసరంగా స్నేహితుల కోసం రెండు వేలు ఖర్చు పెడతారా?” అమృత 
నిలదీసింది. నా అహం దెబ్బతిన్నది. నేను సంపాదించని రోజులలో, నా 
తల్లిదండ్రుల డబ్బుతో నా స్నేహితులకు పార్టీలిచ్చాను. బహుమతులిచ్చాను, 
అప్పులిచ్చాను. వారు ఏనాడు ఆంక్ష విధించలేదు. ఆఫ్టరాల్‌ ఈ అమ్మాయి 
యివరు ? 

“నా ఇష్టం !” అన్నాను పొగరుగా. అంతే మధురంగా గడుపవలసిన 
రాత్రి ఒంటరిగా గడిపాను. నా జీవితంలో భాగం పంచుకుంటున్న యువతికి 
ఆ మాత్రం అధికారం లేదా, అని సర్దుకోబోయాను. అప్పుడే నా స్నేహితులు 
వచ్చారు. నా ఒంటరితనానికి కారణం కనుక్కుని తలొకరకంగా సలహా ఇచ్చారు. 

“ఒరేయ్‌ ! మాది బీబీ అయితే ఉర్‌బైట్‌ (గుంజీలు) చేయిస్తాం. నిన్ను 
మామూల్‌ మనిషి అనుకుందిరా.... చోకిరికి బుద్ధి రావాలంటే నువ్వు ఖడక్‌గా 
ఉండు” రఫీ సలహా ఇచ్చాడు. రఫిని చూస్తే అమృత మండిపడేది. 

“ముఖస్తుతి చేసేవారిని మూడు మైళ్ల దూరం ఉంచాలి” అంటారు నాన్న. 
కాని వాడి మాటలు నాకు సంగీతంలా వినిపిస్తాయి. 

“నీలాంటి వ్యక్తికి యెదురు తిరిగే సాహసమా?” 

“మనమే వాడికి జడుస్తాము కదా!” 

నా స్నేహితుల మాటలు వింటుంటే నా అభిమానము రెట్టింపు అయ్యేది. 
అమృతపట్ల పూర్తిగా నిరసన పెంచుకున్నాను. వారు అంతటితో ఆగలేదు. 
నాకు సలహా ఇచ్చే వారందరితోనూ నా సబంధాలు తెంచేశారు. 

“మీ సుధ కనిపించిందిరా. యెంత గీర అనుకున్నావు.... నన్ను 
కాదన్నందుకు బాగా శాస్తి అయిందని నిన్ను నానా మాటలన్నదిరా” పాండే 
చెప్పాడు. సుధను కాదన్నా ఆమెలోని కొన్ని సుగుణాలు తెలుసు కాని ఆ క్షణంలో 
పాండే నా శ్రేయోభిలాషిగా కనిపించాడు. అందుకే సుధను పిలిపించి చెడా, 
మడా దులిపాను. 

“మీ మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన్నట్టు కూడా తెలియదు బావా!” అన్న 
ఆమె మాటలు వినిపించుకోలేదు. 





174 ఖరీదయిన స్నేహము 


“ఓరేయ్‌ నీ ప్రాణస్నేహితుడని డబ్బాలాడతాడే శ్రీకర్‌. వాడు నీ గురించి 
చాలా నీచంగా మాట్లాడుతున్నాడు” రాజా చెప్పాడు. అందరితో తగవులే. 
సాయంత్రము అయ్యేసరికి మేం నల్లురం మీటింగ్‌ వేసుకునేవారము. 

“మీ మాయల ఫకీరు ఏడి” అనేది నాకు వాడంటే చాలా ఇష్టం. 

నా హోదా, నా చదువు నేను అంటూ ఓ మనిషిని ఉన్నాననే 
మరిచిపోయాను. స్నేహితులు చెప్పిందానికి తలాడించేవాడిని. రోజూ కోడీ చేపలు 
వండించే వాడిని. ఒకవేళ అమ్మ విసుక్కుంటే వెంటనే చైనీస్‌ రెస్టారెంట్‌కి పంపి 
తెప్పించేవాడిని. వారంత ఆప్తులు లేరనిపించింది. అమృతకు విడాకుల నోటీస్‌ 
పంపుతుంటే అమ్మ వణికిపోయింది. 

“ఏమిట్రా ఇది? మీ ఇద్దరి స్వభావము ఒకలాంటిదే అని మీ నాన్న 
వద్దన్నారీ పెళ్ళీ. ఇష్టపడి చేసుకున్నావు. ఒక్కసారి పొరపాటు జరిగింది. 
సర్దుకుపోవాలి...” దీనంగా అడిగింది. 

“మనవాడికేం తక్కువని....” రాజా అడ్డు వచ్చాడు. 

“రాజా ఇన్నాళ్లు మీరు ఏది చెప్పినా వాడు విన్నా నేను యెదురు చెప్పలేదు. 
పచ్చని కాపురములో చిచ్చు పెట్టాలని చూచే మీరు స్నేహితులా?” ఆవేశంగా 
అరిచింది అమ్మ. 

“నీ కోడలు వస్తూనే నిన్ను పొమ్మంటే?” వెటకారంగా అడిగాడు పాండే. 

“అలాగే వెళ్ళిపోతాను. నాకు నా కొడుకు క్షేమము కావాలి” అన్నది 
దృఢంగా. 

“ఊరోవే... ఏమిటా మాటలు!” నాన్న వారించాడు. 

“ఇదిగో అమ్మా, నేనేం చిన్న కుర్రాడిని కాదు. నన్ను అమృత విషయంలో 
బలవంతం చేస్తే ఇల్లు విడిచిపోతాను” అన్నాను. అమ్మా, నాన్న వాళ్ళలో వాళ్ళేం 
కుమిలిపోయారో. మళ్లీ కోడలి ప్రస్తావన యెత్తలేదు. నాల్గురోజుల తరువాత 
యాత్రలకంటూ ఇద్దరూ బయలుదేరారు. నాకు తెలుసు వారు అలిగిపోతున్నారని. 
నాకు పట్టుదలగానే ఉంది. వాళ్ళు బంధాలు తెంచుకునిపోతే, నేనా తీసిపోయింది. 

“ర్మ ఓల్డ్‌ సెంటిమెంటుతో చస్తాంరా. నీకు నచ్చలేదు, నీ పెళ్ళాన్ని 
వదిలేస్తున్నావు. సింపుల్‌...” రాజా నాకు వంత పాడాడు. నాకు కావలసినంత 
స్వేచ్చ సాయంత్రము నేను, నా స్నేహితులు బార్‌లకు, యెక్కడ ఖరీదయిన 
కాలక్షేపముంటే అక్కడికి వెళ్ళేవారము. ఒకనాడు పాండే హడావుడిగా వచ్చాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 175 


“ఒరేయ్‌ గోపీ, నువ్వు తప్ప నాకెవరున్నారురా! నీ చేతుల్లో పెరిగినవాడు 
మా పెద్దాడు మెడిసన్‌ చదువుతానని ఏడుస్తున్నాడు. పిచ్చి సన్యాసి...” 

“ఉపోద్దాతమంతా దేనికిరా డొనేషన్‌ కట్టు” చెక్కు రాసిచ్చాను. రఫీ ఇల్లు 
కడుతుంటే సహాయము చేశాను. రాజా వ్యాపారానికి పెట్టుబడి పెట్టాను. 
జీవితమంటే స్నేహితులతో హోటళ్లల్లో తిని పడుకోవటం అనుకున్నానే తప్ప, 
దానికో అర్థం, పర్ధం ఉందని ఊహించలేదు. నాన్నగారు వ్రాసే ఉత్తరాలకు 
కూడా, నాల్లు వస్తే ఒక్కసారి జవాబులు ప్రాసేవాడ్ని. 

రెండు సంవత్సరాలు తిరిగాయి. నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ తగ్గిపోయింది. 
నేను అన్న అహం, నాకే ప్రపంచ జ్ఞానమున్నదన్న మిడిసిపాటు మిగిలాయి. 
మెల్లగా స్నేహితులు తప్పుకున్నారు. పూర్తిగా చెడిపోయాడు అంటూ ప్రచారం 
ప్రారంభమయింది. నేనే స్నేహానికి తప్పుడు నిర్వచనం చెప్పుకున్నాను. 
భజనరాయుళ్లను స్నేహితులుగా నమ్మాను. స్నేహము చేశాను. స్నేహము ఖరీదు 
చెల్లించాను. ఒంటరితనము, నా పాత జ్ఞాపకాలు నా శాంతిని తీసుకున్నాయి. 
పని చేస్తూ అన్నీ మరిచిపోవచ్చని రాత్రింబవళ్ళు పనిచేయటము (ప్రారంభించాను. 
నా ఆహారము సంగతే మరిచిపోయాను. యెన్నో రాత్రులు ఇంటికివచ్చి, నిద్దుర 
పట్టక నిదురమా(త్రలు వేసుకుని పడుకునేవాడిని. నా స్నేహితులనబడే 
భజనరాయుళ్ళ ఇండ్లలో పార్టీలు అవుతున్నాయి, ఫంక్షన్లు అవుతున్నాయి. 
నేనంటూ ఉన్నానని వారికి గుర్తే లేదు. వచ్చే బంధువులు మాత్రం యెవరున్నారు! 
అందరిని దూరం చేశాను. నా ఆరోగ్యం దెబ్బతిన్నది. వచ్చి ప్రయివేటు 
నర్సింగ్‌ హోమ్‌లో చేరాను. డాక్టర్‌ గారు బాగా తెలిసినవారు. నర్సింగ్‌ హోమ్‌ 
లోనే దూరంగా చిన్న ఉపవనములో ఉన్న ఇల్లు (దాన్ని పెద్దవారు వాడుతారట) 
నాకిచ్చాడు. స్పెషల్‌ వార్డ్‌ అంటూ నర్సులు, డాక్టరు ప్రత్యేకంగా చూచినా ఏదో 
లోపము కనిపించేది. ఏమిటని ప్రశ్నించుకుంటే జవాబు లేదు. మనిషి డబ్బు 
చేతిలో ఉండగానే తన వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవాలి. తను యెంతవరకు 
నిలబడగలడు ఈ భజన రాయుళ్ల మధ్య అని మొదటి పరీక్ష ఇక రెండోది 
యెవరు తన హితులు అన్న విషయము తేల్చుకోవాలి. కొన్నిసార్లు మన అంచనా 
తప్పు కావచ్చు. కొన్ని తెగేవరకు తాడు లాగినట్టు నాలా పూర్తిగా మునిగేవరకు 
నమ్మవద్దు. 

ఈ ఒంటరితనములో అందరూ గుర్తుకు వస్తున్నారు. నా స్నేహితులు 
నాకు దూరమయినాసరే, ఈ స్థితిలో వస్తే బావుండును అనుకున్నాను. నేను 





ఖ స్పేహ 
176 రీదయిన ్న్నహము 


అనుకున్న వారెవరు రాలేదు. కాని యొన్నడు పిలువని సుధ వచ్చింది. రక్త 
సంబంధమా ! ఆ రాత్రికి సుధ భర్త వచ్చాడు. ఒక గంట కూర్చుని వెళ్ళిపోయాడు. 
రెండు రోజులు భారంగా గడిచాయి. సుధ పంపిన కాఫీ త్రాగుతున్నాను. అమ్మ 
కలిపిన కాఫీలా, చాలా బావుంది. అమ్మ, నాన్నా వచ్చారు. వారిని చూడగానే 
ఆనందముతో గంతులు వేయాలన్నంత కోర్కె కల్గింది. కాని లజ్జతో మాట్లాడలేక 
పోయాను. 


“మేమిలా రావటం నీ కిష్టం ఉండదురా, కాని కన్నకడుపు, ఆ బంధం 
తెంచుకోలేక పోయాము” అమ్మ కన్నీటితో నా చేయి నిమిరింది. 

“అమ్మా!” దెబ్బతిన్నట్టు చూచాను. 

“అమ్మను యెప్పుడో మరిచిపోయావు. లేకపోతే ఒక్క ఉత్తరం వ్రాయవా?” 
అన్నది కన్నీటితో. అవేవి నాకు కనిపించటం లేదు. యెంతో శాంతిగా, నిశ్చింతగా 
ఉంది. ఆత్మీయత అంటే ఏమిటని హేళనచేసే నాకు ఆ రోజు తెలిసింది ఆత్మీయత 
అంటే ఏమిటో! 


“నాదే పొరపాటండీ. పిల్లలను గారాబంగా పెంచటమే కాదు, వివిధ 
పరిస్థితుల్లో బ్రతుకడం కూడా నేర్పాలి.” 


“ఊం...” నాన్న మాట్లడలేదు. నాకు తెలుసు ఆయన నా గురించే 
ఆలోచిస్తున్నారని. నా కాపురము బాగు చేయాలని. అమ్మకు నా ఆరోగ్యం 
గురించి ఆందోళన. మీరు వచ్చారు. నాకేం బావున్నాని అనాలనిపించింది. 
కాని నోరు విప్పలేకపోయాను. నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాను. స్నేహము 
ఖరీదుతో కొనకండి, ఆత్మీయతతో ఆకట్టుకోండి” అని వచ్చిన వారందరి దగ్గర 
అరవాలనిపించింది. ఏమీ చేయలేకపోయాను. 


(0 





మాదిరెడ్డి సులోచన కథలు 177 


జరుగుతున్న చరిత్ర 


ఆ రోజు ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది బాలకృష్ణకు. తనకు 
మంచిదో, చెడ్డదో అయిదెకరాల కొండ్రు వచ్చింది. దాన్ని తన అభిరుచులకు 
అనుగుణంగా తీర్చిదిద్దుకుంటాడు. తనకెన్నో ఉపాయాలున్నా, అమల్లో పెట్టటానికి 
అధికారం లేదు. పొలమంతా తండ్రిపేర వుండేది. తండ్రి ఆరోగ్యం 
పాడయిపోవటంతో ముగ్గురు కొడుకులకు మూడు అయిదులు పదిహే 
నెకరాలలిచ్చి, తనకు మూడెకరాలుంచుకున్నాడు. తన తదనంతరం కొడుకులకు 
తలొక యెకరం అని వ్రాసాడు రామయ్య. చెబువు క్రింద అర ఎకరం తరి 
పొలం వుంటే అది పెద్ద కొడుక్కు ఇచ్చాడు. “చూడండిరా, ఆ అర యెకరం నా 
స్వార్దితం. ఆడు తెలిసీ తెలియక అయిదుగురు పిల్లలను కన్నాడు. అది ఆడికిస్తాను” 
అన్నాడు. 

మిగిలిన ఇద్దరు కోడండ్లు మూతులు తిప్పినా, తండ్రికి కొడుకంటే 
సానుభూతి వుంది. దాన్ని తమ భర్తలు ఎదురించరని తెలుసు. 

బాలకృష్ణ భార్య వరాలు భర్త ఇంట్లోకి రాగానే మూతి మూడు వంకర్లు 
తిప్పింది. 

“మీ నాయనకు అదేం యిదయ్యా ! రేపు మనకు పిల్లలు పుట్టరా? 
ఖర్చులుండవా?” కంయిమంది. 


“ఊర్మోయే! చూడు నాలుగేండ్లలో అర యెకరం కాదు అయిదెకరాలు 
సంపాయించుకుంటాము.” 





178 మాదిరెడ్డి సులోచన కథలు 


“ఆం... సంపాయించుకుంటము. దేవుడు యెదురుపడి వంద రూపాయలవి 
ఓ వంద నోట్లు యిస్తానన్నాడా ఏం?” వెటకారం చేసింది. 

“వరాలూ! మీ వూరిలో అంతా యిసుక కదే. అది నీ బుర్రలో దూరింది. 
దేవుడు యెక్కడో లేదే. మన కండ్లలో వున్నాడు” అన్నాడు. చింకిచాపపై వెల్లకిలా 
పడుకున్నాడు. అతని భవిష్యత్తు అంతా బంగారుబాటలా కనిపిస్తుంది. 

వరాలు అన్న రాఘవులు వచ్చాడు. 

“బాలయ్య బావా! పట్నం వస్తావేం ఫ్యాక్టరీలలో దినానికి అయిదు, ఆరు 
దొరుకుతున్నాయంట. ఓ యాడాది జేస్తే పర్మినెంటు అయితదంట” అన్నాడు 
రాఘవులు. 

“ఆర్నెళ్ల క్రితమయితే వచ్చేటోడిని బావా! ఇప్పుడు రాను. నాకు 
అయిదెకరాల పొలం వుంది. ఇంకొకరి చేతి (క్రింద పని చేయటం ఏమిటి?” 
అన్నాడు సగర్వంగా. 

“అయిదు లక్షలున్నట్లు నీల్లుడు చూడు అన్నా” వరాలు గురిగిలా వంటింటి 
నుండి వచ్చింది బయటికి. 

“వరాలూ! నువ్వుండు కాసేపు. బాలయ్యా రెడ్డిగారికి పొలం తక్కువా 
కొడుకును కొలువులో పెట్టిండు” రాఘవులు అడిగాడు. 

“చూడు బావా! వాళ్ళు జీతగాళ్ళపై ఆధారపడ్డవారు. మనము సయాన 
కనపడతాము” లేచి కూర్చున్నాడు. 

టు దగ్గర మిగిలిన రెండు దున్నపోతులతో, అయిదెకరాల పొలంతో ఏ 
పని చెయ్యలేవు బాలయ్యా!” 

“చూడు బావా! నన్నెందుకు గాలి బతుక్కి ఈడుస్తవు! ప్రభుత్వం 
ఆప్పిస్తుంది. ఆ అప్పుతో బావి త్రవ్వుతాను. పాతాళ గంగను పైకి రప్పిస్తాను. 
ఒక్క యెకరం మాత్రం వరి ఏస్తాను. ఒక యెకరంలో నా కోసం చిన్న పూరిల్లు, 
పూలు వేసుకుంటాను. మిగతా మూడెకరాలలో కూరగాయలు పండిస్తాను. ఓ 
చిన్న బండీ కొంటాను.” 

“చెప్పుకోవటానికి బాగున్నాయి కాని చేయడానికి కష్టంగా వున్నాయి. 
వస్తాను వరాలు....” రాఘవులు వెళ్ళిపోయాడు. 

వరాలు దిగులుగా చూస్తూ గది గుమ్మంలో నిల్చుంది. ఇద్దరు బావలకు 
ఇల్లు వదిలేసి, ధాన్యం కొట్టు తీసుకున్నాడు బాలకృష్ణ. వాళ్ల తాత కాలమునాడు 
గింజలు బాగా పండితే అందులో పోసేవారట. 





జరుగుతున్న చరిత్ర || 79 


“వరం... ఓయ్‌ వరాలూ!” బాలకృష్ణ పిలిచాడు. 

“ఏమిటే! ఇంకా కోపమేనా? ఇట్లారా!” అన్నాడు. విసురుగా పోబోయి, 
భర్త కళ్లల్లోని ఆదరణకు కరిగిపోయి, తలుపు చేరవేసి వచ్చి భర్త దగ్గర కూర్చుంది 
వరాలు. 

“నేను చెప్పింది వినిపించిందా?” ఆమె నడుముకు చేయి చుట్టి అడిగాడు 
బాలకృష్ణ. 

“ఊం!” అన్నది. 

“అక్కడికి వెళ్ళి, చాలీచాలని జీతాలతో యెలా (బతుకుతాం. రేపే 
అప్పుకోసం అప్లికేషన్‌ పెడతాను” అన్నాడు. 

“మనకు దొరుకుతుందా?” 

“పిచ్చిదానివి వరాలు. ప్రభుత్వం ఇలాంటి సదుపాయాలు చేసిందే 
మనలాంటోళ్ల కోసం” అన్నాడు ఆమె బుగ్గ చుంబిస్తూ. 

“చ్చీ... ఫో...” లేచిపోయింది వరాలు. కండబలం, గుండెబలం కల 
తన భర్త వుండగా తనకేం భయం అనుకుంది. అతనికి చిట్లులువలు తెచ్చి 
పెట్టింది. 

అతను ఉలవలు తిని, మంచినీళ్ళు తాగాదు. 

“అట్లా కరణంగారి దగ్గరకి వెళ్ళి వివరాలు తెలుసుకు వస్తాను” అని 
లేచి దండెం మీద చొక్కా తీసి తొడుక్కుని బయటికి వెళ్ళాడు. 

వరాలు పొయ్యిమీద యెసరు పెట్టింది. భర్త చూపిన స్వర్గం చూస్తూ 
నిలబడి పోయింది. ఎంత హాయి! ఎంత బాగుంది తన వ్యవసాయం! తను 
పూలు తెంపి అమ్మి ఇల్లు గడుపుతుంది. భర్తను ఒక్కపైసా అడగదు. అతను 
తెచ్చిన డబ్బు అంతా జమ చేసి మొదట ఎడ్లు కొంటారు. తరువాత ఓ గేదెను 
కొంటారు, అలా అలల్లాలేచి పడుతున్నాయి ఆమె ఆలోచనలు. ఆమె ఊహలలో 
ఊయలలూగుతూ, ఇల్లు కట్టింది, పంపుసెట్టు పెట్టింది. యెన్నో... యెన్నో! 

బాలకృష్ణ కరణంగారు వేసిన ప్రశ్చలన్నింటికి జవాబు చెప్పినా, ఏదో 
నానుస్తాడు. 

“తీసుకున్నవాళ్ళు కిస్తులు కట్టటం లేదుట. ప్రభుత్వం కొత్త రుణాలు 
యివ్వటం లేదు” అన్నాడు. 





|| 80 జరుగుతున్న చరిత్ర 


బాలకృష్ణ బేజారయి బయటికి వచ్చాడు. కరణంగారి గుమస్తా ముసి, 
ముసిగా నవ్వాడు. 

“బాలకృష్ణా! కండబలం, గుండెబలమే కాదు. బుద్ధిబలం కూడా వుండాలి. 
ఓ వంద రూపాయలు కర్ణం చేతిలో బెట్టు, అన్నీ సాఫీగా సాగుతాయి” సలహా 
ఇచ్చాడు. 

“లంచమా?” 

“కాదు లాంఛనము” అన్నాడు వీడీ కాలుస్తూ. లాభం లేదని, 
దాచిపెట్టుకున్న వంద రూపాయలు కర్ణానికిచ్చాడు. అతని అప్లికేషన్‌తో పాటు, 
కర్ణంగారు కూడా రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ దగ్గరకు వచ్చాడు. 

“ఊం!.... ఓ దో సౌ రుపియా కావాలి...” అన్నాడు. 

బాలకృష్ణ తెల్లబోయాడు. 

“మీకు సర్మారోల్లు జీతం ఇయ్యరా అయ్యగారూ?” అమాయకంగా 
అడిగాడు. నిండుకుండ (బ్రద్దలయినట్టు నవ్వారు ఇద్దరూ. 

“ఏ కాలం వాడయ్యా?” అన్నాడు ఇన్‌ స్పెక్టర్‌. 

“అయ్యా! ఇన్నాళ్ళు అయ్యచాటున బ్రతికాడు. వెర్రిబాగుల వాడు. మొదటి 
కిస్తు రాగానే మీ లాంఛనం తీసుకుందురుగాని” కరణం సర్ది చెప్పాడు 
ఇన్‌ స్పెక్టరుకు. 

“ఏమయ్యా! మొదటి కిస్తు రాగానే నా కిస్తావా?” రెవెన్యూఇన్‌ స్పెక్టర్‌ 
అడిగాడు. 

“అది కాదండీ, ఈ కిస్తులేమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు బాలకృష్ణ. 

“ఓ, అది తెలియదా? ఇదిగో బాబూ నీకు బాయి త్రవ్వకానికి మూడువేలు 
మంజూరు అవుతే, వెయ్యి ఒకసారి, మరో వెయ్యి ఇంకోసారి, ఆఖరు కిస్తు 
మరో వెయ్యి ఇస్తారు” అన్నాడు. 

బాలకృష్ణకు ఆ విషయం బొత్తిగా గిట్టలేదు. అంతా వొక్కసారిస్తే వీళ్ళ 
సొమ్మేంపోయింది? 

“తొందరగా చెప్పు బాలయ్యా” కరణం అడిగాడు. 

“చెప్పటానికేముందండి! మీ ఇష్టం” అన్నాడు. ఎంత ఉత్సాహంగా వెళ్ళాడో 
అంత నీరసంగా తిరిగి వచ్చాడు. భార్య ముందు బయట పడకూడదని నిబ్బరంగా 
వున్నాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 1 8 1 


మర్నాడు మరో యాభయి రూపాయలు ఖర్చు పెట్టి భూగర్భ శాగ్రజ్ఞుడిని 
తీసుకువచ్చాడు. అతడు నీళ్లు పడతాయన్నచోట కాసింత త్రవ్వాడు. ఆ భాగం 
చూచుకొనే మురిసిపోయాడు. అక్కడ బావి త్రవ్వినట్టు నీళ్లు పడి, తన పంట 
మూడుపువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని కలకన్నాడు. 

తెల్లవారి వెళ్ళేసరికి త్రవ్వినంత దూరం పూడుకుపోయింది. అది పల్లంలో 
వుందని మరిచిపోయాడు. 

ఈ సారంటే పోయింది. ఇకముందు ఒకే తడవ (త్రవ్వుతాను, 
అనుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన లాంఛనాలు పోను, తిరిగిన ఖర్చులు 
మినహాయించగా మిగిలింది అయిదు వందల రూపాయలు. వెయ్యి రూపాయలు 
అప్పు తీసుకుంటే సగం ఖర్చు పెట్టాలన్న సత్యం తెలిసేసరికి అతని నవనాడులు 
క్రుంగిపోయాయి. ఇది మొదటిసారి కాబట్టి అంత ఖర్చు అయింది. రెండవ 
వాయిదాకు అంత ఇవ్వవలసి వుండదు అనుకుని కరిగిపోతున్న ఆశను అదిమిపట్టి 
రంగంలోకి దిగాడు. 

అట్టడగునున్న వారి ఓట్లు పడాలని మంచి, చెడులు ఆలోచించక పెంచిన 
కూలి, బాలకృష్ణను బావిలోకి త్రోసింది. భార్యాభర్తలు కూలీలతోపాటు పనిచేస్తే 
గజం బావి తెగింది. అంతకే మురిసిపోయారా దంపతులు. 

“మనము బావి త్రవ్వగలమా?” వరాలు అడిగింది. 

“నీకు అనుమాన మెందుకు వచ్చింది? పాతాళ గంగమ్మను ప్రసన్నం 
చేసుకుంటానో లేదో చూడు” ఆమె నెత్తిపై మొట్టాడు. 

భార్యాభర్తలు కలల్లో తేలిపోయి ఆ చింకి చాపనే పట్టుపరుపుగా భావించి, 
ఆనందంగా గడిపారా రాత్రి. 

మళ్ళీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ మొదలు అయింది. దేవుడికయినా 
ఒకసారి పూజాద్రవ్యాలు మరిచి పోవచ్చుగాని, ఆఫీసుల్లో అధికార్ల దగ్గర నుండి 
గుమస్తాలకు ఎక్కడి కక్కదే పరగడుపు. ఎప్పటికప్పుడు కొత్త. బాలకృష్ణకు చికాకు 
కలిగింది. ఈసారి లంచాలు ఇవ్వనుగాక ఇవ్వను అని భీష్మ ప్రతిజ్ఞ చేసాడు. 

ఫలితం? రెండవ వాయిదా రావటానికి చాలా ఆలస్యం అయింది. త్రవ్విన 
వాక మీటరు లోతు ఇసుకతో, చెత్తా చెదారంతో పూడుకుపోయింది. రెవిన్యూ 
ఇన్‌ స్పెక్టర్ని చూచినప్పుడు బాలకృష్ణ తడబడ్డాడు. 

“ఏమయ్యిందయ్యా?” 





182 జరుగుతున్న చరిత్ర 


“బావి పూడుకుపోయింది. మీరొచ్చి చూసినా అక్కడేం ఉండదు సర్‌” 
అతను చిన్నగా నవ్వాడు. 

“ఉభయతారకంగా ఓ మాట చెబుతాను వింటావా? యెనిమిది 
వందలిస్తాను. అలాగే నువ్వు రెండు మీటర్ల లోతు త్రవ్వినట్టు రిపోర్టు రాసి పైకి 
పంపాను కదా. ఈసారి జాగ్రత్తగా త్రవ్వు” అన్నాడు. 

ఆశయాన్ని ఆశ జయించింది. రెండు వందల లాంఛనం ఇచ్చి డబ్బు 
తెచ్చాడు. అతను డబ్బు తెచ్చేలోపల కూలి మళ్ళీ పెరిగింది. పురుషులకు 
రూపాయిన్నర, స్రీలకు రూపాయి కూలి పెంగింది. ఈ తిరుగుడుకు చేసిన 
అప్పుకు రెండు వందలు పోయాయి. మరో రెండు వందలు తిండిగింజలు 
కొన్నారు. 

“నాలుగు వందలు మట్టిపాలు చేస్తే యెలాగండీ? మరో వెయ్యి యెక్కడైనా 
అప్పు తెస్తే అప్పుడు ఆలోచించవచ్చు” అన్నది. 

“అప్పా! అప్పెవరిస్తారే?” అన్నాడు. 

“మా అన్న పట్నంలో ఓవర్‌ టైమ్‌లు చేసి చిట్టి కట్టాడంట. అడిగితే 
ఇవ్వడా?” అన్నది వరాలు. 

“వద్దే! ఈ పరిస్థితి యెప్పుడూ ఇట్లనే ఉంటదా” ఆలోచిస్తూ. 

“మరి బాయి?” 

“ఆఖరు కిస్తూ తెచ్చి త్రవ్వుకుందాం.” 

“తవ్వినట్టు సర్టిపికెట్టు కావాలె కద” అన్నది వరాలు. 

“ఇయ్యాల రేపు చేతులో డబ్బుంటే నేను బి.ఏ. పాసయ్యినట్టు సర్టిపికెటు 
పుట్టించవచ్చునే” అన్నాడు. 

అతను నాల్గు వందలలోకి మరో వంద రూపాయలు అప్పుచేసి గేదెను 
కొన్నాడు. రెండు పూటలా తిండికి కరువు లేదు. 

ఈసారి రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణకు తనే టీ తెప్పించాడు. కర్ణం 
గారింట్లో పండుగకు, చెంబెడు పాలు తీసుకెళ్ళి ఇస్తే బావి యెనిమిది గజాల 
లోతు తెగినట్టు ఒక ప్రక్కన నీటి ఊట కనిపించినట్టు సర్టిఫికెట్‌ ఇచ్చాడు. 

“అబ్బా! గటికుడవోయ్‌! యెనిమిది గజాలు త్రవ్వావా? వచ్చి చూద్దామని 
ఉందిగాని, వీలవుతుందో లేదో, నెలాఖరు రోజులు. పిల్లదాని పుట్టిన రోజట” 
అన్నాడు దిగులుగా ఇన్‌ స్పెక్టర్‌. 





మాదిరెడ్డి సులోచన కథలు 1 83 


బాలకృష్ణకు అర్ధం అయింది, అతని అంతర్యం. పాలుపోస్తే వచ్చిన 
డబ్బులో నుండి ఓ యాభై రూపాయలు తీసి అతని చేతిలో పెట్టి గుప్పిలి 
మూసాడు. అతని ముఖం ప్రసన్నం అయినా మొహమాటపడ్డాడు. 

“ఫరవాలేదండి. పుట్టినరోజు బాగా చెయ్యండి” అన్నాడు. 

“ఇదిగో నీ బాయి చూసినట్టు రిపోర్టు వ్రాసాను. ఎల్లుండి వరకు నీ 
కిస్తు వస్తుంది బాలయ్యా” అన్నాడు ఆప్యాయంగా. 

బాలయ్యకు లంచాల విలువ బాగా తెలిసివచ్చింది. అవి ముడితే ఆఫీసులో 
యెంత గౌరవం దక్కుతుందో కూడా తెలిసివచ్చింది. ఈసారి ధైర్యంగా ఇంటికి 
వచ్చాడు. 

మూడో రోజు ఆఫీసుకు వెళ్ళేసరికి ఆఫీసు ముందు జాతరలా ఉంది. 

జీపు ఆగి ఉంది. 

“సబ్‌ కలెక్టర్‌ వచ్చిండు బాలయ్యా” కర్ణం హడావుడిగా వచ్చాడు. 

“అలాగా!” అన్నాడు బాలయ్య. 

“నీ బావి యెన్ని గజాలు తెగింది. ఈసారి ఆయన టూర్‌లో బావులను 
తనిఖీ చేస్తాడట” అన్నాడు కర్ణం 

“ఆం!” బాలకృష్ణ గుండెల్లో రాయిపడింది. 

బావి సంగతి అటుంచి అక్కడ (త్రవ్విన చిహ్నము కూడా లేదు. తనేం 
చూపుతాడు? 

బావి త్రవ్వకపోవడానికి కారణం మీవాళ్ళే. లంచాలకాశించి, నాకు కిస్తులు 
ఆలస్యంగా యిచ్చారంటే నమ్ముతాడా? నిండా మునిగాక చలేమిటి? 

బాలకృష్ణ ఓ నిర్ణయానికి వచ్చాడు. 

సబ్‌ కలెక్టర్‌ జీపులోనే బయలుదేరారు. ఒకరిద్దరు బావులు సగం సగం 
త్రవ్వినవి చూచి ఆయన మండిపడ్డాడు. 

“అసలు ప్రభుత్వమిచ్చిన డబ్బు సద్వినియోగం చేయటం లేదు” అని 
కేకలేసాడు. బాలకృష్ణకు మండిపోతుంది. 

కలెక్టరిలా తిన్నగా వచ్చి, డబ్బిచ్చి పోవద్దు. కర్ణంగారిని, రెవెన్యూ 
ఇన్‌ స్పెక్టర్ని, ప్యూన్లని తడిపేసరికే వచ్చిన డబ్బు కాస్తా ఖర్చయిపోతుందని 
యెరగడా? 





184 జరుగుతున్న చరిత్ర 


వీళ్ళకు బుద్ధి చెప్పాలి. 

అతనికి తళుక్కున ఓ ఆలోచన వచ్చింది. అంతే కొండంత ధైర్యము 
వచ్చింది. 

“బాలకృష్ణా! బావిలో తేమ వుందా?” కంగారుగా అడిగాడు కరణం. 

“అయ్యో బాబూ! వుందని మీరు సర్టిఫై చేసారు. సద్‌బ్రాహ్మలు 
అబద్ధమాడతారా?” అన్నాడు వెటకారంగా. 

బాలకృష్ణ బావి దగ్గరకు వచ్చారు. 

“సార్‌... సార్‌... అన్యాయం జరగిపోయింది సార్‌... నా బావి సార్‌. 
రాత్రింబవళ్లు కష్టపడి త్రవ్విన బావి సార్‌. ఎవరో యెత్తుకు పోయారు. యెవరో 
యెత్తుకు పోయార్‌ సార్‌” బాలకృష్ణ పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. 

“ఏమిటి? వాట్‌ ఈజ్‌ దిస్‌?” సబ్‌ కలెక్టర్‌ అడిగాడు. 

“ఏమో సార్‌ ! బావి యెత్తుకుపోయారు యెవరో అని ఏడుస్తున్నాడు.” 

“వ్వాట్‌ నాన్సెన్స్‌ యు ఆర్‌ స్పీకింగ్‌ ! అతను మెంటల్‌ పేషంటా? బావి 
ఏమిటి? యెత్తుకు పోవటం ఏమిటి?” సబ్‌కలెక్టర్‌ మండిపడ్డాడు. 

“నిజం సార్‌! ఇక్కడే త్రవ్వాను. ఇదిగో కావాలంటే కర్ణంగారు, రెవెన్యూ 
ఇన్‌స్పెక్టర్‌ చూచి సర్టిఫై చేశారు” అతను కాగితాలు చూపాడు. 

అయిదు నిమిషాలు ఆ కాగితాల వంక చూచాడు. బాలకృష్ణ అన్నదాంట్లో 
తప్పేంలేదు. యెనిమిది గజాలు త్రవ్వినట్టు, నీళ్ళు పడ్డట్టు వ్రాసి వుంది. అది 
కాదనలేడు. 

ఆయన ముఖాన చిన్నగా చిరునవ్వు వెలిసింది. 

కర్ణంగారిని, ఇన్‌స్పెక్టరును పిలిచి సర్టిఫికెట్లు చూపించాడు. వాళ్ళిద్దరూ 
తేలు కుట్టిన దొంగల్లా ముఖం చూచుకున్నారు. 

“మన్నించండి సార్‌!.... ఆ పల్లెటూరి వెధవకు తెలివి తేటలు 
మీరిపోయాయి” అన్నారు పళ్ళు పట పట కొరుకుతూ. 

“లేదు మీలాంటివారు వాళ్ళనలా తయారు జేస్తున్నారు. లంచాలకు కూడా 
హద్దూ పద్దూ వుండాలి” అన్నాడు కోపంగా. 

“అయ్యా...” అన్నా మనసులో తిట్టుకున్నారు ఇతను తీసుకోడా వేలకు 
వేలు, అని.... 





మాదిరెడ్డి సులోచన కథలు 1 85 


“కర్ణంగారు! మీ సర్టిఫికెట్లు అబద్ధం అయితే మీ కరణీకం వుండదన్న 
సంగతి మీకు తెలుసుకదా!” 

“సార్‌?...” 

“ఇప్పుడేమన్నా లాభం లేదు. నెల రోజులలో ఆ బావి అక్కడుండాలి. 
లేదా డబ్బు వాపసు రావాలి. లేదంటే మీ వుద్యోగాలకు ఉద్వాసన చెబుతారా!” 
అతను మండిపడ్డాడు. 

బాలకృష్ణ తన పాచిక పారినందుకు సంతోషించాడు. తన దగ్గర తీసుకున్న 
డబ్బుకు రెట్టింపు ఖర్చు పెట్టి బావి త్రవ్వనీ అనుకున్నాడు కసిగా. 

సబ్‌కలెక్టర్‌, కరణం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జీపులో వెళ్ళిపోయారు. 

“బాలకృష్ణా! భలేపని చేసావురా! భలేగా బుద్ధి చెప్పావు” యువకులు 
హర్షించారు. 

“బాలయ్యా ! గుండె అంటే నీదేరా! నీలాంటి యువకుల వల్లే దేశం 
నిలబడుతుందిరా” పెద్దవారు అభినందించారు. 

ఆ రాత్రంతా సంబరాలతో సంతోషంగా ఇదే విషయం చర్చించుకుంటూ 
పంచరంగుల కలలు కంటూ గడిపారు అందరూ. నాలుగు రోజులనంతరం 
బాలకృష్ణకు నోటీసు వచ్చింది. ప్రభుత్వపు అప్పు కట్టాలి, లేదా బావి త్రవ్వాలని. 
నెల రోజులు గడువిచ్చారు. ఆ గడువులో బావి అక్కడ లేకపోతే పొలం జప్తు 
చేస్తామన్నారు. 

అది విని బాలకృష్ణ తెల్లబోయాడు. 

“ఇదేం విడ్డూరమండీ! నిన్న వాళ్ళను తిట్టిన సబ్‌కలెక్టర్‌ ఈ రోజు ఇట్లా 
పంపిండు” వరాలు ఆశ్చర్యపోయింది. 

“వీళ్లు వెళ్లి ఆయన స్థాయిలో లంచం యిచ్చి వుంటారు వరం. లంచాలను 
కూడా న్యాయబద్ధంగా, చట్టసమ్మతంగా అంగీకరిస్తుందేమో ప్రభుత్వం....” 
అన్నాడు. 

బాలకృష్ణ నవనాడులూ కృంగిపోయాయి. 

ఒకవైపు బంజరు భూమి. 

రెండో వైపు ప్రసవానికి సిద్ధంగా వున్న భార్య. 

మూడోవైపు ప్రభుత్వపు అప్పు. 





|| 86 జరుగుతున్న చరిత్ర 


ఆ రోజు తెల్లవారుజామున లేచి వెళ్లి రెడ్డిగారు పౌల్‌టరీ పెట్టుకుంటానంటే 
యెకరము పొలం అమ్మి, ప్రభుత్వం అప్పుకట్టి, ఇంటికి తాళం పెట్టి, ఉన్న 
నాలుగు బొచ్చెలు సంచిలో వేసుకొని, భార్యను తీసుకొని పట్నం తయారు 
అయ్యాడు. 

“ఏం చేద్దాం?” వరాలు దిగులుగా అడిగింది. 

“ఏముంది? మీ అన్న ఫాక్టరీలో ఉద్యోగం దొరికితే చేస్తాను. లేకపోతే 
బంగళాలు కట్టే దగ్గర కూలి దొరుకుతుందట” అన్నాడు. 

బస్తాండులో మైక్‌ నుండి ఏదో రేడియో కార్యక్రమం వస్తోంది. 

“భారతదేశం వ్యవసాయ ప్రాతిపదికపై ప్రగతి మార్గంలో పయనిస్తోంది. 
ప్రభుత్వం బుణసౌకర్యాలు, సబ్సిడీలు, ఎరువులిచ్చి రైతులను యెన్నో విధాలుగా 
ప్రోత్సహిస్తోంది. వ్యవసాయాభివృద్ధికి పాటుపడుతోంది. ఈ ప్రోత్సాహాన్ని రైతులు 
సద్వినియోగం...” వినలేను అన్నట్టు చెవులు మూసుకున్నాడు బాలకృష్ణ. 

“అదిగో, పట్నం బస్సు...” వరాలు లేచింది. 

ఆశయాలు, ఉత్సాహం, స్వతంత్రం అన్నీ కట్టగట్టి ఊర్గోపడేసి, రెండు 
పొట్టలు రెండు పూటలా నింపుకోవాలన్న ఆశతో పట్నం బస్సు యెక్కారు బాలకృష్ణ, 
వరాలు. 


(0 





మాదిరెడ్డి సులోచన కథలు 1 87 


అనుబంధాలకు అర్థం ఎమిటి? 


మావారు పోలీసు డిపార్టుమెంటులో పని చేస్తారు. ఆయన ఇంటికి 
రావటం, డ్యూటీకి వెళ్లటానికి వేళా పాళా ఉండవు. సాధారణంగా వెళ్ళటం 
సమయానికే వెళ్తారుగాని, రావటం మాత్రం వూహించలేము. ఈ రోజు దీపావళి 
పండుగ త్వరగా వస్తారనుకున్నాను. పది దాటినా ఇల్లు చేరలేదు. 

ట్వింకి వారి కోసం చూచి నిదురపోయింది. బాబి అమ్మ దగ్గరున్నాడు. 
ఒక్కదానికి విసుగు వేసింది. ఆకలేస్తుంది. పండుగ రోజు అయినా కలిసి 
తినాలనుకున్నాను. 

ఆవులిస్తూ కుర్చీలో ఒరిగాను. జావా ఆగిన చప్పుడయింది. ఉత్సాహంగా 
లేచి తలుపు తీశాను. ఆయనగారు కిళ్ళీ నములుతున్నారు. 

“సారీ, శాంతీ! నువ్వు భాస్కర్‌ ఇంటి దగ్గరుంటావనుకున్నాను. అందుకే 
అక్కడికి వెళ్ళీ వస్తున్నాను” అన్నారు. 

“ఎందుకో వెళ్ళాలనిపించలేదు” అన్నాను ఆయన రాగానే తలుపువేసి. 

“వాళ్ళు మాత్రం చాలా బాధపడ్డారు సుమా!” అన్నారు బూట్లు 
విప్పుకుంటూ. 

“మీరు భోజనం చేస్తారా?” అన్నాను. 

“భాస్కర్‌, పద్మ భోజనం చెయ్యనిదే వదలుతారా! నీకు చీర కూడా కొన్నాడు 
భాస్కర్‌!” అన్నారాయన. 





|| 88 మాదిరెడ్డి సులోచన కథలు 


“అలాగా...” అన్నాను. నా కళ్ళ ముందు వెలిసిపోయిన వాయిల్‌ చీర 
కట్టుకుని వదిగి దీనంగా చూచే భారతి కనిపించింది. 

“నువ్వు భోజనం చెయ్యలేదు కదూ! అయితే వడ్డించెయ్యి, కంపెనీ ఇస్తాను” 
అన్నారాయన. 

“వద్దులెండి. తిని వస్తాను” అన్నాను. ఆయనకు మొహమాటం చాలా 
ఉంటుంది. కడుపునొప్పని బాధ పడతారు. 

“పఫ్రోస్రీ స్వీట్‌ ఇవ్వు” అన్నారు. నేను భోజనం చేస్తుంటే కాళ్ళు చేతులు 
కడుక్కుని వచ్చి కూర్చున్నారు. 

పండుగ రోజు నేను ఏనాడు కొత్త బట్టలు కట్టుకోను. ఉత్సాహం ఉరక 
లేసే వయసులో పేదరికం అయితేనేం, నిర్లక్ష్యం అయితేనేం, మా ఇంట్లో ఏ 
పండుగా జరిగేది కాదు. నోరు తెరిచి అడిగినా ఆప్యాయంగా, ఆర్తిగా నచ్చ 
చెప్పలేదు మా అమ్మ. 

“పోతూ పోతూ ఈ శనిగాళ్ళను నా గండాన వేసి పోయాడు” అంటూ 
చచ్చి స్వర్గాన ఉన్న మా నాన్నను తిట్టేది అమ్మ. దాంతో పండగ సంబరం 
కొందెక్కేది. కట్నాలు లేకపోయినా, నన్నిష్టపడి వివాహం చేసుకున్నారు శ్రీధర్‌. 
ఆయన నేను కావాలన్నది ఏది వద్దనరు. అయినా, అడిగే ఉత్సాహం లేదు. 
పిల్లలకు వేసి వూరుకుంటాను. 

“నీ కంపెనీకని నేను వస్తే మవునంగా ఆలోచిస్తావేం? రచయిత్రివయి 
పోదామనే!” అన్నారాయన. 

“చూడండి! రచయిత్రులంతా ఎప్పుడూ ఆలోచిస్తారనే కార్టూనిస్టుల పైత్యం 
ఆరగించకండి” అన్నాను. 

“కోపం వచ్చేసిందే” నవ్వి నా కిష్టమయిన పచ్చడి వడ్డించేశారు. నేనూ 
నవ్వేశాను. ఇద్దరమూ స్వీట్‌ తిన్నాము. అలసటగా ఉందేమో, ట్వింకిల్‌ పక్కన 
పడుకుని నిదురబోయారు. 

నేను తలుపులన్నీ చూచుకుని వస్తుంటే ఫోన్‌ వచ్చింది. క్షణం నా గుండె 
కొట్టుకుంది. అయినా ఎత్తాను. 

“హల్లో ! ఎవరూ? భాస్మరన్నయ్యా ! థాంక్స్‌. పని ఉంది. చీరలు 
ఎందుకు? అభిమానం చాలు” అన్నాను. 





అనుబంధాలకు అర్థం ఏమిటి? 1 89 


అతను నిష్టూరం ఆడి రేపు వచ్చి భోజనం చేసి, చీర కట్టుకుని 
వెళ్లమన్నాడు. 

“మంచిది” అన్నాను పొడిగా. 

నిజంగా భాస్మర్‌గారి స్నేహం ఒక అపురూపమైన వరం లాంటిది. నా 
వివాహం అయ్యాక, శ్రీధర్‌ (ఫ్రెంద్స్‌ క్షబ్బుకు రమ్మన్నారు. 

“క్షబ్బులు, షికార్లు ఎందుకు?” అన్నాను కాస్త జంకుతూ. అక్కడ అంతా 
బాగా తెలిసిన వారు, నాగరికులుంటారేమో. 

“క్లబ్బంటే నీకు సదభిప్రాయం లేనట్టుంది, శాంతీ! మా (ఫెండ్స్‌ క్లబ్బులో 
ప్రీల విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ కుట్లు, అల్లికలు, ఆట, పాటలే 
కాక వర్మింగ్‌ విమెన్‌ కోసం ఒక క్రష్‌ ట్యుటోరియల్స్‌ కూడా ఉన్నాయి” అన్నాను. 

ఆయన కూడా వెళ్ళాను. నాకు (ఫెండ్స్‌ క్లబ్బు ఎంతగానో నచ్చింంది. 
కాలక్షేపంకాక, కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారేమో అనిపించింది. ఆ క్రష్‌లో 
పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. అలా వెళ్తూ వెళ్తూ క్రష్‌లో 
యాక్టివ్‌ మెంబరుగా మారాను. అక్కడే నాకు భాస్కర్‌, అతని శ్రీమతి పద్మతో 
పరిచయం అయింది. 

“భాస్కర్‌ పెద్ద బిజినెస్‌ మాగ్నెట్‌. అతనికి సంబంధాలు లేని సేవా సంస్థ 
లేదు” అన్నారు అందరూ. 

ఒకసారి మా వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అతడిని ఆహ్వానించాను. 
అతను మా కార్యకలాపాలు చూచి చాలా మెచ్చుకున్నాడు. 

“మా పద్మ లేడీస్‌ క్షబ్బుకు వెన్నెముక మీరని చెబితే నమ్మలేదమ్మా! యు 
ఆర్‌ సూపర్స్‌” అంటూ భాస్మర్‌ పొగడటం, ఆ తరువాత పరిచయం విడదీయరాని 
స్నేహంగా మారింది. అన్నయ్య అని నేను, చెల్లీ అంటూ ఆయన పిలవటం 
పరిపాటి అయింది. ఏ పార్టీ అయినా నా సలహాలు అడిగేవారు. రెండు, మూడు 
సంవత్సరాలలో వాళ్ళింటి ఆడబడుచు కున్నంత చనువు సంపాదించాను. (ప్రతి 
దీపావళికి నాకు కొత్త చీర, మా అందరికీ భోజనాలు అక్కడే పెట్టేవారు. పిల్లలు 
మామయ్య, మామయ్య అంటూ తిరిగేవారు. 

“పిల్లికి భిక్షం పెట్టడు. సేవాసంస్థలకు దానం చేస్తున్నాడంటే ఏదో తన 
అవసరం కొద్దీ, తనకు పబ్లిసిటీ కావాలని. జాగ్రత్త” అన్నారు ఒకరిద్దరు భాస్కర్‌ 
గురించి. 





100 అనుబంధాలకు అర్థం ఏమిటి? 


చిన్న వయసులో భాస్కర్‌ స్వశక్తిపై పైకి వచ్చాడు. అందరికి అతనంటే 
ఏడుపు ఉండటం సహజమే ననిపించింది. ఆ అమృతమూర్తిని తలుచుకోని 
రోజు లేదు. 

“అతను హోదాకు ప్రాణం ఇస్తారు” అని కొందరన్నారు. 

“మాకున్న పెద్ద హోదా ఏమిటని?” నవ్వుతూ వారి మాటలు కొట్టివేశాను. 

“మీ ఆయన పోలీసు ఆఫీసరు చాలదా?” అన్నారు. 

ఇద్దరు స్నేహంగా ఉన్నా వోర్వలేరీ జనం అనుకున్నాను. క్లబ్బులో నా 
మాటకు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం అన్నయ్య ఇచ్చే చందాలు 
కూడా నని నే నూహించాను. బేబీ కేర్‌ సెంటర్‌కి ఆయా కావాలని వార్తా 
పత్రికలో అడ్వర్‌టెజ్‌మెంటు వేశాము. 

చాలామందే వచ్చారు. అక్కడ పని చేయటానికి కావలిసింది విద్యార్హతలు 
కాదు. సహనము, శాంతము, పిల్లలకు పంచి ఇవ్వగల (ప్రేమ హృదయము. 

“మీ పేరు?” 

“భారతి!” 

చటుక్కున తల ఎత్తాను. ఆ కంఠం మృదు మధురంగా, అత్యంత 
కోమలంగా ఉంది. ఎవరయి ఉంటారబ్బా? చిరుగులు పట్టిన పట్టుచీర భుజాల 
నిండుగా కప్పుకున్నది. ఆవిడను ఎక్కడో చూచినట్టు అనిపించింది. 

ఎక్కడ చూచాను? నాకు గుర్తుకు రాలేదు. 

“మీరు లోగడ ఎక్కడయినా పని చేశారా?” అన్నాను. 

ఆమె అయోమయంగా చూచింంది. మరుక్షణమే చిన్నగా నవ్వింది. ఆ 
నవ్వు నాకు చిరపరిచితమైనట్టుంది. 

“లేదు. మీరు ఎందుకడిగారో నాకు తెలుసు. ఒక్కసారి మనం 
భాస్మర్‌గారింట్లో కలుసుకున్నాం” అన్నది. 

అవును. ఆమె చెప్పింది నిజమే. ఒకరోజు ఉదయమే ఆయన ఇంటికి 
వెళ్ళాను. వెళ్ళేసరికే బయటి వరండాలో అయిదారుగురు స్త్రీలు కూర్చుని వున్నారు. 
చివరగా భారతి కూర్చున్నది. 

“శాంతిమతిగారూ! నా కీ ఉద్యోగం ఇచ్చారంటే మూడు ప్రాణాలు 
నిలబెట్టిన వారవుతారు” అన్నదామె స్వచ్చంగా. 





మాదిరెడ్డి సులోచన కథలు 191 


ఆమె వాలకం, కట్టుకున్న పట్టు చీర చూస్తే బ్రతికి చెడినట్టు కనిపించింది. 
“మీకు మరే ఆధారం లేదా?” 


“లేదమ్మా! మాది (పేమ వివాహం. అటు అత్తింటికి, పుట్టింటికి దూరం 
అయ్యాం. ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆయన పోయారు. ఆ నాటి నుండి ఉద్యో 
గాన్వేషణలో తిరుగుతూనే ఉన్నాను” అన్నది. 


ఆమె కంఠంలోని మృదుత్వానికి కరిగిపోయాను. ఆమెలోని సంస్కారానికి 
ముగ్గురాలినయ్యాను. 


మే మిచ్చేది చాలా తక్కువ. దాంతో మీ ముగ్గురి పొట్టలు నిండుతా 
యనుకోను” అన్నాను. 


“ఏమీ లేనిదానికంటే ఏదో కొంత ఉంటే నయం కదమ్మా. ఒక ఇంట్లో 
రొట్టెలు చేసి కాంపౌండు వూడ్చినందుకు చిన్న గది ఇచ్చారు. మరో రెండిళ్ళలో 
చపాతీలు చేస్తాను” అన్నది. 


“చపాత్రీలా?” 


“అవునమ్మా. మహారాష్టీయులకు రొట్టెలే కావాలి. కిలో పిండి రోజూ 
చేస్తే నెలకు ముప్పై రూపాయలు ఇస్తారు” అన్నది. 


“అవన్నీ చేసుకుని పనికి రాగలవా?” 
“మీరు టైం చెప్పండి. ఆ సమయానికి వస్తాను” అన్నది. 


నా కెందుకో భారతి అంటే ఒక విధమైన గర్వం కలిగింది. ఆమెను 
అప్పాయింట్‌ చేశాను. 


మూడు నెలలు గడిచాయి. ఒక్కనాడయినా భారతికి సంబంధించిన 
నింద, నిష్టూరాలు వినరాలేదు. నేను ఆఫీసులో పని చేస్తుంటే పిల్లలను లాలించే 
ఆ కంఠము వినిపించేది. అప్పుడప్పుడు లాలిపాటలు వినిపించేవి. 


భారతి మంచి పాటకత్తె అని అర్ధం అయింది. అదే పాత పట్టుచీరతో 
వచ్చేది. మూడో నెలలో రెండు వాయిల్‌ చీరలు కట్టుకుంది. 


“నమస్కారమండీ.” 
“నమస్తే, భారతీ! బాగున్నావా?” అంతే మా పరిచయం. 





192 అనుబంధాలకు అర్థం ఏమిటి? 


ఒకరోజు నేను వచ్చేసరికి ఇద్దరు మగపిల్లలు పిల్లలను ఆడిస్తున్నారు. 
ఒకడికి ఆరేళ్ళు. మరొకడికి ఎనిమిదేళ్ళు ఉండి ఉంటాయి. ముతక గుడ్డల్లో 
ముత్యాల్లా మెరుస్తున్నారు. 

“గుడ్‌ మార్నింగ్‌ ఆంటీ!” 

“మార్నింగ్‌ ! ఎవరు, బాబూ?” 

“ఇక్కడ పని చేస్తారు చూడండి - భారతిగారు - ఆమె పిల్లలం” అన్నారు. 

“అదేమిటి? పిల్లలను మీరు ఆడిస్తున్నారు?” ఆశ్చర్యంగా అడిగాను. 

“మా అమ్మ రెండు రోజుల నుండి తీసుకవస్తున్నారమ్మా. మంగమ్మకు 
జలుబు చేసిందట. అది పిల్లలకు అంటుకుంటుందట” అన్నాడు. 

“రమేష్‌ సురేష్‌...” అంటూ భారతి వచ్చింది. 

“ఏమిటమ్మా?” పెద్దవాడు అడిగాడు. 

“ఆంటీని విసిగించవద్దు. మా అబ్బాయిలండీ....” అన్నది వినయంగా. 

“ఏమిటి? వీళ్ళు బడికి వెళ్ళరా?” 

భారతి ముఖంలో రంగులు మారిపోయాయి. “వాళ్ళ నాన్నగారు బతికి 
ఉండగా ప్రయివేటు బడిలో చేర్చారు. వాళ్ళ ఫీజులు, యూనిఫారాలు కుట్టించటం 
నాకు వీలుకాలేదు. వాళ్ళను బయటికి పంపేశారమ్మా. వచ్చే ఏడు ఏదయినా 
ప్రభుత్వ పాఠశాలలో చేర్చిస్తానమ్మా” అన్నది వినయంగా. 

“రమేష్‌! నీకు మార్ములెలా వచ్చాయిరా?” కాజువల్‌గా అడిగాను. 

“అన్నింటిలో తొంబయి, ఎనభై వచ్చాయండీ. ఒక హిందీలో మాత్రం 
పుస్తకం లేక యాభై వచ్చాయి” అన్నాడు దిగులుగా. 

నా గుండెల్లో చెయ్యి పెట్టి కెలికినట్లయింంది. మార్కులు వచ్చినా చదవలేని 
దురదృష్టం. 

“చూడు, భారతీ ! భాస్మర్‌గారు తెలుసు కదా, వారు ఇలాంటి వాటికి 
చాలా సహాయం చేస్తుంటారు. నువ్వెళ్ళి విషయము చెప్పు-కాదనరు” అన్నాను. 

భారతి వేదాంతిలా నవ్వింది. “అంతా మీలా సేవా భావంతో చెయ్యరు, 
శాంతిమతిగారూ! వారికి పేపర్లో ఫోటో పడాలి. పబ్లిసిటి కావాలి. తామిచ్చే 
ప్రతి రూపాయికి చప్పట్లు మోగాలి...” 





మాదిరెడ్డి సులోచన కథలు 193 


“భారతీ....” కోపంగా అరిచాను. 

“క్షమించండి, శాంతిమతిగారూ! హద్దుమీరినట్లున్నాను. కష్టాలు మనిషిని 
కాల్చి, సమస్యలను అన్నివైపులా చూపిస్తాయి. మీరు మనుష్యుల్ని ఒక కోణంలోనే 
దర్శించారు” అని వెళ్ళిపోయింది. 

ఒక చీర ఖరీదు పెడితే ఆ ఇద్దరి పిల్లల ఫీజు అవుతుందని ధైర్యం చేసి 
ఫీజు కట్టి, పిల్లలకు యూనిఫారం కుట్టించి ఇచ్చాను. భారతి కళ్ళలో నీళ్ళు 
నిండాయి. 

“మీరు నా కంటె చిన్నవారో, పెద్దలో నాకు తెలియదు కాని, మనసు 
పెద్దదని నిరూపించుకున్నారు” అని నాకు పాదాభివందనం చేసింది. 
కసురుకున్నాను. ఆ వచ్చే జీతంతో ఇద్దరి పిల్లలతో భారతి ఉక్కిరి, బిక్కిరి 
అవుతుంది. అయిదారు నెలలు గడిచాయి. పిల్లలు ఇద్దరూ క్లాసులో ఫస్టు వచ్చారు. 
నా సంతోషం ఇంతా అంతా కాదు. నేనే పాసయినంత సంబరంగా ఉన్నది 
నాకు. ఆ రోజు సెంటర్‌కు వెళ్ళినప్పుడు భారతి చిరుగులు పట్టిన పాత చీరలో 
కనిపించింది. 

“భారతీ! మంచివారు, చెడ్డవారు వస్తారు సెంటర్‌కు. ఖరీదయిన బట్టలు 
లేకపోయినా, శుభ్రమైనవి కట్టుకోరాదూ!” అన్నాను. 

“నాకు బిడియంగానే ఉందండీ. నా కున్నది రెండే చీరలు. ఈ రోజు 
బబ్లూకు విరేచనాలు అవుతున్నాయి. ఇందాక చీరంతా పాడు చేశాడు” అన్నది 
లజ్జితురాలయి. 

“ఓ ఫరవాలేదు....” అన్నాను. నేనే తొందరపడ్డానేమో. ఈ సింథటిక్స్‌ 
వచ్చాక అసలు చిరగనే చిరగవు బట్టలు. నా దగ్గరున్నాయి కాని, భారతి 
ఏమనుకుంటుందో! 

ఆ రోజంతా చిరుగుల వాయిల్‌ చీరగట్టిన భారతే నా కళ్ళ ముందు 
కదిలింది. నేను ఇంటికి వచ్చేసరికి భారతి పిల్లలు, మా పిల్లలు ఆడుకుంటున్నారు. 


“ఆంటీ! రోజూ రావచ్చా...” ఆశగా అడిగారు. 

“తప్పక, బాబూ” అన్నాను. మావారు ఏ అర్ధ రాత్రికో వచ్చి, ఉదయమే 
వెళ్ళిపోతారు. నాకు, పిల్లలకు కాలక్షేపంగానే ఉన్నది. ఒక రోజు భాస్మరన్నయ్య 
వచ్చాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. 





194 అనుబంధాలకు అర్థం ఏమిటి? 


“పద్మ రాలేదా?” అని వచ్చి కూర్చున్నాను. 

“ఏడీ మా పోలీసు!” అన్నారు. 

“పోలీసులను వెతకటానికి సి.ఐ.డి.ని పెట్టాలి మరి” అన్నాను. పనిపిల్ల 
మా ఇద్దరికి టీ తెచ్చి పెట్టింది. 

“శాంతీ! ఈ పిల్లలు.....” అతను బొమలు ముడిచి చూచారు. 

“మరచేపోయాను, అన్నయ్యా ! వీళ్ళు మా కేర్‌ సెంటర్‌లో ఆయాగా 
పని చేస్తున్న భారతి పిల్లలు. తెలివితేటలు విపరీతంగా ఉన్నాయి. కాని, తండ్రి 
లేడు. అమ్మ పేరున మీరిచ్చే స్మాలర్‌షిప్పు ఈ పిల్లలకు ఇవ్వకూడదూ!” అన్నాను. 

ఆయన గంభీరంగా మారిపోయారు. నేను భారతి గుణగణాలు, ఆమె 
ఎంత అభిమానవంతురాలో చెప్పాను. 

“మీకు ప్రొగ్రెసు కార్డు చూపిస్తాను - సంతోషిస్తారు” లేవబోయాను. 

“ఆలోచిద్దాం” అని లేచాడు అతను. 

వ్యాపారస్థులకు సవాలక్ష తలనొప్పులనుకుని, అతడిని సాగనంపాను. 

“ఆంటీ... ఆంటీ... ఈ రోజు కొత్త చిగురు పిల్లల కార్యక్రమం 
చూచివెళ్తాం” అన్నారు రమేష్‌, సురేష్‌, 

మంచిదన్నాను. ప్రోగ్రామయ్యాక చీకటి పడింది. 

“పదండి మిమ్మల్ని పంపించి వస్తాను” అన్నాను. మా పిల్లలను రమ్మంటే 
మొత్తం కార్యక్రమము చూడకపోతే టి.వి. వాళ్ళు వాళ్ళకు ఫైన్‌ వేస్తారన్నట్టు, 
సీరియస్‌గా చూస్తున్నారు. 

పిల్లలు ఏవేవో కబుర్లు చెబుతుంటే వింటున్నారు. 

“మా ఇల్లు ఇదే, ఆంటీ, మీరెళ్ళండి” అన్నారు. ఒక పెద్ద మేడలో 
అవుట్‌హవుస్‌లో ఒక భాగం అది. అక్కడ భాస్మరన్నయ్య కారు చూచి 
కుతూహలంగా లోపలికి వెళ్ళబోయాను. 

“అన్నయ్యా! నీకిది న్యాయం కాదు. నేను నీ చెల్లెలి నని ఎవరితోను 
చెప్పలేదు” వెక్కి వెక్కి ఏడుస్తుంది భారతి. 

“భారతీ! ఏనాడయితే నా మాట కాదని వివాహం చేసుకున్నావో ఆనాడే 
నీకు, నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పాను” భాస్మరం గొంతు 
కఠినంగా ఉంది. 





మాదిరెడ్డి సులోచన కథలు 195 


“మీరు చెప్పారు.మళ్ళీ నేను వచ్చానా, అడిగానా! సగం ఆస్తి నాకు 
రావలసింది. నువ్వు అనుభవిస్తున్నావు. నేను కావాలని అడిగానా? అమ్మ పేర 
స్మాలర్‌షిప్పులు ఇస్తున్నావంటే, దిక్కులేని వారితో చేరి వచ్చానే తప్ప చెల్లెలిగా 
అధికారం చూపుకోవాలని రాలేదు.” 

“శాంతి అంటే మాకు అభిమానం. ఆమె మా ఇంటి ఆడబడచు. ఆమె 
ద్వారా నన్ను సాధించాలని చూస్తున్నావేమో!” 

“ఎంత పొరపాటు పడుతున్నావు. ఆమెను అడగండి. నీకు చేతులెత్తి 
దండం పెడతాను. నా ఉద్యోగం జోలికి రాకు...” 


మూడు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆ తరువాత భాస్కర్‌ 
కారు వెళ్ళిపోయింది. 


“రమేష్‌! నేను వచ్చానని అమ్మతో అనకండి. కోప్పడుతుంది” అని చెప్పి 
ఇంటికి వచ్చాను. నా తల తిరిగిపోసాగింది. అనుబంధాలకు అర్థం ఏమిటి? 
బ్లడ్‌ ఈజ్‌ థిక్కర్‌ దాన్‌ వాటర్‌ అంటారు. అంతా ఉత్తదే?! అన్న అష్ట ఐశ్వర్యాలతో 
తులతూగుతుంటే, చెల్లెలు దిక్కులేని దానిలా పరుల ముందు చేయి చాపి, 
రొట్టెలు చేసుకుని బ్రతకటమా? 

మనిషిలోని దుర్మార్గుడు, నియంత ఇక్కడే బయట పడతాడేమో. తను 
అన్నదన్నట్టు జరక్కపోతే ఎంత కయినా దిగజారుతా రన్నమాట. నాపై ఇంత 
ఆప్యాయత కురిపిస్తున్నారు. రేపు నాకు, అతనికి భేదాభిప్రాయాలు వస్తే నా 
పనీ అంతేనేమో. అశాంతిగా దొర్లాను. నా మనసులోని మాట ఎవరికయినా 
చెప్పుకోవాలని ఉన్నది. ఎవరితో చెప్పను! ఎక్కడ చెప్పను. వారం రోజులు 
మావారు కంటికే కనిపించలేదు. 

“శాంతీ! ప్రతీ విషయం అంత సీరియస్‌గా ఆలోచిస్తే ఎందుకూ 
పనికిరావు. టేకిట్‌ ఈజీ” అన్నారు. 

కాని, భాస్మరన్నయ్య ప్రతీ పని నాకు కృత్రిమంగా, ఏహ్యంగా కనిపించింది. 
దానికి తగినట్లే రమేష్‌, సురేష్‌ కూడా రావటం తగ్గించేశారు. 

“భారతీ! పిల్లలు రావటం లేదేమిటి?” 


“చదువుకుంటున్నారు, మేడమ్‌! ఒకసారి మీ ఇంటికి అలవాటయితే 
ఎప్పుడూ వస్తామంటారు” అన్నది నవ్వలేక నవ్వుతూ. 





106 అనుబంధాలకు అర్థం ఏమిటి? 


“బడి లేదు కదా....” అన్నాను. 

“అవుననుకోండి. ఇప్పటికే టి.వి, టి.వి. అంటూ గోల పెడుతున్నారు. 
రోజూ అలవాటయితే కష్టం” అన్నది ఇబ్బందిగా. ఎంత గుంభనం, ఎంత 
గాంభీర్యం! 

ప్రతీ వ్యక్తికి స్వేచ్చ స్వాతంత్రా లున్నాయి. అభిరుచులు కలవనంత 
మాత్రాన చెల్లెలు, చెల్లెలు కాకపోతుందా! ఆమె అంతగా బాధపడుతుంటే నా 
కుటుంబం, నా స్నేహితులంటూ తిరగటం అన్యాయం. అక్రమం. న్యాయం, 
ధర్మము అంటూ ఉన్నాయని మరచిపోతే ఎలా? 

“శాంతీ! నీ వాదన నీదేనా! వాళ్ళ వర్షన్‌ ఏమిటో వినరాదూ!” అన్నారు 
విసుగ్గా. 

నిజమే! భారతి వైపు నుండి ఆలోచించాను, వాళ్ళ వర్షన్‌ ఏమిటో? 
ఒక్కనాడు, మరచిపోయి అయినా తమకో ఆడబడుచు ఉందని ఇద్దరూ అనలేదు. 
ఎంత గొప్పవారయినా, మరిచిపోతే మనుషులే కారేమో. ఈ విషయం ఎలా 
ఎత్తాలో అర్థం కాలేదు. అందుకే మావారితో అన్నాను ఈమాట. 

“అబ్బబ్బ! ప్రతివారి మంచి చెడులు మనకెందుకు? మనకు సంబంధించి 
నంతవరకు సొంత అన్నకంటే ఎక్కువగా చూస్తున్నాడు. ఇంకేం కావాలి! అతని 
వ్యక్తిగత విషయాలు నీ కెందుకు?” ఈయన కసురుకున్నారు. నిజమే కాని, 
కన్ను మూసినా, తెరచినా చిరుగుల చీరతో నా కళ్ళ ముందు భారతే (ప్రత్యక్షం 
అవుతుంది. 

ఈ విషయం జరిగాక, రెండు నెలలు వూరు వెళ్ళి వచ్చాము. 
వార్షికోత్సవాలు, ఇంటి పనులతో భారతిదేవి విషయమే మరిచిపోయాను. భాస్కర్‌ 
అన్నయ్యతో కూడా ఎక్కువగా కలిసే అవకాశం కలుగలేదు. 

ఆ రోజు ఆఫీసులో కూర్చున్నాను. సంవత్సరం పాపను తీసుకుని 
వచ్చిందొకావిడ. 

“నమస్తే, మేడమ్‌! మా శ్వేతకు పునర్జన్మ ప్రసాదించింది మీ ఆయా 
భారతి. రేపు శ్వేత పుట్టినరోజు. మీరు రావాలి. మీరు అనుమతిస్తే భారతిని 
కూడా పిలవాలని.” 

“నా అనుమతి దేనికి? మీరు అక్కడ ఆమెను అందరితో సమానంగా 
చూస్తామంటే పిలవండి” అన్నాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 197 


ఆమె వెళ్ళిపోయింది. శిశువిహార్‌ పిల్లలతో ఏర్పడిన అనుబంధం అర్థం 
కానిది. నేను కనిపించగానే సంబరపడిపోతూ “ఆంటీ... ఆంటీ” అంటూ గంతులు 
వేస్తారు. అందుకే శ్వేతకో బొమ్మ కొని పుట్టిన రోజునాడు వెళ్ళాను. అప్పటికే 
ఆవరణంతా కల కల లాడుతుంది. పెళ్ళి అంత ఘనంగా చేస్తున్నారు. శ్వేత 
తండ్రికి భాస్మర్‌ మంచి స్నేహితుడు. 

భాస్మరన్నయ్య పెద్ద పాకెటు పట్టుకుని కుటుంబంతో వచ్చాడు. శ్వేత 
తల్లి వచ్చింది. 

“ఈ శుభ సందర్భములో మా శ్వేత ఆరోగ్యం తీర్చిదిద్దిన భారతికి, 
శాంతిమతి గారు తన చేతుల మీదుగా చీర బహుకరిస్తారు” అన్నది. నేను లేచి 
భారతిని పిలిచాను. చిరుగులు పట్టి, కుట్లు పడిన చీరలో బిడియ పడుతూ చీర 
అందుకుపోయింది. నేను ఓరకంట భాస్మర్‌ వంక చూచాను. అతని ముఖంలోని 
రంగులు మారిపోయాయి. నేను వచ్చి కూర్చున్నాను. 


“శాంతీ! ఈ భారతిని ఎందుకు పెట్టుకున్నావ్‌?” 

“ఏమయిం దన్నయ్యా?” 

“ఆవిడ చరిత్ర చెప్పుకోతగింది కాదు.” 

“వారి చరిత్రల జోలికి వెడితే, ఈ ప్రపంచం, మనుషులే మిగల రన్నయ్యా! 
ఆవిడ పిల్లల పాలిట (ప్రేమమూర్తి. ఆమె శ్రద్ధాసక్తులకు నిదర్శనం శ్వేత” అన్నాను 
కఠినంగా. 

అతను ముఖం గంటు పెట్టుకున్నాడు. నేను అతని నోట భారతి విషయం 
చెప్పించాలనుకున్నాను. సాధ్యం కాలేదు. 

“కోపం వచ్చిందా, అన్నయ్యా ! ఆవిడ చెడ్డదే కావచ్చు. మన తోబుట్టువే 
ఆ స్థానంలో ఉంటే కోపగించుకుంటామా!” 


అతని ముఖం నల్లగా మాడిపోయింది. మరుక్షణం నవ్వేశాడు. 


“మనకెందుకండీ - ఆవిడ తిప్పలు ఏవో ఆవిడ పడుతుంది” అన్నది 
పద్మ. ఇద్దరూ తనకేం తెలియనట్లే నటించారు. ఆ రోజు నుండి నాకు 
తెలియకుండా నా మనసు వాళ్ళింటికి వెళ్ళటానికి ఎదురు తిరుగుతుంది. 
వాళ్ళింట్లో పొందే మర్యాద నాది కాదన్నట్లు, ఎవరి హక్కో నేను లాక్కున్నట్లు 
అనిపించేది. ఎప్పటిలాగే వారు దీపావళి పండుగకు పిలిస్తే పోలేకపోయాను. 





106 అనుబంధాలకు అర్థం ఏమిటి? 


మావారు మాత్రం వెళ్ళి వచ్చారు. మరునాడు నాకు కావలసిన చీర తీసుకుని 
భాస్మర్‌, పద్మ వచ్చారు. ఆ చీర తీసుకోవటం బొత్తిగా ఇష్టం లేదు. ఎలా 
తిప్పికొట్టను? ఎలా? అదే అర్థం కాలేదు. 

“ఏమిటి, శాంతీ! మూఢీగా ఉన్నావ్‌?” 

“అన్నయ్య ! ఈ చీర తీసుకోనందుకు ఏం అనుకోకు. మరి నాకు... 
నాకు.... వేరే వారి దగ్గర బహుమతులు తీసుకోవటం మంచిది కాదుట” అన్నా 

“మై గాడ్‌ ఎవరు చెప్పారు? ఎవరయినా జ్యోతిష్యుడా?” 

అమ్మయ్య నువ్వే క్లూ ఇచ్చావనుకుని అతడే అని చెప్పాను. చాలాసేపు 
వాదోపవాదాలు జరిగాక, చీర తీసుకుని వాళ్లు వెళ్లిపోయారు. 

రాత్రి శ్రీధర్‌ చీవాట్లువేశారు. 

“నా మనసు నాది. అతను సొంత చెల్లెలిని వదలి నాకు చేయటం 
నాకేదో ఎబ్బెట్టుగా ఉంది.” అన్నాను. నాకు బాధగానే ఉంది. స్నేహపాత్రుడు. 
మేమంటే ప్రేమున్నవాడు.... అలా దూరం కావటం. కాని ఏం చేయను! నా 
ముఖంలో బాధ గమనించారేమో! శ్రీధర్‌ నా దగ్గరగా వచ్చారు. 

“డోంట్‌ బి టూ సెంటిమెంటల్‌! అనుబంధాలకు అర్థము చెప్పలేము” 
అన్నారు. 

నిజంగా అంతేనా! రక్త సంబంధం అంటారే దానికేం విలువ లేదా! 
ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. 

O 





మాదిరెడ్డి సులోచన కథలు 199 


ఆశకు హద్దులు 


వర్షం వచ్చే సూచనగా గది అంతా ఉక్కగా ఉంది. కమలమ్మ లేచి, 
కిటికీలు బారుగా తీసింది. బయటకూడా గాలి ఆడటం లేదు. విసుగ్గా ఫ్యాన్‌ 
వేసింది. ఫ్యాన్‌ వేగం పుంజుకుంది. “అమ్మయ్య” అనుకుంది. ఆమె మనసు, 
శరీరము చల్లబడ్డాయి. తృప్తిగా బల్లముందు కూర్చున్న కూతురు వాణిని 
చూసుకుంది. నిజంగా వాణి వాణి అనుకుంది. తల్లి ఇంత తతంగము చేసినా 
ఆమె కళ్ళు పుస్తకంలో నుండి కదలలేదు. ఆ అకుంఠిత దీక్షకు తల్లి మనసు 
ఆనందపడింది. “గంగి గోవుపాలు గరిటెడయిన చాలు” అన్న సామెత గుర్తుకు 
వచ్చింది. తనకు ఒక్క కూతురయితేనేం బుద్ధిమంతురాలు. చదువుల సరస్వతి.... 
ఇంకా ఏదో ఆలోచించబోయింది. బయట కాలింగ్‌బెల్‌ వినిపించింది. బెల్‌ 
పదే, పదే మోగితే కూతురికి యెక్కడ అవాంతరం కలుగుతుందోనని చక, చక 
బయటికి వచ్చి తలుపు తీసింది. యెదురుగా నిలబడిన బావగారిని, అతని 
కూతుర్ని చూసి నీరుగారి పోయింది. వెల వెలబోయే ముఖం వారికి 
కనిపించకూడదని ప్రక్కకు తిప్పుకుని, “రండి” అన్నది. 

“భాస్మర్‌ లేడా అమ్మాయ్‌” ఆమె బావగారు నారాయణ అడిగాడు. 

“ఉష్‌” నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని డైనింగ్‌హాల్లోకి దారితీసింది. 
బిత్తరపోయినట్టు చూచి తండ్రీ, కూతురు ఆమెను అనుసరించారు. మధ్యతలుపు 
దగ్గరగా వేసింది తొందరగా. 


“వాణికి పరీక్షలు” అన్నది ఇటు తిరిగి. 





200 మాదిరెడ్డి సులోచన కథలు 


“అంతేకదా! నేనేమో ఊహించుకున్నాను” ఆయన తేలికగా నిట్టూర్చాడు. 
కుర్చీలాక్కుని కూర్చున్నాడు. అతని కూతురు గంగ చేతిలో సూట్‌కేసుతో నిల్చుంది. 

“అలా పెట్టి కూర్చోమ్మా” నారాయణ అన్నాడు. 

“ఆం కూర్చో గంగా ! బాగా యెదిగావు. గౌన్లు వేసుకుంటుండగా 
చూచానయ్యె. సూట్‌కేసు, పక్కచుట్టతో బయలుదేరారు. యా(తలకు 
వెడుతున్నారా?” అన్నది. 

నారాయణ తటపటాయించాడు చివరకు చెప్పాడు. 

“పెద్దాడు ఈ ఊర్లో ఉండి, వద్దురా అంటే గంగను బి.ఏ.లో చేర్పించాడు. 
వాడికి ట్రాన్స్‌ఫర్‌ అయిందని, అమ్మాయిని మా దగ్గర జనగామలో వదిలివెళ్లాడు. 
ఆ పరీక్ష కాస్త ఇస్తే బి.ఏ. అవుతుందని...” 

“అవునుమరి ! హాస్టల్లో వుంచాలని తెచ్చారా! వాణికి పరీక్షలు. లేకపోతే 
మా ఇంట్లోనే ఉంచుకునేదాన్ని. దానికి ఫస్ట్‌క్లాస్‌ వస్తుందని అనుకుంటున్నాము. 
యొలాంటి డిస్టబెన్స్‌ వద్దనుకుంటున్నాము” అన్నది గడుసుగా. గంగ మొహం 
ఎట్టిగా కందిపోవటం గమనిస్తున్నాడు. అసహాయత కొన్నిసార్లు అభిమానాన్ని 
ఇస్తుంది. 

“అమ్మాయ్‌ కమలా! నీకు తెలియందేముంది, నాకొచ్చే పింఛను డబ్బుతో 
ముగ్గురి భోజనము పోగా హాస్టల్లో ఉంచడానికి డబ్బు మిగులుతుందా! 
నాల్గురోజులు మీ బయటి వరండాల్లో ఉండి చదువుకొని పరీక్ష రాస్తుందన్న 
ఆశతో వచ్చాను.” 

“ఇంట్లో అయినా ఉండవచ్చు. మీరేం పరాయివారా? మా ఇబ్బంది 
చెప్పానుగా. ఆడపిల్లయినా, మొగపిల్లవాడయినా వాణే. దాని చదువు ముఖ్యం 
మాకు....” అన్నది. అతను యెంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. 

“చవకలో మీకు తెలిసిన వసతి గృహము లాంటిది ఉంటే...” చివరి 
ప్రయత్నంగా అడిగాడు నారాయణ. 

“నాకు అలాంటి విషయాలేం తెలియవు. వచ్చేసారి మళ్ళీ ఫీజు కట్టండి. 
అప్పుడు ఇక్కడే ఉంచుకొంటాను.” 

“అంతేనంటావా!” నారాయణ మొఖం నిరాశతో, చిన్నబోయింది. 

“వాణికోసం అందరం పెందలకడే తినేస్తాంం. మీకు వంటచేస్తాను” 
కమలమవ్మ వంటింటి వైపు కదిలింది. 


"ఆశకు హద్దులు 20] 


“పిన్నీ! భోజనం చేసే బయలుదేరాం. నాన్నగారయితే రాత్రిళ్ళు సరిగ్గా 
భోజనము చెయ్యరు... ఇప్పుడేం వద్దు” అప్పటివరకు మౌనంగా వున్న గంగ 
కలుగజేసుకుంది. 

“పోనీ మజ్జిగ త్రాగండి....” ఆమె లోపలికి పోబోయింది. వెనుక వరండా 
గుమ్మం తీసుకొని భాస్మరరావు వచ్చాడు. నారాయణ, భాస్మరరావులను చూడగానే 
ఒకే మూసలో తీసిన బొమ్మలు గుర్తుకువస్తాయి. జాగ్రత్తగా మడచిన షోకేసులో 
పెట్టిన బొమ్మలా ఉంటాడు భాస్మరరావు. దుమ్ము, ధూళితో కొట్టుకుపోతూ రంగు 
వెలసిన బొమ్మలా ఉంటాడు నారాయణ. 

“అరే.... అన్నయ్యా! ఎప్పుడొచ్చావ్‌! ఓ.... గంగ... యెంత యెదిగి 
పోయావే” సంతోషంగా అడిగాడు. 


“ఉష్‌! ఏమిటా గావుకేకలు. వాణి చదువుకుంటోంది.” 

“శ్చ సారీ మేడమ్‌!....” తనూ ఓ కుర్చీ లాక్కుని కూర్చుని, అన్న క్షేమ 
సమాచారాలు అడిగాడు. కమలమ్మ తెలివిగా వారు వచ్చిన పని, తన నిస్సహాయత 
చెప్పింది. భాస్కర్‌ ముఖం చిట్లించాడు. 

“అదేమిటి కమలా! ఒక సంవత్సరం వేస్ట్‌ కాదూ!” 

“మరేం చేస్తాం...” అన్నది కళ్ళతో అతనికి ఏదో చెప్పాలని తాపత్రయ 
పడింది. 

“రేపు ఉదయం ఏదో ఏర్పాటు చేస్తాను. నువ్వు పడుకో అన్నయ్యా.... 
గెస్ట్‌రూమ్‌లో నీళ్ళు పెట్టు కమలా...” 

“గెస్ట్‌ రూమ్‌ ఎందుకురా ! హాయిగా పెరట్లో పడుకుంటాను. చల్లగా 
గాలి వస్తుంది అన్నాడు. భార్యా, భర్తలు లోపలికి వెళ్ళిపోయారు. గంగ పెరటి 
వరండాలో తనకు, తండ్రికి పక్క పరిచింది. 

“నిజంగా ఆకలిగా లేదా గంగా?” 

“నాన్నా! మీరు పాఠాలు ఎంత స్పష్టంగా చెప్పగలరో బంధుత్వాలను 
అంత అస్పష్టంగా అర్థం చేసుకున్నారు. నాకు పరీక్ష రాయాలని లేదు” అన్నది 
తను సామాన్లు ఓ ప్రక్కన సర్దుతూ. 

“చూడమ్మా అంత తొందర కూడదు.” మందలింపుగా అన్నాడు. అతని 
కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు కదిలాయి. ఇంటికి పెద్ద కొడుకుగా తనకంటూ 


౨౮2 ౫౨ ర 


ఏం మిగుల్చుకోక తమ్ముల చదువులు, చెల్లెళ్ల పెండ్లిళ్ళు చేశాడు. అందరూ 
రెక్కలొచ్చిన పక్షులే అయ్యారు. నారాయణ ఉనికినే అసహ్యించుకునేవారు. ఒక్క 
భాస్కర్‌ మాత్రము అన్న అంటే అభిమానము చూపిస్తాడు. బడిపంతులు చేసి 
రిటైర్దు అయిన నారాయణ ఇద్దరి కొడుకులను గుమస్తాలుగా చెయ్యగలిగాడు. 
ఆఖరుగా ఆలస్యంగా పుట్టిన గంగ వివాహము సమస్యగానే ఉంది. బి.ఏ. 
చదివించి ఎక్కడయినా ఉద్యోగం వేయిస్తే ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అని 
కట్నం లేకుండా చేసుకుంటారని అతని ఆశ. కమలమ్మ నైజం యెరిగినా 
అభిమానం చంపుకుని వచ్చాడు. కూతురికి చిల్లర బుద్దులు అబ్బుతాయని, 
అత్తవారివైపు బంధువులను అతి జాగ్రత్తగా దూరంగా ఉంచింది. వాణిని జాగ్రత్తగా 
తన తెలివినంతా ఉపయోగించి పెంచింది. పరీక్షలంటే ఆ యింట్లో వాణికి 
ఎంత అపురూపంగా జరుగాలో అంత అపురూపంగా జరుగుతు ఉంది. కూతురు 
చదువుతుంటే తల్లి జడ వేస్తుంది. తండ్రి జవాబులు తయారుచేసి ఇస్తాడు. ఏ 
ప్రశ్నకు ఏ విధంగా సమాధానం వ్రాయాలో అర్థం చేస్తాడు. కొన్నిసార్లు తల్లే 
చదువుతుంది గట్టిగా. వాణి బి.ఎస్సీ వరకు వచ్చింది. డాక్టర్‌ను చేద్దామన్న 
కోర్కె తీరలేదు. వాణికి జంతువులంటేనే భయము. రిసర్చి కాగా అందరూ 
గర్వించే విధంగా ఉండాలని వారికోరిక. కూతురి చదువుకు యెలాంటి ఆటంకము 
భరించలేదా తల్లి. భర్తకు జ్వరం వస్తేనే, మూల్లితే కూతురి అటెన్షన్‌ డైవర్ట్‌ 
చేస్తాడని నర్సింగ్‌ హోమ్‌లో చేర్చించింది, ఇంటర్‌ చదువుతుండగా. ఇప్పుడు 
గంగను ఉంచుకుంటుందా? ఉంచుకుంటుందనుకోవటం తన పొరపాటు అని 
గ్రహించాడు నారాయణ. 

మర్నాడు భాస్కర్‌ గంగను ఉండనియ్యమని చెప్పినప్పుడు తెల్లమొహము 
వేశాడు. నారాయణ గంగకు నచ్చజెప్పి ఉంచి వెళ్లాడు. అతను వెళ్లిపోగానే 
కమలమ్మ గంగ దగ్గరకు వచ్చింది. 

“గంగా ఆ పెరట్లో చెట్టు క్రింద దిమ్మెపై కూర్చుని చదువుకో. నోరు 
తగ్గించి మాట్లాడాలి.” 

“అలాగే పిన్నీ” అన్నది తన పెట్టి బెడ్డింగుపెరటి వరండాలో పెట్టి పుస్తకాలు 
తెచ్చుకుని చెట్టు క్రింద కూర్చుంది. వంటింట్లో మంచి కాఫీ వాసన వేస్తుంది. 
వంట భోజనాలు అయినట్టున్నాయి. ఛీ చదవక ఈ పిచ్చి ఆలోచన ఏమిటి? 
తనను తాను మందలించుకుంది. 





మాదిరెడ్డి సులోచన కథలు 203 


“కమలా! గంగ భోజనము చేసిందా?” భాస్కర్‌ గొంతు అది. “మీకేం 
తెలియదు. నన్ను పిలిచి, డిస్టర్బ్‌ చెయ్యకు. పిన్నీ నాకు ఆకలిగా ఉన్నప్పుడు 
తింటాను అన్నది. పరీక్ష చదువు” 

“అలాగా... నాకు తెలియదు” అతను వెళ్ళిపోయాడు. తన పిన్ని 
జాణతనానికి ఆశ్చర్యపోయింది. అరగంట తరువాత పప్పూ, అన్నం వడ్డించిన 
పళ్ళెం వరండాలో పెట్టింది. గంగ మాట్లాడక అది తీసుకుని తిన్నది. ఇక్కడో 
గమ్మత్తయిన మనస్తత్వముంటుంది. ధనికులంతా భీదవారిని, మధ్యతరగతి వారిని 
చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు. నిజానికి శుభ్రమైన తిండి, రుచికరంగా 
తినేది వీరే. ధనికుల భోజనము వంటవాడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి 
వుంటుంది. వాడి మూద్‌ను బట్టి టేస్ట్‌ మారుతుంది. అలాగే కమలమ్మ కూడా 
గంగ విషయంలో పొరపాటు పడింది. గంగ అలాంటివి పట్టించుకోవడం మాని 
వేసింది. “గంగా ! ఊర్మె చదివితే బుర్రకు ఎక్కదు కాస్త ఈ జాడించిన బట్టలు 
ఆరవేయమ్మా. ఆ చేత్తోనే ఆ చెట్ల క్రింద చెత్త ఊడ్చెయ్యి” అనేది. ఆ తరువాత 
రొట్టెలు వత్తమని, కూరలు తరిగి వంటామెకిమ్మని పనులు పురమాయించేది. 
భాస్కర్‌ కలుగజేసుకుంటే అతి నేర్పుగా సమాధానం చెప్పేది. 

“గంగా ఆ చెట్టు క్రింద యెందుకమ్మా యిలా వచ్చి కూర్చో” భాస్కర్‌ 
పిలిచాడు. 


“మీరు మరీనండీ? ఆ అమ్మాయికి అక్కడే గాలి ఆడుతుందట” కమలమ్మ 
కలుగజేసుకునేది. వాణి మాత్రం భోజనాల దగ్గర కనిపించేది. యెలా 
చదువుతున్నావు? అని గంగ పలుకరించినా ఆమె విసుక్కునేది. “నాకు 
పరీక్షలున్నాయి. క్లాసురాని బ్రతుకు దండగ....” అంటూ వెళ్ళిపోయేది. 


వరండా లైటు క్రింద రాత్రి చదువుతుంది గంగ. నలభై నంబర్‌ బల్బ్‌. 
కళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇంటిముందు లైటు కాంతి వంతముగా 
వెలుగుతుంది. ఇంటి చుట్టూ తిరిగి వచ్చింది. ఆ లైటుముందు కూర్చుని 
చదువుకుంటున్న గంగ యెవరో గోడ దూకగానే కెవ్వుమని అరిచింది. దాంతో 
అందరు మెలుకువ తెచ్చుకున్నారు దొంగ వచ్చాడా. యెందుకు అరిచావ్‌ 
అనలేదుగాని, కమలమ్మ వాణి చదువు పాడయిందని గోల. 


“వెధవగోల అందుకే యివర్నీ వద్దన్నాను. నా మాట మీరు వింటారా? 
ఫస్ట్‌ క్లాస్‌ పోతుంది” 


204 ఇ హద్దులు 


“అబ్బ ఏమిటి కమలా నీగోల. అయిదు నిమిషాలకు కొంప మునిగి 
పోయినట్టు చేస్తావెం?” 

“నేను పరీక్ష మానేస్తానమ్మా....” పుస్తకం నేలకేసి కొట్టింది. గంగ నెమ్మదిగా 
పుస్తకం తీసి వాణి చేతిలో పెట్టింది. 

“ఇక ఇలాంటి అవాంతరం రాదని హామీ ఇస్తున్నాను పిన్నీ మళ్ళీ 
ఏదయినా జరిగితే నేను వెళ్ళిపోతాను” అన్నది. గంగ తన మాట నిలబెట్టుకుంది. 
పరీక్షలుప్రారంభించారు. పరీక్ష అయిన సాయంత్రము వాణి చుట్టూ తల్లి, తండ్రి 
చేరి ఏ ప్రశ్నకు యెలా రాశావని అడగటం, స్నేహితులకు టెలిఫోన్లు చేయటం 
చూస్తుంటే, జీవితంలో ఏదో క్రొత్త విషయం చూస్తున్నట్టు ఉంది గంగకు. అంత 
హడావుడి చేయకపోయినా, తండ్రి పేపర్‌ విషయాలు అడిగి బాగా చేశావు 
అంటే ఒక రకమైన తృప్తి కల్లేది. కమ్మగా టీ వాసన వేస్తుంది. పిన్ని పిలిచి ఇస్తే 
బావుండును అనుకుంది. కమలమ్మకు అంత ఉదారత లేదు. ఉన్నా ఉత్సాహంలో 
మరచిపోయింది. 

రెండో పరీక్ష అయింది. గంగ వేళ్ళు మడిచి ఇంకా యెన్ని రోజులుండాలో 
లెక్క వేసుకుంది. 

“గంగా ! రేపటి పేపర్‌ చాలా ఇంపార్టెంటా? కమలమ్మ ఆప్యాయంగా 
అడిగింది. సినిమాకు రమ్మంటుందేమో, బోరు కొడుతుందనుకొని, లేదని 
చెప్పింది. 

“వాణి కళ్ళు మండుతున్నాయట. కాస్త చదువుతావా?” తను 
చదువుకోవాలి. ఆమాట పైకి అనలేదు. 

“అవునూ, నువ్వు క్లాస్‌ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యటం లేదుకదా! అది క్లాస్‌ డౌన్‌ 
అయిందంటే పిచ్చిదవుతుంది” కమలమ్మ ఆశకు ఆశ్చర్యంగా చూసి, అర్ధరాత్రి 
వరకు వాణి అడిగినవన్నీ చదివి వినిపించింది. వాణి చాలు అన్న తరువాత 
వచ్చి తన పాఠము చదువలేక పడుకుంది. ఉదయము లేవగానే మళ్ళీ చదువమని 
పిలిచింది. “చాల్లే తెలివి. అది చదువుకో వద్దు? నేను చదువుతాను” భాస్కర్‌ 
అడ్డు వచ్చాడు. గంగ పుస్తకం తీసింది, ఏ ప్రశ్న చదువాలో తెలియలేదు. 
అంతకు క్రితం రోజు హాల్లో విద్యార్థులు ఇంపార్టెంట్‌ అన్నవి, నాల్గు ప్రశ్నలు 
చదివేసరికి సమయము అయింది. గబ గబ స్నానము చేసి, భోజనానికి వెళ్ళింది. 
వంట కాలేదు. ఇంట్లో వారంతా వాణి గదిలో వున్నారు. వాణి వాంతి 
చేసుకుంటుంది. 





మాదిరెడ్డి సులోచన కథలు 205 


“నాన్నా... నా పరీక్ష” 

“నేను తీసుకు వెడతానమ్మా... నువ్వు ఈ తేనె తీసుకొని పదినిమిషాలు 
రెస్టు తీసుకో” భాస్కర్‌ గొంతు అది. 

“ఇదేం ఖర్మండీ! ఈ స్థితిలో పరీక్ష రాయగలదా” ఏడ్చు గొంతుకతో 
కమలమ్మ అంటుంది. ఆ స్థితిలో తనకు భోజనము పెట్టే వారెవరూ లేరని 
తెలుసు. కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోయింది గంగ. ఆమె అదృష్టం ఏమంటే చదివిన 
ప్రశ్నలన్నీ వచ్చాయి. ఆ తృప్తితోనే ఆకలి మరచిపోయి ఇల్లు చేరింది. భాస్కర్‌ 
ఒక్కడే ఉన్నాడు ఇంట్లో, 

“పిన్నీ వాణి ఏరి బాబాయ్‌! వాణి పరీక్ష వ్రాసిందా?” 

“లేదమ్మా! అప్‌సెట్‌ అయింది. నర్సింగ్‌ హోమ్‌లో చేర్చించాం. అసలు 
ఈ కాలపు పిల్లలకు చదువు, ప్రణాళిక అంటే ఏమిటో తెలియదు” అన్నాడు. 

“ఈ కాలం పిల్లలకు కాదు బాబాయ్‌, తల్లిదండ్రులకు” అన్నది మెల్లగా. 

“ఏమిటమ్మా?” 

“ఏం లేదు....” వెళ్ళి ముఖం కడుక్కొంది. అతనడిగితే టీ చేసి, తనూ 
త్రాగింది. యెందుకో ఆ టీ అమృతములా అనిపించింది. అన్నం తిన్నది. 

“గంగ పరీక్షలు అయ్యేవరకు వాణి ఆస్పత్రిలోనే ఉంది. కమలమ్మ కూతురి 
దగ్గరే యెక్కువ ఉంటుంది. గంగకు గిల్టీగానే వుంది. తను వచ్చిన వేళావిశేషం 
అని పిన్నమ్మ అంటే ఏం చేస్తుంది? ఆ మాటలు పడే సహనము తనకు లేదు. 
సాయంత్రం ఊరు వెళ్ళాలి. 

“పరీక్షలతోనే సరిపోయింది. నాల్లు రోజులుండమ్మా. ఊరు చూద్దువుగాని” 
భాస్కర్‌ అడిగాడు. 

“మళ్ళీ వస్తాను బాబాయ్‌. వాణిని అడిగానని చెప్పు” అన్నది. వెళ్ళేలోపున 
ఒకసారి చూడాలని ఉన్నా ఆ కోర్మెను బలవంతంగా అణచుకుంది. 

గంగ తన ఇంటికి వచ్చాక అసలు కమలమ్మ (ప్రవర్తనే దాదాపు 
మరచిపోయింది. రిజల్ట్‌ కోసం వేచి చూచింది. ఒకరోజు కమలమ్మ ఉత్తరం 
వచ్చింది. మొదట తనకు పరిచయం లేని దస్తూరి యెవరిదా అని చూచింది. 
విప్పి ఆశ్చర్యపోయింది. మొదటి పేరాలో ఆశీర్వచనాలు, తన విషయాలు 
వ్రాసింది. 


206 == హద్దుల. 


“గంగా! ఆనాటి నుండి ఉంది. మనము తలచుకొన్నది జరగడం మన 
చేతుల్లో లేదని. అయినా అదొక చాదస్తం క్రింద తీసి వేస్తున్నాము. నీపట్ల నాకు 
కోపం లేదమ్మా, నా కూతురిపట్ల విపరీతమయిన అభిమానముంది. ఆమె 
భవిష్యత్తు పట్ల అంతులేని ఆశను పెంచుకొన్నాను. ఆశ అధికమైతే దురాశ 
అవుతుందని విధి మరోసారి పాఠము నేర్చింది. నిన్నింత నిర్లక్ష్యం చేసినా, 
సెకెండ్‌ క్లాస్‌లో పాసయ్యావు. నా హృదయపూర్వకమైన అభినందనలు. మీ 
బాబాయ్‌ తెలుసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో పేపర్లో రావచ్చు... వాణి 
బాగా అప్‌సెట్‌ అయింది. మళ్లీ పరీక్ష ఇవ్వటానికి అంగీకరించింది.” ఇలాగే 
తనను క్షమించమంటూ వ్రాసింది. 


“ఏం జరిగిందే?” తల్లీ, వదిన కుతూహలంగా ప్రశ్నించారు. 

“ఏం లేదమ్మా...” అని, పిన్నమ్మ ప్రవర్తన చెప్పింది. వాళ్లు ఆ క్షణములో 
అన్నీ మరిచిపోయారు. ఒక్కటే గుర్తుంచుకున్నాం... ఏది ఏమయినా గంగ 
పాసయింది అంతేచాలు. వారి ఆశకో హద్దు ఉంది, ఆశయానికో గమ్యం 
ఉంది. గంగ మాత్రం పిన్నిని గూర్చి ఆలోచిస్తూ గంభీరంగా ఉండిపోయింది. 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 207 


అనుభవం 


అనుభవము నేర్పిన పాఠాలు ఏ కళాశాలలు నేర్పవని అంటారు. అది 
అక్షరాలా నిజం. జీవితం అంటే అమ్మా నాన్నలు కష్టపడి పంపిన డబ్బు ఖర్చు 
పెట్టటమేనని కొన్నాళ్ళు అనుకున్నాను. అందముంది కాబట్టి అందానికి తగిన 
భార్య వస్తే ఆనందించటమే జీవితమని కొన్నాళ్లు అనుకున్నాను. అలాగే భారీ 
కట్నకానుకలతో, అందచందాలు సంతరించుకున్న నా భార్య రేణు ఆనందపు 
లోతుల్ని చూపింది. నా భార్యను చూచాక నాకో బలమైన అభిప్రాయము 
ఏర్పడింది. భార్య అనే పదానికి వ్యాఖ్యాత, మా రేణు. ఆమె నా సహాయము 
లేనిదే బ్రతుకలేదని తెలిపినప్పుడు నా ఆనందము ఇంతా అంతా కాదు. అందరి 
ప్రీలలా కాదు మా రేణు. నేను కాకిని చూపి తెలుపు కదూ అంటే, “అవును.” 
అంటుంది. నాకన్నీ ఉన్నాయి. అనుభవము లేదని అన్నా వదినా అంటారు. 
వాళ్లకు మహా అనుభవము ఉన్నట్టు. నాకు కొన్ని మంచి గుణాలు కూడా 
ఉన్నాయి. నేను అందరికి సలహాలు ఇస్తాను. నా కెవరయినా సలహా ఇస్తే 
కోపము వస్తుంది. యెందుకంటే నేను మాట్లాడేదంతా హేతువాదంగా 
మాట్లాడుతానన్న నమ్మకము నాకు ఉంది. అప్పుడే నాకు బాంబేలో, హైద్రాబాద్‌లో 
ఒకేసారి ఉద్యోగం వచ్చింది. 


“బొంబాయికే వెడతాను” అన్నాను. హైద్రాబాద్‌లో ఉండి బంధువుల 
బెదడ, యెవరు భరిస్తారు ? 

“వద్దురా అక్కడ వచ్చిన జీతం ఇంటి అద్దెలకే చాలదు” అన్నాడు అన్నయ్య. 
నేను వినలేదు. వెళ్లేరోజు రేణు కంటనీరు పెట్టుకుంది. అలాంటి క్షణాలు నాకు 





208 మాదిరెడ్డి సులోచన కథలు 


చాలా అపురూపమయినవి. ఆమెను దగ్గరగా తీసుకుని ఓదార్చాను. 

“వంద రూపాయలు ఇచ్చే దగ్గర మరో వంద ఇస్తే అదే దొరుకుతుంది 
డియర్‌. నువ్వు దిగులు పెట్టుకోకు” ఓదార్సాను. ఆమె దాదాపు ఏడ్చిందనే 
చెప్పాలి. 

హోటల్‌ గదిలో సామాను పెట్టి నేను పని చేయవలసిన కంపెనీకి 
వెళ్లాను. బాస్‌ నా వెంట వచ్చి అందరినీ పరిచయం చేశారు. 

“ఇతను రవికాంత్‌ క్రొత్తగా వచ్చిన బి టెక్‌... మిస్టర్‌ రవికాంత్‌, మిస్టర్‌ 
చక్రవర్తి - అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసరు, లియాకత్‌ - హెడక్షర్మ్‌ ఆమె లత - నా 
పర్సనల్‌ సెక్రటరీ, కులకర్ణి, స్టెనోగ్రాఫర్‌...” ఆఫీసు స్టాఫ్‌నంతా పరిచయం 
చేశాడు. అక్కడ ఇంగ్రీషులోనే అందరితో మాట్లాడాలి. హిందీ కూడా అందరికి 
రాదు. రెండు రోజుల తరువాత కాస్త అందరితో చనువు ఏర్పడింది. చక్రవర్తి 
అందరితో ఛలోక్తిగా మాట్లాడుతూ తిరుగుతాడు. అతన్నే అడిగాను. 

“యెక్కడయినా ఇల్లు దొరుకుతుందా?” 

“అప్పుడేనా? వెళ్ళి ఏజెంట్లకు చెప్పాలి” అన్నాడు. 

“బాబోయ్‌ ! హోటల్‌వాడు రోజుకు ఇరవై తీసుకుంటున్నాడు. మళ్ళీ 
భోజనానికి అదనంగా ఓ పది అవుతున్నాయి.” 

“మరి ఇది బొంబాయి.” నవ్వాడు అతను. మరో నాల్దురోజులు ప్రయత్నం 
చేసినా ఇల్లు దొరుకుతుందన్న ఆశలేదు. ఆ సాయంత్రం చక్రవర్తి పిలిచాడు. 
అతనిది యు.పి. అని తెలిసింది. 

“కొన్నాళ్లు మా అవస్థ ఏదో మేం పడతాము. మా ఇంట్లో గదిలో 
ఉండు. ఇల్లు దొరికాక షిఫ్ట్‌ చెద్దువుగాని.” 

“అలాగే భోజనవసతి కూడా చూడాలి....” ఏమయితేనేం చక్రవర్తి ఇంట్లో 
నేను పేయింగ్‌ గెస్టుగా కుదిరాను. సుమన్‌, అతని భార్య చాలా కలుపుగోలు 
ప్రీ. భర్త లేకపోయినా నాతో చనువుగా ఉండేది. వారి పిల్లలు టిల్లు, పింకి, 
నాతోనే ఆడుతుందేవారు. ఫ్లాట్‌ చిన్నదే అయినా నీటుగా అమర్చింది సుమన్‌. 
అవి చూచి ఆనందించబోయే సమయానికి అహం అడ్డు వచ్చేది. 

“ఈ ఉత్తరాది స్రీలకు నీతి నియమాలు ఏముంటాయి? ఇతరుల దగ్గర 
డబ్బు లాక్కోవాలనే నటన, నవ్వు” అనుకున్నాను. రాను, రాను నా అభిప్రాయము 


“అనుభవం 209 


బలపడిపోయింది. వాళ్ల ఆప్యాయత నటనలాగ తోచింది. వారి ఆదరణ వెనుక 
ఏదో దురభిప్రాయమే ఉండి ఉంటుంది. నెలాఖరున డబ్బు ఇస్తుంటే నా కదోలా 
అనిపించింది. ఇంత డబ్బు హైద్రాబాద్‌లో అయితే ఓ మధ్యతరగతి ఉద్యోగి 
జీతము. చక్రవర్తి ఇంట్లో అన్ని వస్తువులు యెలా అమిరాయో అర్థం అయింది. 
అతను నాలాంటివారికి సహాయము చెయ్యటము వ్యాపార దృష్టితో చేస్తాడు 
అన్న అభిప్రాయము కల్గింది. మాలాంటివారి వల్లనేకదా మీరు ఇంత దర్జాగా 
బ్రతుకుతున్నారు. నిశ్చింతగా, నిర్భయంగా నాకు కావలసినవి అడగసాగేను. 
వారు నాకేం ఉపకారము చెయ్యటం లేదు. నావల్ల ఉపకారము పొందుతున్నారు. 
అదికాక మాటి, మాటికి ఇల్లు, రేణు గుర్తుకు వస్తున్నారు. తిండి సమస్య, ఉండే 
సమస్య తీరినా, ఒంటరితనము ఒక సమస్యగా మిగిలింది. రాత్రిళ్లు నిదుర 
పట్టేది కాదు. ప్రక్కగదిలో నవ్వు వినిపించినప్పుడల్లా నాకు అదోలా అయ్యేది. 
నా అసంతృప్తి వాళ్ల దగ్గర ప్రదర్శించసాగేను. 

“మీ దాల్‌తో ప్రాణాలు తీస్తున్నారు. సాంబారు చేయటం రాదా?” 
అన్నాను. సుమన్‌ నవ్వింది, నొచ్చుకుంది కూడాను. 

“సారీ రవీ! రేపు మిసెస్‌ పిళ్లేను అడిగి చేస్తాను. అలా ్రాంక్‌గా అడగాలి” 
తలెత్తి చూచాను. సుమన్‌ నిజంగా ఆ మాట అంటుందా? 

మర్నాటినుండి, పప్పుతో పాటు సాంబారు ఉండేది. కొన్ని రోజులు 
పోయాక మరో కోర్కె బయటపెట్టాను. 

“వంటలు వండటములో మా దక్షిణాది ప్రీలేనండీ, మీకు పిండి కలిపి 
పరోటాలు పిసికి వెయ్యటము వచ్చు.....” అన్నాను వెటకారంగా. అయినా 
సుమన్‌ నొచ్చుకోలేదు. 

“నిజమే, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మా ఇంట్లో నేను 
చిన్నదాన్ని. పని చెయ్యనియ్యలేదు. వివాహము కాగానే, కొన్నాళ్ళు నేర్చుకున్నాను. 
ఇదిగో మేమున్నామంటూ టిల్లూ, పింకి పుట్టుకు వచ్చారు” అన్నది. ఆ తరువాత 
టిఫిన్‌కు వారు పరోటాలు తిన్నా నా కోసము దోసె, ఇడ్లి, వడ - పెసరట్టు 
చేసేది. 

చక్రవర్తి, నేను ఫ్లాట్స్‌ చూస్తూనే ఉన్నాము. కొన్నింటికి అద్దె యెక్కువ. 
కొన్నింటికి పగిడీ కావాలి. అలా కాకుండా ఉంటే పెద్ద ఇల్లు అవుతుంది. 
అప్పుడే నాయర్‌ ఇల్లు సగమిస్తారన్న వార్త తెలిసింది. చక్రవర్తితో చెప్పాను. 


210 అనుభవం 


“నాయర్‌ తల్లిని గూర్చి రకరకాలుగా చెబుతారు. ఆ ఇంట్లో ఉందేవారిని 
పీల్చి పిప్పి చేస్తుందిట. చూద్దాం” అన్నాడు. ఆయన బాధ ఆయనది. అప్పనంగా 
వచ్చే డబ్బు యెందుకు వదులుకుంటాడు ? మరోచోట ఇల్లుందంటే చూచి 
ఆలస్యంగా ఇంటికి వచ్చాను. చక్రవర్తి భార్యను ఏదో అంటున్నాడు. వినడము 
సభ్యత కాకపోయినా విన్నాను. 

“మనిషికో రకం చేస్తూ, దినమంతా వంటింట్లోనే గడిపితే బాగుపడ్డట్టే. 
దాక్టర్‌ దగ్గర కెళ్ళమని మూడు రోజులుగా చెబుతున్నాను.” 

“రేపు వెడతాలెండి” అంటుంది. గదిలోకి బట్టలు మార్చుకుని ముఖం 
కడిగి కూర్చున్నాను. టిల్లు వచ్చాడు. 

“అంకుల్‌ భోజనానికి రమ్మంటున్నారు..... టిల్లు వెంట వెళ్ళాను. 
గోంగూర పచ్చడి, అప్పడాలు మాత్రం ఉన్నాయి. వారికి రొట్టెలు కూర, పప్పు 
స్పెషల్‌గా ఏం లేదు. అన్నం వండుతారు. పచ్చడి రుబ్బితే అరిగిపోయిందా 
ఈయన భార్య. ఆంధ్రుల మర్యాదలు చూపాలి వీడికి అనుకున్నాను. బల్లమీద 
దాదాపు ఆంధ్ర వంటకాలు ప్రత్యక్షమయ్యేవి. రోజులు గడుస్తున్నాయి. రేణు 
ఉత్తరాలు వస్తున్నాయి. వాటి నిండా విరహ బాధనే! ఒకసారి ఉండబట్టలేక 
సుమన్‌తో చెప్పాను. “ఆవిడ సర్గుకోగల్లితే సరే పిలిపించు” అన్నది. అదే అదను 
అనుకుని రేణుకు ఉత్తరము వ్రాశాను. 

ఆరోజు, జన్మలో మరిచిపోలేని రోజు! నా జీవిత పుటల్లో ఎట్ట గీతతో 
గుర్తుపెట్టిన రోజు ! చక్రవర్తి పూనాలో సబ్‌ ఆఫీసుకు వెళ్లాడు. ఆఫీసు వాళ్లము 
ఇష్టారాజ్యంగా గడుపుతున్నాము. ఆ రోజు టీ తాగుతున్నాము. లియాకత్‌ పకోడీలు 
తెచ్చి మా ముందుంచాడు. జీడిపప్పు వేసి చేసినవి చాలా రుచిగా ఉన్నాయి. 

“యెక్కడ కొన్నావు? చాలా రుచిగా ఉన్నాయి” అడిగాను. 

“ఆ పిసినారివాడు కొంటాడా? వాడి మహబుబా తెచ్చింది” కులకర్ణి 
చెప్పాడు. 

“ఈజ్‌ ఇట్‌! యెవరా మహబుబా?” 

“లతరా భాయి” అతను గర్వంగా నవ్వాడు లియాకత్‌. 

“అదే రవికాంత్‌ భాయీ! ప్రేమించే కంటే ప్రేమించబడటం అదృష్టంరా. 
తను ఆకలితో మాడుతూ వీడికి రకరకాల పిండివంటలు తెస్తుంది” అసూయగా 
అన్నాడు కులకర్ణి. 





మాదిరెడ్డి సులోచన కథలు 21 1 


“అరే బడుద్దాయి. అదేరా ప్రేమతత్వం, మనిషిలో మహత్యము. ప్రీ 
(ప్రేమించిన వాడికోసము ఏమయినా చేస్తుంది. యెంత శ్రమ అయినా భరిస్తుంది” 
అన్నాడు. నవ్వుకుని పని చూచుకున్నాము. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 
సుమన్‌ పచ్చడి రుబ్బుతుంది. “పేమించిన పురుషుడి కోసము యెంత శ్రమయినా 
సహిస్తుంది ఆ! సుమన్‌ నన్ను (ప్రేమిస్తుందా? అవును యెందుకు ప్రేమించడు! 
ఆమె నాకిష్టమయిన పిండి వంటలు చేసి పరోక్షంగా తెలిపింది. నేనే ఫూల్‌ని. 
గుర్తించలేకపోయాను. భార్యలు వేసే చాటుమాటు వేషాలు భర్తలకు తెలుసేమో! 
వారి ప్రోత్సాహము కూడా ఉండి ఉంటుంది. లేకపోతే భార్యను ఒంటరిగా 
వదిలిపోయాడు. నేను ఏం చేసినా తప్పులేదు. మొగాడిని! ఇక నా భార్యకు 
తెలిస్తే పేచీ వస్తుంది. ఆమెకు తెలిసేది యెలా? సుమన్‌ ఇద్దరి బిడ్డల తల్లయినా 
వాడని పువ్వులా (ఫెష్‌గా ఉంటుంది. 

భోజనాల దగ్గర కొసరి కొసరి వడ్డించింది. 

“చక్రవర్తి లేడు, విసుగ్గా లేదా?” అడిగాను. 

“మీరున్నారు! పిల్లలున్నారు. విసుగెందుకు?” అన్నది. ఆ “మీరు” అన్న 
పదం నాకు ప్రత్యేకంగా కనిపించింది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది 
తలుచుకుంటే వెన్ను జలదరించింది. సన్నగా వణుకు ప్రారంభం అయింది. 


లోపలి గిన్నెల చప్పుడు, పిల్లల చప్పుడు ఆగిపోయింది. 

“రవీ! హార్లిక్స్‌ త్రాగవా” లోపలి నుండే అడిగింది. 

“వద్దు” అన్నాను. నా భావాలను ఇక్కడ టాస్‌ వేశాను. సుమన్‌ హార్లిక్స్‌ 
తెస్తే నన్ను కాంక్షిస్తుందని లెక్క లేకపోతే.... నేను ఆలోచిస్తుండగానే సుమన్‌ 
గ్లాసుతో గదిలో ప్రవేశించింది. ఆమె వంక చూచి పిచ్చివాడిని అయ్యాను. 
చేతులు లేని జాకెట్లో నుండి భుజాలు అందంగా కనిపిస్తున్నాయి. నీలం వాయిల్‌ 
చీర ఆమె వంటికి యెంతగానో నప్పింది. 

“మీ రేణుకు టెలిగ్రామివ్వాలి” అన్నది గ్లాసు ముందుకు చాచి. 

గ్లాసు అందుకుని ప్రక్కన పెట్టీ, ఆమె చెయ్యిపట్టి ముందుకు లాకున్నాను. 

“రవీ!” 

“అవును సుమన్‌, రవినే. నీ ప్రేమను ఆలస్యంగా గ్రహించాను” ఆవేశంతో 
ఆమెను హృదయానికి హత్తుకున్నాను. 


2l2 em 


“థ్యాంక్స్‌! నన్ను సరిగ్గా నిలబడని...” అన్నది. వదిలాను. అంతే! నా 
చెంప చెళ్లుమంది. 

“ఒళ్ళు దగ్గర పెట్టుకో. చదువొక్కటే కాదు, సభ్యతా, సంస్కారాలు కూడా 
ఉండాలి” అన్నది. ఆ తరువాత కళ్లు తెరిచేసరికి ఆమె నా గది గొళ్లెం బయటపెట్టి 
వెళ్లిపోయింది. ఆ రాత్రి యెలా గడిపానో ఆ భగవంతుడికే తెలుసు. మర్నాడు 
ఉదయం లేచాను. బయట తలుపు తీసే ఉంది. స్నానము చేసి బయటపడ్డాను. 
తిన్నగా సామాన్లు సర్దుకుని హైద్రాబాద్‌ వెళ్లాలి. చక్రవర్తికి కంపెనీలో యెంత 
పలుకుబడి ఉందో తెలుసు. సారిడాన్‌ వేసుకుని ఆఫీసుకు వెళ్లాను. మూడు 
గంటలప్పుడు చక్రవర్తి వచ్చాడు నా దగ్గరకు. నా శరీరమంతా కంపించసాగింది. 

“ఏం ఒంట్లో బాగాలేదా?” అన్నాడు పరీక్షగా చూస్తూ. 

“ఇంటికి వెళ్లారా?” అడగలేక అడగలేక అడిగాను. 

“వెళ్లి భోజనము చేశాను. సుమన్‌ అన్నది. “అతని ఆరోగ్యము బాగా 
లేదని”....” అన్నాడు. హృదయము మీది నుండి పెద్ద బండ తీసివేసినట్టుంది. 

“ఏదో కాస్త తలనొప్పి” అన్నాను ధైర్యం కూడదీసుకుని. 

“అదిగో, నీకు ఉత్తరం” ఇంటి దగ్గర నుండి తెచ్చాడు. విప్పి చదివాను. 
రేణు వస్తుంది.... నా ముఖంలో మార్పులు గమనించాడేమో! 

“అంతా క్షేమమేనా?” 

“క్షేమమే. రేపే రేణు వస్తుంది. సాయంత్రము ఒకసారి వెళ్లి నాయర్‌ 
ఇల్లు యెవరూ తీసుకోకపోతే నేను తీసుకుంటాను.” 

కనీ ఇష్టం” అన్నాడు. సాయంత్రము వెళ్లాము యెవరూ రాలేదు. ఒక 
గది, వంటిల్లు, బాల్మనీ ఉన్నాయి. బాత్‌రూమ్‌, లావెట్రి కామన్‌గా ఉన్నాయి. 
అడ్వాన్స్‌ ఇచ్చి వచ్చాము. ఇల్లు చేరుతుంటే సుమన్‌కు యెలా ముఖం చూపించాలో 
తెలియలేదు. మేం పైకి వెళ్లాము. పక్కింటామె తాళం చెవి ఇచ్చింది. 

“పూనమ్‌ ఇంట్లో బర్త్‌డే పార్టీకి వెళ్లారు” అని చెప్పింది. అదే మంచి 
అదను అనుకుని సామాన్లు సర్దుకున్నాను. చక్రవర్తి ఆశ్చర్యంగా చూచాడు. 

“మీరిద్దరు పోట్లాడుకున్నారా ఏం? సుమన్‌ ముభావంగానే జవాబు 
చెప్పింది.” 

“అదేం లేదు....” అన్నాను గాని అతను అంతా తెలిసే 
మాట్లాడుతున్నాడేమో. 





మాదిరెడ్డి సులోచన కథలు 2 1 3 


“అమ్మాయి వచ్చాక రెండు రోజులు విశ్రాంతి తీసుకుని వెడితే...” 

“మా రేణుకు సర్దుకుపోవడం అసలు తెలియదు.” 

“మరి అలాంటప్పుడు నాయర్‌ తల్లితో....” 

“పరవాలేదు” అన్నాను. అతను యెంత చెప్పినా వినకుండా, బల్లమీదున్న 
భోజనము పూర్తిచేసి, టాక్సీని పిలిచాను. 

“సుమన్‌ని రానియ్యి.” 

“మళ్ళీ రానా, ఏమిటీ?” అంటూనే సామాన్లు క్రిందికి తెచ్చాను. టాక్సీ 
కదిలాక తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. ఆ తరువాత ఆ సంఘటన మరుగున 
పడింది. రేణుకు, అత్తకు ఊరు చూపాను. సామాన్లు కొని ఇల్లు సర్జుకున్నాము. 
చక్రవర్తి ఆహ్వానించాడు. మర్యాదలు వద్దని, వీలు చూచుకుని వస్తామని చెప్పాను. 
అత్త వెళ్లిపోయింది. 

“అమ్మీ ఒక గ్లాసుతో కాఫీపొడి ఇస్తావుటమ్మా?!”నాయర్‌ తల్లి రాజమ్మ 
అడిగింది. 

“మేము నెస్‌ వాడుతాము” అన్నాను. 

“అదే ఇవ్వు” అన్నది. ఆమె గ్లాసులో పొడి ఒంపేసరికి మా డబ్బా ఖాలీ 
అయింది. సాయంత్రము వచ్చి బయటకికి వెడుతుండగా (ప్రెషర్‌ కుక్కర్‌తో 
వచ్చిందామె. 

“ఏమిటండీ?” 

“గ్యాస్‌ అయిపోయింది. ఓ అరగంట వాడుతాను. మళ్ళీ మీకు ఇస్తాను” 
అన్నది. వంటిల్లు వదిలేసి వెళ్లాము. అరగంట అన్నమాట మూడు రోజుల 
వరకు వెళ్లింది. మరో రోజు బజారుకు వెడుతున్నాను. 

“అబ్బాయ్‌! బజారుకేనా?” యెదురు వచ్చింది రాజమ్మ. 

“ఏం?” 

“ఈ సామాన్లు తెచ్చిపెట్టు” లిస్ట్‌ ఇచ్చింది. డబ్బులడిగితే ఏం చిక్కో 
అద్దెలో తీసుకోవచ్చని తెచ్చాను. అద్దె ఇచ్చేనాడు విషయము చెబితే నాయర్‌ 
యింతెత్తున యెగిరాడు. తల్లి చేసే అప్పులకు తన పూచీ లేదన్నాడు. ఆవిడను 
అడిగాను. 

“మహాముష్టి రూపాయలకు గోల. ఇంత ఇల్లు దొరకాలంటే వెయ్యి 
రూపాయలయినా పగిడీ ఇయ్యాలి” అన్నది. 


214 అనుభవం 


బాత్‌రూమ్‌లో సబ్బులు, షాంపూ ఒకటేమిటి అన్ని మాయం చేస్తుంది. 
ఆవిడతో కచ్చితంగా లేదని చెబితే రేణును సాధించటము మొదలు పెట్టింది. 
వండిన అన్నము తినేవరకు నమ్మకం లేదు. 


ఆ బాధ భరించలేక సింధీ కాలనీలో ఇల్లు ఖాళీ అయితే వెళ్ళి వెనుకా 
ముందు ఆలోచించక అయిదు వందలు అడ్వాన్స్‌ ఇచ్చాను. నేను చెప్పానుగా 
నాకెవరి సలహా వినే అలవాటు లేదని. 


“వచ్చే యెనిమిది వందల్లో అయిదు వందలు అద్దెకిచ్చి ఏం తింటాము?” 
రేణు గోల పెట్టింది. భార్య మాట వినటము యెంత నామర్గా! 


“ఇక్కడ పద్ధతి అంతే రేణూ. కావాలంటే మనము పేయింగ్‌ గెస్టుని 
తీసుకుందాము బోలెడు డబ్బు” అన్నాను. ఇంటి నుండి వెయ్యి రూపాయలు 
తెప్పించాము. అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వలేదు. అతనికి నెల ముందరగా చెప్పాలట. 
అక్కడ వదులుకుని, ఇక్కడ ఇస్తే నా జీతం ఏం సరిపోతుంది! మరో నెల 
గడిచింది. చక్రవర్తి క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు గాని రమ్మని పిలవలేదు. 
ఇద్దరు మహారాష్ట యువకులు పేయింగ్‌ గెస్ట్‌గా దొరికారు. నాకు చాలా 
సంతోషంగా ఉంది. 


“ఏమిటోనండీ, అందరికీ వంట అంటే మాటలా?” అన్నది రేణు. 


“మనతోపాటు మరో ఇద్దరికి చెయ్యాలి, తప్పదు. లేకపోతే ప్రతి నెల 
ఇంటి నుండి యెవరు పంపుతారు?” అడిగాను. అయిష్టంగా అంగీకరించింది. 


నెల గడిచేసరికి పేయింగ్‌ గెస్టుల మీద సంపాదించే ఉబలాటం 
తీరిపోయింది. వాళ్ళకు మంచాలు, బల్ల కొనవలసి వచ్చింది. రేణుకు ఒక్క 
క్షణం తీరిక ఉండదు. సరదాకు ఒకటి రెండు గోధుమ రొట్టెలు ఆఫ్రికా, అమెరికా 
మ్యాపుల్లా చేసే రేణు, పూటకు పది రొట్టెలు చేయవలసి వస్తుంది. మాకు 
సాంబార్‌, వాళ్ళకి దాల్‌. విధిగా పచ్చికూరగాయల సలాడ్‌ ఉండి తీరాలి. ఏదో 
ఓ రోజు ఈ జంజాటము వదిలి, సినిమా చూచి బయట భోజనము చెయ్యటానికి 
లేదు. స్నేహితులు పిలిచినా వీరికి వంటచేసి పోవాలి. ఒక బాధ్యతగా 
పరిణమించింది. పైగా జమాఖర్చులు చూస్తే చేతి సమురే వదిలింది. 


“మీ ఆంధ్రులు తీపి పదార్థాలు తినరా?” ఒకరోజు గోల్మర్‌ అడిగాడు. 
నాకు చిర్రెత్తుకొచ్చింది. వీడికి అన్నం పెట్టెదే గొప్పంటే! బలవంతంగా నవ్వాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 2 1 వ 


“నా మిసెస్‌కు రావు” సహృదయము కదిలిపోయింది. నేను యెంత 
అధికారంగా సుమన్‌ను అడిగేవాడిని! 


“వదిన వంట తింటుంటే ఆటోమాటిక్‌ డయటింగ్‌!” మరో రోజు 
అనురూప్‌ నవ్వాడు. నా ఒల్లంతా కారం రాచుకున్నట్టు అయింది. ఆఫీసులో 
లియాకత్‌ గొడవ యెక్కువయింది. 


“వీ బీ వచ్చిందిగా ! మనవాడు రాత్రిళ్ళు నిదుర మరిచిపోయాడులా 
ఉంది. కళ్ళ క్రింద వలయాలు చూడు.” 


“నిజమేనుట్రా భాయి!” కులకర్ణి అడిగాడు. పేలవంగా నవ్వాను. 
అంతకంటే ఏమి చేయగలను. ఒకొకసారి తొమ్మిదింటికే అలసి నా భార్య నిదుర 
బోతుందని చెప్పనా? 

ఊహలు ఊరిస్తాయి. అపోహలు అందమైనవిగా కనిపిస్తాయి. 
అనుభవము యెంత వాస్తవమయినది ! యెంత గొప్పది ! చక్రవర్తిని చూడాలంటే 
ముఖం చెల్లటం లేదు. దానికితోడు ఆయనకు టూర్లు యెక్కువయ్యాయి. అతనితో 
మనసు విప్పి మాట్లాడనిదే బ్రతుకలేనేమో అనిపించింది. 


ఆ రోజు ఆదివారం, ఏడిండికి మేల్ముని ప్రక్కకు చూస్తే రేణు ఎప్పుడో 
లేచిపోయింది. రాత్రి అనురూప్‌ చెప్పిన విషయము గుర్తుకు వచ్చింది. 


“వదినా! రేపు ఆఫీసులో పని వుంది. యెనిమిది గంటలకల్లా వంటయి 
పోవాలి” అన్నాడు. కొందరు మొదటే మాట్లాడుతారట, సెలవు దినాలలో అర్జంటు 
పని ఉంటే బయట భోజనము చేయాలని. మరికొందరు మర్యాదకోసం అడగరట. 
మహారాషులు కార్యవాదులు. ఒక్కపైసా ఇతరత్రా ఖర్చు పెట్టుకోరు. తీ, ఈ 
గోల లేకపోతే హాయిగా ఇద్దరము పడుకునేవారము. మా స్వేచ్చ యెంతగా 
అరికట్టబడిందో తెలిసిపోయింది. లేచి వంటింట్లోకి వెళ్లాను. అనురూప్‌ పూరీలు 
ఒత్తుతున్నాడు. రేణు వేయిస్తుంది. ఇద్దరు ఒకరిని, ఒకరు ఆనుకుని ఉన్నట్టే 
వున్నారు. అతనేం అన్నాడో రేణు పక పక నవ్వింది. నా హృదయాన్నెవరో 
గట్టీగా పిండినట్టు ఫీలయ్యాను. ఏమనలేక బాత్‌రూమ్‌కెళ్ళీ ముఖం కడుకుని 
వచ్చేసరికి, అనురూప్‌ భోజనము చేస్తున్నాడు. అతని యెదురుగా కూర్చుని 
వడ్డిస్తుంది రేణు. నాకు పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది. “రేణూ!” 
కోపంగా పిలిచాను. ఆమె వచ్చింది. 


“ఆ వెధవతో ఏమిటా వికవికలు, పకపకలు!” 


గ హా 


ఆమె కళ్లు పత్తికాయలే అయ్యాయి. వెంటనే నీటితో నిండాయి. 


“ఏమన్నారు?” వణికిపోయింది. “పాపం! రాత్రి సరిగ్గా తినలేదని వడ్డించ 
బోయాను.” 


“వడ్డించేది తరువాత, ముందు నవ్వలే?” నిలదీశాను. 


“ఆం... అతను తను వండుకునే టప్పుడు ఆయన అనుభవాలు చెప్పాడు. 
మిరపకాయల కూరలో కారంవేసి వండినట్టు చెబితే నవ్వాను. ఛీ 
ఆమె కళ్ళు ఒత్తుకుని వెళ్ళింది. రెండు రోజులు ముఖం మాడ్చుకుంది. రేణుకు 
చెడు ఉద్దేశము లేకపోవచ్చు. అవతలి వారు చనువును అర్థం చేసుకునే 
సంస్మారవంతులో కాదో? “అంతా నీలాంటి సంకుచిత స్వభావులే ఉంటారా?” 
అని నా అంతరాత్మ ప్రశ్నించింది. ఆత్మపరిశీలనతో హృదయము తేలికయింది. 
ఆనందంగా ఇంటికి వచ్చాను. రేణు శరీరములో ఓపికలేనట్టు పడుకుంది. 


“రేణూ!” ఆదుర్గాగా నుదురు తాకిచూచాను. 
“భయము లేదు. మిఠాయి కావాలి.” గోల్మర్‌ నవ్వాడు. 
“నువ్వు ఆఫీసుకు పోలేదా?” 


“తయారయ్యాను. వదిన మూల్లు వినిపించింది. డాక్టర్‌ను తీసుకువచ్చాను. 
షి ఈజ్‌ ఇన్‌ ఫ్యామిలి వే....” 


“ఈజ్‌ ఇట్‌!” నా సంతోషం ఇంతా అంతా కాదు. ఆనందంగా రేణును 
ఒడిలోకి తీసుకోబోయి, సభ్యత అడ్డు వచ్చింది. ఆగాను. 


“రెండేసి గంటలకు టాబ్లెట్టు, పండ్ల రసము ఇవ్వమన్నాడు. నీకు ఫోన్‌ 
చేసి నువ్వు వచ్చేసరికి సగం దినము వేస్టు అని చేయలేదు” అతని మాటలు 
చెళ్ళున తగిలాయి. మా కోసం యెందుకతను ఆదుర్దాపడాలి? ఒకరోజు 
సెలవెందుకు పెట్టాలి? డబ్బుకు అతీతమయిన బంధమేదో ఉంది. సుమన్‌ను, 
చక్రవర్తిని యెంత అపార్థం చేసుకున్నాను? 


“ఏమండీ? అతన్ని యెంత వారించినా వినలేదు” సంజాయిషీ ఇచ్చింది 
రేణు. గోల్మర్‌ వెళ్ళిపోయాడు. అతను టీ కాచుకుని వచ్చాడు. నా కళ్ళకున్న 
పొరలు పూర్తిగా తొలగిపోయాయి. 'నేను’ అనే అహం పూర్తిగా కరిగి పోయింది. 
గోల్మర్‌ వెళ్ళిపోగానే రేణును హృదయానికి హత్తుకున్నాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 2 || 7 


“సారీ ! రేణూ.... నేను నువ్వూహించినంత మూర్చుడిని కాను...” 
అన్నాను. ఆ తరువాత రేణు పరిస్థితి చూచి వాళ్ళే వేరే ఏర్పాటు చేసుకున్నారు. 
నాకు పెద్ద బరువు దింపినట్టు అయింది. రేణు లేచి తిరుగుతున్నా బలహీనంగా 
ఉంది. ఆమెను ఇంట్లో వదిలి చెంబూర్‌ ఫ్లాట్స్‌కు వెళ్లాను. నా పొరపాటును 
మన్నించమని హృదయపూర్వకంగా కోరాను. సుమన్‌ అదే చిరునవ్వుతో 
మాట్లాడింది. దాన్నిబట్టి ఆమె క్షమించిందని అనుకున్నాను. 

“ఒదినా, మరిదికి రాజీ కుదిరిందన్నమాట. మీ మిస్టరీ అర్థంకాక 
చచ్చాననుకో...” చక్రవర్తి వచ్చాడు. 

“అది సరే. తొందరగా తయారవ్వండి. ఈయనగారి బెటర్‌హాఫ్‌ను చూచి, 
పార్టీ తీసుకుందాము” సుమన్‌ గలగల మాట్లాడేస్తుంది. రేణు గర్భవతి అని 
విని చక్రవర్తి అభినందించాడు. 

“అంకుల్‌ ! ఊరికి వెళ్లావా?” టిల్లు అడిగాడు, అమాయకంగా. 

“ఊం....” అన్నాను. అనుభవం యెంత విలువయినది ! 

పదే పదే అనుకున్నాను, అమృతము హాలాహలం అయ్యేది అనుకున్నాను. 
వాళ్ళు తయారవుతున్నారు. నేను తేలికపడ్డ మనసుతో ఉత్సాహంగా టిల్లుతో 
కబుర్లు చెప్పసాగేను. 


O 


218 me 


బదులు ఇచ్చి బీరుదు కొన్నాము 


నిజంగా కొన్నిసార్లు మనవారి మనస్తత్వము చూస్తే నవ్వాలా ఏడ్వాలా 
అనిపిస్తుంది. చిత్రమైన ప్రవృత్తులు. బాల్యచాపల్యము అంటే అది లేదు. డిగ్రీలకు 
డిగ్రీలు సంపాదించి, ఉద్యోగరీత్యా విదేశాలకు వచ్చినవారు. విశాల సముద్రము 
దాటినా, మనను సంకుచిత తత్వము వదలలేదు. 

మేము ఇథియోపియాకు వచ్చిన మూడు నెలలకు అనుకుంటాను, తోటి 
భారతీయ సహోదరుడు అత్యంత అవసరముతో మా యింటికి వచ్చారు. 

“ఏమండీ; ఆఖరు సోర్స్‌గా మీ దగ్గరకొచ్చాను. మూడు వందల డాలర్లు 
కావాలి. మళ్లీ రెండు నెలల్లో తిరిగి యిస్తాను” యెంతో జాలిగా అడిగాడు. 
నిజంగా మా దగ్గర అంత డబ్బు లేదు. క్రొత్తగా వెళ్ళాము. ఎన్నో వస్తువులు 
కొనాలి. ఆ మాటే చెప్పాము. 

అయితే కారు మరెవరికో అమ్మేయమంటారు. భారతీయులు నిలకడలేని 
వారు అంటారు. మన రెపుటేషన్‌ పాడవుతుంది.” అతను బాధగా ముఖము 
పెట్టారు. మావారు భారతీయుల మంచితనానికి తానే (ప్రతినిధి అయినట్టు 
ఫీలయ్యారే వారు లోపలికి వచ్చారు. 

“పోనీ ఆ మూడు వందలు యిచ్చేయి. ప్రిజిడైర్‌ లేకుంటే మనము 
చచ్చిపోము. అతనికి ప్రిస్టేజ్‌ క్వెశ్చన్‌” లోపల మండిపోయినా, మాట్లాడక తీసి 
ఇచ్చాను. అతను యెంతో యిదిగా కృతజ్ఞత చూపుతూ వెళ్లిపోయాడు. ఇక్కడ 
రాను, రాను తెలిసిందేమిటంటే జంతు విభాగములా, భారతీయులంతా విభాగింప 
బడినారు. 





మాదిరెడ్డి సులోచన కథలు 219 


ఆంధ్రులు ఉదాహరణ కొక్కరుగా ఉన్నారు. ఇదంతా తెలిసి మన దేశం 
పారిపోదామా అనిపించింది. ఒకరోజు బజార్లో ఒకతను కనిపించి వంకరగా 
నవ్వాడు. 

“వంద డాలర్లు బదులిస్తారా?... అలా చూస్తారేం మూడేసి వందలు 
యిస్తారట కద. మాకు యెంతొచ్చిన మిగులదు” అతని కేదో జవాబు చెప్పాము. 
రెండవరోజు మరొకతను వచ్చి “మీరు శేతుగారయ్యారుట కదా! మా కయితె 
యింటికి రెమిటెన్స్‌ పంపడానికి డబ్బు మిగులదు.” 


“పోనిద్దురూ ఇంత దూరం వచ్చి గడ్డి కరవటానికా” ఆతని భార్యంది. 
గడ్డి యెవరు కరుస్తున్నారో అర్థం కాలేదు. “మీరు బియ్యం కొంటారా?” 
ఒకరడిగితే, మీరు కూరగాయలు తింటారా అని మరొకరు. నాకేం అర్థం కాలేదు. 
మా వారికో తమిళ స్నేహితుడున్నాడు. అతను చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని 
తెలిసినా; మా వారు నవ్వుతూ, ఓపికగా కోతలు వింటారు. అందుకే ఆయనకి 
మా వారంటే యెక్కడలేని (ప్రేమ, గౌరవము. అతను ఒకరోజు వచ్చి మావారిపై 
విరుచుకపడ్డాడు. “నీ కెన్నిసార్లు చెప్పాను ! ఇక్కడ యెవరయినా బదులడిగితే, 
ఫస్టున జీతము రాకముందే మా జీతమంతా ఖర్చు అయింది. మేము నెలకు 
కోడిగ్రుడ్లే వందడాలర్లవి తింటాము. నెయ్యికి మరో వందవుతుంది అని 
చెప్పలేవూ? యెంత వచ్చినా, మావాడి చిరుతిండ్లకే సరిపోదని కొయ్యలేవూ?” 

“నీ గోల ఏమిటయ్యా ! కొయ్యటానికి సొరకాయలు, బీరకాయలు అసలు 
లేవు. సంగతేమిటో చెప్పు” విసుక్కున్నా రీయన. 

“అదిగో, నీ శాంతము చూస్తే మండిపోతుంది. ఫలానా అతనికి డబ్బెవ 
రియ్యమన్నారు? మా దగ్గర లేకనే మేము లేదన్నామా? అతని స్వభావం మంచిది 
కాదు. అందరి దగ్గర తీసుకునే ఈ వెధవల కెక్కడినుండి వస్తుంది డబ్బు? 
తింటారా పెడతారా అని నిన్న అందరితో చెబుతున్నాడు. నీవు పిసినారివట. 
డబ్బు ఆదా చేయటమే తెలుసుట. ఒకే పూట తిండి తింటారుట....” 

“ఆయన అనగానే సరా. తింటామో, లేదో మా ఆరోగ్యాలు చూస్తే 
తెలియదూ! అందరు అనుకునే మాటకు నేను బాధ్యుడినా? నెమ్మదిగా అడిగారు 
మావారు. 

“సర్లే నువ్వలా నెమ్మదిగా ఉంటావనే అలా అంటారు. నేనే అయితేనా 
ఫైర్‌ చేసేవాడిని.” 





220 బదులు ఇచ్చి బిరుదు కొన్నాము 


“మహా చేశావులే. నాకు షో చేయరాదు. ఇంట్లో తిండికి, కటకట 
లాడుతూ, బయట బార్లో కూర్చోని అందరూ చూడాలని బ్లాక్‌ అండ్‌ వైట్‌ విస్కీ 
త్రాగరాదు. పోనిద్దూ.” 

“నన్నే పోనివ్వమంటా వేమిటి? అతని మాటలు నీకు ఆమోదమే 
నన్నమాట!” 

“ఇలాంటి విషయాలు ఆమోదకరంగా ఉంటాయా? ఒకందుకు బాధగా 
ఉంది. విద్యావంతులు, విచక్షణా జ్ఞానము కలవారని పేరుగాంచిన పెద్ద 
మనుష్యులు చిన్నపిల్లల్లా మాట్లాడటము. నాకొచ్చిన నష్టం లేదు. వారే యెప్పుడూ 
అశాంతితో బాధపడతారు” మావారి మాటలు వారి స్పేసితునికి నచ్చనట్టున్నాయి. 
బయటకు వెల్లిపోయాడు. 

“అవసరాలు కట్టి పెట్టి, పోనీకదా అని యిచ్చినందు కిదా, ఆయన యిచ్చే 
బిరుదు! వెళ్ళీ దులిపెయ్యండి” 

“దులపడము తేలికే. ఆ తరువాత కథ యింకా రసవంతముగా 
నడుస్తుంది.” 

“మ్‌ రన్నింటికి యిలాగే అంటారు. మీ స్థలంలో నేనే గనక ఉంటేనా....” 

“ఉంటే ఏం చేసేదానవు? వారి అజ్ఞానానికి ఓ నవ్వు నవ్వి ఊర్మునేదానవు. 
హైదరాబాద్‌లో ఉండగా కుడిప్రక్కనుండే చెల్లెలిని అప్పుడే మరిచిపోయావా, 
'ఛాయాదేవి..” అని బిరుదు కూడా యిచ్చారు. యెడమ ప్రక్కనుండే మర 
దళ్లు....” ఆయన అంటుండగానే మూడు సంవత్సరాల కింద జరిగిన విషయము 
నా కళ్ళ ముందు మెదిలింది. యెవరో పిలువటముతో ఆయన బయటికి వెళ్లారు. 


2 


ఇంటి వారి పోరు యింతింత కాదయా అన్నట్టు అద్దెకుండి విసుగువచ్చి 
వారి పోరు భరించలేక మా యిల్లు కట్టడం పూర్తికాక మునుపే గృహప్రవేశం 
చేశాము. భాజాభజంత్రీలు ఏం లేవు. ఇంటివారి సాధింపుల నుండి 
తప్పించుకుంటే చాలనుకున్నాము. ఓ తెల్లవారు రూమున నేను, చెల్లి నీళ్ళ 
బిందె శ్రీ వెంకటేశ్వరస్వామి పటము తీసుకుని, గృహప్రవేశము చేశాము. పూజా 
ద్రవ్యాలతో మావారు వచ్చారు. టెంకాయకొట్టి మామిడి కొమ్మలు కట్టి పూజ 
ముగించాము. లారీ సామాను, అమ్మా పిల్లలు వచ్చారు. సామాన్లన్నీ వరండాలో 
పడేసి వెళ్లిపోయారు. ఆ రాత్రి బంధువులింట్లో పెళ్లి. 





మాదిరెడ్డి సులోచన కథలు 22 


“పెళ్ళికి పోకుంటే బావుండదు. దొడ్డి, స్నానాల గది లేవు. ఈ సామానులు 
యెప్పుడు సర్దుకుంటావే తల్లీ” అమ్మ జాలిపడింది. 

“పోరు లే------- జి. అంటారే” అన్నాను. వరమాన్నము వండి 
తిన్నాము. అంతా వాళ్ళు వెళ్లి పోయారు. బాబు స్టానిక్‌ బిల్లింగ్‌ మెటీరియల్‌తో 
కడుతున్నాడు. నామానాన నేను యిల్లు సర్దుతున్నాను. 

“అమ్మా... తల్లీ... నీ పేరేమిటో అమ్మాయి అనే ఆప్యాయమైన పిలుపు 
వినిపించి యెవరా అని తలెత్తి చూశాను. సన్నగా, పొట్టిగా ధవళ వస్త్రధారిణి 
అయిన ఓ బామ్మ గారు నిల్చున్నారు. యెవరో తెలియక పోయినా పెద్దామే 
కాబట్టి నమస్మరించాను. “నా తల్లే... ఏం వినయము... మంచి లక్షణము!” 
తెల్లవారురూమున రిక్షా దిగుతుంటే చూచాను. ఆ రెండో అమ్మాయెవరూ చెల్లెలా, 
లక్ష్మి, సరస్వతులల్లే ఉన్నారు. మిమ్మల్ని చూడగానే కడుపు నిండిపోయింది” 
తలపై ముసుగు సవరించుకుంటూ అన్నది. “అయితే రోజూ అమ్మగార్ని చూస్తూ 
ఉండండి. పొట్టకింత బియ్యం మిగులుతాయి” దూరంగా నీటి హౌస్‌ కడుతున్న 
పాపయ్య వెక్కిరించాడు. 

“ఆ బియ్యము మిగలడానికి ఉండి చస్తే కదరా! బియ్యము బంగారము 
అయిపోయాయి. తల్లీ నీ పేరేమిటన్నావు?” చెప్పాను. 

“యెంత నిండుగా ఉందమ్మా పేరు. మా మనుమరాలు పిల్లకేం పేరో 
పెట్టిందమ్మా, గతో, రాతో నట. నాకు నోరు తిరిగి చావదు.” అలాగే నాకు 
తెలియని తన బంధువులనంతా పరిచయము చేసింది. పని బోలెడుందే యన్న 
బాధ ఒకవంక పీకుతుంది. బామ్మ దేవాంతకురాలే! నా భావము పసికట్టింది. 

“పాపము సామాన్లన్నీ బయటపడి ఉన్నాయి. సర్దుకో. వస్తానమ్మ” ఆవిడ 
వెళ్లిపోయింది. ప్రొద్దుట నా పనికి సరిపోయింది. పిల్లవాడు అలసి పడుకున్నాడు. 
బియ్యము కడిగి స్టౌమీద పెట్టాను. 

“అమ్మాయ్‌ ఏం జేస్తున్నావు?” ప్రొద్దుటి బామ్మగారు వచ్చారు. 

“వంట చేస్తున్నానండి.” 

“అన్నమేనా, లేక నార పీచులాంటి వెధవ గోధుమ రొట్టెలా! బ్లాకులో 
కిలో రెండు రూపాయలంటున్నారు బియ్యము ధర. కార్డు గట్రా తీయించమ్మా.” 

“మాకా బాధలేదండి. మాకు పండుతాయి.” నిజంగా ఆ క్షణము గొప్ప 
కోసమే అని చెప్పుకోవచ్చు. 





222 బదులు ఇచ్చి బిరుదు కొన్నాము 


“అలాగా అమ్మాయ్‌...” రహస్యం మాట్లాడినట్టు చెప్పింది. “అబ్బాయి 
యెటో వెళ్ళాడు తిరిగిరాలేదు. నల్గురు బంధువులు వచ్చారు. కొట్లు తెలిసి 
చావవు. ఓ నాల్గు గొట్టాల బియ్యముంటే యిద్దూ” ఇలాంటి బదుళ్ళు, మధ్యతరగతి 
కుటుంబీకులకు అతి సహజము. ఒకోసారి అగ్గిపుల్లలు కూడా మరొకరి దగ్గర 
పుచ్చుకుంటాము. వెంటనే డబ్బాతీసి బీయ్యం యిచ్చాను. 


“రేపు వాళ్ళంతా భోజనానికి ఉంటే యిబ్బంది, మరో నాల్గు గొట్టాలు 
పొయ్యమ్మా.” 
అలాగే చేశాను. 


“మీ యింటిముందు రాళ్ళూ, రప్పలు కాస్త వదిలి వస్తావూ?” ఆమె 
చెయ్యి పట్టి ప్రక్కింటి వరకు పంపించి వచ్చాను. 

“పొద్దుట అంత చీకటిలో లక్ష్మి సరస్వతులలాగా కనిపించారని చెప్పిందే 
బామ్మగారు. ఇప్పుడు దారి కనిపించదా? అప్పుడే బయటి నుండి వచ్చిన మావారు 
అడిగారు. 


“పెద్దామె ఏదో మాట వరుసకన్నది పోనిద్దురూ!” బీరకాయలు తరుగుతూ 
కూర్చున్నాను. 


“వదిన గారూ... వదినగారూ...” యెవరబ్బా, నా మరదళ్ళు అని లేచాను. 
వరండాలో ఒక స్త్రీ నిలబడి ఉన్నది. సెంటు వాసన గుప్పుమంది. 


“ననీ ప్రకృయింటిలో ఉంటానండి. మావారు రాలేదు. ఇంటి తాళం 
చెవిపోయింది. ఓ రెండు రూపాయలుంటే యిద్దురూ. ఉదయానే యిస్తాను. 
కొత్త వారిని అడగాలంటే ఏదోగా అనిపించింది. అయినా ముఖము చూస్తే 
అందరి లాంటి వారు కాదు అనిపించింది. మీ బాబూ, ఒక్కడేనా యెంత 
ముద్దుగా ఉన్నాడండీ. ” ఆవిడతో మాటాడే తీరిక, ఓపిక లేవు. యెంత అవసరము 
లేకుంటే వస్తుంది? రెండు రూపాయలు ఇచ్చి పంపించాను. అలాంటి అవసరాలు 
యెవరికైనా వస్తాయి. కాని మర్నాటి నుండి నా పని ఇరకాటములో పడింది. 


అమ్మాయ్‌, ఇంటి నిండా పని, పనిమనిషి వచ్చి చావలేదు. గుప్పెడు 
కాఫీ పొడుమిస్తావ్‌ అని బామ్మగారు, వదినగారూ! కాసింత పంచదార ఇవ్వండి. 
పిల్లాడిని ఉదయమనగా పంపితే యింకా రాలేదు బజారునుండి” అని బామ్మ 
మరదలుగారి మాట. 





మాదిరెడ్డి సులోచన కథలు 2923 


“అమ్మాయ్‌ ఈ హైద్రాబాద్‌లో వీధుల పేర్లు తెలిసి చావవే తల్లీ. సైదాబాదా, 
బాగా అక్కడ బంధువులకు బావుండలేదుట వెళ్ళాలి. పండో ఫలమో పట్టుకెళ్ళాలి. 
ఓ అయిదు రూపాయలుంటే యివ్వమ్మా.” 

“మా వారెప్పుడూ పర్సు జేబులో వేసుకు పోతారు. పిల్లాడి ఫీజు కట్టలేదని 
క్లాసులో నుండి తరిమేశారట. రూపాయి నలభై పైసలివ్వండి వదినగారూ”, 
“కాసింత పెరుగు, రెండు బంగాళా దుంపలు యివ్వు. మా వారందరికి బయట 
భోజనమట. ఈ రెండు దుంపలు వేయించుకుంటాను. అన్నట్టు కాఫీ 
పొడుమివ్వాలి కదూ, రేపిస్తాను తల్లీ...” 

“వదినగారూ ! మావారి బంధువులు వచ్చారు. బీయ్యం లేవు. అన్నట్టు 
మీరు కొనరుకదూ!” 

“అమ్మాయ్‌ బుట్టెడు బొగ్గులుంటే యిద్దూ, మా వాడికి చెప్పి నాల్లు రోజులు 
అయింది.” 

“వదినగారూ! యెంత మతిమరుపో చూడండి. నిన్న అల్లుడు వస్తాడని 
అన్నీ తెచ్చి కందిపప్పు మరిచాను. గిద్దెడు వుంటే ఇప్పిద్దురూ” నాకు నవ్వు 
వచ్చింది. అయితే ఇల్లు కడుతున్న పసిపాప నా మరదలన్న మాట. నయము 
బామ్మగారు “పిన్నిగారని పిలవలేదు ఏమిటండి ఆలోచిస్తారు? ముందు తీసుకెళ్ళిన 
వస్తువులు యివ్వలేదనా! మా అమ్మాయిని పంపినాక అన్నీ యిస్తాను లెండి” 

“అది కాదండి. మా యింట్లో అయిపోయి వారం రోజులు అయింది. 
డబ్బుకు యిబ్బందిగా ఉండి తెప్పించలేదు.” 

“నెలకు ఓ నాల్గు కిలోలు తెప్పించుకోవాలి. ఇల్లన్నాక ఆ మాత్రం 
ఉండాలి” అని ఆవిడ వెళ్లిపోయింది. 

“అమ్మాయ్‌ మీ యింట్లో మిషనుందట. నీ చెల్లెకు రెండు రవికెలు 
కుట్టమ్మా' 

“నా చెల్లీ...” యెవరు! నాకున్నదొక్క చెల్లి కొన్ని వందల కిలోమీటర్ల 
దూరంలో ఉంది.” 

“అదేనమ్మా, మా మనవడి పెళ్ళాం...” నీకు ఏం తెలియదన్నట్లు నవ్వింది. 


“పాపం రవికెల గుడ్డ తెచ్చి వారం రోజులయింది. మిషన్‌ వాడు రూపాయి 
పావలా అడుగుతున్నాడు. నాకు పెద్దగా కుట్టరాదు. యెలాగో నావి మాత్రం 
కుట్టుకుంటాను. నాకు తీరికేదండి. ఈ మాత్రం షిఫ్ట్‌ సిస్టమని తీరుతుంది.” 





224 బదులు ఇచ్చి బిరుదు కొన్నాము 


“నాకు తెలియదటమ్మా. ఆదివారం ఇవ్వు...” 

“ఆ ఒక్కరోజు నాకుందేది. ఇంట్లోకి కావల్సినవి చూచుకోవాలి. సినిమాకో 
యెటో వెళ్ళాలి. బంధువులు వస్తారు.” 

“ఊఊ... ఇదివరకటి యింట్లో యింటామెకు మిషన్‌ ఉండేది. వీధిలో 
వారందరికి కుట్టి పెట్టేది ధర్మతల్లి.” అని వెళ్ళిపోయింది. బదుళ్ళు తీసుకోవడాలు 
ఇవ్వడాలు చాలా సహజమైనవి కాని మితి మీరరాదు. బామ్మ, మరదలుగారు 
మితిమీరిపోయారు. ఒక వస్తువని కాదు, సమస్తమూ, సమయాసమయాలుందేవి 
కాదు. ఇంట్లో యెవరున్నా రావడం అడగడం మామూలు అయిపోయింది. 
నేను ధర్మతల్లిని కాదు, ధనవంతురాలిని అంతకంటే కాదు. అయితే యింతగా 
యిళ్ళు తిరిగే అలవాటు యెందుకు! వారు డబ్బుకు కటకటబడి పోతున్నారా 
అంటే అదేం లేదు. సాయంత్రము యిటు నా చెల్లెలు, అటు మరదలూ, 
కనకాంబరాలు, మల్లెలు మరువం కొంటూ కనిపించేవారు. అర్ధరూపాయి పూలు 
అతి తేలికగా కొనే మనుష్యులు కొన్నిసార్లు పది పైసలకు బదులు అడగటం 
చిత్రంగా కనిపించింది. 

మా బాబు ద్వారా, వీధిలో గుట్టుగా కాలక్షేపం చేసే మరో యిల్లాలు 
పరిచయమయింది. ఆమె యింట్లో నలుగురు పిల్లలు. మావాడు అక్కడే 
ఆడుకునేవాడు. ఓ రోజు మాటల సందర్భంలో మరదలి మాటలు, బామ్మగారి 
విసుర్లు ఆమెతో చెప్పాను. 

“ఈ వీధిలో వారిద్దరంటే అందరికి తెలుసు. అందరిని వెర్రి పీన్గులను 
చేస్తారు. మీరు కొత్తవారుగా, మేము రెండక్షరాలు 'లేదు అని నేర్చుకుని చాలా 
రోజులయింది.” ఆవిడ తన అనుభవాలు చెప్పింది. వారింట్లో వారేం “'మూర్చులు 
కారే. చదువూ, సంస్కారం కలవారిలా యెందుకు ప్రవర్తిస్తారు? కోర్కెలు 
గుర్రాలవలె పరుగులు పెడతాయా? నెలరోజులు గడిచాయి. యే ఒక్క రోజూ, 
యే ఒక్క వస్తువూ అడగనిది లేదు. ప్రొద్దుటే వాకిట్లో రెండు గీతలు గీసి ముగ్గు 
డబ్బాతో వెనక్కు తిరిగాను. 

“ముగ్గుపిండి నిండుకుందే తల్లీ. కొందామంటె మరో వారం రోజుల్లో 
యిల్లు మారుతున్నాం. పిడికెడు పెట్టు” బామ్మగారు చేయి చాపారు. 

“ఎందుకు, యొక్కడికి మారుతారండి?” 

“ఈ చుట్టు ప్రక్కలంతా పాడు జనముండి చచ్చారే తల్లీ. అవసరమైతే 
ఆదుకొనే నాథుడేడి? బ్రహ్మగారు చెప్పినట్టు... ఆల... ఫలానా వీధిలో నాల్గుమంచి 





మాదిరెడ్డి సులోచన కథలు 225 


కొంపలున్నాయి” ముగ్గు పిండి తీసుకుని వెళ్ళిపోయిందావిడ. ఆవిడ యిల్లు 
మారితే బదుళ్ళు తీరుస్తుందా, అన్న భయం పట్టుకుంది. చిన్నవి, సన్నవి పోని 
అనుకున్నా, మిగిలినవి, పెద్ద బాపతులు చాలా ఉన్నాయి. యెందుకు వదలాలి? 
బియ్యమూ, డబ్బు యిప్పించుకు రమ్మని పని అవ్వని పంపాను. అవ్వ తిరిగి 
వచ్చింది! తనే తెస్తారటమ్మా! మరో గంటలో, చేతిలో తోటకూర కట్టలు పట్టుకుని 
వచ్చింది బామ్మగారు హుస్సురంటూ కూర్చుంది. 

“పప్పో, పులుసో చెయ్యమ్మా నవ నవలాడే తోటకూర” ఆ తరువాత 
ఆమె బంధు పురాణం విప్పింది. అంతా లక్షాధికార్లే దానకర్ణులే. నా ముఖంలో 
విసుగుదల కనిపెట్టిందేమో, చూడమ్మా అబ్బాయి పది రోజులపాటు ఊరు 
వెడుతున్నాడు. అప్పుడు మిగులుజూసి బియ్యము. ఫస్టున డబ్బు పువ్వుల్లో పెట్టి 
తెస్తానే” అని లేచింది. ఆమెను సాగనంపుతూ బయటకు వచ్చాను. అప్పుడే 
మా పనవ్వ నువ్వులు గాలించి యెండబోస్తుంది. 

“ముత్యాల్లా ఉన్నాయే. యింటి నువ్వులేనా? నిశ్చయంగా ఇంటివేలే” 
రెండు పిడికిళ్ళు ఒడిలో పోసుకుని వెళ్ళిపోయింది. 

మర్నాడు బడి నుండి వచ్చి అలసటగా వరండా మెట్లపై చతికిలపడ్డాను. 
బామ్మ మనుమరాలు పూల బేరం చేస్తుంది. బామ్మగారు వచ్చారు. 

“అమ్మాయ్‌ ! పది పైసలివ్వవే. తుల్జాభవనము పోవాలి. కాళ్ళు నొప్పులు. 
అన్నీ ఏకంగా ఇచ్చేస్తాముగా” నాకు మండిపోయింది. మేము పైసా, పైసాకు 
కట, కట లాడుతుంటే వారు హాయిగా అన్నీ అనుభవిస్తున్నారు. 

“లేదండి, నా దగ్గర ఒక్క పైనా లేదు.” ఆ రోజు నుండి లేవన్నమాట 
నేర్చుకున్నాను. మరదలు కాస్త నయమే మనసు పుడితే, మరురోజు మరో 
వస్తువు అవసరము ఉంటే పంచదార, కాఫీ పొడుం లాంటివి తిరిగి యిచ్చేది. 
బామ్మ మనుమరాలు వీధిలో వారందరికి బదుళ్ళకు బీరుదు యిచ్చిందట. 
నాకయితే యివ్వలేదు నయమే అనుకున్నాను. బామ్మ మనుమరాలు ఉరఫ్‌ నా 
చెల్లెలు చాలా తెలివైనదే. బామ్మనే పావులా వాడుతుంది గాని, తను బయట 
పడలేదు. 

ఆఫీసు వారికి ముప్పై తారీఖునే జీతాలు అందాయి. మాకు జీతాలు 
రాలేదు. మొదటి తేదీ సెలవు రెండవ తేదీ ఆదివారము అడ్డు వచ్చాయి. నిజంగా 
చేతిలో ఎజ్జి ఏగాని లేదు. బస్సులో స్నేహితురాలు టికెట్‌ తీస్తుంటే ఊర్మున్నాను. 
ఇంటికి రాగానే పనిమనిషి దాడి. 





226 బదులు ఇచ్చి బిరుదు కొన్నాము 


“అమ్మా ! ఇంట్లో పిడికెడు గింజలు లేవు. జీతం కావాలి.” 

“నాకు, అయ్యగార్మి రాలేదు. యెలా యిచ్చేది?” 

“అట్లాగంటే యెట్లాగమ్మా. రెండు రూపాయలే, లేవా?” లేవని చెప్పినా 
అది నమ్ముతుందా? దాని దృష్టిలో డబ్బున్న వారమే. ఓ పూట ఉపవాసమున్నా 
ఇస్త్రీ నలగని బట్ట లేస్తున్నామాయే. నాకో ఉపాయము తోచింది. 

“మామ్మగారి మనుమడి జీతం వచ్చింది. అడుగుపో” అన్నాను. అప్పటి 
గొడవ వదిలించుకున్నాను. మరో పది నిమిషాల్లో మా పనవ్వ బామ్మగారు 
అరవటము, మరుక్షణమే అటు యిటు వెళ్ళే జనము వింతేమిటని అడగటము 
వినిపించింది. 


“మర్యాద లేకపోయాక చదువులూ, చట్టుబండలూ యెందుకు? ఇరుగు 
పొరుగులమని ఏదో బదులు తీసుకుంటే, వసూలుకు పనిమనిషినా, అవ్వ...” 
నేను గుడ్లప్పగిచ్చి చూచాను. రెండు రూపాయలు అవ్వ ముఖాన కొట్టింది 
బామ్మ. బామ్మ మనుమరాలు ఉరఫ్‌ మా చెల్లాయి నా వంక ఒక తీక్షణమైన 
చూపు విసిరింది. షైలాక్‌ కంటే నువ్వేం తక్కువయ్యావు అన్నట్టు. ఆ రోజు 
కాగోల ముగిసింది. 

ఆ రోజు లాబొరేటరీలో ఆలస్యం అయింది. త్వరగా పని ముగించుకుని 
వచ్చేసరికి చీకటి పడింది. అలమరా తాళం తియ్యడాని కిచ్చిన తాళం చెవులు 
అక్కడే మరిచి వచ్చాను. అందులో మా యింటి స్టోర్‌ కీస్‌ కూడా ఉన్నాయి. 
అప్పటికే గంట ఆరు నలభై. ఏడు గంటలకే, మావాడు గోల చేస్తాడు. ఇంటి 
కెవరయినా వచ్చారా, ఇక ఒకటికి పదిసార్లు ఆకలంటాడు. రెండో కీ మా వారి 
వద్ద ఉంది. మా కిచ్చే బియ్యంలో నుండి ఓ గొట్టం బియ్యం యిప్పించుకురా 
అని మా మేనల్లుడు వస్తే పంపాను. కాని వారిని పంపితే పరువు తీశావన్నారు 
కదా అని వరండాలో నిల్చున్నాను. బామ్మ మనుమరాలు వాళ్ళ వరండాలోకి 
వచ్చింది. 

“యేయ్‌ అబ్బాయి. ఎవరికిచ్చారు, యెవర్ని అడుగుతున్నారు ! నా కిచ్చారా, 
మరోసారి యిలా అడిగితే మర్యాద ఉండదని చెప్పు. జలగలవంటి మనుష్యులు...” 
అని విసురుగా లోపలికి పోయింది. ఆశ్చర్యపోయాను. ఇలాంటి మనుష్యులు 
కూడా ఉంటారని మొదటిసారిగా తెలిసింది. పోయిన వస్తువులకు చెప్పా 
పెట్టకుండా ఊరు విడిచిన బామ్మకో నమస్మారం పెట్టి ఊర్మున్నాను. మరో 





మాదిరెడ్డి సులోచన కథలు 22] 


రెండు రోజులకు ఓ సుప్రభాతాన బామ్మదారిని అనుసరిస్తూ మనుమడు, 
మనుమరాలు వెల్లిపోయారు. కూరగాయల కొట్టు రంగారావు, పాలు పోసే 
కోదండపాణి, చిల్లరకొట్టు గుమస్తా అడివయ్య అంతా గోల పెడుతూ వీరి అడ్రసు 
అడిగినప్పుడు, అమ్మ మేమే కాదు, మాతోపాటు మరికొందరు ఫూల్స్‌ అయ్యారని 
తృప్తి చెందాము. 


8 


నాకు సికింద్రాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయింది. ఈసారి రైలు బండిలో 
వెళ్ళీ రావటము సరదాగానే ఉంది. బండి దిగి, నేను నా స్నేహితురాలు కబుర్లు 
చెప్పుకుంటూ, మా మరదలు యింటి ముందు నుండి వెళ్ళేవారము. మా మరదలి 
కూతుళ్ళు మా వయసుంటుందో, ఒకటి అర తక్కువేనో వారు గేట్లో నిలబడి, 
నలగని దుస్తులతో మాపై విమర్శలు డైరెక్ట్‌గా విసిరేవారు. వీధికో పేరు మోసిన 
వారితో మా కెక్కడ కుదురుతుందని ఊర్మునేవారము. 

ఆ రోజు బండి దిగుతుండగానే బామ్మ మనుమరాలు కనిపించింది. 
నన్ను చూడలేదు. మా భవానిని మాత్రమే చూచింది. అత్యంత సంతోషంతో 
తన కేదో చెప్తుంది. నేను అక్కడకు చేరాను. నన్ను చూస్తూనే ముఖం మాడ్చుకుని 
వెళ్ళిపోయింది. 


“ఈవిడ నీకు తెలుసా ! నిన్ను చూచి అలా వెళ్ళిపోయిందేం!” భవాని 
అడిగింది. మా యిరువురి పరిచయము చెప్పక తప్పలేదు. 


“అలాగా సాయంత్రము నోము నోచుకుంటుందిట. పేరంటానికి 
రమ్మంది.” 


“వెళ్ళిరా ఇదిగో... ఫలానా వారిళ్ళు తెలుసా ! ఆవిడ పేరంటానికి రమ్మని 
చెప్పింది” అన్నాను. ఇది వరకు భవాని ఆ వైపునే ఉండి వచ్చింది. 

“ఇందాక పిలిచిందే మీ చెల్లెలు వారింటికి వీరింటికి గోడే అడ్డము” 
సమస్య తీరింది అనుకుని, త్వరగా యింటికి వచ్చి, తయారయి యిరువురమూ 
పేరంటానికి బయలుదేరాం. 


నేను వెళ్ళిన వారింట్లో హాలు నిండుగా ఉన్నారు జనము. అందరూ 


కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను ఒంటరిగా ఒక మూల కూర్చున్నాను. పసుపు, 
కుంకుమ, పండు ఇవ్వగానే తీసుకుని వచ్చేశాను. భవానిని పిలుద్దామని పక్క 





228 బదులు ఇచ్చి బిరుదు కొన్నాము 


వాటాలోకి వెళ్లాను. హాల్లో నుండి పేరంటాండ్లు మాటలలో నుండి మా చెల్లాయి 
గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. 

“ఆవిడ మీకెలా తెలుసు భవానిగారూ!” 

“నా జతనే పని చేస్తుంది” భవాని చెబుతుంది. అయితే నన్ను గురించే 
నన్నమాట. 

“అబ్బో ఆ మనిషి మహా గట్టిది. మేము భలే పేర్లు పెట్టాము. 'జలగా, 
అని “షైలాక్‌' అని ఛాయాదేవి” అని అసలు కూడు తింటారో లేదో అవసరమైతే 
వీధిలో వారి ప్రాణాలు పోతున్నా గ్రుక్కెడు మంచి నీళ్ళివ్వరు...” తన ప్రతాపానికి 
మురిసిపోతూ యింకేదో చెప్పబోయింది. మా భవాని ఓ బాణం విసిరింది. 

“తను చెప్పింది. ఆ వీధిలో వారంతా చెప్పారు యెవర్ని గురించబ్బా. 
ప్రొద్దుట లేస్తూనే బదుళ్ళకు తిరిగేవారు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు గుట్టుగా ఖాళీ 
చేశారట. పోలికయితే...” మా భవాని మాటలు మధ్యలోనే తుంచి వేసింది 
మా చెల్లెలు. నేను చూడలేదుగాని, భవాని చెప్పింది వంద వాట్స్‌ పవర్‌లో 
వెలిగే బల్ఫ్‌లాంటి ముఖం, జీరో వాట్స్‌ బల్ఫ్‌లా మారిపోయిందట. మిగిలిన 
పేరంటాళ్ళు గమనించారేమోనని కంగారు పడిందట. 

“మా అమ్మగారు మేం చెబితే వినకుండా అలా వెళ్ళేదండి... ” నేను 
తలుపు మీద కొట్టగానే భవాని లేచివచ్చింది. యెంత తెలివి గలది. నేరమంతా 
అమ్మమ్మ మీదికి నెట్టివేసింది. వెనక్కు తిరిగి ఆ అమ్మాయిని నాల్లు దులిపి 
బదులిచ్చే జాబితా చూపాలనుకున్నాను. గుణం లేని మనుషులతో మాకేమిటని 
పించింది. విద్యాహీనులలో బీదవారిలో కూడా మంచితనముంటుంది. అద్దెకుండే 
యింట్లో (ప్రకృవారికి పనిచేసే మనిషి ఒకరోజు అర్ధరూపాయి బదులు తీసుకుంది. 
ఇల్లు ఖాళీ చేసి వచ్చాను. ఆ విషయమే మరిచిపోయాను. ఒకరోజు దారిలో 
కనిపించింది. 

“అమ్మా, నేను మీకు డబ్బులివ్వాలి. వద్దామంటే యిల్లు తెలియదు” 
సంచి విప్పబోయింది. 

“వద్దులే గుండమ్మా యెన్నిసార్లు నాకు పనులు చేయలేదు” వారించాను. 
నా వెనుకాల బస్సు వరకు వచ్చి యెక్కించి వెళ్లిపోయింది. గుండమ్మకున్న 
సంస్కారము కూడా లేదా! 


“ఆ అమ్మాయి అన్న మాటలు విన్నావా!” భవాని అడిగింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 229 


Gs 


ఆం...” అన్నాను. 

“అలాంటి వారి మాటలకు బాధ పడుతానా!” 

“బాధ కాదు భవానీ, ఈ అప్పు చేసి పప్పుకూడు తినే వారికంతా యింత 
పొగరా, బదుళ్ళు చేసి తీర్చకపోగా, బిరుదులిస్తారా? వారివల్ల పొందిన సాయము 
అప్పులు యెలా మరిచిపోయారు!” 

“అదంతా మిడి మిడి జ్ఞానము వల్ల అనే మాట. మానసికంగా యెదగ 
లేదన్నమాట. ఒక విషయము ఒప్పుకోవాలి. అభిమానములేనివారు ఇలాంటి 
బదుళ్ళు చేసి బిరుదులిచ్చేవారే సుఖంగా బ్రతుకుతారు. మనలాంటి వారు ఇబ్బందీ 
పడతారు” భవాని ఓదార్చింది. ప్రీ విజ్ఞానము దూరం నెట్టి వికసించని మనసుతో, 
అనుచితమైన మాటలని తనను తాను గొప్పగా భావించు కుంటుంది. ఆ కోవకు 
చెందినదే మా చెల్లెలు అనుకుని ఊరుకున్నాను. 

స్వదేశీ విద్యావంతుడు విదేశాలలోకి ఉద్యోగరీత్యా వచ్చిన పెద్దమనిషి 
మా వల్ల సాయం పొంది, మమ్మల్నే అనడము చిత్రంగా అనిపించింంది. 

“ఏమ్మా అంత దీర్జాలోచన” తలెత్తి చూచాను. చౌదరిగారని పంజాబతను 
నిల్చున్నాడు. అతన్ని చూస్తే అన్నయ్యే గుర్తుకు వస్తాడు. శాంతంగా సహనంగా 
హితవు చెబుతాడు. 

“బావగారేరి!” మా వారిని జీజాజి అంటారు. 

“బయటకు వెళ్లారు. రండి” భార్యాభర్తల్ని ఆహ్వానించాను. కూర్చున్నాక 
విషయాలు చెప్పాను. ఆయన నవ్వారు. 

“ఇది నీకు క్రొత్త అనుభవములా ఉందేమిటమ్మా. మాకిలాంటి అనుభవాలు 
అయి తల బొప్పికట్టి వారే డబ్బు అడుగుతారని తెలియగానే, ముందే నా కష్టాలు 
చెప్పడం మొదలు పెడతాను. అతితెలివిగల వారు అనుకుంటారు. వారి కత్తికి 
రెండు వైపులా పదునే.” 

“నిజమే” అతని భార్య అందుకుంది. “డబ్బిస్తే పిసినారి, మనకులేని 
డబ్బు వీడి దగ్గరికెలా వచ్చింది అంటారు. ఇవ్వకపోతే నన్ను ముట్టుకోకే...” 
అన్నట్టు బంక పీచు అంటారు. ఇచ్చి రెండు విధాలుగా బాధపడే కంటే 
యివ్వకపోవడమే మంచిది కదా. ముఖ్యంగా మీరు డబ్బిచ్చారే... 
అతనిలాంటివారు అమృతం త్రాగి కూడా ఛీ విషం” అంటారు. మొదటి రెండు 
సంవత్సరాలలో యిలాంటి అనుభవాలు అయ్యాక బుద్ధి తెచ్చుకున్నాము. 





230 బదులు ఇచ్చి బిరుదు కొన్నాము 


“తెలిసిందిలెండి. ఇక జాగ్రత్తగా ఉండి యే మాత్రం విముఖత ప్రకటించినా 
మూడు వందలు గంగలో కలిసిపోతాయి. మీరు విశాల హృదయులూ. మీ 
గుణగణాలు చక్రవర్తిలో కూడా లేవు. మీ డొక్కు కారు చక్రవర్తి కారుకంటే 
అందమైనది అని ఉబ్బేసి డబ్బు రాబట్టుకోండి. 

“హరీ... ఇదో నటనా అనుకున్నాను. వారు మాట్లాడి వెళ్లిపోయాక జన్మలో 
మరెవ్వరికి అప్పు యివ్వరాదని నిర్ణయించుకున్నాము. నా నిర్ణయము స్థిరంగా 
ఉందొద్దూ! పైగా మా వారికి యే క్షణానికేం బుద్ధి పుడుతుందో ! అలాగే 
అందరూ జాగ్రత్త పడడము మంచిది. కీలెరిగి వాతన్నట్టు మనసెరిగి, యిచ్చి 
పుచ్చుకోవటాలు ప్రారంభించాలి. 

అంకితము 

బదుళ్లు అడిగే బామ్మలకు, బిరుదులిచ్చే చెల్లాయిలకు, మరదళ్లకు... 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 23 1 


హరివిల్లు 


అమరావతిలో రచయితల సభలు ఉన్నాయని ఆహ్వానించారు. వెళ్ళాలా 
వద్దా అని ఆలోచనలో ఉండగా మావారు వెళ్లమని బలవంత పెట్టారు. 

“ఈ యాంత్రిక జీవితం నుండి రెండు రోజులయినా విముక్తి దొరికినా 
చాలు..” అన్నారు. సరే అని అంగీకరించాను. బయటికి వెళ్తుంటే సర్దటం ఓ 
యాతన. సర్గాక, మళ్ళీ వచ్చి యథాస్థానంలో పెట్టడం ఓ యాతన. అప్పగింతలు 
తప్పవు. 

వీథి చివర పిన్నిగారిల్లు, వెళ్లాను. అమ్మకు చిన్నమ్మ కూతురామె. 

“అబ్బో!... అబ్బో! ఎక్కడో చుక్క తెగి పడుతుంది” నవ్వింది పిన్ని, 

“నాకు తీరదని తెలుసు. ఆడవారితో చేరితే మాటల స్వరూపం, స్వభావం 
మారుతుందని తెలుసు. ఒక చిన్న సహాయం అడగాలని వచ్చాను పిన్నీ” అని 
అన్నాను. ఆమె సంబరపడింది. 

“వచ్చినప్పుడు ఒక కప్పు టీ ఇవ్వటం తప్ప మేము నీకు చెయ్యగల 
సహాయం ఏముందే తల్లీ” అన్నది పిన్ని. 

ఆమెకు నాకు సహాయం చెయ్యాలని ఉంటుంది. వంటల్లో, పిండి వంటల్లో 
అతిథులు వచ్చినప్పుడు పిలిచి సహాయం చేయించుకోవాలని ఉంటుంది. నా 
పరిధి నాకు తెలుసు. ఇచ్చి, పుచ్చుకోవటాలుండాలి. నాకు వెళ్ళీ సహాయం చేసే 
సమయం లేదు. చెయ్యలేను. అలాంటప్పుడు అడగటంలో అర్థం లేదు. 





232 మాదిరెడ్డి సులోచన కథలు 


“నేను అమరావతి వెళ్తున్నాను పిన్నీ ఈయన ఎక్కడో ఒకచోట తింటారు. 
మా మామగారికి హోటల్‌ తిండి పడదు. పనివాడికి చెయ్యటం రాదు. కాస్త 
రోజూ కూర పంపించు. ఒకసారి వెళ్ళి ఇల్లు చూచుకో” అన్నాను. 

“అంతకంటేనా ! అవును అమరావతి వెళ్తున్నావు కదూ! దార్లోనే సుగుణ 
ఉందే, వెళ్ళి చూచిరా” అన్నది. 

“వీలుంటే తప్పక వెళతాను పిన్నీ” అన్నాను. 

“వీలు, గీలు ఏం లేదు. వెళ్ళాల్సిందే. అంత దూరం వచ్చి ఇంటికి 
రాలేదంటే బాధపడుతుంది” అన్నది. 

“తప్పక వెళ్తాను పిన్నీ” అన్నాను. నిజంగా అందరూ నన్ను అభిమానిస్తారు 
ఆ ఇంట్లో. అందరిలో సుగుణకు నేను అంటే వల్లమాలిన అభిమానం. 

“సుగ్గీ... సుగ్గ అంటూ ఏడ్చించేదాన్ని. 

“దాని పెళ్ళికూడా తిరుపతిలో అయింది. నేను వెళ్ళలేకపోయాను. నేను 
వెళ్తానో లేనో అని అనుమానం కాబోలు. పిన్ని దానికి పెళ్ళికి చేయించటానికి 
వీలు కాలేదట. గొలుసులోకి జంటపావురాల లాకెట్టు చేయించింది, ఇచ్చింది. 

అన్నీ తీసుకుని ప్రయాణమయ్యాను. అమరావతిలో సభలు చక్కగా 
జరిగిపోయాయి! మ్యూజియం చూచి, విజయవాడ బయలుదేరాం. అప్పుడు 
సుగుణ గుర్తుకు వచ్చింది. 

“నేను రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తానండీ” నా కూడా వచ్చిన కార్యకర్తలతో 
చెప్పి సుగుణ ఇంట్లోకి వెళ్ళాను. 

సుగుణ సంతోషం అంతా ఇంతా కాదు. తనిల్లు తరించిపోయినట్టు 
చేసింది. సంతోషంగా కబుర్లు చెబుతూ కాఫీ, ఫలహారాలు ముగించాము. 

“అమరావతి యెలా ఉంది?” 

“అన్ని ఊళ్ళలా అది పాడు, బీడు కొడుతుంది. కాకపోతే కృష్ణానదిని 
చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంది” అన్నాను. 

“పుష్మరాలప్పుడు గెస్ట్‌హౌస్‌ కూడా కట్టారట.” 

“గెస్ట్‌ హౌస్‌లు, గుళ్ళూ బాగానే ఉన్నాయి. నేను ఎక్కువగా ఊహించి 
నందువల్లనేమో అంతగా థ్రిల్లింగ్‌గా లేదు” అన్నాను. 

“మావారయితే పడవ ప్రయాణం భలే ఊరిస్తారక్కాయ్‌. మా వారిని 
చూడలేదు కదూ! క్యాంప్‌ కెళ్లారు అక్కయ్యా” అన్నది. 


mma 223 


అతను ఏదో పేరుమోసిన చార్జర్ట్‌ అకవుంట్స్‌ ఆఫీసులో పని చేస్తున్నాడుట. 

“చిన్నప్పటిలాగే పోట్లాడుతుంటావా మీ ఆయనతో...” 

“అబ్బ! కాని మా ఆయన చాలా మంచివారక్కయ్యా. అసలు నాకు కాస్త 
(శమ కల్లితే ఓర్చుకోలేరు” అన్నది అరమోడ్పు కన్నులతో, నేల చూపులు చూస్తూ. 

“కంగ్రాచ్యులేషన్‌!” అన్నాను. 

“థాంక్స్‌ ! వసంత గుర్తుందా అక్కా” 

“నీ క్షాసుమేటు కదూ!” 

“అవునక్కయ్యా! ఈ ఊళ్ళోనే ఉంది. అందగాడని, ఆడుతాడు, పాడతాడని 
మోజుపడి చేసుకుంది. ఇప్పుడు అనుభవిస్తుంది. అతను ఒర్టీ తిరుగుబోతుట” 
అన్నది. 

“సుగ్గీ! ఆడేవారు, పాడేవారు, మాలాంటివారం కాస్త స్వేచ్చగా తిరుగ 
వలసిన అవసరం ఉంటుందే. అంతమాత్రాన కేరెక్టర్‌ లేనట్టా” అన్నాను నవ్వి. 
అమరావతికి వచ్చినవారిలో ఎక్కువ మంది రచయితలే. ఒకరిద్దరు రచయిత్రు 
లున్నారు. అంతమాత్రాన తిరుగుబోతులనుకుంటే యెలా? భర్త వెళ్లిన ప్రతి 
చోటుకు భార్య, భార్య వెళ్ళిన ప్రతీ చోటుకు భర్త వెళ్ళలేరు.” 

“అబ్బ నీకు తెలియదక్కా ! విజయవాడ రేడియో స్టేషన్లో గర్ల్‌ఫ్రెండ్‌ 
ఉందట.” 

“బయట తిరిగే మగవారిలో అలాంటి శాతం ఎక్కువ. నువ్వు మనిషిని 
బంధించగలవు కాని, మనసును కాదుగా.” 

“అమ్మో! అలాంటి భర్త నాకు దొరికితే!” భయంగా చూచింది. 

“ఏం చేస్తావ్‌? చూచీ, చూడనట్టు ఊరుకుంటావ్‌” అన్నాను ఆవులిస్తూ, 

“నువ్వు మరీ తప్పుగా అంచనా వేస్తావు. అసలు ఎంగిలికూటికి ఆశిస్తానా! 
మా వారిని చూస్తే అలా అనవు” అన్నది. 

“ఎంగిలికూటి కెవరూ ఆశించరే, పరిస్థితులకు లొంగిపోతారంతే” అన్నాను 
ఆవులిస్తూ. 

“పరిస్థితులు ! నాకు మాత్రం రావు. వసంత విషయం ఆయనతో 
చెప్పినప్పుడు ఏమన్నారో తెలుసా?” 

“ఏమంటారు?” 


234 హంవల్ల 


“అలాంటి మగాడిని షూట్‌ చెయ్యాలంటారక్కా” 

“అదో బలహీనత ! బయట తిరిగే మగాడికి సవాలక్ష అలవాట్లని మగాడు 
సరి పెట్టుకుంటాడులేవే. అంతా కాకపోయినా ఎక్కువ శాతం మగవారు, వీధిలో 
కృష్ణయ్యలే” అన్నాను. 

“నయం అందరూ అనలేదు....” నేను పడుకుంటే వచ్చి నా ప్రక్కన 
కూర్చుంది. ఏమో చెప్పాలని తెగ సిగ్గుపడిపోయింది. 

“ఏమిటే?” అన్నాను ప్రోత్సాహంగా. 

“మావారింట్లో చాలా స్ట్రిక్ట్‌ అట అక్కయ్యా ! సినిమా చూచి, పుస్తకాలు 
చదివి దాంపత్యం అంటే ఇలా అని నేనయినా కొంత ఊహించి, (గ్రహించాను 
గాని ఆయన ఒరి బుద్ధవతారం అనుకో” అన్నది ముసిముసిగా నవ్వుతూ. 

భర్తతో పంచుకున్న ఏ సంఘటన గుర్తుకు వచ్చిందో ఏమో పిచ్చిపిల్ల 
అనుకున్నాను. నాకు నిదుర ముంచుకు వస్తుంది. గెస్ట్‌హౌస్‌లో వసతిగా ఉన్నా 
కొత్త ప్రదేశం కావటం వల్లో ఏమో నిదుర రాలేదు. సుగుణ ఇల్లు కొత్త ప్రదేశం 
అయినా నిదుర ముంచుకు వచ్చింది. 

సుగుణ వాళ్ళాయన మంచితనం గురించి, అతను తనను ఎంత (పైమగా 
చూస్తాడో చెబుతుండగా, నేను గాఢ సుషుప్తిలోకి జారిపోయాను. 

పువ్వులు వెదజల్లినట్టు, మెత్తని నవ్వులు దగ్గరలో వినిపించేసరికి ఉలిక్కి 
పడి కళ్ళు విప్పాను. గదిలో ఒక మూలకున్న బీరువా దగ్గర పురుషుడు చొక్కా 
విప్పుతున్నాడు. పక్కనే సుగుణ నిలబడింది. 

“ఉష్‌ అక్కయ్య లేస్తుంది.” 

“అబ్బా! ఏమిటోయ్‌ అక్కయ్య, అక్నయ్యంటూ భర్తను మరిచిపోయావా!” 

“అబ్బ అదికాదండీ. పాపం పరాయిచోటు, రెండు రోజులుగా నిదుర 
పోలేదట.” 

“నీకోసం నేను అంత దూరం నుండి వస్తే...” 

“అబ్బ ఊరుకుందురూ....” ఇద్దరూ బయటికి వెళ్ళాక లేచాను. ఆవులిస్తూ 
బయటికి వచ్చాను. 

“మీ మరిది వచ్చారక్కా ! స్నానం చేస్తున్నారు.” అన్నది. 

చిన్నగా నవ్వాను. 





మాదిరెడ్డి సులోచన కథలు 23 వ 


“ఇదిగో నాకోసం తెచ్చారు పూలు” అన్నది సంబరంగా. నాకు సంతోషంగా 
ఉంది. సుఖ సంతోషాలు బంగళాలలో, పట్టుచీరలలో లేవు అనుభూతులలో 
అనుకున్నాను. 

“నువ్విలా రా అక్కయ్యా ! ముగ్గురం భోజనం చేద్దాం.” అన్నది సుగుణ. 
దాని కళ్ళు ఆనందం అంచులు మించేమో తళతళలాడుతున్నాయి. 

“అలాగే” అన్నాను. గదిలోకి వచ్చి చెదిరిన జుట్టు సరిచేసుకున్నాను. 

నేను ఇటు తిరిగేసరికి సుగుణ, దాని భర్త నిలబడి ఉన్నారు. 

“మా పెద్దమ్మ కూతురు, రచయిత్రి అని పరిచయం చేసి... మావారు 
మూర్తిగారు అక్కయ్యా” అన్నది సుగుణ. 

నవ్వబోయి ఆశ్చర్యంగా చూచాను. అతని పని అంతే అయింది. 

“మీరు కృష్ణ... కృష్ణ...” అన్నాను. 

“అవునక్కా! కృష్ణమూర్తిగారే. ఆ పేరుంటే కృష్ణుడి బుద్దులు వస్తాయని 
మా మామగారు మూర్తి అని పిలవమని అన్నారు” గలగల నవ్వింది సుగుణ. 
వెంటనే నవ్వాపింది. 

“మావారు నీకు తెలుసా అక్కయ్యా!” 

“ఎప్పుడో చూచారు. మీ బావగారి బడిలో కొన్నాళ్ళు నేను డ్రిల్లు 
మాష్టారుగా పనిచేశాను.... అయినా భోజనాల వద్ద సోది ఏమిటి సుగుణా ! 
వడ్డించు” అన్నాడు మూర్తి. 

అతని కంగారు అర్థమైపోయింది. 

“అవునే. మా పెళ్ళయిన కొత్తలో అనుకుంటాను... మీ బావగారప్పుడు 
ఏదో తాలూకా హెడ్‌క్వార్టర్‌లో పని చేసేవారు. అక్కడ చూచాను” అన్నాను. 

“అదా ! అదేమిటండీ, టీచర్‌గా చేసానని ఎప్పుడూ అనలేదు” అన్నది 


దాని ప్రశ్న క్యాజువల్‌గా వచ్చింది. కాని ఆ పుణ్య పురుషుడు కంగారుపడి 
పోయాడు. 

“అబ్బే... టీచర్‌గానా! ఆ వృత్తి అంటే నాకు ఎలర్జీ! అప్పుడెంత పదవ 
తరగతి పాసయి, ఊరికే ఉంటే (డ్రిల్లు మాష్టారుగా.... టెంపరరీగా అపాయింట్‌ 
చేశారంతే.... కదండీ....” అన్నాడు. 


236 హా 


“అవునవును” అన్నాను. అతను ఆరాటంగా సుగుణను కంగారు పెట్టి 
భోజనానికి కూర్చున్నాము. భోజనాలు అయినంతసేపూ అతను పరాకుగా 
ఉన్నాడు. 

“అక్కయ్యా! ఒక్కనిమిషం మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. వంటిల్లు 
చక్కబెట్టి వస్తాను” వెళ్ళిపోయింది సుగుణ. 

“చూడండి సుగుణను పెళ్ళి చేసుకోక ముందు మీ జీవితం యెలా 
గడిచిందో అనవసరం. ఇప్పుడు చక్కగా కాపురం చేసే దంపతులను విడదీసే 
సంకుచితురాలిని కాను. నిశ్చింతగా ఉండండి....” అన్నాను. 

“అబ్బే... అదికాదు...” ఏదో చెప్పబోయాడు. సుగుణ వచ్చింది. 

“అక్కయ్యా ! మా ఊరు డబ్బా థియేటర్‌లో సినిమా చూస్తావా?” 
సంబరంగా అడిగింది సుగుణ. 

“సినిమా వద్దు సుగుణా! రేపు ప్రెస్‌ కాన్ఫరెన్సు ఉంది. నేను వెళ్ళాలి. 
హాయిగా కబుర్లు చెప్పుకుందాం” అన్నాను. 

“ఈ పూటే వెళ్ళిపోతే ఆయన బాధపడతారే” అన్నది. 

“కాదు. నాకు థాంక్స్‌ చెబుతారు. ఏమంటారు మరిదిగారూ!” 

“అబ్బే... ఓ రెండు రోజులుండండి...” అన్నాడు. 

“మరోసారి వస్తానులెండి” అన్నాను. అతన్ని రాత్రి బస్సుకు టికెట్‌ తెచ్చి 
పెట్టమన్నాను. అతను వెళ్ళిపోయాడు. 

“మావారు (్రిల్లు టీచరుగా ఉండేవారంటున్నావు, బాగా తెలుసా?” 

“చూచాను అంతే, అప్పుడు నేను వయసులో ఉన్నాను కదా...” అన్నాను. 
అది ఎంత అసందర్భమో నాకు తెలుసు. 

“అక్కయ్యా ! నువ్వేం అనుకోకే. ఈ వారపత్రిక తిరగవెయ్యి. అయిదు 
నిమిషాల్లో వచ్చేస్తాను. మా మహిళా మండలికి నిన్ను పిలుద్దాం అనుకున్నాను. 
నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు. నా దగ్గర (ఫ్రెండే కనకదుర్గ. వెళ్ళి చెప్పాస్తాను” 
అన్నది. 

“వెళ్ళు...” అన్నాను. ఒక్కసారి నా ఆలోచనలు ఎనిమిది, తొమ్మిది 
సంవత్సరాల వెనక్కు వెళ్ళాయి. మా వారు పెళ్ళికాగానే తను పనిచేస్తున్న తాలూకా 
హెడ్‌క్వార్టర్స్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ అందరిలోకి మా ఇల్లే పెద్దది. దాదాపు 
టీచర్లంతా వచ్చేవారు. హెడ్‌మాష్టారు ఓ రోజు వచ్చాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 237 


“యెలా వాసూ! ఈ కృష్ణతో వేగలేక పోతున్నాను. ఇది కోఎడ్యుకేషన్‌ 
స్కూల్‌ అని మరిచిపోతే యెలా?” 

“మళ్ళీ ఏమయింది సర్‌!” 

“పదవ తరగతిలో రమను ఏమో అన్నాడట.” 

“రేపు నేను మందలిస్తాను” మా వారు హామీ ఇచ్చారు. టీ తాగి హెడ్‌ 
మాస్టారు వెళ్ళిపోయారు. 

“ఎవరండీ ఈ కృష్ణ!” అన్నాను. 

“మా స్కూలు డ్రిల్లు మాస్టారు క్రాంతీ. మెట్రిక్‌ మూడుసార్లు తప్పాడట. 
డ్రిల్లు మాష్టారుగా పంపాడు. ఫ్యామిలీ ఉంది. అయినా చూచిన ఆడపిల్లనల్లా 
అనుభవించాలనుకుంటాడు” అన్నారాయన. 


ఆ విషయం మర్చిపోయాను. ఈయన గారు స్పోర్ట్‌ అంటూ, లాబ్‌ 
వర్క్‌ అంటూ ఆరు, ఏడు గంటలకు వస్తారు. ఇంట్లో విసుగనిపించి, ఇంటివాళ్ళ 
కోడళ్ళు, కూతురు వెళ్తుంటే గుడికి వెళ్ళాను. 

“నిలువవె వాలు కనులదానా!” అంటూ పాట వినిపించింది. 

“పాడు సన్యాసి....” అనుకుంటూ వాళ్ళు హడావుడి పడిపోయి, నడక 
వేగం హెచ్చించారు. 

“యెవరు?” అన్నాను 

“వాడే కృష్ణగాడు... టీచర్‌” నాకు కుతూహలం హెచ్చింది. త్వరగా 
వెళ్ళాలని పట్టుబట్టారు. తలఎత్తి చూచాను. ఇద్దరు యువకులు నిల్చున్నారు. 
ఒకతను నేను చూడగానే కాలరెత్తాడు. 


నా కలాంటి వారిని ఏడిపించడం సరదా. 

“ఇలా వస్తారా!” చప్పట్లు కొట్టాను. ఇంటివారి కోడలు భయంగా 
చూచింది. 

“నన్నేనా...” నీరుకారిపోతూ వచ్చాడు. 

“ముగ్గురు... కాదు నల్గురం ఉన్నాం యెవరివి వాలుకనులు” అన్నాను. 

ఆ వెంట ఉన్న మరో యువకుడు పరుగున వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. 

“వాసు మాష్టారి భార్య....” అనటం వినిపించిది. 


238 హు 


అతను ఏమనుకున్నాడో ఏమో, నా వంక ఎగాదిగా చూచి వెళ్ళిపోయాడు. 
వెంట ఉన్న అతను పరుగులే పెట్టాడు. 

“చూచారా, మగాడిని చూచి నీరుగారిపోతూ, సిగ్గుల మొగ్గలయితే ఇలాగే 
ఉంటుంది” అన్నాను. కాస్త విజయ గర్వంతో. తప్పు నాది కాదు. ఆ వయసు 
అలాంటిది. 

అందరం ఇంటికి వచ్చాము. ఈ విషయం ఆయనతో చెబితే 
బావుంటుందా? అవసరం అనుకుంటే చూద్దాం అనుకున్నాను. ఆ రోజు వారు 
పదకొండింటికి వచ్చారు. నిదురకళ్ళతో వడ్డించి పడుకున్నాను. మర్నాడు లంచ్‌ 
అవర్లో వచ్చారు. వస్తూనే పకపక నవ్వేశారు. 

“కాంతీ! నువ్వు ఈ ఊళ్ళో బాయ్‌(గ్రైండ్స్‌తో విచ్చలవిడిగా 
తిరుగుతున్నావని నాకు రిపోర్ట్‌ వచ్చింది.” 

“ఈ రోజు నుండి నా మీద సి.ఐ.డీలను వెయ్యండి” అన్నాను. 

“వాడి చెంప పగలగొట్టి ఉందేవాడిని. మళ్ళీ నిన్నేమయినా అంటాదని 
ఊరుకున్నాను. ఈడియెట్‌, పెళ్ళాం ఉంది. కూతురు ఉంది. పాడుబుద్దులు” 
అన్నారాయన. 

“అసలు ఏం చెప్పాడు?” 

“వాసుగారూ ! మీరు చాలా ఫార్వర్డ్‌! మీరిక్కడ పనిచేస్తుంటే మీ భార్య 
బాయ్‌(ఫెండ్స్‌తో తిరుగుతుంది” అన్నాడు. నాకు ఒల్లు మండింది. 'మనము 
రోజుకో గర్ల్‌ను వెతుక్కోవటం లేదూ, అలాగే వాళ్లు అన్నాను” అన్నారు. 

“ఈ విషయం అందరితో చెబుతాడేమో.” 

“వాడి ముఖం వాడి మాట నమ్మేదెవరు. తప్పు చేసినవాడి నింకా తప్పులోకి 
తొయ్యవద్దని నేను మాట్లాడుతాను. యెవడూ మాట్లాడడు” అన్నారు. ఆ విషయం 
మరిచిపోయాను. 

శుక్రవారం పది గంట లప్పుడు, స్కూలు అటెండర్‌ ఎల్లయ్య వచ్చాడు. 

“అమ్మా... అమ్మా! కృష్ణమాషారి ఫ్యామిలీ వస్తుంది.... ఫ్యామిలి” 
అన్నాడు. నాకు కుతూహలం పెరిగింది. ఈ అల్లరి కుర్రాడికి యెలాంటి భార్యో! 
ముక్కుకు తాడేస్తుందో, ముగ్ధరాలో అనుకున్నాను. ఎదురు వెళ్లాను. ఒక నలభై 
ఏళ్లావిడ, ఆవిడ వెంట లంగా, ఓణీ వేసుకున్న పన్నెండేళ్ళ అమ్మాయి వచ్చారు. 





మాదిరెడ్డి సులోచన కథలు 239 


అమ్మాయి కృష్ణకు ఈడు, జోడు బాగానే ఉంది. ఇంకా బాల్య వివాహాలు 
అమలులో ఉన్నాయి కాబోలు, అనుకుంటూ ఎదురువెళ్లి చాపవేసి ఆహ్వానించాను. 

“మావారు మరీ, మరీ చెప్పారు. వాసుగారి భార్యను పేరంటానికి 
పిలువమని....” పెద్దావిడ బొట్టు పెట్టింది. 

“కృష్ణగారి భార్యను. ఇది మా అమ్మాయి. వరలక్ష్మీ వ్రతం. తప్పక రండి” 
అన్నది. గోడను ఆనుకుని నిలబడవలసి వచ్చింది. 

కృష్ణ భార్యా! కోరమీసాలతో కుర్రాడిలా కనిపించే కృష్ణ భార్యా! కొందరు 
వయసు దాచుకుంటారేమో! 

“తప్పక రావాలకృయ్యా....” ఆ పిల్ల నా చెయ్యి పట్టుకుంది. 

“తప్పక వస్తాను. కూర్చోండి. టీ తాగి పోదురుగాని” అన్నాను. 

“వద్దమ్మా. ఇంకా పిలవాలి” అన్నదామె. ఆమె పేరు మంగళట, అమ్మాయి 
పేరు శర్మిష్ట. 

నేను తేరుకోవటానికి చాలాసేపు పట్టింది. ఆ విషయం మరిచిపోదాం 
అనుకుంటుండగా సాయంత్రం కృష్ణ అమ్మాయి వచ్చింది. 

“మీకు మా ఇల్లు తెలియదని వచ్చాను” అన్నది. 

తప్పదని తయారయి వెళ్ళాను. 

అంతా పెద్దవారే ఉన్నారు. ఆ వీధిలో బ్రాహ్మణులే ఎక్కువ ఉన్నట్టున్నారు. 
అందరూ గుంటూరు చీరలు కట్టుకుని, చక్కగా ఉన్నారు. అందర్లో కాస్త ఫ్యాషన్‌గా 
నేనే కనిపించానేమో. అందరికీ నేను ఒక వింత పదార్థంలా ఉంది. 

“ఒక పాట పాడు...” అంటూ తలా ఒక ప్రశ్న వేసారు. 

“నేను వెళ్తానండీ....” లేచాను. ఈ గస్రీశక్తిని తట్టుకోవటం కష్టం 
అనిపించింది. 

“వాసుగారిది మీ కులమేనా?” 

“మీది (ప్రేమ వివాహమా పెద్దలు కుదిర్చిన పెళ్ళా?” 

“మీ ఆయన కాస్త ముదురు!” 

అమ్మనాయనోయ్‌... అందుకే లేచాను. “వీర నారీమణీ?” అంటూ 
అంతరాత్మ హేళన చేసింది. 


240 హా 


“అబ్బ! ఉండండి, మావారితో మాట్లాడాలి. మీరు చాలా అదిట... ఏది...” 
అన్నది. 

“సోసియల్‌....” కూతురు అందించింది. 

“అమ్మ బాబోయ్‌....” మరో బాంబా! 

“నీకటవుతుంది. నేను వెళ్ళాలి” అన్నాను కచ్చితంగా. ఆవిడ అయిష్టంగా 
లేచింది. 

“తాంబూలం ఇవ్వకున్నా వెళతారా?” అడిగింది మంగళ. 

“ఆలస్యం అవుతుంది. వెళతాను.” 

“వరలక్ష్మీవ్రతం చేసాక, తాంబూలం తీసుకోందే వెళ్లకూడదు. అరిష్టం.” 

“నాకా నమ్మకాలు లేవు” లేచాను. ఆవిడ తాంబూలం ఇచ్చింది. తీసుకుని 
బయటికి వచ్చాను. అక్కడ ప్రీలంతా అలా ప్రశ్నించారంటే ఏదో బలమయిన 
కారణం ఉండి ఉంటుంది. ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను. ఆ చుట్టుపక్కల 
పేరంటాలు పిలువటంతో ఆనాటి విషయం మరిచిపోయాను. 

మూడు రోజుల తరువాత మధ్యాహ్నం ఎల్లయ్య మావారి టిఫిన్‌ కోసం 
వచ్చాడు. 

“అయ్యగారింటికి రాలేరంటనమ్మా” అన్నాడు. 

ట్స్‌ కృష్ణ మాష్టారి భార్య యెలా ఉంది!” మామూలుగా ప్రశ్నించాను. 

“తప్పుడుముండ! దాని పేరెత్తకమ్మ....” అన్నాడు. 

ఒక అటెండరు, ఒక టీచర్‌ భార్యను అలా అవమానించటం సహించలేక 
పోయాను. 

“నోరు పారేసుకోకు. ఏమిటా మాటలు!” అరిచాను. 

“లేకపోతే ఏమిటమ్మా! ఇరవైఏళ్ల కుర్రాడికి, నలభై ఏళ్ల ఆడదా! పోనీ 
మగబుద్దులు, మోటుబుద్దులు అనుకుందామన్నాా వాసుబాబు మీద తప్పుడు 
ప్రచారం. మిమ్మల్ని లేవదీసుకు వచ్చాడట. మీరు సంసారపక్షం కాదట.” 

పకపక నవ్వాను. 

భలేగా ఉంది కామెంటు. 

“నేను పెళ్లికొచ్చాను కాబట్టి నమ్మలేదు” అన్నాడు ఎల్లయ్య. ఆలోచిస్తూ 
ఉండిపోయాను. కళ్లు మూసుకుని పాలు త్రాగే పిల్లి కథలా వుంది. 





మాదిరెడ్డి సులోచన కథలు 241 


అయిదారు రోజులకు కృష్ణ అసలు కథ తెలిసింది. ఆవిడ భార్య కాదుట. 
ఇద్దరూ కాపురం పెట్టారట. కృష్ణ తండ్రి, పిన తండ్రి వచ్చి, కృష్ణను ఉద్యోగం 
మాన్పించి తీసుకుపోయారు. ఆవిడ భర్తను వదిలిందట. 

“వీడికింత చరిత్ర పెట్టుకుని ఇతరులకు కథలు అంటకడతాడా” అని 
వాసు ఆశ్చర్యపోయాడు. 

రెండు సంవత్సరాల వరకు కృష్ణను గుర్తుకు తెచ్చుకునే అవసరం ఏం 
రాలేదు. నేను హైద్రాబాద్‌ వచ్చి, బియిడి చేసి ఉద్యోగంలో చేరగానే, మనిషి 
అవసరం అనుకున్నాను. మాకు అబ్బాయి పుట్టాడు. తెలిసిన వారెవరో పనిపిల్లను 
తెచ్చారు. 

తీరా చూస్తే ఆ అమ్మాయి కృష్ణమూర్తి కూతురుగా పరిచయం అయిన 
పిల్ల, శర్మిష్ట. కొన్ని పేర్లు మరిచిపోలేం. 

“అక్కా! మా అమ్మ అందరిని వదిలి వచ్చింది. ఆ కృష్ణ వెళ్ళిపోయాక, 
అమ్మ, నేను, పట్నం వచ్చి, పాచి పనులు చేసుకుంటున్నాము” అన్నది. 

జాలేసింది. మంగమ్మను మంగళగా మార్చేడుట కృష్ణ. 


ఒకరోజు తల్లి కూడా వచ్చి బడిలో అటెండర్‌గా వేయించమని 
(బ్రతిమాలింది. మనకంత పరపతి ఎక్కడిది! మనకు తెలిసిన షావుకార్ల ఇంట్లో 
ఉంచాను. తల్లీ కూతుర్లకు కలిపి రెండు వందలిస్తారు. భోజనం అక్కడే. మంగమ్మ 
కూతుర్ని తీసుకుని అప్పుడప్పుడు వస్తుంది. 

అలా మరిచిపోయిన కృష్ణమూర్తి, రూపంలో పిన్ని కూతుర్ని చేసుకుని, 
బుద్ధిమంతుడుగా చలామణి అవుతున్నాడంటే సంతోషమే. ప్రతీ భార్యా, తన 
భర్త మంచివాడేనని నమ్మితే మంచిదే. ఆ నమ్మకమే కాపురం నిలబెడుతుంది. 
అనుకోకుండా కళ్లు మూతలుపడ్డాయి. అరగంట గాఢ నిద్రలో గడిపి లేచాను. 
కళ్లు కడుక్కుందామని బాత్‌రూమ్‌ వైపు వెళ్ళాను. 


“ఆ టీచర్‌ భార్యే రచయిత్రి అని నాకేం తెలుసు” అంటున్నాడు మూర్తి 
“అందుకా మీరామెను చూచి తెల్లబోయింది” ఆశ్చర్యంగా అడుగుతోంది 


సుగుణ. 


“అవును సుగుణా! ఆమె గురించి నీకెలా చెబుతాను! గ్రంథసాంగురాలులే. 
రెండు జడలేసుకుని, సినిమాస్స్టార్‌ ఫోజులనుకో. అందుకే అప్పటి విషయాలు 


242 వా 


బయట పెడతానని నీతో నా గురించి ఏవయినా అబద్దాలు చెబుతుందేమో 
ఆమె మాటలు నమ్మ మ్ల అంటున్నాడు. 


“అమ్మో! ఇక నమ్ముతానా! మీరు లేకపోతే చెప్పేదేమో ఎంత నంగనాచి...” 
అంటున్నది సుగుణ. 


నేను వెనక్కు వచ్చి కూర్చున్నాను. నా గురించి ఏం చెప్పి ఉంటాడు! 
సుగుణ నన్ను నంగనాచి అనే స్థితికి వచ్చిందంటే ఏం చెప్పి ఉంటాడు! ఆలోచిస్తూ 
కూర్చున్నాను. 


“ఇదుగో టికెట్టు....” సుగుణ బస్‌ టికెట్టు ఇచ్చింది. 

“బస్‌ ఎక్కేక కొనవల్సిందే, కాని మీ పేరు చెప్పి ఆమె కొనలేరని తెచ్చాను” 
అన్నాడు మూర్తి. 

నేను మామూలుగా ఉండాలని ప్రయత్నం చేశాను. 

“మీ (ఫెండ్స్‌ ఎవరో వస్తారన్నావు.” 

“ఇంట్లో లేరు.” 

నిప్పుల మీద ఉన్నట్టుంది సుగుణ స్థితి. నేను టీ త్రాగేశాను. 

“మనుషులు రాసేదానికి చేసేదానికి సమన్వయం ఉండదు” అన్నది. 

ఉండి, ఉండి ఇదేం నాన్చుడు! ఐనా చిరునవ్వుతో అడిగాను. 

“యెవరి విషయం సుగ్గీ!” 

“ఇంకెవరు! మీ రచయిత్రులు” అన్నది. 

“ఎంతమంది రచయి(త్రుల నెరుగుదువు?” అన్నాను. 


జవాబు చెప్పలేదు. నేను పేపర్‌ చదువుతూ సాయంత్రం వరకు గడిపాను. 
మా ఇద్దరి మధ్య అడ్డుతెర పడినట్టు ఫీలయ్యాను. కృష్ణమూర్తి ముందే అతని 
విషయం చెప్పాలనుకున్నాను. పోనీలే నేను చెడ్డదాన్ని అయినా ఓ కాపురం 
నిలబెట్టాను అనుకున్నాను. బస్‌ ఎక్కాక అసలు వాళ్ళ విషయమే మర్చిపోయాను. 
నా పుస్తకాలు నా ఇంటర్వ్యూ మాత్రమే గుర్తుంది. 

విజయవాడలో ఒక రోజుండి ఇల్లు చేరాను. మూడ్రోజులకు పిన్ని 
వచ్చింది. 


“సుగుణ యెలా ఉందే?” 





మాదిరెడ్డి సులోచన కథలు 243 


“సుగుణ బావుంది పిన్నీ!” అన్నాను. అక్కడ ఉండి భోజనం చేశానని 
చెప్పాను. 

“ఏమోనే అమ్మా ! దూరం సంబంధం. పెళ్ళి అయి, అది కాపురానికి 
వెళ్లాక తెలిసింది, అల్లుడు గ్రంథసాంగుడని. దాన్ని ఏం బాధలు పెడుతున్నాడోనని” 
అన్నది పిన్ని దిగులుగా. 

“కుర్రాళ్ళు తెలిసీ తెలియని వయసులో ఏమో చేస్తారు. ఎప్పటికీ అలాగే 
ఉంటారా పిన్నీ” అన్నాను. కంటిలో నలుసులా, సుగుణ ఇంట్లో జరిగిన 
సంఘటన నన్ను కృంగదీస్తుంది. 

జనవరిలో ఇదంతా జరిగింది. ఫిబ్రవరి రెండున మామయ్య కూతురి 
పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళికి సుగుణ, కృష్ణమూర్తి వచ్చారు. నాతో ముభావంగా 
ఉంది. పెళ్ళికొడుకు మంగమ్మ పనిచేసే వారింటిలో అద్దెకుంటాడట. మంగమ్మ, 
కూతురు పెళ్ళికి వచ్చారు. ఆమె కృష్ణమూర్తిని గుర్తుపట్టింది. ఆరోజు రాత్రి 
పిన్నిగారింటికి వచ్చింది. 

“ఏదో మీ ఆవిడతో గుట్టుగా కాపురం చేసుకుంటున్నావ్‌. నా దగ్గర 
తీసుకున్న బంగారం ఇచ్చెయ్యి. నా పిల్ల పెళ్ళి చేస్తాను” అని నిలదీసిందట. 
నాకు కబురు వచ్చింది. 

వెళ్ళలేదు. వెళ్ళినా ఏం చెబుతాం! పిన్ని బాబాయి కూతురి కాపురం 
నిలబెట్టాలని, మంగమ్మకు రెండు కాసుల బంగారం ఇచ్చి పంపేసాను. 

మర్నాడు అయిదు గంటలప్పుడు మా ఇంటి బెల్లు మోగింది. పాలవాడేమో 
నని తలుపు తీసాను. మూర్తిభవించిన శోక దేవతలా ఉంది సుగుణ. 

“అక్కయ్యా..... నన్ను.... నన్ను క్షమించవే....” అన్నది. 

“నువ్వేం తప్పు చేసావే...” అన్నా తెచ్చి, కూర్చోబెట్టుకుని. వేదాంతిలా 
నవ్వింది. 

“యెవరు రాసారోగాని మోసకారి కామదాసుల మాటలు నీటి మూటే 
అని అక్షరాలా నిజం అక్కయ్యా” అన్నది ఏడుస్తూ. 

“జీవితం ఓ హరివిల్లు సుగ్గీ! ఎన్నో రంగులు, ఎన్నో చిత్రాలు. ధైర్యంగా 
ఉండాలి” అన్నాను ఓదార్పుగా. 

జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికయినా బుద్ధిగా ఉంటే బావుండును. 
కాని ఉంటాడా! సినిమా కాదు మార్పు అంత తొందరగా రావటానికి. “సుగ్గీ! 


244 హంవిల్లు. 


ఒక్క విషయం! పదే, పదే ఆ తప్పు గుర్తుచేసి, తప్పు చేయటానికి రాజబాట 
వెయ్యకు. ఏం జరుగనట్టే ప్రవర్తించు” అన్నాను. 

“ప్రయత్నిస్తాను.” 

“ప్రయత్నం కాదు. నిజంగా నువ్వలా చేయాలి. అదెంత బాధో నాకు 
తెలుసు. అయినా తప్పదు అన్నాను. సుగుణ కళ్లు తుడుచుకుని వెళ్తానని 
లేచింది. జాలిగా చూచి సాగనంపాను. 


O 





మాదిరెడ్డి సులోచన కథలు 245 


దేవుడు తెల్లబోయాడు 


అనగా, అనగా ఓ పట్టణంగాని పట్టణంలాంటి ఊరుంది. ఆ వూరికి 
పేరుంది. పేరు వుద్ధరించే రాజుగాని రాజు గోవిందరాజు ఏలుతుండేవాడు. 
మంత్రిగాని మంత్రి శఠగోపం గారుండి సలహాలిచ్చేవాడు. గోవిందరాజు 
అయిదేళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే ఆలయపు పూజారి శఠగోపంగారు ఆయనను 
యథావిధిగా సేవించాడు. ఆ ఊరికి వున్న వేణుగోపాల స్వామి ఆలయం 
పాడుబడి భిక్షగాళ్ళకు, దిక్కులేని వారికి ఆశ్రయం ఇస్తూంది. 

శరగోపంగారు గుమస్తా, సెక్రటరీ, ప్యూన్‌, డ్రయివర్‌, వంటవాడు ఇలా 
ఇలా యెన్నో వేషాలతో రాజుగారిని కొలిచాడు. అయితే జనం తెలివి మీరారో, 
తెలివి లేదోకాని యీసారి ఎన్నికలలో గోవిందరాజు డిపాజిట్‌ పోగొట్టి, గోళ్ళు 
గిల్లుకునేలా చేశారు. ఆటోమాటిక్‌గా మంత్రి పదవి పోయింది. 

ఈసారి శఠగోపంగారి సలహాయే తిప్పి కొట్టిందని అతని నమ్మకం. 
“మీరు మొదట ఈ పార్టీ తరపున పోటీ చెయ్యండి రాజుగారూ. గెలిచిందా 
గెలుపు మీదే. కాక అవతల పార్టీ గెలిచిందనుకోండి. పార్టీ మార్చెయ్యడం 
ఎంతసేపు!” అన్నాడు. 

“ఈ ఊళ్ళో నాకు ఓట్లు పడతాయన్న నమ్మకము నాకు లేదు” నిరాశ 
పడిపోయాడు రాజు. 

“ఎవడి కోసం పడతాయి. అంతా హరిజనులేగా. మీరూరుకొండి. 
జగజీవన్‌రామ్‌ బొమ్మ అడ్డుపెట్టి గెలిపించేస్తాను” అన్నాడు చిటికెవేసి, 
గోవిందరాజు అంగీకరించాడు. 





246 మాదిరెడ్డి సులోచన కథలు 


అపర వేణుగోపాలస్వామిలా వున్న శఠగోపం మూడు నామాలపై 
నమ్మకము కుదిరింది. 

కానీ అవతలి పార్టీ గెలిచింది. శఠగోపం నెత్తిన గుడ్డేసుకుని వచ్చాడు. 

“ఈ జనానికి బొత్తిగా భయభక్తులు కులం మతం అన్న అభిమానం 
లేదు” అన్నాడు ఆగ్రహంగా. 

“సరేలేవయ్యా! ఊరికి మనం ఏం చేసామని ఏడ్చు!” అన్నాడు రాజు. 

“ఊరికేం చేయకపోయినా, మనకు మనమయినా చేసుకునే అవకాశం 
లేదుకదా స్వామీ. చేతిలో చిల్లు పెంకు లేదు” ఏడ్వలేక ఓ చవట నవ్వు నవ్వాడు 
శఠగోపం. 

“చూడు పంతులూ! కార్యవాదులు ఓటమిని గెలుపుగానే భావిస్తారు. 
ఇన్నాళ్ళు నువ్వ సలహా చెప్పావు, నేను విన్నాను. ఇప్పుడు నేను సలహా చెబుతాను. 
నువ్వు విను. దబ్బు! నీకు చేతినిండా పని...” 

“ఆం! అదెలా సామె. చెప్పండి, నా ప్రాణం లేచి వచ్చింది.” 

“మరి వచ్చే ఫలితం చెరిసగం పంచుకుందామా?” 

“మీతో నాకు వాటా ఏమిటి సామె. ఏదో చెయ్యి విదిలిస్తే బ్రతికేవారము. 
అసలు పని లేక చస్తున్నామంటే నమ్మండి” విడిపోయిన జుట్టు తీసి 
ముడివేసుకున్నాడు. 

“పనా? పోట్లాటలా?” గలగల నవ్వాడు గోవిందరాజు. 

“ఏదో ఒకటి! పోలిటిక్స్‌ అర్థం అయిన వాడిలా గోళ్లు గిల్లుకుంటూ 
కూర్చోవడం ఎంత నరకమో మీకు తెలియదు సామి” అన్నాడు. 

గోవిందరాజు శఠగోపం చెవిలో తారకమంత్రంలా ఏవో నాల్గు మాటలు 
చెప్పాడు. 

“నిజంగా... నిజమేనా సామె.” శఠగోపం ముఖం వెలిగిపోయింది. 

“పని పకడ్బందీగా జరగాలి. నీకు చాటింపు చాలా ప్రీతి. కాస్త జాగ్రత్తగా 
వ్యవహరించాలి” అన్నాడు. 

“అబ్బే...” ముక్కుకు అడ్డంగా వేలు పెట్టుకుని, నోరు మూసుకున్నాడు. 
ఇద్దరూ మరి కాసేపు మాట్లాడి విడిపోయారు. 


వారం రోజులు గడిచాయి. 


దేవుడు తెల్లబోయాడు 247] 





శఠగోపం దిగులుగా రచ్చబండ దగ్గర తలపై గుద్దేసుకుని కూర్చున్నాడు. 
అక్కడ చేరిన చిన్నా పెద్దా విషయం యేమిటని అడిగారు. 

“ఏమి ఎలక్షన్లో ఏమో, యెందరి ప్రాణం తీస్తారో మా రాజుగారు పూర్తిగా 
మారిపోయారు. పిలిస్తే పలకడు, ఉలకడు, అంతా ఆ దేవుడి దయ అంటున్నాడు” 
అన్నాడు కన్నీళ్ళు ఒత్తుకుంటూ. 

se ఊర్మోవయ్యా; మతి చాంచల్యం నీ పగవారికి రానియ్యి. మా 
బావ భక్తి మార్గంలో పడ్డాడు” అన్నాడు రాజుగారి వేలు విడిచిన మేనత్త కొడుకు. 

“ఎంత భక్తి అయినా దేశంపై యింత విరక్తా?” అన్నాడు. 

“అంతేకాదుట, అక్కయ్యగారు చెప్పారు. రాత్రి అంతా తనలో తానే 
భజన చేస్తారట” అన్నాడు. 

“అయితే వారిని చూడవల్సిందే” అన్నారు పెద్దలు. 

“నాకు చూడాలని లేదు. మహారాజులా తిరిగే మనిషి అలా అయ్యాడంటే 
దిగులుగా వుంది” శఠగోపం ఎగబీల్పాడు. 

వాళ్ళంతా వెళ్ళేసరికి గోవిందరాజు పడక కుర్చీలో కూర్చుని పైకి 
చూస్తూన్నాడు. “కృష్ణం భజ రాధా!” అంటూ తనలో తాను గొణుక్కుంటున్నాడు. 

“గోవిందరాజుగారూ! నమస్మారమండీ” అన్నాడో పెద్ద. 

“కృష్ణార్చణం! రండి వచ్చిలా కూర్చోండి” అన్నాడు అర్థనిమీలిత నేత్రాలతో 
అందరినీ ఒకసారి చూచి. 

“మీరు ఊళ్ళోకి రావటమే మానేసారు” కూర్చుని అడిగారెవరో. 

“ఊరా, వల్లకాడా? అంతా మిథ్య! అంతా మాయ” అన్నాడు. 

“అదికాదండీ...” మరొకతను మాట్లాడబోయాడు. 

“కృష్ణార్పితం అయిన ఈ ఇంటి ఆవరణలో దేశం, రాజకీయం 
మాట్లాడవద్దని (ప్రార్థన. రారా పుణ్యాత్ములారా! రారా ఓ భక్తులారా!” అంటూ 
పాట మొదలు పెట్టేరు. ఇలా మాట్లాడుతుండగానే, ఆయన తన్మయత్వంలో 
పాట మొదలుపెట్టేడు. ఆయనకు పాట, ఆట రాదు. అందుకే అందరూ 
గోవిందరాజు గారిపట్ల గౌరవం యేర్పరచుకున్నారు. ఏ క్షణంలో ఏం జరుగు 
తుందోనని, ఒక వేదాంత ధోరణిలో మాట్లాడి వెళ్ళిపోయారు. రోజూ ఇలా 
హితులు, స్నేహితులు, తెలిసినవారు రావటం పోవటం జరిగింది. 


248 దేవుడు తెల్లబోయాడు 





నెలరోజులు గడిచాయి. 

ఒకరోజు శరగోపం హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. “ఈ విడ్డూరం 
విన్నారా? మన గోవిందరాజుగారికి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కలలోకి వచ్చేడట” 
అన్నాడు. 

“ఆం నిజమేనా, ఇందాక మా అబ్బాయి చెబితే వుత్తదే అని కొట్టివేసాను” 
అన్నాడు లింగయ్యశెట్టి. 

“ఇదేం చిత్రమండి! ఓసారి వెళ్లి చూద్దామా!” అన్నాడు మరో షావుకారు. 

శరగోపంతో కలసి అందరూ గోవిందరాజు ఇంటికి వెళ్లారు. ఆయన 
సన్నగా పాడుతూ కూర్చున్నారు. 

“ఏమిటి రాజుగారూ! ఏదో స్వవ్నం అని అందరూ అంటున్నారు” ఏం 
యెరగనట్టు అన్నాడు శఠగోపం. 

“ఏదో ఆ కృపాసింధు, ఆ దీనబంధు....” అంటూ మొదలు పెట్టేడు 
రాజు. 

“గోవిందరాజుగారూ! మీరు ఆ వేణుగోపాలుని దర్శించారు. ఆ వైనం 
విని తరిస్తాం. వివరించండి” అన్నాడు కరణంగారి బావ. 

“అది మీకు తమాషాగా వుండొచ్చు. అర్ధరాత్రి అయింది. అప్పుడే మాగన్ను 
పడింది. కృష్ణా కృష్ణా అంటూ నా అధరాలు అదిరి పడుతున్నాయి. వెలుగు..... 
వర్ణించలేని వెలుగు వచ్చింది. “పిలిచావా భక్తా అన్నారెవరో. యెటు చూచినా 
ఆ స్వామే కనిపించాడు. ఆ వేణు నాదమే వినిపించింది. కళ్లు విప్పలేక 
పోయాను...” 

“ధన్యుడవయ్యా రాజూ....” అంటూ శఠగోపం సాష్టాంగ పడ్డాడు. 

“చెప్పనియ్యవయ్యా!” లింగయ్య విసుక్కున్నాడు. 

“కళ్ళు విప్పుదాం అంటే జిగురుపెట్టి అంటించినంతగా అంటుకున్నాయి. 
యేం చేయాలి, నిజమా, కలా అనుకుంటున్నాను. రాజూ! ఊళ్ళో వుండా 
లనుకున్నాను. ఆలయం అడవిలా చేసావ్‌. పునరుద్ధరించు. ఊరికి జయం 
కలుగుతుంది” అన్నాడు.” 

“నిజంగానా?” కరణం నోరు తెరిచాడు. 

“అంతేకాదు. విగ్రహాలు విరిగిపోయాయట. తన అంశగల విగ్రహాలు 
నా పొలంలో వున్నాయట. త్రవ్వించు అన్నారు” అని చెప్పాడు గోవిందరాజు. 





మాదిరెడ్డి సులోచన కథలు 249 


“నీ పొలంలో యెక్కడో చెప్పాడా?” 


“పొన్నచెట్టు నీడలో తలదాచుకున్నానని అన్నాడు.” రాజుగారు కళ్ళు 
మూసుకొని విన్నవించాడు. 

“త్రవ్వి చూస్తే పోలేదా?” 

“వద్దు శెట్టిగారూ! వద్దు. విగ్రహాలు దొరికాయనుకోండి. విగ్రహ 
ప్రతిష్టాపన, గుడి పునఃనిర్మించడం నా వల్ల అయ్యే పని కాదు. ఆ స్వామిని 
మనో నేత్రంతో దర్శించి ధన్యుడనవుతాను” అని, మీరు వెళ్ళవచ్చు అన్నట్టు 
కళ్లు మూసుకొని “కృష్ణ కృష్ణు” అంటూ పాటలు మొదలుపెట్టేడు. 

వాళ్ళంతా రచ్చబండ దగ్గరకొచ్చారు. 

“ఆయన కృష్ణ కృపకు పాత్రుడయ్యాడు. అతన్ని వదలివేద్దాం. మన సంగతి 
ఏమిటి? ఊరికంత అరిష్టం కదా” అన్నాడు శఠగోపం. 

“కలలు నిజం అవుతాయా! ఆయన ఆ ధ్యాసలో వున్నాడు కాబట్టి అలా 
అనిపించి వుంటుంది” అన్నారెవరో. 


“ఛ... ఛ.... ఆయన వున్నాయి అనలేదు. పోనీ డబ్బు ఖర్చులేని పని. 
మనమంతా తలా ఒక చెయ్యివేసి త్రవ్వి చూద్దామా?” అన్నాడు శఠగోపం. 

“నీ సలహా బాగుందయ్యా! విగ్రహాలు లేకపోతే అతని ఊహ అవుతుంది. 
నిజంగా వుంటే, నేను అయిదు వెలిస్తాను” లింగయ్యకశెట్టి అన్నాడు. 

“అదేం మాట! మేమేనా తీసిపోయింది. విగహాలు బయటపడితే నేను 
అయిదువేలు ఇస్తాను” రెడ్డిగారు అన్నారు. 

“మేమూ ఇస్తాము ఇంతో... అంతో....” కరణంగారు అన్నారు. 
అరగంటలో పేపర్‌ మీద లక్ష రూపాయలు పోగయ్యాయి. అందరూ 
కుతూహలంగా వెళ్ళీ రాజుగారి పొలంలో పొన్నచెట్టు కోసం వెతికారు. పొన్న 
చెట్టు కింద దట్టమయిన పొదలూ పుట్టలూ కనిపించాయి. అతి కష్టంపై అవి 
పెకిలించారు. పొన్న చెట్టు చుట్టూ మూడు రోజులు త్రవ్వారు. రెండు మీటర్ల 
లోతులో వాళ్ళకు పాతబడిన యిత్తడి విగ్రహాలు దొరికాయి. వాటిని తాకటానికి 
అందరి చేతులు వణికాయి. 

“ఆగండి... ఆగండి” శఠగోపం దూరం జరిగి శ్లోకాలు చదువుతూ 
పడిపోయాడు. 





250 దేవుడు తెల్లబోయాడు 


నిమిషాల మీద ఈ వార్త ఊరంతా ప్రాకిపోయింది. జనం తండోప 
తండాలుగా వస్తున్నారు. అదో యాత్రాస్థలంగా మారిపోయింది. 

లక్షాయాభయివేల రూపాయలు తాలూకా 'హెద్‌క్వార్టర్‌ నుండి వసూలయి 
వచ్చాయి. మేళ, తాళాలతో విగ్రహాలను ఊరేగించి తీసుకెళ్ళారు. నిమిషాలపై 
గుడి పునరుద్ధరించారు. 

డబ్బు వస్తూనే వుంది. మన జనం ఇద్దరికే జడిసి డబ్బిస్తారు. ఒకరు 
పోలీసులు, రెండు దేవుడు. 

దానికి పరమ భక్తుడయిన గోవిందరాజు ట్రస్టీ అయ్యాడు. 

“నాకీ బాదరబందీ యెందుకు? ఆ స్వామి చరణాలు కడిగిన తీర్థంతో 
తులసీదళం వేసి యివ్వండి” అన్నాడు. 

“అలా అనకండి గోవిందరాజూ! నీ మూలంగా కదూ, జనం కళ్ళు 
తెరిచారు” అన్నారంతా. 

మిగిలిన డబ్బు దేవుడిపేర బ్యాంక్‌లో వేయాలని ఆ వడ్డీతో పూజారికి 
జీతం ఇవ్వాలని దేవుడి పేరిట సంబరాలు జరిపించాలని నిర్ణయం జరిగింది. 

“మరొకడు యెందుకు? శఠగోపంగారే పూజారిగా వుంటారు. మొదటి 
నుండి అన్నీ తెలిసినవాడు” అన్నారు జనం. 

“ఆ మహానుభావుడి సేవకు యెప్పుడూ సిద్ధమే” భక్తిగా నమస్కరించాడు 
శఠగోపం. 

నిత్య కళ్యాణం పచ్చతోరణంలా అయ్యింది శఠగోపం పని. 

గోవిందరాజు పని ఇరుకులో పడింది. ఆ డబ్బు తనకు దక్కాలి. ఎలా 
అన్నదే తోచటం లేదు. 

ఆశకు అంతులేదు అంటారు. అలాగే శఠగోపం పని తయారయింది. 
అతను ఈ వచ్చే జీతంతో జీవితం యెలా వెళ్ళమారుస్తాడు! గోవిందరావుగారి 
సెకైటరీగా వున్న కాలంలో యింతో, అంతో మందు కొట్టటం, మజా చేయటం 
నేర్చుకున్నాడు. అతను గుడికి తాళం పెడుతుండగా గోవిందరాజు వచ్చాడు. 

“రండి సామె రండి. తమ దర్శనానికే రావాలానుకుంటున్నాను” శఠగోపం 
అన్నాడు. గోవిందరాజు గుడి తలుపులు తీయించి, నమస్కరించి, గుడి ముందు 
కూలబడిపోయాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 29 1 


“మీరు చెప్పిన నాటకం యెలా ఆడానంటారు? ఎక్కడయినా పొల్లు 
బోయిందా?” అన్నాడు శఠగోపం. 

“ఏం నాటకం లేవయ్యా ! ప్రభుత్వ జీతగాళ్ళ కిచ్చినట్టు పింఛను నీకు 
దొరుకుతుంది. గడ్డి కుప్పకాడి కుక్కలా నేనో ట్రస్టీనట. |ట్రస్టీని” అన్నాడు కోపంగా. 

“ఆయం ఆ వడ్డీ డబ్బులు రెండు పూటలు చావకుండా తినటానికి 
సరిపోతాయేమో తప్ప, యెందుకు పనికిరావు” శఠగోపం అన్నాడు. 

“నీ ఆశ కూలా! నాకేం మిగిలిందని....” 

“మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి సామె. స్వామివారి ప్రతిష్టాపనకు 
జరిగిన ఖర్చులో యాభై శాతం మిగిలింది” అన్నాడు. 

“అదో లెక్కా! ఈ డబ్బు మనకొచ్చే మాస్టర్‌ప్లాన్‌ వేస్తాను. నీ వాటాకు ఓ 
అయిదు వేలిస్తానయ్యా. తీసుకుని యెక్కడికయినా వెళ్లు.” 

“అయిదు వేలా... అయిదు! ముష్టి వేస్తున్నారా సామె” అన్నాడు. 

“ముష్టికాక ముడుపా ! శఠగోపం ఆశకంతుండాలయ్యా!” 

“నాకే ఆశంటారా సామె. మీ గురించి, మీ సన్యసించడం గురించి, మీ 
భక్తిభావం గురించి వాగిన దానికి టీ ఖర్చులు కావు అయిదువేలు. మీరేం 
కష్టపడ్డారండి.” 

“ఒరేయ్‌! తిన్నగా అడుగుతావా? నటించటం యెంత కష్టమో నీకేం 
తెలుసు?” 

“మీరు నటించారు, నేను పడ్డ శ్రమ గుర్తుకు రావా? అక్కడే క్రవ్వితే 
జనం చూస్తారని, అయిదారు మీటర్ల పొడవునా సొరంగం త్రవ్వి విగ్రహాలు 
పెట్టాను. కూలిని పిలిచినా గుట్టు బయటపడుతుందని భయపడ్డాను, చేతులకు 
పొక్కులు వచ్చాయి” అన్నాడు. 

“ఇదిగో శఠగోపం కంఠశోష యెందుకు? అయిదువేలు కావాలా వద్దా?” 

“నా కెందుకు ముష్టి! సగం వాటా కావాలి.” 

“వాటా యివ్వకపోతే...” గోవిందరాజుకు కోపం ముంచుకువస్తుంది. 

“ఏముంది సామె. జరిగిన విషయాలు ఊర్లో అంటాను. నాకేం భయమా!” 
అన్నాడు నిర్లక్ష్యంగా. “మీకు తెలుసు నాకు చాటింపు ఇష్టమని....” 





292. దేవుడు తెల్లబోయాడు 


“ఓహో! అంతవరకు వచ్చిందా వ్యవహారం! అలాగే చెప్పుకో ఫో. 
డప్పుచ్చుకు మరీ చాలించు. నాకేం భయం” అన్నాడు. 


శఠగోపం గుడితాళాలు అయ్యగారి ముందు విసిరికొట్టి, విసురుగా 
ముందుకు వెళ్ళాడు. గోవిందరాజుకు యిలాంటి సందర్భాలలో యెక్కడలేని 
ధైర్యం వస్తుంది. లేచి, శఠగోపం భుజాన వేసుకున్న పైపంచ ఒడుపుగా అతని 
మెడకు బిగించి వెనక్కు లాగాడు. 

“ఏమిటిది.... ఏ.... మి.... టి... సా....మె” అన్నాడు అతను. 

ఆ రాత్రి గడిచింది. 


తెల్లవారింది. ఊర్లో గల్లంతుగా వుంది. దేవాలయ ధర్మకర్త 
గోవిందరాజింట్లో చోరీ, తలపై బలంగా బాదడం మూలాన ధర్మకర్త స్పృహ 
తప్పాడట. 

ఆ దొంగతనం చేసిందెవరో కాదుట. పూజారి శరగోపమేనట. ఆలయం 
ముందు చచ్చిపడివున్నాడు శఠగోపం. అక్కడక్కడ రూపాయలు, మేడిపువ్వులు, 
కళ్ళూ, పాదాలు పడివున్నాయట. 

ధర్మకర్తను పూజారి దోచే ప్రయత్నం చేస్తే పూజారిని దొంగల రూపంలో 
వచ్చిన దేవుడే దోచాడని వింతగా చెప్పుకుంటున్నారు. జనం తండోపతండాలుగా 
వస్తున్నారు. 

పోలీసులకు రిపోర్టు ఇద్దామన్నారు అంతా. అప్పుడే తలకు కట్టుకట్టుకుని 
వచ్చాడు గోవిందరాజు. 


“అంతా మిథ్య! అంతా ఆ స్వామిదే అని మరిచి స్వార్థచింతనతో ప్రాణాలు 
తీసుకున్నాడు” శఠగోపం. పూజారిని నియమిస్తే నా పొలం మీద వచ్చే 
ఆదాయంతో జీతం యిస్తాను. పోలీసులకిస్తే చచ్చినపామును చంపినట్టు. వాడి 
శరీరం కోస్తారు, చీలుస్తారు. డబ్బు ముఖ్యంకాదు మనకు. అతను చేసిన ఆ 
స్వామి సుద ముఖ్యం. మీరు అందరూ అతన్ని క్షమించాలని ప్రార్థిస్తున్నాను...” 
అన్నాడు. అందరూ ముఖాలు చూసుకుంటుండగానే గోవిందరాజు ఓ భక్తిగీతం 
ఎత్తుకున్నాడు. అందరూ గొంతులు కలిపి పాడారు. 

అపశ్చతిలా అప్పుడప్పుడు శఠగోపం భార్య ఏడ్చు వినిపిస్తూంది. 

అరగంట గడిచింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 253 


“ఈ కాయాన్ని కృష్ణార్చణం చేయాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు 
నేనిస్తాను. నా ఇల్లు దోపిడీ అయింది. ఈ ఉంగరం అమ్మి డబ్బు తీసుకురండి” 
అని చేతి వుంగరం తీసి యిచ్చాడు. 


“ఎందుకండీ! తలా పది రూపాయలు వేస్తాం చాలు” అన్నారు జనం. 
అలా, అలా, నిమిషాల మీద వసూలయింది డబ్బు. 

శఠగోపం శవం లేచింది. గుడిలో దేవుడు తెల్లబోయినట్టు చూచాడు. 
గోవిందరాజు కళ్ళు ఒత్తుకున్నాడు. 


O 





254 దేవుడు తెల్లబోయాడు 


దబ్బు! డబ్బు! డబ్బు! 


“ఈ లోకంలో డబ్బుంటే దేనినయినా జయించవచ్చు. రాజీ! నేనేం 
పర్మినెంటణగా వెళ్ళడం లేదు కదా. రెండు సంవత్సరాల టైనింగ్‌ కోసం 
వెడుతున్నాను” అని భర్త అన్న మాటలు గుర్తుకు వచ్చాయికి రాజేశ్వరికి. చిన్నగా 
నవ్వుకుంది. చిన్న వయస్సులోనే భర్తకు డబ్బుపై ఎంత మోజు” అనుకుంది. 


రెండు సంవత్సరాల క్రితం రాజేశ్వరికి, బలరామ్‌కి పెండ్లి జరిగింది. 
టెక్నికల్‌ కోర్స్‌ పూర్తి చేసి, మాడ్యుల్‌ మెషిన్‌ టూల్స్‌లో ఉద్యోగం చేశాడు. 
అతను ఇంటలిజెంట్‌, ఇండస్ట్రియలిస్ట్‌ కూడాను. 

అందుకే వాళ్ళ కంపెనీ నుంచి అతన్ని ట్రెయినింగ్‌కు జర్మనీ పంపుతుంటే 
రాజేశ్వరికి దుఃఖం ఆగలేదు. నూతన వధూవరులు! నెల రోజులకే ఎడబాటా! 

బలరామ్‌ ఆమెను దగ్గరకు తీసుకుని అనునయంగా తన మాటలలో 
బంగారు భవిష్యత్తు చూపాడు. 

“రాజీ! ఈ రెండేళ్ళ జీతం వస్తుంది నీకు. అక్కడ నుండి నెలకు రెండు 
వేల రూపాయలు పంపగలుగుతాను. అందరిలా మనం (ప్రణాళిక లేకుండా 
ఇరుకు గదులలో బెరుకుగా బ్రతకాల్సిన పని ఉండదు. ఈ డబ్బు మిగిలితే 
ప్లాటు కొంటే, నేను రాగానే ఎల్‌.ఐ.సి. లోన్‌ తీసుకుంటాను. చిన్న ఇల్లు 
కట్టుకుందాం” అన్నాడు. అవి ఊహాలోకంలో విహరించే ఉత్తుత్తి మాటలు కావు. 
అతను పట్టుదల మనిషి. 

“వూ నేనూ వస్తాను” అన్నది అతని భుజంపై తలవాల్చి. 





మాదిరెడ్డి సులోచన కథలు 255 


“ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకు వెళ్ళేవాడిని రాజీ! వారానికి 
రెండుత్తరాలు రాస్తాను. మీ నాన్నగారు వచ్చి మంచి ప్లాటు చూస్తారు. నువ్విక్కడ 
ఉండి చేయవలసిన పనులు ఏమిటో తెలుసా?” 


“ఉహు!” తెలియదన్నట్లు తల అడ్డంగా వూపింది. 
“వారానికి రెండు ఉత్తరాలు నాకు రాయాలి. నెలకొక్కసారి మా అమ్మ 


నాన్నలను చూచి, వాళ్ళకు వంద రూపాయలు ఇవ్వాలి. పదిహేను నెలలు 
కాగానే నాన్నచేత ప్లాటు కొనిపించాలి” అన్నాడు. 


“వూ!” అంది. వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. 

“నేనేం చేయాలో చెప్పవేం?” అన్నాడు నవ్వుతూ. 

“నేను చెప్పింది చేసినట్టు” అంది అలకసాగిస్తూ, 

“చెప్పి చూడు” అన్నాడు ఆమె ముఖం రెండు చేతులలోకి తీసుకుని. 
నంబర్‌ వన్‌ అందమైన అమ్మాయిల వంక చూడ...” 


“కూడదు, అవునా. రాజీ డియర్‌. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం, అభిమానం 
ఉండాలి. ఆంక్షలు ఆపుతాయా” అన్నాడు నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూసి. 


“నేనేం చెప్పను పొండి...” లేచి పోబోయింది. 


“ఓ....” అతను చెయ్యి పట్టి ఆపబోయాడు తూలి అతని వడిలో పడింది 
రాజేశ్వరి. 


“రాజీ! నువ్వు నాకు తటస్థపడి ఎన్ని రోజులయింది? నెల రోజులు, 
అవునా? మరి అమ్మా నాన్నలకు అప్పగించలేని బాధ్యత నీకు అప్పగించాను” 
అన్నాడు మృదువుగా ఆమె బుగ్గలు నొక్కుతూ. 

“మీరు వెంటనే జాబు రాయాలి.” 

“అది నువ్వు చెప్పనక్కర లేదు.” 

“మరి ! త్రాగుడు...” అతను వమనుకుంటాడో అని మధ్యలోనే అంది. 
అతను పకపకా నవ్వేశాడు. 

“కొద్దిగా తాగే పర్మిషన్‌ ఇవ్వు డియర్‌.” 


“ఓ... క” అన్నది ఎంతో ఉదారంగా. ఆ రాత్రి ఇలాంటి కబుర్లతో 
నిద్రపోలేదు. తెల్లవారి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వచ్చిన ఒక్కొక్క ఉత్తరం 


256 డబ్బు! డబ్బు! డబ్బు! 





పదిసార్లు చదువుకొనేది. అందరూ మేఘ సందేశం అని ఏడ్పించి, ఆటలు 
పట్టించేవారు. 

ఇంకొక్క నెలలో వస్తున్నాడు తన భర్త. తను అతని రూపు వూహించి, 
వూహించి అలసిపోతోంది. 

తన ఆలోచనలు ఆపి ఆఖరి వాక్యాలు చదివింది. రాజీ డియర్‌! నన్ను 
సర్‌(పైజ్‌ చేద్దామనా ప్లాటు విషయం రాయలేదు. నాన్నకు రాద్దాం అనుకున్నాను. 
గానీ ఆయన ప్లాటు కొనటం నీ ఆలోచన అని అభినందించాలి. ఏమంటావ్‌. 
జూలై ఇరవైయ్యో తారీఖున నీ వళ్ళో ఉంటాను...” ఆ తరువాత చదివి మొదటిలా 
పరవశించలేకపోయింది. 


“జూలై ఇరవై... జూలై ఇరవై....” అనుకుంది మనసులో వెంటనే. ఆటో 
రిక్షా చేరుకుని అన్నగారింటికి వెళ్ళింది. 

“ఈ వేళప్పుడు వచ్చా వేమిటమ్మా?” శివశంకరం అడిగాడు. 

“అన్నయ్యా. ఆయన... ఆయనీ రోజు తను వచ్చే తారీఖు రాశారు.” 

“ఒహో! అలాగా” అన్నాడు ఆయన. 

“అవునన్నయా! ఇదిగో ప్లాటు విషయం రిమైండ్‌ చేశారు” అన్నది 
ఉత్తరం మడిచి పెట్టుకుని. 

“ఏమిటమ్మా నీ గోల! మా పెళ్ళీ అయ్యి పది సంవత్సరాలయ్యింది. 
మాకే లేదు, మీ కెందుకు? బలరామ్‌ రానీ నేను మాట్లాడతాను” అన్నాడు 
శివశంకరం. 

రాజేశ్వరి తెల్లమొహం వేసింది. భర్త వెళ్లగానే పుట్టింటికి వచ్చింది. 
అన్నగారి తియ్యటి మాటలతో అత్తగారింట్లోనే ఉండేలా చేశారు. 

“చూడు రాజీ! నువ్వు సానుభూతి ఎంతయినా కురిపించు. ఆ డబ్బు 
మాత్రం ఇవ్వకు” గీతోపదేశం చేశాడు. 

“మరి ఆయనకు తెలిస్తే...” 

“అక్కదే తెలివిగా ఉండమంటున్నాను. అమ్మాయి ! చూడు, భర్త 
లేకపోయినా అత్త మామల దగ్గరున్నది అన్న పేరు నీకు వస్తుంది. అలాగే ఫస్ట్‌ 
తారీఖున ఒక వంద రూపాయలిచ్చి “మామయ్యా ! మీ ఖర్చు కింద ఉంచండి 
అను అని సలహా ఇచ్చాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు DY] 


ఈ రెండు సంవత్సరాలు అత్తమామల దగ్గరే ఉంది. అప్పుడప్పుడు అన్నల 
దగ్గరకు వచ్చేది. ఒకనాడు వంద రూపాయలు మామగారికి యివ్వబోయింది. 

“వద్దమ్మా! ఈ వయసులో వాడికి దూరంగా ఒంటరిగా ఎలా ఉండాలని 
బాధ పడ్డాం. బంగారు తల్లిలా మాతోపాటే ఉన్నావు. అది చాలమ్మా” 
అన్నారాయన. ఆనందం వెల్లివిరిసింది. 

“నీ దగ్గర ఉంటే నీ పాస్‌బుక్‌ చూస్తే కన్నుకుట్టి కూతుళ్ళకు పెడతా 
నంటాదేమో ఆ ముసలాడు. నేను దాచి పెడతాను” అన్నాడు శివశంకరం. 

రాజేశ్వరి భర్త తనను నమ్మినంతగా, ఆయన వైపు వారిని నమ్మలేదు. 
అందుకే డబ్బు డ్రా చేసి అన్న కిచ్చింది. 

“నువ్వు ప్లాటు కొనేటప్పుడు ఇంకేమయినా ఎక్కువ పట్టినా ఇస్తాను” 
అన్నాడు. అన్న ఉదారతకు మైమరచి పోయింది. 

ఈ వార్త ఎలా తెలిసిందో రెండో అన్న రాజారావు వచ్చాడు. 

“రాజీ! నేను నేరకపోయి చవుకగా వస్తుందంటే పొలం కొన్నానే. వడ్డీలు 
కట్టలేక చస్తున్నాను. నువ్వు ప్లాటు చూచుకునే వరకు డబ్బిస్తానే. ఒక రెండు 
మూడు వేలు సర్వ” అన్నాడు. 

“నా దగ్గర ఎక్కడిదన్నయ్యా ! నెల, నెలా బావ పంపుతారు తప్ప.” 

“ఆ నెల నెలవే ఇవ్వు” అన్నాడు. 

ఇవ్వక తప్పలేదు. తల్లి అనుభవశాలి. మొత్తుకుంటూనే ఉంది. “డబ్బు 
ప్రాణం తీస్తుందే, బంధువుల్ని దూరం చేస్తుందీ డబ్బే...” అని అయినా అన్నలు 
అవసరాల నిమిత్తం ఒక నెల ఒకరు, మరొక నెల ఇంకొకరు తీసుకున్నారు. 

ప్లాటు చూడమని చెబుతూంది. చేతిలో డబ్బు లేదు. అందుకే ఈ రోజు 
అన్నను నిలదీయాలనే వచ్చింది. బలరామ్‌ కోసం తనేమయినా చేస్తుంది. తను 
తన తండ్రుల దగ్గర ఉంటున్నందుకు “దేవత అన్నాడు. ఇంకా ఎన్నెన్నో రాశాడు. 

“అన్నయ్యా ! వారితో చెప్పే ప్రసక్తి దేనికి? ఎవరిష్టం వారిది” అన్నది 
కాస్త కఠినంగా. 

“నా ఒక్కడినే అడుగుతావేం? రాజారావిచ్చాడా?” 

“ఆయన దగ్గరకు వెళ్లాను” అన్నది అసహాయంగా. 

“వెళ్ళు.... వెళ్ళు నా తల తాకట్టు పెట్టయినా ఇస్తాను. పెంచామన్న 
అభిమానం, మమకారం ఉందనుకున్నాను” అన్నాడు నిష్టూరంగా. 


258 డబ్బు! డబ్బు! డబ్బు! 





“నువ్వేం పెంచావ్‌? నాన్నగారి డబ్బు మీద వడ్డీలు వచ్చాయి” 
అందామనుకుని కోరి గొడవ పడటం ఇష్టం లేక వూరుకుంది. చిన్నన్న దగ్గరకు 
వెళ్ళింది. 

“అన్నయ్యా! ఆయ నొచ్చే తారీఖు నిర్ణయమయింది” అన్నది దిగులుగా. 

“రాజీ! నువ్వేమో ఫూల్‌వి. ఏం ఆయనొచ్చాక ప్లాటు కొనకూడదా?” 
అన్నాడు దర్పంగా. 

“కొనకూడదని కాదన్నయ్యా, ఆయన చెప్పిన ఆ చిన్న పని చేయలేక 
పోయాననే దిగులు” అన్నది బలవంతంగా కన్నీరు ఆపుకుని. 

“నా దగ్గర ఎక్కడే అంత డబ్బు? నెలకు అయిదో పదో ఇవ్వమంటే 
ఇస్తాను. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ పట్టుకెళ్ళు - ఆడబిడ్డ సొమ్ము నాకెందుకు?” 
ఒక యాభై రూపాయలు తెచ్చి ఆమె ఒడిలో వేశాడు. అప్రతిభురాలయినట్టు 
చూచింది రాజేశ్వరి. మెల్లగా డైరీ తీసింది. పద్దెనిమిది వేలు ఇవ్వాలి. యాభై 
రూపాయలు నెలకు ఇస్తే ఎప్పుడు తీరేను. 

కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. 

“అన్నయ్యా! ఇది నీకు ధర్మం కాదు. ఆయన మిమ్మల్ని పీడించి కట్నం 
తీసుకున్నారా?” అన్నది ఏడుస్తూ. 

అతని భార్య కమల వచ్చింది. కంపరంగా చూచింది. 

“డబ్బు... డబ్బు... దబ్బు...! వెంట తీసుకుని పోతారా! వసూళ్ళ కొచ్చి 
మా పరువు తీస్తున్నావా? ఇచ్చినట్టు ఏం సాక్ష్యముంది? ఆ యాభై రూపాయలు 
ఇవ్వం. దిక్కున్నచోట చెప్పుకో” అన్నది కమల. 

డబ్బు తీసుకునే రోజు కమల అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. 

“ రాజేశ్వరీ! చిన్నదానివయినా పెద్ద మనసు నీది. మా పరువు ప్రతిష్టలు 
నీవల్ల నిలిచాయి. నీ డబ్బు పువ్వుల్లో పెట్టి బ్యాంక్‌ వడ్డీతో ఇస్తాను” అన్న 
వదినేనా! 

డబ్బు చాలా మహిమ గలదని అర్థం అయింది. దాన్ని నిర్లక్ష్యం చేస్తే 
ఎంత శిక్ష పడుతుందో కూడా తెలుసుకుంది. 

“అన్నయ్యా ! మీ పరువు తీయాలని కాదు. ఆయన వచ్చే లోపల డబ్బు 
ఇవ్వాలి ఎలాగయినా సరే... ప్లీజ్‌.... ” బ్రతిమాలింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 259 


“ఒకసారి చెప్పాను. నెల కింత అని ఇస్తాను.” ఆయన కచ్చితంగా 
అన్నాడు. అక్కడ ఏం మాట్లాడినా లాభం లేదు. ఏ మాత్రం సభ్యత సంస్మారమున్న 
మగాడయినా భార్యముందు అప్పచెల్లెండ్లను అవమానించడు. అంతకు 
దిగజారాడంటే ఎంతకయినా దిగజారుతాడు. మెల్లగా ఇంటికి వచ్చింది. 

“ఏమ్మా ఒంట్లో బావుండలేదా?” అత్తగారు ఆప్యాయంగా అడిగితే ఆమెకు 
కళ్లలో నీళ్ళు నిండుకున్నాయి. వాళ్ళ ఎదుట పడకుండా గదిలో దూరింది. 
సాయంత్రం మళ్ళీ శివశంకరం ఇంటికి వెళ్ళింది. 

“అన్నయ్యా ! ఆయన ఎంతో నమ్మకంతో నాకీ పని అప్పగించారు. 
ఎలాగయినా డబ్బు సర్దు అన్నయ్యా!” బ్రతిమాలింది. 

“రాజారావు ఇచ్చాడా?” 

“ఇస్తా నన్నాడు” అన్నది అక్కడ జరిగిన విషయాలు చెబితే నవ్వులాటగా 
ఉంటుందని. 

“వాడు ఇచ్చిన రోజు నా దగ్గరా తీసుకో.” 

“అన్నయ్యా” దెబ్బ తిన్నట్టు చూసింది. 

“అవునమ్మా మీ వదిన ముందు నాకెంత అవమానం. ఏమనుకుంటుంది. 
మీ చెల్లెలికి మీరంటే మర్యాద గౌరవం లేదు... అనుకోదూ?” 

“వద్దన్నయ్యా అంతమాటనకు. తీసుకునేటప్పుడలా అన్నావా?” 

“అవసరాని కెన్నో అంటారు. అవన్నీ నిజం అనుకుంటారా” అన్నాడు 
నిర్లక్ష్యంగా. 

రాజేశ్వరికి మతి పోయింది. పిచ్చిదానిలా ఇద్దరన్నల దగ్గరకు వెళ్ళింది. 
ప్రతీ రోజూ వెళ్ళి ప్రాధేయపడింది. 

గెటవుట్‌ అనే పరిస్థితికి వచ్చారు. 

“నీకు కళ్ళు నెత్తికి వచ్చాయే. ఎవడితో చెప్పుకుంటావో చెప్పుకో పో” 
అన్నాడు శివశంకరం. 

వాళ్ళ అభిప్రాయం అర్థం అయింది. రాజేశ్వరికి మతి పోతూంది. తల్లి 
దగ్గర ఏడ్చింది. 

“బంధువులతో డబ్బు లావాదేవీలు వద్దని నేను మొదటే చెప్పాను” అన్నది. 
అసహాయురాలు అంతకంటే ఏమనగలదు. ఇద్దరి కొడుకుల బారి నుండి భర్త 
ప్రావిడెంటు ఫండు, ఇన్సూరెన్స్‌ డబ్బు దాచి రాజేశ్వరికి వివాహం చెయ్యటమే 


260 డబ్బు! డబ్బు! డబ్బు! 





గగన మయిపోయింది. అటు కొడుకులు, ఇటు కూతురు. ఆమె ఏమనగలదు. 
అయినా అని, ఆశ్రయం పోగొట్టుకుంది. 

“ఆడపిల్ల కంటతడి పెడితే అరిష్టమంటార్రా నాయనా! దాని డబ్బులో 
కొంతయినా ఇచ్చి, తరువాత ఇస్తామను” సలహా ఇచ్చింది. 

“తోడి డబ్బు, వెధవ డబ్బు తనకే ఉందని అంత అహంకారమా అన్నలనే 
వచ్చి అప్పు వసూలు అడుగుతుందా” కోడలు దులిపింది. మాట, మాట పెరిగి 
కూతురు దగ్గరే ఉండు - పొమ్మన్నారు. ఆమె అలిగి చెల్లెలు ఇంటికి వెళ్ళింది. 
కుడితిల పడ్డ ఎలుకలా అల్లాడిపోయింది రాజేశ్వరి. 

“ఏమ్మా అలా ఉంటున్నావేం?” మామ అడిగాడు. 

ఏమిటి ఈ పెళ్ళిళ్ళు, ఫారిన్‌ ట్రిప్పులు చిరాగ్గా ఉంది అనుకుంది అత్తగారు. 
ఈ సమస్య వారితో చర్చించాలనుకుంది. కాని వీలుపడలేదు. ప్రతిసారీ భయంగా 
ఉండేది. ఆమె సతమతమవుతుండగానే జూలై ఫస్ట్‌ దగ్గరికి వచ్చింది. ఆమె 
త్వరగా తనకున్న నగలన్నీ మూట కట్టి బంగారం కొట్టుకు తీసుకు వెళ్ళింది. 
తరుగుడు, విరుగుడు పోగా ఎనిమిది వేలు చేతికి వస్తుందన్నారు. ఆ రోజు 
ఆమెకు నిద్ర రాలేదు. ఎనిమిది వేలు పెట్టి ఎక్కడో ప్లాటు కొంటుంది. అది 
కాదు ముఖ్యం. భర్త తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేసింది. 

“అమ్మాయి ! అబ్బాయి వస్తున్నాడంటే సంతోషించాల్సింది, విచారిస్తుంది 
ఎందుకంటావ్‌?” మామగారు అత్త నడగటం వినిపించింది. 

“ఏమోనండి అదీ కాక ఏదో విచారంగా ఉంటుంది. పగలంతా ఎక్కడో 
తిరిగి వస్తుంది” అనుకున్నా రోనాడు. 

“ఏమిటో ఇంకో ఇరవై రోజు లయితే మన బాధ్యత తీరుతుంది” ఆయన 
నిట్టూర్చారు. వెళ్ళి ఆయన హృదయంలో తల దాచుకుని బావురుమని 
ఏడ్వాలనిపించింది. ఏడ్వలేక పోయింది. ఆశగా తనను చూచి అయినా అన్న 
హృదయం కరుగుతుందేమో అని వెడితే తలుపు వేసుకుంది వదిన. 

వదినకు కావల్సింది డబ్బు... డబ్బు... 

డబ్బు పాపిష్టిది అంటారు. కాదు. గారడీలు చేస్తుంది. పిచ్చిదానిలా 
అయింది రాజేశ్వరి. ఆమె ప్రయత్నాలలో ఉండగానే అనుకున్న తారీఖు రానే 
వచ్చింది. 

“ఎరైవింగ్‌ టుమారో మార్నింగ్‌ ప్లేన్‌ బాంబే నుండి” అన్న బలరామ్‌ 
టెలిగ్రామ్‌ చూసుకుని తల్లడిల్లిపోయింది రాజేశ్వరి. 





మాదిరెడ్డి సులోచన కథలు 261 


“టాక్సీని రాత్రే రప్పించండి” అన్నది హడావుడిగా అత్తగారు. 

“రాజేశ్వరమ్మా బజారుకు వెళ్ళి రెండు దుప్పట్లు ఒక హార్లిక్స్‌ సీసా పట్టుకు 
రా తల్లీ” అన్నాడు మామగారు. 

రాజేశ్వరి బజారుకు వెళ్ళి కావల్సిన వస్తువులు తెచ్చింది. గదంతా 
అలంకరించింది. తను హుషారుగా తిరిగింది. అత్తమామలు నిట్టూర్చారు. 
వాళ్ళు కూడా రాత్రంతా కలత నిదురబోయారు. తెల్లవారు జామున మాగన్ను 
పడింది. 

మళ్ళీ మెలకువ వచ్చేసరికి పొద్దెక్కింది. 

“అయ్యో ఇదేం నిదురండి, దరిద్రపు నిదుర. టాక్సీవాడన్నా లేపలేదేం?” 
అనుకున్నారా దంపతులు. ఏర్‌ఫోర్ట్‌కు వెడితే ప్లేన్‌ వచ్చి కొడుకు బయలుదేరితే 
సమస్యే - అనుకుంటూండగానే బలరామ్‌ టాక్సీ దిగాడు. తల్లిదండ్రులకు 
పాదాభివందనం చేసి టాక్సీవాడికి డబ్బులిచ్చి పంపేశాడు. 

తండ్రి అతను తెచ్చిన సామాన్లు తెచ్చి లోపల పెట్టాడు. తల్లి ముసిముసిగా 
నవ్వుతూ గది వంక చూసింది. 

బలరామ్‌ గదిలో అడుగు పెట్టి ఆశ్చర్యపోయాడు. అలంకరణ విపరీతంగా 
కనిపించింది. మంచాల మధ్యలో నిశ్చింతగా నిదురబోతుంది రాజేశ్వరి. 

“రాజీ... ఏయ్‌” అతను నవ్వుతూ ఆమె ప్రక్కన చేరాడు. 

“నేను వస్తున్నానంటే నీకు నిదురెలా వచ్చింది. ఎన్ని రోజులయింది 
నేను నిద్రకు దూరం అయి” ఆమెకు కితకితలు పెట్టాడు. 

ఇటు తిప్పాడు. అంతే షాక్‌ కొట్టినట్టు లేచాడు. 

“అమ్మా...” అన్న గావుకేకకు తల్లి తండ్రీ పరుగెత్తుకు వచ్చారు. అప్పటికే 
కర్రలా బిగుసుకుపోయింది రాజేశ్వరి. 

“రాజీ....” బలరామ్‌ అరిచి ఆమెను పొదివి పట్టుకున్నాడు. “రాజీ 
ఏమయింది. రాజీ ఏమయింది? నాపై కోపం వచ్చిందా! ప్లీజ్‌ రాజీ” అతను 
ఆమెను కుదుపుతుండగానే బలరామ్‌ తండ్రి వెళ్ళి డాక్టర్ని తెచ్చాడు. అతను 
పరీక్షించి ప్రాణం పోయిందనీ కనీసం నాలుగు గంటలయినా అయిందని 
చెప్పాడు. అందరూ ఘౌల్లుమన్నారు. 

రాజేశ్వరి తలగడ క్రింద నిద్రమాత్రల సీసా ఒక చీటీ ఉంది. నా మరణం 
నేను కోరిందే. జీవితంలో ఓడిపోయిన నేను నిదుర మాత్రలు మింగాను. నాకు 


262 డబ్బు! డబ్బు! డబ్బు! 





నా భర్త బలరామ్‌ తప్ప ఎవరూ దహన సంస్కారాలు చెయ్యవద్దు. అతను ఉ 
దయం రాకపోతే వచ్చేవరకు అయిసులో ఉంచండి” ఆమె సంతకం ఉంది. 

బలరామ్‌కు భార్య మరణం ఒక పజిల్లా మిగిలింది. పోలీసులు, 
బంధువులు, తల్లీ, అన్నలు అంతా వచ్చారు. 

ఏమిటో నమ్మి 'అత్తమామ దగ్గర ఉంచారు” ఏదయిన అవమానకరంగా 
మాట్లాడి ఉంటారు, నిందమోపి ఉంటారు. 

జనం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. బలరామ్‌కు మతిపోయింది. తన 
తల్లి తండ్రిని తా నెరుగును. అతను చేసేది ఏం లేక రాజేశ్వరికి అంత్యక్రియలు 
చేశాడు. ఆమె శవం బయలుదేరుతుండగా, సూట్‌కేసు తీసి చీరలు, సెంటు 
సీసాలు అన్నీ పాడె మీద వేశాడు. 

“రాజీ రాజీ! ఎందుకిలా చేశావ్‌....” అని అతని హృదయం 
ఆ(క్రోశించింది. 

అందరూ స్నానాలు చేస్తున్నారు. రాజేశ్వరి తల్లి ఒకచోట కూర్చుని 
ఏడుస్తూంది. కొడుకులు నిలబడ్డారు. తనకు భార్య దొరుకుతుంది కాని, ఆ 
తల్లికి కూతురు దొరుకుతుందా! ఆర్తిగా ఆమె దగ్గరకు పోబోయాడు. 

“ఎంత అన్యాయం జరిగిపోయిందిరా.దాని ప్రాణం మీరే తీశారా! 
మొత్తుకుంటూనే ఉన్నాను. వద్దే అమ్మా! ఈ డబ్బే ప్రాణం ఇచ్చే స్నేహితుడిచేత 
ప్రాణం తీయిస్తుందే అన్నా వినలేదు. అన్నలని మిమ్మల్ని నమ్మింది. పాపిష్టిదాన్ని! 
వూర్లో ఉన్నా ఇంత అనర్థం జరగనిచ్చేదాన్నికాదు” ఆమె కొడుకులను పెట్టే 
శాపనార్థాల వల్ల జళతావ్‌కు సర్వం అర్థం అయిపోయింది. 

అతనింటికి రాగానే రాజేశ్వరి బీరువా తీశాడు. పాస్‌ బుక్కులున్నాయి. 
అందులో తను పంపిన డబ్బు వివరాలున్నాయి. మర్నాడ్‌ విత్‌డ్రా చేసింది. 
ఆఖరు రెండు నెలలు పంపిందలాగే ఉంది. క్రితం రోజు కట్టిన ఎనిమిది వేలుంది. 
“మీ పష్లాటుకు సరిపోదు క్షమించండి. డబ్బు.... డబ్బు బంధువుల కివ్వకండి, 
ఇచ్చినా దానం ఇవ్వండి, మీ కోర్కె తీర్చలేని అశక్తురాలను మన్నించండి....” 

రాజీ!... అతను ఆవేశంగా లేచాడు. తన బావమరుదులే హంతకులు. 
కానీ సాక్ష్యం లేదు. 

డబ్బు... ఎంత పని చేసింది. “రాజీ! నన్ను అర్థం చేసుకోలేదు” అని 
అతని హృదయం ఆక్రోశిస్తూ ఉంటే అసహాయుడై కూర్చున్నాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 263 


చీమలు పెటిన పుటలు 
© © 


రంగు భార్యవంక అసహాయంగా చూచాడు. అతని పరిస్థితి గమనించని 
అలువేలు గోరింటాకుతో పండిన తన చేతులను పరిశీలించుకుంటూ తనకు 
వివాహానికి పూర్వం తిరుపతి, మద్రాసు ముఖ్యంగా సినిమా ఆర్టిస్టులను 
చూడాలన్న కోర్కె యెంతగా ఉందేదో తన్మయత్వంతో చెప్పుకు పోతూంది. 

“అవన్నీ తరువాతగాని కీలుగుర్రం ఆఖరి రోజు. త్వరగా తయారయితే 
వెళ్ళి వద్దాం” అన్నాడు. ఆ ఊళ్ళో అయితే డబ్బులు ఇవ్వకుండా సినిమా 
చూడవచ్చు. గేటు కీపరు నుండి ఆపరేటర్‌ వరకు తండ్రి దగ్గరకు వచ్చే బాపతే. 
గల గల గాజుగంపలో రాయి విసిరినట్టు నవ్వింది అలువేలు. 

“ఎందుకు? నేనేం హాస్యంగా మాట్లాడలేదే” అన్నాడు వుడుక్సుని. 

“హాస్యం కాక ఏమిటండీ! మా అమ్మ మూడో తరగతి చదువుతుండగా 
వచ్చిందట కీలుగుర్రం. మా అమ్మకు సినిమాలంటే మా చెడ్డ భయమట. 
అమ్మమ్మను యెలా బోల్తా కొట్టి సినిమాకు వెళ్ళిందో ఓ మంచి కథలా చెబుతుంది 
అమ్మ. ఆ సినిమా నాకు చూపిస్తారా?” 

రంగు రోషం తెచ్చుకోబోయాడు కాని జంట చేపపిల్లల్లా అందంగా 
కదిలిన అలువేలు కళ్ళు అతనిపై సమ్మోహనాస్తాన్ని వేశాయి. 

“అలువేలూ...” ఆమె అధరామృతంలో స్వర్గమే కనిపించిందేమో. అతని 
మెడకు చేతులు వేసింది. 


“ఏమండీ.... మనము.... మద్రాసు వెడదాం....” ముద్దుగా గునిసింది. 





264 మాదిరెడ్డి సులోచన కథలు 


“తప్పక వెడదాం...” ప్రమాణం చెయ్యలేదు గాని వాగ్దానం చేశాడు. 
అలువేలు పరవశించిపోయింది. భర్తంటే భక్తి, (పేమ కలిగాయి. 

“రంగూ!” బయటి నుండి రత్తయ్య గొంతు కర్మశంగా వినిపించింది. 
రంగు మైకం వదిలిపోయింది. తండ్రి యెందుకలా పిలిచాడో అర్థం అయింది. 
అతను భార్యతో కబుర్లు చెప్పినందుకు కాదని తెలుసు. రెండు రోజుల క్రితం 
ప్రకృఊరి రైతు పది రూపాయలిచ్చి తండ్రికిమ్మన్నాడు. అలువేలు మల్లెపూలు 
తెమ్మన్నది. ప్రారంభంలోనే సంసార జీవితాన్ని కలతలపాలు చెయ్యటం ఇష్టంలేక 
ఒక్కరూపాయి తీసుకుని తొమ్మిది రూపాయలు ఇచ్చాడు. సాధారణంగా రత్తయ్య 
మందు ఫీజు పది రూపాయలు. అప్పుడప్పుడు కొందరు బేరమాడే స్వభావం 
గలవారు తొమ్మిది, ఎనిమిది ఇస్తుంటారు. వారి స్వభావానికి నవ్వి ఊరుకుంటాడు. 

“ఏమిటి నాన్నా?” భయంగా బయటికి వచ్చాడు. 

“నిన్న రామయ్య ఇచ్చిన డబ్బులో రూపాయి కాజేసి ఏం చేశావు?” 

“అది కాదు నాన్నా...” 

“ఏది కాదు. డబ్బిలా విచ్చలవిడిగా ఖర్చుపెడితే నువ్వు ఎందుకు పనికి 
వస్తావురా? గాడిదలను కాద్దువులే.” 

“పోనియ్యి బావా! కొత్తగా పెళ్ళయిన కుర్రవాడు కదా రూపాయి ఖర్చు 
వుండదా?” అప్పుడే అక్కడికి వచ్చిన ప్రక్కింటి చెట్టి రాజీ కుదర్చాలని చూచాడు. 

“ఓయ్‌!... ఏం చెట్టీ, ఎలా వుంది వ్యవహారం! ఈ భూమండలమ్మీద 
రోజుకు ఎన్నో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కొత్త, పాత ఏందయ్యా.... ఆం! సంసార 
మన్నాక చూచి ఖర్చు పెట్టుకోరూ! అడ్డగాడిదలా ఒద్దుపొడవు పెరిగావు...” 
తిట్ల ప్రవాహానికి అడ్డువేస్తూ చెట్టి అతడిని బయటికి లాక్కుపోయాడు. 

“ఎంత కొడుకయినా అలా తిట్టటమేనా? కోడలుపిల్లకు లోకువ కాడు? 
వాడు కావాలన్నాడా ? తొందరపడి పెళ్ళీ చేశావు. ఏవో ఖర్చులుంటాయి.” 

రత్తయ్య ఏమి అనలేక, వెళ్ళి తన పీట మీద కూర్చున్నాడు. 

“చెట్టీ! పెళ్ళి నాకు అరక్కుంటే చేశాను అనుకుంటున్నావేమో. ఎప్పుడూ 
ఆ చిన్ని పంతులు బిడ్డతో పరిహాసాలు ఆడుతుంటే, జాతి సంకరమవుతుందని 
చేశాను” రత్తయ్య మాటలకు అడ్డువేస్తూ ఓ నల్గురు పొరుగూరి వారు వచ్చారు. 

“రత్తయ్యా! ఒల్లంతా ఒక్కటే నొప్పులయ్యా. పిండికొట్టినట్టుంది. ఏభై 
రూపాయలు ఖర్చు పెట్టి ఇంగ్లీషు మందులు వాడాను” ఒకతను హుస్సురంటూ 
కూర్చున్నాడు. 





చీమలు పెట్టిన పుట్టలు 265 


“ఏందోనయ్యా ఈ తేప నీ మందు పనిజెయ్యలే. వాతంపెయ్యి.” 
మరొకతను నిట్టూర్చాడు. 


“రత్తయ్యా! నీ మందు వాడాక మా వియ్యపురాలి కాళ్ళు బొంగరాల్లా 
తిరుగుతున్నాయంట. ఆమె ఆడబడుచుకు. ఆడబడుచు వియ్యపురాలికి మందు 
కావాల్నట.” మరొకతను ఉత్సాహంగా చెప్పాడు. అందరూ చెప్పినవి విని 
నిదానంగా నవ్వాడు. రత్తయ్య ఇంట్లో వాళ్ళ దగ్గర పులి అయితే బయటివారి 
దగ్గర పిల్లే అవుతాడు. 

అసలు సంగతి ఏమిటంటే రత్తయ్య మందులిస్తాడు. ఒకటే రోగానికి 
అని నియమము లేదు. ఆయన మందు సర్వరోగ నివారిణి. వాతము, పైత్యము, 
కీళ్ళవాతము ఒకటేమిటి అన్నిరకాల రోగాలు నయమవుతాయని వినికిడి. ఏ 
డాక్టరు దగ్గర కుదురని మొండిరోగాలుంటే “రత్తయ్య మందు తిందాము 
అనుకుంటున్నాము” అంటారు జనము. ఆ రత్తయ్య మందు వివరాలు ఎవరికీ 
తెలియవు. పది రోజుల మందుకు పది రూపాయలు తీసుకుంటాడు. రోజుకు 
పది మంది నుండి పాతికమంది వస్తారు. ఒకసారి ఒక డాక్టరమ్మ అత్తగారికి 
“రత్తయ్య మందుతో కడుపునొప్పి తగ్గింది. ఆ అత్త కోడలి చదువును అవహేళన 
చేసిందట. ఆ కోడలు డాక్టరమ్మ పనిగట్టుకుని రత్తయ్య ఇంటికి వచ్చి మందు 
వివరాలు అడిగింది. 

“ఏదో డాక్టరమ్మా. నాదేం లేదు. అంతా ఆ స్వామి దయ. అతని పేరుతో 
తులసి దళాలు ఇస్తున్నాను” అన్నాడే తప్ప వివరాలు చెప్పలేదు ఆమెకు. ఆ 
మందు విషయములో రిసర్చిచేసి, ఆ ఫార్ములా వైద్య సహాయ సమితికి అందజేసి 
మంచి బహుమతి ఇప్పిస్తానని కూడా చెప్పింది. అతను 'స్వామి దయి అనటం 
తప్ప రెండో మాట అనలేదు. ఆ కుర్ర డాక్టరమ్మ, (ఫ్రెండు వాదించుకుంటూ 
వెళ్ళిపోయారు. 

“ఇదంతా ఫాల్స్‌ బిలీఫ్‌. అతను ప్రజలను మోసం చేస్తున్నాడు” డాక్టరమ్మ 
అరుపు. 

“మోసం ఎళ్లకాలం సాగుతుందంటావా?” (ఫైెండు ప్రశ్న డాక్టరమ్మ 
ఆలోచించింది. 

“ఆర్‌.కె. నారాయణ్‌ 'ఆస్థాలజర్స్‌ డే చదువలేదూ. అతను అవసరానికి 
వేసిన వేషం యెంత బాగా కుదిరింది?” 


266 చీమలు పెట్టిన పుట్టలు 





“కొంత సైకలాజికల్‌ సాటిస్‌ఫాక్షన్‌ ఉంటుందనుకో. ఈ అశాస్త్రీయ 
విషయాలు ఇంత ప్రగతి సాధిస్తున్నాయంటే, మన దేశంలో సైంటిఫిక్‌ థింకింగ్‌లో 
ఐ మీన్‌ చదువులో నిజాయితీ లేదన్నట్టే కదా...” డాక్టరమ్మ ఆలోచనలో పడింది. 
ఇలా రత్తయ్య మందు గురించి ప్రయత్నించి చాలా మంది విఫలురయ్యారు. 

రత్తయ్య ఉదయం లేస్తూనే అటు అడవికి వెళ్ళి ఏవేవో ఆకులు, చెక్కలు 
తెచ్చుకుని, తనే ఏవో తయారు చేసేవాడు. అతని భార్య పున్నమ్మకు కూడా 
తెలియవు. ఆమె తెలుసుకోవాలని ప్రయత్నించనూ లేదు. ఆమెకు తెలిసిందల్లా 
భర్తకు, కొడుక్కు వండి పెట్టుకుని, ఇల్లును కనిపెట్టుకుని ఉండటమే. రత్తయ్యే 
దీపావళికి ఒక చీర, సంవత్సరాదికి ఒక చీర కొనిస్తాడు. ఆమెకు అక్కడికే 
సంతోషము. సంవత్సరానికో సారి పుట్టింటికి వెడితే ఆమెకు నల్గురన్నదమ్ములు 
తలా ఒక రవికెల గుడ్డ పెడతారు. రెండు చీరలు నాల్గు రవికెలు చాలు. 
పెళ్ళినాడు ఆమె తండ్రి పెట్టిన దిద్దులు, దండెకడియము, మెడలో గుండ్ల 
పేర్లున్నాయి. అవి పెట్టుకుని, ముచ్చట ముడి వేసుకుని, ఏ కాలం వచ్చే పువ్వులు 
ఆ కాలములో తలనిండుగా పెట్టుకుని, అందరిచేత లక్ష్మీదేవి అనిపించుకుంది. 
“చాదస్తం కాకపోతే తంగేడు పువ్వులు తలలో పెట్టుకుంటారా” అని నవ్విన 
వారున్నారు 

కొడుక్కు రంగనాథస్వామి పేరు పెట్టుకుని రంగూ” అంటూ పిలుచు 
కుంటారు. అతనికి నిక్కర్లు వేసుకోవటం కుదరదని బడిలో పంతుళ్ళు అంటే, 
రత్తయ్య సంవత్సరానికి సైను గుడ్డతో రెండు పైజామాలు, లాల్బీలు కుట్టించే 
వాడు. ఒక్క జత పంచెలు, లాల్ఫీలు కుట్టించేవాడు. ఒక్క జత పంచెలు, పై 
పంచెతోనే కాలం నెట్టుకు వస్తున్నాడు. భోజనము దగ్గర కూడా చాలా క్లుప్తంగా 
అన్నము, ఒక కూర, లేదా పప్పు తప్ప మరో ఆదరువు వద్దనేవాడు. ఎందుకు 
వద్దు అని యెవరూ అడగలేదు. 

పద్దెనిమిదేళ్ళు వచ్చిన రంగు మిషన్‌ కాంపౌండులో చదువుతూ చిన్ని 
పంతులు కూతురితో సినిమాకెళ్ళటం చూచిన రత్తయ్య వెంటనే రంగు చదువు 
చాలంటూ, పున్నమ్మ తమ్ముడి కూతురు అలువేలును రంగుకు ముడిపెట్టాడు. 

“ఆ ఇంట్లో నా పిల్లకు ఓ అచ్చటా, ముచ్చటా జరుగుతాయా?” అలువేలు 
తల్లి అయిష్టత ప్రకటించింది. 

“మనమ్మాయి అన్నీ చక్కదిద్దుతుందే. కాని కట్నం లేకుండా లక్షాధికారికి 
ఏకయిక వారసుడు దొరకటం మాటలా?” అలువేలు తండ్రి సంతోషించాడు. 





మాదిరెడ్డి సులోచన కథలు 267 


తన తండ్రి దగ్గర లక్ష రూపాయలున్నాయా! రంగుకు ఆశ్చర్యం కలిగేది. ఏమీలేని 
పంతులుగారి భార్య నగలమ్మి కూతుర్ను చదివిస్తుంటే తన తండ్రి యెందుకు 
ముందుకు రాడు! అంతా అబద్ధం అనుకునేవాడు. అంతకంటే ముందుకు వెళ్ళీ 
ఆలోచించే అవసరము అతనికి కలుగలేదు. 

అలువేలు వచ్చాక అవసరాలు పెరిగాయి. పౌడరు కావాలంటుంది, 
చీరలంటుంది, పువ్వులంటుంది. దేశం మీద తిరుగుదామంటుంది. 

“మీరు పేంటు చొక్కా వేసుకుంటే అచ్చు సినిమా యాక్టర్‌లా వుంటారు” 
అని ఊరించేది. పండక్కి మామగారు కుట్టించిన ప్యాంటు, చొక్కా వేసుకుని, 
అద్దం ముందు నిలబడి తనేనా అని చూచుకున్నాడు. బట్టలు కూడా మనిషి 
అందాన్ని ఇనుమడింప జేస్తాయని అర్థం అయింది మొదటిసారి. అతనికి రంగు 
రంగుల కలలు వస్తున్నాయి. నేను సంపాదించాలి. అప్పుడే కలలు నెరవేరుతా 
యన్న విజ్ఞత రాలేదు. చిన్న వయసాయె మరి. కోరికల వలలో చిక్కుకుని 
భార్య యెత్తి పొడుపులతో గిలగిలలాడి పోతున్నాడు. ఏదయినా పని చేద్దామన్నా 
తోచటం లేదు. పనివున్నా అతని ఆలోచనలు అంత తీవ్రంగా ఉండేవి కావేమో. 

“మనము తిరుపతి, మద్రాసు పోనట్టెనా?” భార్య అలక సాగించింది. 

ధైర్యంచేసి తమ ప్రయాణం సంగతి తండ్రితో చెప్పాడు రంగు. 

“దేవుడు ఇక్కడ లేడా? ఇక్కడి నుండే నమస్మారం పెట్టి చెంపలు 
వాయించుకో” అన్నాడు రత్తయ్య. భార్యతో అదే మాట చెప్పి. తన అసహాయతను 
వెళ్ళడించాడు. 

“నాన్న దగ్గర డబ్బు లేదేమో అలువేలూ....” 

“బోలెడుందని మా నాన్న చెప్పాడు.” 

“ఎక్కడుందంటావు! బ్యాంకులో వేస్తాడా అంటే మా నాన్న అటు వెళ్ళగా 
యెన్నడూ చూలేదు.” 

“చెట్టీ! ఓ రెండు రూపాయలు బదులు ఇవ్వవోయి.” రత్తయ్య అడగటం 
విని అప్పటికి ఊర్మున్నారు. అలువేలు బుర్ర చురుకయింది. రోజుకు వంద 
వస్తే పది కూడా ఖర్చుకావు. రత్తయ్య భార్యకు కొడుక్కు ఆ మాత్రమయినా 
ఖర్చు పెడతాడు గాని తనకంటే అసలు పెట్టుకోడు. మధ్యాహ్నము చట్టిలో 
కూర తక్కువ కనిపిస్తే సాయంత్రము మళ్ళీ యెక్కడ వండుతుందో నని మజ్జిగ 
పోసుకుని లేచేవాడు. రెండుసార్లు అన్నం తినడం తప్ప మరే అలవాటు లేదు. 


268 చీమలు పెట్టిన పుట్టలు 





రంగుకు తన తోటి వారిని చూచినప్పుడల్లా తండ్రిని చంపేద్దామన్నంత 
కోపం వచ్చేది. హాయిగా చదువుకుంటూ, చక్కని వేష భూషణాలలో వున్నారు. 
రోషం వచ్చి పని చేద్దామన్నా, ఇచ్చేవారు కనిపించలేదు. తండ్రి పిసినిగొట్టు 
తనము, భార్య యెత్తిపొడుపులు అతడిని పిచ్చివాడిని చేస్తున్నాయి. దొంగతన 
మయినా చేసి భార్య కోర్కె తీర్చాలన్నంత ఆవేశము కల్గింది. ఆ ఇంట్లో అమ్మటానికి 
కూడా వస్తువు కనిపించలేదు. 

“నాన్నా! మీ కోడలికి.... పండుగకు చీర కావాలంట....” 

“పెళ్ళి అయి పదేళ్ళు అయినట్టు పండుగకు మనము చీరలు కొనాలా! 
కొనేరోజు కొందాములే” మరో మాటకు అవకాశము ఇచ్చేవాడు కాదు. 

“పండుగయినా మనింట్లో పిండి వంటలు లేవా!” అలువేలు అత్తను 
అడిగింది. జవాబు మామ ఇచ్చాడు. 

“పిండి వంటలు. దండి వంటలు తిని డాక్టరు దగ్గరకు వెళ్లాలనా? ఇదే 
తిండి పాతికేళ్ళుగా తింటున్నాము. మీ అత్తగాని, నేను గాని చీది యెరగం....” 

అలువేలు అసహాయంగా చూచింది. ఆ రాత్రి అలక సాగించింది. ఆకలి 
నక నకలాడుతుంటే నిదుర దూరమయింది. అటు దొర్లి, ఇటు దొర్లి మొద్దులా 
నిదురబోతున్న భర్తను చూచి విసుక్కుంది. మంచినీళ్ళకని బయటికి వచ్చి మామ 
గదిలో దీపం వెలుగుతుంటే ఆశ్చర్యంగా చూచింది. దీపాల ఖర్చని ప్రొద్దుండగానే 
అందరిని తినుమని కేకలు వేస్తాడు. మరిచిపోయి దీపం ఉంచాడా అని కిటికీలో 
నుండి తొంగిచూచింది. ఆమె గుండె ఆగినంత పని అయింది. గబ గబ లోపలికి 
వచ్చి భర్తను లేపింది. రెండు గదుల వసారాతో ఇల్లుంది. చుట్టూ ప్రహరిగోడ. 
ఒక పక్క తనకయి గది వేసుకున్నాడు. రెండో వైపు వంటిల్లు వేశాడు. ఆ 
రెండిటిని కలిపిన గోడకు బయట తలుపుంటుంది. 

“ఏమిటి?” 

“ఉష్‌! నా వెంటరండి.” 

ఇద్దరూ పిల్లుల్లా వచ్చారు. కిటికీలో వున్న రంధ్రం ద్వారా లోపలి దృశ్యము 
చూపింది. మంచం ప్రక్కకు జరుపబడి ఉంది. అక్కడో చతురస్రాకారపు నేలమాళిగ 
లాంటిది వున్నది. దాన్నిండా నోట్లే. తనముందున్న రూపాయల కుప్పలో నుండి 
అయిదులు, పదులు, ఒక్క రూపాయి వేరుచేసి కట్టలు కడుతున్నాడు. అతను 
కదలటంతో ఇద్దరు వెనక్కు వచ్చారు. 





మాదిరెడ్డి సులోచన కథలు 269 


“చూచారా! ఇప్పుడయినా మా నాన్న అబ్బిం చెప్పరని అంగీకరిస్తారా?” 

రంగుకు మతిపోయినట్టుగా ఉంది. అంత డబ్బుండగా తండ్రి యెందుకు 
నికృష్ణంగా గడుపుతున్నట్టు. ఒక్కనాడయినా తీరయిన తిండి తినలేదు. ఇంపయిన 
బట్టకట్టలేదు. యెన్ని మైళ్ళయినా నడిచే వెళ్తాడు. డబ్బు వుండి యెందుకని. 

“మాట్లాడరేమండీ....” అలువేలు కుదిపింది. 

“ఆం.... ఏమన్నావ్‌?” 

“ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. అంత డబ్బు ఉండి యెందుకు? రేపే 
వెళ్ళి అడగండి” అలువేలులోని నిరాశ ఆశగా మారి ఒక్కసారి వెలిగిపోయింది. 
ఆమె (ప్రణాళికలు ఆమె వేసుకుంది. 

మర్నాడు భార్య చెప్పిన మాటలు మననము చేసుకుంటూ తండ్రి దగ్గరకు 
వచ్చాడు. మందులు దంపే కలపురాయి చేతిమీద పడి వాచిందని కట్టు కట్టించు 
కుంటున్నాడు మంగలాడిచేత. 

“నా మాటినుండ్రయ్య. ఆసుపత్రికి బొండ్రి. బొమికె ఇరిగింది. లేకుంటే 
ఇంత వాపు చూపదు....” మంగలి సలహా ఇచ్చాడు. 

“యెందుకురా డబ్బు దండుగ. సాయంకాలమెల్లి ఆకులు తెచ్చి కట్టు 
కడుతాను. మనకేం గవర్నమెంటు ఉద్యోగమా, వ్యాపారమా?” రత్తయ్య తేల్చి 
వేశాడు. ప్రాణం మీదికి వచ్చినా తన కోసం డబ్బు ఖర్చు పెట్టుకోని తండ్రిని 
తనకోసం యెలా అడుగుతాడు. ఆ రోజు రత్తయ్య చెయ్యి వాపు చూసి అలువేలు 
ఏమీ అనలేకపోయింది. చెయ్యి వాపుతో జ్వరము వచ్చి వారము రోజులు 
పదకవేసినా, కప్పుతో కప్పెడు పాలు తాగలేదు. నాల్గు అణాలు పెట్టి ఒక 
మాత్ర కొనలేదు. అది చూచిన రంగు మతిపోయింది. తండ్రిచేత ఖర్చు 
పెట్టించటం బ్రహ్మతరము కాదని తెలిసిపోయింది. “చూడు అలువేలూ! ఇది 
నా సంపాదన కాదు. అడిగే హక్కులేదు. ఏదో ఓ పని చేసి నిన్ను తీసుకు 
వెడతాను” అన్నాడు రంగు. 

“అప్పటి వరకు నేను ముసలిదాన్ని అయిపోతాను” వెక్కి వెక్కి ఏడ్చింది. 
ఆ తరువాత అలువేలుకు పిచ్చిపట్టీనట్టుంది. మామగారి మంచము క్రింద దాచిన 
రూపాయలు ఆమె కళ్ళ ముందు గిరా గిరా తిరుగసాగాయి. ఆ గదిలోకి వెళ్ళాలని 
యెన్నోసార్లు ప్రయత్నించి విఫలురాలయింది. అతను బయటికి వెళ్ళేటప్పుడు 
తాళంవేసుకు వెడతాడు. తాళం తీద్దామని రంగుతో సంప్రదించింది. అతను 
సుతారము అంగీకరించలేదు. 


270 చీమలు పెట్టిన పుట్టలు 





అలువేలు పుట్టింటికి వచ్చి తండ్రితో విషయము చెప్పింది. అతను 
ఆలోచించాడు. తన అంతరంగికులనుకునే వారిని సంప్రదించాడు. చివరకు 
ఉపాయము ఆలోచించాడు. కూతురితో విషయము చెప్పాడు. 

“నాన్నా! అన్యాయంగా అంత డబ్బు ప్రభుత్వానికిచ్చి, వాళ్ళిచ్చినంత 
దానంగా తీసుకోవాలా?” లౌక్యం తెలియని అలువేలు అడిగింది. అతను నవ్వాడు. 

“అంతో, ఇంతో వస్తుంది మీకు. ఆ ముసలాడు ఇప్పుడప్పుడే చస్తాడా? 
ఇక రెండో దారి అతడిని అంతం చేయటమే” అలువేలు తండ్రి అన్నాడు. ఆమె 
వణికిపోయింది. 

“వద్దు నాన్నా! ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మంచివాడు” అన్నది. 
అతను కూతుర్ని ప్రేమగా అక్కున చేర్చుకున్నాడు. 

రత్తయ్య మామూలుగా వచ్చినవారికి మందులిచ్చి విశ్రమించాలని 
లేచాడు. ఎదురుగా నిల్చున్న ప్రభుత్వ అధికారులను చూచి ఆగిపోయాడు. 

“రత్తయ్య అంటే?” 

“నేనేనండి. నా మందు మీదాక వచ్చిందా....” నవ్వాడు. 

“ముందు మీ రాబడి, ఖర్చు లెక్కలు చూపండి” ఒకతను అడిగాడు. 

“రాబడి... లెక్కలా! యెందుకు, నా కష్టం ఖర్చు పెట్టుకుంటాం. 
మిగుల్చుకుంటాం మీకెందుకు? నేను యెవరి దగ్గరా దోపిడీ చెయ్యలేదు” రత్తయ్య 
రోషంగా అన్నాడు. వాదోపవాదాలు పెరిగాయి. వారు సోదా మొదలుపెట్టి 
రత్తయ్య దాచిన చోటు కనుక్కున్నారు. ఒక్క రూపాయి నోట్లు లెక్కించటానికి 
ఒక్క రోజు పట్టింది. రెండు లక్షల చిల్లర డబ్బులు లెక్కించారు. రత్తయ్య రాయిలా 
అయ్యాడు. ఏ ఫిలాసఫర్‌కూడా కష్టార్దితాన్ని వదులుకొమ్మని చెప్పలేదు. కాని 
రెండవ ప్రాణంగా దాచుకున్న డబ్బు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కొంత 
శాతం కొడుక్కు ఇస్తామని చెబుతుంటే అతను అందరివంక పిచ్చి చూపులు 
చూచాడు. రంగు భార్యను ఉరిమి చూచి, తండ్రికి ముఖం చూపించలేక బయటికి 
వచ్చాడు. చెట్టికొడుకు గాబోలు గట్టిగా చదువుతున్నాడు. 

చీమలు పెట్టిన పుట్టలు 

పాముల కిరువయిన యట్లు... 

రంగు కనుకొలుకులలో నిండిన నీరు ఒత్తుకుని, తండ్రిని తలుచుకుని 
జాలిగా నవ్వుకొన్నాడు. O 





మాదిరెడ్డి సులోచన కథలు 271 


బ్రతకటానికో దారి 


టెంకన్నబాబు రిటైర్‌ అయ్యారు. అయ్యారనే చెప్పాలిగాని ప్రభుత్వం 
నిర్బంధంగా చేయించిందంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. 

“ఏమిటోయ్‌! మహా ఇదిగా మాట్లాడుతారు! కావాలంటే టార్చ్‌ ఇస్తాను. 
వెతికి చూపించండి ఒక్క మనిషి అంటే ఒకే మనిషిని న్యాయంగా ఉన్నవాడిని....” 
అంటారాయన. 

“ఒక్కర్నేం చాలా మందిని చూపిస్తాను” అనబోయిన అతనింట్లో అద్దెకున్న 
గోపాలరావు. నోట్లో మాట, నోట్లో ఆగిపోతుంది. వెంకన్న బాబు స్వభావము 
యెరిగిన వాడు కాబట్టి తలూపుతాడు. ఈ కాలంలో అద్దె ఇల్లు దొరకటం 
చాలా కష్టం. ఉద్యోగమయినా లంచమో, రికమండేషనో పెట్టి సంపాదించవచ్చు. 
కాని ఇల్లు దొరకటం మాత్రం మహా యజ్ఞం. 'పెతులారిజమ్‌” గూర్చి మూడు 
గంటలు ఉపన్యాసం ఇచ్చే పెద్దలే, ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు సవాలక్ష ప్రశ్నలు 
వేస్తారు. 

“మీరు ఏ కులస్తులు?” 

“మేము బ్రాహ్మణులకయితేనే ఇస్తాం.” 

“మీకు వివాహమయిందా? కుటుంబం ఉన్న వారికే ఇస్తాం” ఇలాంటి 
ప్రశ్నలతో ప్రాణాలు తీస్తారు. వెంకన్నబాబు ఇల్లు ఇరుకే అయినా కాస్త సెంటర్లో 
వుందని అందరికి నచ్చుతుంది. నేనూ ఒకప్పుడు ఆ ఇంట్లో వాటా 
సంపాదించాలని తాపత్రయపడిన వాడినే. (బ్రాహ్మణత్వము లేక సంపాదించలేక 
ప్రక్క ఇంట్లో ఉంటున్నాను. ఆ రోజు ఆయన వచ్చి ఏదో చెప్పాడు. 





212 మాదిరెడ్డి సులోచన కథలు 


“ఏమిటో సెలవిస్తున్నారు?” అన్నాను. ఆయన ముఖం విప్పారింది. మా 
ఇంటికి వచ్చేవాడు. ఆయనకు మా ఇంట్లో కనిపించే ఆకర్షణ ఏమిటబ్బాని 
ఆరా తీస్తే వార్తాపత్రికలని తెలుస్తుంది. వస్తూనే పత్రిక పట్టుకుని చూచి, 
విసిరికొట్టాడు. 

“వీళ్ళ బొంద రిటైరుమెంటు, దీనివల్ల లాభం ఏమిటి?” 

“నిజమేనండీ. దీనివల్ల లాభం లేదు. ఆస్తులు కూడా జప్తు చేస్తే 
బావుండును” అన్నాను. అతను కొర, కొర చూచాడు. ఇది వరకయితే 
ఉపన్యాసం దంచి, మా నోర్లు మూయించేవాడు. కాని ఇప్పుడు కాస్త తగ్గాడు. 
ముఖం చిట, పట లాడించుకుంటూ లేచాడు. 


“ఉండండి కాఫీ త్రాగి వెడుదురు” శ్రీమతి కేక విని ఆయన కూర్చున్నాడు. 
ఆయనలో మరో బలహీనత ఉంది. మీరేం అన్నా చాలు. యెంత నొచ్చుకున్నా 
చాలు. ఒక కప్పు కాఫీ ఇస్తే చాలు అన్నీ మరిచిపోతాడు. ఆయన కాఫీ త్రాగి 
వెళ్ళిపోయాడు. 


“కుటుంబ నియంత్రణ ఉల్లంఘించిన మహానుభావుడు. ఇంకా చదువుకునే 
పిల్లలున్నారు. వారి వివాహాలు కావాలి. జీతం, పైన రాబడి వచ్చేటప్పుడే 
కటకటలాడి పోయేవాడు...” అన్నాను జాలి చూపుతూ. 


“మీరేం దిగులు పడకండి. అతను (బ్రతుక నేర్చినవాడు. రేపీపాటికి 
(బ్రతుకు తెరువుకో మార్గం వెతుక్కుంటాడు” అన్నది శ్రీమతి. ఆ తరువాత 
పదిరోజులు చాలా బిజీగా గడిచిపోయాయి. అలసటగా ఇంటికి రావటం, 
నిదురపోవటంతో సరిపోయింది. ఆ రోజు ఆదివారం ప్రొద్దుటే లేచి టీ త్రాగుతూ 
పేపర్‌ చూస్తున్నాను. దాదాపు ప్రతి ఆదివారం నేనలా కూర్చోగానే వెంకన్నబాబు 
వచ్చేవాడు. 

“అమ్మాయ్‌ ఆ చేతోనే కాసిన్ని వేడి నీళ్లు ఇలా పొయ్యి. మీ పిన్నిగారింకా 
కుంపటి విసురుతుంది.” అంటూ చనువుగా వచ్చి కూర్చుని పేపర్లోని మధ్య 
నున్న భాగం తీసుకునేవాడు. అలాంటిది యెనిమిది కావస్తున్నా ఆయన జాడ 
కనిపించలేదు. మనము కొన్ని విషయాలలో యాంత్రికంగా తయారవుతాం. 
ఆదివారం పేపరు అలా ఒంటరిగా చదివితే ఏదో వెలితిగా అనిపించింంది. 
మాటి, మాటికి, నా కళ్ళు గుమ్మం వైపుకు చూడసాగేయి. అతను మాత్రం 
రాలేదు. యెనిమిది దాటితే రాడని నిశ్చయించుకుని లేచి స్నానానికి వెళ్ళాను. 


బ్రతకటానికో దారి 273 





సాయంత్రము సినిమాకు వెడదామని నేను శ్రీమతి ఇద్దరు పాపల్ని 
తీసుకుని బయలుదేరాము. ఒక యువతి కుర్రవాడిని భుజమ్మీద వేసుకుని 
వచ్చింది. 

“యెవరు కావాలమ్మా?” అడిగాను. మా ఇంట్లో బయలుదేరే సమయానికి 
నా కోసమో, శ్రీమతి కోసమో యెవరో ఒకరు రావటం పరిపాటి. నాకు ఉత్తమ్‌ 
కుమార్‌ అంటే చాలా ఇష్టం. అతని సినిమా ఆడుతుంది. చూడటం కుదరదేమో 
అనుకున్నాను. 

“భగవాన్‌ వెంకన్న బాబు గారిల్లు ఇదేనా?” 

“భగవాన్‌....” ఆశ్చర్యంగా చూచాను. 

“అవునండీ. ఈ చెత్తకుండీ యెదురుగా అని చెప్పాను.” 

“భగవాన్‌ అని తెలియదుగాని వెంకన్నబాబు ప్రక్క ఇంట్లో ఉంటున్నారని 
చూపాను. ఆమె వెళ్ళిపోయింది. తేలికగా నిట్టూర్చి సినిమాకు బయలుదేరాము. 

రాత్రి సినిమా నుండి వచ్చి భోజనాలు చేశాక, బయటికి వచ్చాను. రక, 
రకాల గొంతులు భజనలు పాడుతున్నారు. అది వెంకన్నబాబు గారింటి నుండే. 
ఏమీ అర్థం కాలేదు. ఆయన రాకుండానే మరో వారం రోజులు గడిచాయి. 
ఒకరోజు సాయంత్రం వెంకన్న బాబు ఇంటి ముందు నుండి సామానుతో ఉన్న 
నిండు లారీ కదిలింది. ఆయనిట్లో అద్దెకుండే వారి సామాను రిక్షాకే సరిపోతుంది. 
కాదు కూడదని బట్టలు తట్టలు జమ చేసుకుంటే బండిలో తీసుకు వెళ్ళవచ్చు. 
లారీ వచ్చిందేం చెప్మా! అనుకుంటున్నాను. ఆయనే వచ్చారు. 

“చూడవోయ్‌ వాసూ, కాస్త ఇల్లు కనిపెట్టి ఉండు. నేను మలక్‌పేటలో 
ఉన్న మా ప్లాటులో ఆశ్రమము నిర్మించుకుని ఉంటున్నాను” అన్నాడు. 

“చదువుకునే పిల్లలున్నారు కదా. వారికి దూరం అవుతుంది.” 

“ఎంత వెర్రివాడవోయ్‌! నేను కాలేజీలో చదువుతుండగా కొండపల్లి నుండి 
విజయవాడ వెళ్ళేవాడిని. సిట్రీ బస్సులున్నాయిగా. అమ్మాయ్‌ యిన్ని వేన్నీళ్ళు..” 
అన్నాడు. అయిదు నిమిషాల్లో శ్రీమతి ముగ్గురికీ కాఫీ తెచ్చింది. తనూ మాతోనే 
కాఫీ త్రాగింది. మరోసారి జాగ్రత్తలు చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అక్కడే 
నిల్చున్నాం ఇద్దరం. 

“అంతా యెత్తులెండి. తనుండే పోర్షనుకు ఏ రెండు వందలో అద్దె 
వస్తుందని...” శ్రీమతి అన్నది. 


274 (బ్రతకటానికో దారి 





“అదేం కాదండోయ్‌ రమాదేవిగారూ” ఉత్సాహంగా వచ్చాడు గోపాల 
రావు. అతన్ని చూస్తే పాము పడగనీడలో జీవించే మనిషిలా ఉండేవాడు. ఈ 
రోజు హాయిగా నవ్వుతున్నాడు. 

“ఆయన భగవాన్‌ వెంకన్న బాబుగా మారాడు. మనము గుర్తించటం 
లేదు సరికదా, ఈ వీధిలో వారు, వచ్చే భక్తులకు పిసినారి వెంకన్నబాబు అని 
చెబుతున్నారట” అన్నాడు నవ్వుతూ. 

“అతను భగవాన్‌ వెంకన్నబాబుగా ఎప్పుడు మారాడు?” 

“మీరీ మధ్య మా కాంపౌండులోకి రాలేదేమో. (ప్రతి శనివారము భజనలు, 
పాటలు ఒకటేమిటి? భక్తులు రావటం, ఆశీస్సులు పొందటం...” 

“పోనివ్వండి కొందరు వయసులో చేసిన పాపాలు కడుక్కోవాలని పరమ 
భక్తులుగా మారి పోతారు సంతోషం” అన్నాను. కాసేపుండి పిచ్చాపాటి మాట్లాడి 
వెళ్ళిపోయాడు. 

“గోపాలంగార్మి స్వాతంత్ర్యం లభించినట్టుంది. మనిషి యెప్పుడు చూచినా 
భయపడుతూ తిరిగేవాడు” అన్నది శ్రీమతి. ఆ తరువాత గాడిలో పడిన జీవితం, 
మనము వేసుకున్న ప్రణాళికలే మనకు గుర్తుండవు. ఇక ఇరుగు, పొరుగుల 
గురించి ఆలోచించే సమయము యొక్కడ ఉంది. 

నెల రోజులు గడిచాయి. సైదాబాద్‌ కాలనీలో తెలిసినవారు ఉంటే వెళ్ళి 
వస్తున్నాను. దారిలో జనము గుమికూడి ఉన్నారు. జనములో నుండి కోరస్‌గా 
గీతం వినిపించింది. 

జయజయ వెంకట రమణా! 

జయ జయ పాపహరణా ! 

చప్పట్లతో తాళాలు వేస్తున్నారు. చిరుతలు వాయిస్తున్నారు. వాయిద్యాలు 
వినిపించాయి. సన్నగా మంజీరాలధ్వని కూడా వచ్చింది. 

కలియుగమున వెలసిన దేవుడెవ్వరు ? 

రాగయుక్తంగా ప్రశ్నించిందో కంఠము, వెంటనే కోరస్‌గా జవాబు 
వచ్చింది. 

భక్తుల బ్రోచే వెంకటేశ్వరుడు. 

జయ జయ వెంకటరమణా ! జయ జయ కరుణా భరణా ! పాట 
తారాస్థాయినందుకుంది. అప్పుడు పరిసరాలను చూచాను. వీధిలోని స్త్రీలు, 
పురుషులు గుమ్మాలలో నిల్చున్నారు. ప్రీల చేతిలో బియ్యపు పళ్ళెం, పురుషుల 





మాదిరెడ్డి సులోచన కథలు 215 


చేతిలో చిల్లర డబ్బులు కనిపించాయి. ఒక్కసారి వాయిద్యాలు ఆగిపోయాయి. 
వెంకటేశా ! తిరుమలేశా! శ్రీనివాసా! 

అన్నదో కంఠము. 

“జరగండి... జరగండి భగవాన్‌గారి దర్శనము అందరికి కావాలి”. ఆ 
గొంతు విని సినిమా విలన్‌ సత్యనారాయణ గారు ఇక్కడికెలా వచ్చారు 
అనుకున్నాను గాని సన్నగా, పీలగా ఉన్న ఓ భక్తుడు జనాన్ని అదరగొట్టాడు. 
అప్పుడు స్పష్టంగా కనిపించింది. పసుపురంగు పట్టువస్ర్తాలు ధరించినతను. 
మెడలో చేమంతుల మాల రుద్రాక్షమాల, తలకు పట్టురుమాలు చుట్టుకున్నాడు. 
రెండు చేతులకు పూలదండలు కట్టుకున్నాడు. ముచ్చటగా తీర్చిన నామాలు. 
ఒక చేతిలో చిరుతలు, ఒక చేతిలో హుండీ వున్నాయి. చేతిలో తంబూర గనక 
ఉంటే నారదుడని (భ్రమపడే వారు జనము. ఏదయినా షూటింగ్‌ జరుగుతుందా 
ఏం ? అనుకున్నాను. అతని వెనకాల హార్మోనియం పెట్టె మెడకు వేసుకున్న 
మరో ఆసామి కనిపించాడు. అతన్ని చూడగానే అరవ తంబి అని (గ్రహించవచ్చు. 
మరొకతను తాళాలు పట్టుకున్నాడు. ఒకతను వీపున గోతాం మోస్తున్నాడు. 
మరో యువకుడు కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, చేతిలో భజన పుస్తకం పట్టుకుని 
నిల్చున్నాడు. మధ్యలో నిలబడిన వ్యక్తి భగవాన్‌ అయి ఉంటాడని ఊహించాను. 

“మహాజనులారా! శ్రీ వెంకన్నబాబు భగవాన్‌గారు, ఈ పూట పాదయాత్ర 
చేస్తూ మన వీథి పావనము చేయటం మన అదృష్టము. ఒక్కొక్కరే వారిని 
తాకకుండా నమస్కరించి వారి ఆశీస్సులు పొందండి - ఆం... అన్నట్టు ఉట్టి 
చేతులతో పసిబిడ్డలను భగవంతుడిని చూడకూడదని అంటారు. డబ్బని కాదు, 
ఒక పువ్వు, ఫలము ఏది తోచినా ఇవ్వండి....” ఒక లుంగీ ఆసామి అనౌన్స్‌మెంట్‌ 
చేశాడు. నేను ఉలిక్కిపడి చూచాను. భగవాన్‌గా పరిచయమయిన వారు వెంకన్న 
బాబే. సందేహము లేదు. ముఖానికి చందనము పట్టించడం మూలాన వెంటనే 
గుర్తించలేదు. ఆశ్చర్యంతో చూస్తుండగానే స్త్రీలు బియ్యం పళ్ళాలతో ముందుకు 
వచ్చారు. వీపున గోతాం మోస్తున్న మనిషి గోతాం క్రిందికి దించాడు. వెంకన్న 
బాబు బియ్యం ముట్టుకుని, అయిదారు గింజలు చేతిలోకి తీసుకున్నాడు. మిగతావి 
గోతాంలో పోశారు. ఆవిడ సాస్థాంగపడింది నడిరోడ్డులో. అతను చేతిలోని 
బియ్యం గింజలు ఆమె తలపైన వేశాడు. 

“స్వామీ! మీ పాదధూళి మా ఇంట్లో పడాలి. మా ఇల్లు పావనము 
కావాలి” అంజలి ఘటించి నిల్చుంది ఆమె. 


276 బ్రతకటానికో దారి 





ఇందాకటి అనౌన్సర్‌ రాకెట్టులా దూసుకు వచ్చాడు. 

“మహాజనులారా ! మాకు దర్శనము ఇవ్వండి. మా ఇల్లు పావనము 
చెయ్యండి! అంటూ ఆర్థిస్తే రావడానికి శ్రీవారు అల్లా టప్పా మనుషులు కారు. 
ఏ ఇంట నిత్యం పూజా పునస్కారాలు జరుగుతాయో దీప, ధూప నైవేద్యాలు ఆ 
శ్రీనివాసునికి సమర్పిస్తారో, వారు శ్రీవారి దివ్యదృష్టికి యెప్పుడో వచ్చారు. 
అడగకుండానే వారిల్లు పావనము చేస్తారు. అడిగి వెలితి పడకండి.” అతని 
గంభీరమైన విజ్ఞాపనము విన్న జనము వెనక్కు తగ్గారు. వెంకన్న బాబుగారు 
ఏడు అడుగులు వేశారు. బిల, విల మంటూ పది మంది ప్రీ పురుషులు వచ్చి, 
బియ్యం గోతాంలో పోసి, డబ్బులు హుండీలో వేసి నమస్మరించారు. వెంకన్నబాబు 
అపర వెంకటేశ్వరుడిలా ఆశీర్వదించాడు. పిల్లల్ని తెచ్చి అతని పాదాల మీద 
వేశారు. 

“అపచారం.... అపచారం....” అనౌన్సర్‌ పరుగుల మీద వచ్చి వారిని 
దూరం లాగాడు. 

“బాలలు (బ్రహ్మ స్వరూపులు. వారు పసివారు కావుననే అస్పృష్యులుగా 
దూరం నిలబడలేక పోయారు.... శాంతి! శాంతి:”” ఆయన అభయ హస్తము 
చూపారు. కాస్తముందుకు వెడితే నాలాంటి వాడిని వెంకన్నబాబు గుర్తిస్తారేమో 
చూద్దామని ఒక్కడుగు ముందుకు వేసాను. భక్త బృందం ఒక్క నెట్టు నెట్టింది. 
పడబోయి నన్ను నేను ఆపుకున్నాను. 

“అచ్చు ఆ భక్తవత్సలుడే దిగి వచ్చినట్టుంది.” 

“అదే కాదు, ఆయన ఆశ్రమంలో అడుగు పెడితే చాలునట. యెక్కడలేని 
ప్రశాంతత ఆవహిస్తుందట.” 

“పిల్లలకు యెలాంటి జబ్బులయినా సరే ఆయన ఆశీర్వదిస్తే చాలునట. 
ఊదేసినట్టు పోతాయట.” 

“అసలు ఆయుష్పులేనివారు వెడితే వారిని అసలు ఆశీర్వదించడట. కళ్ళ 
నీళ్ళు పెట్టుకుని ఆ జగద్రక్షకుదే నిన్ను రక్షించుగాక అంటాడట.” 

“అంత యెందుకు మా ప్రక్క ఇంటి పిన్నిగారి తోడికోడలు అన్నకొడుకు 
బావమరిది చెల్లెలి ఆడబడుచుకు వివాహము కాలేదుట. శ్రీ వెంకన్నబాబు భగవాన్‌ 
గారు విభూతి ఇచ్చారట. నెల తిరక్క మునుపే సంబంధం కుదిరిందట.” 


“అంతేకాదు. మాకు పాలుపోసే కొమురయ్య భార్య అన్నకోడలి, చెల్లెలి 
భర్త భీమవరం ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడట. ఈయన విభూతి పెట్టగానే మళ్ళీ 





మాదిరెడ్డి సులోచన కథలు 277 


హైద్రాబాద్‌ వచ్చేశాడట.” అని ఆడవారి అపూర్వ నమ్మకముతో మాట్లాడే మాటలు 
వినిపించాయి. విసుగొచ్చి మొగవారున్న చోటికి యెలాగో అలా చేరుకున్నాను. 


“అవన్‌దా పెరుమాళ్ళుకు మారు అనుకో” ఒక అరవ సోదరుడు 
సెలవిచ్చాడు. 


“అవును మా మూడిళ్ళవతలి శర్మగారబ్బాయికి ఉద్యోగం చేయించారు 
బాబుగారు.” 


అందరూ బంధువుల గురించి, తెలిసిన వారి గురించే చెబుతున్నారు. 
ప్రత్యక్షంగా తమకు జరిగిన ఉపకారము చెప్పటం లేదు. మళ్ళీ వెంకన్న బాబువైపు 
చూచాను. ఆయనకు యెదురింట్లో పాదపూజ జరుగుతుంది. వెండి పళ్లెంలో 
వున్న అతని పాదాలు అతడు కడుగుతున్నాడు. ఆ గృహిణి నీళ్లు పోస్తుంది. 
అక్కడ ఉండి వెంకన్న బాబును చూడటం కుదరని పని. అందుకే జనము 
ముందుకు సాగాక, నేను బస్టాప్‌ వైపు వచ్చాను. నెల రోజులలో వెంకన్నబాబు 
మాంత్రిక, తాంత్రిక శక్తులు నేర్పాడా అంటే నమ్మలేని విషయము. కాశీమజిలీ 
కథల్లోలాగ యెవరయినా ప్రత్యక్షమయి ఈయన నాలుక మీద ఏమయినా 
(బాశారా? 

ఇంటికి వచ్చి విషయమంతా నా శ్రీమతికి చెప్పాను. 


“గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఇదేం జనమండీ! భగవంతుడు ఉన్నాడని 
నమ్మితే పరవాలేదుగాని, కనిపించిన ప్రతి మనిషిని భగవంతుడని పూజించడం 
ఏమిటి?” 

“మరదేనోయ్‌ మనము సాధించిన ప్రగతి. కొన్నాళ్ళ క్రితం పట్టణానికో 
చిన్నదేవుడు ఉండేవాడు. ఆ తరువాత ఊరికి ఒకరు, ఇప్పుడు వీథికి ఒకరు 
అవుతారు” అన్నాను. మా వీథి చివర్లో ఓ ప్రీ వుంది. ఆమె శివభక్తురాలు. ప్రతీ 
సోమవారం మంత్రాలు వేస్తుంది. తాయిత్తులు కడుతుంది. మనుషులు శాస్త్రంపట్ల 
అపనమ్మకం ఏర్పరుచుకుంటున్నారు యెందుచేత? ఇచ్చే మందులు కల్తీ అనా. 
లేక వారి మనసుల్లో ఉన్న పాపభీతా? ఏదీ అర్థం కావటం లేదు. అందుకే ఆ 
విషయము గురించి యెక్కువ ఆలోచించలేదు. మరో నెల గడచింది. వెంకన్నబాబు 
గారింట్లో ఒక వాటా ఖాళీ అయింది. మాకు తెలిసిన అబ్బాయి అది కావాలని 
వెడితే అక్కడివారు 'కుటుంబానికే ఇస్తారు? అన్నారట. గోపాలం నా దగ్గరకు 
తీసుకుని వచ్చాడు.” 


278 బ్రతకటానికో దారి 





“నాకు అన్నింటికి దగ్గరగా ఉంటుంది సర్‌. యెలాగయినా చెప్పి 
ఇప్పించండి” అని (బ్రతిమాలాడు. అతనికి ఇల్లు ఇప్పించే కంటే ముఖ్యంగా 
నాకు అతని ఆశ్రమము చూచి, ఆయనలో దైవత్వం యెలా ప్రవేశించిందో 
తెలుసుకోవాలని ఉంది. అందుకే ఆదివారం వుదయమే వెళ్లాను. వెంకన్నబాబు 
ఓ నల్గురి మనుషులను కూర్చోబెట్టి ఏదో ఆదేశం ఇస్తున్నాడు. నన్ను చూచి 
ముఖం ప్రసన్నంగా చేసుకుని యెదురు వచ్చాడు, 

“రావోయ్‌ వాసూ!.... రా. చూచి చాలా రోజులయినట్టుంది” అన్నాడు. 
ఇద్దరం వెళ్ళీ వరండాలో కూర్చున్నాము. చుట్టూ చాచాను. పూల మొక్కలతో 
ఆ(శ్రమములాగే ఉంది. దూరంగా పునాదులు కనిపించాయి. 

“అక్కడ ఇల్లు కడుతున్నారా?” 

“అబ్బే, లేదయ్యా, ఆ స్వామికి మందిరము కడుతున్నాము. నేను కాదు, 
భక్త బృందము” అన్నాడు అదోలా నవ్వుతూ. 

“మీరు చాలా స్వల్పకాలములో సంసార జంజాటం వదుల్చ్బుకున్నారండీ. 
మీరు ప్రజలను యెలా ఆకట్టుకున్నారో మొన్న సైదాబాదులో చూచాను” అన్నాను. 

“ఓ... అదా.... అంతా ఆ స్వామి దయ” అన్నాడు. ఆయన మొదటే 
వేసిన రెండు గదుల్లో, వరండాలో ఆయన కుటుంబం ఉంటుంది. 

“రా కాఫీ తాగుదాం. ఇక్కడికి వచ్చినా రమాదేవి కాఫీ మరచిపోలేను” 
అన్నారు. అతని మాటల్లో అతిశయోక్తి కనిపించలేదు. వచ్చి మళ్ళీ కూర్చున్నాము. 
అతని కూతురు కాఫీ తెచ్చింది. 

“చెప్పారు కారేం? అసలు మీరింక మహత్తు యెలా సంపాదించారో 
వినాలని ఉంది.” 

“అంతా వాడి దయ” పైకి చూచి నమస్కరించాడు. నేను అక్కడ 
కూర్చున్నంత సేపు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఏదో ఒకటి తీసుకు 
వస్తూంటారు. అతనికి అన్ని వస్తువులూ సమృద్ధిగా దొరుకుతున్నాయి. నేను 
వచ్చిన విషయము చెప్పాను. 

“నీకు మంచివారన్న నమ్మకం వుంటే ఇవ్వు వారికి! నాకేం అభ్యంతరం 
లేదు” అన్నాడు. నేను బి.ఏ. పాసయిన కొత్తలో ఆరు నెలలు ఉపాధ్యాయుడుగా 
చేసిన అనుభవము ఉపయోగించి కూడా అతని నుండి అసలు విషయము 
రాబట్టాలని చూచి ఓడిపోయాను. ఆదివారం ఒక్కరోజు ఇంట్లో ఉండకూడదా 
అని దెబ్బలాడే శ్రీమతి గుర్తుకు వచ్చి లేచాను. అన్నింటికి అతను ఆ పరాత్పరుని 





మాదిరెడ్డి సులోచన కథలు 279 


దయి అనో, ఏడుకొండలవాడి కృపి అనో అంటుండేవాడు. నన్ను సాగనంపుతూ 
కూడా అందరి రక్షణ ఆ భగవంతుని మీద పెట్టేశాడు. 

ఇంటికి వచ్చేసరికి భోజనాల సమయము అయింది. భోజనం చేసి రెస్ట్‌ 
తీసుకుందామనుకుంటుండగా గోపాలం వచ్చాడు. అతన్ని చూడగానే కోపం 
వచ్చేసింది. సమయాసమయం పాటించకుండా వస్తాడు. 

“మీరు విశ్రాంతి తీసుకుంటారా... ఆం... ఏం లేదు. మన వెంకన్నబాబు 
గారు మరో నల్లురిని పోగు చేశాడు. వాళ్ళంతా ఈయన మహత్తు గురించి 
చాటుతూ వీథి వీథినా (ప్రచారం మొదలు పెట్టారు. వారందరిని నేను 
యెరుగుదును. ముత్తుస్వామి అని నటోరియస్‌ ఫెలో...” నాకు గతంలో చూచిన 
అరవ ఆసామి గుర్తుకు వచ్చాడు. 

“మాట్లాడరేమండీ వాసుగారూ! ఇది మోసము కాదా?” 

“మోసమే, కాని మన దేశంలో రెండే నిశ్చింతగా (బతికే అవకాశాలు 
కన్పిస్తున్నాయి. ఒకటి వేషము, రెండోది మోసము. దానికి విరుగుడు మన 
దగ్గర లేదు” అన్నాను. 

“నాకయితే వెళ్ళి వారికి యెదురుగా నిల్చి నిజం చెప్పాలనిపిస్తుంది.” 

“అనిపిస్తుందేగాని ఆచరించలేము. యెందుకు? మనము ఇంకా 
ఇలాంటివి ఎదిరించే పరిస్థితికి రాలేదు గోపాలం. ఒకవైపు సాంప్రదాయాలు 
అంటూ ఓ వర్గం, వాటిని కాల్చండి కూల్చండి అంటూ మరో వర్గం సామాన్య 
ప్రజలను ఒత్తిడి చేస్తున్నారు. ఏది మంచి, ఏది చెడు నిర్ణయించుకోలేక ఉక్కిరి 
బిక్కిరి అవుతున్నారు. విప్లవం, విచ్చలవిడితనము, వ్యక్తిగత ద్వేషాలు ఒకే కోవలోకి 
వచ్చాయి. ఒక నిర్దిష్టమైన భావము లేని ప్రజలు నువ్విప్పుడు ఏది చెప్పినా 
వినరు. పైగా నిన్నే తిడతారు....” నా మాటలు మధ్యలోనే త్రుంచింది రమ. 

“అది కాదండి, అతనిలో ఏదో మహత్తు ఉండవచ్చు. మా స్నేహితురాలు 
వెడితే ఆమె సమస్యలన్నీ చెప్పాడట వెంకన్నబాబు.” 

“చూడు రమా, కావాలంటే నువ్వు వెళ్లు. నీ మనసులో ఒక కోరిక, 
కాకపోతే సమస్య తీసుకో అతను “బిడ్డా ఏమిటి ని కష్టం” అనగానే, ఆ మార్దవానికి 
కరిగిపోయి విషయాలు చెప్పక, ఒక ప్రయోగం చెయ్యి. “స్వామీ! సర్వజ్ఞాలు 
మీకు తెలియనిదేముంది?” అను. అప్పుడు అసలు రంగు బయటపడుతుంది.” 

“యెలా?” రమ గోపాలం ఒకేసారి అడిగారు. 

“ఏముంది మీరు నోరు విప్పకపోతే అతను నోరు విప్పలేడు. వచ్చినవారి 


280 బ్రతకటానికో దారి 





ముఖము చూచి, 'నువ్వు కష్టాల్లో కాలిపోతున్నావు” అంటాడు.” 

“అవును ప్రతివాడు ఏదో కష్టాలలో కాలిపోతూ ఉంటేనే భగవంతుడు, 
మాంత్రికులు గుర్తుకు వస్తారు” అన్నాడు గోపాలం. 

“అది నిజమే. ఆ క్షణంలో మనము విచక్షణ మరిచిపోతాము.” 

“అరే మనసులో మాట చెప్పాడే” అని మురిసిపోతాం. 

మిగతా కష్టాలు ఏక బిగిన ఏకరువు పెడతాము. అతను మనకు 
అప్పీలింగ్‌గా ఉన్నవి రెండు మూడు మననము చేసుకుని వాటినే తన 
వాక్సాతుర్యంతో తిరిగి చెబుతాడు.” 

“ఏమండోయ్‌ మీ వివరణ చూస్తే మీరో మహా యోగి అయి మా పాపాలు 
దూరం చేసేలా ఉన్నారు” రమ నవ్వింది. 

“నేను చెప్పింది నీకు నవ్వులాటగా ఉందా? కావాలంటే ప్రయోగము 
చేసి చూడు.” 

“అక్కరలేదులెండి. నాకు తోచినది అంతే. కాని దీన్ని అరికట్టే మార్గమే 
లేదా?” 

“ఉంది. కాని ఆచరణ చాలా కష్టం. తేలికగా నమ్మలేరు జనము. వారిని 
నమ్మించగలిగి, వారి హృదయాలకు హత్తుకునేలా ఈ మోసాన్ని వివరించాలి. 
అంత ఓపికా, తీరికా మనకు ఉండవు.” 

“ఇదిలా సాగిపోవలసిందేనా?” 

“ఇదో ముళ్ళ కంపలాంటి వ్యవస్థ. ఒక దానితో ఒకటి ముడిపడి 
వుంటుంది. ప్రజలకు మన ప్రణాళికల మీద, నిజాయితీ మీద నమ్మకం కలగాలి. 
తినే ఆహారం, మందులు కల్తీ లేనివనే భావము కలగాలి. అన్నింటికంటే ముఖ్యం 
నాల్గు మాటలు చెప్పేటప్పుడు కనీసం ఒక్కవిషయము ఆచరించాలి. సిద్ధాంతాలు 
మీకు, అనుభవాలు మాకు అంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది” అన్నాను. 

నిజమే కదా! యెప్పుడూ ఏదో ఒక ఉత్సవం దేవుడి పేరు మీదుగా 
చేస్తుంటారు. అతనికి చెముడు వచ్చిందని రికార్డులు, మైకులలో పాటలు, 
మరోవైపు వెంకన్న బాబులాంటి వారు బ్రతుకుతెరువు కోసం మామూలు ప్రజలను 
దోపిడీ చేస్తున్నారు. కారణం ఏమిటి అన్నవాడికి రెండు ఆస్రో మాత్రల అవసరం 
ఉంటుంది. పెద్ద చేప చిన్నచేపను మింగితే, చిన్నచేప చిట్టిచేపను మింగుతుంది. 
ఇదే బ్రతుకు తెరువు సిద్ధాంతం. 


(0 


మాదిరెడ్డి సులోచన కథలు 28 1 





భలే భార్యలు 


ఆరతి ముసి ముసిగా నవ్వుకుంది. 

భర్త చేసే అల్లరి పని గుర్తుకు వచ్చింది. ఆరతికి భర్తంటే ఎక్కడలేని 
ఆరాధన, అందగాడన్న గర్వం. నిజంగా తను అదృష్టవంతురాలు. అతని ముందు 
తీసికట్టే అయినా అతనలా ఎప్పుడూ అనుకోడు. 

అలివేలుమంగను కాస్తా ఆరతిగా మార్చాడు. 

శనివారం, బ్యాంకు మధ్యాహ్నం వరకే ఉంటుంది. కొనదలుచుకున్నవన్నీ 
ఆ రోజే కొంటుంది ఆరతి. ఆ రోజు లక్ష్మీ, ఆరతీ కలిసి దయాల్స్‌కు వెళ్ళి 
మంచి ప్యాంట్లు కొనాలనుకున్నారు భర్తలకు. ఇద్దరూ వెళ్ళారు. 

ముక్కు పొడుం రంగు ప్యాంట్లు చూచారు. 

“మా ఆయనది మంచి రంగు లక్ష్మీ! ఆయనకి ముక్కు పొడుం రంగు 
ప్యాంటు బాగుంటుంది. మీ ఆయన కా లైటు బ్లూ తీసుకో” అన్నది ఆరతి. లక్ష్మి 
చురుకుగా చూచింది. 

ఆమెకీమధ్యే వివాహం అయింది. ఆమె భర్త నలుపయినా అందం, ఆకర్షణ 
ఉన్నవాడని అందరూ అన్నారు. అలాంటిది ఒక తోటి ఉద్యోగిని నోటికొచ్చినట్టు 
అనటమా? ధిక్కారం... ధిక్కారం అనుకుంది. అప్పుడు తేలిపోవటం ఇష్టం 
లేదు. ప్యాంటు కొని, కాఫీ త్రాగాలని హోటల్‌కు వెళ్ళారు. 

వాళ్ళ ఎదురు సీట్లో కూర్చున్న వ్యక్తులను చూచి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. 





282 మాదిరెడ్డి సులోచన కథలు 


res 


అచ్చు ఆరతి భర్త మనోహర్‌ లాగే ఉన్నాడొకాయన. లక్ష్మి పెదాల 
గుంభమైన నవ్వు వెలసింది. 

“ఆరతీ! ఆ యెదురుగా ఉన్నాయన చూడు - ఎర్రగా పండు కోతిలా 
లేడూ?” అన్నది కాఫీ ఆర్డర్‌ చేస్తూ. 

ఆరతి ముఖం ఎ(ర్రబారింది. 

“ఆ క్లీన్‌ షేవ్‌, నలగని బట్టలు చూస్తే ఆడంగిలా అనిపిస్తున్నాడు” అన్నది. 

ఆరతి విననట్టు యెటో చూచింది. మరేదో అడిగింది. 

“అవునూ, జామ్‌ చేస్తానన్నావ్‌ లక్ష్మీ! చేశావా?” 

“పండ్లన్నీ తెచ్చాను. ఒక్కదాన్ని చేయాలంటే కష్టం. కాస్త సహాయం 
చెయ్యమంటే చెయ్యలేదు ఈయన. అందుకే పండ్లు తినేశాం” నిర్లక్ష్యంగా చెప్పింది 
లక్ష్మి. 

“మా వారు ఆదివారం అన్నీ తయారుచేసి ఇచ్చారు. నేను సంవత్సరానికి 


సరిపడా జామ్‌ చేశాను” సగర్వంగా అన్నది ఆరతి. లక్ష్మి ఒంటిపై కారం 
రాచుకున్నట్టు అయింది. 


ఆరతి చేసిన జామ్‌ బాటిల్స్‌ పటాపటామని పగలగొట్టి గిరాటు వేద్దాం 
అనుకుంది. 

“నిజంగా అన్నింటా సహకరించే భర్త దొరికితే అంతకంటే అదృష్టం 
ఏముంది?” ఓ పుల్ల ఎగదోసింది సెగలోకి, ఆరతి. 

లక్ష్మి ఒళ్ళు మండిపోయింది. 

“ఏమద్భష్టంలే! నా కయితే మగాళ్ళు అలా పనులు చేస్తుంటే కంపరంగా 
ఉంటుంది” అన్నది లక్ష్మి - కంపరం అంతా ముఖంలో చూపుతూ. 

కాఫీ వచ్చింది. 

ఆ కాఫీ కప్పు యెత్తి లక్ష్మి ముఖాన దిమ్మరించాలని ఉంది ఆరతికి. “మా 
ఇంటా వంటా లేదు మగాళ్ళు పనిచేయటం. నీకే మనిపిస్తుందేమోగాని, నా 
కయితే అసహ్యం వేస్తుంది. మగాడంటే ఆర్డర్లు వేస్తూ దర్జాగా, హుందాగా 
వుండాలి” అన్నది. అప్పుడే భర్తతో ఉదయం, ఆడవారి హక్కులను గూర్చి హోరా, 
హోరిగా పోట్లాడటం మరిచిపోయింది. 


భలే భార్యలు 23 


“బయటికి వెళ్ళి పెళ్ళాం సంపాదిస్తే ఆనందిస్తారు గాని, ఆ పెళ్ళాం 
చాకిరీలో కాస్త తగ్గించాలని ఆలోచించరేం? ఇద్దరం సంపాదిస్తాం, ఇద్దరం 
పని చేయాలి” అన్నది. 

“ఆర్డర్‌... ఆర్డర్‌” అంటూ భర్త నీళ్ళు నింపి, కూరలు తరిగివ్వటం 
మరిచిపోయింది లక్ష్మి, 


కాఫీ కషాయంలా అనిపించింది ఆరతికి. 

ఆమె బుర్రలో విమానం ప్రొఫెల్లర్లు రొద పెడుతున్నాయి. కోపంగా 
లేచింది. 

ఆరతి ఇంట్లో అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది. వంటిల్లంతా శుభ్రం చేసి, 
కుక్కర్‌ ఎక్కించాడు మనోహర్‌. 


“ఆరతీ వచ్చేశావా? నిమిషంలో తయారవ్వాలోయ్‌. మా (ఫ్రెండ్‌ రాజు 
లేడూ! ఓ మంచి మళయాళం పిక్చర్‌ తెలంగాణాకి హక్కులు కొనేశాడట. 
సాయంత్రం షోకి మనల్ని రమ్మన్నాడు. అదేమిటి డియర్‌, అలా చూస్తావు? 
మన వాళ్ళు సెట్టింగ్స్‌ అని, రంగులని, హంగులని నానా హైరానా పడి దివాలా 
తీస్తారు” అన్నాడు కాఫీ కలపటానికి కప్పులు పెడుతూ. 

మరోసారయితే ఆరతి అతని మెడకు చేతులు పెనవేసి, తీయని కబుర్లతో 
పాటు అంతకన్నా తీయని ముద్దులు పెట్టేది. 

“ఊం... ఆడంగి ముత్తయ్యలా వంటింట్లో ఎవరు దూరమన్నారు?” 
కోపంగా అరిచింది. 

“రతీ! శాంతి శాంతి! నువ్వు ఆలస్యంగా వస్తే వంటవదని వంటింట్లో 
దూరాను. అది నీ సామ్రాజ్యమైతే ఇప్పుడే పట్టాభిషిక్తురాలిని చేస్తాను” అన్నాడు 
తమాషాగా చేతులు తిప్పుతూ. 

ఆమె కళ్ళు చిట్లించింది. 

ఆ క్షణంలో భర్త మనోహర్‌లా కనిపించలేదు. చిల్లరకొట్టు చిట్టెమ్మలోని 
పువ్వుల పున్నయ్యలా కనిపించాడు. 

“ఏమిటా ఆడంగి వేషాలు?” చీదరించుకుంది. తను తెచ్చిన ప్యాంటు, 
షర్టు గుడ్డ బల్లమీద గిరాటేసింది. 


284 ఆభ్యఎ 


అంతకంటే హుందాగా, ఈ పూట వంటా పెంటా ఏం అక్కరలేదు, 
హోటల్‌కి వెళ్లాం అనలేడూ” అనుకుంది. 


“కోపమేల బాలా!” అంటూ పాట పాడబోయాడు. 


“ఏమిటా వెకిలివేషాలు?” విసుక్కుని బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. మనోహర్‌కు 
మతిపోయింది. పెళ్ళయిన ఈ ఆరు నెలల్లో ఒక్క రోజు పోట్లాడుకోలేదు. 

ఆఫీసులో ఘర్షణ పడిందా? తనంటే మొహం మొత్తిందా? మొన్న 
వాళ్ళింటికి వెడితే అందరూ తనను ఉంచేయమని గొడవ ప్రారంభించారు. 

“మనూ! నేనుండనంటే వాళ్ళు నొచ్చుకుంటారు. నన్ను వదిలి ఉండలేనని 
చెప్పు” అన్నది మెల్లగా. 

“ఒక్క రోజు ఉండగలను” అన్నాడు అల్లరిగా మనోహర్‌. 


“నేనుండలేను -సరా! ఒక్క నిమిషం ఉండలేను” అన్నది. ఆ కళ్ళల్లోని 
ఆరాధనకు, ఆప్యాయతకు కరిగిపోయాడు. ఇప్పుడేమైంది? 


టపీమని కాఫీ కప్పు పెట్టిన శబ్దం అయింది. ఉలిక్కిపడ్డాడు మనోహర్‌. 
“రతీ...” 


“రతీ లేదూ, సతీ లేదు.” అపర సత్యభామలా వెళ్ళిపోయింది. మనోహర్‌ 
కాఫీ త్రాగినా భార్య అలకకు కారణం తెలుసుకోలేక పోయాడు. 


నెమ్మదిగా ఆమెను సమీపించాడు. 


“రతీ! ఏదయినా పొరపాటు జరిగితే ఇదీ అని చెప్పు - సరిదిద్దుకుంటాను. 
కోపాలు తాపాలంటే నాకు గిట్టవు.” 


“నున్నగా తయారయి, ఆడపిల్లలా తిరగటం అంటేనే గిడుతుందా?” 
అని అడగబోయి, అతని కళ్ళల్లోని ఆరాధనా భావానికి కరిగిపోయింది. 


వెంటనే అనుకుంది - 'దీమాగా నిలదీసి అడగడేంి అని. 

“పొరపాటు గ్రహపాటేం లేదు. నా కిష్టం లేదు ఆ సినిమా” అన్నది. 

అతనికి ఈసారి కోపం వచ్చింది. బట్టలు మార్చుకొని తనే వెళ్ళి పోయాడు. 

మంచి సెక్సీ పిక్సృరేమో, హుషారుగా వచ్చాడు. తలుపు తీసి తల 
తిప్పుకుంది ఆరతి. ఈ తిరకాసు అర్థం కాలేదు. 

చిరునవ్వు లేదు, మధురహాసం లేదు. 





మాదిరెడ్డి సులోచన కథలు 285 


మామూళ్ళు లేవు. 

“రతీ!” మృదువుగా, మెత్తగా పిలిచాడు. నిజంగా రతీదేవిలా ఉంది ఆరతి. 

“ఆడంగిగా, నంగిగా మాట్లాడకపోతే కాస్త గంభీరంగా మాట్లాడలేరూ?” 
అన్నది కోపంగా. నున్నగా దువ్విన అతని క్రాపు బరబరా పీకేయాలని ఉంది. 

ఆ మాటలు అతని అణువణువును చీల్పాయి. ఉరకలు వేసే ఉత్సాహం 
చల్లారిపోయింది. 

అతను వెళ్ళీ బట్టలు మార్చుకుని పడుకున్నాడు. ఎంతో అందంగా 
గడపాలని, కొబ్బెర తిని చురుకుగా మార్చిన మళయాళీ బు(ర్రలను 
అభినందించుకుంటూ వచ్చి అధఃపాతాళానికి దిగజారిపోయాడు. రెండు రోజులు 
గడచినా పరిస్థితిలో మార్చేంలేదు. అదిలింపులు, విదిలింపులకంటే ఆరతి 
చూపులు భరించలేకుండా ఉన్నాడు. ఆఫీసులో ఏమైనా చికాకులున్నాయేమో 
కనుక్కుందామని లక్ష్మి ఇంటికి వెళ్ళాడు మనోహర్‌. 

లక్ష్మి భర్త మాటలు విని టక్కున ఆగిపోయాడు మనోహర్‌. 

“పాపం! అంత మాట అనవల్సింది కాదు లక్ష్మీ! ఒకసారి వెళ్లాం పద.” 

“ఆం - పెద్ద పోజు. మా ఆయన అందం అంటూ మొదలు పెడుతుంది. 
మా ఆయన పనులు చేస్తాడంటూ గొప్పలు చెబుతుంది. అందుకే ఆడంగి అని 
అవమానించాను. అంత మాత్రానికే మాటలు ఆపేస్తుందా?” లక్ష్మి గొంతు 
తీక్షణంగా వినిపించింది. 

స్థాణువులా నిలబడ్డ మనోహర్‌కు మెల్ల మెల్లగా అంతా అర్థం అయింది. 
మెల్లగా ఇల్లు చేరాడు. అతను కాఫీ త్రాగుతూ ఆలోచించాడు. గంట తరువాత 
అతనికి కర్తవ్యం స్ఫురించింది. 

“య్యా హూ!” అంటూ షమ్మీకపూర్‌లా అరిచాడు. అతను ఆరతి వచ్చేసరికి 
వార్తా పత్రిక పట్టుకుని కూర్చున్నాడు రెండవ రోజు. ఆరతి వచ్చి ఆశ్చర్యంగా 
చూచింది. అతను నీళ్ళు పట్టలేదు. అసలు నిశ్చింతగా కూర్చున్నాడు. 

“ఏయ్‌! ఆఫీసు నుంచి ఇంత ఆలస్యంగా వచ్చావేం?” 

ఆరతి ఆశ్చర్యంగా చూసింది, భర్తేనా మరెవరన్నా అన్నారా అని. అతనే 
అన్నాదని అర్థం అయింది. 

“కాస్త కాఫీ నా ముఖాన పొయ్యి. తరిస్తాను.” 


286 ఇభ్యు 


ఆరతి కళ్ళు పెద్దవయ్యాయి. తూర్పున పొద్దు పొడవ లేదన్నా నమ్ముతుంది 
గాని భర్త తనను అలా మాట్లాడటమా? 

“నేను అడిగింది వినిపించలేదా? భూమికి అతుక్కుపోయావేం?” 

ఆ గద్దింపు విని కాళ్ళకు చక్రాలు వచ్చినట్టు పరుగెత్తి, కాఫీ తెచ్చింది. 
ఇంకొక్క నిమిషం ఆలస్యం చేసినా పీక నొక్కేలా ఉన్నాడు అనుకుంది. కాఫీ 
తీసుకుని ముఖం చిట్లించాడు. 

“పాలకంపు కొడుతుందేం?” హూంకరించినట్లే అడిగాడు. 

అతనికి పాలిష్టం అని కాసిన్ని యెప్పటిలా యెక్కువ పోసింది. అంతగా 
అవమానించాలా? 

కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. 

లోపలికి వెళ్ళిపోయింది. అతను కాఫీ త్రాగి బయటికి వెళ్ళి తొమ్మిది 
గంటలకు వచ్చాడు. 

“అప్పుడే నిద్ర మొహమా! పడుకోక పోయావా?” అన్నాడు విసుగ్గా. 
ఆమెకు అభిమానం ముంచుకు వచ్చింది. యెప్పుడయినా ఇలా అన్నాడా? తన 
ఆఫీసులో ఏవో ప్రోగ్రామ్స్‌ ఉన్నాయని ఆలస్యం చేసిన రోజు తనను యెంత 
అలరించాడు? తను భోజనము చెయ్యలేదని తెలిసి, తన కోసం రెండవసారి 
పెరగన్నం తిన్న భర్తేనా? 

“ఊం అంటే ముఖం వ్రేళ్ళాడేసుకుని చూస్తావ్‌!” అతను కసిరే సరికి 
కన్నీటితో కదిలింది. 

అతనికి మాత్రమే వడ్డించి తను గ్లాసుడు మంచి నీళ్ళు త్రాగింది. అదేం 
అని అడగలేదతను. 

ఆకలి బాధకన్నా అవమానం బాధ యొక్కువయింది. 

ఆ రాత్రి అతను చాలా మొరటుగా ప్రవర్తించాడు. ఆరతికి భర్త అసలు 
స్వరూపం అర్థం అయింది. మర్నాటి నుండి ఒక్క సహాయం అందలేదు. పైగా 
అరుపులు. 

సహనము సన్నగిల్లింది. 

మూడో రోజు ప్యాంటు తీసి పెట్టలేదని అరుస్తుంటే రోషం ముంచుకు 
వచ్చింది. 





మాదిరెడ్డి సులోచన కథలు 287 


“నేను ఉద్యోగం చేస్తున్నాను. మీ పనులు, బయటి పనులు చెయ్యలేను” 
అన్నది కచ్చితంగా. 

“అయితే ఉద్యోగం మానెయ్యి.....” అన్నాడు తీవ్రంగా - కొత్తగా 
పెంచుతున్న మీసాల షేప్‌ చూస్తూ. 

“ఉద్యోగం చేస్తుండగానే ఇంతమాత్రం ఆదరిస్తున్నావ్‌. అది లేనినాడు 
నా ముఖం చూడవు...” 

“శ హో! ఉద్యోగంతోనే నీ ముఖం అందంగా ఉందా?” వెటకారం 
చేశాడు. 

వారం రోజుల్లో బాగా నీరసపడిపోయింది. అన్నం సరిగ్గా దిగటం లేదు. 
భర్త ఆప్యాయత, ఆదరణ లేదు. పని యొక్కువయింది. ఒక్కొక్క మధుర ఘట్టం 
తలుచుకుని కుమిలి పోతుంది ఆరతి. ఆ రోజు ఉదయం భర్తతో ఘర్షణపడి 
భోజనం చెయ్యకుండా బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. 

లక్ష్మి కంగారుగా ఆటోరిక్షాలో యింటికి తెచ్చింది. మనోహర్‌ ఆఫీసుకు 
ఫోన్‌ చేసింది ప్రక్కింటి నుండి. 

“వద్దు లక్ష్మీ! ఫోన్‌ చెయ్యొద్దు. ఆయన మారిపోయారు, రారు” అన్నది 
ఏడుస్తూ. 

“పిచ్చిగా మాట్లాడకు. మనోహర్‌ గారి హృదయము రూపంలాగే 
అందమయింది” అన్నది లక్ష్మి. 

ఆరతి తన నీరసం మరిచిపోయి, చిత్రంగా చూచింది - “ఇది నిజమా” 
అన్నట్టు. “లక్ష్మి నాలుకకు నరం లేదు” అనుకుంది పదేపదే. 

మనోహర్‌ డాక్టర్‌ను వెంటబెట్టుకుని వచ్చాడు. డాక్టరు పరీక్ష చేసి, ఆమెను 
కొన్ని ప్రశ్నలడిగి నవ్వాడు. 

“నేను అక్కడే చెప్పాను. నా అనుమానమే నిజం అయింది. మీ ఆవిడకి 
మూడో నెల. ఇదిగో ఈ మందులు తీసుకురా” చీటి ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. 
అతన్ని సాగనంపి వచ్చేసరికి లక్ష్మి తలుపుకు అడ్డం నిలబడింది. 

“ఏమిటమ్మా ఇది?” 

“పార్టీ ఇస్తేనే ఇంట్లోకి రానిచ్చేది” అన్నది అల్లరిగా. 

“జంటగా వసేనే పార్టీ” 


— 


ఏరిరీ ఆభభ్యఎ 


“పామిస్‌....” అన్నది నవ్వుతూ. 

“డబుల్‌ ప్రామిస్‌” అన్నాడు. 

“అయితే అయిదు గంటలకల్లా రెడీగా వచ్చేస్తాం” అన్నది లక్ష్మి సంబరంగా, 
సంతోషంగా. 


లక్ష్మిని సాగనంపి ఇంట్లోకి వచ్చాడు. భర్త దగ్గరకు వస్తుంటే ఏమేమో 
ఊహించుకుని భయపడింది ఆరతి. ఆమె ఊహించని విధంగా మెడ క్రిందా, 
కాళ్ళ దగ్గరా చేతులు వేసి లేవనెత్తాడు. ఆమెను గిర గిర తిప్పి, ముఖం అంతా 
మృదువుగా చుంబించాడు. 


ఆ పిలుపుకు కరిగిపోయింది ఆరతి. జవాబుగా వెక్కి వెక్కి ఏడ్చింది. 
ఉధృతంగా వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. 


“రతీ... ఏయ్‌ ఇటు చూడు, నిజంగా నీపై అరిచాననుకున్నావా?” అతని 
మృదుత్వం చూచాక ఆమెకు ధైర్యం వచ్చింది. ఆమెకు తన ప్రవర్తన గుర్తుకు 
వచ్చింది. 


అతనామె కళ్ళు ఒత్తాడు. 

“నేను ఆడంగి అన్నానని కదూ అలా ఏడ్చించారు...” అన్నది వెక్కిళ్ళ 
మధ్య నవ్వుతూ. 

“ఊం. యెవరో ఏమో అంటే అలా విదిలించి పారేస్తావా?” 

“సారీ మనూ... అనకూడదేమో - సారీనండి!” అన్నది నిశ్చింతగా. 

“అలా సారీ చెబితే చెల్లదమ్మాయ్‌..” 

ఇద్దరూ తన్మయావస్థలో ఉండిపోయారు. అది మధ్యాహ్నమని ఆఫీసు 
వదిలి వచ్చానని మరిచిపోయాడు. 

వాళ్ళ కళ్ళకు అంతా మిథ్య, తమిద్దరే సత్యం అన్నట్టుగా ఉంది. తలుపు 
బాదిన చప్పుడు విని, తమ స్వర్గం నుండి బయటపడి తలుపు తీశాడు మనోహర్‌. 

“మీరింకా రెడీ కాలేదా?” లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. 


“ఓ! సారీ లక్ష్మీ! అయిదు నిమిషాల్లో వెడదాం. రండి రావుగారూ!” 
కంగారుగా ఆహ్వానించాడు లక్ష్మి భర్తను. 





మాదిరెడ్డి సులోచన కథలు 289 


ఆరతి గదిలో తయారవుతోంది. 

మనోహర్‌ బూట్లు వేసుకుంటూ గదిలో నుండి వచ్చే కిలకిలలు విన్నాడు. 

“అబ్బా లక్షీ... ఆయనలా పిలుస్తుంటే...” దాదాపు తనకు భర్తకు జరిగిన 
శృంగార ఘట్టం వర్ణిస్తుంది ఆరతి. ఇంకా అంతా చెప్పించుకోవాలన్న 
కుతూహలంతో “అలానా”, ఆం...” అంటూ మైమరచి పోయింది లక్ష్మి. ఒళ్లు 
మండిపోయింది మనోహర్‌కు. యెదురుగా రావుగారున్నారని మరిచిపోయాడు. 

“ఛ... ఛ... ఏం భార్యలు!” అన్నాడు కోపంగా. 

“భలే భార్యలు....” నవ్వాడు రావ్‌, అంతా అర్థం అయినట్టు. 

“పదండి.... పదండి! ఆలస్యం అయింది. ఆడవాళ్ళకంటే ఎక్కువ 
అలంకారాలు” అంటూ వచ్చింది ఆరతి. 


నల్లురూ బయలుదేరారు - ఉత్సాహానికి మారుపేరుగా, ఉడుకు రకానికి 
నిర్వచనంగా. 


O 


290 అభ్య